7, సెప్టెంబర్ 2021, మంగళవారం

PCOS &అధిక బరువు సమస్య ఉన్న వాళ్ళు కోసం తీసుకోవలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు పెరుగుతూనే ఉన్నారా? పీసీఓఎస్ కావ‌చ్చు జాగ్ర‌త్త‌..!అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు (PCOS )

ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు పెరుగుతూనే ఉన్నారా? పీసీఓఎస్ కావ‌చ్చు జాగ్ర‌త్త‌..! (PCOS In Telugu)

పీసీఓఎస్ (PCOS) పాలీ సిస్టిక్ ఓవ‌రీ సిండ్రోమ్‌.. మ‌న దేశంలో ప్ర‌తి న‌లుగురు మ‌హిళ‌ల్లో ఒక‌రు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇది నేటిత‌రం అమ్మాయిలు, మ‌హిళ‌ల్లో వ‌స్తున్న స‌మ‌స్య‌.. దీనికి ప్ర‌ధాన కార‌ణం హార్మోన్ల అస‌మ‌తౌల్య‌త‌ (Harmonal imbalance). మహిళ‌ల శ‌రీరాల్లో ఉత్ప‌త్తి అయ్యే హార్మోన్లు ఈస్ట్రోజ‌న్‌, ప్రొజెస్టిరాన్‌. ఈ రెండిటి విడుద‌ల స‌మ‌తుల్యంగా ఉంటే మన ఆరోగ్యం బాగున్న‌ట్లే..

అదే ఈ రెండింట్లో ఒక‌టి ఎక్కువ‌గా విడుద‌లై.. మ‌రొక‌టి త‌క్కువ‌గా విడుద‌లైతే హార్మోన్ల‌లో అస‌మ‌తౌల్య‌త ఏర్ప‌డి పీసీఓఎస్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది. ఈ స‌మ‌స్య వ‌చ్చిన వారిలో అండాశ‌యాల్లో నీటి తిత్తులు ఏర్ప‌డి అండాల విడుద‌ల‌ను అడ్డుకుంటాయి. దీనివ‌ల్ల పిల్ల‌లు పుట్టే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అందుకే ఈ స‌మ‌స్య ఎదుర‌య్యాక వీలైనంత తొంద‌ర‌గా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

 

pcos in telugu1

పీసీఓఎస్ అంటే ఏంటి? (What Is PCOS In Telugu)

పీసీఓఎస్ అనేది పిల్ల‌లు పుట్టే వ‌య‌సులో ఉన్న ఆడ‌వారిలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌. మ‌న దేశంలో ఈ స‌మ‌స్య‌కి గురైన వారు ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రు ఉన్నారంటేనే ఈ స‌మ‌స్య తీవ్ర‌త ఎంతో అర్థం చేసుకోవ‌చ్చు. సాధార‌ణంగా స్త్రీల పున‌రుత్ప‌త్తి వ్యవ‌స్థ ఐదు హార్మ‌న్ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ ఐదు హార్మోన్లు సరైన స్థాయిలో విడుద‌లైతేనే సరైన ఆరోగ్యం మ‌న సొంత‌మ‌వుతుంది. వీటిలోని అస‌మ‌తౌల్య‌త వ‌ల్ల మ‌న అండాశ‌యాల్లో స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

అండాశ‌యాల్లో అండాలు విడుద‌లయ్యే ఫాలిక‌ల్స్ చుట్టూ నీటి బుడ‌గ‌లు ఏర్ప‌డ‌డం వ‌ల్ల అండాలు విడుద‌ల కావు. దీంతో సంతాన‌లేమి స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. దీంతో పాటు హార్మోన్లలో స‌మ‌తుల్య‌త లేక‌పోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరిగిపోవ‌డం, అవాంఛిత రోమాలు, జుట్టు రాలిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

పీసీఓఎస్‌కి కార‌ణాలేంటి? (Causes Of PCOS)

పీసీఓఎస్ ఫ‌లానా కార‌ణంతోనే వ‌స్తుంద‌న్న రూలేమీ లేదు. కానీ కొన్ని కార‌ణాలు మాత్రం ఈ స‌మ‌స్య ఎదుర‌య్యేలా చేస్తాయి.. అవేంటంటే..

అండాశ‌యాలు విడుద‌ల చేసే ఆండ్రోజ‌న్ హార్మోన్ ఎక్కువ‌గా విడుద‌ల కావ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.
ఇన్సులిన్ ఎక్కువ‌గా విడుద‌ల కావ‌డం – మ‌న ర‌క్తంలోని చ‌క్కెర స్థాయుల‌ను నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్‌. మ‌న శ‌రీర క‌ణాలు ఇన్సులిన్‌కి రెసిస్టెంట్‌గా మారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయులు పెరుగుతుంటాయి.

దీన్ని త‌ట్టుకోవ‌డానికి శ‌రీరం ఇన్సులిన్ మోతాదును పెంచుతుంది. త‌ద్వారా ర‌క్తంలో చ‌క్కెర స్థాయి మ‌రింత పెరుగుతుంది. ఇన్సులిన్ మోతాదు ఎక్కువ‌వ‌డం వ‌ల్ల సాధార‌ణంగా చాలా త‌క్కువ‌గా విడుద‌ల‌య్యే ఆండ్రోజ‌న్లు స్త్రీల‌లో ఎక్కువ‌గా ఉత్ప‌త్తవుతాయి.  జ‌న్యుప‌రంగా – మీ కుటుంబంలో పీసీఓఎస్ లేదా డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉంటే మీకూ పీసీఓఎస్ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

pcos in telugu

పీసీఓఎస్ ల‌క్ష‌ణాలేంటి? (Symptoms Of PCOS)

సాధార‌ణంగా పీసీఓఎస్ ల‌క్ష‌ణాలు మొద‌టిసారి రుతుక్ర‌మం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి మెనోపాజ్ వ‌ర‌కూ ఎప్పుడైనా క‌నిపించ‌వ‌చ్చు. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ క‌నిపించ‌క‌పోయినా.. కొంత‌మందిలో కొన్ని ల‌క్ష‌ణాలు మాత్ర‌మే క‌నిపిస్తాయి. అవేంటంటే..

– బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గేందుకు చాలా స‌మ‌యం ప‌ట్ట‌డం
– మొటిమ‌లు ఎక్కువ‌గా రావ‌డం
– హిర్సుటిజం ( శ‌రీరం, ముఖంపై ఎక్కువ‌గా జుట్టు రావ‌డం)
– రుతుక్ర‌మం క్ర‌మం త‌ప్ప‌డం
– జుట్టు రాలిపోవ‌డం
– పులిపిర్లు రావ‌డం
– పాలీసిస్టిక్ ఓవ‌రీస్ (అండాశ‌యాల్లో నీటి బుడ‌గ‌లు)
– ఎక్కువ‌గా అల‌సిపోవ‌డం
– మూడ్‌స్వింగ్స్‌

పీసీఓఎస్ వ‌ల్ల స‌మ‌స్య‌లున్నాయా? (Other Problems Which Occur Because Of PCOS)

పీసీఓఎస్ స‌మ‌స్య ఉంద‌ని తెలియ‌గానే చికిత్స తీసుకోవాలి. లేదంటే దీని వల్ల భ‌విష్య‌త్తులో పెద్ద స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. అవేంటంటే..
– ర‌క్త‌స్రావం చాలా ఎక్కువ‌గా లేదా త‌క్కువ‌గా అవ్వ‌డం
– డిప్రెష‌న్‌, ఈటింగ్ డిజార్డ‌ర్ వంటి మాన‌సిక సమ‌స్య‌లు
– ఎండోమెట్రియ‌ల్ క్యాన్స‌ర్‌
– డ‌యాబెటిస్‌, ర‌క్త‌పోటు
– ఇన్‌ఫ‌ర్టిలిటీ
– మెట‌బాలిక్ సిండ్రోమ్
– నిద్ర‌లేమి
– గ‌ర్భ‌స్రావం లేదా నెల‌లు నిండ‌కుండానే పిల్ల‌లు పుట్ట‌డం

pcos in telugu2

పీసీఓఎస్‌ని ఎలా గుర్తించాలి? (How To Diagnose PCOS)

పీసీఓఎస్ స‌మ‌స్య ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే దాన్ని గుర్తించ‌డం కోసం ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం మంచిది. అందుకే కార‌ణం లేకుండా బ‌రువు పెరుగుతున్నా.. రుతుక్ర‌మంలో మార్పులు క‌నిపిస్తున్నా.. హిర్సుటిజం, యాక్నే వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నా పీసీఓఎస్ ఉందేమోన‌ని అనుమానించి పెల్విక్ స్కాన్ చేయించుకోవాలి. దీనివ‌ల్ల అండాశ‌యాలు, ఇత‌ర ప్ర‌త్యుత్పత్తి అవ‌య‌వాల ఆరోగ్యం గురించి తెలుసుకోవ‌చ్చు.

pcos in telugu2

పీసీఓఎస్‌కి చికిత్స ఎలా? (Treatment)

పీసీఓఎస్ అనేది క్రానిక్ స‌మ‌స్య‌. అంటే స‌మ‌స్య వ‌చ్చిన త‌ర్వాత పూర్తిగా త‌గ్గేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. అయితే ఈలోపు స‌మ‌స్య‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. మంచి జీవ‌న‌శైలి, చ‌క్క‌టి మందుల సాయంతో ఈ స‌మ‌స్యను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ స‌మ‌స్య‌కు ఉన్న ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందంటే..

కాంబినేష‌న్ థెర‌పీ (Combination Therapy)

గ‌ర్భం రాకుండా చేసే బ‌ర్త్ కంట్రోల్ పిల్స్‌లో ఈస్ట్రోజ‌న్, ప్రొజెస్టిరాన్ స‌మాన స్థాయుల్లో ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఈస్ట్రోజ‌న్‌, ప్రొజెస్టిరాన్ స్థాయులు అదుపులో ఉండడంతో పాటు.. యాండ్రోజెన్ స్థాయులు అదుపులో ఉంటాయి. దీనివ‌ల్ల ఎండోమెట్రియ‌ల్ క్యాన్స‌ర్ ముప్పు త‌గ్గ‌డంతో పాటు ఎక్కువ ర‌క్త‌స్రావం, అవాంఛిత రోమాలు, మొటిమ‌లు వంటివి త‌గ్గుతాయి. రోజూ పిల్స్ తీసుకోవ‌డం క‌ష్టం అనుకుంటే స్కిన్ ప్యాచ్ లేదా వ‌జైన‌ల్ రింగ్ కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

ప్రొజెస్టిన్ థెర‌పీ (Progestin Therapy)

ప్రొజెస్టిన్ హార్మోన్ మాత్ర‌ల‌ను నెల‌లో ప‌ద్నాలుగు రోజులు తీసుకోవాలి. ఇలా రెండు నెల‌ల పాటు చేస్తే మీ శ‌రీరంలో హార్మోన్లు స‌మ‌తుల్యంగా మారే వీలుంటుంది. అయితే ఇది మ‌న శ‌రీరంలో యాండ్రోజ‌న్ల స్థాయిని త‌గ్గించ‌దు. అంతేకాదు.. ఇది గ‌ర్భం రావడాన్ని కూడా అడ్డుకోదు. అందుకే గ‌ర్భం కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌వారికి ఇది చ‌క్క‌టి ఎంపిక‌.

పీసీఓఎస్ స‌మ‌స్య‌ తగ్గుముఖం పట్టాలంటే.. చికిత్సతో పాటు లైఫ్ స్టైల్ మార్పులు త‌ప్ప‌నిస‌రి. ఈ త‌ర‌హా మార్పుల వ‌ల్లే ఎక్కువ కాలం పాటు మందుల‌పై ఆధార‌ప‌డ‌కుండా పీసీఓఎస్ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునే వీలుంటుంది.

పీసీఓఎస్‌ని త‌గ్గించేందుకు జీవ‌న‌శైలిలో ఎలాంటి మార్పులు అవ‌స‌రం? (Changes In Lifestyle To Reduce PCOS)

pcos in telugu8

ప్రొటీన్లు ఎక్కువ‌గా తీసుకోండి.. (Increase Intake Of Protein)

పీసీఓఎస్ స‌మ‌స్య‌కు కార‌ణ‌మైన యాండ్రోజెన్ హార్మోన్ ర‌క్తంలో చ‌క్కెర‌లు ఎక్కువ‌య్యేలా చేస్తుంది. పైగా ఇన్సులిన్ ఎక్కువ‌గా ఉత్ప‌న్నమవుతుంది కూడా. అందుకే ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటే.. వీలైనంత మేర‌కు కార్బొహైడ్రేట్ల‌ను త‌గ్గించి ప్రొటీన్లు, ఫ్యాట్లు ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇది వీలుప‌డ‌క‌పోతే క‌నీసం కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లను స‌మాన మోతాదుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. మ‌నం తీసుకునే కార్బొహైడ్రేట్ల‌లో కూడా పీచు ప‌దార్థం ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. ఇవి మ‌న శ‌రీరంలోకి విడుద‌ల‌య్యే చ‌క్కెర‌ల‌ను నెమ్మ‌దించేలా చేస్తాయి. దీనివ‌ల్ల మెట‌బాలిజం మెరుగుప‌డుతుంది.

గ్లైసిమిక్ ఇండెక్స్ గ‌మ‌నించండి. (Consider The Glycemic Index)

గ్లైసిమిక్ ఇండెక్స్.. ఒక ప‌దార్థం మ‌న ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయుల‌ను పెంచే స్థాయిని ఆధారంగా చేసుకొని.. వివిధ ఆహార‌ప‌దార్థాలను కొలిచే ఇండెక్స్ ఇది. పీసీఓఎస్ ఉన్న‌వారికి ఇప్ప‌టికే ర‌క్తంలో చ‌క్కెర స్థాయులు ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే ఇలాంటివారు గ్లైసిమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉండే ఆహార ప‌దార్థాల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. 

 pcos in telugu7

యాక్టివ్‌గా ఉండండి. (Be Active)

పీసీఓఎస్‌ని దూరం చేసుకోవడానికి ఆహారంతో పాటు ప్ర‌ధానంగా యాక్టివ్ జీవ‌న‌శైలిని కొన‌సాగించ‌డం ఎంతో అవ‌స‌రం. దీనికోసం క‌నీసం వారానికి ఐదు రోజులు వ్యాయామం చేయ‌డంతో పాటు రోజూ క‌నీసం ప‌దివేల అడుగుల టార్గెట్‌ని చేరుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి. ఇంట్లో పనులు కూడా చేయ‌డం అల‌వాటు చేసుకోవ‌డంతో పాటు రోజూ కూర్చునే స‌మ‌యాన్ని త‌గ్గించుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలుంటాయి. 

అంతేకాదు.. ఇలాంటివారికి పొట్ట‌, తొడ‌లు వంటి భాగాల్లో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోయే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది .కాబ‌ట్టి ఈ భాగాల‌కు ఎక్కువ వ్యాయామం అందించాలి. కార్డియో కోసం ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు చేస్తూనే కొవ్వు శాతాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

దీనికోసం రెసిస్టెన్స్ ట్రైనింగ్‌, వెయిట్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తుండాలి. అయితే వ్యాయామం చేయ‌డం అవ‌స‌ర‌మే కానీ దీన్ని మ‌రీ ఎక్కువ‌గా కూడా చేయ‌కూడ‌దు. ఇలా వ్యాయామం ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల అడ్రిన‌ల్ గ్రంథులు ప్రేరేపిత‌మైన అడ్రిన‌లిన్ ఉత్పత్తి చేస్తాయి. ఇవి మీ స‌మ‌స్య‌ను మ‌రింత పెంచుతాయి. అందుకే వ్యాయామం కూడా మితంగా చేయాల్సి ఉంటుంది.

కాఫీ మానేయండి. (Avoid Coffee)

కొంతమంది ప‌రిశోధ‌కులు చేసిన అధ్య‌య‌నాల్లో భాగంగా.. కాఫీ పీసీఓఎస్ స‌మ‌స్య‌ను పెంచుతుంద‌ని గుర్తించార‌ట‌. అందుకే పీసీఓఎస్ స‌మ‌స్య తగ్గాలంటే కాఫీకి దూరంగా ఉండ‌డం మంచిద‌ని వారి స‌ల‌హా. మ‌రీ తాగ‌కుండా ఉండ‌లేక‌పోతే రోజంతా క‌లిపి ఒక క‌ప్పు తీసుకోవ‌డం మంచిది. కాఫీ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో స‌హ‌జంగా విడుద‌ల‌య్యే ఈస్ట్రోజ‌న్ ఉత్ప‌త్తి పెరిగి.. హార్మోన్ల అస‌మతౌల్య‌త స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. అందుకే కాఫీని వీలైనంత త‌క్కువ‌గా తీసుకోవ‌డం మంచిది.

ఏయే ఆహార ప‌దార్థాలు తీసుకోకూడ‌దు? (Food Items That Should Not Be Taken)

పీసీఓఎస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు కొన్ని ర‌కాల ఆహార‌ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. మ‌రికొన్ని ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పీసీఓఎస్ స‌మ‌స్య తొంద‌ర‌గా త‌గ్గే వీలుంటుంది. మ‌రి, ఏయే ఆహార ప‌దార్థాలు తీసుకోవ‌డం వ‌ల్ల ఈ పీసీఓఎస్ స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుందంటే..

pcos in telugu3

తీసుకోవాల్సిన ప‌దార్థాలు.. (Food Items That Should Be Taken)

– ప్రాసెస్ చేయ‌ని ఆహార ప‌దార్థాలు
– పీచు ప‌దార్థం ఎక్కువ‌గా ఉండే ఆహార ప‌దార్థాలు
– సాల్మ‌న్‌, ట్యూనా, సార్డైన్‌లాంటి కొవ్వు ఎక్కువ‌గా ఉండే చేప‌లు
– పాల‌కూర‌, కేల్ లాంటి ఆకుకూర‌లు
– ముదురు ఎరుపు, న‌లుపు రంగులో ఉండే పండ్లు (ఉదా – ద్రాక్ష‌, బ్లాక్‌బెర్రీ, చెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు)
– బ్రొకోలీ, కాలీఫ్ల‌వ‌ర్‌
– బీన్స్‌, ప‌ప్పుధాన్యాలు
– ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉండే నూనెలు ఉదా – కొబ్బ‌రి నూనె, ఆలివ్ నూనె
– కొబ్బ‌రి, అవ‌కాడో లాంటి పండ్లు
– పైన్ న‌ట్స్‌, బాదం, పిస్తా, వాల్‌న‌ట్స్..
– డార్క్ చాక్లెట్ (త‌క్కువ మోతాదులో)
– ప‌సుపు, దాల్చిన చెక్క పొడి వంటి మ‌సాలాలు
వంటి ప‌దార్థాల‌న్నీ రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

తీసుకోకూడ‌ని ప‌దార్థాలు (Ingredients That Should Not Be Taken)

– వైట్ బ్రెడ్‌
– మైదాతో చేసిన ప‌దార్థాలు
– ఫ్రై చేసిన ప‌దార్థాలు
– ఫాస్ట్ ఫుడ్‌
– సోడాలు, కోలాలు, ఇత‌ర ఎన‌ర్జీ డ్రింకులు
– ప్రాసెస్ చేసిన మాంసం
– రెడ్‌మీట్‌, పంది మాంసం

ఇంటిచికిత్స కూడా ప‌నిచేస్తుంది.. (Food To Treat PCOS Problem)

పీసీఓఎస్‌ని త‌గ్గించేందుకు కేవ‌లం మందులు, జీవ‌న‌శైలిలో మార్పు మాత్ర‌మే కాదు.. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు కూడా ఉపయోగ‌ప‌డ‌తాయి. ఈ త‌ర‌హా ఆహార ప‌దార్థాల‌ను ఇంటి చికిత్స‌గా రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల పీసీఓఎస్ ముప్పు త‌గ్గుతుంది. దీనికోసం తీసుకోవాల్సిన ఆహార ప‌దార్థాలేంటో మీకు తెలుసా?

1. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో.. (Apple Cider Vinegar)

రోజూ కాస్త యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ని తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు మాత్ర‌మే కాదు.. పీసీఓఎస్ కూడా త‌గ్గే అవకాశాలు ఎక్కువ‌. ప్రతీ రోజూ గ్లాసు వేడి నీళ్ల‌లో రెండు టీస్పూన్లు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ క‌లిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. కొన్నాళ్లు ఈ మిశ్రమాన్ని ఉదయం మాత్ర‌మే తీసుకున్నా.. తర్వాత రోజుకి రెండు, మూడు సార్లు తీసుకోవ‌డం మంచిది.

2. కొబ్బ‌రి నూనెతో.. (Coconut Oil)

కొబ్బ‌రి నూనెను రోజూ తీసుకున్నా.. అందులోని గుణాలు మ‌న ఆరోగ్యం బాగుప‌డేలా.. హార్మోన్ల స్థాయి స‌మ‌తుల్య‌మ‌య్యేలా చేస్తుంది. పీసీఓఎస్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా రోజుకో టేబుల్ స్పూన్ వ‌ర్జిన్ కొకోన‌ట్ ఆయిల్‌ని తీసుకొని దాన్ని ఆహారంలో భాగంగా శ‌రీరానికి అందేలా చేయాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. అందుకే రోజూ స్మూతీల్లో, ఇత‌ర వంట‌కాల్లో క‌లిపి దీన్ని తీసుకోవ‌డం మంచిది.

pcos in telugu 5

3. గ్రీన్ టీ (Green Tea)

గ్రీన్ టీ వ‌ల్ల ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న విషయం మ‌న‌కు తెలిసిందే. గ్రీన్ టీ పీసీఓఎస్ స‌మ‌స్య‌ను త‌గ్గించేందుకు సహ‌జ‌మైన ప‌దార్థంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ గ్రీన్ టీని రోజూ నాలుగైదు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలుంటాయి.

4. క‌ల‌బంద ర‌సం (Aloe Vera Juice)

క‌ల‌బంద ర‌సం వ‌ల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలుంటాయి. దీనికోసం మీరు చేయాల్సింద‌ల్లా మార్కెట్లో ల‌భించే క‌లబంద ర‌సం తాగ‌డం లేదా మీరే స్వ‌యంగా క‌ల‌బంద ఆకుల‌ను శుభ్రం చేసి.. తెల్ల‌ని గుజ్జులాంటి ప‌దార్థాన్ని తీసి జ్యూస్ చేసుకొని తాగ‌డం చేయాలి. ఇలా రోజూ ఉద‌యాన్నే ప‌రగ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. అండాశ‌యాల ప‌నితీరు మెరుగుప‌డుతుంది.

5. తాటిబెల్లం (Thati Bellam)

ర‌క్తంలోని చ‌క్కెర స్థాయుల‌ను మెయిన్‌టెయిన్ చేయ‌డానికి సాధార‌ణ చక్కెర‌, బెల్లాల కంటే తాటిబెల్లం చ‌క్క‌టి ఎంపిక‌. ఇది గ్లైసిమిక్ లెవ‌ల్లో ఉంటుంది కాబ‌ట్టి.. ఒకేసారిగా గ్లూకోజ్ విడుద‌ల చేయ‌కుండానే శ‌రీరానికి శ‌క్తిని అందిస్తూ ఉంటుంది. ఇందులోని క్యాల‌రీలు కూడా త‌క్కువ కాబ‌ట్టి.. దీన్ని రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవ‌చ్చు.

pcos in telugu 6

6. తేనె, దాల్చిన చెక్క (Honey And Cinnamon)

తేనెలో ఎన్నో యాంటీబ్యాక్టీరియ‌ల్‌, యాంటీఫంగ‌ల్ గుణాలుంటాయి. ఇక దాల్చిన చెక్క బ‌రువు త‌గ్గేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనికోసం టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని.. టేబుల్ స్పూన్ తేనెతో క‌లిపి రోజూ ఉద‌యాన్నే తీసుకోవాలి. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల ఫ‌లితం క‌నిపిస్తుంది.

7. లికోరైస్‌ రూట్‌ (Licorice Root)

ఈ త‌ర‌హా మొక్క వేర్ల‌లో హార్మోన్ల‌ను కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. దీన్ని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోని ప్రొజెస్టిరాన్‌, ఈస్ట్రోజ‌న్ హార్మోన్ల స్థాయుల్లో మార్పు వ‌చ్చి అవి స‌మ‌తుల్యంగా మారతాయి. దీనివ‌ల్ల పీసీఓఎస్ స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. దీనికోసం ఈ వేరు పొడిని అర టీస్పూన్ తీసుకొని.. అందులో నీళ్లు క‌లిపి టీలా చేసుకొని క‌నీసం రోజుకోసారి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చ‌ద‌వండి.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660


6, సెప్టెంబర్ 2021, సోమవారం

మూత్రం సమస్య పై అవగాహనా కోసం ఈ లింక్స్ లో చుడండి

మూత్ర సమస్య ఉందా.. ఇలా చేస్తే తగ్గుతుందట..అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


మూత్రపిండాలు రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తుంటాయి. ఆ వడపోత ప్రక్రియలో విడుదలయ్యే వ్యర్థ పదార్థమే మూత్రం. ఆ మూత్రం మూత్రాశయం (బ్లాడర్‌)లో నిల్వ ఉంటుంది. మూత్రాశయం సామర్థ్యం 300 మి.లీ నుంచి 600 మి.లీ దాకా ఉంటుంది. కానీ, చాలావరకు అది మూడింట రెండొంతులు నిండగానే మనం దానిని ఖాళీ చేసేస్తుంటాం.

    

ప్రధానాంశాలు:

  • అనేక కారణాలతో అతి మూత్ర సమస్య
  • కొన్ని చిట్కాలతో సమస్య దూరం



మూత్రాశయం నిండినప్పుడు ఆ విషయం నాడుల ద్వారా మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుంది. దీనిని మనం కంట్రోల్ చేయలేం. ఒక్కోసారి అతి మూత్రం సమస్య కూడా ఏర్పడుతుంది. దీంతో అకస్మాత్తుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కో సందర్భంలో దగ్గినా, తుమ్మినా మూత్రం లీకవుతూ ఉంటుంది.
undefined
అతి మూత్రం సమస్య ఎలా తెలుస్తుంది?

✿ ఒక మనిషి రోజులో 8 కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తే అతి మూత్రం సమస్య ఉన్నట్లే
✿ రాత్రిపూట ఒకటి, రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు మూత్రం పోసేందుకు నిద్ర లేవడం
✿ ఉన్నట్టుండి అర్జెంటుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రం ఆపులేకపోవడం
✿ లోదుస్తుల్లోనే మూత్రం లీక్ కావడం

అతి చురుకైన మూత్రాశయం ఉన్నవారు వెంటనే రెస్ట్ రూమ్‌కు వెళ్లాలని భావిస్తుంటారు. ఒకవేళ వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలనే ఫీలింగ్ కలిగి ఉంటారు. అయితే అతి చురుకైన మూత్రాశయం కలిగిన వారిని వైద్యులు రెండు రకాలుగా విభజించారు. అందులో మొదటిది పొడి కలిగిన అతి చురుకైన మూత్రాశయం. రెండోది తడి కలిగిన అతి చురుకైన మూత్రాశయం.


అతి మూత్రం సమస్య ఉన్న వారిలో మూడింట రెండొంతుల మంది పొడి రకాన్ని కలిగి ఉంటారు. వీళ్లకు మూత్రం లీక్ కావడం వంటి సమస్య ఉండదు. అదే తడి రకాన్ని కలిగి ఉండే వారిలో తెలియకుండానే మూత్రం లీక్ అవుతూ ఉంటుందని, ఒకవేళ కాకపోయినా లీక్ అయిందనే భావనలో ఉంటారని వైద్యులు చెప్తున్నారు.
undefined
దగ్గినా, తుమ్మినా మూత్రం చుక్కలుగా పడుతోందని పలువురు చెప్తుంటారు. ఈ సమస్య ఎక్కవగా ఆడవారిలో వస్తుంది. సుమారు 50 శాతం మంది మహిళలు జీవితంలో ఎప్పుడో అప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటారు. సాధారణంగా 40,50 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య కనపడుతుంది. ఊబకాయుల్లో, ఎక్కువమంది సంతానం కన్నవారిలో మూత్రాశయ కండరాలు బలహీనపడుతుంటాయి. దీంతో చిన్నపాటి ఒత్తిడికి గురైనా మూత్రం లీక్ అవుతుంది. అయితే మూత్రం తరచుగా లీక్ అవుతున్నా, నలుగురిలో వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నా వారికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీనికి రకరకాల సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. టెన్షన్ ఫ్రీ వజైనల్ టిప్ (టీవీటీ) పద్ధతిలో మూత్రమార్గం కింద టేపులాంటిది అతికిస్తారు. కొందరికి ల్యాప్రోస్కోపీ సాయంతో కాల్పోసస్పెన్షన్ కూడా చేస్తారు.
గంటకు గంటకు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని కొందరు వాపోతుంటారు. ఇందుకు రకరకాల కారణాలు దోహదం చేయవచ్చు. ఇన్‌ఫెక్షన్ కారణంగా కూడా అతిగా మూత్రానికి వెళ్లాల్సి రావొచ్చు. ప్రొస్టేట్ ఉబ్బు, స్ట్రిక్చర్, స్టినోసిస్ వంటి సమస్యల్లో మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాదు. దీంతో మూత్రాశయం నిండి తరచుగా మూత్రం రావొచ్చు. క్షయ, మధుమేహం నియంత్రణలో లేకపోవడం వల్ల అతిమూత్రం సమస్య ఏర్పడుతుంది. కొందరిలో మూత్రాశయ కండరం అతిగా స్పందించడం కూడా ఈ సమస్యకు దారి తీయవచ్చు. మూత్రాశయం అతిగా స్పందించేవారికి యాంటీ కొలనర్జిక్ మందులు ఉపయోగపడతాయి. వీటిని దీర్ఘకాలం వాడాల్సి ఉంటుంది. దీని వల్ల దుష్ప్రభావాలు ఏమీ కలగవు. కొందరికి నోరు ఎండిపోవడం, మలబద్ధకం వంటివి తలెత్తే అవకాశం ఉంది.

చాలా మంది వయసు పెరిగే కొద్దీ రాత్రిపూట మూత్రం ఎక్కువగా వస్తుందని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదని వైద్యులు చెప్తున్నారు. వయసుతో పాటు వచ్చే ప్రొస్టేట్ ఉబ్బు వంటి ఇతర సమస్యలే అతి మూత్రానికి కారణమవుతుందని వారు వెల్లడిస్తున్నారు. రాత్రి పూట మూత్రానికి ఎక్కువ సార్లు లేవడం వల్ల నిద్ర బాగా దెబ్బతింటుంది. దీంతో మరుసటి రోజు ఉదllయం బద్ధకంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. జీవనశైలి మార్చుకోవడంతో ఈ సమస్యకు మంచి ఫలితం కనపడుతుంది.


✿ రాత్రిపూట 7 గంటల తర్వాత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోకూడదు. చాలామంది రాత్రి పడుకునేముందు పాలు, మజ్జిగ వంటివి తాగుతుంటారు. దీంతో వారికి రాత్రిళ్లు ఎక్కువ మూత్రం వస్తుంది. మద్యం తీసుకోవడం కారణంగానూ మూత్రం ఎక్కువగా రావొచ్చు.
✿ అధిక బరువు తగ్గించుకోవాలి. ఎందుకంటే అధిక బరువు మూత్రాశయంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది
✿ దూమపానానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే పొగ కారణంగా మూత్రాశయంపై ఎక్కువ ప్రభావం పడి సమస్య ఏర్పడుతుంది
✿ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా అతిమూత్రం సమస్యను పరిష్కరించవచ్చు

undefinedహైలురానిక్ యాసిడ్ వాడుతున్నారా..
అతి మూత్రం సమస్యను పరిష్కరించే కొన్ని చిట్కాలు:

✿ ఉసిరి ఎక్కువగా తినాలి. ఎందుకంటే ఉసిరి మూత్రాశయాన్ని క్లియర్ చేయడంలో బాగా పనిచేస్తుంది. మూత్రాశయ కండరాలను ఉసిరి బలంగా చేస్తుంది. దీంతో సమస్య దూరమవుతుంది.

✿ కుంకుడు కాయలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా ఓ వారం చేస్తే అతి మూత్ర సమస్య కంట్రోల్‌లోకి వస్తుంది.
✿ జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వత వడగట్టి అందులో తేనెను కలిపి తీసుకోవాలి. టీలా వేడిగా తాగాలి. ఇలా రోజులో రెండు సార్లు ఈ టీ తాగితే అతి మూత్రం సమస్య తగ్గుతుంది
✿ ఉదయాన్నే కొన్ని తులసి ఆకులను మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకోవాలి. తరచూ ఇలా చేస్తే అతి మూత్రం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది
✿ నువ్వులు కూడా మూత్రాశయ సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి వీటిలో బెల్లం కలిపి లడ్డూల్లా చేసి ఈ సమస్యని దూరం చేసుకోండి.

గమనిక: 
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి

రోజ ఇలా చేస్స అదుపులో ఉంటుంది


డయాబెటీస్‌తో బాధపడుతున్నారా? అయితే, జాగ్రత్త. కరోనా వేళ.. మధుమేహ బాధితులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

    
ఈ రోజుల్లో డయాబెటీస్ లేని వ్యక్తులను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, బిజీ లైఫ్, ఒత్తిడి వల్ల చిన్న వయస్సులోనే చాలామంది డయాబెటీస్ లేదా మధుమేహానికి గురవ్వుతున్నారు. వైరస్‌లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో డయాబెటీస్ బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాయమం నుంచి ఆహారపు అలవాట్లు వరకు ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఒళ్లు కదల్చకుండా ఒక చోటే కూర్చుంటే.. చాప కింద నీరులా చక్కెర వ్యాధి తన పని తాను చేసుకుపోతుంది. అవయవాలను దెబ్బతిస్తూ ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఏదైనా వైరస్ సోకితే చికిత్స కూడా క్లిష్టంగా మారుతుంది. అలాగే, వైరస్‌కు చికిత్స పొందిన తర్వాత బ్లాక్ ఫంగస్ ముప్పు కూడా డయాబెటీస్ రోగులకే ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి.. ఇక్కడ తెలిపిన డయాబెటీస్‌కు గల కారణాలను, జాగ్రత్తలను తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి.

Representational Image
☀ దేశంలో డయాబెటీస్ విజృంభించడానికి మొదటి కారణం జీవనశైలిలో మార్పు.
☀ ఒకేచోట కూర్చుని ఉద్యోగం చేయాల్సి రావడం, శరీరానికి తగిన వ్యాయమం లేకపోవడం కూడా డయాబెటీస్‌కు దారి తీస్తోంది.
☀ స్థూలకాయం, పని ఒత్తిడి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.
☀ రోజూ 30 నుంచి 45 నిమిషాల నడక, జాగింగ్, ఈత, లేదా ఏదైనా వ్యాయామం చేయాలి.
☀ ఒకే చోట కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తుంటే ఒంట్లో ఇన్సులిన్ వినియోగం చక్కగా ఉంటుంది.
☀ మధుమేహం వస్తే అన్నం మానేసి, చపాతీలు మానేయడం ఒక్కటే మార్గమని భావిస్తారు. కానీ, అది సరైన విధానం కాదు.


☀ డయాబెటీస్ వస్తే స్వీట్లు, తీపి పదార్థాలకు, చివరికి పండ్లకు కూడా దూరంగా ఉండటం మంచిదే.
☀ మధుమేహానికి పథ్యాలు పాటించాల్సిన అవసరం లేదు. క్రమబద్ధంగా తింటే చాలు.
☀ ఆహారాన్ని ఒకేసారి కాకుండా దశల వారీగా తక్కువ తక్కువగా తీసుకోవాలి.
☀ పాలీష్ పట్టించని బియ్యాన్ని మాత్రమే వండుకుని తినాలి.
☀ గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరు ధాన్యాలు తీసుకోవాలి.


☀ కాయగూరలను, ఆకుకూరలను ఎక్కువగా తినాలి.
☀ వేళకు భోజనం చేయాలి. విందులు, ఉపవాసాలకు దూరంగా ఉండాలి.
☀ నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, యాపిల్‌ వంటి పండ్లు డయాబెటీస్‌ను అదుపులో ఉంచుతాయి.
☀ ఉదయం వేళ రాగి జావ తాగడం ఎంతో మంచిది.
☀ రోజు ఏదో ఒక రూపంలో మెంతులను తీసుకోవడం మరింత ఉత్తమం.

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

యూరిక్ ఆసిడ్ సమస్య ఉన్న వాళ్ళు తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

గౌట్ మరియు యూరిక్ఆసిడ్ సమస్యను శాశ్వతంగా తగ్గించే అద్భుతమైన నవీన్ఆయుర్వేద చిట్కా..uric acid remedies

యూరిక్ యాసిడ్ శరీరంలో పెరిగిపోతే ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనం భోజనం చేసినప్పుడు మన జీర్ణాశయం జీర్ణంచేసి పోషకాలను శరీరానికి అందిస్తుంది. యూరిక్ యాసిడ్ కూడా అలాంటి పోషకాలలో ఒకటి. అది మూత్రపిండాల్లోకి వెళ్ళి తర్వాత మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఈ యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోయి బయటకు వెళ్ళలేకపోతున్నాం. ఇది శరీరమంతా వ్యాపిస్తుంది. అలా జరగడంవలన అనారోగ్యాలకు కారణమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అవుతుంది. చేతులు కాళ్ళలో వాపులు రావడం, కీళ్ళమధ్యలో తరుచూ వాపులు రావడం జరుగుతుంది. 

ముఖ్యంగా ఆ ప్రదేశాలలో ఎర్రగా అవుతుంది. ఇలాంటి సమస్యలకు యూరిక్ యాసిడ్ కారణం. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరీగిపోతే షుగర్, కిడ్నీ సంబంధిత రోగాలు ఇలాంటి ఎన్నోరకాల సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరగడంవలన కీళ్ళనొప్పులు వస్తూ ఉంటాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఎముకల మధ్యలో స్పటికాలలా ఏర్పడతాయి. దీనివలన ఎముకలు రూపం మారుతుంది. దీనిని గౌట్ అని పిలుస్తారు. ఉదయం లేదా సాయంత్రం పూట ఒంట్లో నొప్పులు వస్తే దీనికి గౌట్ కారణంకావచ్చు. యూరిక్ యాసిడ్ పెరిగిపోయినప్పుడు  తినకూడని ఆహార పదార్థాలు చూద్దాం. దీనివలన మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగకుండా చూసుకోవచ్చు.

 దానికోసం సొరకాయ, వాము, మిరియాలు తీసుకోవాలి. ముందుగా వామును దంచి దానిని పొడిచేసుకోవాలి. సొరకాయ పైన చెక్కుతీసి ముక్కలుగా చేసిఒక గ్లాసు జ్యూస్ చేసుకోవాలి. ఒక చెంచా వాముపొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఉదయాన్నే ఏమైనా తిన్న తర్వాత తాగితే చాలు. ఈ జ్యూస్ ఆయుర్వేదం ప్రకారం యూరిక్ యాసిడ్ను బయటకు పంపుతుంది. యూరిక్ యాసిడ్ విషపదార్థాలతో సమానం. శరీరంలో పెరిగేవ్యర్థాలను డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి అధికంగా ఉంటాయి. మూత్రపిండాల్లో, కాలేయంలో ఏర్పడే విషవ్యర్థాలను బయటకు పంపడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీనివలన ఎంత తీవ్రమైన గౌట్ సమస్యైనా తగ్గిపోతుంది. వాముపొడి, మిరియాల పొడివలన ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

 శరీరంలో వచ్చే వాపులను తగ్గించడంలో దోహదపడుతుంది. గిలాయ్ జ్యూస్ అంటే తిప్పతీగ జ్యూస్ ఇది కరోనా సమయంలో ఇమ్యూనిటి పెరగడానికి సహాయపడుతుంది. శరీరంలో ఏర్పడే ఎలాంటి అనారోగ్యాలనైనా తగ్గిస్తుంది. గౌపహట్ లాంటి సమస్యలు తగ్గడానికి తిప్పతీగ చాలా బాగా ఉపయోగపడుతుంది. తిప్పతీగ అందుబాటులో లేకపోతే ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. యూరిక్ యాసిడ్ వలన డయాబెటిస్, ఒళ్ళునొప్పులు ఎక్కువగా పెరిగిపోతాయి. అలోవెరా జ్యూస్,ఆమ్లా జ్యూస్ కూడా బాగా పనిచేస్తాయి. 

అలోవెరా వలన రక్తశుద్ధి జరుగుతుంది. యూరిక్ యాసిడ్ బయటకు పోతుంది. ఉసిరి జ్యూస్లో లభించే విటమిన్ సి యూరిక్ యాసిడ్ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపున తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువగా నీరు తాగడంవలన మూత్రంద్వారా యాసిడ్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఆల్కహాల్, జంక్ ఫుడ్ తగ్గించాలి. అలాగే టీ, కాఫీలు, మసాలాలు, కూడా మానేయాలి. 

మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి 

గౌట్ ఆర్థరైటీస్ నుంచి విముక్తి ఇలా…

Gout Symptoms Causes Treatment

ఈ మధ్య చాలామంది కీళ్ళ నొప్పులతో బాధ పడటం చూస్తుంటాం. కీళ్ళకు సంబంధించిన వ్యాధులను ఆర్థరైటీస్ అంటారు. కీళ్ళలో వాపుతో పాటు నొప్పి అధికంగా ఉండి కదల్లేక పోవటం. ఆర్థరైటీస్ వయస్సును బట్టి, కారణాలను బట్టి శరీరంలో వివిధ భాగాలు ఆర్థరైటిస్‌కు గురవుతున్నాయి. ఆర్థరైటీస్‌లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ‘గౌట్’ వ్యాధి చాలా మందిని వేధిస్తోంది. ఈ వ్యాధి మొదలు కాలి బొటన వేలుతో మొదలై తరువాత మోకాళ్ళు, భుజం, మోచేయి, మణికట్టు, వేళ్ళ కపులు, నొప్పి పుట్టి బాధిస్తుంటాయి. ఈ వ్యాధి సాధారణంగా పురుషుల్లోనే ఎక్కువ. మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఈ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది. సాధారణంగా మహిళల్లో ఈ వ్యాధి మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గిపోయాక కనిపిస్తుంటుంది.

యూరిక్ యాసిడ్ మెటబాలిజం చక్కగా జరుగక రక్తంలో యూరిక్‌యాసిడ్ స్థాయి పెరగడం వల్ల గౌట్ వ్యాధి సంభవిస్తుంది. యూరిక్ యాసిడ్ కొందరిలో కీళ్ల మధ్యన చేరి రాయి (క్రిస్టల్)లా గట్టిగా మారిపోయి కీలును దెబ్బ తీస్తుంది. మాంసాహారం, ఆల్కహాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం వల్ల.కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. స్థూలకాయం, థైరాయిడ్ సమస్య ఉండటం.
లక్షణాలు: యూరిక్ యాసిడ్ ఈ కీళ్ళలో రాయిలా మారి ఉండటం వల్ల నొప్పి, వాపులతో పాటు సరిగ్గా నడవలేక పోవటం జరుగుతుంది. కీళ్ళ నొప్పులు వాపుతో కూడి ఉండును(ముఖ్యంగా బొటన వేలు ) మోచేయి, మోకాలు, మణికట్టు వంటి కీళ్ల దగ్గర నొప్పి ఉండి కదలికలు కష్టంగా మారుతుంది.

నిర్ధారణ పరీక్షలు: ఈఎస్‌ఆర్, ఆర్‌ఎఫ్యాక్టర్, సీరం యూరిక్ ఆసిడ్, విడిఆర్‌ఎల్, సిబిసి. ఎక్స్‌రేలు( ఆయా కీళ్లకు సంబంధించినవి).

జాగ్రత్తలు: ముఖ్యంగా ఉప్పు, వంటలలో నూనెను తగ్గించాలి. మాంసాహారం, ఆల్కహల్, స్మోకింగ్ (అలవాటు ఉన్నవారు ) వెంటనే మానివేసే ప్రయత్నం చేయాలి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి వాయ్యామం, యోగా నిత్యం చేయాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కాల్షియం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. పాలు, కోడిగుడ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి. పాదరక్షలు సౌకర్యవంతముగా ఉండే విధంగా చూసుకోవాలి. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం నివారించుకోవాలి. వ్యాయామం, నడక , సైక్లింగ్ మొదలైనవి చేయడం వల్ల నొప్పులు కొద్దిగా ఎక్కువ అనిపించినా కూడా ప్రతిరోజు కొద్దిసేపు వాయ్యమం చేయడానికి ప్రయత్నించాలి. నొప్పి తీవ్రత తగ్గించుకోవటానికి అతిగా పెయిన్ కిల్లర్స్‌ను వాడకూడదు. నీరు సరిపడినంతగా తాగాలి తాజా కూరగాయలు నిత్యం ఆహారంలో ఉండే విధంగా తీసుకోవాలి.

చికిత్స: ఇంతగా వేధించే కీళ్ళ నొప్పులకు హోమియో
వైద్యంలో చక్కని చికిత్స ఉంది. వ్యాధి లక్షణాలను, వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోనికి తీసుకొని మందులను ఎన్నుకొని వైద్యం చేసిన గౌట్ సమస్యను నయం చేయవచ్చును. వ్యాధి తొలిదశలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రధించి లక్షణాలకు అనుగుణంగా మందులు వాడితే కీళ్ళనొప్పుల నుండి విముక్తి పొందవచ్చును.

మందులు:

ఆర్నికా : గౌట్ కు ఇది ఒక మంచి ఔషధం. కాళ్లలోనూ, నడుంలోనూ నొప్పి ఎక్కువగా ఉంటుంది. కింద పడుకున్నప్పుడు నడుము గట్టిగా అనిపించి నొప్పి వస్తుంది. నడుము భాగంలో నొప్పి ఉండటం ములాన నిటారుగా నడవ లేక ఇబ్బంది పడుతారు. కీళ్ళలో ఏర్పడ్డ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ను కరిగించడానికి ఆర్నికా మంచి ఔషధం.

బెంజోయిక్ యాసిడ్ : గౌట్ కోసం వాడదగిన ఔషధాలలో ఇది ప్రత్యేకం. కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడం ( రీనల్ ఇన్‌సఫిషియెన్సీ), కిడ్నీలోని నెప్రాన్‌లలో యూరిక్ యాసిడ్ వడపోత సరిగ్గా జరగకపోవడంతో మూత్రంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల మూత్రం గాఢంగా, భరించలేని వాసనతో, ముదురు రంగులో ఉంటుంది. నడిచేటప్పుడు ఎముకలలో శబ్దాలు వినపడుతాయి. అన్ని రకాల గౌట్ నొప్పులకు ఈ మందు తప్పక ఆలోచించదగిన మంచి ఔషదం.

లెడంపాల్ : రక్తంలో యూరిక్ ఆసిడ్ స్థాయి పెరగడం వల్ల నొప్పి మొదట పాదాలలో ప్రారంభమై పిక్కలలోకి వ్యాపించును, తరువాత తొడలలోకి పాకుతుంది. వీరికి కాలి బొటన వేలు, పాదాలలో నొప్పి ఎక్కువగా ఉండి వాపుతో కూడి ఉంటుంది. వీరికి వేడి కాపును భరించలేరు. చల్లని నీల్లు కాళ్ళకు తాకిన నొప్పి నుండి ఉపశమనం పొందే వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.


బ్రయోనియా : వీరికి కదలికల వల బాధలు ఎక్కువగును. విశ్రాంతి వల్ల తగ్గుట గమనించదగిన లక్షణము. వీరికి దాహం ఎక్కువగా ఉండును. అయినప్పటికి మల బద్దకముతో బాధ పడుతుంటారు. మలము గట్టిగా వచ్చును. మానసిక స్థాయిలో వీరు ఇంటిపైనే ఎక్కువగా బెంగపెట్టుకొని ఉంటారు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడుకోదగినది. ఈ మందులే కాకుండా రస్‌టాక్స్, రూటా, కాల్కేరియా ఫాస్, కాల్సికవ్‌ు, గయుయకం, లైకోపోడియం, అక్టియోస్పైకేట వంటి మందులను వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నుకొని వైద్యం చేసిన గౌట్ నుండి విముక్తి పొందవచ్చును.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660


2, సెప్టెంబర్ 2021, గురువారం

పురుషులు లో సంతానలేమి సమస్య కు అవగాహనా కోసం లింక్స్ లో చుడండి

పురుషుల్లో ఈ సమస్యలుంటే పిల్లలు పుట్టడం కష్టమే..!అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 




సురక్షితంగా గమ్యం చేరుకోవాలంటే ప్రయాణికుడు, వాహనం మెరుగ్గా ఉండాలి. గర్భధారణ జరగాలంటే, వీర్యకణాలతో పాటు, వాటిలోని జన్యు పదార్థం ఆరోగ్యంగా ఉండాలి. అండాలను చేరుకోవడం కోసం పయనించే జన్యు పదార్థానికి వీర్యం ఓ వాహనంలా ఉపయోగపడుతుంది. అయితే వీర్యంలో లోపాలు ఉన్నా, వీర్యకణాల్లోని జన్యుపదార్థంలో లోపాలు ఉన్నా అండం ఫలదీకరణ జరగదు. ఒకవేళ జరిగినా మూడు నెలలు తిరగకుండానే అబార్షన్‌ అయిపోతూ ఉంటుంది. సాధారణంగా గర్భం దాల్చకపోవడానికి మహిళల మీదే అపవాదు మోపుతూ ఉంటారు. కానీ దీనిలో పురుషులకూ సమ బాధ్యత ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణాలు..


పరిమాణం: వీర్య పరిమాణం సుమారుగా 1.5 మిల్లీ లీటర్ల నుంచి 2 మిల్లీ లీటర్ల పరిమాణం ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉంటే గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి.


వీర్యకణాల సంఖ్య: గర్భధారణకు అవసరమైన వీర్యకణాల సంఖ్య, ఒక మిల్లీలీటరుకు 15 మిలియన్ల నుంచి 30 మిలియన్లు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే సమస్య ఉన్నట్టు భావించాలి. 


రంగు: వీర్యం రంగు తెల్లగా ఉండాలి. పచ్చగా ఉంటే ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టు, ఎర్రగా ఉంటే వీర్యంలో రక్తం కలుస్తున్నట్టు అర్థం. ఈ సమస్యలు ఉన్నా గర్భధారణ సాధ్యపడదు.


చిక్కదనం: వీర్యం జిగటగా ఉండాలి. నీళ్లలా ఉంటే హర్మోన్ల సమస్య ఉందని అర్థం. ఇలాంటి పల్చని వీర్యం గర్భధారణ జరగనివ్వదు.


వీర్యం కరిగే తత్వం: చిక్కగా ఉండే వీర్యం గది ఉష్ణోగ్రత దగ్గర 15 నిమిషాల్లో కరిగిపోవాలి. ఇలా జరగకపోతే వీర్యంలో ఇన్‌ఫెక్షన్‌ ఉందని అనుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ గర్భధారణకు ప్రధాన అడ్డంకి!


చీము కణాలు: వీర్యంలో చీము కణాలు ఉంటే, ఇన్‌ఫెక్షన్‌ ఉందని అర్థం చేసుకోవాలి.


కదలికలు: వీర్యంలో కదిలే శుక్రకణాలు 32శాతం ఉంటే సరిపోతుంది. అంతకంటే తక్కువ ఉంటే సమస్య ఉందని భావించాలి.


శుక్ర కణం నిర్మాణం: శుక్ర కణం, తల, తోక, ఆకార నిర్మాణంలో లోపాలు. ఈ లోపాల కారణంగా శుక్రకణం అండంలోకి ప్రవేశించలేదు.


అతుక్కుపోయి ఉండడం: వీర్యకణాలు స్వతంత్రంగా కదలకుండా, ఒకదానికి మరొకటి అతుక్కుపోయి ఉండవచ్చు. ఇందుకు ఇన్‌ఫెక్షన్లే కారణం.


వృషణాల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం: బిగుతైన లోదుస్తులు ధరించడం, ఎక్కువ సమయం పాటు కుర్చీల్లో కూర్చుని పని చేయడం, వేడితో కూడిన వాతావరణంలో పని చేయడం (వంటవాళ్లు, కొలిమి దగ్గర పనిచేసే వాళ్లు) వల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా శుక్రకణాల నాణ్యత దెబ్బతింటుంది.


చికిత్సలు ఉన్నాయి!

జన్యుపరమైన సమస్యలు మినహా వీర్యానికి సంబంధించిన ప్రతి సమస్యకూ చికిత్సలు ఉన్నాయి. ప్రోస్టేట్‌ గ్రంథిలో సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, వేరికోసిల్‌ లాంటి పలు ఆరోగ్యపరమైన సమస్యల మూలంగా వీర్యసంబంధ సమస్యలు తలెత్తవచ్చు. వీటిన్నిటినీ మందులతో సరిదిద్దే వీలుంది. వేరికోసిల్‌ చివరి దశకు చేరుకున్నప్పుడు మాత్రమే సర్జరీ అవసరం పడవచ్చు. మొదటి దశలో ఉంటే, మందులతో సరిదిద్దవచ్చు. అలాగే వీర్య సమస్యలకు ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లు కూడా కారణమే! కాబట్టి వాటిని మానుకోవాలి. చికిత్స సమయంలో ఈ దురలవాట్లను మానుకోకపోతే వైద్య ఫలితం దక్కదు. 


ఈ పరీక్ష ఎవరికి అవసరం?

పెళ్లైన ఏడాది వరకూ:  ఎటువంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకపోయినా, గర్భం దాల్చనప్పుడు....


ఏడాది లోపే.....

ఈ కింది కోవలకు చెందిన పురుషులు పెళ్లైన ఏడాది లోపే పరీక్ష చేయించుకోవాలి.


వీర్య సంబంధ సమస్యలు అన్నదమ్ములు, దగ్గరి బంధువుల్లో ఉన్న సందర్భాల్లో...

బాల్యంలో వృషణాలకు సర్జరీ జరిగినా, హెర్నియా సర్జరీ జరిగినా.... 

వృషణాలకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చి తగ్గిన సందర్భంలో...

కేన్సర్‌ చికిత్స తీసుకున్నవారు   ఫ  స్టెరాయిడ్‌ థెరపీలు తీసుకున్న వారు.


ఇదీ పద్ధతి!

వీర్య పరీక్షకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి వీర్యం ఇవ్వవచ్చు అనుకుంటే పొరపాటు. వీర్య పరీక్షలో కచ్చితమైన ఫలితాలు దక్కడం కోసం వీర్యం సేకరించే పద్ధతి, పాటించవలసిన నియమాలు ఇవే! 


వీర్య సేకరణకు మూడు రోజుల ముందు వరకూ (హస్తప్రయోగం, స్వప్న స్ఖలనం, లైంగికంగా కలవడం) స్ఖలనం జరిగి ఉండకూడదు. అలాగే 7రోజుల పాటు స్ఖలనం జరపకుండా వీర్యాన్ని సేకరించకూడదు.


వీర్యాన్ని ఇంటి దగ్గర సేకరిస్తే, ఆ డబ్బాను కాగితంలో చుట్టి శరీరానికి దగ్గరగా ఉంచి, ల్యాబ్‌కు చేర్చాలి. శరీర ఉష్ణోగ్రతకు దగ్గర్లోనే వీర్యకణాలు సజీవంగా ఉంటాయి. కాబట్టి అతి చల్లని, లేదా అతి వేడి వాతావరణంలో వాటిని ఉంచకూడదు.


వీర్యం సేకరించిన 40 నిమిషాల్లోగా ల్యాబ్‌కు అందించాలి.

ల్యాబ్‌లో అందించే స్టెరైల్‌ కంటెయినర్‌లోనే వీర్యాన్ని సేకరించాలి.

స్ఖలనం కోసం ఎటువంటి క్రీమ్‌లూ, నూనెలూ వాడకూడదు.

కండోమ్‌ ఉపయోగించకూడదు.


స్ఖలనం సమయంలో వెలువడే పూర్తి వీర్యాన్ని సేకరించాలి. ఒకవేళ వీర్యం కొంత కింద పడిపోతే పరీక్ష మానుకుని, తిరిగి మూడు రోజుల తర్వాత ప్రయత్నించాలి.


వైరల్‌ ఫీవర్‌ లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు నెల రోజుల వరకూ పరీక్ష చేయించకూడదు.


పరీక్షా సమయం!

వీర్య పరీక్ష (సెమన్‌ ఎనాలసిస్‌)కు కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. ఎవరైనా అరగంటలోపు రిపోర్టు అందిస్తున్న పక్షంలో ఆ ఫలితాన్ని అనుమానించాలి.



లోపాలు కనిపెట్టవచ్చు!

వీర్య పరీక్ష కూడా రక్త పరీక్ష లాంటిదే! రక్తానికి సంబంధించి ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయో, వీర్యానికి సంబంధించి కూడా పలు రకాల పరీక్షలు ఉంటాయి. కాబట్టి ఒకే ఒక పరీక్ష (సెమన్‌ ఎలాలసిస్‌)తో వీర్యంలోని అన్ని లోపాలనూ కనిపెట్టడం కుదరదు. అవసరాన్ని బట్టి వీర్యంలోని ఇతరత్రా అంశాలను గమనించే ఇతర పరీక్షలు అవసరం పడతాయు.

వీర్యకణాలని పెంపొందించుకోవడం ఎలా 


మగవారిలో వీర్యకణాల లెక్క బాగా తక్కువగా ఉంటే, సంతానం కలగటం కష్టం అవ్వవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ప్రకారం వీర్యకణాల లెక్క (sperm count) ఒక మిల్లి లీటర్ కి 15 మిలియన్లు (15 million per milliliter) ఉంటే, మంచి ఆరోగ్యాంగా ఉన్నట్టే. అంతకంటే తక్కువగా వుంటే, సమస్యలు తలెత్తవచ్ఛు (1).

వీర్యం ఎక్కువగా ఉన్నా, పనికివచ్చే కణాలు, చురుకైన కణాలు లేకపోతే కూడా సంతానోత్పత్తి లో సమస్యలు కలుగవచ్చు. మీరు వీర్యకణాల పరీక్ష చేయించుకుని, అందులో కౌంట్ కానీ నాణ్యత కానీ తక్కువ అని వస్తే గనుక, మీ వైద్యులు మీకు చికిత్స మొదలు పెడతారు. ఆ చికిత్సతో పాటుగా మీరు తీసుకునే ఆహరం మీద కూడా ధ్యాస పెడితే ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.

మగవారి వీర్యకణవృద్ధి కోసం సహజమైన ఆహార చిట్కాలని ఇక్కడ మామ్ జంక్షన్ వివరిస్తోంది.


వీర్యకణాలు (స్పర్మ్ కౌంట్) పెంచే చక్కని ఆహారం

మగవారి విషయంలో వీర్యకణాలు పెంచే మంచి పుష్టికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం గురించి తెలుసుకుందాం.

1. టోమాటోలు

టోమాటోల్లో లైకోపెన్ (lycopene) అనే యాంటీ-ఆక్సిడెంట్ (anti-oxidant) ఉంటుంది. వైజ్ఞానిక పరిశోధనలలో తెలిసినది ఏంటి అంటే టోమాటో జ్యూస్ వీర్యం ఆరోగ్యంగా, చురుకుగా ఉండేట్టు చెయ్యగలవు అని (2).

2. వాల్నట్స్ (అక్రోటు కాయ)

ఒమేగా 3, కొవ్వుతో కూడిన యాసిడ్స్ ఆక్రోట్ లో వున్నాయి. ఈ విషయంపై స్టడీ చేసిన వైజ్ఞానికులు ప్రతిరోజూ 70 గ్రాములు ఆక్రోట్ ఆహారంలో వుంటే వీర్యాన్ని బలంగా తయారుచెయ్యటంలో సహకరిస్తుంది అని కనుక్కున్నారు. 21 – 35 మధ్య వయసువాళ్ళు సలాడ్స్ లో పైన టాపింగ్ గా వీటిని వాడుకోవచ్చు. లేదా చిరుతిండి గా ఆక్రోట్ ని తినవచ్చు.

౩. గుమ్మడి కాయ గింజలు

స్పెర్ం కౌంట్ కి కావాల్సిన అమినో ఆసిడ్, ఫైటో స్టిరాల్స్ (phytosterols) గుమ్మడి గింజల్లో బాగా ఉన్నాయి. వీర్యం మోతాదు పెంచడానికి, వీర్య కణం నాణ్యతని పెంచడానికి ఇవి బాగా సహకరిస్తాయి (3). రోజూ వీటిని సలాడ్స్ మీద కానీ, ఉట్టిగా కానీ, పప్పుధాన్యాలతోనో తింటే మంచిది.

4. పప్పు దినుసులు, కాయ ధాన్యాలు

పప్పు దినుసుల్లో, బఠానీల్లో ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది. అది వీర్య ఉత్పత్తికి, వీర్య వృద్ధికి, నాణ్యతకి ఉపయోగకరం (4). కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవాలి. అప్పుడు స్పెర్మ కౌంట్ ఆరోగ్యాంగా ఉండే అవకాశం ఉంటుంది.

5. బెర్రీస్

బ్ల్యూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, ఇలా ఎన్ని రకాల రేగిపళ్ళు దొరుకుతాయో, అవన్నీమంచివే. శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్స్, ఆంటీ-ఇంప్లమాటరీ (anti-inflammatory) లక్షణాలు స్పెర్ము కౌంట్ని పెంచవచ్చు (5) (6). రోజుకో గుప్పెడు బెర్రీలు పెరుగులోనో, ఉట్టిగానో తింటే, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

6. దానిమ్మ పళ్ళు

దానిమ్మలో యాంటీ- ఆక్సిడెంట్స్ సంవృద్ధిగా ఉన్నాయి. టెస్టోస్టెరోన్ (మొగవారి సెక్స్ హార్మోన్) లెవెల్ పెంచి, స్పెర్మ్ ఆరోగ్యకరంగా తయారవడానికి, పురుషుల్లో సెక్స్ వాంఛని కలుగ చెయ్యడానికి దోహద పడుతుంది. ప్రయోగంగా ఎలుకలకి రోజూ ఇవి తినిపించి, 8 వారాలు పైగా పరీక్షించగా, దానిలోని వీర్య కణాల వృద్ధి స్పష్టంగా కనపడింది (7) (8).

7. డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో అధికంగా ఎమినో ఆసిడ్ ల-ఆర్జినిన్ (amino acid L-arginine) ఉండటం వల్లన వీర్య కణాలు బాగా పెరుగుతాయి అని అంటారు. రోజుకో చిన్న ముక్క తింటేమంచిది (9).

8. వెల్లుల్లి

వెల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు పెద్దలు. వెల్లుల్లి లో ఎల్లిసిన్ (allicin) అనే పదార్ధంలో రక్త ప్రసరణని చురుకుగా చేయగల సత్తా ఉంది. రక్త ప్రసరణ బాగా ఉండటం వలన సంతానోత్పత్తి అంగాలలో ప్రక్రియలు బాగా జరిగి, వీర్యం ఎంతో ఆరోగ్యంగా తయారౌతుంది. వెల్లుల్లి లో సెలీనియం (selenium) ఉండటం, వలన వీర్య కణాల కదలికలు కూడా చురుకుగా ఉండే అవకాశం ఉంది (10).

9. కోడి గుడ్లు

గుడ్ల లో సంవృద్ధిగా ప్రోటీన్, విటమిన్ E ఉంటాయి. వీర్యకణాల నిర్మాణం, వాటి పెరుగుదల, నాణ్యతలని రక్షించడానికి అవి చాలా అవసరం (11).

10. క్యారెట్లు

క్యారెట్లలో బీటా-కారొటిన్ (beta-carotene) ఉంటుంది. అది బలమైన యాంటీ-ఆక్సిడెంట్, అరోగ్యకరమైన స్పెర్మ్ తయారవటానికి ఉపయోగ పడుతుంది. వీర్యకణాల కదలికలు, రూపం,మోతాదు పరిరక్షిస్తుంది. దానివల్ల వీర్యకణాలు అండం వద్దకు వెళ్లే వేగము కూడా పెరుగుతుంది (12).

11. అశ్వగంధ

అశ్వగంధ వేరు పురాతనంగా ఆయుర్వేద వైద్యంలో వాడేవారు. ఒక వైజ్ఞానిక ప్రయోగంలో, 66 మంది మగవారిలో టెస్టోస్టెరోన్ (testosterone) లెవెల్ పెరిగి, దానితో స్పెర్మ్ కౌంట్ కూడా బాగా పెరిగింది. అంగస్తంభన సమస్యలకి కూడా సమాధానం దొరికింది. అశ్వగంధ వేరుతో టీ చేసుకుని తాగావచ్చు (13).

12. ఆస్పరాగస్ (కాకపాలాకు) కూర

విటమిన్ బాగా ఎక్కువ శాతం వున్న ఈ ఆకుకూర వీర్య వృద్ధికి పని చేస్తుంది (14). వీర్య కణాలు పెరిగాయంటే, అండాన్ని చేరడానికి పరుగుతీసే వీర్యకణాలు ఎక్కువౌతాయి. తద్వారా గర్భధారణ ఛాన్సులు పెరుగుతాయి.

13. అరటిపళ్ళు

అరటిపళ్ళల్లో బ్రోమిలీన్ అనే ఎంజెయిమ్ సెక్స్ హార్మోన్లని పెంచుతుంది. అంతే కాక, విటమిన్ A, B1, C మగవారిలో వీర్య వృద్ధికి, వీర్య శక్తి కి బలం చేకూరుస్తాయి.

14. పచ్చని ఆకు కూరలు

పచ్చని ఆకు కూరలలో ఫోలిక్ ఏసిడ్ బాగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ మగవారి శరీరం లో ఆరోగ్యకరమైన వీర్యం తయారవడానికి దోహద పడుతుంది. ఒక స్టడీ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, పాలకూర, బ్రోకలీ, పచ్చి బఠాణి, ముదురు పచ్చని ఆకుకూరలు రోజు తింటుంటే, మగవారిలో వీర్యకణాల సంఖ్య బాగా పెరుగుతుంది అని (15).

15. జింకు సంవృద్ధిగా ఉన్న పదార్ధాలు

జింకు ధాతువు స్పెర్మ్ కణాలను నాశనం కాకుండా రక్షించగలదు. జింక్ గల ఆహారం ప్రతి రోజు తీసుకోవటం మంచిది (16).

16. మెంతులు

అనాదిగా మగవారి వీర్య వృద్ధికి, అంగస్తంభనకు మెంతులు వాడేవారు. మెంతుల నుంచి తీసిన గాఢమైన పదార్ధాన్ని 12 వారాలు వాడితే, వీర్యం, వీర్యకణాల సంఖ్య బాగా పెరుగుతాయని ఒక స్టడీ తెలిపింది (17).

17. ఆలీవ్ నూనె

ప్రతిరోజు ఆలివ్ నూనె తాగితే, మగవారిలో వీర్యకణాలు, వీర్యానికి సంభందించిన రుగ్మతలు తగ్గుతాయి. చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఆక్సిజెన్ రక్తంలో బాగా ప్రవహించేలా చేస్తుంది. రక్తప్రసరణ చక్కగా ఉన్నప్పుడు మగవారిలో వీర్య కణ నిర్మాణం, వీర్యం బాగా పెరుగుతాయి (18).

ఆహారంలో మార్పులే కాక, మరికొన్ని చిట్కాలు, సూచనలు పాటిస్తే, మగవారిలోని వీర్య సమస్య పరిష్కరించుకోవడంలో సహాయ పడుతుంది.

వీర్య కణాలను పెంచడంలో సహాయపడే జీవనశైలిలో మార్పులు

కింద సూచించిన మార్పులు మీ వీర్యకణాలకే కాదు శరీర ఆరోగ్యానికి కి కూడా మంచిది.

1. మంచి నిద్ర, వ్యాయామం

అతి బరువు, ఊబకాయం మగవారు తగ్గించుకుంటే, ఆరోగ్యకరమైన వీర్యం పెంపొందించుకోవచ్చు. వ్యాయామం చేసి ఒళ్ళు అలిస్తే, కంటినిండా నిద్ర పోతే, ఆరోగ్యానికి ఎంతో మంచిది.

2. ఒత్తిడిని తగ్గించుకోవాలి

ఒత్తిడి శరీరంలోని శక్తిని హరింపచేస్తుంది. మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు సంతానోత్పత్తి విషయంపై, శరీరంపై ధ్యాస ఉండదు. వత్తిడి ఎందువల్ల కలుగుతుందో, ఆ విషయం ముందు పరిష్కరించుకోవాలి. మగవారిలో వత్తిడి కోసం కొన్నిసార్లు యాంటి డిప్రెస్సంట్ మందులు వాడమని డాక్టర్లు సలహా ఇస్తారు. కానీ ఎక్కువ రోజులు మందులు వాడటం స్పెర్మ్ కౌంట్ కి అంత మంచిది కాదు.

౩. పొగ త్రాగటం మానివేయాలి

పొగ తాగడం అలవాటున్న వారిలో క్రమంగా వీర్య కణాలు తగ్గుతాయి. వీర్య కణాల నాణ్యత కూడా తగ్గుతుంది.అందుకని పొగ తాగడానికి దూరంగా ఉండటం ఉత్తమం (21).

4. మత్తు పదార్ధాలు, తాగుడుకి దూరంగా ఉండాలి

మద్యం మరియు మత్తు పదార్థాలు వంటివి వాడటం వలన వీర్యకణాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

5. మందుల వాడకం వలన ఇబ్బంది

కొన్ని మందుల వాడకం వల్ల స్పెర్మ్ కౌంట్ తాత్కాలికంగా తగ్గుతుంది. ఈ మందుల్ని ఎక్కువ రోజులు వాడటం వల్ల మగవారిలో స్పెర్మ్ ఆకారము, ఉత్పత్తి పై చెడు ప్రభావం ఉంటుంది.

6. రోజువారీ ఆహారంలో విటమిన్ D, కాల్షియం

విటమిన్ D, కాల్షియం స్పెర్మ్ నాణ్యతను పెంచుతాయి. ఏ పదార్ధాలలో ఇవి బాగా ఉన్నాయో తెలుసుకుని రోజు అవి తినాలి లేదా విటమిన్, కాల్షియమ్ టాబ్లెట్స్ రూపం లో నైనా తీసుకుంటే మంచిది.

7. కాలుష్య వాతావరణం

రాను రాను మన చుట్టూ వాతావరణం కాలుష్య మయం అవుతోంది. గాలి, నీరు, అన్నీ కాలుష్య భరితమవుతున్నాయి. వీలైనంత వరకూ స్వచ్ఛమైన వాతావరణంలో ఉండే ప్రయత్నం చేస్తే మంచిది.

మీ వీర్య కణాలలో ఏ సమస్య లేనప్పుడు, ఆరోగ్య కరమైన ఆహారం మరియు జీవనశైలి తో మీ సంతానోత్పత్తి అవకాశాలని పెంచుకోగలరు. కానీ మెడికల్ పరీక్షలలో కనుక మీ కణాలు తక్కువగా ఉన్నాయి అని తేలితే, వైద్యులు చెప్పిన ప్రకారం చికిత్స పొందుతూ, పైన చెప్పిన ఆహారం తీసుకు

ఒక గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, పైన చెప్పిన సలహాలు ఏవి వైద్యుల సలహాలను భర్తీ చెయ్యవు. ఇవి కేవలం మీ సమాచారం కొరకే.

మీ సలహాలు, అనుభవాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలుపగలరు.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింట్

విశాఖపట్నం 

9703706660


-