గౌట్ ఆర్థరైటీస్ నుంచి విముక్తి ఇలా…

Gout Symptoms Causes Treatment

ఈ మధ్య చాలామంది కీళ్ళ నొప్పులతో బాధ పడటం చూస్తుంటాం. కీళ్ళకు సంబంధించిన వ్యాధులను ఆర్థరైటీస్ అంటారు. కీళ్ళలో వాపుతో పాటు నొప్పి అధికంగా ఉండి కదల్లేక పోవటం. ఆర్థరైటీస్ వయస్సును బట్టి, కారణాలను బట్టి శరీరంలో వివిధ భాగాలు ఆర్థరైటిస్‌కు గురవుతున్నాయి. ఆర్థరైటీస్‌లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ‘గౌట్’ వ్యాధి చాలా మందిని వేధిస్తోంది. ఈ వ్యాధి మొదలు కాలి బొటన వేలుతో మొదలై తరువాత మోకాళ్ళు, భుజం, మోచేయి, మణికట్టు, వేళ్ళ కపులు, నొప్పి పుట్టి బాధిస్తుంటాయి. ఈ వ్యాధి సాధారణంగా పురుషుల్లోనే ఎక్కువ. మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఈ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది. సాధారణంగా మహిళల్లో ఈ వ్యాధి మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గిపోయాక కనిపిస్తుంటుంది.

యూరిక్ యాసిడ్ మెటబాలిజం చక్కగా జరుగక రక్తంలో యూరిక్‌యాసిడ్ స్థాయి పెరగడం వల్ల గౌట్ వ్యాధి సంభవిస్తుంది. యూరిక్ యాసిడ్ కొందరిలో కీళ్ల మధ్యన చేరి రాయి (క్రిస్టల్)లా గట్టిగా మారిపోయి కీలును దెబ్బ తీస్తుంది. మాంసాహారం, ఆల్కహాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం వల్ల.కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. స్థూలకాయం, థైరాయిడ్ సమస్య ఉండటం.
లక్షణాలు: యూరిక్ యాసిడ్ ఈ కీళ్ళలో రాయిలా మారి ఉండటం వల్ల నొప్పి, వాపులతో పాటు సరిగ్గా నడవలేక పోవటం జరుగుతుంది. కీళ్ళ నొప్పులు వాపుతో కూడి ఉండును(ముఖ్యంగా బొటన వేలు ) మోచేయి, మోకాలు, మణికట్టు వంటి కీళ్ల దగ్గర నొప్పి ఉండి కదలికలు కష్టంగా మారుతుంది.

నిర్ధారణ పరీక్షలు: ఈఎస్‌ఆర్, ఆర్‌ఎఫ్యాక్టర్, సీరం యూరిక్ ఆసిడ్, విడిఆర్‌ఎల్, సిబిసి. ఎక్స్‌రేలు( ఆయా కీళ్లకు సంబంధించినవి).

జాగ్రత్తలు: ముఖ్యంగా ఉప్పు, వంటలలో నూనెను తగ్గించాలి. మాంసాహారం, ఆల్కహల్, స్మోకింగ్ (అలవాటు ఉన్నవారు ) వెంటనే మానివేసే ప్రయత్నం చేయాలి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి వాయ్యామం, యోగా నిత్యం చేయాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కాల్షియం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. పాలు, కోడిగుడ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి. పాదరక్షలు సౌకర్యవంతముగా ఉండే విధంగా చూసుకోవాలి. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం నివారించుకోవాలి. వ్యాయామం, నడక , సైక్లింగ్ మొదలైనవి చేయడం వల్ల నొప్పులు కొద్దిగా ఎక్కువ అనిపించినా కూడా ప్రతిరోజు కొద్దిసేపు వాయ్యమం చేయడానికి ప్రయత్నించాలి. నొప్పి తీవ్రత తగ్గించుకోవటానికి అతిగా పెయిన్ కిల్లర్స్‌ను వాడకూడదు. నీరు సరిపడినంతగా తాగాలి తాజా కూరగాయలు నిత్యం ఆహారంలో ఉండే విధంగా తీసుకోవాలి.

చికిత్స: ఇంతగా వేధించే కీళ్ళ నొప్పులకు హోమియో
వైద్యంలో చక్కని చికిత్స ఉంది. వ్యాధి లక్షణాలను, వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోనికి తీసుకొని మందులను ఎన్నుకొని వైద్యం చేసిన గౌట్ సమస్యను నయం చేయవచ్చును. వ్యాధి తొలిదశలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రధించి లక్షణాలకు అనుగుణంగా మందులు వాడితే కీళ్ళనొప్పుల నుండి విముక్తి పొందవచ్చును.

మందులు:

ఆర్నికా : గౌట్ కు ఇది ఒక మంచి ఔషధం. కాళ్లలోనూ, నడుంలోనూ నొప్పి ఎక్కువగా ఉంటుంది. కింద పడుకున్నప్పుడు నడుము గట్టిగా అనిపించి నొప్పి వస్తుంది. నడుము భాగంలో నొప్పి ఉండటం ములాన నిటారుగా నడవ లేక ఇబ్బంది పడుతారు. కీళ్ళలో ఏర్పడ్డ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ను కరిగించడానికి ఆర్నికా మంచి ఔషధం.

బెంజోయిక్ యాసిడ్ : గౌట్ కోసం వాడదగిన ఔషధాలలో ఇది ప్రత్యేకం. కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడం ( రీనల్ ఇన్‌సఫిషియెన్సీ), కిడ్నీలోని నెప్రాన్‌లలో యూరిక్ యాసిడ్ వడపోత సరిగ్గా జరగకపోవడంతో మూత్రంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల మూత్రం గాఢంగా, భరించలేని వాసనతో, ముదురు రంగులో ఉంటుంది. నడిచేటప్పుడు ఎముకలలో శబ్దాలు వినపడుతాయి. అన్ని రకాల గౌట్ నొప్పులకు ఈ మందు తప్పక ఆలోచించదగిన మంచి ఔషదం.

లెడంపాల్ : రక్తంలో యూరిక్ ఆసిడ్ స్థాయి పెరగడం వల్ల నొప్పి మొదట పాదాలలో ప్రారంభమై పిక్కలలోకి వ్యాపించును, తరువాత తొడలలోకి పాకుతుంది. వీరికి కాలి బొటన వేలు, పాదాలలో నొప్పి ఎక్కువగా ఉండి వాపుతో కూడి ఉంటుంది. వీరికి వేడి కాపును భరించలేరు. చల్లని నీల్లు కాళ్ళకు తాకిన నొప్పి నుండి ఉపశమనం పొందే వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.


బ్రయోనియా : వీరికి కదలికల వల బాధలు ఎక్కువగును. విశ్రాంతి వల్ల తగ్గుట గమనించదగిన లక్షణము. వీరికి దాహం ఎక్కువగా ఉండును. అయినప్పటికి మల బద్దకముతో బాధ పడుతుంటారు. మలము గట్టిగా వచ్చును. మానసిక స్థాయిలో వీరు ఇంటిపైనే ఎక్కువగా బెంగపెట్టుకొని ఉంటారు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడుకోదగినది. ఈ మందులే కాకుండా రస్‌టాక్స్, రూటా, కాల్కేరియా ఫాస్, కాల్సికవ్‌ు, గయుయకం, లైకోపోడియం, అక్టియోస్పైకేట వంటి మందులను వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నుకొని వైద్యం చేసిన గౌట్ నుండి విముక్తి పొందవచ్చును.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660