13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

నిద్ర సమస్య ఉన్న వాళ్లకు. నవీన్ నడిమింటి అవగాహనా కోసం

*If not enough Sleep, తగినంత నిద్ర లేకపోతే.*

Q: నా వయసు 40 సం.లు. నాకు రాత్రులందు సరిగా నిద్రపట్టదు. పగలు చిరాకుగాను , నీరసముగాను ఉంటుంది తగిన సలహా ఇవ్వండి. సరియైన నిద్ర లేకపోతే వచ్చే అనర్ధాలు ఎమిటి ?

*Solution*:

ఏ వయసు వారికైనా రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవడము చాలా పెద్ద ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుంది. నిద్ర పట్టకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. రాత్రు అటు ఇటు దొర్లుతారు , నిద్ర రాదు , కలతనిద్రగా ఉంటుంది. మెలకువచ్చి మళ్ళీ నిద్ర పోవడము జరుగదు . కొంతమంది అతిగా టి.వి ల దగ్గర , కంప్యూటర్ల దగ్గర ఉండి ,లేదా కొన్ని రకాల అశ్లీల పుస్తకాలు , డిటెక్టివ్ _ నవలలు చదువుతూ నిద్రపోరు .

ఏవిధముగా నైనాసరే ఎక్కువకాలము నిద్రపట్టని పరిస్థితి ఉంటే అది శరీరములో వస్తున్న మార్పులను సూచిస్తుంది . తగింనంత నిద్ర లేకపోతే శరీరానికి విశ్రాంతి ఉండదు . అనేక అనారోగ్యాలకు తారితీస్తుంది .

*తగింనంత నిద్ర లేకపోతే---?*
పగలంటా మత్తుగా జూగుతూ ఉంటారు .
పనిమీద దృస్టి నిలపలేరు ,
ఏకాగ్రత ఉండదు .
కోపము , చిరాకు పెరుగుతాయి.
బి.పి . పెరుగుతుంది . వీరిలో వయసు పెరిగిన కొద్దీ మధుమేహము వచ్చే శాతము ఎక్కువ .
లోపలి అవయవాల పనితీరు మారిపోతుంది .
చిరాకుగా ఉండడము వలన ... సామాజిక సంబధాలు తెగిపోతాయి ,
మూడ్ సక్రమముగా ఉండదు ,
వృత్తి నైపుణ్యము తగ్గుతుంది ,
ఆడవారికి ఇంటి పనులలోనూ పొరపాట్లు జరుతుంటాయి.
సంసార బాంధవ్యాలలోనూ విబేదాలు వస్తాయి.
నిద్రపోకుంటే ఇన్నిరకాల ఇబ్బందున్నాయి. డాక్టర్ని సంప్రదించి తగిన సలహా తీసుకొని హాయిగా నిద్రపోవడము మంచిది .

*రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడానికి మరో కారణం*

*వీక్ నెస్*, షుగర్ , బిపి , జీర్ణసమస్యలు , ఆహారం
వంట బట్టక పోవడం , వత్తిడి , డిప్రెషన్ ఉన్న వారికి నరాలు ,కండరాలు త్వరగా అలసిపోతాయి .
హార్మోన్స్ సమతుల్యత ఉండే వారికైతే  బాగా పనిచేస్తే నిద్ర బాగా పడుతుంది.

కానీ పై వ్యాధులు ఉండేవారు సాయంత్రం ఎక్కువ
పని చేసి అలసిపోతే నిద్ర సరిగా పట్టదు .
కారణం నరాలు త్వరగా  రిలాక్స్ కాకపోవడమే
ఓ ప్రక్క మనసుకు నిద్ర వస్తుంటే , మరోప్రక్క
శరీరంలో అలజడి -ప్రకంపనలు అధికంగా ఉంటాయి.

*గ్లూకోజ్*- పొటాషియం - ఇతర విటమిన్లు సరిగా
నరాలకు,కండరాలకు అందకపోవడం -
అరగని వస్తువులు తినడం ,
నరాలను రెచ్చ గొట్టే ఆహారాలు తినడం
టివీ లోబాగా ఇష్టం కలిగే ప్రోగ్రామ్స్ , యాంగ్జయిటీతో చూడటం కారణమవచ్చు
పై వ్యాధులుండే వారు ఇవన్నీ సాయంత్రం నుంచి వదిలేయండి.

ఒకోసారి నిద్ర మాత్ర కంటే సెలైన్ లేదా
అరటిపండు ఉడకబెట్టి త్రాగడం ఉపశమనం కలిగించవచ్చు....

**నిద్ర రావడం లేదా*
***********************
         మానసిక అశాంతి వలన నిద్ర రాదు . అధికంగా అలసి పోవడం , సరైన విధంగా ఆహారం తీసుకోక పోవడం , మలబద్ధకం , మానసిక అలసట, ఎక్కవగా చింతించడం , అనారోగ్యం మొదలగు కారణాల వలన కూడా రాత్రి సరిగ్గా నిద్రరాదు . అధిక ధూమ పానం , అధిక మధ్య పానం సేవించడం వలన నిద్ర రాదు . కొద్ది పాటి శబ్దానికే నిద్రలో మెలకవ వస్తుంది . కావున శరీరం త్వరగా అలసి పోవడం , బద్ధకంగా వుంటుంది .

*గృహ చికిత్సలు : -----*

1. *రాత్రి పడుకునే ముందు : --           వేడి నీళ్ళతో కాళ్ళు , చేతులను శుభ్రంగా కడగ వలెను . పాదాలకు ఆవాల నూనె ( Mustard oil ) తో మాలిష్ ( మర్ధన ) చేయ వలెను . సుఖమైన నిద్రను పొందండి .

2 .ఆవాల నూనె లో  + *పచ్చ కర్పూరంను*  కలిపి తలకు మర్ధన చేయాలి .

3 . 2  Table Spoon ల *తేనె* + 1 Spoon *ఉల్లి పాయ ( onion ) రసం*  కలిపి తీసుకొన వలెను .

4 .బొప్పాయి కూర* లేక *బొప్పాయి పండ్ల* ను తినండి .

5 . *ఉసరి కాయ రసం + *జాజికాయ చూర్ణం* 
కలిపి తీసుకొన వలెను .

6 . కొద్ది నీళ్ళలో *జాజికాయ* ను రుద్ది ( బండ పైన నూరండి ) ఆ  రసంను  కను రెప్పల పైన పూయండి . *మంచి నిద్ర వస్తుంది* .

7 . *తేనె* + *జాజికాయ చూర్ణం*  లను కలిపి తీసుకొండి .
( అలసట , Irritation తగ్గి పోవును ) .

8 . రాత్రి పడుకునే ముందు *తాజా గోరింటాకుల* పేష్ట్ ను పాదాలకు పట్టించండి .

9 . *పెరుగు ( లేక ) మజ్జిగ
* నల్ల ఉప్పు* + *సోంపు*+ *మిరియాల పొడి* + *పటిక బెల్లం* కలిపి త్రాగండి .

10 . రాత్రి భోజనం త్వరగా చేయండి . తక్కువగా తినండి . ఉదయం శారీరక శ్రమ చేయ వలెను .

11 . రాత్రి భోజనం తర్వాత కొద్ది సేపు నడవ వలెను .

    పై విధానాలలో ఏదో ఒక పద్దతిని ఆచరించి  , సుఖంగా నిద్ర పోండి .మి
ధన్యవాదములు
నవీన్ నడిమింటి
+919703706660
For infremeshon for heath below link see
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

ఆత్మ హత్య ఆలోచన వచ్చిన వారికి నా సలహాలు

ఈ రోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం. ఈ మెసేజ్ అన్ని గ్రూపుల్లో పెట్టండి.

ఆత్మహత్య నివారణకు పఠించాల్సిన మంత్రం
*" ఓం ఆతపినే నమః"*
"Om Aatapi ne namaha"

*ఆత్మహత్య అంటే! ఆపగలిగిన మరణం!!*

నేడు ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం (సెప్టెంబరు 10)

*రోజు న్యూస్ పేపర్ చదువునము  నానాటికీ పెరుగుతున్న ఆత్మ హత్యలు &ఆత్మ హత్య చేసు కోవటానికి గల కారణాలుz ఏమిటీ అవగాహనా కోశం మీ నవీన్ నడిమింటి సలహాలు*

ఇపుడు  హైదరాబాద్ &విశాఖపట్నం బిజీ జీవితం లో ఆఫీస్ మరియు హోమ్ ప్రాబ్లమ్ మనసులో ఆలోచన లు సరిగా ఉండకుండా 
బ్రెయిన్ లో జరిగే రసాయనిక చర్యలు   dopamine  రిలీజ్ లో ఎక్కువ తక్కువ జరిగినా లేదా ఇతర వ్యాధులు సెంట్రల్ నెర్వస్ సిస్టం కి సోకినా  లేదా కొన్ని డ్రగ్స్  సైడ్ ఎఫెక్ట్స్ వలన,  ఇక కొన్ని వ్యాధులకు మందులు లేవు చావే మందు  అని భావించి నప్పుడు  ఆత్మ హత్య చేసుకుంటారు

బాగా చదువుకున్న వారి లో నే ఈ ఆత్మ హత్యలు ఎక్కువ అయి పోతున్నాయి . దానికి కారణం విపరీతము అయిన స్ట్రెస్ , మానసిక కుటుంబ , ఆర్థిక సమస్యలు
ఈ ఆత్మ హత్య చేసుకునే వారి ఆలో చనలను ముందుగానే కుటుంబ సభ్యులు గానీ మిత్రులు కానీ పసి గట్టి నట్లయితే
ఎన్నో ఆత్మ హత్యలను నివారించ వచ్చు ను
ఉద్యోగం లో ఎదురు అయ్యే సమస్యలని ఎదుర్కోలేక స్ట్రెస్ కి గురి అయ్యి ,
అదీ కాకుండా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో ఉద్యోగం అనే టెన్షను వలన,
టీం లీడర్స్ సతాయింపు లు , (Bullying )
ఆఫీసు లో బయట , లైంగిక అఘాయిత్యాలు(sexual assaults ) ఇవన్నీ ఆత్మ హత్యల ని చేసుకోవటానికి కారణం అవుతున్నాయి
వీరు ఆత్మ హత్య చేసుకునే ముందు ఎవరితో మాట్లాడ కుండా , ఒంటరిగా ఉండాలని అను కుంటారు . పరధ్యానంగా ఉంటారు . ఇతరులేవరినా ఏదయినా జోక్ వేస్తె వీరికి కోపం వస్తుంది . ఆందోళన ఎక్కువ అవుతుంది .
ఆఫీసు లో , ఇంట్లో ఇచ్చిన పని సక్రమంగా చెయ్యలేరు . దాని ఫలితం గా ఇంకా మనసు డిప్రెషన్ లో కి పోతుంది
పూర్వం అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి . ఏదయినా ప్రాబ్లం వస్తే సాల్వ్ చె య్యనికి తాత , బామ్మ , తల్లి , తండ్రి ఉండేవారు . ఇప్పుడు రోజులు మారాయి .
ఏదయినా సమస్య వచ్చినప్పుడు ఎవరితో నూ చెప్పుకోలేక సతమత ము అవుతారు .
దాని ఫలితమే ఆత్మహత్య

2
ఒక కుక్క కరిస్తే మనము ఆత్మ హత్య చేసు కుంటామా ? లేదు గదా , డాక్టర్ దగ్గరకి వెళ్తాం , ఇదే విధంగా ఎవరయినా సెక్సువల్ assault  చేస్తే వాడి మీద క్రిమినల్ కేసు పెట్టాలి కానీ  కుమిలి పోగూడదు .  తప్పు చేసిన వాడు ఏడవాలి

ఆఫీస్ లో టీం లీడర్ ల బుల్లియింగ్ ను మిగిలిన కల్లీగ్ ల తో కలసి fight  చేసి ప్రాబ్లం  సాల్వ్ చేసుకోవాలి కానీ డీలా  పడగూడదు

డెప్ప్రెషన్ ఉన్న వారికి సూసైడ్ చేసుకోవాలని అని పిస్తుంది . అలానే కొన్ని మందులు వాడే వారికి  గూడా . అటువంటప్పుడు వారు  మంచి సైకియాట్రిస్ట్ ను  consult  చెయ్యాలి . సొల్యూషన్ దొరుకుతుంది ప్రాబ్లెమ్ కి

. పెళ్లి అయినాక  మొదటి సంవత్సరం బాగున్నా తరవాత   భార్యా భర్తల మధ్య గడబిడలు షురూ  అయితాయి .  వాటిని పెద్దవి గా కాకుండా చూసు కోవాలి . లేక పొతే బతుకు బస్టాండ్ అవుతుంది .  సున్నితమైన మనసు కలవాళ్ళు  ఆత్మ హత్య చేసుకుంటారు . బతికిన వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతుంటారు

ఇవన్నీ అనవసరం              కదా ?  వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇంక  compromise  కానప్పుడు డివోర్స్ కి అప్లై చెయ్యాలి  అంతే కానీ సూసైడ్ చేసు కో నవసరం లేదుఆత్మ హత్య చేసుకునే వారి లో సెలెబ్రేటిస్ గూడా ఉంటారు . యెంత మంది సినీ తారలు తారడు  లు పట్టుకోలేదు తాడు ను ?  కాక పొతే సూసైడ్ చేసుకునే వారి ని  మంచి సైకాలజిస్ట్ కానీ క్లినికల్ సైకాలజిస్ట్ కానీ యిట్టె  పసిగడతారు . అయితే వారికి ఫీజు ఇవ్వాలి .
  తాము ఆఫీస్ లో నేరం చేసినా తమకి శిక్ష పడుతుంది అన్న భయాలు  ఉన్నా, ఆత్మ హత్య ప్రయత్నం చేస్తారు .  వారి కి ట్రీట్మెంట్ డాక్టర్ లు కాదు ఇవ్వాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ .
ప్రేమ లో వైఫల్యం ఈ మధ్య జాస్తి అయింది  చని పోనికి .  ధైర్యం తెచ్చు  కోవాలి  వీడు / ఇది కాక పొతే ఇంకోరు  దేశం లో కొల్లలు  ఉన్నారు అని సాగి పోవాలి . ఉద్యోగం వచ్ఛేదాకా బాగా చదువు కోవాలి
       నిజానికి మనం నడిచెల్లిన దారి చివర ఒక దిపాన్ని వెలిగించి కాలి దోవలకు వెలుగునివ్వాలి
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
9703706660
మా లింక్ 👇👇👇
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

మైగ్రేన్, తలనొప్పి ఏమిటి అది ఎలా ఎందుకు వస్తుంది అవగాహన కోసం ౹౹ వైద్య నిలయం ౹౹ నవీన్ నడిమింటి ౹౹ Ram Karri

మైగ్రేన్, తలనొప్పి: లక్షణాలు, చికిత్సా విధానం&తలనొప్పి అంటే ఏమిటి? అది ఎలా ,ఎందుకు వస్తుంది?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు పరిష్కారం మార్గం



తల భాగంలో కలిగే బాధనే తలనొప్పి అంటారు.తల చుట్టూ వుండే కండరాలూ, రక్తనాళాలూ, నరాలూ, కపాలంలో వుండే ఎముకల పై పొరా ,బ్రెయిన్ ని చుట్టుకుని వుండే "మెనింజెస్ "అనే పొరలూ,ఇవన్నీ నొప్పిని తెలియజేసే రిసెప్టార్స్ ని కలిగి వుంటాయి.
మరీ ముఖ్యంగా మెదడు అడుగు భాగం ఈ నొప్పికి తీవ్రంగా స్పందిస్తుంది. విచిత్రంగా మెదడులో పెయిన్ రిసెప్టార్స్ లేని కారణం వల్ల,మెదడుకి దెబ్బతగిలినా,కోసినా కూడా నొప్పి తెలియదు.
వాపు కారణం గానో ,కణుతుల కారణంగానో అది వ్యాకోచించి ఒత్తిడి పెరిగినపుడు మాత్రమే నొప్పి తెలుస్తుంది.
తల నొప్పి ఎలా వస్తుందంటే, యేదయినా దెబ్బ తగిలినపుడు పెయిన్ రిసెప్టార్స్ స్పందించి,అక్కడున్న నాడీ కణాలలో తీవ్రమయిన స్పందనలని కలగ జేస్తాయి, తద్వారా పెప్టయిడ్స్, సిరటోనిన్ అనే పదార్థాలు అనే పదార్థాలు విడుదలవుతాయి. ఇవి మెదడు పొరలలోనూ,రక్తనాళాలలోనూ,వాపుని కలగ జేస్తాయి. రక్తనాళాలు వ్యాకోచిస్తాయి కూడా .ఈ కార్యక్రమమంతా నొప్పిని మెదడుకు తెలియ జేస్తుంది. కొన్ని రకాల మందులు ఈ సిరటోనిన్ ని బ్లాక్ చేయడం ద్వారా తలనొప్పిని తగ్గిస్తాయి.

తలనెప్పులూ రకాలు

IHS ఇంటర్నేషనల్ హెడ్ ఏక్ సొసైటీ వారు తలనెప్పులని ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు.

ప్రయిమరీ హెడేక్స్

సెకండరీ హెడేక్స్

ప్రయిమరీ హెడేక్స్ తల చుట్టూ వుండే కండరాలలోనూ, రక్తనాళాలలోనూ, నరాలలోనూ యేదైనా వత్తిడి కలిగినపుడూ లేదా యేదైనా దెబ్బ తగిలినప్పుడూ వచ్చే తలనెప్పులు.
ఇవి 20-40 సంవత్సరాల వయసులో వస్తూ వుంటాయి.
తలనెప్పులలో తొంభై శాతం నెప్పులు ప్రయిమరీ హెడేక్సే.
ఇవి తరచూ వస్తూ పోతూ వుంటాయి. ప్రమాదంలేనివి. వీటికి యే ఇతర జబ్బులూ కారణం కాదు. ఇందాక చెప్పుకున్నట్టు మెదడులో జరిగే రసాయనిక చర్య వీటికి కారణమని భావిస్తున్నారు.

కారణాలు

అలసట, శారీరకంగా గానీ ,మానసికంగా గానీ కలిగే ఒత్తిడి

నిద్రలేమి

అతినిద్ర

ఎక్కువగా ఏడవటం ,వేదన చెందడం

డీహైడ్రేషన్

మలబధ్ధకం

కంప్యూటర్ల ముందూ,ఆఫీసులోనూ,పని చేసే చోట ఒకె పొజిషన్లో ఎక్కువ సేపు కూచోవడం వలన కండరాలు పట్టేయడం.

ఇవి సర్వ సాధారణ మయిన కారణాలు.

మళ్లీ ప్రయిమరీ హెడేక్స్ ని మూడు రకాలుగా విభజించ వచ్చు అవి టెన్షన్ హెడేక్స్ , క్లస్టర్ హెడేక్స్ , మైగ్రేన్ లేక వాస్క్యులర్ హెడేక్స్.

✍టెన్షన్ హెడేక్: ఇది చాలా కామన్ గా వచ్చే తలనొప్పి. ప్రతి యేటా ప్రపంచ జనాభాలో 1.6 బిలియన్ల మంది దీని బారిన పడుతూ వుంటారు. ఇది ఆడవాళ్లలో ఎక్కువగా కనపడుతుంది.

✍శారీరక లేదా మానసిక ఒత్తిడి ముఖ్య కారణం.

లక్షణాలు: తలచుట్టూ బిగించినట్లుగా, టైట్ గా అనిపిస్తుంది.

సాధారణంగా మధ్యాహ్నం పూట వస్తుంది.

మెడ నుండీ,తలకు గానీ,తల నుండీ మెడకు గానీ వ్యాపిస్తుంది.

కొన్ని గంటలనుండీ కొన్ని రోజుల వరకూ వుండవచ్చు.
*క్లస్టర్ హెడేక్స్:* ఇవి మగ వారిలో ఎక్కువ కనపడతాయి. తలకు ఒక పక్కన వస్తుంది, ఒక కంటి చుట్టూ నొప్పిగా వుంటుంది, కన్ను ఎర్రబడటం, నీరు కారడం. ఒక్కొక్క సారి కన్ను మూతబడటం,బుగ్గ వాచడం కూడా జరగ వచ్చు.
ఈ తలనొప్పి రోజులో అప్పుడప్పుడూ వచ్చిపోతూ ఉంటుంది.
అలా కొన్ని వారాలూ, నెలలూ కనపడి మళ్లీ కొంతకాలం అసలు కనపడక పోవచ్చు, అందుకే వీటిని "క్లస్టర్ హెడేక్స్ "అంటారు.
ఇవి రావడానికి కారణం "హైపోథలామస్ "(బయలాజికల్ క్లాక్ )లో యేర్పడినఅసాధారణ పరిస్థితి అని భావిస్తున్నారు
ప్రతి యేటా ఒక మిలియన్ పైగా దీని వలన బాధ పడుతున్నారు.అందువలన విలువైన పనిగంటలు నష్టపోవలసి వస్తుంది.దీనికి చికిత్స "ట్రిప్టాన్ "గ్రూపు మందులు వాడటం
మైగ్రేన్ లేక వాస్క్యులర్ హెడేక్ : దీనినే పార్శ్వనేప్పి అంటారు. ఇది చాలా తీవ్రమయిన నొప్పి. తలకు ఒక పక్కనే వస్తుంది. ఏటా 848 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యతో బాధ పడుతున్నారు.
నొప్పి లక్షణం: ధన్ ధన్ మని కొట్టుకుంటున్నట్టూ,సుత్తులతో మోదుతున్నట్టూ వుంటుంది ,దీనినే "థ్రాబింగ్ లేక పల్సటైల్ హెడేక్ "అంటారు.ఇది ఆడవారిలో ఎక్కువగా కనపడుతుంది.
తలనొప్పితో పాటు వికారం ,వాంతులూ వుంటాయి,కాంతినీ ,శబ్దాలనీ తట్టుకోలేక పోవడం,చీకటినీ,నిశ్శబ్దాన్నీ కోరుకోవడం దీని లక్షణాలు.
కొన్ని గంటల నుంచి కొన్నిరోజులపాటు వేధిస్తుంది. పని గంటలు నష్టపోవడానికి కూడా కారణమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనారోగ్యంతో పనిమానెయ్యడానికి ఆరవ ప్రధాన కారణంగా మైగ్రేన్ నిలుస్తోందని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి.
కారణం: జెనెటిక్ కారణాలతో పాటు , పరిసరాలూ వాతావరణ పరిస్థితులూ కూడా ప్రభావం చూపుతాయంటున్నారు.
కొంతకాలం క్రితం మెదడులోని రక్త నాళాలలో కలిగే మార్పులు కారణం అనుకునే వారు,ఇప్పుడు నరాల పనితీరు సక్రమంగా లేకపోవడం మైగ్రేన్ కి కారణమని భావిస్తున్నారు,అలా వాస్క్యులర్ థీరీ వెనక్కు వెళ్లిపోయింది.

👉🏿మైగ్రేన్ తలనొప్పి కి ముందు గా హెచ్చరించే సూచనలు

కళ్ల ముందు జిగ్ జాగ్ లైన్లు కనపడటం

కళ్లు చీకట్లు కమ్మడం

కళ్ల ముందు వెలుతురు

కళ్లలో నీళ్లు రావడం

కళ్లెర్ర బడటం

చెవులలో శబ్దాలు

మాట్లాడలేకపోవడం

శరీరం ఒక పక్క సూదులు గుచ్చినట్టు వుండటం

ఇన్వాలెంటరీ జెర్కీ మూవ్‌మెంట్స్
ఈ లక్షణాలు మైగ్రేన్ తలనొప్పి రాబోతోందని సూచిస్తాయి వీటినే "ఆరా "అంటారు.

ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్

కొన్ని రకాల ఘాటైన వాసనలూ

కొన్ని రకాల ఆహార పదార్థాలూ

నిద్రలేమి

మలబధ్ధకం

ఒత్తిడి

ప్రీ మెన్సట్రువల్ టెన్షన్

ఆల్కహాల్ ముఖ్యంగా రెడ్ వైన్

స్మోకింగ్

ఇవన్నీ మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపిస్తాయి వీటినే ట్రిగ్గర్ ఫాక్టర్స్ అంటారు.

మైగ్రేన్ వచ్చి తగ్గిన వెంటనే కూడా మందకొడిగానో,అత్యుత్సాహంగానో ,డిప్రెషన్ గానో కనిపించవచ్చు, నీరసం, నిస్త్రాణ, మూడీగా వుండటం కూడా జరగవచ్చు.

*👉🏿మైగ్రేన్ ని మళ్లీ మూడు రకాలు గా కూడా విభజిస్తారు*

*క్లాసికల్ మైగ్రేన్ :* ఆరా "లక్షణాలుంటాయి , తలనెప్పీ, వాంతులుంటాయి
*కామన్ మైగ్రేన్ :* "ఆరా "వుండదు ,తలనెప్పీ , వాంతులుంటాయి
*కాంప్లికేటెడ్ మైగ్రేన్ :* నరాలలో చచ్చు వచ్చినట్టుంటుంది (న్యూరలాజికల్ డెఫిసిట్ )
ప్రివెన్షన్ లేక మైగ్రేన్ రాకుండా నిరోధించడం ఒకనెలలో నాలుగు అటాక్స్ కంటే ఎక్కువ వస్తే ,మైగ్రేన్ రాకుండా నిరోధించేందుకు మందులు వాడతారు
*సెకండరీ హెడేక్స్:* ఇవి శరీరంలోని కొన్ని వ్యాధుల ప్రభావం వలన కలిగే తలనెప్పులు.
జ్వరాలు, వైరల్ ,బాక్టీరియల్ ,టి.బీ,లేదా చీము గడ్డల వలన వచ్చే జ్వరాలు
తలకు, బలమైన దెబ్బ తగిలి నప్పుడు----బ్రెయిన్లో రక్తం గూడు కట్టినా,కపాలం ఎముక చిట్లినా, రక్తస్రావమయినా, కంకషన్ ఇంజురీ (అంటే అదురు దెబ్బ)అయినా
పళ్లకి సంబంధించిన వాపులూ,దెబ్బలలోనూ
కళ్లు: దృష్టి దోషాలూ,ట్యూమర్లూ,అక్యూట్ కంజెస్టివ్ గ్లాకోమా
చెవి సమస్యలలో: వాపులూ, చీముగడ్డలూ
ముక్కు సమస్యలలో: ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది "సైనసైటిస్ "లో వచ్చే "సైనస్ హెడేక్ " నుదురు దగ్గర,ముక్కు మొదట,బుగ్గల ఎముకల దగ్గర నొప్పి అనిపిస్తుంది,ముందుకు వంగినా దగ్గినా తుమ్మినా ఎక్కువ అవుతుంది.
జీర్ణాశయ సమస్యలు, వాంతులు,విరోచనాలు,
బి.పి ఎక్కువయినప్పుడు
బ్రెయిన్ ట్యూమర్ ,ఇతర కాన్సర్లలో తలనెప్పే ప్రధాన లక్షణం
స్ట్రోక్ లో బ్రెయిన్ స్ట్రోక్ లో తలనొప్పి ఎక్కువగా వుంటుంది
గర్భిణీ లో తలనెప్పీ, బి.పి పెరగడం గుర్రపు వాతానికి దారి తీస్తాయి.
చిన్న పిల్లలలో అంటే 10-20మధ్య వయసు వారిలో మెదడులో చేరిన పురుగుల గుడ్లు తలనొప్పికీ,ఫిట్స్‌కీ కారణమవు తాయి
మెనింజైటిస్,ఎన్ సెఫలైటిస్ వీటిలో తీవ్రమైన తలనొప్పి వుంటుంది.
*👉🏿కొన్ని విచిత్రమైన తలనెప్పులు*
*ప్రయిమరీ కాఫ్ హెడేక్:* తీవ్రమైన దగ్గుతెర వచ్చాక కానీ, తుమ్ములు వచ్చాక కానీ వచ్చే తీవ్రమైన తలనొప్పి
*ప్రయిమరీ ఎక్జర్షనల్ హెడేక్:* వ్యాయామం తర్వాత వచ్చే తలనొప్పి
*ఐస్క్రీమ్ హెడేక్‌:* చాలా చల్లగా వున్న ఆహార పదార్థాలని త్వరగా తినడం వలన వచ్చే తలనొప్పి.
*రిబౌండ్ హెడేక్‌:* తలనొప్పి మందులు ఎక్కువగా వాడి హఠాత్తుగా ఆపేయడం వలన కలిగే తలనొప్పి
*👉🏿ప్రయిమరీ సెక్స్ హెడేక్:* సంయోగం తర్వాతా, సుఖప్రాప్తి సమయంలోనూ వచ్చే తలనొప్పి .అప్పుడప్పుడూ దీనికి సబ్ అరఖ్నాయిడ్ హెమరేజ్ కారణమవుతూ వుంటుంది. అందుకే అశ్రధ్ధ చేయగూడదు.

అయితే తల నెప్పులు సాధారణ కారణాల వలన ,వస్తున్నాయా? లేక అసాధారణమైన ,ప్రమాదకరమైన జబ్బుల వలన వస్తున్నాయా తెలుసుకుని ,జాగ్రత్తగా తగిన పరీక్షలు చేసి వ్యాధిమూలాలను అన్వేషించి తగిన చికిత్స ఇవ్వడం వలన ప్రాణప్రమాదాలను తప్పించవచ్చు.
తలనొప్పి తో బాటు ఈ కింది లక్షణాలు కనపడితే తప్పనిసరిగా,ఆ తలనొప్పి కారణాన్ని శోధించాలి

జ్వరం వుండడం

బరువు తగ్గడం

నలభై యేళ్ల వయసు తర్వాత తలనొప్పి రావడం

కాన్సర్ ,హెచ్ .ఐ.వి లాంటి వ్యాధులు వుండడం

హఠాత్తుగా తలనొప్పి తీవ్రమవడం

తలకి దెబ్బ తగిలాక తలనొప్పి రావడం

స్పృహ కోల్పోవడం&ఫిట్స్ రావడం&కాళ్లూ చేతులూ చచ్చుబడటం
*👉🏿వ్యాధి నిర్థారణ*
       తలనొప్పి అనేది నిజం చెప్పాలంటే జబ్బు కాదు .అనేక జబ్బులలో కనపడే ఒక లక్షణం. రోగితో మాట్లాడి ,వ్యాధి లక్షణాలు సమగ్రంగా తెలుసు కోవడం వలన చాలావరకూ వ్యాధి నిర్థారణ జరిగిపోతుంది అంటే అది ప్రయిమరీ హెడేకా?,సెకండరీ హెడేకా? అనేది అవగాహనవుతుంది.
ప్రయిమరీ హెడేక్ కి కారణమైన శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించుకోమని సలహా ఇవ్వడంతో పాటు ,పెయిన్ కిల్లర్స్ అదీ ప్రమాదం కలిగించని పారసిటమాల్ ,అసిటమైనోఫెన్ లాంటి మాత్రలు డాక్టర్ సలహాపై వాడొచ్చు
సెకండరీ హెడేక్‌లో
బి.పి చెక్ చేయడం
రక్త పరీక్షలునిర్వహించడం
న్యూరలాజికల్ పరీక్షలు నిర్వహించడం
ఎక్స్ రే పరీక్షలు
సి.టి స్కాన్
యం.ఆర్ .ఐ
సి.టి. యాంజియో గ్రామ్
ఇవన్నీవ్యాధి నిర్థారణకీ ,తలనొప్పికి మూలకారణాన్ని అన్వేషించడానికీ తోడ్పడతాయి. ఒకసారి తలనొప్పికి మూలకారణం తెలిశాక,చికిత్స సులువవుతుంది.
👉🏿చికిత్స*
       ప్రయిమరీ హెడేక్స్ ని తగ్గాలంటే పాటించాలిసిన విషయాలు
ఒత్తిడిని తగ్గించుకోవడం
రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించడం
క్రమం తప్పని వ్యాయామం. దీనివలన కండరాలు రిలాక్సవుతాయి.
వేళ తప్పని సమతుల మితాహారం
మైగ్రేన్ వున్న వాళ్లు, కొన్ని పదార్థాలు తీసుకోకూడదు. ఛీజ్ ,నట్స్ ,ఆల్కహాల్ ,స్మోకింగ్ వీటికి దూరంగా వుండాలి, తమకు పడని వాసనలకి కూడా దూరంగా వుండటం మంచిది.
రోజుకి కనీసం యెనిమిది గంటలు చక్కని ప్రశాంతమైన నిద్ర పోతే చాలా వ్యాధులు దూరంగా వుంటాయి.
గోరు వెచ్చని నీటితో స్నానం,యోగా,మెడిటేషన్ లాంటివి మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తాయి.
ఇలా జీవన శైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు అవసరమైతే డాక్టర్ సలహాతో ప్రమాదంలేని పెయిన్ కిల్లర్స్ ని యెంచుకుని వాడాలి.
చిన్నపిల్లలలో యాస్పిరిన్ వాడకూడదు.
మైగ్రేన్ తలనెప్పులుండే వాళ్లు ప్రశాంతంగా చీకటి గదిలో చల్లని వాతావరణంలో సేదదీరడంతో పాటు, సుమా ట్రిప్టాన్ ,ఆమ్లో ట్రిప్టాన్ , తోపాటు ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ ని చికిత్సకోసమూ,తరచూ ఎటాక్స్ రాకుండా ప్రొఫైలాక్టిక్ గానూ కూడా వాడవచ్చు.
ఇంకా ఇతర లక్షణాలను బట్టి మందులు వాడుకోవాలి అంటే వాంతులవుతుంటే వాంతుల మందులు వాడటం అలా..
మెనింజైటిస్ ,బ్రెయిన్ ట్యూమర్ ఇంకా ఇతర జబ్బులవలన వచ్చే తలనెప్పులకి ,ఆయా వ్యాధులకి తగిన చికిత్స చేయడం ద్వారా తలనొప్పిని నివారించవచ్చు.
ఇంకా ఇతర లక్షణాలను బట్టి మందులు వాడుకోవాలి అంటే వాంతులవుతుంటే వాంతుల మందులు వాడటం అలా .మెనింజైటిస్ ,బ్రెయిన్ ట్యూమర్ ఇంకా ఇతర జబ్బులవలన వచ్చే తలనెప్పులకి ,ఆయా వ్యాధులకి తగిన చికిత్స చేయడం ద్వారా తలనొప్పిని నివారించవచ్చు.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

 
సభ్యులకు విజ్ఞప్తి
*************

 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

8, మార్చి 2017, బుధవారం

5. తినకపోవడం రుగ్మతే.

Anorexia Nervosa(అనొరె క్సియా నెర్వోసా), తినకపోవడం రుగ్మతే.

Advise:
మనందరమూ జీవించడానికి ఆహారం తీసుకుంటాం. మనం తినే ఆహారాన్ని ఎంతో ఆనందంగా భుజిస్తాం. అయితే మనుష్యుల ప్రవర్తనలలో కనిపించే వైవిధ్యాలలాగా వారి ఆహార విషయాల్లోనూ వైవిధ్యాలు ఉండవచ్చు. కొంతమంది ఎక్కువగా భుజించవచ్చు. మరికొందరు తక్కువగా తినవచ్చు. కొంతమందిత్వరగా స్థూలకాయులు కావచ్చు. ఇంకొంతమందిలో ఎంత తిన్నా స్థూలకాయం వారి దరిదాపులకు రాకపోవచ్చు. అయితే, కొంతమంది సన్నగా ఉండాలనే భావనతో శరీరా వసరాలకు కూడా సరిపోని స్థాయిలో అతి తక్కువ ఆహా రాన్ని తీసుకుంటారు. ఇటువంటి వారి విషయంలో వైద్య సహాయం అవసరం కావచ్చు. ఎందుకంటే వీరు అనొరె క్సియా నెర్వోసా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న వారై ఉండవచ్చు. ఈ పరిస్థితి మహిళలలో సాధారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో ఇది మరింత ఎక్కువ. 

లక్షణాలు:
- స్థూలకాయం వస్తుందనే భయం
- అతి తక్కువగా తినడం
- తీవ్రస్థాయిలో బరువు కోల్పోవడం
- స్థాయిని మించి వ్యాయామం చేయడం
- మహిళల్లో రుతుక్రమంలో లోపాలు

అనొరెక్సియా నెర్వోసా అనే పరిస్థితి యవ్వనంలోకి అడుగుపెట్టిన కొన్నాళ్లకు కనిపిస్తుంది. ఇదిసాధారణంగా ఉన్నతాదాయ వర్గాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాల అమ్మాయిల్లో డైటింగ్‌ అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. కొంతమంది అమ్మాయిలు త్వరితగతిన బరువు కోల్పోవాలనే ఉద్దేశ్యంతో ఆహారాన్ని తీసుకోవడం మానేస్తారు. ఇదే వారి ప్రధాన కార్యక్రమంగా మారుతుంది. తమ వయస్సు, ఎత్తులతో పోల్చినప్పుడు ఉండాల్సిన స్థాయికంటే తక్కువ బరువు ఉన్నప్పటికీ, కొంతమంది అమ్మాయిలు డైటింగ్‌చేయడం, తీవ్రస్థాయిలో వ్యాయామం చేయడం చేస్తుంటారు. లేదా డైటింగ్‌తోపాటు బరువు తగ్గడానికి ఏవైనా మందులు వేసుకుంటూ ఉంటారు. వీరిలో ఆహారం పట్ల స్థిరమైన అవాంఛిత ఆలోచనలు (అబ్సెషన్స్‌) ఉంటాయి. ఇటువంటి వారు ఆహారం తీసుకున్న తరువాత బరువు పెరగకూడదనే ఆలోచనతో తిన్న ఆహారాన్ని వాంతి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. 

అనొరెక్సియా వలన దుష్ఫలితాలు:
- ఆహారం తీసుకోకపోవడం వలన కుద్బాధకు గురవుతారు. ఫలితంగా అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయి.
- వ్యాకులతకు గురవుతారు. ఏకాగ్రత దెబ్బ తింటుంది. నిద్ర సరిగ్గా పట్టదు.
- శరీరంలో పెళుసైన ఎముకలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక బలహీనతకు లోనవుతారు.
- వాంతుల కారణంగా మూర్ఛ వ్యాధికి గురి కావచ్చు. మూత్రపిండాలు దెబ్బ తినవచ్చు. గుండె కొట్టుకోవడంలో లోపాలు సంభవించవచ్చు.
- హార్మోన్లలో అసమతుల్యతలు సంభవించి రుతుక్రమంలో మార్పులు వస్తాయి. రుతుక్రమం పూర్తిగా ఆగిపోయే అవకాశాలున్నాయి.

అనొరెక్సియాకు కారణమేమిటి?
కొంతమంది అమ్మాయిలు ఇలా అనొరెక్సియా నెర్వోసాకు గురికావడానికి కారణమేమిటి? అని పరిశీలిద్దాం.
వీరిపై సామాజికపరమైన వత్తిడి ప్రధాన కారణం. సన్నగా ఉంటే అందంగా ఉంటారనే భావన ఒక కారణమైతే, మీడియాలో వస్తున్న ఫ్యాషన్‌ షోలు వీరిపై ప్రభావం చూపడటం మరొక కారణం. అలాగే 'బరువు తగ్గండి అనే ఆకర్షణీయమైన ప్రకటనలతో వెలుస్తున్న 'క్లినిక్‌లు కూడా అమ్మాయిఉల అనొరెక్సియా నెర్వోసాకు గురవడానికి ఇంకొక కారణం.

సన్నగా ఉన్నవారికి సమాజంలో లభించే ప్రత్యేక గుర్తింపు కూడా అమ్మాయిలలో బరువు తగ్గాలనే ఆలోచన కలుగజేసి డైటింగ్‌ చేయడానికి తద్వారా అనొరెక్సియాకు గురి కావడానికి దోహదం చేస్తున్నది.

* నియంత్రణ : డైటింగ్‌ చేయడంవలన ఏదో సాధించామనే భావన కలుగుతుంది. డైటింగ్‌, బరువు తగ్గడాలు రెండూ శరీరం నియంత్రణలోనే ఉందనే భావనను కలిగిస్తాయి.

* కుటుంబం: తల్లిదండ్రులు పిల్లలడైటింగ్‌ను ఆమోదించడమో, లేదాపిల్లలు భోజనం వద్దనడమో అనేక కుటుంబాల్లో చూస్తూనే ఉంటాం. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులపై కోపాన్ని భోజనం మానివేయడం ద్వారా ప్రదర్శిస్తారు.

* వ్యాకులత: ఏ కారణంగా కలిగే వ్యాకులత అయినా ఆహారంపట్ల అభిరుచిని తగ్గించవచ్చు. అయితే వ్యాకులత కలగడానికిగల కారణాన్ని కనుగొని చికిత్స చేస్తే వారిలో ఆహారం పట్ల ఉన్న నిరాసక్తత తొలగిపోతుంది. 

ఎలాంటి సహాయం అందించాలి?
ఈ సమస్య తక్కువ స్థాయిలో ఉన్న వారికి ప్రత్యేకమైన చికిత్స అవసరమవుతుంది. అమ్మాయిలు కొంత బరువు తగ్గిన తరువాత సరైన పద్ధతిలో సలహాలివ్వడం ద్వారా వారిలో ఉండే అబ్సెషన్‌ను తొలగించవచ్చు. వయస్సు, ఎత్తులకు తగిన బరువు ఉన్న ప్పటికీ అమ్మాయిల్లో బరువు తగ్గాలనే ఆలోచన ఇంకా స్థిరంగా ఉండి, డైటింగ్‌, వ్యాయామాలు మొదలైనవి చేస్తుంటే తప్పని సరిగా వారికి వైద్య సహాయం అవసరమవుతుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే నొరెక్సియా కారణంగా ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అనొరెక్సియాను తొలిదశలోనే గుర్తిస్తే పిల్లలను తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడం అంత కష్టమేమీ కాదు.

అనొరెక్సియా సమస్యతో బాధపడే వారికి చికిత్సలో మొదటి మెట్టు వారు తమ వయస్సు, ఎత్తుకు సరిపోయే బరువు ఉండేలా చూడటం. పిల్లలు కూడా ఇతర కుటుంబ సభ్యులతోపాటు తమ శరీరావసరాలకు సరిపోయిన స్థాయిలో ఆహారాన్ని తీసుకునేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత. అనొరెక్సియా నెర్వోసాతో బాధపడుతున్న రోగికి మానసిక వైద్య నిపుణులతో చికిత్స చేయించడం అవసరం. రోగి సమస్యను మానసిక వైద్య నిపుణుడు సమగ్రంగా తెలు సుకుని, తగిన కారణాలను కనుగొంటారు. అలాగే రోగిలో అంతర్లీనంగా వ్యాకులత ఉందేమో పరిశీలిస్తారు. తదనుగుణంగా చికిత్స చేయడానికి అవకాశముంటుంది. 

2. అధిక బరువు వాస్తవాలు అలవాట్లు ,అధిక బరువు, ఊబకాయం, ఒబెసిటి, స్థూలకాయం.

Over weight and Diet habits,
అధిక బరువు వాస్తవాలు అలవాట్లు ,అధిక బరువు, ఊబకాయం, ఒబెసిటి, స్థూలకాయం.

Advise:

బరువు తగ్గితే ఆరోగ్యం:
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అధిక బరువు, స్థూలకాయంతో సతమతమవుతున్నారు. సుమారు 120 కోట్ల మంది అధిక బరువుతో.. 30 కోట్ల మంది వూబకాయంతో బాధపడుతున్నారని అంచనా. వీరిలో 13 శాతం మంది, పిల్లలు యువకులే కావటం విశేషం. గత పదేళ్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలో పట్టణాల్లో ఉన్నత, మధ్య తరగతి మహిళల్లో 30-50 శాతం మంది.. పురుషుల్లో 32 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని ఇటీవల జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అధిక బరువు, స్థూలకాయం వివిధ జబ్బులకు దారితీస్తుండటంతో వీటిని తగ్గించుకోవాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నివారించదగిన 10 ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం కూడా ఒకటి. ముఖ్యంగా స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతుండటానికి టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడుపుతుండటం.. పిల్లలకు ఆటస్థలాలు కనుమరుగు అవుతుండటం.. వ్యాయామం చేయకపోవటం.. శారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలు.. ఆహారంపై అవగాహన లేకుండా చిరుతిళ్లకు అలవాటు పడటం వంటి జీవనశైలి దోహదం చేస్తోంది. 

మన సమాజంలో కేలరీలు అధికంగా ఉండే పిండి పదార్థాలు, వేపుళ్లు, నూనె, నెయ్యి, కొవ్వు పదార్థాల వాడకం ఒకప్పటికన్నా నేడు బాగా పెరిగిపోయింది. ఇలా ఎక్కువెక్కువగా తింటూ అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయకపోవటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరగటానికి దారి తీస్తోంది. దీనికి దురలవాట్లు కూడా తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుంది. 

వ్యాధుల దాడి:
స్థూలకాయం కారణంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, సంతాన సమస్యలు, క్యాన్సర్‌, వూపిరితిత్తుల జబ్బులు, పిత్తాశయంలో, కిడ్నీల్లో రాళ్లు, అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యల వంటివన్నీ చుట్టుముడుతున్నాయి. భారీ కాయాన్ని మోయాల్సి రావటంతో మోకాలి కీళ్లు అరిగే ప్రమాదమూ ఉంది. కాలేయం దెబ్బతింటుంది. ఇన్స్‌లిన్‌ రెసిస్టెన్స్‌ పెరుగుతుంది. దీంతో మధుమేహ నియంత్రణ కష్టమవుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) పెరిగి, మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) తగ్గుతుంది. ఇవి పక్షవాతానికి, గుండెజబ్బులకు దారితీస్తాయి. మనం కిలో బరువు పెరిగితే రోజుకి అదనంగా 30 కిలోమీటర్ల దూరం వరకు రక్తాన్ని నెట్టాల్సిన భారం గుండెపై పడుతుంది. దీంతో గుండె ఎక్కువ బలంతో పని చేస్తూ గుండె వైఫల్యానికి దారి తీస్తుంది. 

బరువెందుకు పెరుగుతారు?
* ఏ వయసులోనైనా బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. చాలామంది మధ్యవయసులోనే ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. కొందరు చిన్నతనంతోనే అధిక బరువుతో ఉండొచ్చు. 
* కొందరు వంశపారంపర్యంగా అధిక బరువు సమస్య బారిన పడొచ్చు. తల్లిదండ్రుల్లో ఇద్దరూ స్థూలకాయులైతే సుమారు 73 శాతం మంది పిల్లలకూ అది రావొచ్చు. ఎవరో ఒకరు స్థూలకాయులైతే పిల్లల్లో 45 శాతం మంది దీని బారినపడొచ్చు. 
* స్త్రీలల్లో కొన్ని గ్రంథుల స్రావాలు అధిక బరువును తెచ్చిపెట్టొచ్చు. రజస్వల అయినపుడు, గర్భం ధరించినపుడు, ముట్లుడిగిన తర్వాత మహిళలు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. స్టిరాయిడ్లు, గర్భ నిరోధకమాత్రలు, ఇన్స్‌లిన్‌ వంటివి తీసుకోవటమూ దీనికి దోహదం చేయొచ్చు. మానసిక అలసట, అశాంతి, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం, స్వీట్లు ఎక్కువగా తినటం, వంటివన్నీ బరువు పెరగటానికి కారణమవుతున్నాయి. 

మూడు రకాలు:
ఎత్తును బట్టి ఉండాల్సిన బరువును మూడు రకాలుగా విభజించారు.
1. సామాన్య బరువు
2. అధిక బరువు
3. వూబకాయం.
ఎత్తు బరువుల నిష్పత్తి (బాడీ మాస్‌ ఇండెక్స్‌-బీఎంఐ) ప్రకారం దీనిని గణించొచ్చు. బీఎంఐ 20-25 ఉంటే సాధారణ బరువుతో ఉన్నట్టు. 25-30 ఉంటే అధికబరువుగానూ 30-35 ఉంటే వూబకాయంగానూ పరిగణిస్తారు. 

వ్యాధిగ్రస్థ వూబకాయం:
బీఎంఐ 40కి పైగా ఉంటే వ్యాధిగ్రస్థ వూబకాయం (మార్బిడ్‌ ఒబేసిటీ)లోకి అడుగిడినట్టే. ఈ దశలో నడవటమే కష్టమవుతుంది. ఏమాత్రం వ్యాయామం చేయలేరు. కష్టపడి వ్యాయామం చేసేందుకు ప్రయత్నించినా, తిండి తగ్గించినా కూడా బరువు తగ్గటమన్నది మాత్రం దుర్లభంగా తయారవుతుంది. 

తగ్గే మార్గాలు:
* వ్యాయామం: సహజసిద్ధంగా బరువును తగ్గించుకోవటానికి వ్యాయామాన్ని మించింది లేదు. దీంతో శరీరాకృతిని కూడా తీర్చిదిద్దుకోవచ్చు. తలనొప్పి, నడుంనొప్పి, ఆందోళన వంటి సమస్యలూ తగ్గిపోతాయి. వయసు పైబడుతున్నా వ్యాయామాన్ని మానరాదు. వయసుకు తగ్గ వ్యాయామాలను ఎంచుకోవాలి. 

* ఆహారం: వ్యాయామం చేయటంతో పాటు జీవన విధానాన్ని మార్చుకోవటమూ అవసరమే. ఇందులో ఆహార నియమాలు, మితం పాటించటం ముఖ్యమైనవి. ముఖ్యంగా కొవ్వులు, నూనె పదార్థాలను తగ్గించి సమతులాహారం తీసుకోవటంపై దృష్టి పెట్టాలి. 

* ధూమానికి దూరం: అప్పుడుప్పుడు సిగరెట్లు, బీడీలు కాల్చితే అంతగా ముప్పు ఉండదని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. వీటిల్లోని నికోటిన్‌ గుండె, శ్వాసకోశం, ఇతర కండరాలకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఏమాత్రం పొగ తాగినా ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. పొగ తాగటం వల్ల రక్తంలో ఆక్సిజన్‌ మోతాదు పడిపోయి రకరకాల సమస్యలకు దారి తీస్తుంది. ఒకవేళ పొగ అలవాటుంటే వ్యాయామానికి అరగంట ముందూ తర్వాతా తాగకుండా ఉండటం మంచిది. 

* ఆరోగ్యకరమైన జీవనశైలిని చిన్నప్పట్నుంచి పాటిస్తుంటే స్థూలకాయం ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. 

బేరియాట్రిక్‌ సర్జరీ:
వూబకాయం ప్రమాదకర స్థాయికి (మార్బిడ్‌ ఒబేసిటీ) చేరినవారు బరువు తగ్గాలంటే ‘బేరియాట్రిక్‌ సర్జరీ’ సమర్థ మార్గం. ఆహారాన్ని తగ్గించి వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గనివారు, అధిక బరువు మూలంగా దైనందిన కార్యక్రమాలు చేయలేకపోతున్న వారికీ ఈ సర్జరీ మేలు చేస్తుంది. దీని ద్వారా తీసుకునే ఆహార పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. ఇది బరువు తగ్గటానికి దోహదం చేస్తుంది. బేరియాట్రిక్‌ సర్జరీలో వివిధ రకాలున్నాయి. సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణాశయం, పేగుల మొదటి భాగాల్లో జీర్ణమవుతుంది. అనంతరం చిన్నపేగుల గోడల ద్వారా పోషకాలు రక్తంలో కలుస్తాయి. మిగిలిన వ్యర్థాలు పెద్దపేగు ద్వారా బయటకు వెళ్తాయి. బేరియాట్రిక్‌ సర్జరీలో జీర్ణాశయంలో కొంతభాగాన్ని బాండ్‌తో బిగిస్తారు. దీనిని ‘గ్యాస్ట్రిక్‌ బ్యాండింగ్‌’ అంటారు. దీంతో జీర్ణాశయం సైజు తగ్గి ఆహారం తీసుకోవటం తగ్గిపోతుంది. ఇక చిన్నపేగుల బైపాస్‌ సర్జరీ ప్రక్రియలో పేగుల పొడవును తగ్గిస్తారు. దీని వల్ల ఆకలి తగ్గి క్రమంగా బరువు తగ్గుతారు. 

* బేరియాట్రిక్‌ సర్జరీలో పొట్ట సైజును తగ్గించినంత మాత్రాన ఆకలి, తినాలనే కోరిక ఎలా తగ్గుతుందని చాలామంది అనుమానిస్తుంటారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో జీర్ణాశయానికి తగినట్టుగానే హార్మోన్ల ఉత్పత్తిలోనూ మార్పులు వస్తాయి. దీంతో ఎక్కువగా తినాలనే కోరిక కలగదు. వీటిని చేయించుకున్నవారిలో కొద్దిపాటి గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఎదురవ్వొచ్చు. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూ వీటిని నివారించుకోవచ్చు. 

ఇదీ బీఎంఐ.. ఎత్తు-బరువుల నిష్పత్తి:
* బరువును కేజీల్లో ఎంతుందో చూసుకోవాలి.
* అలాగే ఎత్తును మీటర్లలో కొలుచుకోవాలి.
* తర్వాత ఎత్తు సంఖ్యను తిరిగి అదే సంఖ్యతో గుణించి.. ఆ వచ్చిన సంఖ్యతో బరువును భాగించాలి.
* ఉదాహరణకు మీ బరువు 68 కేజీలు, ఎత్తు 1.6 మీటర్లు ఉందనుకోండి. అప్పుడు ఎత్తు-బరువుల నిష్పత్తి (బీఎంఐ) 68/1.6X1.6 = 26 అవుతుంది. 

నడుము చుట్టుకొలత:
* స్త్రీలు 80 సెం.మీ. (31.6 అంగుళాలు), పురుషులు 90 సెం.మీ. (35.6 అంగుళాలు) మించి నడుం కొలత పెరగకుండా చూసుకోవాలి.
* బీఎంఐ తక్కువగా ఉండి, ఒక్క నడుము చుట్టుకొలత ఎక్కువున్నా వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని మరవరాదు.

అధిక బరువు... అలవాట్ల వాస్తవాలివి.
రోజు వారి ఆహారంలో ఏం తినాలి.. ఏం తినకూడదు. కార్బోహైడ్రేట్లు మంచివా.. చెడ్డవా? పాలు, పాలపదార్థాల గురించి కొంతమంది మంచివంటే మరికొందరు బరువు పెంచుతాయంటారు... ఏది నిజం తెలుసుకోవాలంటే పోషకాహార నిపుణులు చెబుతున్న వాస్తవాలు తెలుసుకోవాల్సిందే! 

* అవాస్తవం: కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్‌ నిరోధించి.. బరువు పెంచుతాయి
* వాస్తవం: బరువు పెరగడం అనేది ఫలానా పదార్థం వల్ల ఉంటుంది అని చెప్పలేం. అధిక కెలొరీలు స్వీకరించడం, అవి ఖర్చయ్యేలా వ్యాయామాలు చెయ్యకపోవడం వల్లే సాధారణంగా బరువు పెరుగుతారు. అలాగని బరువు పెరుగుతాం అన్న అభిప్రాయంతో కార్బోహైడ్రేట్లు తీసుకోకపోవడం మంచిది కాదు. దానివల్ల మన ఆహారంలో కాల్షియం, పీచు పదార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. దాంతో ఆరోగ్యాన్నందించే ఫైటోకెమికల్స్‌ తగ్గుతాయి. బదులుగా అన్ని పోషకాలు అందించడానికి సప్లిమెంట్లను తీసుకొంటున్నాం కదా అనొచ్చు. కానీ అవి పోషకాల అందించే శక్తికి ప్రత్యామ్నాయం ఎంత మాత్రం కాదు అంటారు పోషకాహార నిపుణులు. కార్బోహైడ్రేట్లను తగు మోతాదులో తీసుకోవడం తప్పనిసరి.

* అవాస్తవం: సాయంత్రం ఏడింటికే భోజనం కానిచ్చేయాలి.
* వాస్తవం: సాయంత్రం ఎప్పుడు తిన్నా నిద్రించడానికి మూడు గంటలు ముందుగా భోజనం చేయాలి. ఒకవేళ మీ పనివేళలు ఇందుకు సహకరించకపోతే నూనెలు అధికంగా ఉన్నవాటిని నియంత్రించుకోవాలి. అవి కూడా ఆలస్యంగా తినడం శ్రేయస్కరం కాదు. తిన్న వెంటనే నిదురించడం ఎంత మాత్రం మంచిది కాదు. బరువు ఎక్కువయ్యే అవకాశము చాలా ఎక్కువ . తిన్నది జీర్ణం అయిన తర్వాతే నిద్రకు ఉపక్రమించండి. 

* అవాస్తవం: పాలు, పాల ఉత్పత్తులు అధిక బరువుకు కారణం.
* వాస్తవం: పాలు సంపూర్ణ పోషకాహారం. ఇందులో సుమారు 14 రకాల ప్రధాన పోషకాలుంటాయి. ముఖ్యంగా మాంసకృత్తులు.. కాల్షియం ఉంటాయి. 'పాల నుంచి అందే కాల్షియం వృక్ష సంబంధిత ఉత్పత్తుల నుంచి అందే కాల్షియం కంటే త్వరగా శరీరానికి అందుతుంది. దీనిలో లినోలిక్‌ ఆమ్లం... కొవ్వును కరిగించడానికి ఉపకరిస్తుంది. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. 

* అవాస్తవం: ప్రొటీన్లను.. కార్బోహైడ్రేట్లను కలిపి స్వీకరించకూడదు. లేదా రెండు రకాల ప్రొటీన్లను ఒకేసారి తీసుకోకూడదు!
* వాస్తవం: ఒకే రకమైన ఆహారాన్ని తినడానికి శరీరం సహకరించదు. దాంతో తక్కువ తింటాం. కానీ దీని వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందవు. అయితే దీని ఫలితాలు ఒక్కసారి కనిపించకపోయినా దీర్ఘకాలంలో అనేక వ్యాధులు వేధిస్తాయి. అందుకే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే పొట్టుతీయని గోధుమలతో చేసిన రొట్టెలు, చిక్కుడి జాతి గింజలు, పప్పులు, గింజలు, మాంసపు ఉత్పత్తులు తినాలి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గడానికి అన్ని తినాలి.. కానీ ఆ కెలొరీలను కరిగించడానికి తగిన వ్యాయామం కూడా అవసరమే అని గుర్తించుకోవాలి. 

పాలు తాగితే బరువు తగ్గుతాం :
పాలు తాగితే బలం వస్తుందని తెలుసు కానీ.. బరువు తగ్గుతామని తెల్సా...? అవును అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ వారు రెండేళ్ల పాటు పాలు తాగిన వారిపై జరిపిన పరిశోధనలో ఈ నిజాలు వెల్లడించారు. 

ఇజ్రాయిల్‌లోని బెన్-గురియాన్ కళాశాలకు చెందిన డానిత్ షహార్ నేతృత్వంలో నిర్వహించిన ఓ పరిశోధనలో ప్రతిరోజు రెండు గ్లాసుల పాలు తాగిన వారు ఆరు నెలల వ్యవధిలో అధిక మోతాదులో డి-విటమిన్‌ను పొందగలిగినట్లు గుర్తించారు. 

ఈ పరిశోధనలో భాగంగా 40 నుంచి 65 ఏళ్ల వయస్సు గల 300లకు పైగా స్త్రీ, పురుషులపై రండేళ్ల పాటు జరిపిన పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రతి రోజు పాలు తాగే వారు, పాలు తాగని వారితో పోలిస్తే సగటున ఆరు కిలోల బరువు తగ్గినట్లు వారు తెలిపారు.

పాల పదార్థాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. ప్రతి రోజు అధిక కాల్షియం ఉండే డైరీ పదార్థాలను తీసుకున్న వారు రెండేళ్ల తర్వాత సగటున ఆరు కిలోల బరువు తగ్గగా.. తక్కువ కాల్షియం ఉండే డైరీ పదార్థాలను తీసుకున్న వారు రెండేళ్ల తర్వాత సగటున 3.5 కిలో బరువు తగ్గినట్లు వారు గుర్తించారు. 

సాధారణంగా రోజుకు రెండు గ్లాసుల పాలను తీసుకోవడం వల్ల శరీరానికి 583 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుంది. కాల్షియం వల్ల శరీరానికి విటమిన్-డి అందుతుంది. అంతేకాకుండా శరీరంలో విటమిన్-డి స్థాయి స్వతంత్రంగా బరువు తగ్గడానికి ఉపయయోగపడుతుంది. 

పాలు, పాల ఉత్పత్తులు విటమిన్-డిను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తమ పరిశోధనలో వెల్లడైందని వారు తెలిపారు. సాధారణంగా ఒక రోజులో శరీరానికి 400 అంతర్జాతీయ యూనిట్స్(ఐయూ) విటమిన్-డి అవసరం అవుతుంది. అంటే దాదాపు నాలుగు గ్లాసుల "లో-ఫ్యాట్ మిల్క్" అన్నమాట. 

కాబట్టి బరువు తగ్గడానికి బరువైన పనులు(ఎక్సర్‌ సైజులు)చేయడం మాని, ఎంచక్కా రెండు గ్లాసులు పాలు తాగితే చాలని వారు సూచిస్తున్నారు.

అధిక బరువు చాలామందిని వేధించే సమస్య. 'అలాంటివారు ఈ ఎనిమిది సూత్రాలూ పాటించండి, శ్రమలేకుండానే బరువు తగ్గిపోతారు' అంటున్నారు బ్రిటిష్‌ పోషకాహార నిపుణులు. 

* బరువు తగ్గాలనుకునేవారు వారానికి ఒకరోజు అన్నిపూటలూ భోజనానికి బదులుగా కూరగాయలూ ఆకుకూరల సలాడ్‌ తీసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు, ఆ పోషకాలూ విటమిన్లతో చర్మానికి నిగారింపూ పెరుగుతుంది.
* తగిన చోటు, సమయం చూసుకొని కూర్చొనే భోంచేయాలి. దాంతో ఆహారాన్ని బాగా నములుతారు. ఫలితంగా త్వరగా జీర్ణమవుతుంది.
* సాధ్యమైనంత చిన్నసైజు ప్లేటులో భోంచేస్తే మీకు తెలియకుండానే పూటకు కనీసం 250 క్యాలరీలైనా తగ్గించి తింటారు.
* నిద్రలేచిన గంటలోపే బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తిచేయడం మంచిది. ఆలస్యంగా తినడంవల్ల రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరుగుతుంది.
* రోజూ పాల ఉత్పత్తులు ఎంతోకొంత పరిమాణంలో తీసుకోవాలి. వీటిలోని కాల్షియం కొవ్వుని కొంతమేరకు తగ్గించగలదు.
* వ్యాయామం చేసిన తర్వాత 30-60 నిమిషాల లోపు భోంచేయడం మేలు. కొత్తగా చేరే క్యాలరీలను శరీరం అలసిపోయినపుడు వెంటనే ఉపయోగించుకుంటుంది.
* భోజనానికి ముందు నారింజలాంటి నిమ్మజాతి పండు సగం తింటే బరువు తగ్గుతారని ఓ పరిశోధన.
* వారంలో మూడు రోజులు గుడ్లు, ఒకపూట చేప తినడం కూడా బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నా.. అవగాహనాలేమితో చేసే పొరబాట్లతో మరింత బరువు పెరుగుతాం. వాస్తవాలు తెలుసుకుని సరైన నియమాలు పాటించగలగాలి. 

అల్పాహారం మానేస్తే సన్నగా మారిపోవడం చాలా సులువనుకుంటారు కొందరు. కానీ ప్రతిరోజూ అల్పాహారం తీసుకునేవారు త్వరగా చిక్కుతారని చెబుతోందో అధ్యయనం. అల్పాహారం తీసుకోవడం వల్ల మిగిలిన రోజులో ఆకలి తక్కువ కలుగుతుంది. దాంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. రోజంతా చురుగ్గానూ ఉండటం వల్ల శరీరానికీ వ్యాయామం అందుతుంది. జీవక్రియ ఆరోగ్యంగా మారుతుంది. ఇవన్నీ సన్నగా మారేలా చేస్తాయి. అయితే పోషకమిళితమైన పదార్థాలను ఎంచుకుంటేనే ఆ లాభాల్ని పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. 

బరువు పెరగడమనేది కుటుంబచరిత్రలోనే ఉందని తేలిగ్గా తీసుకుంటారు కొందరు. కానీ మనసు పెడితే సన్నగా మారడం మీ చేతుల్లోనే ఉందని గ్రహించాలి. తీసుకునే కెలొరీలను గమనించుకుంటూ.. వాటిని ఖర్చుచేసేందుకు సరైన వ్యాయామం చేయాలి. శరీరానికి శక్తినందిస్తూ.. అదేసమయంలో తక్కువ కెలొరీలనిచ్చే పదార్థాలను తీసుకోవడం కూడా సులువుగా బరువు తగ్గగలుగుతాం. 

అతి ఎప్పుడూ అనర్థమే అవుతుంది. సన్నగా మారే క్రమంలో మితిమీరి పాటించే కొన్ని నియమాల వల్ల లాభం కన్నా ఇతర సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సమతులాహారానికి ప్రాధాన్యం ఇస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. అతిగా వ్యాయామం చేయడం కూడా సరికాదు. రోజులో ఓ గంటన్నరకు మించి వ్యాయామం చేయకూడదు. 

కొన్ని రకాల ప్రత్యేకమైన పదార్థాలు బరువును తగ్గించేలా చేస్తాయి. మిల్క్‌షేక్‌లు, చాక్లెట్లు, శరీరంలో కొవ్వును పెంచే సూప్‌లకు బదులుగా క్యాబేజీ సూప్‌డైట్‌, గ్రేప్‌ ఫ్రూట్‌డైట్‌ వంటి వాటిని ఎంచుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిని ఎక్కువకాలం కొనసాగించలేం. ఖరీదెక్కువ కావడం, కోరుకున్న రుచినివ్వకపోవడం వంటి కారణాలతో ఇతర పదార్థాలనూ తీసుకోవడం మొదలుపెడతాం. అందుకే శరీరారనికి అవసరమైన పోషకాలందించే ఆహారాన్ని తీసుకుంటూనే మెరుపుతీగలా మారాలి.

బరువు తగ్గాలనుకునేవారు ముందుగా వేళపట్టున భోంచేయాలి. ప్రతి రెండుగంటలకోసారి కొద్దికొద్దిగా తినాలి. వేళపట్టున నిద్రపోవడం వల్ల కూడా స్థూలకాయం బాధించదని ఓ అధ్యయనం పేర్కొంటోంది. కాబట్టి రాత్రిళ్లు త్వరగా భోంచేసి రెండు గంటల తరవాత నిద్రపోవడాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలి. 

ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినడం ఆరోగ్యానికి మంచిది. త్వరగా జీర్ణమవుతాయి. అధిక కొవ్వు నిల్వలు పేరుకోవు. బాగా నమిలి తినడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, మిఠాయిలను మితంగా తినడం వంటి జాగ్రత్తలను పాటించడం ఎంతయినా మంచిది. 

అధిక బరువు తెలివికి చేటు!
వూబకాయంతో వచ్చే రకరకాల చిక్కుల గురించి వింటూనే ఉన్నాం. గురక నుంచి గుండె జబ్బుల వరకూ దీనితో ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవే కాదు... ఊబకాయం వల్ల పిల్లల్లో విషయ గ్రహణ సామర్థ్యం కూడా దెబ్బతింటున్నట్టు తాజా అధ్యయనంలో గుర్తించారు. ముఖ్యంగా అధిక బరువు గల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో ఈ తేడా స్పష్టంగా కనబడుతున్నట్టు వీరు గమనించటం విశేషం. పిల్లల బరువు, నిద్ర సమస్యలు, తేలివి తేటలన్నీ ఒకదాంతో మరోటి ముడిపడి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అధికబరువు గల పిల్లలు తగినంత నిద్రకు నోచుకోవటం లేదని.. ఇది తరగతిలో పాఠాలను నేర్చుకోవటంలో ఇబ్బందులకు కారణమవుతోందని తేలటం విశేషం. చికాగో ప్రికర్‌ స్కూల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కరెన్‌ స్ప్య్రూట్‌ ఇటీవల ఒక అధ్యయనం చేశారు. సగటున 8 సంవత్సరాల విద్యార్థులను ఎంచుకొని వారికి పాఠాలను నేర్చుకోవటం, జ్ఞాపకశక్తి, ప్రణాళికా రచన, సమస్యలను పరిష్కరించటం, ఏకాగ్రత వంటి తెలివి తేటలకు సంబంధించిన పరీక్షలు పెట్టారు. అలాగే రాత్రిపూట వాళ్లు నిద్రపోయే విధానాన్నీ పరీక్షించారు. ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

* నిద్ర సరిగా పట్టని పిల్లలకు ఊబకాయం ముప్పు పెరగటమే కాదు తెలివి తేటల పరీక్షలో తక్కువ మార్కులు కూడా వచ్చాయి.
* వూబకాయ పిల్లల్లో నిద్ర సంబంధ శ్వాస సమస్యలు, విషయ గ్రహణ సామర్ధ్య లేమి వంటి ఇబ్బందులు పొంచి ఉంటున్నాయి.
* ఇక పాఠాలు నేర్చుకోవటంలో ఇబ్బంది పడుతున్న వారిలో ఊబకాయం, నిద్ర సమస్యలు కూడా కనిపిస్తున్నాయి.

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చూస్తే- అధిక బరువు పిల్లల్లో నిద్ర సంబంధ శ్వాస సమస్యల వంటివాటిని నిర్లక్ష్యం చేయరాదని కరెన్‌ సూచిస్తున్నారు. తరగతిలో తక్కువ మార్కులు తెచ్చుకుంటున్న పిల్లల్లో తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన అంశాల్లో నిద్ర కూడా ఒకటని నిపుణుల అభిప్రాయం. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరముందని భావిస్తున్నారు. 

వూబకాయంతో చిగుళ్ల సమస్య:
వూబకాయులు తరచూ చిగుళ్ల సమస్యను సైతం ఎదుర్కొనాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో అధిక కొవ్వు, స్థూలకాయం కారణంగా పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే విషయం ఇప్పటికే తెలిసిందే. వీటిలో గుండె జబ్బులు, మధుమేహం, నిద్ర రుగ్మతలు, ఎముకల బలహీనత వంటి సమస్యలన్నీ తలెత్తుతాయి. స్థూలకాయులు బ్యాక్టీరియా బారిన ఎక్కువగా పడుతుంటారనీ, ఫలితంగా చిగుళ్ల వ్యాధులు వస్తాయని బోస్టన్‌ యూనివర్సిటీలో చేపట్టిన తాజా అధ్యయనంలో గుర్తించారు.ఇటీవల చేపట్టిన అధ్యయనంలో.. ఊబకాయుల నోటిలో జింజివైటిస్‌ సమస్య తీవ్రంగా ఉంటుందనీ, వారిలో దంతాల ఎముకలు బాగా దెబ్బతింటాయని, ఇన్‌ఫెక్షన్‌ కూడా ఎక్కువేనని వెల్లడైంది. ఇన్‌ఫెక్షన్లపై పోరాడేందుకు రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసే రసాయనాలు కూడా వూబకాయుల్లో తక్కువేనని గుర్తించారు. 

Half an hour for health, ఆరోగ్యానికో అరగంట:
సన్నగా నాజూగ్గా ఉన్నవారిని చూసి, తమ శరీరతత్వంతో పోల్చి చూసుకుని బాధపడటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దానికి బదులు వారు పాటిస్తున్న ఆరోగ్య నియమాలను తెలుసుకుని ఆచరిస్తే మంచిది. భోజనం మానేస్తే బరువు తగ్గొచ్చు అనుకోవడం, బరువులెత్తే వ్యాయామాలు చేయడం వల్ల సన్నబడతాం అన్నది అపోహ మాత్రమే. తగినంత ఆహారం తీసుకున్నప్పుడే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అయితే ఎక్కువ కెలొరీలు ఉండే జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి. పోషకాలూ, పీచూ, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. నిర్ణీత సమయానికి భోంచేయడం, వేళకు పడుకోవడంతో పాటూ నడకా, పరుగూ, తోటపనీ వంటి వాటికి కొంత సమయం కేటాయించాలి. అది (సమయం)కనీసం అరగంట ఉంటే ఫలితం ఉంటుంది. మానసిక ఆందోళన కూడా అధిక బరువుకి కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎంత తీరిక లేకుండా ఉన్నా కనీసం కొంత సమయాన్ని మీ కోసం మీరు కేటాయించుకోండి. ఇది కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. బరువు తగ్గే దిశలో మీకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.