9, సెప్టెంబర్ 2021, గురువారం

వినికిడి సమస్య మరియు చెవి నొప్పి సమస్య ఉన్న వాళ్ళు తీసుకోవాలి జాగ్రత్త లు అవగాహనా కోసం లింక్స్ లో చుడండి


వినికిడి లోపం అంటే ఏమిటి?

వినికిడి లోపం అంటే శబ్దాలను వినడంలో సామర్ధ్యం తగ్గిపోవడం ఇది ఎదో ఒక చెవిని లేదా రెండు చెవులను ప్రభావితం చేయవచ్చు. వినికిడిలోని అసమర్థత పై ఆధారపడి, వినికిడి లోపాన్ని తేలికపాటిది, మధ్యస్థమైనది మరియు తీవ్రమైనదిగా వర్గీకరించవచ్చు. అసలు వినపడకపోవడం లేదా చాలా తక్కువగా వినపడడాన్ని చెవుడు (deafness) అని పిలుస్తారు. కారణాన్ని బట్టి ఈ పరిస్థితి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉంటుంది.

WHO ప్రకారం, 2050 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 90 మిలియన్లకు పైగా ప్రజలు వినికిడి లోపంతో ఉండవచ్చు. వినికిడి సమస్య ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారతదేశం ఒకటి.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వినికిడి లోపం ఉండడమే ఒక లక్షణం. వినికిడి లోపాన్ని సూచించే ఇతర సంకేతాలు:

  • సందడిగా/గోలగా ఉన్నపుడు వినడానికి చాలా శ్రమపడడం
  • మాట్లాడుకుంటున్నపుడు (సంభాషిస్తున్నపుడు) సరిగ్గా స్పందించకపోవడం
  • అధిక శబ్దాలతో (వాల్యూమ్తో) సంగీతం వినడం లేదా టివి చూడడం
  • ఇతరులను మరలా మరలా ఒకే విషయాన్ని అడుగుతూ ఉండడం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

సహజ వృద్ధాప్య లక్షణాలలో భాగంగా, వయసు పెరిగిన వారిలో వినికిడి లోపాన్ని సాధారణంగా చూడవచ్చు, వృద్దాప్యంకణాల క్షీణతకు దారితీస్తుంది. 40 ఏళ్ల వయస్సు నుండి వినికిడిలో ఇబ్బందులను పడవచ్చు.

పిల్లలలో వినికిడి లోపం వివిధ కారణాల వల్ల కలుగుతుంది, అవి వీటిని కలిగి ఉండవచ్చు:

  • జన్యుపరంగా (జెనెటిక్స్)
  • గర్భధారణ సమయంలో సంక్రమణ వలన
  • గర్భధారణ సమయంలో తీసుకున్న కొన్ని రకాల మందులు
  • పుట్టిన 1 నెల లోపు కామెర్లు రావడం వలన
  • తక్కువ బరువుతో పుట్టడం
  • పుట్టినప్పుడు (జన్మించే సమయంలో) ఆక్సిజన్ అందకపోవడం/తగ్గిపోవడం

వినికిడిని ప్రభావితం చేసే ఇతర కారణాలు:

  • మెనింజైటిస్,మీసల్స్ (measles), గవదబిళ్ళలు వంటి వ్యాధులు
  • చెవి యొక్క అంటువ్యాధులు/సంక్రమణలు
  • కొన్ని రకాల మందులు
  • తల లేదా చెవికి గాయం కావడం
  • చెవి గులిమి
  • కార్యాలయాలలో లేదా వినోద కార్యక్రమాలలో (కచేరీలు, నైట్క్లబ్బులు, పార్టీలు) అధిక  శబ్దాలకు గురికావడం అలాగే హెడ్ఫోన్స్ లేదా ఇయర్ఫోన్లను అధిక శబ్దంతో వినడం

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వ్యక్తి తనకి వినికిడి సమస్య ఉందని అనుకుంటే, వైద్యుడిని (ఒక ఆడియాలజిస్ట్[audiologist]) ని సంప్రదించాలి. వైద్యులు వినికిడి లోపానికి గల కారణాన్ని కనుగొని, చికిత్సా ప్రణాళికను నిర్ణయిస్తారు. చెవిలో గులిమి వినికిడి లోపానికి కారణం అని తెలిస్తే, ఆ గులిమిని తొలగించడం ద్వారా వినికిడి లోపాన్ని సరిదిద్దవచ్చు.

అవసరమైతే వైద్యులు వినికిడి సహాయాలు (hearing aids) లేదా ఇంప్లాంట్ల ఉపయోగాన్ని కూడా కూడా సూచిస్తారు. వినికిడి నష్టం చికిత్స చేయకపోతే, లిప్ రీడింగ్ మరియు సైగల భాషను నేర్చుకోవడం వంటివి ఇతరులతో సంభాషణకు సహాయపడతాయి.

పిల్లలలో వినికిడి లోపాన్ని ఈ క్రింది విధంగా నివారించవచ్చు:

  • మీసల్స్ (measles) మరియు గవదబిళ్ళకు వ్యతిరేకంగా టీకాలు వేయించడం
  • ఓటైటిస్ మీడియా (otitis media) వంటి అంటువ్యాధుల పరీక్షలు
  • పెద్ద శబ్దాలు / సంగీతాన్ని వింటూ ఉండరాదు
  • పిల్లలు వారి చెవులలో ఏవైనా వస్తువులను చొప్పించుకోకుండా (పెట్టుకోకుండా) జాగ్రత్త పడాలి

శబ్దాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పనిచేసేవారు (పెద్దలు) చెవి సంరక్షణను ఉపయోగించాలి/పాటించాలి.


వినికిడి లోపం కొరకు అల్లోపతి మందులు


Medicine NamePack Size
OtzOtz 200 Mg/500 Mg Tablet
Pik ZPik Z 50 Mg/125 Mg Syrup
DiofloxDioflox 100 Infusion
Mark OMark O 200 Mg Tablet
OxanidOxanid Tablet
Pin OZPin OZ Tablet
DiroxinDiroxin 100 Tablet
MaxofMaxof 200 Mg Tablet
Oxflo ZlOxflo ZL Suspension
Piraflox OPiraflox O Infusion

చెవి నొప్పి ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి సలహాలు 

 

1. మీకు ఇటీవలి కాలంలో జలుబు చేసిందా?

జలుబు (కామన్ కోల్డ్)

 

చెవిపోటును ఆయుర్వేద పరిభాషలో కర్ణశూల అంటారు. శాస్త్రకారుడు చెవిపోటు రావటానికి దారితీసే కారణాలను చెపుతూ, “అవశ్యాయము, ప్రతిశ్యాయము, జలక్రీడ – వీని చేతను, చెవిలో దురద జనించడం చేతను, ధ్వనిని అసహజమైనరీతిలో వినడం చేతను, దెబ్బలు మొదలైన అఘాతముల చేతను, వాత ప్రకోప కారణముల చేతను వాటాను ప్రకోపించి తీవ్ర వేగముతో కర్ణ రంధ్రములను చేరి, తత్సంబంధిత నాడుల యందు వ్యాపించి శూలను కలుగచేయును" అంటాడు. ఇక్కడ అవశ్యాయమం ప్రతిశ్యాయం అనేవి జలుబు తాలూకు వివిధ దశలు. ఇక జలక్రీడలంటే స్విమ్మింగ్ మొదలైనవని అర్థం అవుతూనే వుంది. చెవిపోటు కలగడానికి శాస్త్ర కారుడు సూత్రప్రాయంగా చెప్పిన కారణాలను కొంచెం వివరంగా తెలుసుకుందాం.

 

1. జలుబు (కామన్ కోల్డ్):

జలుబు కారణంగా ముక్కులోపలి మ్యూకస్ పొరలు వాయడం చేతగాని, సైనసైటిస్ వ్లలగాని, టాన్సిల్స్ చేతగాని, లేదా ఎడినాయిడ్స్ పెరగడం వల్లగాని గొంతునూ మధ్యచేవినీ కలిపే శ్రోత్ర నాళం (యూస్టేషియన్ ట్యూబ్) పూడుకుపోయి మధ్య చెవిలో ఉండాల్సిన ఒత్తిడిలో మార్పును తీసుకువచ్చి కర్ణభేరి పైన పీడనాన్ని ప్రదర్శిస్తుంది. దీనితో చెవి అంతా నొప్పిగా అనిపిస్తుంది. పిల్లల్లో ఇది సర్వసాధారణంగా కనిపించేదైనప్పటికీ, పెద్దవారు దీనికేమీ అతీతులు కారు.

 

గృహచికిత్సలు: 1. వస పొడిని లేదా నల్లజీరకర్ర పొడిని ఒక గుడ్డులో మూటకట్టి గాఢంగా వాసన పీల్చాలి. 2. తులసి ఆకులను (ఐదు) మిరియాలను (ఐదు) అల్లం ముక్కను (చిన్నది) అన్నిటిని కలిపి కచ్చాపచ్చాగా దంచి నీళ్ళలో వేసి కషాయం కాయాలి. దీనికి కొద్దిగా బెల్లం చేర్చి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 3. నవాసాగరం (అమోనియం క్లోరైడ్), సున్నం ఈ రెంటిని సమతూకంగా తీసుకుని పొడిచేసి కలపాలి, దీనిని చిటికెడు తీసుకొని ముక్కుపొడుం లాగ పీల్చాలి. 4. మిరియాల చూర్ణాన్ని చిటికెడు మోతాదుగా పెరుగుతో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 5. గోధుమ పిండి (అరచెంచా) వాయువిడంగాల చూర్ణం (అరచెంచా) రెంటినీ కలిపి రాత్రి పడుకునే ముందు నీళ్ళతో తీసుకోవాలి.

 

ఔషధాలు: వ్యోషాదివటి. లక్ష్మీవిలాసరసం, కాంచనారగుగ్గులు, షడ్బిందు తైలం (ముక్కులో డ్రాప్స్), త్రిభువన కీర్తిరసం, లవంగాదివటి, కర్పూరాదిచూర్ణం, కస్తూరిమాత్రలు,

బాహ్యప్రయోగాలు - కర్పూరాదితైలం, చంద్రకళాలేపం, రాస్నాదిచూర్ణం.


2. చెవి అంతర్భాగం (మిడిల్ ఇయర్) లో ఇన్ఫెక్షన్:

వైరస్, బ్యాక్టీరియా వంటి వాటి వల్ల మధ్య చెవి కుహరం వ్యదిగ్రస్తమై కర్ణభేరిని వాపునకు గురిచేస్తుంది. దీని పర్యవసానంగా వినికిడి శక్తి తాత్కాలికంగా లోపించవచ్చు.

 

గృహచికిత్సలు: 1. కామంచి ఆకు రాసాన్ని చిన్న సెగమీద వేడిచేసి మూడు లేదా నాలుగు చుక్కలు చొప్పున రోజుకు రెండు సార్లు చెవిలో డ్రాప్స్ వేయాలి. 2. కుంకుడికాయల రసాన్ని మూడు లేదా నాలుగు చుక్కల చొప్పున చెవిలో రోజుకు రెండు లేదా మూడుసార్లు డ్రాప్స్ గా వేసుకోవాలి. 3. తాటి చెట్టు లేత పువ్వు మొగ్గల నుంచి రసం పిండి చెవిలో డ్రాప్స్ గా వేసుకోవాలి. 4. మిరప పువ్వులను, నల్లతుమ్మ పువ్వులను సమానభాగాలుగా తీసుకొని, ముద్దగా దంచి రసం పిండాలి. దీనిని చెవిలో డ్రాప్స్ గా వేసుకోవాలి.

ఔషధాలు: త్రిభువనకీర్తి రసం, వ్యోషాదివటి.

 

3. వెలుపలి చెవికి ఇన్ఫెక్షన్:

వెలుపలి చెవి (ఎక్స్ టర్నల్ ఇయర్) తాలూకు నాళాన్ని కప్పుతూ చర్మం ఉంటుందన్న సంగతి తెలిసిందే, ఈ నాళం తాలూకు చర్మం పైన సెగగడ్డలు, గుల్లలు వంటివి తయారైనప్పుడుగాని, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధి వచ్చినప్పుడుగాని తత్సంబంధిత ప్రాంతంలో తీవ్రంగా నొప్పి వస్తుంది. చెవిలోపలి ఎముకల సముదాయం పైన ఉండే చర్మం బిగుతుగా అమరి ఉండటంతో ఏ మాత్రం వాపు జనించినా, అది ప్రసరించడానికి స్థలం చాలక నొప్పి కలుగుతుంది.

 

గృహచికిత్సలు: 1. ఆవనూనెను వేడిచేసి చెవిలో డ్రాప్స్ గా వేయాలి. 2. నవ్వుల నూనెలో (పావు కప్పు) వెల్లుల్లి గర్భాలను (రెండు) వేసి వేడిచేసి చెవిలో నాలుగు లేదా ఐదు డ్రాప్స్ చొప్పున వేయాలి. ఔషధాలు: త్రిఫలాగుగ్గులు, గంధకరసాయనం, బాహ్యప్రయోగాలు - అపామార్గ తైలం, సముద్రఫేన చూర్ణం (సముద్రపు నురుగు చూర్ణం)


4. కర్ణభేరి పగలటం (పర్ఫరేటెడ్ ఇయర్ డ్రమ్): వ్యాధులు కలగటానికి కారణాలను చెబుతూ శాస్త్రకారుడు 'అసాత్మ్యేంద్రియార్థ సంయోగం' గురించి చెప్పాడు. దీని అర్థం, చెవి అనే జ్ఞానేద్రియం, శబ్దం అనే ఇంద్రియార్థంతో అసహజమైన రీతిలో సంయోగం చెందటం. ఇదే సందర్భంలో ఆగంతుజ కారణాలను కూడా వ్యాధులకు కారణాలుగా చెబుతాడు. ఆగంతుజ కారణాలంటే గాయాలు, దెబ్బలు మొదలైనవన్న మాట. చెవి నొప్పి కలగటానికి ప్రధానమైన కారణాలు ఇవే. పెద్ద విస్పోటనాలు జరిగినప్పుడుగాని, థియేటర్లలో స్టీరియో శబ్దాలను విన్నప్పుడుగాని, చెవి ప్రాంతంలో బలమైన దెబ్బ తగిలినప్పుడుగాని కర్ణభేరి పగిలి తీవ్రమైన నొప్పి కలుగుతుంది, శబ్ద గ్రహణ శక్తి కూడా తగ్గిపోతుంది. ఇలా జరిగినప్పుడు సాధారణంగా కర్ణభేరిలోని రంధ్రం దానంతట అదే పూడుతుంది. మందులు వాడితే ఫలితం మరింత త్వరితగతిని కనిపిస్తుంది.

ఔషధాలు: శారిబాది వటి.

బాహ్యప్రయోగం - బిల్వాది తైలం.

 

5. దంతసంబంధ సమస్యలు:

కొంతమంది యుక్త వయస్కులలో జ్ఞాన దంతం మొలిచేటప్పుడు చెవిపోటు కూడా వస్తుంది. ఇలాగే కొంతమంది పిల్లల విషయంలో కూడా జరుగుతుంది. దంతాలు చిగుర్లను తొలుచుకుని వచ్చే సమయంలో, ఏ పక్కనుంచైతే దంతాలు వస్తుంటాయో ఆ ప్కకనుండే చెవిని మాటి మాటికి తడుముకోవటం గాని, రుద్దుకోవడం కాని చేస్తుంటారు. నరాలనేవి దంతాల చిగుర్లనుంచి చెవి వరకూ వ్యాపించి ఉండటమే దీనికి కారణం. ఔషధాలు: ఖదిరావటి,

బాహ్యప్రయోగం - ఇరిమేదాది తైలం.

 

6. నిత్యరొంప (సైనసైటిస్):

మన తలను బరువులేకుండా తేలికగా ఉంచడం కోసం కపాలం లోపల సైనస్ లనే గాలి గదులు ఉంటాయి. ఇవి వ్యాధిగ్రస్తమైనప్పుడు నొప్పి అనేది చేవిలోనికి నరాల ద్వారా ప్రసరించే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో ఇటువంటి నొప్పిని 'రిఫర్డ్ పెయిన్' అంటారు. ఇటువంటి నొప్పి ఎక్కువగా చెవికి వెనుక పక్కనుండే ఖాళీ ప్రదేశం వ్యాధిగ్రస్తమైనప్పుడు (మాస్టాడైటిస్)వస్తుంది. దీనికి మందులతోపాటు స్వేదకర్మ వంటి చికిత్సలు అవసరమవుతాయి.

 

గృహచికిత్సలు: 1. తులసి, అల్లం, ఎలాక్కాయలు, మిరియాలు, మునగాకులను కషాయం కాచుకుని తాగాలి. 2. వావిలి రసం (పావులీటరు), నువ్వుల నూనె (పావు లీటరు), ఉల్లిముద్ద (పావు కిలో) వీటినన్నిటిని కలిపి సన్నని సెగ మీద ఉడికించాలి. నూనె మాత్రం మిగులుతుంది. దీనిని రోజువారిగా తలకు రాసుకోవాలి. 3. తుమ్మి ఆకులను (గుప్పెడు), వెల్లుల్లి గర్భాలను (మూడు), ఉప్పును (చిటికెడు) కలిపి ముద్దచేసి రసం పిండాలి. దీనిని ఉదయం ఆహారానికి ముందు ముక్కులో డ్రాప్స్ గా నాలుగైదు రోజులు వేసుకోవాలి.

 

ఔషధాలు: ఆరోగ్యవర్ధీనీ వటి, చిత్రక హరీతకి, కాంచనార గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగారాజ గుగ్గులు, నవక గుగ్గులు, నవాయాస చూర్ణం, పంచతిక్త ఘృత గుగ్గులు, యోగరాజ గుగ్గులు. పైకి వాదాల్సినవి - అసన బిల్వాది తైలం, బలా గుడూచ్యాది తైలం, బలాశ్వగంధాది తైలం, రాస్నాది చూర్ణం, నిర్గుండి తైలం, త్రిఫలాది తైలం.


7. హనుగ్రహం (లాక్ జా): దవడ ఎముక తాలూకు జాయింటు చెవికి ముందు భాగాన కదులుతుంటుంది. దీనిని 'టెంపోరో మాండిబ్యులర్ జాయింట్' అంటారు. ఈ భాగం వ్యాదిగ్రస్తమైనప్పుడు దవడను కదిలించినప్పుడల్లా చెవిలో క్లిక్ మనే శబ్దం వస్తుంటుంది. ఒకోసారి దవడను కదిలించడం కష్టమైపోవడంతో పాటు చెవిలో నొప్పిగా కూడా ఉంటుంది. దీనిని మామూలు చెవిపోటును చికిత్సించినట్లుగా కాకుండా కీళ్లనొప్పి మాదిరిగా చికిత్సించాల్సి వుంటుంది. అంటే స్నేహస్వేదాలు, పంచకర్మలతోపాటు శోథహర ఔషధాలతో శమన చికిత్సలు చేయాల్సి వుంటుంది.

ఔషధాలు: మహాయోగరాజగుగ్గులు, మహావాతవిధ్వంసినీ రసం, పునర్నవాది గుగ్గులు, లక్షాదిగుగ్గులు.

బాహ్యప్రయోగం - మహానారాయణతైలం.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింట్

విశాఖపట్నం

ఫోన్ -9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.




విటమిన్ లోపం వల్ల నా వచ్చే ఆరోగ్యం సమస్య కోసం అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

Vitamin విటమిన్లు పోషక పదార్థాలు ఉపయోగాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

vitamin

vitamin పోషక పదార్థాలను విటమిన్లు అంటారు. ఇవి మన శరీరంలో జరిగే మార్పులలో కీలకపాత్ర వహిస్తాయి, ఈ పోషక పదార్థాలు మన ఆరోగ్యాన్ని సంక్రమంగా వుండేలా చేస్తాయి.

  • A-విటమిన్
  • B- విటమిన్ (B1, B2, B3, B5, B6,B9 మరియు B12)
  • C-విటమిన్
  • D-విటమిన్
  • E-విటమిన్
  • K -విటమిన్ అని వ్యవహరించడం జరుగుతుంది.

వీటి గురించి, వీటి వలన కలిగే అనారోగ్యాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వీటిని గురించి తెలుసుకుని ఈ విటమిన్లుగల ఆహారపదార్థాలను తీసుకుంటే ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు

A - vitamin విటమిన్

vitamin-A-telugu

మనం తీసుకునే ఆహారంలో A – విటమిన్ లోపిస్తే అంధత్వానికి దారితీస్తుంది. తక్కువ కాంతిలో లేదా రాత్రులు చూపు అనకపోవడం, హ్రస్వ, దూరదృష్టిలు కలగడం ఈ విటమిన్ లోపం వలనే జరుగుతుంది. చూడటానికి కళ్ళు కాంతివిహీనంగా కనబడటం, పొడిగా, గరుకు వుండటం దీని లక్షణాలు.

విటమిన్ – A ఉపయోగాలు:

  • కంటి చూపునకు తోడ్పడుతుంది
  • గర్భధారణకు ఉపయోగపడుతుంది
  • ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది
  • చర్మం కాంతివంతంగా ఉండటానికి అవసరం

A లభించే పదార్థాలు:

  • కేరెట్
  • తోటకూర
  • పాలకూర
  • ములగాకు
  • బాగా పండిన మామిడి
  • బొప్పాయి పండు
  • వెన్న
  • నెయ్యి పాలల్లో A-విటమిన్ అధికంగా ఉంటుంది.
  • B – vitamin విటమిన్

    vitamin-b-telugu

    మనం తీసుకునే ఆహారంలో B - విటమిన్ లోపించినట్లయితే- ఆకలి మందగించడం, కాళ్లూ చేతులు మెద్దుబారటం, గుండెదడ, అలసట, నీరసం వంటి లక్షణాలు కనబడతాయి.

    B లభించే పదార్థాలు

    • గింజలు
    • వేరుశనగ
    • మాంసము
    • గ్రుడ్లు
    • దంపుడు బియ్యం
    • ఉప్పుడు బియ్యంలో ఈ విటమిన్ అధికంగా ఉంటుంది.

    B2 - vitamin విటమిన్ ఇందులోనే 'రైబో లిన్' అనే విటమిన్

    దీని లోపం వలన నాలుకమీద పుండ్లు పడుట, నోటి పెదవులు మూలల్లో పగలడం, కళ్ళు మండటం, చర్మ పై పొలుసులు ఏర్పడటం జరుగుతుంది. ఆకుకూరలు, మొక్కల చిగుళ్ళు, పాలు, కాలేయము, గ్రుడ్లలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.

    'పిరిడాక్సిన్' అనే విటమిన్ ని B6 - విటమిన్ అంటారు. దీని లోపం వలన నోటిమూలల్లో పగలడం, రక్తహీనత, చిన్నపిల్లల్లో ఫిట్స్ వంటి వ్యాధులు ఏర్పడతాయి.

    B2 లభించే పదార్థాలు

    • తాజా కాయగూరలు
    • గ్రుడ్డుసొనలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది

    విటమిన్ B2 లోపం వల్ల కలిగే వ్యాధులు

    • కీటోసిస్: నోరు మూలల్లో పగిలి రక్తస్రావం జరగడం
    • గ్లాసైటిస్: నాలుక ఎర్రగా మారి పుండ్లు ఏర్పడి మెరవడం

    B3 - vitamin విటమిన్

    దీన్నే నియాసిన్ (Niacin or Nicotinic Acid) అని, నికోటిక్ ఆమ్లం, యాంటీ పెల్లాగ్రా విటమిన్ అని అంటారు.

    విటమిన్ B3 లభించే పదార్ధాలు

    • ఈస్ట్ అనే శిలీంధ్రం
    • వేరుశనగ
    • చిలగడదుంప
    • పాలు
    • గుడ్లు మొదలైనవి.

    B3 లోపం వల్ల కలిగే వ్యాధులు:

    • పెల్లాగ్రా: చర్మం వాచి పైపొర పొలుసుల్లా ఊడిపోవడం (DERMATITIS)
    • మతిమరుపు. జ్ఞాపకశక్తి లోపం (DEME-TI-G)
    • సోమ్నాంబులిజం: అంటే నిద్రలో లేచినడవడం
    • డయేరియా/అతిసార: ప్రపంచంలో అధికంగా చిన్న పిల్లల మరణానికి కారణం

    B5 - vitamin విటమిన్

    దీన్ని పాంటోథినిక్ ఆమ్లం (Pantothenic Acid) అంటారు విటమిన్

    B5 లభించే పదార్థాలు

    • చిలగడదుంప,
    • ఈస్ట్,
    • వేరుశనగ విటమిన్ B5 ఉపయోగాలు:
    • కార్బోహైడ్రేట్స్, ప్రొ
    • టీన్స్
    • ఫ్యాట్స్ జీవక్రియ

    విటమిన్ B5 లోపం వల్ల కలిగే వ్యాధులు

    • కంటి నొప్పి

    విటమిన్ B6

    దాన్ని పైరిడాక్సిన్ (Pyridoxine) అని, యాంటీ ఎనీమియా విటమిన్ (రక్తహీనత నిరోధక విటమిన్) అని అంటారు.

    విటమిన్ B6 లభించే పదార్థాలు

    • పప్పులు

    విటమిన్ B6 ఉపయోగాలు

    • ప్రొటీన్ల జీవక్రియ
    • హిమోగ్లోబిన్ (HB), ప్రతి రక్షకాల తయారీ

    విటమిన్ B6 లోపం వల్ల కలిగే వ్యాధులు

    • రక్తహీనత
    • పాలిచ్చే తల్లుల్లో B6 లోపం ఎక్కువ.
    • ఆర్ బీసీల సంఖ్య తగ్గడం. దీన్ని మైక్రోసైటిక్ ఎనీమియాగా

    విటమిన్ B9 (Vitamin B9)

    దీనిని ఫోలిక్ ఆమ్లం (Folic Acid) అని, ఫోలేట్ అని అంటారు.

    విటమిన్ B12 (Vitamin B12)

    దీని లోపం వలన… విపరీతమైన రక్త హీనత ఏర్పడుతుంది. కేంద్ర నాడీమండలం సక్రమంగా పనిచేయాలంటే ఈ విటమిన్ ఎంతో

    B12 లభించే పదార్థాలు

    • పాలు మాంసము
    • కాలేయము
    • మొదలైన వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది.

    C - vitamin

    vitamin-c-telugu

    మనం తీసుకునే ఆహారంలో C - విటమిన్ లోపం వలన జలుబు మొదలుకుని తీవ్రమైన అంటువ్యాధుల వరకూ గురికావడం జరుగుతుంది. దీని లోపం వలన నోట్లో పుండు పడటం, పంటి చిగుళ్లనుండి రక్తం కారడం, దంతాలు కదలడం... చర్మం క్రిందనుండే కేశనాళాలు చిట్లడం, తల తిరుగుతున్నట్లు, వాంతి వస్తున్నట్లుండటం జరుగుతుంది.

    C లభించే పదార్థాలు

    •  నిమ్మ
    • నారింజ
    • టమోటా
    • ఉసిరి
    • బొప్పాయి
    • జామ
    • ఆకుపచ్చని కాయగూరల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది.

    విటమిన్ C ఉపయోగాలు:

    •  కొల్లాజెన్ అనే ప్రొటీన్ తయారీ
    • విరిగిన ఎముకలు అతికించడం
    • గాయాలను మాన్పడం
    • కోల్పోయిన భాగాలను తిరిగి అతికించడం
    • వైరస్ నిరోధకం
    • గుండె లయను నియంత్రించడం
    • క్యాన్సర్/యాంటీ ఆక్సిడెంట్
    • వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
    • ఐరన్ శోషణ, రక్త ఉత్పత్తి
    • కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

    విటమిన్ C లోపం వల్ల కలిగే వ్యాధులు

    స్కర్వీ(Scurvy): చిగుళ్లు వాచి రక్తస్రావం కరగడం, ఎముకలు, కండరాల నొప్పి, చర్మం పగలడం

    D - vitamin

    vitamin-d-telugu

    చిన్నపిల్లల్లో ఈ విటమిన్ లోపం వలన 'రికేట్స్' అనే వ్యాధి వస్తుంది. దీనివలన మణికట్టు దగ్గర వాపు, దొడ్డికాళ్ళు ఏర్పడతాయి. పెద్దవారిలో ఎముకల బలం కోల్పోవడం... పెళుసుబారి సులువుగా విరగడం జరుగుతుంది.

    విటమిన్ – D లోపం వలన కలిగే వ్యాధులు

    •  చిన్న పిల్లల్లో రికెట్స్ (Rickets)
    • Pigeon Chest (కపోత వక్షం)
    • E - vitamin

      vitamin-E-telugu

      మనం తీసుకునే ఆహారంలో E- విటమిన్ లోపం వలన ముఖ్యంగా పురుషులలో బీజకణాల అభివృద్ధి సరిగా లేకపోవడం, ఆడవారిలో గర్భస్రావాలు కావడం జరుగుతుంది.

      పళ్ళు, కూరగాయలు, విత్తనాలు, సూర్యకాంతపు మొక్క గింజలు, ప్రత్తిగింజలు… కుసుమ నూనే… గింజలనుండి తీసిన నూనె, మాంసములలో ఈ విటమిన్ ఎక్కువగా మనకు లభ్యమవుతుంది.

      E - vitamin

      vitamin-d-telugu

      ఈ విటమిన్ లోపం వలన రక్తం తొందరగా గడ్డ కట్టదు. ఆపరేషన్ చేసే సమయాల్లో డాక్టర్లు ఈ విటమిన్ రోగికి ఇవ్వడం జరుగుతుంది. పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన ఈ విటమిన్ లభిస్తుంది.

      పైన చెప్పిన విటమిన్ల లోపాలు లేకుండా తగిన ఆహారం తీసుకుంటే దాదాపుగా ఏ వ్యాధులు వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా ఆకుకూరలు, పాలు, గ్రుడ్లు… వీటితో పాటు ఏ సీజన్లో వచ్చే పళ్ళను ఆ సీజన్లో ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఒకే రకమైన ఆహారం తీసుకుంటున్నా అన్ని విటమిన్లు మనకు లభ్యంకావు. రోజూ విభిన్నంగా ఆహారం తీసుకుంటుంటే మన శరీరానికి అన్ని రకాల ఖనిజ, పోషక పదార్థాలు లభ్యమవుతాయి.

      ⁠⁠⁠⁠⁠ 💢విటమిన్లు వాటి ఉపయోగాలు ...💢


      🔅¤  విటమిన్‌ల పుట్టు పూర్వోత్తరాలు 18వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి.


      🔅¤  విటమిన్‌లు మానవ శరీరానికి ఆవశ్యకమైన సూక్ష్మ పోషకాలు.


      🔅¤  1912వ సంవత్సరంలో H.G. హాప్‌కిన్స్ అనే శాస్త్రవేత్త పాలలో పెరుగుదలకు కావలసిన పదార్థాన్ని గుర్తించి దాన్ని 'సహాయ లేదా అదనపు కారకం' అని తెలిపారు.


      🔅¤  ఇదే సంవత్సరంలో 'ఫంక్ అనే శాస్త్రవేత్త 'బెరిబెరి వ్యాధిని నిరోధించే పదార్థం బియ్యం పొట్టు (తవుడు)లో ఉందని కనుక్కున్నారు.


      🔅ఈ పదార్థం రసాయన నిర్మాణాన్ని బట్టి దీనికి 'వైటమైన్' (Vitamine - Vital Amine) అని పేరు పెట్టారు.


      🔅¤  ఆ తర్వాత కనుక్కున్న ఇలాంటి అనేక పదార్థాలు రసాయనికంగా వైటమైన్‌ని పోలి ఉండకపోవడం వల్ల 'వైటమైన్' అనే పేరును 'విటమిన్‌'గా మార్చారు.


      🔅¤  విటమిన్‌లను మొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త H.G. హాప్‌కిన్స్ (1912)


      🔅¤  విటమిన్‌లకు మొదటిసారిగా పేరుపెట్టిన శాస్త్రవేత్త ఫంక్ (1912)


      🔅¤  పూర్తిగా రసాయన స్వభావాన్ని తెలుసుకోలేని కాలంలో విటమిన్‌లను ఆంగ్ల వర్ణమాలలో A B C D E K అని గుర్తించారు. 

       

      🌀ద్రావణీయత ఆధారంగా విటమిన్‌లను రెండు ప్రధాన వర్గాలుగా విభజించారు. 

      అవి


      🔅1. కొవ్వులో కరిగే విటమిన్‌లు


      🔅2. నీటిలో కరిగే విటమిన్‌లు.


      🔅కొవ్వులో కరిగే విటమిన్‌లు: A,D,E,K


       💢విటమిన్-A


      🍥దీన్ని మొదటిసారిగా మాక్ కోలమ్ గుర్తించారు. దీని రసాయనిక నామం- రెటినాల్. ఇది కంటిచూపునకు అవసరం.


      🍥¤  లభించే పదార్థాలు: క్యారెట్, టొమాటో, గుమ్మడి, బచ్చలి, తోటకూర లాంటి కూరగాయల్లో, పాలు, వెన్న, గుడ్లు, పెరుగు, షార్క్ చేపల కాలేయం నుంచి తీసిన నూనెలలో, బొప్పాయి, మామిడి లాంటి పండ్లలో అధిక మొత్తాల్లో లభిస్తుంది.


      🍥¤  జంతు సంబంధమైన ఆహార పదార్థాల్లో ఇది నేరుగాను, వృక్ష సంబంధమైన ఆహార పదార్థాల్లో ఇది 'కెరాటిన్ అనే మిశ్రమం రూపంలో లభిస్తుంది.


      🌀విటమిన్ 'ఎ' ఉపయోగాలు:


      🍥¤  సాధారణ కంటిచూపునకు, కంటి సంబంధ వ్యాధులు సోకకుండా ఉండటానికి.


      🍥¤  అస్థిపంజర వ్యవస్థ పెరుగుదలకు, ఈ వ్యవస్థకు వ్యాధులు సోకకుండా ఉండటానికి.


      🍥¤  రెటీనాలోని దండాలు (రొడాప్సిన్), కోనుల (ఐడాప్సిన్)లో దృష్టి వర్ణకాలు ఏర్పడటానికి.


      🍥¤  శరీరానికి వ్యాధి సంక్రమణ ప్రతికూలత కలిగించడానికి సహాయపడుతుంది. 

       


      💢విటమిన్ 'ఎ' లోపం వల్ల కలిగే వ్యాధులు:అవగాహనా కోశం నవీన్ సలహాలు 


      🍥¤  రేచీకటి/ నైట్ బ్త్లెండ్‌నెస్/ నిక్టలోపియా: ఈ వ్యాధితో బాధపడేవారు తక్కువ వెలుతురులో, రాత్రిపూట వస్తువులను చూడలేరు.


      🍥¤  జీరాఫ్‌థాల్మియా / పొడికళ్లు: కంటిలోని అశ్రుగ్రంథులు అశ్రువులను ఉత్పత్తి చేయవు. ఫలితంగా కంటిపొర

      (కంజెక్టివా) పొడిగా అవుతుంది.


      🍥¤  పోషకాహార అంధత్వం: పిల్లల్లో పోషకాహార (విటమిన్ ఎ) లోపం వల్ల కంటి ముందుభాగంలో ఉండే శుక్లపటలం (కార్నియా) అనే పారదర్శకమైన పొర మెత్తగా అయ్యి, పగులుతుంది. దీనివల్ల దృష్టి పోయి శాశ్వత అంధత్వం కలుగుతుంది.


      🍥¤  చర్మం పొలుసుల్లా, గరుకుగా చిన్న చిన్న సూక్ష్మాంకురాలతో కప్పబడి, గోదురకప్ప చర్మంలా కనిపిస్తుంది.


      🍥¤  విటమిన్ 'ఎ' లోపం ప్రత్యుత్పత్తి చర్యల మీద కూడా ప్రభావం చూపుతుంది.


      🍥¤  కలర్ బ్త్లెండ్‌నెస్ / వర్ణ దృష్టిలోపం: రెటీనాలోని కోన్‌లలో ఉండే దృష్టి వర్ణకాల లోపం వల్ల ఎరుపు, ఆకుపచ్చ రంగుల మధ్య తేడాలను గుర్తించలేరు.

      🍥శరీరంలో విటమిన్ 'ఎ'ను 6 నుంచి 9 నెలల వరకు నిల్వచేయవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ పోషకాహార సంస్థ (NIN, హైదరాబాద్) విటమిన్ 'ఎను పాఠశాలల్లో చదివే పిల్లలకోసం ప్రతి ఆర్నెళ్లకోసారి పెద్దమొత్తాల్లో సరఫరా చేస్తుంది.


      🍥¤  విటమిన్ 'ఎ'ను 'యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్ / జీరాఫ్తాల్మియా నివారక విటమిన్' అని కూడా పిలుస్తారు. 

       

       

       💢విటమిన్ - D


      🍥¤  రసాయన నామం: కాల్సిఫెరాల్


      🍥¤  ఇతర పేర్లు: యాంటి రాకెటిక్ విటమిన్ / హార్మోన్‌లాంటి విటమిన్/ ఫ్రీ విటమిన్


      🍥¤  కాల్షియం, ఫాస్పరస్‌లను పేగు శోషణం చేసుకొని వాటిని ఎముకల్లో నిల్వ చేయడానికి (అస్థుల ఖణిజీకృతం)

      విటమిన్ D సహాయపడుతుంది.


      🍥¤  సూర్యరశ్మి వల్ల చర్మం లోపల ఉండే 'ఎర్గోస్టెరాల్, కొలెస్టెరాల్‌'లు విటమిన్ 'డి' గా మారతాయి.


      🍥¤  విటమిన్ 'డి' ప్రధానంగా ఎముకలు, దంతాలు ఏర్పడటానికి, అవి మామూలుగా పెరగడానికి అత్యవసరం.


      🍥¤ విటమిన్ 'డి' జంతు సంబంధ పదార్థాలైన పాలు, వెన్న, పెరుగు, గుడ్డులోని సొన, షార్క్ చేపల కాలేయ నూనెలలో లభిస్తుంది. ఇది కూరగాయలలో లభించదు.


      🌀విటమిన్ 'డి' లోపం వల్ల:


      🍥¤ పిల్లల్లో (2 నెలల నుంచి 2 సంవత్సరాల వయసు) రికెట్స్ వ్యాధి కలుగుతుంది.

      రికెట్స్ వ్యాధి లక్షణాలు:


      🍥¤ ఎముకలు సక్రమంగా పెరగకపోవడం.


      🍥¤  పిల్లల్లో దొడ్డి కాళ్లు (విల్లు ఆకారపు కాళ్లు), ముట్టి కాళ్ళు (నిలబడినప్పుడు మోకాళ్లు రెండూ ఒకదానికొకటి తాకుతాయి) ఏర్పడటం.


      🍥¤  పిల్లల్లో మణికట్టులు వాయడం, దంతాలు ఆలస్యంగా పెరగడం. 

       

      🍥¤  పెద్దవారిలో విటమిన్ 'డి' లోపం వల్ల ఎముకలు లవణాలను అధికంగా కోల్పోయి తేలిక అయ్యి, సులభంగా విరుగుతాయి. ఈ లక్షణాన్నే 'ఆస్టియో మలేసియం' అంటారు.


      💢విటమిన్ - E


      🍥¤  రసాయన నామం: టోకోఫెరాల్


      🍥¤ ఇతర పేర్లు: వంధ్యత్వ ప్రతికూల విటమిన్ / యాంటిస్టెరిలిటిక్ విటమిన్.


      🍥¤ ఈ విటమిన్ ప్రత్యుత్పత్తి చర్యలకు సహాయపడుతుంది.


      🍥¤ ఈ విటమిన్ వృక్ష సంబంధమైన నూనెలలో, ముఖ్యంగా గోధుమ బీజ తైలం, పత్తి గింజలు, సోయా, చిక్కుడు, మొక్కజొన్న నూనెల్లో అధికంగా ఉంటుంది.


      🍥¤ విటమిన్ 'ఇ' లోపం వల్ల పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం కలుగుతాయి.


      🍥¤ దీని లోపం వల్ల ఎర్ర రక్తకణాల జీవితకాల పరిమితి కూడా తగ్గుతుంది.


      🍥¤ విటమిన్ 'ఇ' జీవరసాయన పదార్థాలు ఎక్కువ ఆక్సీకరణ చెంది అవి నశించకుండా కాపాడుతుంది. అందుకే దీన్ని 'యాంటీ ఆక్సిడెంట్ విటమిన్' అని కూడా పిలుస్తారు.


      💢విటమిన్ - K


      🍥¤ రసాయన నామం: నాపోక్వినోన్ లేదా ఫిల్లోక్వినోన్


      🍥¤ ఇది రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. 

       

      🍥¤ ఇతర పేర్లు: కోయాగులెంట్ విటమిన్ / యాంటీ హీమరేజిక్ విటమిన్


      🍥¤ ఇది ఆకుపచ్చటి ఆకుకూరల్లో, ఆవుపాలలో లభిస్తుంది.


      🍥¤ మానవుల పేగులో ఉండే బ్యాక్టీరియాలు ఈ విటమిన్‌ను సంశ్లేషణ చేస్తాయి.


      🍥¤ ఈ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డకట్టడానికి చాలావ్యవధి పడుతుంది. దీనివల్ల గాయాల నుంచి ఎక్కువ రక్తం స్రవిస్తుంది. ఈ లక్షణాన్నే 'హీమరేజిక్' అంటారు.


      🍥¤ ఆపరేషన్ చేసే ముందు రోగికి విటమిన్ 'కె' ఇస్తారు.


      🍥¤ సాధారణంగా మానవులలో విటమిన్ 'కె' లోపం కనిపించదు. కానీ అప్పుడే పుట్టిన శిశువులలో 'కె' విటమిన్ లోపం కనబడుతుంది.

      ధన్యవాదములు 🙏

      మీ నవీన్ నడిమింటి

      ఫోన్ 9703706660


    7, సెప్టెంబర్ 2021, మంగళవారం

    PCOS &అధిక బరువు సమస్య ఉన్న వాళ్ళు కోసం తీసుకోవలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

    ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు పెరుగుతూనే ఉన్నారా? పీసీఓఎస్ కావ‌చ్చు జాగ్ర‌త్త‌..!అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు (PCOS )

    ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు పెరుగుతూనే ఉన్నారా? పీసీఓఎస్ కావ‌చ్చు జాగ్ర‌త్త‌..! (PCOS In Telugu)

    పీసీఓఎస్ (PCOS) పాలీ సిస్టిక్ ఓవ‌రీ సిండ్రోమ్‌.. మ‌న దేశంలో ప్ర‌తి న‌లుగురు మ‌హిళ‌ల్లో ఒక‌రు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇది నేటిత‌రం అమ్మాయిలు, మ‌హిళ‌ల్లో వ‌స్తున్న స‌మ‌స్య‌.. దీనికి ప్ర‌ధాన కార‌ణం హార్మోన్ల అస‌మ‌తౌల్య‌త‌ (Harmonal imbalance). మహిళ‌ల శ‌రీరాల్లో ఉత్ప‌త్తి అయ్యే హార్మోన్లు ఈస్ట్రోజ‌న్‌, ప్రొజెస్టిరాన్‌. ఈ రెండిటి విడుద‌ల స‌మ‌తుల్యంగా ఉంటే మన ఆరోగ్యం బాగున్న‌ట్లే..

    అదే ఈ రెండింట్లో ఒక‌టి ఎక్కువ‌గా విడుద‌లై.. మ‌రొక‌టి త‌క్కువ‌గా విడుద‌లైతే హార్మోన్ల‌లో అస‌మ‌తౌల్య‌త ఏర్ప‌డి పీసీఓఎస్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది. ఈ స‌మ‌స్య వ‌చ్చిన వారిలో అండాశ‌యాల్లో నీటి తిత్తులు ఏర్ప‌డి అండాల విడుద‌ల‌ను అడ్డుకుంటాయి. దీనివ‌ల్ల పిల్ల‌లు పుట్టే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అందుకే ఈ స‌మ‌స్య ఎదుర‌య్యాక వీలైనంత తొంద‌ర‌గా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

     

    pcos in telugu1

    పీసీఓఎస్ అంటే ఏంటి? (What Is PCOS In Telugu)

    పీసీఓఎస్ అనేది పిల్ల‌లు పుట్టే వ‌య‌సులో ఉన్న ఆడ‌వారిలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌. మ‌న దేశంలో ఈ స‌మ‌స్య‌కి గురైన వారు ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రు ఉన్నారంటేనే ఈ స‌మ‌స్య తీవ్ర‌త ఎంతో అర్థం చేసుకోవ‌చ్చు. సాధార‌ణంగా స్త్రీల పున‌రుత్ప‌త్తి వ్యవ‌స్థ ఐదు హార్మ‌న్ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ ఐదు హార్మోన్లు సరైన స్థాయిలో విడుద‌లైతేనే సరైన ఆరోగ్యం మ‌న సొంత‌మ‌వుతుంది. వీటిలోని అస‌మ‌తౌల్య‌త వ‌ల్ల మ‌న అండాశ‌యాల్లో స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

    అండాశ‌యాల్లో అండాలు విడుద‌లయ్యే ఫాలిక‌ల్స్ చుట్టూ నీటి బుడ‌గ‌లు ఏర్ప‌డ‌డం వ‌ల్ల అండాలు విడుద‌ల కావు. దీంతో సంతాన‌లేమి స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. దీంతో పాటు హార్మోన్లలో స‌మ‌తుల్య‌త లేక‌పోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరిగిపోవ‌డం, అవాంఛిత రోమాలు, జుట్టు రాలిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

    పీసీఓఎస్‌కి కార‌ణాలేంటి? (Causes Of PCOS)

    పీసీఓఎస్ ఫ‌లానా కార‌ణంతోనే వ‌స్తుంద‌న్న రూలేమీ లేదు. కానీ కొన్ని కార‌ణాలు మాత్రం ఈ స‌మ‌స్య ఎదుర‌య్యేలా చేస్తాయి.. అవేంటంటే..

    అండాశ‌యాలు విడుద‌ల చేసే ఆండ్రోజ‌న్ హార్మోన్ ఎక్కువ‌గా విడుద‌ల కావ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.
    ఇన్సులిన్ ఎక్కువ‌గా విడుద‌ల కావ‌డం – మ‌న ర‌క్తంలోని చ‌క్కెర స్థాయుల‌ను నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్‌. మ‌న శ‌రీర క‌ణాలు ఇన్సులిన్‌కి రెసిస్టెంట్‌గా మారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయులు పెరుగుతుంటాయి.

    దీన్ని త‌ట్టుకోవ‌డానికి శ‌రీరం ఇన్సులిన్ మోతాదును పెంచుతుంది. త‌ద్వారా ర‌క్తంలో చ‌క్కెర స్థాయి మ‌రింత పెరుగుతుంది. ఇన్సులిన్ మోతాదు ఎక్కువ‌వ‌డం వ‌ల్ల సాధార‌ణంగా చాలా త‌క్కువ‌గా విడుద‌ల‌య్యే ఆండ్రోజ‌న్లు స్త్రీల‌లో ఎక్కువ‌గా ఉత్ప‌త్తవుతాయి.  జ‌న్యుప‌రంగా – మీ కుటుంబంలో పీసీఓఎస్ లేదా డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉంటే మీకూ పీసీఓఎస్ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

    pcos in telugu

    పీసీఓఎస్ ల‌క్ష‌ణాలేంటి? (Symptoms Of PCOS)

    సాధార‌ణంగా పీసీఓఎస్ ల‌క్ష‌ణాలు మొద‌టిసారి రుతుక్ర‌మం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి మెనోపాజ్ వ‌ర‌కూ ఎప్పుడైనా క‌నిపించ‌వ‌చ్చు. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ క‌నిపించ‌క‌పోయినా.. కొంత‌మందిలో కొన్ని ల‌క్ష‌ణాలు మాత్ర‌మే క‌నిపిస్తాయి. అవేంటంటే..

    – బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గేందుకు చాలా స‌మ‌యం ప‌ట్ట‌డం
    – మొటిమ‌లు ఎక్కువ‌గా రావ‌డం
    – హిర్సుటిజం ( శ‌రీరం, ముఖంపై ఎక్కువ‌గా జుట్టు రావ‌డం)
    – రుతుక్ర‌మం క్ర‌మం త‌ప్ప‌డం
    – జుట్టు రాలిపోవ‌డం
    – పులిపిర్లు రావ‌డం
    – పాలీసిస్టిక్ ఓవ‌రీస్ (అండాశ‌యాల్లో నీటి బుడ‌గ‌లు)
    – ఎక్కువ‌గా అల‌సిపోవ‌డం
    – మూడ్‌స్వింగ్స్‌

    పీసీఓఎస్ వ‌ల్ల స‌మ‌స్య‌లున్నాయా? (Other Problems Which Occur Because Of PCOS)

    పీసీఓఎస్ స‌మ‌స్య ఉంద‌ని తెలియ‌గానే చికిత్స తీసుకోవాలి. లేదంటే దీని వల్ల భ‌విష్య‌త్తులో పెద్ద స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. అవేంటంటే..
    – ర‌క్త‌స్రావం చాలా ఎక్కువ‌గా లేదా త‌క్కువ‌గా అవ్వ‌డం
    – డిప్రెష‌న్‌, ఈటింగ్ డిజార్డ‌ర్ వంటి మాన‌సిక సమ‌స్య‌లు
    – ఎండోమెట్రియ‌ల్ క్యాన్స‌ర్‌
    – డ‌యాబెటిస్‌, ర‌క్త‌పోటు
    – ఇన్‌ఫ‌ర్టిలిటీ
    – మెట‌బాలిక్ సిండ్రోమ్
    – నిద్ర‌లేమి
    – గ‌ర్భ‌స్రావం లేదా నెల‌లు నిండ‌కుండానే పిల్ల‌లు పుట్ట‌డం

    pcos in telugu2

    పీసీఓఎస్‌ని ఎలా గుర్తించాలి? (How To Diagnose PCOS)

    పీసీఓఎస్ స‌మ‌స్య ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే దాన్ని గుర్తించ‌డం కోసం ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం మంచిది. అందుకే కార‌ణం లేకుండా బ‌రువు పెరుగుతున్నా.. రుతుక్ర‌మంలో మార్పులు క‌నిపిస్తున్నా.. హిర్సుటిజం, యాక్నే వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నా పీసీఓఎస్ ఉందేమోన‌ని అనుమానించి పెల్విక్ స్కాన్ చేయించుకోవాలి. దీనివ‌ల్ల అండాశ‌యాలు, ఇత‌ర ప్ర‌త్యుత్పత్తి అవ‌య‌వాల ఆరోగ్యం గురించి తెలుసుకోవ‌చ్చు.

    pcos in telugu2

    పీసీఓఎస్‌కి చికిత్స ఎలా? (Treatment)

    పీసీఓఎస్ అనేది క్రానిక్ స‌మ‌స్య‌. అంటే స‌మ‌స్య వ‌చ్చిన త‌ర్వాత పూర్తిగా త‌గ్గేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. అయితే ఈలోపు స‌మ‌స్య‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. మంచి జీవ‌న‌శైలి, చ‌క్క‌టి మందుల సాయంతో ఈ స‌మ‌స్యను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ స‌మ‌స్య‌కు ఉన్న ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందంటే..

    కాంబినేష‌న్ థెర‌పీ (Combination Therapy)

    గ‌ర్భం రాకుండా చేసే బ‌ర్త్ కంట్రోల్ పిల్స్‌లో ఈస్ట్రోజ‌న్, ప్రొజెస్టిరాన్ స‌మాన స్థాయుల్లో ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఈస్ట్రోజ‌న్‌, ప్రొజెస్టిరాన్ స్థాయులు అదుపులో ఉండడంతో పాటు.. యాండ్రోజెన్ స్థాయులు అదుపులో ఉంటాయి. దీనివ‌ల్ల ఎండోమెట్రియ‌ల్ క్యాన్స‌ర్ ముప్పు త‌గ్గ‌డంతో పాటు ఎక్కువ ర‌క్త‌స్రావం, అవాంఛిత రోమాలు, మొటిమ‌లు వంటివి త‌గ్గుతాయి. రోజూ పిల్స్ తీసుకోవ‌డం క‌ష్టం అనుకుంటే స్కిన్ ప్యాచ్ లేదా వ‌జైన‌ల్ రింగ్ కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

    ప్రొజెస్టిన్ థెర‌పీ (Progestin Therapy)

    ప్రొజెస్టిన్ హార్మోన్ మాత్ర‌ల‌ను నెల‌లో ప‌ద్నాలుగు రోజులు తీసుకోవాలి. ఇలా రెండు నెల‌ల పాటు చేస్తే మీ శ‌రీరంలో హార్మోన్లు స‌మ‌తుల్యంగా మారే వీలుంటుంది. అయితే ఇది మ‌న శ‌రీరంలో యాండ్రోజ‌న్ల స్థాయిని త‌గ్గించ‌దు. అంతేకాదు.. ఇది గ‌ర్భం రావడాన్ని కూడా అడ్డుకోదు. అందుకే గ‌ర్భం కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌వారికి ఇది చ‌క్క‌టి ఎంపిక‌.

    పీసీఓఎస్ స‌మ‌స్య‌ తగ్గుముఖం పట్టాలంటే.. చికిత్సతో పాటు లైఫ్ స్టైల్ మార్పులు త‌ప్ప‌నిస‌రి. ఈ త‌ర‌హా మార్పుల వ‌ల్లే ఎక్కువ కాలం పాటు మందుల‌పై ఆధార‌ప‌డ‌కుండా పీసీఓఎస్ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునే వీలుంటుంది.

    పీసీఓఎస్‌ని త‌గ్గించేందుకు జీవ‌న‌శైలిలో ఎలాంటి మార్పులు అవ‌స‌రం? (Changes In Lifestyle To Reduce PCOS)

    pcos in telugu8

    ప్రొటీన్లు ఎక్కువ‌గా తీసుకోండి.. (Increase Intake Of Protein)

    పీసీఓఎస్ స‌మ‌స్య‌కు కార‌ణ‌మైన యాండ్రోజెన్ హార్మోన్ ర‌క్తంలో చ‌క్కెర‌లు ఎక్కువ‌య్యేలా చేస్తుంది. పైగా ఇన్సులిన్ ఎక్కువ‌గా ఉత్ప‌న్నమవుతుంది కూడా. అందుకే ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటే.. వీలైనంత మేర‌కు కార్బొహైడ్రేట్ల‌ను త‌గ్గించి ప్రొటీన్లు, ఫ్యాట్లు ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇది వీలుప‌డ‌క‌పోతే క‌నీసం కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లను స‌మాన మోతాదుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. మ‌నం తీసుకునే కార్బొహైడ్రేట్ల‌లో కూడా పీచు ప‌దార్థం ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. ఇవి మ‌న శ‌రీరంలోకి విడుద‌ల‌య్యే చ‌క్కెర‌ల‌ను నెమ్మ‌దించేలా చేస్తాయి. దీనివ‌ల్ల మెట‌బాలిజం మెరుగుప‌డుతుంది.

    గ్లైసిమిక్ ఇండెక్స్ గ‌మ‌నించండి. (Consider The Glycemic Index)

    గ్లైసిమిక్ ఇండెక్స్.. ఒక ప‌దార్థం మ‌న ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయుల‌ను పెంచే స్థాయిని ఆధారంగా చేసుకొని.. వివిధ ఆహార‌ప‌దార్థాలను కొలిచే ఇండెక్స్ ఇది. పీసీఓఎస్ ఉన్న‌వారికి ఇప్ప‌టికే ర‌క్తంలో చ‌క్కెర స్థాయులు ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే ఇలాంటివారు గ్లైసిమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉండే ఆహార ప‌దార్థాల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. 

     pcos in telugu7

    యాక్టివ్‌గా ఉండండి. (Be Active)

    పీసీఓఎస్‌ని దూరం చేసుకోవడానికి ఆహారంతో పాటు ప్ర‌ధానంగా యాక్టివ్ జీవ‌న‌శైలిని కొన‌సాగించ‌డం ఎంతో అవ‌స‌రం. దీనికోసం క‌నీసం వారానికి ఐదు రోజులు వ్యాయామం చేయ‌డంతో పాటు రోజూ క‌నీసం ప‌దివేల అడుగుల టార్గెట్‌ని చేరుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి. ఇంట్లో పనులు కూడా చేయ‌డం అల‌వాటు చేసుకోవ‌డంతో పాటు రోజూ కూర్చునే స‌మ‌యాన్ని త‌గ్గించుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలుంటాయి. 

    అంతేకాదు.. ఇలాంటివారికి పొట్ట‌, తొడ‌లు వంటి భాగాల్లో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోయే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది .కాబ‌ట్టి ఈ భాగాల‌కు ఎక్కువ వ్యాయామం అందించాలి. కార్డియో కోసం ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు చేస్తూనే కొవ్వు శాతాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

    దీనికోసం రెసిస్టెన్స్ ట్రైనింగ్‌, వెయిట్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తుండాలి. అయితే వ్యాయామం చేయ‌డం అవ‌స‌ర‌మే కానీ దీన్ని మ‌రీ ఎక్కువ‌గా కూడా చేయ‌కూడ‌దు. ఇలా వ్యాయామం ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల అడ్రిన‌ల్ గ్రంథులు ప్రేరేపిత‌మైన అడ్రిన‌లిన్ ఉత్పత్తి చేస్తాయి. ఇవి మీ స‌మ‌స్య‌ను మ‌రింత పెంచుతాయి. అందుకే వ్యాయామం కూడా మితంగా చేయాల్సి ఉంటుంది.

    కాఫీ మానేయండి. (Avoid Coffee)

    కొంతమంది ప‌రిశోధ‌కులు చేసిన అధ్య‌య‌నాల్లో భాగంగా.. కాఫీ పీసీఓఎస్ స‌మ‌స్య‌ను పెంచుతుంద‌ని గుర్తించార‌ట‌. అందుకే పీసీఓఎస్ స‌మ‌స్య తగ్గాలంటే కాఫీకి దూరంగా ఉండ‌డం మంచిద‌ని వారి స‌ల‌హా. మ‌రీ తాగ‌కుండా ఉండ‌లేక‌పోతే రోజంతా క‌లిపి ఒక క‌ప్పు తీసుకోవ‌డం మంచిది. కాఫీ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో స‌హ‌జంగా విడుద‌ల‌య్యే ఈస్ట్రోజ‌న్ ఉత్ప‌త్తి పెరిగి.. హార్మోన్ల అస‌మతౌల్య‌త స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. అందుకే కాఫీని వీలైనంత త‌క్కువ‌గా తీసుకోవ‌డం మంచిది.

    ఏయే ఆహార ప‌దార్థాలు తీసుకోకూడ‌దు? (Food Items That Should Not Be Taken)

    పీసీఓఎస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు కొన్ని ర‌కాల ఆహార‌ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. మ‌రికొన్ని ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పీసీఓఎస్ స‌మ‌స్య తొంద‌ర‌గా త‌గ్గే వీలుంటుంది. మ‌రి, ఏయే ఆహార ప‌దార్థాలు తీసుకోవ‌డం వ‌ల్ల ఈ పీసీఓఎస్ స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుందంటే..

    pcos in telugu3

    తీసుకోవాల్సిన ప‌దార్థాలు.. (Food Items That Should Be Taken)

    – ప్రాసెస్ చేయ‌ని ఆహార ప‌దార్థాలు
    – పీచు ప‌దార్థం ఎక్కువ‌గా ఉండే ఆహార ప‌దార్థాలు
    – సాల్మ‌న్‌, ట్యూనా, సార్డైన్‌లాంటి కొవ్వు ఎక్కువ‌గా ఉండే చేప‌లు
    – పాల‌కూర‌, కేల్ లాంటి ఆకుకూర‌లు
    – ముదురు ఎరుపు, న‌లుపు రంగులో ఉండే పండ్లు (ఉదా – ద్రాక్ష‌, బ్లాక్‌బెర్రీ, చెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు)
    – బ్రొకోలీ, కాలీఫ్ల‌వ‌ర్‌
    – బీన్స్‌, ప‌ప్పుధాన్యాలు
    – ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉండే నూనెలు ఉదా – కొబ్బ‌రి నూనె, ఆలివ్ నూనె
    – కొబ్బ‌రి, అవ‌కాడో లాంటి పండ్లు
    – పైన్ న‌ట్స్‌, బాదం, పిస్తా, వాల్‌న‌ట్స్..
    – డార్క్ చాక్లెట్ (త‌క్కువ మోతాదులో)
    – ప‌సుపు, దాల్చిన చెక్క పొడి వంటి మ‌సాలాలు
    వంటి ప‌దార్థాల‌న్నీ రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

    తీసుకోకూడ‌ని ప‌దార్థాలు (Ingredients That Should Not Be Taken)

    – వైట్ బ్రెడ్‌
    – మైదాతో చేసిన ప‌దార్థాలు
    – ఫ్రై చేసిన ప‌దార్థాలు
    – ఫాస్ట్ ఫుడ్‌
    – సోడాలు, కోలాలు, ఇత‌ర ఎన‌ర్జీ డ్రింకులు
    – ప్రాసెస్ చేసిన మాంసం
    – రెడ్‌మీట్‌, పంది మాంసం

    ఇంటిచికిత్స కూడా ప‌నిచేస్తుంది.. (Food To Treat PCOS Problem)

    పీసీఓఎస్‌ని త‌గ్గించేందుకు కేవ‌లం మందులు, జీవ‌న‌శైలిలో మార్పు మాత్ర‌మే కాదు.. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు కూడా ఉపయోగ‌ప‌డ‌తాయి. ఈ త‌ర‌హా ఆహార ప‌దార్థాల‌ను ఇంటి చికిత్స‌గా రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల పీసీఓఎస్ ముప్పు త‌గ్గుతుంది. దీనికోసం తీసుకోవాల్సిన ఆహార ప‌దార్థాలేంటో మీకు తెలుసా?

    1. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో.. (Apple Cider Vinegar)

    రోజూ కాస్త యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ని తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు మాత్ర‌మే కాదు.. పీసీఓఎస్ కూడా త‌గ్గే అవకాశాలు ఎక్కువ‌. ప్రతీ రోజూ గ్లాసు వేడి నీళ్ల‌లో రెండు టీస్పూన్లు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ క‌లిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. కొన్నాళ్లు ఈ మిశ్రమాన్ని ఉదయం మాత్ర‌మే తీసుకున్నా.. తర్వాత రోజుకి రెండు, మూడు సార్లు తీసుకోవ‌డం మంచిది.

    2. కొబ్బ‌రి నూనెతో.. (Coconut Oil)

    కొబ్బ‌రి నూనెను రోజూ తీసుకున్నా.. అందులోని గుణాలు మ‌న ఆరోగ్యం బాగుప‌డేలా.. హార్మోన్ల స్థాయి స‌మ‌తుల్య‌మ‌య్యేలా చేస్తుంది. పీసీఓఎస్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా రోజుకో టేబుల్ స్పూన్ వ‌ర్జిన్ కొకోన‌ట్ ఆయిల్‌ని తీసుకొని దాన్ని ఆహారంలో భాగంగా శ‌రీరానికి అందేలా చేయాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. అందుకే రోజూ స్మూతీల్లో, ఇత‌ర వంట‌కాల్లో క‌లిపి దీన్ని తీసుకోవ‌డం మంచిది.

    pcos in telugu 5

    3. గ్రీన్ టీ (Green Tea)

    గ్రీన్ టీ వ‌ల్ల ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న విషయం మ‌న‌కు తెలిసిందే. గ్రీన్ టీ పీసీఓఎస్ స‌మ‌స్య‌ను త‌గ్గించేందుకు సహ‌జ‌మైన ప‌దార్థంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ గ్రీన్ టీని రోజూ నాలుగైదు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలుంటాయి.

    4. క‌ల‌బంద ర‌సం (Aloe Vera Juice)

    క‌ల‌బంద ర‌సం వ‌ల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలుంటాయి. దీనికోసం మీరు చేయాల్సింద‌ల్లా మార్కెట్లో ల‌భించే క‌లబంద ర‌సం తాగ‌డం లేదా మీరే స్వ‌యంగా క‌ల‌బంద ఆకుల‌ను శుభ్రం చేసి.. తెల్ల‌ని గుజ్జులాంటి ప‌దార్థాన్ని తీసి జ్యూస్ చేసుకొని తాగ‌డం చేయాలి. ఇలా రోజూ ఉద‌యాన్నే ప‌రగ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. అండాశ‌యాల ప‌నితీరు మెరుగుప‌డుతుంది.

    5. తాటిబెల్లం (Thati Bellam)

    ర‌క్తంలోని చ‌క్కెర స్థాయుల‌ను మెయిన్‌టెయిన్ చేయ‌డానికి సాధార‌ణ చక్కెర‌, బెల్లాల కంటే తాటిబెల్లం చ‌క్క‌టి ఎంపిక‌. ఇది గ్లైసిమిక్ లెవ‌ల్లో ఉంటుంది కాబ‌ట్టి.. ఒకేసారిగా గ్లూకోజ్ విడుద‌ల చేయ‌కుండానే శ‌రీరానికి శ‌క్తిని అందిస్తూ ఉంటుంది. ఇందులోని క్యాల‌రీలు కూడా త‌క్కువ కాబ‌ట్టి.. దీన్ని రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవ‌చ్చు.

    pcos in telugu 6

    6. తేనె, దాల్చిన చెక్క (Honey And Cinnamon)

    తేనెలో ఎన్నో యాంటీబ్యాక్టీరియ‌ల్‌, యాంటీఫంగ‌ల్ గుణాలుంటాయి. ఇక దాల్చిన చెక్క బ‌రువు త‌గ్గేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనికోసం టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని.. టేబుల్ స్పూన్ తేనెతో క‌లిపి రోజూ ఉద‌యాన్నే తీసుకోవాలి. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల ఫ‌లితం క‌నిపిస్తుంది.

    7. లికోరైస్‌ రూట్‌ (Licorice Root)

    ఈ త‌ర‌హా మొక్క వేర్ల‌లో హార్మోన్ల‌ను కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. దీన్ని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోని ప్రొజెస్టిరాన్‌, ఈస్ట్రోజ‌న్ హార్మోన్ల స్థాయుల్లో మార్పు వ‌చ్చి అవి స‌మ‌తుల్యంగా మారతాయి. దీనివ‌ల్ల పీసీఓఎస్ స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. దీనికోసం ఈ వేరు పొడిని అర టీస్పూన్ తీసుకొని.. అందులో నీళ్లు క‌లిపి టీలా చేసుకొని క‌నీసం రోజుకోసారి తీసుకోవాల్సి ఉంటుంది.

    ఇవి కూడా చ‌ద‌వండి.

    ధన్యవాదములు 🙏

    మీ నవీన్ నడిమింటి

    విశాఖపట్నం

    ఫోన్ -9703706660


    6, సెప్టెంబర్ 2021, సోమవారం

    మూత్రం సమస్య పై అవగాహనా కోసం ఈ లింక్స్ లో చుడండి

    మూత్ర సమస్య ఉందా.. ఇలా చేస్తే తగ్గుతుందట..అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


    మూత్రపిండాలు రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తుంటాయి. ఆ వడపోత ప్రక్రియలో విడుదలయ్యే వ్యర్థ పదార్థమే మూత్రం. ఆ మూత్రం మూత్రాశయం (బ్లాడర్‌)లో నిల్వ ఉంటుంది. మూత్రాశయం సామర్థ్యం 300 మి.లీ నుంచి 600 మి.లీ దాకా ఉంటుంది. కానీ, చాలావరకు అది మూడింట రెండొంతులు నిండగానే మనం దానిని ఖాళీ చేసేస్తుంటాం.

        

    ప్రధానాంశాలు:

    • అనేక కారణాలతో అతి మూత్ర సమస్య
    • కొన్ని చిట్కాలతో సమస్య దూరం



    మూత్రాశయం నిండినప్పుడు ఆ విషయం నాడుల ద్వారా మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుంది. దీనిని మనం కంట్రోల్ చేయలేం. ఒక్కోసారి అతి మూత్రం సమస్య కూడా ఏర్పడుతుంది. దీంతో అకస్మాత్తుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కో సందర్భంలో దగ్గినా, తుమ్మినా మూత్రం లీకవుతూ ఉంటుంది.
    undefined
    అతి మూత్రం సమస్య ఎలా తెలుస్తుంది?

    ✿ ఒక మనిషి రోజులో 8 కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తే అతి మూత్రం సమస్య ఉన్నట్లే
    ✿ రాత్రిపూట ఒకటి, రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు మూత్రం పోసేందుకు నిద్ర లేవడం
    ✿ ఉన్నట్టుండి అర్జెంటుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రం ఆపులేకపోవడం
    ✿ లోదుస్తుల్లోనే మూత్రం లీక్ కావడం

    అతి చురుకైన మూత్రాశయం ఉన్నవారు వెంటనే రెస్ట్ రూమ్‌కు వెళ్లాలని భావిస్తుంటారు. ఒకవేళ వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలనే ఫీలింగ్ కలిగి ఉంటారు. అయితే అతి చురుకైన మూత్రాశయం కలిగిన వారిని వైద్యులు రెండు రకాలుగా విభజించారు. అందులో మొదటిది పొడి కలిగిన అతి చురుకైన మూత్రాశయం. రెండోది తడి కలిగిన అతి చురుకైన మూత్రాశయం.


    అతి మూత్రం సమస్య ఉన్న వారిలో మూడింట రెండొంతుల మంది పొడి రకాన్ని కలిగి ఉంటారు. వీళ్లకు మూత్రం లీక్ కావడం వంటి సమస్య ఉండదు. అదే తడి రకాన్ని కలిగి ఉండే వారిలో తెలియకుండానే మూత్రం లీక్ అవుతూ ఉంటుందని, ఒకవేళ కాకపోయినా లీక్ అయిందనే భావనలో ఉంటారని వైద్యులు చెప్తున్నారు.
    undefined
    దగ్గినా, తుమ్మినా మూత్రం చుక్కలుగా పడుతోందని పలువురు చెప్తుంటారు. ఈ సమస్య ఎక్కవగా ఆడవారిలో వస్తుంది. సుమారు 50 శాతం మంది మహిళలు జీవితంలో ఎప్పుడో అప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటారు. సాధారణంగా 40,50 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య కనపడుతుంది. ఊబకాయుల్లో, ఎక్కువమంది సంతానం కన్నవారిలో మూత్రాశయ కండరాలు బలహీనపడుతుంటాయి. దీంతో చిన్నపాటి ఒత్తిడికి గురైనా మూత్రం లీక్ అవుతుంది. అయితే మూత్రం తరచుగా లీక్ అవుతున్నా, నలుగురిలో వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నా వారికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీనికి రకరకాల సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. టెన్షన్ ఫ్రీ వజైనల్ టిప్ (టీవీటీ) పద్ధతిలో మూత్రమార్గం కింద టేపులాంటిది అతికిస్తారు. కొందరికి ల్యాప్రోస్కోపీ సాయంతో కాల్పోసస్పెన్షన్ కూడా చేస్తారు.
    గంటకు గంటకు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని కొందరు వాపోతుంటారు. ఇందుకు రకరకాల కారణాలు దోహదం చేయవచ్చు. ఇన్‌ఫెక్షన్ కారణంగా కూడా అతిగా మూత్రానికి వెళ్లాల్సి రావొచ్చు. ప్రొస్టేట్ ఉబ్బు, స్ట్రిక్చర్, స్టినోసిస్ వంటి సమస్యల్లో మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాదు. దీంతో మూత్రాశయం నిండి తరచుగా మూత్రం రావొచ్చు. క్షయ, మధుమేహం నియంత్రణలో లేకపోవడం వల్ల అతిమూత్రం సమస్య ఏర్పడుతుంది. కొందరిలో మూత్రాశయ కండరం అతిగా స్పందించడం కూడా ఈ సమస్యకు దారి తీయవచ్చు. మూత్రాశయం అతిగా స్పందించేవారికి యాంటీ కొలనర్జిక్ మందులు ఉపయోగపడతాయి. వీటిని దీర్ఘకాలం వాడాల్సి ఉంటుంది. దీని వల్ల దుష్ప్రభావాలు ఏమీ కలగవు. కొందరికి నోరు ఎండిపోవడం, మలబద్ధకం వంటివి తలెత్తే అవకాశం ఉంది.

    చాలా మంది వయసు పెరిగే కొద్దీ రాత్రిపూట మూత్రం ఎక్కువగా వస్తుందని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదని వైద్యులు చెప్తున్నారు. వయసుతో పాటు వచ్చే ప్రొస్టేట్ ఉబ్బు వంటి ఇతర సమస్యలే అతి మూత్రానికి కారణమవుతుందని వారు వెల్లడిస్తున్నారు. రాత్రి పూట మూత్రానికి ఎక్కువ సార్లు లేవడం వల్ల నిద్ర బాగా దెబ్బతింటుంది. దీంతో మరుసటి రోజు ఉదllయం బద్ధకంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. జీవనశైలి మార్చుకోవడంతో ఈ సమస్యకు మంచి ఫలితం కనపడుతుంది.


    ✿ రాత్రిపూట 7 గంటల తర్వాత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోకూడదు. చాలామంది రాత్రి పడుకునేముందు పాలు, మజ్జిగ వంటివి తాగుతుంటారు. దీంతో వారికి రాత్రిళ్లు ఎక్కువ మూత్రం వస్తుంది. మద్యం తీసుకోవడం కారణంగానూ మూత్రం ఎక్కువగా రావొచ్చు.
    ✿ అధిక బరువు తగ్గించుకోవాలి. ఎందుకంటే అధిక బరువు మూత్రాశయంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది
    ✿ దూమపానానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే పొగ కారణంగా మూత్రాశయంపై ఎక్కువ ప్రభావం పడి సమస్య ఏర్పడుతుంది
    ✿ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా అతిమూత్రం సమస్యను పరిష్కరించవచ్చు

    undefinedహైలురానిక్ యాసిడ్ వాడుతున్నారా..
    అతి మూత్రం సమస్యను పరిష్కరించే కొన్ని చిట్కాలు:

    ✿ ఉసిరి ఎక్కువగా తినాలి. ఎందుకంటే ఉసిరి మూత్రాశయాన్ని క్లియర్ చేయడంలో బాగా పనిచేస్తుంది. మూత్రాశయ కండరాలను ఉసిరి బలంగా చేస్తుంది. దీంతో సమస్య దూరమవుతుంది.

    ✿ కుంకుడు కాయలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా ఓ వారం చేస్తే అతి మూత్ర సమస్య కంట్రోల్‌లోకి వస్తుంది.
    ✿ జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వత వడగట్టి అందులో తేనెను కలిపి తీసుకోవాలి. టీలా వేడిగా తాగాలి. ఇలా రోజులో రెండు సార్లు ఈ టీ తాగితే అతి మూత్రం సమస్య తగ్గుతుంది
    ✿ ఉదయాన్నే కొన్ని తులసి ఆకులను మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకోవాలి. తరచూ ఇలా చేస్తే అతి మూత్రం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది
    ✿ నువ్వులు కూడా మూత్రాశయ సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి వీటిలో బెల్లం కలిపి లడ్డూల్లా చేసి ఈ సమస్యని దూరం చేసుకోండి.

    గమనిక: 
    ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

    మరింత సమాచారం తెలుసుకోండి

    రోజ ఇలా చేస్స అదుపులో ఉంటుంది


    డయాబెటీస్‌తో బాధపడుతున్నారా? అయితే, జాగ్రత్త. కరోనా వేళ.. మధుమేహ బాధితులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

        
    ఈ రోజుల్లో డయాబెటీస్ లేని వ్యక్తులను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, బిజీ లైఫ్, ఒత్తిడి వల్ల చిన్న వయస్సులోనే చాలామంది డయాబెటీస్ లేదా మధుమేహానికి గురవ్వుతున్నారు. వైరస్‌లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో డయాబెటీస్ బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాయమం నుంచి ఆహారపు అలవాట్లు వరకు ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఒళ్లు కదల్చకుండా ఒక చోటే కూర్చుంటే.. చాప కింద నీరులా చక్కెర వ్యాధి తన పని తాను చేసుకుపోతుంది. అవయవాలను దెబ్బతిస్తూ ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఏదైనా వైరస్ సోకితే చికిత్స కూడా క్లిష్టంగా మారుతుంది. అలాగే, వైరస్‌కు చికిత్స పొందిన తర్వాత బ్లాక్ ఫంగస్ ముప్పు కూడా డయాబెటీస్ రోగులకే ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి.. ఇక్కడ తెలిపిన డయాబెటీస్‌కు గల కారణాలను, జాగ్రత్తలను తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి.

    Representational Image
    ☀ దేశంలో డయాబెటీస్ విజృంభించడానికి మొదటి కారణం జీవనశైలిలో మార్పు.
    ☀ ఒకేచోట కూర్చుని ఉద్యోగం చేయాల్సి రావడం, శరీరానికి తగిన వ్యాయమం లేకపోవడం కూడా డయాబెటీస్‌కు దారి తీస్తోంది.
    ☀ స్థూలకాయం, పని ఒత్తిడి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.
    ☀ రోజూ 30 నుంచి 45 నిమిషాల నడక, జాగింగ్, ఈత, లేదా ఏదైనా వ్యాయామం చేయాలి.
    ☀ ఒకే చోట కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తుంటే ఒంట్లో ఇన్సులిన్ వినియోగం చక్కగా ఉంటుంది.
    ☀ మధుమేహం వస్తే అన్నం మానేసి, చపాతీలు మానేయడం ఒక్కటే మార్గమని భావిస్తారు. కానీ, అది సరైన విధానం కాదు.


    ☀ డయాబెటీస్ వస్తే స్వీట్లు, తీపి పదార్థాలకు, చివరికి పండ్లకు కూడా దూరంగా ఉండటం మంచిదే.
    ☀ మధుమేహానికి పథ్యాలు పాటించాల్సిన అవసరం లేదు. క్రమబద్ధంగా తింటే చాలు.
    ☀ ఆహారాన్ని ఒకేసారి కాకుండా దశల వారీగా తక్కువ తక్కువగా తీసుకోవాలి.
    ☀ పాలీష్ పట్టించని బియ్యాన్ని మాత్రమే వండుకుని తినాలి.
    ☀ గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరు ధాన్యాలు తీసుకోవాలి.


    ☀ కాయగూరలను, ఆకుకూరలను ఎక్కువగా తినాలి.
    ☀ వేళకు భోజనం చేయాలి. విందులు, ఉపవాసాలకు దూరంగా ఉండాలి.
    ☀ నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, యాపిల్‌ వంటి పండ్లు డయాబెటీస్‌ను అదుపులో ఉంచుతాయి.
    ☀ ఉదయం వేళ రాగి జావ తాగడం ఎంతో మంచిది.
    ☀ రోజు ఏదో ఒక రూపంలో మెంతులను తీసుకోవడం మరింత ఉత్తమం.