9, సెప్టెంబర్ 2021, గురువారం

విటమిన్ లోపం వల్ల నా వచ్చే ఆరోగ్యం సమస్య కోసం అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

Vitamin విటమిన్లు పోషక పదార్థాలు ఉపయోగాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

vitamin

vitamin పోషక పదార్థాలను విటమిన్లు అంటారు. ఇవి మన శరీరంలో జరిగే మార్పులలో కీలకపాత్ర వహిస్తాయి, ఈ పోషక పదార్థాలు మన ఆరోగ్యాన్ని సంక్రమంగా వుండేలా చేస్తాయి.

  • A-విటమిన్
  • B- విటమిన్ (B1, B2, B3, B5, B6,B9 మరియు B12)
  • C-విటమిన్
  • D-విటమిన్
  • E-విటమిన్
  • K -విటమిన్ అని వ్యవహరించడం జరుగుతుంది.

వీటి గురించి, వీటి వలన కలిగే అనారోగ్యాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వీటిని గురించి తెలుసుకుని ఈ విటమిన్లుగల ఆహారపదార్థాలను తీసుకుంటే ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు

A - vitamin విటమిన్

vitamin-A-telugu

మనం తీసుకునే ఆహారంలో A – విటమిన్ లోపిస్తే అంధత్వానికి దారితీస్తుంది. తక్కువ కాంతిలో లేదా రాత్రులు చూపు అనకపోవడం, హ్రస్వ, దూరదృష్టిలు కలగడం ఈ విటమిన్ లోపం వలనే జరుగుతుంది. చూడటానికి కళ్ళు కాంతివిహీనంగా కనబడటం, పొడిగా, గరుకు వుండటం దీని లక్షణాలు.

విటమిన్ – A ఉపయోగాలు:

  • కంటి చూపునకు తోడ్పడుతుంది
  • గర్భధారణకు ఉపయోగపడుతుంది
  • ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది
  • చర్మం కాంతివంతంగా ఉండటానికి అవసరం

A లభించే పదార్థాలు:

  • కేరెట్
  • తోటకూర
  • పాలకూర
  • ములగాకు
  • బాగా పండిన మామిడి
  • బొప్పాయి పండు
  • వెన్న
  • నెయ్యి పాలల్లో A-విటమిన్ అధికంగా ఉంటుంది.
  • B – vitamin విటమిన్

    vitamin-b-telugu

    మనం తీసుకునే ఆహారంలో B - విటమిన్ లోపించినట్లయితే- ఆకలి మందగించడం, కాళ్లూ చేతులు మెద్దుబారటం, గుండెదడ, అలసట, నీరసం వంటి లక్షణాలు కనబడతాయి.

    B లభించే పదార్థాలు

    • గింజలు
    • వేరుశనగ
    • మాంసము
    • గ్రుడ్లు
    • దంపుడు బియ్యం
    • ఉప్పుడు బియ్యంలో ఈ విటమిన్ అధికంగా ఉంటుంది.

    B2 - vitamin విటమిన్ ఇందులోనే 'రైబో లిన్' అనే విటమిన్

    దీని లోపం వలన నాలుకమీద పుండ్లు పడుట, నోటి పెదవులు మూలల్లో పగలడం, కళ్ళు మండటం, చర్మ పై పొలుసులు ఏర్పడటం జరుగుతుంది. ఆకుకూరలు, మొక్కల చిగుళ్ళు, పాలు, కాలేయము, గ్రుడ్లలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.

    'పిరిడాక్సిన్' అనే విటమిన్ ని B6 - విటమిన్ అంటారు. దీని లోపం వలన నోటిమూలల్లో పగలడం, రక్తహీనత, చిన్నపిల్లల్లో ఫిట్స్ వంటి వ్యాధులు ఏర్పడతాయి.

    B2 లభించే పదార్థాలు

    • తాజా కాయగూరలు
    • గ్రుడ్డుసొనలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది

    విటమిన్ B2 లోపం వల్ల కలిగే వ్యాధులు

    • కీటోసిస్: నోరు మూలల్లో పగిలి రక్తస్రావం జరగడం
    • గ్లాసైటిస్: నాలుక ఎర్రగా మారి పుండ్లు ఏర్పడి మెరవడం

    B3 - vitamin విటమిన్

    దీన్నే నియాసిన్ (Niacin or Nicotinic Acid) అని, నికోటిక్ ఆమ్లం, యాంటీ పెల్లాగ్రా విటమిన్ అని అంటారు.

    విటమిన్ B3 లభించే పదార్ధాలు

    • ఈస్ట్ అనే శిలీంధ్రం
    • వేరుశనగ
    • చిలగడదుంప
    • పాలు
    • గుడ్లు మొదలైనవి.

    B3 లోపం వల్ల కలిగే వ్యాధులు:

    • పెల్లాగ్రా: చర్మం వాచి పైపొర పొలుసుల్లా ఊడిపోవడం (DERMATITIS)
    • మతిమరుపు. జ్ఞాపకశక్తి లోపం (DEME-TI-G)
    • సోమ్నాంబులిజం: అంటే నిద్రలో లేచినడవడం
    • డయేరియా/అతిసార: ప్రపంచంలో అధికంగా చిన్న పిల్లల మరణానికి కారణం

    B5 - vitamin విటమిన్

    దీన్ని పాంటోథినిక్ ఆమ్లం (Pantothenic Acid) అంటారు విటమిన్

    B5 లభించే పదార్థాలు

    • చిలగడదుంప,
    • ఈస్ట్,
    • వేరుశనగ విటమిన్ B5 ఉపయోగాలు:
    • కార్బోహైడ్రేట్స్, ప్రొ
    • టీన్స్
    • ఫ్యాట్స్ జీవక్రియ

    విటమిన్ B5 లోపం వల్ల కలిగే వ్యాధులు

    • కంటి నొప్పి

    విటమిన్ B6

    దాన్ని పైరిడాక్సిన్ (Pyridoxine) అని, యాంటీ ఎనీమియా విటమిన్ (రక్తహీనత నిరోధక విటమిన్) అని అంటారు.

    విటమిన్ B6 లభించే పదార్థాలు

    • పప్పులు

    విటమిన్ B6 ఉపయోగాలు

    • ప్రొటీన్ల జీవక్రియ
    • హిమోగ్లోబిన్ (HB), ప్రతి రక్షకాల తయారీ

    విటమిన్ B6 లోపం వల్ల కలిగే వ్యాధులు

    • రక్తహీనత
    • పాలిచ్చే తల్లుల్లో B6 లోపం ఎక్కువ.
    • ఆర్ బీసీల సంఖ్య తగ్గడం. దీన్ని మైక్రోసైటిక్ ఎనీమియాగా

    విటమిన్ B9 (Vitamin B9)

    దీనిని ఫోలిక్ ఆమ్లం (Folic Acid) అని, ఫోలేట్ అని అంటారు.

    విటమిన్ B12 (Vitamin B12)

    దీని లోపం వలన… విపరీతమైన రక్త హీనత ఏర్పడుతుంది. కేంద్ర నాడీమండలం సక్రమంగా పనిచేయాలంటే ఈ విటమిన్ ఎంతో

    B12 లభించే పదార్థాలు

    • పాలు మాంసము
    • కాలేయము
    • మొదలైన వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది.

    C - vitamin

    vitamin-c-telugu

    మనం తీసుకునే ఆహారంలో C - విటమిన్ లోపం వలన జలుబు మొదలుకుని తీవ్రమైన అంటువ్యాధుల వరకూ గురికావడం జరుగుతుంది. దీని లోపం వలన నోట్లో పుండు పడటం, పంటి చిగుళ్లనుండి రక్తం కారడం, దంతాలు కదలడం... చర్మం క్రిందనుండే కేశనాళాలు చిట్లడం, తల తిరుగుతున్నట్లు, వాంతి వస్తున్నట్లుండటం జరుగుతుంది.

    C లభించే పదార్థాలు

    •  నిమ్మ
    • నారింజ
    • టమోటా
    • ఉసిరి
    • బొప్పాయి
    • జామ
    • ఆకుపచ్చని కాయగూరల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది.

    విటమిన్ C ఉపయోగాలు:

    •  కొల్లాజెన్ అనే ప్రొటీన్ తయారీ
    • విరిగిన ఎముకలు అతికించడం
    • గాయాలను మాన్పడం
    • కోల్పోయిన భాగాలను తిరిగి అతికించడం
    • వైరస్ నిరోధకం
    • గుండె లయను నియంత్రించడం
    • క్యాన్సర్/యాంటీ ఆక్సిడెంట్
    • వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
    • ఐరన్ శోషణ, రక్త ఉత్పత్తి
    • కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

    విటమిన్ C లోపం వల్ల కలిగే వ్యాధులు

    స్కర్వీ(Scurvy): చిగుళ్లు వాచి రక్తస్రావం కరగడం, ఎముకలు, కండరాల నొప్పి, చర్మం పగలడం

    D - vitamin

    vitamin-d-telugu

    చిన్నపిల్లల్లో ఈ విటమిన్ లోపం వలన 'రికేట్స్' అనే వ్యాధి వస్తుంది. దీనివలన మణికట్టు దగ్గర వాపు, దొడ్డికాళ్ళు ఏర్పడతాయి. పెద్దవారిలో ఎముకల బలం కోల్పోవడం... పెళుసుబారి సులువుగా విరగడం జరుగుతుంది.

    విటమిన్ – D లోపం వలన కలిగే వ్యాధులు

    •  చిన్న పిల్లల్లో రికెట్స్ (Rickets)
    • Pigeon Chest (కపోత వక్షం)
    • E - vitamin

      vitamin-E-telugu

      మనం తీసుకునే ఆహారంలో E- విటమిన్ లోపం వలన ముఖ్యంగా పురుషులలో బీజకణాల అభివృద్ధి సరిగా లేకపోవడం, ఆడవారిలో గర్భస్రావాలు కావడం జరుగుతుంది.

      పళ్ళు, కూరగాయలు, విత్తనాలు, సూర్యకాంతపు మొక్క గింజలు, ప్రత్తిగింజలు… కుసుమ నూనే… గింజలనుండి తీసిన నూనె, మాంసములలో ఈ విటమిన్ ఎక్కువగా మనకు లభ్యమవుతుంది.

      E - vitamin

      vitamin-d-telugu

      ఈ విటమిన్ లోపం వలన రక్తం తొందరగా గడ్డ కట్టదు. ఆపరేషన్ చేసే సమయాల్లో డాక్టర్లు ఈ విటమిన్ రోగికి ఇవ్వడం జరుగుతుంది. పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన ఈ విటమిన్ లభిస్తుంది.

      పైన చెప్పిన విటమిన్ల లోపాలు లేకుండా తగిన ఆహారం తీసుకుంటే దాదాపుగా ఏ వ్యాధులు వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా ఆకుకూరలు, పాలు, గ్రుడ్లు… వీటితో పాటు ఏ సీజన్లో వచ్చే పళ్ళను ఆ సీజన్లో ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఒకే రకమైన ఆహారం తీసుకుంటున్నా అన్ని విటమిన్లు మనకు లభ్యంకావు. రోజూ విభిన్నంగా ఆహారం తీసుకుంటుంటే మన శరీరానికి అన్ని రకాల ఖనిజ, పోషక పదార్థాలు లభ్యమవుతాయి.

      ⁠⁠⁠⁠⁠ 💢విటమిన్లు వాటి ఉపయోగాలు ...💢


      🔅¤  విటమిన్‌ల పుట్టు పూర్వోత్తరాలు 18వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి.


      🔅¤  విటమిన్‌లు మానవ శరీరానికి ఆవశ్యకమైన సూక్ష్మ పోషకాలు.


      🔅¤  1912వ సంవత్సరంలో H.G. హాప్‌కిన్స్ అనే శాస్త్రవేత్త పాలలో పెరుగుదలకు కావలసిన పదార్థాన్ని గుర్తించి దాన్ని 'సహాయ లేదా అదనపు కారకం' అని తెలిపారు.


      🔅¤  ఇదే సంవత్సరంలో 'ఫంక్ అనే శాస్త్రవేత్త 'బెరిబెరి వ్యాధిని నిరోధించే పదార్థం బియ్యం పొట్టు (తవుడు)లో ఉందని కనుక్కున్నారు.


      🔅ఈ పదార్థం రసాయన నిర్మాణాన్ని బట్టి దీనికి 'వైటమైన్' (Vitamine - Vital Amine) అని పేరు పెట్టారు.


      🔅¤  ఆ తర్వాత కనుక్కున్న ఇలాంటి అనేక పదార్థాలు రసాయనికంగా వైటమైన్‌ని పోలి ఉండకపోవడం వల్ల 'వైటమైన్' అనే పేరును 'విటమిన్‌'గా మార్చారు.


      🔅¤  విటమిన్‌లను మొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త H.G. హాప్‌కిన్స్ (1912)


      🔅¤  విటమిన్‌లకు మొదటిసారిగా పేరుపెట్టిన శాస్త్రవేత్త ఫంక్ (1912)


      🔅¤  పూర్తిగా రసాయన స్వభావాన్ని తెలుసుకోలేని కాలంలో విటమిన్‌లను ఆంగ్ల వర్ణమాలలో A B C D E K అని గుర్తించారు. 

       

      🌀ద్రావణీయత ఆధారంగా విటమిన్‌లను రెండు ప్రధాన వర్గాలుగా విభజించారు. 

      అవి


      🔅1. కొవ్వులో కరిగే విటమిన్‌లు


      🔅2. నీటిలో కరిగే విటమిన్‌లు.


      🔅కొవ్వులో కరిగే విటమిన్‌లు: A,D,E,K


       💢విటమిన్-A


      🍥దీన్ని మొదటిసారిగా మాక్ కోలమ్ గుర్తించారు. దీని రసాయనిక నామం- రెటినాల్. ఇది కంటిచూపునకు అవసరం.


      🍥¤  లభించే పదార్థాలు: క్యారెట్, టొమాటో, గుమ్మడి, బచ్చలి, తోటకూర లాంటి కూరగాయల్లో, పాలు, వెన్న, గుడ్లు, పెరుగు, షార్క్ చేపల కాలేయం నుంచి తీసిన నూనెలలో, బొప్పాయి, మామిడి లాంటి పండ్లలో అధిక మొత్తాల్లో లభిస్తుంది.


      🍥¤  జంతు సంబంధమైన ఆహార పదార్థాల్లో ఇది నేరుగాను, వృక్ష సంబంధమైన ఆహార పదార్థాల్లో ఇది 'కెరాటిన్ అనే మిశ్రమం రూపంలో లభిస్తుంది.


      🌀విటమిన్ 'ఎ' ఉపయోగాలు:


      🍥¤  సాధారణ కంటిచూపునకు, కంటి సంబంధ వ్యాధులు సోకకుండా ఉండటానికి.


      🍥¤  అస్థిపంజర వ్యవస్థ పెరుగుదలకు, ఈ వ్యవస్థకు వ్యాధులు సోకకుండా ఉండటానికి.


      🍥¤  రెటీనాలోని దండాలు (రొడాప్సిన్), కోనుల (ఐడాప్సిన్)లో దృష్టి వర్ణకాలు ఏర్పడటానికి.


      🍥¤  శరీరానికి వ్యాధి సంక్రమణ ప్రతికూలత కలిగించడానికి సహాయపడుతుంది. 

       


      💢విటమిన్ 'ఎ' లోపం వల్ల కలిగే వ్యాధులు:అవగాహనా కోశం నవీన్ సలహాలు 


      🍥¤  రేచీకటి/ నైట్ బ్త్లెండ్‌నెస్/ నిక్టలోపియా: ఈ వ్యాధితో బాధపడేవారు తక్కువ వెలుతురులో, రాత్రిపూట వస్తువులను చూడలేరు.


      🍥¤  జీరాఫ్‌థాల్మియా / పొడికళ్లు: కంటిలోని అశ్రుగ్రంథులు అశ్రువులను ఉత్పత్తి చేయవు. ఫలితంగా కంటిపొర

      (కంజెక్టివా) పొడిగా అవుతుంది.


      🍥¤  పోషకాహార అంధత్వం: పిల్లల్లో పోషకాహార (విటమిన్ ఎ) లోపం వల్ల కంటి ముందుభాగంలో ఉండే శుక్లపటలం (కార్నియా) అనే పారదర్శకమైన పొర మెత్తగా అయ్యి, పగులుతుంది. దీనివల్ల దృష్టి పోయి శాశ్వత అంధత్వం కలుగుతుంది.


      🍥¤  చర్మం పొలుసుల్లా, గరుకుగా చిన్న చిన్న సూక్ష్మాంకురాలతో కప్పబడి, గోదురకప్ప చర్మంలా కనిపిస్తుంది.


      🍥¤  విటమిన్ 'ఎ' లోపం ప్రత్యుత్పత్తి చర్యల మీద కూడా ప్రభావం చూపుతుంది.


      🍥¤  కలర్ బ్త్లెండ్‌నెస్ / వర్ణ దృష్టిలోపం: రెటీనాలోని కోన్‌లలో ఉండే దృష్టి వర్ణకాల లోపం వల్ల ఎరుపు, ఆకుపచ్చ రంగుల మధ్య తేడాలను గుర్తించలేరు.

      🍥శరీరంలో విటమిన్ 'ఎ'ను 6 నుంచి 9 నెలల వరకు నిల్వచేయవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ పోషకాహార సంస్థ (NIN, హైదరాబాద్) విటమిన్ 'ఎను పాఠశాలల్లో చదివే పిల్లలకోసం ప్రతి ఆర్నెళ్లకోసారి పెద్దమొత్తాల్లో సరఫరా చేస్తుంది.


      🍥¤  విటమిన్ 'ఎ'ను 'యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్ / జీరాఫ్తాల్మియా నివారక విటమిన్' అని కూడా పిలుస్తారు. 

       

       

       💢విటమిన్ - D


      🍥¤  రసాయన నామం: కాల్సిఫెరాల్


      🍥¤  ఇతర పేర్లు: యాంటి రాకెటిక్ విటమిన్ / హార్మోన్‌లాంటి విటమిన్/ ఫ్రీ విటమిన్


      🍥¤  కాల్షియం, ఫాస్పరస్‌లను పేగు శోషణం చేసుకొని వాటిని ఎముకల్లో నిల్వ చేయడానికి (అస్థుల ఖణిజీకృతం)

      విటమిన్ D సహాయపడుతుంది.


      🍥¤  సూర్యరశ్మి వల్ల చర్మం లోపల ఉండే 'ఎర్గోస్టెరాల్, కొలెస్టెరాల్‌'లు విటమిన్ 'డి' గా మారతాయి.


      🍥¤  విటమిన్ 'డి' ప్రధానంగా ఎముకలు, దంతాలు ఏర్పడటానికి, అవి మామూలుగా పెరగడానికి అత్యవసరం.


      🍥¤ విటమిన్ 'డి' జంతు సంబంధ పదార్థాలైన పాలు, వెన్న, పెరుగు, గుడ్డులోని సొన, షార్క్ చేపల కాలేయ నూనెలలో లభిస్తుంది. ఇది కూరగాయలలో లభించదు.


      🌀విటమిన్ 'డి' లోపం వల్ల:


      🍥¤ పిల్లల్లో (2 నెలల నుంచి 2 సంవత్సరాల వయసు) రికెట్స్ వ్యాధి కలుగుతుంది.

      రికెట్స్ వ్యాధి లక్షణాలు:


      🍥¤ ఎముకలు సక్రమంగా పెరగకపోవడం.


      🍥¤  పిల్లల్లో దొడ్డి కాళ్లు (విల్లు ఆకారపు కాళ్లు), ముట్టి కాళ్ళు (నిలబడినప్పుడు మోకాళ్లు రెండూ ఒకదానికొకటి తాకుతాయి) ఏర్పడటం.


      🍥¤  పిల్లల్లో మణికట్టులు వాయడం, దంతాలు ఆలస్యంగా పెరగడం. 

       

      🍥¤  పెద్దవారిలో విటమిన్ 'డి' లోపం వల్ల ఎముకలు లవణాలను అధికంగా కోల్పోయి తేలిక అయ్యి, సులభంగా విరుగుతాయి. ఈ లక్షణాన్నే 'ఆస్టియో మలేసియం' అంటారు.


      💢విటమిన్ - E


      🍥¤  రసాయన నామం: టోకోఫెరాల్


      🍥¤ ఇతర పేర్లు: వంధ్యత్వ ప్రతికూల విటమిన్ / యాంటిస్టెరిలిటిక్ విటమిన్.


      🍥¤ ఈ విటమిన్ ప్రత్యుత్పత్తి చర్యలకు సహాయపడుతుంది.


      🍥¤ ఈ విటమిన్ వృక్ష సంబంధమైన నూనెలలో, ముఖ్యంగా గోధుమ బీజ తైలం, పత్తి గింజలు, సోయా, చిక్కుడు, మొక్కజొన్న నూనెల్లో అధికంగా ఉంటుంది.


      🍥¤ విటమిన్ 'ఇ' లోపం వల్ల పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం కలుగుతాయి.


      🍥¤ దీని లోపం వల్ల ఎర్ర రక్తకణాల జీవితకాల పరిమితి కూడా తగ్గుతుంది.


      🍥¤ విటమిన్ 'ఇ' జీవరసాయన పదార్థాలు ఎక్కువ ఆక్సీకరణ చెంది అవి నశించకుండా కాపాడుతుంది. అందుకే దీన్ని 'యాంటీ ఆక్సిడెంట్ విటమిన్' అని కూడా పిలుస్తారు.


      💢విటమిన్ - K


      🍥¤ రసాయన నామం: నాపోక్వినోన్ లేదా ఫిల్లోక్వినోన్


      🍥¤ ఇది రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. 

       

      🍥¤ ఇతర పేర్లు: కోయాగులెంట్ విటమిన్ / యాంటీ హీమరేజిక్ విటమిన్


      🍥¤ ఇది ఆకుపచ్చటి ఆకుకూరల్లో, ఆవుపాలలో లభిస్తుంది.


      🍥¤ మానవుల పేగులో ఉండే బ్యాక్టీరియాలు ఈ విటమిన్‌ను సంశ్లేషణ చేస్తాయి.


      🍥¤ ఈ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డకట్టడానికి చాలావ్యవధి పడుతుంది. దీనివల్ల గాయాల నుంచి ఎక్కువ రక్తం స్రవిస్తుంది. ఈ లక్షణాన్నే 'హీమరేజిక్' అంటారు.


      🍥¤ ఆపరేషన్ చేసే ముందు రోగికి విటమిన్ 'కె' ఇస్తారు.


      🍥¤ సాధారణంగా మానవులలో విటమిన్ 'కె' లోపం కనిపించదు. కానీ అప్పుడే పుట్టిన శిశువులలో 'కె' విటమిన్ లోపం కనబడుతుంది.

      ధన్యవాదములు 🙏

      మీ నవీన్ నడిమింటి

      ఫోన్ 9703706660


    కామెంట్‌లు లేవు: