20, అక్టోబర్ 2016, గురువారం

Healthy Food Tips By Charakudu

చరకుడు చెప్పిన ఆహార నియమాలు:

Acharya-Charak1
1. భోజనం పరిమళ భరితంగా ఉండాలి ( నెయ్యి , నూనె వంటివి కలపడం వలన పరిమళం వస్తుంది )
2. భోజనం వేడిగా తాజాగా ఉండాలి
3. భోజనాన్ని అందమైన , ప్రశాంతమైన ప్రదేశం లో కూర్చుని భుజించాలి
4. భోజనం చేసే సమయం లో మాట్లాడకూడదు
5. క్రింద కూర్చుని మఠం వేసుకుని కూర్చుని భోజనం చెయ్యడం ఉత్తమం
6. సంతోషకరమైన మనస్సుతో , శాంతియుతంగా భోజనం చెయ్యాలి
7. ఎప్పుడూ నిర్ణీత సమయం లోనే భోజనం చెయ్యాలి . ( అందువలన బయోలాజికల్ క్లాక్ సక్రమంగా ఉంటుంది )
8. ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి ( ఘన పదార్ధాలను త్రాగండి అంటారు . అంటే నోటిలోనే సగం నమలబడాలి . అందువలన లాలాజలం పూర్తిగా కలిసి , ముద్దా మింగడం సులువు అవుతుంది . పిండి పదార్ధాలు పూర్తిగా జీర్ణం అవుతాయి . కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం ( క్షారం ) విరుగుడు గా పనిచేస్తుంది .
9. ఆహార నియమాలను పాటించే వ్యక్తికి ఔషధాల అవుసరం ఏమి ఉంటుంది ? ఆహార నియమాలను పాటించని వ్యక్తికి ఔషధాలు ఏమి ఫలితాలను ఇవ్వగలవు ?
పధ్యే సతి గదార్తస్య కి మౌషద నిషేవనై:
వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత
న తు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి
అంటే రోగికి ఔషధాల అవుసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి .
రోగికి ఆహారం పై నియంత్రణ లేక పోతే మాత్రం అత్యుత్తమ మైన మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు అని అర్ధం .
షుగర్ వ్యాధి విషయం లో ఈ విషయాలు అందరికీ తెలుసు కదా !
చరకుడు ఇంకా ఇలా కూడా అన్నారు :-
ఆహారం జీఎవరాసులకు ప్రాణం . అందుకే ఈలోకం ఆహారం కోసం పరుగులు పెడుతుంది . మన చర్మ కాంతి , అందం , స్వరం , జీవితం , ప్రతిభ , సంతృప్తి , అధికారం , తెలివితేటలు అన్నీ ఆహారం మీదనే ఆధార పడి ఉంటాయి.

కామెంట్‌లు లేవు: