గర్భిణులకు వచ్చే సుఖవ్యాధులు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
గర్భిణులకు వచ్చే సుఖవ్యాధులు
శరీరంలోని ఇతర భాగాలలాగానే జననేంద్రియాలకు కూడా వ్యాధులు సంక్రమించే అవకాశం వ్ఞంది. వివిధ రకాలైన బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా వల్ల జననేంద్రియ వ్యాధులు మామూలు కన్నా గర్భీణులలో సులభంగా వచ్చే అవకాశం వ్ఞంది. దీనివల్ల తల్లి నుంచి బిడ్డకు వ్యాధులు సంక్రమించే వీలుంది. ముఖ్యంగా గనేరియా, సిఫిలస్, ఎయిడ్స్,మొదలైనవి అన్ని జననేంద్రియ వ్యాధులు సుఖ వ్యాధులు కాకపోవచ్చు.
కాని అన్ని సుఖ వ్యాధులు జననేద్రియాలకు సంబంధించివే కనుక జననేంద్రియ విషయంలో సుఖ వ్యాధుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. కారణాలుః శారీరక పరిశుభ్రత పాటించకపోవడం బహిష్టు సమయంలో, ప్రసవ సమయంలో శుభ్రమైన బట్టల్ని ఉపయోగించకపోవడం లైంగిక సంపర్కం తర్వాత జననేంద్రియాల్ని సరిగా శుభ్రపరచకపోవడం,స్త్రీలలోని శరీర నిర్మాణం ఇన్ఫ్‌క్షన్స్ సులభంగా సోకడానికి వీలుగా వ్ఞంటుంది. సమాజంలోని సంప్రదాయాలు, ఆచారాలు, మూఢనమ్మకాలు స్త్రీలలోఅవగాహన లోపం,జననేందియ వ్యాధుల గురించి మరుగు పర్చడం, వైద్య చికిత్స సకాలంలో తీసుకోకపోవడం, వైద్య పరీక్షల సమయంలో జననేంద్రియ పరీక్ష సమయంలో పరిశుభ్రతలు పాటింయకపోవడం, అబార్ష్‌న్, కాపర్ టి (లూప్) అమర్చినపుడు, డెలివరీ టైములో అపరిశుభ్రత వల్ల ఇన్ఫ్‌క్షన్స్ ఎక్కువ. సాంఘిక ఆర్థిక పరిస్థితుల వల్ల మగవారికి ఎక్కువ మంది పార్టనర్స్ కల్గి వ్ఞండడం రోజూ స్నానం చేయకపోవడం, వివాహేతర సంబంధాలు కలవారు మత్తు పదార్ధాలు సేవించేవారు.
విశృంఖలంగా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, సెక్స్ వర్కర్లు, సంచార జీవనం చేయించువారు అసహజ లైంగిక పద్దతులు, నిరక్షరాస్యత జననేంద్రియాల పట్ల, ఆరోగ్యం పట్ల సరైన ఆరోగ్యపరమైన అవగాహన లేకపోవడం మొదలైనవి కారణాలు. లక్షణాలు ః జననేంద్రియ స్రావాలుః- స్రావం సర్విక్స్ లేదా జననేంద్రియం నుండి కావచ్చు. సంపర్క సమయంలో నొప్పి ఉంటుంది. భార్యభర్తలిరువ్ఞరిలో వ్యాధి లక్షణాలుంటాయి. దుర్వాసన గల చీము వంటి స్రావం కావడం, సుఖవ్యాధుల వల్ల కల్గుతుంది. స్త్రీలలో తెల్ల మైల ఎక్కువవుతుంది. – జననేంద్రియంపై కురుపులుః జననేంద్రియంపై (హెర్పిస్, సిఫిలిస్), జననేంద్రియం లోపల కురుపులు (వెజైనల్ ఇన్ఫ్‌క్షన్స్,సర్విసైటిస్) ఉంటాయి. ఏ ఒక్కరికున్న ఇద్దరు చికిత్స తీసుకోవాలి. – గజ్జల్లో వాపు గజ్జలకు ఇరువైపులా లేదా ఒకేవైపు వాపు, లింఫ్‌నోడ్స్ వాచి ఉబ్బి గట్టిగా నొప్పితో ఉంటాయి. బాధగా ఉండి కురుపు స్రావంతో కలిసి వ్ఞండవచ్చు. నొప్పిలేని గజ్జల్లో వాపు సిఫిలిస్ వ్యాధిలో ఉంటుంది.
– పొత్తికడుపులో నొప్పిః స్త్రీ పురుషులు,జననేందియాల లోపల వ్యాధి ఉన్నట్లు తెలుస్తుంది. స్త్రీలలో అయితే సాల్పింజైటిస్ అండశయాల, వాపు,పెల్విక్‌ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్‌కు దారితీస్తుంది. పురుషలుల్లో యూరెత్రైటిస్, సిస్టయిటిస్‌కు దారి తీస్తుంది. స్త్రీలలో గర్భీణీ సమయంలో వస్తే ట్యూబ్‌బ్లాక్ కావడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, బ్లీడింగ్ కావడం వంటి సమస్యలెదురవుతాయి.
– మూత్ర విసర్జన సమయంలో మంట,నొప్పి బాధ, మాటిమాటికి మూత్ర విసర్జన కావడం వ్ఞంటుంది. – జననేంద్రియాల వాపు,మంట,దురద,పొక్కులు – జననేద్రియాల నుండి దుర్వాసన గల స్రావాలు
– లైంగిక సంపర్క సమయాల్లో నొప్పి, బాధ, మంట ఉంటుంది.
ననేంద్రియ వ్యాధులుః
1. ఫంగల్ ఇన్ఫ్‌క్షన్‌ః గర్బీణీ స్త్రీలలో తరుచుగా కన్పించే ఇది కేండిడా ఆల్బికన్స్ అనే ఫంగస్ ఇన్ఫ్‌క్షన్ వల్ల వస్తుంది. జననేంద్రియం నుండి చిక్కటి విరిగిన పెరుగు వంటి తెల్లని స్రావం స్రవించడం,దురద, మంట ఉంటుంది. దీనికి ఆంటి ఫంగల్ క్రీమ్ పూస్తు,జననేంద్రియాన్ని శుభ్రంగా పొడిగా వ్ఞంచుకోవాలి.
ట్రైకోమోనాస్ వెజైనైటిస్‌ః
ఇది ప్రోటోజోవల్ ఇన్ఫ్‌క్షన్,గర్భీణీ స్త్రీలలో డయాబెటిస్ వ్ఞన్న వారిలో, ఆకుపచ్చని పసుపు రంగు నురగ వంటి స్రావం కావడం,జనేంద్రియాలు ఎర్రగా వాచి మంటతో వ్ఞంటాయి. సంపర్కం వల్ల, స్రావాల వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. – గనేరియా నైసీరియా గోనో కాకై అనే సుఖ వ్యాధి స్త్రీ, పురుషల్లో వంధత్వాన్ని కలుగ చేసే వ్యాధుల్లో ఒకటి, గర్భాశయ ద్వారం నుండి లేదా మూత్రద్వారం నుంచి చీము వంటి స్రావాలు కన్పిస్తాయి. దీని వల్ల లోపలి జననేంద్రియాల వాపు,జ్వరం,పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలుంటాయి. డెలీవరీ టైములో తల్లి నుంచి బిడ్డకు కండ్ల కలక వంటి జబ్బులు వచ్చే అవకాశముంది.
– సిఫిలిస్‌ః వ్యాధి సోకిన వ్యక్తితో కలిసిన తర్వాత ఈ వ్యాధి9 నుండి 30 రోజుల్లో చిన్న కురుపు (అల్సర్) రూపంలో కన్పిస్తుంది. ఒక్కొసారి 3-4 నెలలు కూడా పడుతుంది. ఇది నొప్పి లేకుండా వ్ఞంటుంది. చికిత్స తీసుకోకపోయినా కొన్ని వారాల తర్వాత ఇది కన్పించకుండా పోతుంది. గజ్జల్లో వాపుండి నొప్పితో కూడిన అనేక కురుపుల్ని షాంక్రయిడ్ అంటారు. సిఫిలిస్‌ను విడి ఆర్‌ఎల్ పరీక్ష ద్వారా నివారించవచ్చు. ఒక్కోసారి స్త్రీ జననేంద్రియం లోపలి భాగంలో వస్తే వాటిని గుర్తించడం కష్టం. రోగి కూడా గమనించకపోయే అవకాశం ఉంది. పురుష జననేందియంపై అనేక చిన్న బొబ్బలు చిట్ల్లిపోయి (హెర్పిస్ పొక్కు )బాధతో కూడిన కురుపుగా మారుతుంది. లైంగిక సంపర్కం లేకపోయినప్పటికీ తరుచుగా వచ్చే లక్షణం ద్వారా దీన్ని గుర్తించవచ్చు. ట్రిపనోమా పాలిడమ్ వల్ల వచ్చే సిఫిలిస్ గర్భీణీల్లో వస్తే ఇన్ఫ్‌క్షన్ పిండానికి 20 వ వారంలో చేరుతుంది. ప్లాసెంటాలో సైజ్ పెరిగి అనేక మార్పులకు లోనవ్ఞతుంది. గర్భిణీ స్త్రీలలో వచ్చే ఈ స్పీరొకిట్స్ ఇన్ఫ్‌క్షన్ వల్ల అబార్ష్‌న్ కావడం, కడుపులో బిడ్డ చనిపోవడం, ఇన్ఫ్‌క్షన్ తో పుట్టడం జరుగుతుంది. కాబట్టి ముందే యు.డి.ఆర్.ఎల్ టెస్ట్ చేయించాలి.
– ఎయిడ్స్‌ః
రెట్రో వైరస్ వల్ల వచ్చే ఈ ఇన్ఫ్‌క్షన్ సోకిన 2 నెలల నుంచి 4 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా రావచ్చు. ఎయిడ్స్ వైరస్ తల్లి నుండి బిడ్డకు ప్లాసెంటా ద్వారా వచ్చే అవకాశం 40-75% వ్ఞంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ అని కన్‌ఫర్మ్ అయిన వెంటనే ఎచ్‌ఐవి పరీక్ష, విడిఆర్‌ఎల్ పరీక్ష చేసి అబార్షన్ చేయడమే మంచిది. ఇవే గాక క్లామైడల్, బాక్టీరియల్, ప్రోటోజోవల్, పారసైటిక్ ఇన్ఫ్‌క్షన్స్ ప్రభావం గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా వస్తాయి. ఇవి కూడా పిండంపై ప్రభావం చూపిస్తాయి.
కాంప్లికేషన్స్‌ః జననేంద్రియ వ్యాధుల ఇన్ఫ్‌క్షన్ వల్ల వచ్చే లైంగిక వ్యాధులు ముఖ్యంగా గనేరియా,సిఫిలిస్,ఎయిడ్స్ స్త్రీ,పురుషులిరువ్ఞరిలో బాధ,చికాకును కల్గించడం కాకుండా కొన్ని ఇబ్బందుల్ని కల్గించవచ్చు. ఇన్ఫ్‌క్షన్ వల్ల అండవాహికలు మూసుకొని పోయి వంధత్వం కల్గుతుంది. గర్భధారణ గర్భసంచిలో జరగకుండా పెలోఫియన్ ట్యూబ్‌లో స్త్రీ జనేంద్రియంలో వచ్చే ఇన్ఫ్‌క్షన్లు వల్ల ఎప్పుడు పొత్తికడుపులో నొప్పి,వాసనతో కూడిన తెల్లమైల కావడం, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజీ రావడం జరుగుతుంది.
జననేంద్రియ వ్యాధులతో బాధపడే వారిలో కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సుఖ వ్యాధులతో బాధపడేవారిలో ఎయిడ్‌స వ్యాధిసోకే అవకాశాలు 10-20 రెట్లు ఎక్కువ. గర్భస్రావం, బిడ్డలు చనిపోయి పుట్టడం జరగవచ్చు. జాగ్రత్తలుః సుఖ వ్యాధులు లక్షణాలు కన్పించిన వెంటనే తరుచు పరీక్షలు చేయించుకోవడం మంచిది. సరైన చికిత్స జరిపితే సుఖ వ్యాధులు చాలా వరకు నయిమవ్ఞతాయి. దీని వల్ల హెచ్.ఐవి. వ్యాప్తిని చాలా వరకు నివారించవచ్చు. భార్యభర్తలిరువ్ఞరిలో ఏ ఒక్కరి కన్న ఇన్ఫ్‌క్షన్ వ్ఞన్న లైంగికంగా కలవకూడదు. నిరోద్ సక్రమంగా వాడడం మంచిది. అక్రమ సంబంధాలకు అసహజ లైంగిక విధానాలకు దూరంగా వ్ఞండాలి. కలిసిన తర్వాత జజనేంద్రియాల్ని శుభ్రం చేసుకోవాలి. కాన్పు మరియు గర్భస్రావ సమయంలో పూర్తి ఎసెప్టిక్ విధానాలు పాటించడం మంచిది.
రోగికి ధైర్యం కల్గించి మందులు సక్రమంగా వాడేటట్లు చూడాలి. ఇన్ఫ్‌క్షన్ వ్ఞన్న రోగి వస్తువ్ఞల్ని సపరేట్‌గా ఉంచి శుభ్రపరచాలి. జననేంద్రియాల పరిశుభ్రత చాలా అవసరం. డాక్టర్ల పర్యవేక్షణలో సరైన వ్యాధి నిర్థారణ చేయించుకొని ఒక అవగాహనతో మందుల్ని సక్రమంగా వాడితే వ్యాధి సత్వరం నివారణ అవుతుంది.
హోమియో చికిత్సః 1. మెర్క్‌సాల్‌ః సుఖ వ్యాధులకు ఆలోచించ దగ్గ మందు మూత్రానికి రాత్రి పూట చాలా సార్లు వెళ్లాల్సి రావడం మూత్రం మంట నొప్పి నోటి నుంచి చొంగ కారడం, రాత్రిపూట జ్వరం, రాత్రిళ్ళు బాధతో నిద్ర పట్టదు.శరీరంపై మచ్చలు చలిగాని, వెచ్చదనంగాని భరించలేరు. జననేంద్రియాలపై పుండ్లు నొప్పి బాధగా ఉంటాయి.
హెపార్ సల్ఫ్‌ః పుండ్లు సూదులు గుచ్చుతున్నట్లు బాధ ఇది రాత్రిపూట ఎక్కువ. నొప్పి భరించలేరు. పుండ్లు చీము కారుతుంటాయి.వేడి కాపడం వల్ల ఉపశమనం. నైట్రక్ ఆసిడ్‌ః పుండ్లు సలుపు పోటు రాత్రిపూట ఎక్కువ. ఎర్రటి పుండ్లు ముల్లు గుచ్చుతున్నట్లు నొప్పి వేడినీళ్ళ వల్ల ఉపశమనం కల్గుతుంది. చలిగాలిలో విపరీతమైన నొప్పి నిద్ర వ్ఞండదు.మూత్రం వెంట నెత్తురు,చీముతెల్లవార్లు మూత్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
కెన్నబిస్ సటైవాః మూత్రం పోస్తూ వ్ఞండే మంట పోటు మూత్రనాళం వాపు. జననేంద్రియం ముట్టుకుంటే నొప్పి.నొప్పితో నడవడం కష్టం,జననేంద్రియం వాచి నీరు పడుతుంది. జననేంద్రియం నుంచి చీము. ఆరంమెట్‌ః రాత్రి,తెల్లవార్లు ఎముకల్లో నొప్పులతో నిద్ర వ్ఞండదు. ఎప్పుడు విచారం,బాధలు భరించలేక జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఎప్పడు చల్లదనాన్ని కోరుకుంటారు. నీరసం భైరాటకార్భ్‌ః జ్ఞాపకశక్తి తగ్గడం, ఎప్పడు జలుబు,గొంతు వాపు,లింప్ గ్రంధుల వాపు,ఎముకల నొప్పులు చల్లగాలికి ఎక్కువవుతాయి.
కెనొబిస్ ఇండికాః మూత్రం పోసేటప్పుడు,తర్వాత, ముందు నొప్పి, జననేంద్రి యం బిగుసుకుకొని పోతుంది. మూత్రం చుక్కలు చుక్కలుగా పోతుంది. ఇవేగాక జననేంద్రియ వ్యాధులకు వ్యాధి లక్షణాల్ని బట్టి మెడోరినమ్,బెల్లడోనీ,మెర్కకార్, ఆర్భ ఆల్బ్ మందుల్ని వైద్య పర్యవేక్షణలో వాడడం మంచిది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి