స్థూలకాయం మల బద్ధకం మధుమేహ వ్యాధి తలనొప్పి/మైగ్రేన్ థైరాయిడ్ గ్రంధి రక్తపోటు సాధారణ జలుబు జుట్టు రాలడం
స్థూలకాయం
మల బద్ధకం
మల బద్ధకం అనగా నేమి? ప్రతిరోజు క్రమబద్దంగా అలవాటు ప్రకారంగా కాకుండా దీనిలో ఎటు మార్పు వచ్చినా,ఆ మార్పు మలం తక్కువ కావటం.గట్టిగా గాను,తక్కువ సార్లు మలవిసర్జన కావటం,మలవిసర్జన సమయంలో చాలా ముక్కడం,కష్టంగా ఉండటం.సామాన్యంగా మల విసర్జనలో మనిషికి మనిషికి అలవాట్లు వేరుగా ఉంటాయి.అనగా కొంత మందికి ప్రతి రోజూకు లేక ప్రతి రెండు రోజులకు ఒక్క సారి కావటం జరుగుతుంటుంది.లక్షణాలు :- కడుపు ఉబ్బరం లేదా కడుపులో ఇబ్బందికరంగా ఉండటంకారణాలు :- 1. తీసుకొనే ఆహారంలో పీచుపదార్ధం తక్కువగా ఉన్నచో. 2. శరీరంలొ నీరు తక్కువ అయినా. 3. శరీరం కదలికలు తక్కువ అయినా. 4. ఏవైనా మందులు వాడుతున్నా. 5. ప్రేగులలో ఏదైనా సమస్య ఉన్నచో .ఉదా:(ప్రేగులలో క్యాన్సర్ వ్యాధి) 6. థైరాయిడ్ హర్మోన్ తక్కువ అయినా. 7. కాల్షియం,పోటాషియం తక్కువ అయినా. 8. మధుమేహ వ్యాధి వలనా,జీర్ణకోశ వ్యాధి అయినా. 9. పార్కిన్ సన్ వ్యాధి అయినచో. ఎలా నివారించాలి:- 1. ఆహారంలో పీచుపదార్ధం ఎక్కువగా ఉండాలి. 2. ఎక్కువగా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి. |
మధుమేహ వ్యాధి
తలనొప్పి/మైగ్రేన్
దాదాపుగా ప్రతిఒక్కరూ తలనొప్పి తో ఏదో ఒక సందర్భంలో బాధపడతారు, కానీ కొన్ని చాలా అసౌకర్యం కలిగిస్తాయి. అయితే ఇవి ఎక్కువ తాత్కాలి కమైన ఇబ్బందులే. సాధారణంగా తలనొప్పులు తాత్కాలికం, అవి వాటంతటవే పోతుంటాయి. అయితే, నొప్పి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించటానికి సిగ్గుపడకూడదు. వైద్యుడు తలనొప్పి తీవ్రంగ ఉన్నా, మరల -మరల వస్తున్నా లేదా జ్వరంతో పాటువస్తున్నదేమో పరీక్షించాలి. తలనొప్పి ఎప్పుడు తీవ్రమనిపిస్తుంది? ప్రతి తలనొప్పికీ వైద్యమక్కరలేదు. కొన్ని తలనొప్పులు భోజనం సరియైన సమయంలో తీసుకోక పోవడంలో వల్లా లేదా కండరాల ఉద్రిక్తతవల్ల కలుగుతాయి, వాటికి తగుజాగ్రత్తలు ఇంటిదగ్గర తీసుకుంటే సరిపోతుంది. మరికొన్ని తలనొప్పులు ఏదో తీవ్రమైన స్ధితికి సంకేతాలు మరియు వాటికి తక్షణం వైద్యసాయం అవసరమవుతుంది. మీరు ఈ క్రింది తలనొప్పి లక్షణాలను కనుక అనుభవిస్తుంటే మీకు అత్యవసరంగా వైద్య సహాయం అవసరం: * తీవ్రమైన, ఆకస్మికంగా తలనొప్పి వేగంగా, చెప్పలేని విధంగా వచ్చి "ఇది నా జీవితము లో దారుణమైన తలనొప్పి" అనిపించేది * స్పృహతప్పటం, గందరగోళం, కంటి చూపులో మార్పులు లేదా యితర శారీరక బలహీనతలతో కూడిన తలనొప్పి * మెడ బిగుసుకుపోవటం మరియు జ్వరంతో కూడిన తలనొప్పి మీరు ఈ క్రిందితలనొప్పి లక్షణాలను కనుక అనుభవిస్తుంటే మీరు వైద్య సహాయం అవసరం: * నిద్ర నుంచి మిమ్మల్ని మేలు కొలిపే తలనొప్పి * తలనొప్పి స్వభావములో గానీ లేదా తరచూ ఎందుకొస్తుందో వివరించలేని మార్పులు * మీ తల నొప్పి స్వభావం గురించి మీకు స్పష్టత లేనట్లైతే వైద్యుడిని సంప్రదించటం ఉత్తమం. ఆందోళన, క్లస్టర్ తలనెప్పి, పార్శ్వశూల అనేవి తలనెప్పులలోని రకాలు. తల పగిలిపోయేంత, పార్శ్వశూల అనేవి రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులు. ఈ రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులలో భౌతిక శ్రమ తలనొప్పి బాధను అధికం చేస్తుంది. తలచుట్టూ ఉండే కణజాలములోని రక్తనాళాలు ఉబ్బుతాయి లేదా వాస్తాయి, దానివల్ల తల నెప్పితో బాధపడతాము. తల పగిలిపోయేంత (క్లస్టర్) తలనెప్పి పార్శ్వశూల తలనెప్పి కన్నా తక్కువగానే వస్తుంది, ఇది రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులలో సాధారణమైనది. క్లస్టర్ తలనెప్పి వరుసగా అతివేగంగా వస్తుంది-వారాలు లేదా నెలలపాటు ఉంటుంది. క్లస్టర్ తలనెప్పి ఎక్కువగా మగవారికి వస్తుంది మరియు భరించరానంత బాధాకరమైనది. వ్యాధి నిర్ధారణ అధికభాగం తలనెప్పులు తీవ్రస్థితిలో కలిగేవి కావు మరియు దుకాణాలలో దొరికే మందులతో చికిత్స చెయ్యవచ్చు. పార్శ్వశూల తలనెప్పి మరియు యితర తీవ్రమైన తల నెప్పులకు వైద్య పర్యవేక్షణ మరియు ఔషధచీటి అవసరమవ్వవచ్చు. ఆందోళనవల్ల కలిగే తలనెప్పి * ఆందోళన వల్ల లేదా కండరం ముడుచుకోవటం వల్ల కలిగే తలనెప్పి అన్నది అత్యంత సాధారణమైన తలనెప్పి, మరియు అవి వత్తిడి పెరిగే దశలతో తరచూ ముడిపడి ఉంటాయి. * ఆందోళన వల్ల కలిగే తలనెప్పి అన్నది స్థిరంగా మరియు మందంగా ఉండిమరియు నుదురు, కణతలు మరియు మెడవెనుక భాగం లో లోనవుతాము. * ఆందోళన వల్ల కలిగే తలనెప్పి అన్నదాన్ని తలచుట్టూ గట్టిగా కట్టివేసినట్లుంటుందని ప్రజలు తరచూ వర్ణిస్తారు. * ఆందోళన వల్ల కలిగే తలనెప్పి దీర్ఘకాలం ఉండవచ్చు కానీ వత్తిడి తగ్గగానే సాధారణముగా మాయమవుతాయి. * ఆందోళన వల్ల కలిగే తలనెప్పి కి మరేయితరలక్షణాలతో సంబంధం లేదు మరియు పార్శ్వశూలతలనెప్పిలాగా తలనెప్పికి ముందు వ్యాధిలక్షణాలు ఏవీ కనిపించవు. అన్నిరకాల తలనెప్పులలో ఆందోళన వల్ల కలిగే తలనొప్పులు 90శాతము. సరణి(సైనస్)తలనొప్పులు సరణి(సైనస్)తలనొప్పులకు సరణి సంక్రమణం(అంటువ్యాధి) లేదా సహించకపోవటం(ఎలర్జీ) వల్ల కలుగుతాయి. జలుబు లేదా ఫ్లూ జ్వరము తరువాత ముక్కు ఎముకలకు ఎగువన,దిగువున ఉండే గాలి కుహరాలు సరణి మార్గాలు మంటకుగురికావడం, సరణితలనెప్పు కలుగుతుంది.ఈ సరణి చిక్కబడటం లేదా క్రిమిపూరితం అయినా తలకు నెప్పి కలిగించేకారణమవుతుంది.ఈ నెప్పి తీవ్రంగా,కొనసాగుతూ ఉంటుంది,ఉదయాన్నే మొదలవుతుంది మరియు ముందుకు వంగితే మరింతదారుణంగా మారుతుంది. సరణి(సైనస్)తలనొప్పుల సాధారణ లక్షణాలు: * చెక్కిళ్ళమీదుగా మరియు నుదుటిపై,కళ్ళచుట్టూ నెప్పి మరియు వత్తిడి, * పైపళ్ళు నెప్పిగా ఉన్న భావన * జ్వరము మరియు వణుకు * ముఖం వాయటం సరణి(సైనస్)తలనొప్పులలో వచ్చే ముఖం నెప్పులకు వేడిద్వారా మరియు మంచుద్వారాఉపశమనం కలిగిస్తారు. గమనిక: మీకు తీవ్రమైన తలనొప్పులుంటే,ఆ లక్షణాలన్నిటిని, నెప్పి యొక్క తీవ్రత మరియు ఆ నెప్పిని మీరు ఎలా నిభాయించారు అన్న దానిని గుర్తుంచుకోండి. మైగ్రేన్ తరచూ వచ్చే ఒక రకమైన తలనొప్పిని మైగ్రేన్ అని అంటారు. పార్శ్వ తల నొప్పి( మైగ్రేన్ తలనొప్పి )ఇతర తలనొప్పులకు భిన్నంగా వుంటుంది. మైగ్రేన్ లక్షణాలు మనిషి కి మనిషి కి వేరు వేరు విధాలుగా ఉంటాయి. ఇది నరాల వ్యవస్దకు సంబంధించిన సాధారణమైన జబ్బు లక్షణాలు మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి.తేలిక పాటి తల నొప్పి తో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి వస్తున్నట్లుగాను మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి వుంటుంది. అధిక వెలుతురు కు శబ్దాలను భరించలేరు. కళ్ళముందు వెలుతురు చుక్కలాగా కనిపించవచ్చు. * ఈ లక్షణాలు మొదలైన కొన్ని నిముషాలకు ముఖములో ఒక భాగములో కాని, ఒక చేయి కాని , ఒక కాలు కాని తిమ్మిర పట్టడము. సూదులతో గుచ్చినట్లు అనుభూతి కల్గడం జరుగుతుంది. * కళ్ళు తిరగడం , బలహీనత, మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడడం జరగవచ్చు. ఈ లక్షణాలు తీవ్రమైన లేక తగ్గుదల కనిపించిన తరువాత విపరీతమైన తలనొప్పి సుత్తి తో బాదినట్లు వస్తుంది. * ఆకలి మందగిస్తుంది. * ఈ లక్షణాలు సాధారణంగా 6 గం నుండి 8 గం వరకు వుంటుంది. * స్త్రీలకు బహిస్టు సమయంలో మైగ్రేన్ తల నొప్పి వస్తుంటాయి. కారణాలు * మానసిక వత్తిడి – తలనొప్పి * అధిక శ్రమ * ప్రకాశవంతమైన వెలుతురు కళ్ళ మీద పడినప్పుడు * రుతు క్రమములో తేడాలు. * కొందరిలో గర్బనిరోధక మాత్రలు మైగ్రేన్ ను ప్రేరేపించే అవకాశం ఉంది. * మత్తుపానీయాలు – పొగత్రాగుట * మైగ్రేన్ లక్షణాలు తలకు ఒక వైపు వెళ్ళే నరాలు అకస్మాతుగా కుచించుకు పోవడం వలన ప్రారంభమవుతుంది. ఇవే నరాలు ఒక్కసారిగా వ్యాకోచించడం వలన అక్కడికి అధిక రక్తం ప్రవహించుట వచ్చి తలనొప్పి వస్తుంది. నివారణ * ఉద్వేగము కలిగించే జీవనశైలి నుండి స్వల్ప మార్పుల తో సాధారణ జీవిత విధానాన్ని అలవరచుకోవాలి * ఇంటిలో వున్నప్పుడు చీకటి రూములో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. * ద్రవ పదార్దాలు నీళ్ళు ఎక్కువ మోతాదుల లో తాగాలి. * నీటిలో తడచిన బట్టను తల మీద వేసుకొని విశ్రాంతి తీసుకొన్న కొంత ఉపశమన ఉంటుంది. * ఏ మాత్రము సందేహము వున్నా గర్బ నిరోధక మాత్రలు తీసుకోకూడదు. ఇతర కుటుంబ నియంత్రణ పద్దతులు పాటించాలి. * కొందరు స్త్రీ ల లో మెనోపాజ్ వయస్సు రాగానే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది. * డాక్టరు ను సంప్రదించి మాత్రమే వైద్యం చేయించుకోవాలి. |
థైరాయిడ్ గ్రంధి
థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ గ్రంధి సీతాకోక చిలుక ఆకారంలో వుండే చిన్న గ్రంధి.ఇది గొంతు ముందు భాగములో వుండును.ఈ గ్రంధి వుత్పత్తి చేయు హార్మోనుల ప్రభావము వలన శరీరములో వున్న వివిధ కణాలు అవసరమైన శక్తిని ఉపయోగించుకొని విధి నిర్వహాణ చేసుకొనుటకు తోడ్పడతాయి. థైరాయిడ్ వ్యాధి అనగానేమి? * థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోన్లు ఉత్పత్తి చేస్తే కణాలు అధిక శక్తిని వేగంగా ఉపయోగించుకొనేలా చేస్తుంది. * థైరాయిడ్ గ్రంధి తక్కువ స్ధాయిలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే శరీరములోని జీవకణాలు తక్కువ స్ధాయిలో శక్తిని ఉపయోగించి కణాలను విధి నిర్వహణ చేయునట్లు తోడ్పడతాయి. ఏ వయస్సు వారిలో థైరాయిడ్ వ్యాధులు వస్తాయి * అన్ని వయస్సుల వారికి థైరాయిడ్ వ్యాధులు వస్తాయి. * 5 నుండి 8 పాళ్ళు స్త్రీలలో అధికంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయి. థైరాయిడ్ గ్రంధి తక్కువ స్ధాయిలో పనిచేయుటకు కారణాలు - లక్షణాలు * ములం వాపు. * చర్మము పొడి బారడం. * శబ్దములో మార్పు. * శరీరము బరువు అధికమగుట. * కీళ్ళ వాపులు, నొప్పులు. * నెలసరి రుతుక్రమములో మార్పులు. * మానసిక రుగ్మతలు. * థైరాయిడ్ గ్రంధి పెద్దది అగుట. * శ్వాసకు సంబంధించిన,బి.పి కి సంబంధించిన వ్యాధులు రావడం. * మలబద్దకం. * చిన్న పిల్లలలో సాధారణ ఎదుగుదల లేక పోవడం. * యుక్త వయస్సు పిల్లలలో నెలసరి ప్రారంభం ఆలస్యం కావడం. * మానసిక ఎదుగుదలతో పాటు ఆహారములో అయోడిన్ శాతం తక్కువగా వుండుట, థైరాయిడ్ హార్మోను ఉత్పత్తికి ఆహారములోని అయోడిన్ తోడ్పడుతుంది. థైరాయిడ్ అధిక స్ధాయిలో పనిచేయుట కారణాలు: - * థైరాయిడ్ గ్రంధి అధికంగా పనిచేస్తు - ఎక్కువస్ధాయిలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. * థైరాయిడ్ గ్రంధికి ఇన్ ఫెక్షన్ వచ్చి నొప్పితో కూడిన గడ్డ కావచ్చు. * ఒక్కొక్క సందర్భములో నొప్పి లేని గడ్డగా కనబడును. * నొప్పి లేని థైరాయిడ్ గ్రంధి అధిక శాతం స్త్రీలలో వస్తుంది. * అయోడిన్ శాతం ఎక్కువగా కొన్ని మందుల ద్వారా రావచ్చును. లక్షణాలు: - * చికాకు,విసుగుదల. * కండరాల నీరసం. * అప్పుడప్పుడు కండరాలు వణకడం. * నెలసరిలు అధికంగా వుండడం,నెలలో ఎక్కువసార్లు రుతుక్రమాలు. * నిద్ర సమస్యలు. * థైరాయిడ్ గ్రంధి పెద్దది కావడం. * కంటి జబ్బులు ,గ్రేవ్స్ కంటి వ్యాధి వేడిని భరించలేకపోవడం. తీసుకోవలసిన జాగ్రత్తలు * థైరాయిడ్ జబ్బును వీలైనంత త్వరగా గుర్తించగలగాలి. * అయోడిన్ ఉప్పును ఆహారంలో తీసుకోవడం మంచిది. * వ్యాధి నిర్ధారణ చేసిన తరువాత జీవిత కాల వైద్యం అవసరం కావచ్చు. * డాక్టరును సంప్రదించి పూర్తి స్ధాయి పరీక్షలు చేయించుకొని వైద్య సలహా పొందాలి. |
రక్తపోటు
గుండె అనుక్షణము సంకోచ, వ్యాకోచాలు చేస్తూ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది.ఇలా సంకోచించినప్పుడు (కుచించుకొన్నప్పుడు) రక్తం గుండె నుండి రక్త నాళాల లోనికి వేగంగా వత్తిడితో ప్రవహిస్తుంది.ఈ వత్తిడిని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (Systolic Blood pressure) అని అంటారు. గుండె మరల వ్యాకోచించి సాధారణ స్ధితికి వచ్చినప్ఫుడు,రక్తనాళాలలో వున్న వత్తిడిని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు.ఈ రక్త పోటును గాజు గొట్టము లోని పాదరసపు మిల్లీ మీటర్లలో కొలుస్తారు. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు సిస్టోలిక్ ప్రెషర్ 90 నుండి 120 మి.మీ గాను,డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 నుండి 80 మి.మీ గాను నమోదు కావచ్చు. అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్నకొద్దీ మార్పు చెందుతుంది. అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది.మానసిక వత్తిడులు కూడా బి.పి ని ప్రభావితం చేస్తాయి.
|
సాధారణ జలుబు
ఎలా వస్తుంది? జలుబు తో బాధపడుతున్నవ్యక్తి తుమ్మినా,చీదినా అందులోంచి వచ్చు వైరస్ క్రిములు గాలి తుంపర్లుగా వ్యాపిస్తాయి.ఈ వైరస్ కలిగిన తుంపర్ల గాలిని దగ్గరలో వున్న ఇతరులు పీల్చితే వారికి జలుబు వస్తుంది. జలుబు వున్న వ్యక్తి ఎవరినైనా ముక్కుతో కాని,చేతులతో కాని తాకినా జలుబు వ్యాపిస్తుంది. జలుబు వున్న వ్యక్తి చీదిన, పెన్ను,టవలు,చేతిరుమాలు,పుస్తకాలు,కాఫీ కప్పుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.జలుబు కారక వైరస్ లు ఈ వస్తువుల ద్వారా అధికంగా వ్యాపిస్తాయి. చలి వాతావరణ ప్రభావము వలన జలుబు ప్రధానంగా వ్యాపించదు.ఈ వాతావరణ మార్పు జలుబు వ్యాప్తిలో పెద్దగా ప్రభావితము చూపించదు. ఎంతకాలం వుంటుంది?
|
జుట్టు రాలడం
జుట్టు రాలడం అనగా ఏమి ?జుట్టు రాలడం అనేది పలచబడడం దగ్గర నుంచి బట్టతల రావడం వరకూ ఉండవచ్చు. వైద్య పరంగా క్రింది విధంగా విభజించవచ్చు.
* సాధారణంగా శారీరక ఒత్తిడి – ఉదా: దీర్ఝకాలిక జబ్బులు, శస్త్ర చికిత్సానంతరం , తీవ్రమైన అంటు వ్యాధుల తరువాత రెండు మూడు నెలలు వరకూ జుట్టు రాలిపోవచ్చు. ఒక్క సారిగా హార్మోనుల అసమతుల్యం మూలంగా, ముఖ్యంగా స్త్రీలలో కాన్పు తరువాత జుట్టు రాలవచ్చు.
* ఈ స్ధితులలో సుమారుగా జుట్టు రాలవచ్చు, కానీ చాలా కొద్ది మార్లు తీవ్రంగా ఉంటుంది. అటువంటి సమయంలో వైద్య సలహా అవసరం.
మందుల వల్ల కలుగు దుష్పలితం
* కొన్ని జబ్బులకు వాడే మందుల వల్ల చాలా జుట్టు రాలిపోవడం,బట్టతల రావడం కూడ జరుగుతుంది.
జబ్బు లక్షణాలు
* ధైరాయిడ్ గ్రంధి జబ్బులలో (హార్మోను అధికం కావడం,తక్కువ కావడం) వల్ల వచ్చే పలు లక్షణాలలో జుట్టు రాలడం ఒకటి.
* సెక్స్ (లైంగిక హార్మోన్లు) హార్మోన్లు అసమతుల్యం
* తీవ్రమైన పౌష్ఠికాహార లోపం, ముఖ్యంగా
* ప్రోటీన్లు, ఐరన్ (ఇనుము), జింక్, boiton వంటి విటమినుల లోపం, ఈ లోపాలు ముఖ్యంగా పరిమితంగా ఆహారం తీసుకొను వారిలో, స్త్రీలలో బుతు స్రావం అధికంగా వున్న పరిస్ధితులలో కనబడుతుంది.
* ఫంగల్ ఇన్ ఫెక్షన్లు, కొన్ని రకాల ఫంగల్ జబ్బులలో ఇది మచ్చలు, మచ్చలుగా కొద్ది పాటి విసర్జాలలో కనిపిస్తుంది. ఇది చిన్న పిల్లలలో అధికంగా కనిపిస్తుంది.
* అనువంశికం (లేక) వంశపార పర్యంగా వచ్చు జుట్టు రాలడం పురుషులలో ఇది ఒక క్రమంలో (ముందు భాగం నుంచి పలుచ పడుకుంటు పై భాగంలో పూర్తిగా ఊడిపోవడం – బట్టతల ) కనబడుతుంది. ఇది సర్వ సాధారణంగా కనబడే లక్షణం. ఇది పురుషుల జీవితకాలంలో ఎప్పుడైనా మొదలు కావచ్చు. చాలా చిన్న వయసులో 13 నుంచి 19 సం” ల వయసులో కూడ మొదలు కావచ్చు. ముఖ్యంగా 3 కారణాల సముదాయం కావచ్చు.
* వంశపారపర్యం
* పెరుగుతున్న వయసు
* పురుష హార్మోన్లు
స్త్రీలలో జుట్టు రాలిపోవడం ముందు బాగం మొదలు కొని కణతల వైపు నుంచి వెనక్కు వెళుతుంది. తల పైభాగంలో తక్కువగా కనబడుతుంది.
లక్షణాలు
ప్రతి రోజు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజం.ఇంత కన్న ఎక్కువ రాలిన పక్షంలో వైద్య సలహా అవసరం. జుట్టు పలుచ బడ్డట్టు అనిపించినా,ఒకటి కంటే ఎక్కువ చోట్ల బట్టతల కనపడ్డా వైద్య సలహా తీసుకోవాలి.
నివారణోపాయాలు
* మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం
* సమతుల్య పౌష్ఠికాహారం తీసుకోవడం.
* జుట్టు దువ్వుకొనునప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం.
* జుట్టు రాలిపోవడానికి కారణమైన మందులను మార్చడం.
* ఫంగల్ ఇన్ ఫెక్షన్ల మూలంగా జుట్టు రాలుతున్న పక్షంలో
* జుట్టును పరిశుభ్రంగా వుంచుకోవడం.
* ఎండుగా, జిడ్డు లేకుండా వుంచుకోవడం
* టోపీలు ఇతరులవి పెట్టుకోకపోవడం
* ఇతరుల దువ్వెనను వాడక పోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. వంశపార పర్యంగా వచ్చే బట్టతలను కూడ కొన్ని సందర్భాలలో నివారించవచ్చు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
ఫోన్ -9703706660