వైద్య సలహాలు సిర్పి సమస్య కు
ఫీవర్ బ్లిస్టర్స్ వీటినే కోల్డ్ సోర్స్ లేదా హెర్పిస్ సింప్లెక్స్ లేబియాలిస్ అని అంటారు. ఇది పెదవులు, నోరు చుట్టూ ఎక్కువగా వస్తుంది. కొందరిలో ముక్కు నోటి లోపల, బుగ్గలపైన, లోపల ఏర్పడతాయి. ఇండియాలోనే ప్రతి సంవత్సరం దాదాపు 10 మిలియన్ మంది ఫీవర్ బ్లిస్టర్స్‌లో బాధపడుతుంటారు.
ఇది వైరల్ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్‌తో వస్తుంది. 90% మందిల ఇది హెచ్‌ఎస్‌యు తక్కువ తీవ్రతతో వచ్చే ఇన్ణెక్షన్ అని చెప్పవచ్చు. యుఎస్‌లో 65% మంది హెచ్‌ఎస్‌యు1 ఇన్ఫెక్షన్ వల్ల బాధపడుతున్నారు. ఇది పిల్లల నుండి పెద్దవారిలోను, ఇమ్యూనిటీ తక్కువగా వున్న వారిలో 25-35% వస్తుంది.
దశలు : ఇది 5 దశలుగా ఏర్పడతాయి.
- 1వ దశ: మొద్దుబారినట్లు, మంట లేదా దురదగా ఉంటుంది.
- 2వ దశ: 12-24 గంటల తర్వాత నోటి పొక్కులు ఏర్పడతాయి. ఇవి ఎర్రగా వాపుతో నొప్పిగా ఉంటాయి.
- 3వ దశ : నీటి పొక్కులు పగిలిపోయి నీరు బైటికి వస్తుంది. ఇది 2-3 రోజులకి ఏర్పడుతుంది.
- 4వ దశ : పక్కులు కట్టడం, చీలినట్లుండడం, బ్లీడింగ్ రావడం వుంటుంది.
- 5వ దశ : పక్కులు రాలిపోతాయి. ఈ దశ 5 స్టేజ్‌ల ఏర్పడా నికి 2 వారాలు పడితే ఇమ్యూనిటీ తక్కువగా వున్న వారిలో, ఎయిడ్స్ రోగుల్లో, ఎక్కువగా మందులు వాడే వారిలో 4-5 వారాలు పడుతుంది.
కారణాలు :
ముద్దు పెట్టుకోవడం ఎంగిలి, ఒకరు వాడిన వస్తువులు, టవల్స్, రేజర్స్ వాడడం, క్లోజ్ కాంటాక్ట్ వల్ల వస్తుంది. జననేంద్రియాల ఇన్ఫెక్షన్ వున్నప్పుడు ముఖ్యంగా హెచ్‌ఎస్‌వి-1 హెచ్‌ఎస్‌వి-2 వైరల్ ఇన్ఫెక్షన్ వున్నప్పుడు, ఓరల్ సెక్స్ చేసినప్పుడు ఇది జ్వరాలు, స్ట్రెస్ ఎక్కువగా వున్నా, జలుబు, ఎలర్జీస్, నిస్సత్తువ సక బర్న్, ఎండ తీవ్రత ఎక్కువగా వున్న , కొన్ని రకాల ఆహార పదార్థాలు, డెంటల్ ప్రాబ్లమ్స్, కాస్మోంటిక్ సర్జరీ, మెన్ట్సు వేషన్ ప్రాబ్లమ్స్ వున్న వారిలో ఎక్కువగా వస్తంటాయి. దెబ్బలు తగిలిన, డిప్రెషన్ వున్నవారిలో, ప్రెగ్నెన్సీ ఇన్ఫె క్షన్స్ ఎక్కువ గా వున్న వస్తుంది.
ఇవి ఏమంత ప్రమా దకరం కావు. కాని చూడడానికి ఆహారం తీసుకోడానికి ఇబ్బందిగా ఉంటాయి. ఇవి ఎయిడ్స్ వ్యాధి నిరోధక శక్తి వున్న వారిలో, ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో, ఎగ్జిమా వంటి చర్మ, వ్యాధుల్లో వచ్చే రిస్క్ ఎక్కువగా వుంటుంది. పోషకాహార లోపం వున్న వారిలో, కార్టికోస్టీరాయడ్స్ వాడే వారిలో ఎక్కువ.
లక్షణాలు :
జ్వరం తీవ్రత, ఇన్ఫెక్షన్‌ని బట్టి రోగి రోగికి మారుతుంటాయి. మొదటిసారి ఇనెఫీవర్ బ్లిస్టర్స్ వచ్చినపుడు జ్వరంతోపాటు గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, చిగుళ్ల వాపు, మెడలోని లింప్ గ్రంధుల వాపు వంటి లక్షనాలుంటాయి. దీన్నే ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటారు.
కొందరిలో తరుచుగా ఫీవర్ బ్లిస్టర్స్‌కన్పిస్తుంటాయి. వీటినే రికరెంట్ ఫీవర్ బ్లిస్టర్స్ అంటారు. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ హార్మోన్స్ ఛేంజ్స్ వున్నప్పుడు, స్ట్రెస్, ఫాటిగ్, గాలి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ఇమ్యూనిటీ లెవల్స్‌లో ఛేంజ్స్ వున్నప్పుడ వస్తాయి.
రిస్క్‌ఫ్యాక్టర్స్ :
హెచ్‌ఐవి, ఎయిడ్స్, బర్నోని, ఎగ్జిమా, కేన్సర్ కీవో థిరపీ, ట్రాన్స్‌ప్లాంటేషన్, ముసలివారిలో, ఆర్గాన్ ట్రఛ్స్‌ప్లాంట్ చేసుకున్నప్పుడు..
నేచురల్ హోమ్ రెమిడీస్ :
ఐస్‌ప్యాక్, లెమన్‌బామ్, ఎల్ లైసిస్ (500-3,000 ఎంజి) జింగ్ థిరపీ, బరిగానో ఆయిల్, లికోరైస్ ఎక్స్‌ట్రాక్, టీట్రీ ఆయిల్ ఆపల్ సిడర్ వెనిగర్, లిచ్ హాజెల్ వాడాల్సి వుంటుంది.
కాంప్లికేషన్స్ :
చాలా తక్కువగా కాంప్లికేషన్స్ వుంటాయి. ఇవి శరీరంలోని ఇతర భాగాలకు గీరడం, తాకడం, గిల్లడం వల్ల ఇతర భాగాలికి వ్యాప్తి చెందుతాయి.
చేతి వ్రేళ్లకు ఇన్ఫెక్షన్ సోకిన హెర్పిస్ విట్‌లో వస్తుంది. పిల్లల్లో నోటిలో వ్రేలు వేసుకోనే వారిలో ఎక్కువగా వస్తుంది.
ఎగ్జిమా రోగుల్లో నొప్పిలో కూడిన రాష్ వస్తుంది. దీన్నే ఎగ్జిమా హెర్పిపా టికమ అంటారు.
కంటికి ఇన్ఫెక్షన్ సోకడం వల్ల హెచ్‌ఎస్ యు హెరటై టిస్, కార్నియాకు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల అభ్యత్వం వస్తుంది. దృషి లోపాలేర్పడతాయి. వ్యాధి నిరోధక శక్తి వున్న వారిలో బ్రెయిన్ లేదా వెన్నెముకకు ఇన్ఫెక్షన్ పోకడం వల్ల మెనింజైటిస్, ఎన్‌సెఫలైటిస్ వస్తుంది.
చికిత్స :
విశ్రాంతి అవసరం కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకి సోకకుండా చూసుకోవాలి. ఒకరు వాడిన వస్తువుల్ని వాడరాదు. వాటిని గిల్లడం, తాకడం చేయరాదు. చేతుల పరిశ్భుత చాలా అవసరం.
చేతిగ్రోళ్లని కత్తిరించుకోవాలి. మంట, నొప్పి తగ్గడానికి తడి గుడ్డ మరియు కోల్డ్‌క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఆంటివైరల్‌మందల్ని వాడాల్సి వస్తుంద. ఇవి అంటువ్యాధి. సులభంగా ఇతరులకి వ్యాప ిస్తాయి. కాబట్టి వారిని ముద్దుపెట్టుకోవడం, దగ్గరికి తీసు కోవడం చేయరాదు.
ముఖ్యంగా పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ త్వరగా వ్యాపి స్తాయి. ఈ చిన్న నీటి పొక్కుల్ని పగలకొట్టరాదు. 3-4 రోజుల్లో వాటింతట అవే పగిలిపోతాయి. పగిలిన తర్వాత వీటినే కోల్డ్ సోర్స్ అంటారు. వీటిని గిల్లరాదు. తగిన పోషకాహారం తీసుకోవాలి.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ 9703706660
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి