28, ఏప్రిల్ 2022, గురువారం

కామెర్లు నివారణకు తీసుకోవలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి


కామెర్ల బారిన ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

రోజూ మ‌నం తినే ఆహారాలు మ‌న‌కు శ‌క్తిని అందివ్వ‌డ‌మే కాదు, మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. అందువ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు త్వ‌ర‌గా కోలుకునేందుకు పౌష్టికాహారాల‌ను తీసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఇక కామెర్లు వ‌చ్చిన వారు ఆహారం విష‌యంలో ఇంకా జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు.

jaundice patients should take these foods to speed up recovery

రక్తంలో అధికంగా బైలిరుబిన్ అనే ప‌దార్థం పేరుకుపోవ‌డం వ‌ల్ల ప‌చ్చ కామెర్లు వ‌స్తాయి. ఇది ఒక ప‌సుపు రంగు పిగ్మెంట్‌. అందువ‌ల్ల శ‌ర‌రీం ప‌చ్చ‌గా మారుతుంది. క‌ళ్లు ప‌చ్చ‌గా మారుతాయి. ఎర్ర ర‌క్త క‌ణాలు విభజించ‌బ‌డ‌డం వ‌ల్ల అలా జ‌రుగుతుంది. లివ‌ర్ ఇబ్బందుల‌కు గుర‌వ‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది. లివ‌ర్ మ‌న శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను, దెబ్బ తిన్న క‌ణాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అయితే అధికంగా బైలిరుబిన్ ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మం, క‌ళ్లు, చిగుళ్లు ప‌సుపు రంగులోకి మారిపోతాయి.

మ‌న శ‌రీరంలో లివ‌ర్ అనే విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తిన్న ఆహారాల్లో ఉండే కొవ్వు ప‌దార్థాల‌ను సంశ్లేష‌ణ చేసేందుకు లివ‌ర్ చిన్న‌పేగుల‌కు స‌హాయం అందిస్తుంది. అందుకు గాను బైల్ జ్యూస్‌ను పంపిస్తుంది. దీంతో కొవ్వు క‌ణాలు విభ‌జించ‌బ‌డ‌తాయి. సుల‌భంగా జీర్ణం అవుతాయి. అలాగే మ‌న శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను లివ‌ర్ బ‌య‌ట‌కు పంపుతుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించేలా చేస్తుంది. మ‌నం ఏ ఆహారం తిన్నా స‌రే దాన్ని జీర్ణం చేసేందుకు లివ‌ర్ బాగా క‌ష్ట‌ప‌డుతుంది.

ఇక కొన్ని ఆహారాలు లివ‌ర్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. కొన్ని లివ‌ర్ పై ఒత్తిడిని క‌లిగిస్తాయి. దీంతో లివ‌ర్ ప‌నిచేయ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. జాండిస్ వ‌చ్చిన రోగులు లివ‌ర్‌-ఫ్రెండ్లీ ఆహారాల‌ను తిన‌డం వల్ల ఆ వ్యాధి నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు.

ప‌చ్చ కామెర్ల బారిన ప‌డ్డ‌వారు ఎంజైమ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, పోష‌కాలు అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకుంటే ఆ వ్యాధి నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు.

* ఈ వ్యాధి బారిన ప‌డ్డ‌వారు నీటిని ఎక్కువ‌గా తాగుతుండాలి. దీంతో లివ‌ర్‌కు మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డం సుల‌భ‌త‌రం అవుతుంది. శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను లివ‌ర్ సుల‌భంగా బ‌య‌ట‌కు పంపుతుంది. క‌నీసం రోజుకు 2 లీట‌ర్ల నీటిని అయినా తాగాలి. దీంతో కామెర్ల వ్యాధి నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు.

* పండ్లు, కూర‌గాయ‌ల‌ను పోష‌కాలకు గ‌నులుగా చెప్ప‌వ‌చ్చు. ఇవి అల‌స‌ట‌ను త‌గ్గిస్తాయి. ముఖ్యంగా వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబ‌ర్ జీర్ణ‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేస్తాయి. అన్ని ర‌కాల పండ్లు, కూర‌గాయలు మ‌న ఆరోగ్యానికి మంచివే. ఇక ద్రాక్ష‌, నిమ్మ‌, చిల‌గ‌డ దుంప‌లు, ట‌మాటాలు, క్యారెట్లు, పాల‌కూర వంటివి లివ‌ర్‌కు ఎంతో మేలు చేసే ఆహారాలు. క‌నుక వీటిని రోజూ తీసుకుంటే కామెర్ల నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు.

* జీర్ణాశ‌యానికి అవ‌సరం అయ్యే ఎంజైమ్‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా జాండిస్ నుంచి త్వ‌ర‌గా కోలుకోవచ్చు. తేనె, పైనాపిల్‌, బొప్పాయి, మామిడి పండ్ల‌ను తింటే మ‌న జీర్ణాశ‌యానికి కావ‌ల్సిన ఎంజైమ్‌లు ల‌భిస్తాయి. ఇవి జీర్ణ‌క్రియ‌ను సాఫీగా జ‌రిగేలా చూస్తాయి. దీంతో కామెర్ల నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు.

* కామెర్లు వ‌చ్చిన వారు రోజూ ఓట్స్‌, వాల్ న‌ట్స్ ను తీసుకోవడం వ‌ల్ల చాలా త్వ‌ర‌గా కోలుకుంటారు.

జాండిస్ ఉన్న‌వారు వేపుళ్లు, ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, మ‌సాలాలు, కారం ఆహారాలు, తీపి ప‌దార్థాల‌ను తిన‌రాదు. వీటి వ‌ల్ల లివ‌ర్‌పై భారం ఎక్కువ‌గా ప‌డుతుంది. లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోతుంది.

మ‌ద్యం జీర్ణం అయ్యేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. శ‌రీరానికి ఇది విషంతో స‌మానం. క‌నుక దీన్ని బ‌య‌ట‌కు పంపేందుకు లివ‌ర్ బాగా శ్ర‌మించాల్సి వ‌స్తుంది. క‌నుక మ‌ద్యం సేవించ‌కూడ‌దు. మ‌ద్యం సేవిస్తే లివ‌ర్ వాపుల‌కు గుర‌వుతుంది. ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. అది మ‌రింత అనారోగ్యాన్ని క‌ల‌గ‌జేస్తుంది. క‌నుక మ‌ద్యం తాగ‌డం మానేయాలి.

ఈ జాగ్ర‌త్ల‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల కామెర్ల వ్యాధి బారిన ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

కామెర్లు వచ్చినప్పుడు తినడానికి మంచి ఆహారాలు ఏమిటి?

  1. మజ్జిగ అన్నం ఎక్కువ తినాలి.
  2. పాలు ఎక్కువగా తీసుకోవాలి.
  3. అన్ని ఆకుకూరలు తీసుకోవచ్చు గోంగూర మాత్రం తీసుకోకూడదు.
  4. అన్ని కూరగాయలు తీసుకోవచ్చు దుంపకూరలు తీసుకోకూడదు.
  5. మాంసాహారం మూడు నెలలపాటు తీసుకోకూడదు.
  6. కోడి గుడ్లు కూడా తీసుకోకూడదు.
  7. బెల్లం తినకూడదు, టెంకాయ తినకూడదు.


కామెర్లు రోగలక్షణమేకాని రోగంకాదు. ABC అనే మూడు వేరువేరు వైరస్లవల్ల కామెర్లు రావచ్చు. వళ్ళు, కళ్ళు పచ్చబడడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. A టైపు వైరస్ వ్యాధి సాధారణంగా పసిప్రాయంలో కనిపిస్తుంది. వైద్యం చేసినా చేయకపోయినా సాధారణంగా తగ్గిపోతుంది. కాల్చడాలు, పసుర్లు, మంత్ర తంత్రాలు చేసేవారు పూర్వం. కఠినంగా పథ్యం. అంతా విశ్వాసమే. నిజంకాదు.

B టైపు వ్యాధి ఇంజక్షన్ సూదులు, సర్జరీ, రక్తం మార్పిడి, శరీర సంబంధం వంటివాటిద్వారా సంక్రమిస్తుంది. చాలా ప్రమాదకరమైన వ్యాధి. వైద్యుల సలహా అవసరం. వైద్యం అవసరం. అమితాబ్ ఈ వ్యాధిపాలై జీవితాంతం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నయమయినా, యాభై ఏళ్ళ ప్రాయంలో లివర్ కేన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని వైద్యులు అంటున్నారు.

సి టైపు కూడా ఉంది. వైద్యం అవసరం. మూడింటికి వేక్సిన్లు ఉన్నాయి. బి వైరస్ వేక్సిను యువజనం వేయించుకుంటే మంచిది, ఐదేళ్ళకొకసారి బూస్టర్ డోసు వేయించుకోవాలి.

ఏ ఆహారం పానీయాలద్వారా సంక్రమిస్తుంది. కలుషితాహారం, రోగి మలమూత్రాలద్వారా..

వీధుల్లో బళ్ళమీద ఈగలు వాలిన ఆహారం తినరాదు.

ఇంజెక్షన్ లు డిస్పోసబుల్సు మాత్రమే వాడాలి. ఇంకా పల్లెల్లో సిరంజిలు మళ్ళీ మళ్ళీ వాడకం ఉంది. రోగితో జాగ్రత్తగా వ్యవహరించడం.

మా మేనత్త సూదులతో మంత్రించేది. అలాచేస్తే తగ్గుతుందని విశ్వాసం. ఏ వైరస్ తనంతట తానే తగ్గుతుంది కనక మంత్రం ప్రభావం అనుకునేవారు. ఇంత తెలుసుకున్నా వేక్సిన్లు గురించి ఎంతమంది శ్రద్ధతీసుకుంటారు. మొదటి రోజు సినీమా టిక్కెట్ కోసం ఖర్చు చేసిన దాంట్లో నాలుగో భాగం చాలు వేక్సిన్ వేయించుకోడానికి. రెడ్ క్రాస్ ను సంప్రదించండి వివరాలకు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: https://t.me/HelathTipsbyNaveen

ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660,
          విశాఖపట్నం 

1 కామెంట్‌:

kaveri చెప్పారు...

Good information telangana
has been provided about