27, డిసెంబర్ 2019, శుక్రవారం

మానసిక సమస్య నుండి బయటకు రావాలి అంటే


మానసిక రోగాలకు చికిత్సఎలా ఉంటది అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు ?

edti

 

ప్రజారోగ్యం గురించి మనం మాట్లాడుతుంటాం కాని దేశంలో మానసికారోగ్యం పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఒక అంచనా ప్రకారం పదిహేను కోట్ల మంది భారతీయులు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక మానసిక రుగ్మతలకు గురై ఉన్నారు. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే 2015-16 ప్రకారం భారతదేశంలో మానసికారోగ్యం పట్ల శ్రద్ధ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరిని ఏదో ఒకవిధమైన మానసిక రుగ్మత పీడిస్తోంది. గమనించవలసిన మరో వాస్తవమేమంటే, అల్పాదాయానికి, మానసిక సమస్యలకు సంబంధం ఉన్నట్లు ఈ సర్వేలో తెలిసింది.
గత సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ బెంగుళూరులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ 22వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. దేశంలో మానసికారోగ్యం గురించి మాట్లాడారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశం మానసికారోగ్యానికి సంబంధించిన ఒక విపత్తును ఎదుర్కోవచ్చని హెచ్చరించారు. మానసిక సమస్యలను నివారించడానికి 2022 వరకు మెంటల్ హెల్త్ కేర్ ఫెసిలిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. బాలీవుడ్ నాయిక దీపికా పదుకునె తాను ఎదుర్కొన్న డిప్రషన్ గురించి చెప్పడం ద్వారా ప్రజల్లో ఈ సమస్య గురించి చర్చ జరిగే వాతావరణం ఏర్పరిచారు. ఆమె తాను ఎదుర్కొన్న పరిస్థితిని, డిప్రషన్ నుంచి ఎలా బయటపడిందో ఆ వివరాలను, ఆమెకు సహాయపడిన మానసిక నిపుణులు, కుటుంబసభ్యులు, వైద్యచికిత్సల గురించి తెలియజేశారు. సమస్యేమిటంటే దీపికా పదుకునే వంటి వారు తమ సమస్యకు చికిత్స చేయగలిగిన వైద్యుడిని వెదికి చికిత్స పొందడం సులభం. చికిత్సకయ్యే ఖర్చును భరించడం కూడా వారికి కష్టం కాదు. కాని దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు మానసిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, అందులో చాలా మంది పేద, బలహీనవర్గాలైనప్పుడు సమస్య తీవ్రమవుతుంది. అందుకే దేశంలో ఈ విషయమై చర్చ జరగవలసి ఉంది. ముఖ్యంగా పేద బలహీనవర్గాలు ఎదుర్కొనే ఇలాంటి సమస్యలపై మాట్లాడవలసిన అవసరం ఉంది.
నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీని 1982లో ప్రవేశపెట్టారు. దేశంలో మానసికారోగ్య కేంద్రాలు లేని సమస్యను నివారించడానికి ఈ విధానం తీసుకొచ్చారు. మానసిక అనారోగ్యానికి చికిత్స అందజేయడమే కాదు, దాంతో పాటు ప్రజల మానసికారోగ్యానికి అవసరమైన చర్యలు తీసుకోవడం కూడా ఈ విధానం ఉద్దేశం. అయినా భారతదేశం ఈ విషయంలో ఇంకా వెనుకబడి ఎందుకుందన్నది ఆలోచించవలసిన ప్రశ్న. ఈ పాలసీ అమలు విషయంలో సమీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
దేశంలోని మానసికారోగ్య కేంద్రాలన్నీ మానసిక రుగ్మత వల్ల తలెత్తే బయాలజికల్ ప్రభావాలను నివారించడానికి ఉద్దేశించినవి మాత్రమే. సైకో సోషల్ , మనో సామాజిక కోణంలో సమస్య పరిష్కారానికి జరిగిన ప్రయత్నాలు చాలా తక్కువ. తక్కువ స్థాయి విద్య జీవనప్రమాణాలు ఉన్న వారిలో మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు తెలుపుతున్నాయి. నిమ్నస్థాయి సాంఘిక, ఆర్ధిక నేపథ్యాల నుంచి వచ్చినవారు అనేక మానసిక సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. భారతదేశం 2020 నాటికి మానసిక రుగ్మతల విషయంలో ప్రపంచంలోనే అత్యధికమంది బాధితులు ఉన్న దేశంగా మారవచ్చు. డిప్రషన్ (మానసిక కుంగుబాటు), యాంగ్జయిటీ (ఆందోళన) వంటి రుగ్మతలు పెరిగిపోవచ్చు. వీరికి పునరావాస కల్పనలో శిక్షణ పొందిన మనీషా శాస్త్రి చెప్పిన మాటలివి.
దేశంలో మానసికారోగ్యానికి సంబంధించి చికిత్సా సదుపాయాలు చాలా తక్కువగా ఉండడానికి ఒక ముఖ్యమైన కారణమేమంటే, మానసిక రుగ్మతలను మనం పెద్దగా పట్టించుకోం. సమాజంలో ఈ విషయమై అవగాహన, చైతన్యం లేదు. అనేక మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఉన్నాయి. మానసిక సమస్య ఎందుకు తలెత్తిందో అర్ధం చేసుకునే వాతావరణం లేదు. అసలు మానసిక రుగ్మత ఎలాంటిదో అర్ధమయ్యే పరిస్థితి కూడా లేదని మనీషా శాస్త్రి అన్నారు.
నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే మానసికారోగ్య కేంద్రాలు అందుబాటులో ఉండేలా చూడడం. ముఖ్యంగా బలహీన, పేదవర్గాల ప్రజలకు, ఇల్లు వాకిలి లేనివారికి, మారుమూల ప్రాంతాల వారికి, సామాజికంగా, ఆర్ధికంగా, విద్యాపరంగా అణగారిన వారికి అందుబాటులోకి వచ్చేలా చేయడం.
దేశంలో మానసికారోగ్యానికి సంబంధించి, ముఖ్యంగా మానసిక సమస్యలు ఏవి ఎక్కువగా ఉన్నాయన్న వివరాలు లేవు. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించే విధానాలను అమలు చేయడం కూడా సాధ్యం కాదని మానసికారోగ్యానికి సంబంధించి విధానాల రూపకల్పన, సలహాసూచనల కోసం పనిచేస్తున్న మనిషా శాస్త్రి అన్నారు. నిజానికి ఇదొక విషవలయం, సామాజిక భద్రత, విద్య,ఆరోగ్యం, నివాసగృహం వగైరా కనీస సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వంటివి ఎమోషనల్ సమస్యలకు కారణమవుతాయని అధ్యయనాల వల్ల తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో చాలా పెద్ద జనాభా బతుకుతోంది. ఈ పరిస్థితులు మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కొందరికి జన్యుపరంగా కూడా మానసికాందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వ్యక్తులకు ఈ కారణాల వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. ఈ సమస్య తీవ్రం కావడం వల్ల వారి జీవన పరిస్థితి దిగజారుతుంది. దాంతో సమస్య మరింత జటిలమవుతుంది.
దేశంలో కొన్ని కేంద్రాలు మానసికారోగ్యం కోసం పనిచేస్తున్నాయి. ది లివ్ లాఫ్ ఫౌండేషన్ను దీపికా పదుకునే ప్రారంభించారు. కాని దేశంలో బలహీన పేదవర్గాల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే అనేక కేంద్రాలు సంస్థల అవసరముంది. ఢిల్లీలో ఇలాంటి ఒక కేంద్రం పనిచేస్తున్నది. మనస్ ఫౌండేషన్ పేరుతో ఈ కేంద్రం పనిచేస్తోంది. కమ్యూనిటీ మెంటల్ హెల్త్ కేర్ రంగంలో సేవలందిస్తోంది. చికిత్సా పద్ధతులతోను, చైతన్యం పెంచడం ద్వారాను బలహీన, పేదవర్గాల ప్రజల్లో మానసిక ఆరోగ్యం కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. మానసికారోగ్యాన్ని మనోసామాజిక కోణంతో అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తోంది. మానసిక రుగ్మతలను నివారించడం ఇతర ఆరోగ్య సమస్యల వంటిది కాదు. ఈ ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజరుగా పనిచేస్తున్న కృతా రౌత్ ఈ విషయమై మాట్లాడుతూ, షుగరు వ్యాధి ఉన్నవారికి ఆ వ్యాధి నుంచి బయటపడమని చెప్పనవసరం లేదు. కాని మానసిక రుగ్మతతో బాధపడే వ్యక్తికి ఆ రుగ్మత నుంచి బయటపడమని చెప్పడం సాధ్యం కాదు. ఈ సమస్య పరిష్కారం చాలా సున్నితమైనది. పైగా మానసిక రుగ్మతలకు వైద్యం కూడా ఖరీదైనదిగా మారింది. అందువల్ల పేద, బలహీనవర్గాలు ఈ చికిత్స పొందడం సాధ్యపడడం లేదు.
ఆసుపత్రుల్లో వారికి సహాయం లభించదు. చికిత్సా ప్రక్రియ ఖరీదైనది కావడం వల్ల, చికిత్స పొందే వ్యక్తి సుదీర్ఘకాలం చికిత్స పొందవలసి ఉండడం వల్ల పేద బలహీనవర్గాలకు ఇది స్తోమతకు మించిన పనవుతుంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రుగ్మతలకు చికిత్సా కేంద్రాలుండవు. నగరాలకు తరలి రావలసి ఉంటుంది. నగరాల్లో చికిత్సా కేంద్రాలు చాలా తక్కువ. కాబట్టి, చికిత్స అందుబాటులో లేకపోవడం, ఖరీదైనది కావడం వల్ల పేద బలహీనవర్గాలే కాదు మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వారికైనా ఇది తలకు మించిన భారమైపోతోంది. దేశంలో ప్రతి మూడులక్షల మంది మానసిక రోగులకు ఒక డాక్టరు మాత్రమే ఉన్నారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

*సభ్యులకు విజ్ఞప్తి*

******************

 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 

ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/


అతి మధురంవసతినటం వలన లాభాలుతినటం వలన నష్టాలు( ఆయుర్వేదిక్ )అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు


వసకొమ్ము ద్వార ఆయుర్వేద గృహ చికిత్సలు నవీన్ సలహాలు 

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి

వస ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం అకోరస్ కెలామస్ (Acorus calamus). ఇది అకోరేసి (Acoraceae) కుటుంబానికి చెందినది. పూర్వం మనదేశంలో అన్ని పల్లెసీమలలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇప్పటికీ ఈ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతునేయున్నది. దీని వలన గొంతులోని కఫం పోవడమే గాక ఉత్తరోత్తరా మాటలు స్పస్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు.

ప్రాంతీయ నామములు

ఇంగ్లీషుస్వీట్ ఫ్లాగ్
సంస్కృతంవచ, ఉగ్రగంధ, షడ్గ్రంధ
హిందీగుడ్ బచ్
కన్నడంబజేగిడా
మళయాళంబవంబు
పార్శిఅగరేతుర్కీ
ల్యాటిన్అకోరస్ కలమస్

ఉపయోగపడే భాగం

వస దుంప (రైజోమ్).--వసకొమ్ముతో తయారయ్యే ఔషధాలు--వచాది ఘృతం, వచాది చూర్ణం, సారస్వత చూర్ణం.

ఆధునిక ప్రయోగ ఫలితాలు

  • నర్వైన్ టానిక్ (నరాలను శక్తివంతం చేస్తుంది)
  • హైపోటెన్సివ్ (రక్తపోటును తగ్గిస్తుంది)
  • ట్రాంక్విలైజర్ (నిద్రకు సహాయపడుతుంది)
  • అనాల్జెసిక్ (నొప్పినితగ్గిస్తుంది)
  • స్పాస్మోలైటిక్ (కడుపునొప్పి, బహిష్టునొప్పి వంటి అంతర్గత నొప్పులను తగ్గిస్తుంది)
  • యాంటీ కన్వల్సెంట్ (మూర్ఛలను నియంత్రిస్తుంది)
  • యాంటీ కెటారల్ (కఫాన్ని పలుచన చేసితగ్గిస్తుంది)
  • యాంటీడయేరల్ (అతిసారాన్ని ఆపుతుంది)
  • యాంటిడిసెంటిరిక్ (జిగట విరేచనాలను తగ్గిస్తుంది)

ఆయుర్వేద గృహ చికిత్సలు

అతిసారం (నీళ్ల విరేచనాలు)

వస కొమ్ములు, తుంగముస్తల గడ్డలు, పసుపు, శొంఠి కొమ్ములు కచ్చాపచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం కాచి తీసుకోవాలి. (చరక సంహిత చికిత్సాస్థానం,అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం చికిత్సాస్థానం)

మూర్ఛలు (ఎపిలెప్సీ)

బ్రాహ్మీ రసం, వస కొమ్ము, చెంగల్వకోష్టు వేరు, శంఖపుష్పి (వేరు, ఆకులు)లను పాత నెయ్యికి కలిపి ఘృతపాకం విధానంలో ఘృతం తయారుచేసి వాడితే ఉన్మాదం, మూర్ఛలు తదితర రుగ్మతలు తగ్గుతాయి. (చరకసంహిత చికిత్సా స్థానం),

వసకొమ్ము పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మూర్ఛలు తగ్గుతాయి. దీనితోపాటు వెల్లుల్లి వేసి తయారుచేసిన నువ్వుల నూనెను అనుపానంగా తీసుకుంటే మంచిది. ఈ చికిత్సాకాలంలో పాలను ఆహారంగా తీసుకోవాలి. మూర్ఛవ్యాధి ఎంత మొండిదైనా, దీర్ఘకాలంనుంచి వేధిస్తున్నా దీనితో ఫలితం కనిపిస్తుంది. (చరక సంహిత చికిత్సాస్థానం, వృందమాధవ, వంగసేన సంహిత అపస్మార అధికరణం, సిద్ధ్భేషజమణిమాల)

శరీరపు వాపు

వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే శరీరపు వాపు తగ్గుతుంది.

ఎసిడిటీ (ఆమ్లపిత్తం)

వస చూర్ణాన్ని తేనె, బెల్లంతో కలిపి తీసుకుంటే ఆమ్లపిత్తంలో హితకరంగా ఉంటుంది.ఎసిడిటి తగ్గుతుంది,

చర్మవ్యాధులు

వసకొమ్ములు, చెంగల్వకోష్టు వేరు, విడంగాలను మెత్తగా నూరి, నీళ్లు కలిపి ముద్దచేసి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మవ్యాధుల్లో హితకరంగా ఉంటుంది.

మొటిమలు

వసకొమ్ముల గంధం, లొద్దుగచెక్క గంధం, ధనియాల పొడిని కలిపి ముఖంమీద ప్రయోగిస్తే యవ్వనంలో వచ్చే మొటిమలు తగ్గుతాయి.

తలనొప్పి (అర్ధశిరోవేదన)

పచ్చి వస కొమ్మును దంచి, రసం పిండి పిప్పళ్లు పొడిని గాని ఇప్ప పువ్వుల రసాన్ని గాని కలిపి తేనె కూడా చేర్చి ముక్కులో నస్యం రూపంలో బిందువులుగా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా సూర్యావర్తం, అర్ధావభేదం వంటి తలనొప్పుల్లో ఇది అమితమైన ఫలితాన్ని చూపిస్తుంది.

జుట్టు ఊడటం

వసకొమ్ము, దేవదారు వేరు పట్ట లేదా గురవింద గింజలను ముద్దగా నూరి జుట్టు ఊడినచోట లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనికి ముందు సిరావ్యధనం ద్వారా రక్తమోక్షణం చేయాల్సి ఉంటుంది.

గాయాలు, అభిఘాతాలు, దుష్టవ్రణాలు

వస కొమ్ము వేసి కాచిన నీళ్లతో వ్రణాన్ని కడిగి శుభ్రంచేస్తే త్వరితగతిన మానుతుంది.

పసిపిల్లల్లో కళ్లు అతుక్కుపోవటం

వసకొమ్ము పొడిని తేనెతో కలిపి గాని లేదా మదనఫలాన్ని ఇప్ప పువ్వులతో కలిపి ముద్దగా నూరి గాని పిల్లలకు నాకించి వాంతిని కలిగిస్తే కళ్లు పుసులుకట్టి అతుక్కుపోవటం తగ్గుతుంది.

వసకొమ్ములను వేసి ఘృతపాక విధానంలో నెయ్యిని తయారుచేసి, వందసార్లు ఆవర్తం చేసి దీర్ఘకాలంపాటు వాడితే శరీరం వజ్ర సమానంగా తయారవుతుంది. వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

మంచి జ్ఞాపకశక్తి, చక్కని కంఠస్వరంకోసం

వసకొమ్ములను పాలలోవేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి, కోకిల లాంటి కంఠస్వరం, మంచి శరీర కాంతి సిద్ధిస్తాయి. సూక్ష్మజీవులు దాడి చేయకుండా ఉంటాయి. వస కొమ్ములను ఆవునెయ్యికి కలిపి ఘృతపాక విధానంలో నెయ్యిని తయారుచేసి కూడా వాడుకోవచ్చు.

కడుపునొప్పి

వస కొమ్ములు, సౌవర్చల లవణం, ఇంగువ, చెంగల్వకోష్టు వేరు, అతి విష వేరు, కరక్కాయలు, కొడిశపాల గింజలు వీటిని కలిపి తీసుకుంటే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.

అర్శమొలలు :

వసకొమ్ములను, సోంపు గింజలను కలిపి నూరి ముద్దగాచేసి అర్శమొలల మీద ప్రయోగించాలి. దీనికి ముందు నువ్వుల కాలి పి రాసుకోవాలి 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

*సభ్యులకు విజ్ఞప్తి******************* మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

26, డిసెంబర్ 2019, గురువారం

సొరియాసిస్ వచ్చాక తీసుకోవాలిసిన జాగ్రత్త అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు



సారాంశం

సోరియాసిస్ చర్మపు కణాల అసాధారణ వృద్ధి వల్ల ఏర్పడిన దీర్ఘకాలి స్థితి. ఈ చర్మ కణాలు వేగంగా వృద్ధి అవుతాయి మరియు ప్రభావిత ప్రాంతం యొక్క వాపును ప్రేరేపిస్తాయి. సోరియాసిస్ వలన సాధారణంగా చర్మంపై ఎరుపు ప్యాచెస్ ఏర్పడడానికి కారణమవుతుంది. ఎరుపు పాచెస్ నొప్పికి కారణమవుతాయి మరియు భయంకరమైన దురద కలిగి వెండి-తెలుపు వంటి పొరలతో కప్పబడి ఉంటాయి. శారీరకమైన లక్షణాలు పెరుగుతున్న మరియు క్షీణిస్తున్న అనేక దశలను చూపుతాయి, కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యాధికి ఎలాంటి శాశ్వత నివారణ లేదు. అయితే, తగిన చికిత్సతో, వ్యాధి లక్షణాలు నియంత్రణలో ఉంచబడతాయి. జీవనశైలి మార్పులతో (ఒత్తిడిని నివారించడం, తేమను ఉపయోగించడం, ధూమపానం మరియు మద్యపానాన్ని తొలగించడం వంటివి) తో పాటు పాటు టార్గెట్ చికిత్స (స్థానిక అనువర్తనం, ఫోటో థెరపీ మరియు నోటి ద్వారా తీసుకొనే మందులు) సాధారణంగా ఉపశమనం యొక్క కాలం (లక్షణం లేని దశ) పొడిగింపు చేయబడుతుంది

      
సోరియాసిస్ యొక్క లక్షణాలు - 

వ్యక్తులను బట్టి మరియు సోరియాసిస్ రకం బట్టి సోరియాసిస్ లక్షణాలు మారుతూ ఉంటాయి. ఈ ప్యాచ్లు కొన్ని మచ్చలు నుండి పెద్ద గాయాలు వరకు ఉంటాయి. చర్మం, మోచేతులు, మోకాలు, చేతులు మరియు కాళ్ళు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు.

సోరియాసిస్ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • చర్మంపై ఎరుపు  మచ్చలు కనిపించడం, ఇవి మందపాటి వెండి పొరలుగా ఉంటాయి.
  • ఈ మచ్చలు దురదలా మారుతాయి, మంటను కలిగిస్తాయి మరియు బాధ కలిగించడానికి కారణమవుతాయి.
  • కొన్నిసార్లు చర్మం అధిక పొడిగా ఉండడం లేదా స్క్రాచ్ కారణంగా రక్తస్రావం జరుగవచ్చు.
  • ప్రభావితమైన ప్రాంతాలు చర్మం,మోచేతులు, మోకాలు లేదా ఎగువ శరీర భాగం.
  • నెయిల్ సోరియాసిస్ వలన గోళ్ళ యొక్క మందం, గుంతలు అవడం మరియు రంగు మారడం వంటి లక్షణాలకు కారణమవుతుంది. గోర్లు వాటి ఆధారం నుండి కొన్నిసార్లు ఊడిపోతాయి.
  • పస్టులర్ సోరియాసిస్ అనేది చేతులు మరియు కాళ్ళ మీద చీము నిండిన ఎర్రని-పొరలు, పగిలిన చర్మం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.

సాధారణంగా, ఈ లక్షణాలు వృద్ది చెందుతున్న మరియు క్షీణిస్తున్న క్రమానుగత లేదా వలయాలను చూపుతాయి. లక్షణాలు కొన్ని రోజులు లేదా వారాల వరకూ  తీవ్రంగా ఉండవచ్చు మరియు సాధారణ స్థితికి వస్తాయి లేదా కొన్నిసార్లు అవి కూడా నయం అవుతాయి మరియు గుర్తించదగినవి కావు. ఆపై మళ్ళీ, ఈ ప్రభావాలు రేకెత్తించే లక్షణాల కారణoగా మరల కనిపిస్తాయి.

సోరియాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు క్రింది వాటితో సహా:

  • శరీరంలో ఒక వైపు లేదా ఇరువైపులా కీళ్ల ప్రమేయం.
  • ప్రభావిత కీళ్ళు బాధాకరమైనవిగా మరియు వాపు  కలిగి తాకడం వలన వెచ్చని అనుభూతి పొందవచ్చు.
  • వేళ్లు మరియు కాలి యొక్క కీళ్ళు వాపు వలన సాసేజ్-లాంటివిగా కనిపిస్తాయి మరియు ఇవి వైకల్యాలకు కారణమవుతాయి.
  • కొన్నిసార్లు, వెన్నుపూస మధ్య కీళ్ళు ప్రభావితం అవుతాయి మరియు నడుము నొప్పి లక్షణాలు (లంబర్ స్పొండిలైటిస్ ను పోలి ఉంటుంది) కలిగి ఉంటుంది.
  • ప్రభావిత అకిలెస్ స్నాయువు మరియు అరికాలి అంటిపట్టుకొన్న కణజాలము మడమ లేదా వెనుక పాదంలో తీవ్రమైన నొప్పికి కారణమవుతుంది. (మరింత చదవండి - మడమ నొప్పి కారణాలు మరియు చికిత్స)

సోరియాసిస్ యొక్క చికిత్స -

సోరియాసిస్ కు శాశ్వతంగా నయమయ్యే చికిత్స లేదు. చికిత్స అనేది వ్యక్తి యొక్క జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మరియు లక్షణాలను ఉపశమనం చేసుకొనే లక్ష్యంతో చేయబడుతుంది. సోరియాసిస్ చికిత్స 3 కేటగిరీలుగా విభజించబడింది- పైపూత చికిత్స, క్రమబద్ధమైన మందులు వాడుక మరియు ఫోటో థెరపీ (కాంతి చికిత్స)

  • పైపూత చికిత్స
    తేలికపాటి సోరియాసిస్ లో, పైపూత మందులు మాత్రమే సరిపోవచ్చు.  మధ్యస్థమైన లేదా తీవ్రమైన సోరియాసిస్ లో, పైపూతగా రాసే మందులతో పాటుగా నోటి ద్వారా తీసుకునే మందులు లేదా ఫోటోథెరపీ అవసరం అవుతుంది. పైపూతగా రాసే మందులలో ఇవి ఉంటాయి:
    • కోర్టికోస్టెరాయిడ్లు
    • విటమిన్ డి అనలాగ్‌లు
    • పైపూత రెటీనాయిడ్లు
    • శాలిసైలిక్ ఆసిడ్
    • కోల్ తార్
    • కాల్సినీయురిన్ ఇన్‌హిబిటర్లు
    • ఆంత్రాలిన్
    • మాయిశ్చరైజర్లు
  • క్రమబద్ధమైన మందుల వాడుక
    సోరియాసిస్ తీవ్రమైన లేదా సమయోచిత చికిత్సకు ఆటంకo కలిగితే నోటి లేదా సూది మందులు సూచించబడతాయి. సాధారణంగా, ఈ మందులు తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి, అందుచే అవి తక్కువ వ్యవధి కోసం ఉపయోగించబడతాయి మరియు ఇతర రకాల చికిత్సలతో ప్రత్యామ్నాయoగా చేయబడతాయి. సోరియాసిస్ కు చికిత్స చేయడానికి వాడే మందులు:
  • మెథోట్రెక్సేట్
  • సైక్లోస్పోరిన్
  • రెటీనాయిడ్లు
  • ఇమ్యునోమోడ్యులేటర్లు
  • హైడ్రాక్సీయూరియాస్
  • ఫోటో థెరపీ
  • ఆదర్శ ఫోటో థెరపీలో అల్ట్రా-వైలెట్ కిరణాల (సహజ లేదా కృత్రిమ) కు ఈ పొరల గాయాలను గురవుతాయి. సాధారణంగా తీవ్రమైన సోరియాసిస్ యొక్క మోతాదు సమయోచిత చికిత్సా ప్రయోజనాలలో లేదా క్రమబద్ధమైన మందుల వాడుకతో కలిపి ఫోటోథెరపీతో సహా నిర్వహించబడుతుంది. వివిధ రకాల తేలిక చికిత్స రూపాలలో ఈ క్రిందివి చేరి ఉంటాయి:
    • ఎండ తగులుట
    • యువిబి ఫోటోథెరపీ
    • గోకర్‌మ్యాన్ థెరపీ
    • లేజర్ థెరపీ
    • సోరాలెన్ ప్లస్ అల్ట్రావయొలెట్ ఎ థెరపీ

జీవనశైలి యాజమాన్యము

సోరియాసిస్ ఒక వ్యక్తి యొక్క జీవనశైలిని అలాగే అతని/ ఆమె యొక్క జీవన నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. సోరియాసిస్ గురించి అవగాహన అనేది ఒక వ్యక్తి సోరియాసిస్­ని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనుటలో సహాయ పడుతుంది. ఇది వ్యాధిని నయం చేయుటలో మరియు వ్యాధి ప్రభావాలకు పరిష్కారాలను కనుగొనుటలో సహాయపడుతుంది. ఈ కోలుకునే పద్ధతులలో ఈ క్రిందివి ఉంటాయి:

  • ఒత్తిడి యాజమాన్యము
    ఒత్తిడి అనేది సోరియాసిస్ యొక్క అత్యంత ఎక్కువగా గురి అయ్యే కారక అంశాలలో ఒకటి.
  • దురద లేకుండా చేయుట
    సాధారణంగా, దురద ఒక దుష్ట వలయo లాగానే ఉంటుంది, మీరు మరింతగా గోకినపుడు అది మరింత దురదను కలిగిస్తుంది. కాబట్టి, ముఖ్యంగా సోరియాసిస్ అనేది చర్మం యొక్క పొరల కోసం, దురదను నివారించడం కోసం గోకడం మానుకోవాలి. మాయిశ్చరైజర్ల ఉపయోగం దురదను తగ్గించడంలో సహాయపడుతుంది. 
  • బరువు నియంత్ర్రణ
    బరువు కోల్పోవడం లేదా లక్ష్యిత BMI సాధించడంలో సోరియాసిస్ లక్షణాల తీవ్రత తగ్గించడం అనేది బాగానే పనిచేస్తుంది. అంతేకాకుండా, పండ్లు, కూరగాయలు, కాయ ధాన్యాలు, క్రొవ్వు లేని మాంసం మరియు చేపలు కలిగిన ఆహారాన్ని సోరియాసిస్ మీద సానుకూల ప్రభావం చూపుతుంది. మరోవైపు ఎర్రని మాంసం, అధిక కొవ్వు గల పాల ఉత్పత్తులు, శుద్ధి చేసిన ఆహారం మరియు ఆల్కహాల్ వంటివి సోరియాసిస్­ని మరింత తీవ్రతరం చేస్తాయి.
  • ఒత్తిడి యాజమాన్యము
    ఒత్తిడి అనేది సోరియాసిస్ యొక్క అత్యంత ఎక్కువగా గురి అయ్యే కారక అంశాలలో ఒకటి

సోరియాసిస్ అంటే ఏమిటి? 

మనుషులకు సోకే చర్మ వ్యాధులు వందకు పైగా ఉన్నాయి. ఈ స్థితులలో అత్యధికం ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో అధిక భాగం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. తాత్కాలికమైన లేదా శాశ్వతమైన, బాధాకరమైన లేదా నొప్పిలేకుండా, దురద కలిగిన లేదా దురద లేని లక్షణాల ఆధారంగా ఈ పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. కారణాలు భిన్నంగా ఉంటాయి మరియు రోగనిరోధక వ్యవస్థ మరియు జన్యువుల్లోని అలెర్జీ, ఇన్ఫెక్షన్, లోపాలు కూడా కారణం కావచ్చు. లక్షణాలు వాటి తీవ్రతను బట్టి మారుతుంటాయి. కొన్ని లక్షణాలు తక్కువగా ఉంటాయి మరియు అదృశ్యం అవుతాయి, అయితే కొన్ని చాలా తీవ్రంగా ఉంటాయి మరియు ఆసుపత్రిలో చేరవలసి వస్తుంది. సోరియాసిస్ ప్రపంచ జనాభాలోని 5% మందిని ప్రభావితం చేసే అత్యంత సాధారణ చర్మ వ్యాదుల్లో ఒకటి.

సోరియాసిస్ అంటే ఏమిటి?

సోరియాసిస్ చర్మ కణాల పెరుగుదలను హెచ్చించుట ద్వారా చర్మం యొక్క వృద్ధి వేగవంతం అయ్యే ఒక స్థితి. ఇది చర్మ కణాల నిర్మాణానికి దారితీస్తుంది. కణాలు ఈ సమూహాలుగా చేరి దురదను కలిగి ఉంటాయి మరియు ఎరుపుగా మారుతాయి మరియు కొన్నిసార్లు ఇవి బాధాకరమైనవిగా కూడా  ఉంటాయి. ఇది ఎక్కువ కాలం (దీర్ఘకాలిక) ప్రభావం చూపే ఒక స్థితి, ఇది ఒక క్రమానుగత నమూనాలో కనిపిస్తుంది. ఇది పూర్తిగా నయo అవదు మరియు అందువల్ల చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం దీని లక్షణాలను నియంత్రణలో ఉంచడమే.

సోరియాసిస్ కొన్ని మందులు మీ ఫ్యామిలీ చూచన మేరకు వాడాలి 

Medicine NamePack SizePrice (Rs.)
BetnesolBETNESOL 0.1% EYE DROPS 5ML0
AerocortAEROCORT CFC FREE 200MD INHALER164
AdapanAdapan Gel 15gm97
Candid GoldCANDID GOLD 30GM CREAM59
Exel GnExel Gn 0.05% W/W/0.5% W/W Cream41
Propyderm NfPROPYDERM NF CREAM 5GM60
AdapenAdapen 0.1% W/W Gel106
Propygenta NfPROPYGENTA NF CREAM 20GM122
PropyzolePropyzole Cream0
AdaretAdaret 0.1% W/V Gel76
Propyzole EPropyzole E Cream0
ClostafCLOSTAF 0.05% CREAM 15GM0
AdeneAdene 0.1% Gel60
Canflo BnCanflo Bn 1%/0.05%/0.5% Cream34
Tenovate GnTenovate Gn Cream24
Toprap CToprap C Cream28
AdhibitAdhibit Gel60
Crota NCrota N Cream27
Clop MgClop Mg 0.05%/0.1%/2% Cream34
FubacFUBAC CREAM 10GM0
Canflo BCanflo B Cream27
Adiff AqsAdiff Aqs 0.1% W/W Gel127
Sigmaderm NSigmaderm N 0.025%/1%/0.5% Cream45
Clovate GmClovate Gm Cream0
FucibetFUCIBET 10GM CREA
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

*సభ్యులకు విజ్ఞప్తి*

******************

 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 

ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/


ఆరోగ్యం గా ఉండాలి అంటే ఈలా చేయండి

Daily activities : 

*ఆరోగ్యానికి  నియమాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

1. ఉదయం 4.30 కి నిద్ర లేవాలి 
2. లేచిన వెంటనే గ్లాస్ గోరు వెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
3. ఐస్ క్రీం  ఎప్పుడూ తినకూడదు.
4. ఫ్రిజ్ లో తీసినవి గంట తర్వాత తినాలి 
5. కూల్ డ్రింక్స్  త్రాగకూడదు.
6. వండిన ఆహారం వేడిగా 40ని.లో తినాలి
7. భోజనం  తర్వాత వజ్రాసనం  5 - 10 నిమిషాలు వేయాలి
8. ఉదయంటిఫిన్ 8.30 గం లోపు తినాలి
9. ఉదయం టిఫిన్ తో పండ్లరసం త్రాగాలి
10. టిఫిన్ తిన్నాక తప్పకుండా పని చేయాలి.
11. మధ్యాహ్నం లోగా మంచినీరు  2,3 గ్లాసులు త్రాగాలి 
12. మంచినీళ్ళు భోజనానికి 48 ని.ముందు త్రాగాలి 
13. భోజనం క్రింద కూర్చుని తినాలి
14. ఆహారం బాగా నమిలి మ్రింగాలి
15. మధ్యాన్నం కూరల్లో వాముపొడి వాడాలి
16. మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి 
17. మధ్యాన భోజనం తర్వాత  మజ్జిగ  త్రాగాలి
18. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి  
19. రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి
20. రాత్రి పూట చాలా తక్కువగా, తినాలి
21. రాత్రి భోజనంతర్వాత 1కి.మీ నడవాలి
22. రాత్రి భోజనంతర్వాత గంటకు పాలు త్రాగాలి.
23. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగకూడదు
24. రాత్రి పుల్లటి పండ్లు తినకూడదు.
25. రాత్రి  9 - 10 గం.పడుకోవాలి
26. పంచదార, మైదా,గుండఉప్పు తక్కువ వాడాలి.
27. రాత్రి పూట సలాడ్ తినకూడదు.
28. విదేశీ ఆహారంను ఎప్పుడూ కొనరాదు 
29. టీ,కాఫీ ఎప్పుడు  త్రాగకూడదు.
30. పాలలో పసుపు వేసి మరిగించి త్రాగితే 
క్యాన్సర్ రాదు
31.ఆయుర్వేద వైద్యం ఆరోగ్యంకు మంచిది
32. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో) వెండి, బంగారు పాత్రలోని  నీరు  త్రాగాలి
33. జూన్ నుంచి సెప్ట్ంబర్ (వర్షాకాలంలో) లో రాగి పాత్రలో నీరు త్రాగాలి
34. మార్చ్ నుంచి జూన్ (ఎండాకాలంలో) మట్టి పాత్రలో నీరు త్రాగాలి...

సులబంగా జీర్నం అయ్యె ఆహారం తీసుకొంటు, మంచి ఆరొగ్యకరమైన పండ్లు రోజు తీసుకొవాలి, 
కనీసం 1 కిలోమీటర్ అయినా రోజు వారి బలాన్ని బట్టి నడుస్తుండాలి, అదికంగా మాంసాహారాలు తీసుకొకుడదు. కొంతవరకు చేపలు తీసుకొవచ్చును. 

ఆకుకూరలు ఎక్కువగా తీసుకొవాలి, వీలుఅయితె వ్యాయమం ద్యానం చెస్తె మంచి ఫలితాలు వుండును. 

అలాగె మాములు తెల్ల అన్నం వదలి, సిరిదాన్యలు వాడడం మంచిది. 

ఉప్పుబదలు సైందవ లవణం వాడాలి,
మిరపబదులు మిరియాలు వాడాలి
మంచి నీరు రాగి గ్లాస్ లో తిసుకొవాలి, 
ఆహారం మట్టి పాత్రల్లొ చెసుకొవాలి, 
నీరుని మట్టికుండల్లొ వేసి వాడుకొవాలి, 
ఇలా చెసుకొవడం వల్ల మంచి ఆరొగ్యం చేకూరును.
ధన్యవాదములు 🙏🏻
మీ నవీన్ నడిమింటి 
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

25, డిసెంబర్ 2019, బుధవారం

అమ్మాయి లో ఋతుక్రమం సమస్యలు అవగాహనా నవీన్ నడిమింటి

నమ్మకాలు-నిజాలు: బహిష్టు సమయంలో కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? పిరియడ్ నొప్పి వస్తే పిల్లలు పుట్టరాధతో దిగాలుగా ఉన్న యువతి పదో తరగతి పరీక్షలు రాస్తూ కడుపు నొప్పని మధ్యలోనే ఇంటికి పరుగెత్తుకొచ్చిన ప్రేమను చూసి ఇంట్లో అంతా కంగారుపడ్డారు. పొట్ట పట్టుకుని మెలికలు తిరిగిపోతున్న అమ్మాయిని డాక్టర్ దగ్గరకు తీసికెళ్తే కంగారేమీ లేదని.. బహిష్టు సమయంలో వచ్చే నొప్పేనని చెప్పారాయన. 'పరీక్షలు కదా ఒత్తిడికి గురై ఉంటుంది.. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనయినప్పుడు ఇలా నొప్పి తీవ్రంగా వస్తుంద'ని చెప్పారు డాక్టర్. ........... ప్రతి నెలా రెండు రోజులు నాగా పెడుతున్న నాగమ్మతో 'ఇలా పని ఎగ్గొడితే ఎలా.. నేను చేసుకోలేకే కదా నిన్ను పెట్టుకున్నది' వాపోయింది ఇంటావిడ ఈశ్వరి. 'ఏం చెయ్యనమ్మగారూ..! బయటజేరిన రెండురోజులూ పక్క దిగలేనమ్మా. వాంతులు కూడా అవుతాయి. డాక్టర్నడిగితే కొంత వయసు ముదిరితే తగ్గుతుందంటున్నారు' చెప్పింది నాగమ్మ. ........... పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు కలగని విమలని వాళ్లత్తగారు పొద్దున్నుంచి ఒకటే సతాయిస్తోంది. 'బహిష్టు సమయంలో కడుపులో నొప్పంటావు అందుకే పిల్లలు పుట్టటం లేదు' అంటోంది. ఆవిడ పోరు పడలేక విమల భర్తను తీసుకుని డాక్టర్ దగ్గరకెళ్లింది. 'బహిష్టు సమయంలో కడుపు నొప్పి వస్తే పిల్లలు పుట్టరని ఎవరు చెప్పారు? అసాధారణ పరిస్థితులలో(ఎండోమెట్రియోసిస్, కొన్ని ఇన్ఫెక్షన్స్) మాత్రమే అలాంటి సమస్య వస్తుంద'ని లేడీ డాక్టరు స్పష్టంగా చెప్పారు. కడుపు నొప్పి రావడం ఒకరకంగా అండం విడుదలకు సూచన అని, అండం విడుదలకాని సందర్భంలో వచ్చే బహిష్టులలో కడుపు నొప్పి ఉండదని చెబుతూ 'అండం విడుదలయితేనేగా పిల్లలు పుట్టే అవకాశముంటుంది, అంతేకానీ, కడుపు నొప్పి వచ్చినంత మాత్రాన పిల్లలు పుట్టరని కాదు, ఏదైనా వ్యాధి వల్ల నొప్పి వస్తోందా.. లేదా సహజంగా వచ్చే నొప్పేనా అన్నది మొదట నిర్ధారించుకోవాల'ని చెప్పారామె. ఎండోమెట్రియాసిస్: లక్షణాలు ఏంటి.. ఎంత ప్రమాదకరం? సెక్స్‌పై ఆసక్తి లేదా.. అది వ్యాధి లక్షణమా.. 

శానిటరీ నాప్కిన్స్ బహిష్టు లేదా పిరియడ్ అంటే ఏంటి? చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్య ఈ 'బహిష్టు సమయంలో కడుపునొప్పి'. దీన్నే వైద్య పరిభాషలో డిస్మెనోరియా అంటారు. అసలు ఈ నొప్పి కథేమిటో తెలుసుకుందాం.. బహిష్టు అంటే యుక్త వయసు ఆడపిల్లలలో నెలనెలా కనిపించే రక్తస్రావం. ఇది 50-200 మిల్లీ లీటర్లు ఉంటుంది. గర్భాశయం లోపలి గోడలని కప్పుతూ ఉండే మృదువైన ఎండోమెట్రియమ్ అనే పొర ప్రతి నెలా బాగా ఎదిగి, మందంగా తయారై, అధిక రక్త ప్రసరణతో గర్భధారణకు సంసిద్ధంగా ఉంటుంది. నెలమధ్యలో విడుదలయ్యే అండం, వీర్యకణంతో కలసి ఫలదీకరణం చెంది పిండం ఏర్పడితే ఈ ఎండోమెట్రియమ్ పొర ఆ పిండానికి కావలసిన రక్తసరఫరాను, పోషకాలను అందిస్తూ అది గర్భాశయంలో అతుక్కుని ఎదగడానికి తోడ్పడుతుంది. గర్భధారణ జరగని పరిస్థితులలో ఈ ఎండోమెట్రియమ్ పొర ప్రతి నెలా బయటకు విసర్జించబడుతుంది. దాంతోపాటు కొంత వ్యర్థ కణజాలాలు, అందులో ఉండే రక్తనాళాల కొనలు కూడా గర్భాశయ ద్వారం ద్వారా బయటకు విసర్జించబడతాయి. ఇదంతా హార్మోన్ వ్యవస్థ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ముఖ్యమైనవి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్. నెల మొదటి భాగం ఈస్ట్రోజన్ అధీనంలో.. రెండో భాగం అంటే 14 నుంచి 28 రోజుల వరకు ప్రొజెస్టిరోన్ అధీనంలో ఉంటుంది. ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా? అమ్మానాన్నలు కావాలన్న వీళ్ల ఆశలు ఫలిస్తాయా? 
కడుపునొప్పితో బాధపడుతున్న యువతి మరి.. కడుపు నొప్పి ఎందుకొస్తుంది? బహిష్టు సమయంలో వచ్చే ఈ నొప్పిని వైద్య పరిభాషలో 'డిస్మెనోరియా' అంటారు. ఇది సాధారణంగా రక్తస్రావంతో కానీ.. రక్తస్రావానికి కొద్ది గంటల ముందు నుంచి కానీ మొదలై ఒకట్రెండు రోజులు ఉంటుంది. కొద్దిమందిలో రక్తస్రావం మొదలు కావడానికి ఒకట్రెండు రోజుల ముందునుంచే నొప్పి వస్తుంది. దీనికి కారణం గర్భాశయ లోపలి పొర అయిన ఎండోమెట్రియమ్ విచ్ఛిన్నమై బయటకు వచ్చేటపుడు ఆ కణజాలం నుంచి విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్ F2ఆల్ఫా అనే పదార్థం. దీనివల్ల గర్భాశయంలో సంకోచ వ్యాకోచాలు కలుగుతాయి. అప్పుడు గర్భాశయ కండరాలు ముడుచుకోవడం వల్ల రక్త సరఫరా తగ్గుతుంది. దాంతో గర్భాశయ కండరాలకు ఆక్సిజన్ లభ్యత తగ్గుతుంది. ఫలితం కడుపు నొప్పి. గర్భాశయ ద్వారం చిన్నదిగా, సన్నగా ఉంటే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి ఏ వయసు వారికి వస్తుంది? సాధారణంగా యుక్త వయసు వారిలో అంటే 14-25 ఏళ్ల మధ్య ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. రజస్వల అయిన మొదటి రెండేళ్లు నొప్పి ఉండకపోవచ్చు. ఆ సమయంలో అండం విడుదల కాకుండానే హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పుల వల్ల మాత్రమే బహిష్టు అవుతుంది. అనంతరం కొన్నాళ్లకు అండం కూడా విడుదల కావడం ప్రారంభమైతే కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మధ్య వయసు వారి విషయానికొస్తే.. ఒక్కోసారి ఇతర వ్యాధులేమైనా కూడా కారణం కావొచ్చు. ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నొప్పి వస్తుంది. శరీరం మీద ఆ గుల్లలు ఎందుకు వస్తాయి? మంత్రాలు, పసర్లతో తగ్గుతాయా? నమ్మకాలు-నిజాలు: కాపురాలు కూల్చేసే తెల్లబట్ట 
గర్భాశయం లక్షణాలు ఏంటి? పొత్తి కడుపులో తెరలుతెరలుగా నొప్పి మొదలై వాంతులు, వికారం, నడుమునొప్పి, తొడల భాగంలో నొప్పి కూడా ఉండొచ్చు. కొద్దిమందిలో మల బద్ధకం, విరోచనాలు, ఆకలి లేకపోవడం, చిరాకు, అసహనం, నిరాసక్తత వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఈ డిస్మెనోరియాని రెండు రకాలుగా వర్గీకరిస్తారు

 1) ప్రైమరీ డిస్మెనోరియా యుక్త వయసులో నూటికి యాభై మందిలో కనిపించే నొప్పి ఇది. దీనికి ప్రత్యేక కారణమంటూ ఉండదు. వయసు పెరిగాక, పిల్లలు కలిగాక ఈ సమస్య దానికదే తగ్గిపోతుంది. 

 2) సెకండరీ డిస్మెనోరియా: దీనికి కొన్ని రకాల వ్యాధులు కారణం * ఎండోమెట్రియోసిస్: ఈ వ్యాధి వల్ల కడుపునొప్పి తీవ్రంగా ఉండడమే కాకుండా సంతాన లేమికీ దారి తీయొచ్చు. దీనికి కారణం గర్భాశయ కుహరాన్ని కప్పి ఉంచే ఎండోమెట్రియమ్ పొర అసహజంగా, అసాధారణంగా గర్భాశయం వెలుపలా.. పొత్తి కడుపులోని అండాశయం తదితర అవయవాలపై వ్యాపించి ఆయా కణజాలాలలో వాపుని కలగజేసి వాటి విధులకు ఆటంకం కలిగించడం. దీనివల్ల పీరియడ్స్‌లో క్రమబద్ధత లోపించడం, సంతానోత్పత్తి దెబ్బతినడం జరుగుతాయి. కాబట్టి బహిష్టు నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ కారణమేమో తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకుని నిర్ధరించుకోవాలి. * ఫైబ్రాయిడ్స్: ఇవి గర్భాశయం కండరాలలో వచ్చే కణుతులు. వీటివలన గర్భాశయం పరిమాణం పెరుగుతుంది. * ఎడినోమయోసిస్ : ఈ సమస్య ఉన్నవారిలో ఎండోమెట్రియమ్ పొర గర్భాశయ గోడలకు పరిమితం కాకుండా కండరాలలోనికి చొచ్చుకునిపోతుంది. ఫలితంగా తీవ్రమైన కడుపునొప్పి, అధిక రక్తస్రావం కలుగుతాయి. * జననేంద్రియ వ్యవస్థలో ఇన్‌ఫెక్షన్లు: లైంగిక సంబంధాల వల్ల వ్యాపించే సుఖవ్యాధులు కూడా సెకండరీ డిస్మెనోరియాకి కారణాలు. నమ్మకాలు - నిజాలు: అలర్జీలు ఆడవాళ్లకేనా? నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటి? పాటించకపోతే ఏమవుతుంది? 

గర్భాశయం కండరాలలో వచ్చే కణుతుల వలన గర్భాశయం పరిమాణం పెరుగుతుంది పిల్లలు పుడితే డిస్మెనోరియా తగ్గుతుందా? పూర్తిగా తగ్గుతుందని చెప్పలేం కానీ పిల్లలు పుట్టాకా, కొంత వయసు పెరిగాక తగ్గే అవకాశముంది. వ్యాధి నిర్ధారణ ఎలా? అనుభవజ్ఞులైన వైద్యులు రోగి నుంచి అవసరమైన సమాచారం సేకరించడం ద్వారా, కొన్ని పరీక్షలు చేసి వ్యాధి నిర్ధరణ చేస్తారు. దీనికి ఉపకరించే పరీక్షలు.. 
* జననేంద్రియాల లోపలి పరీక్ష * కొన్ని రకాల రక్తపరీక్షలు * 
అల్ట్రాసౌండ్ స్కానింగ్ * లాప్రోస్కోపీ.. ఇది ఎండోమెట్రియోసిస్‌ వ్యాధి నిర్ధరణలో, చికిత్సలో కూడా ఉపకరిస్తుంది. నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా? జుట్టు ఎందుకు ఊడిపోతుంది.. పొడవు జుట్టు రహస్యమేంటి
పొత్తికడుపు, నడుము మధ్య వేడినీళ్ల బ్యాగుతో కాపడం పెడితే కడుపు నొప్పి నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి? * సమస్యను అర్థం చేసుకుని సానుభూతితో వ్యవహరించాలి. తగినంత విశ్రాంతి ఇవ్వాలి. * వేడినీళ్ల స్నానం చేయడం.. పొత్తికడుపు, నడుము మధ్య వేడినీళ్ల బ్యాగుతో కాపడం పెడితే కొంత ఉపశమనం కలుగుతుంది. * క్రమంతప్పని వ్యాయామం.. కాఫీ వినియోగం తగ్గించడం, ఆహారంలో ఉప్పు తగ్గించడం వల్ల రక్త సరఫరా పెరిగి నొప్పి తీవ్రత తగ్గే అవకాశముంది. * సిగరెట్, ఆల్కహాల్ అలవాటుంటే వెంటనే మానేయాలి. మందులు ఉన్నాయా? * ఇక మందుల విషయానికొస్తే నొప్పికి కారణమైన ప్రోస్టాగ్లాండిన్స్ స్థాయిని తగ్గించే మందులు సురక్షితమైనవి. వీటిని డాక్టరు సలహాపైనే వాడాలి. * నొప్పి బాగా తీవ్రంగా ఉంటే డాక్టర్ సలహాపై ఓసీ పిల్స్ కానీ, ప్రొజెస్టిరోన్ ఉన్న లూప్ కానీ వాడొచ్చు. * వ్యాధుల కారణంగా వచ్చే కడుపు నొప్పికి ఆ వ్యాధిని నిర్ధారణ చేసి తగిన చికిత్స చేయాలి. బహిష్టు సమయంలో కడుపునొప్పిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అది ఎందుకొస్తుందో తెలుసుకుని తగిన చికిత్స తీసుకుంటే మహిళల ఆరోగ్యం బాగుండటమే కాకుండా ఎంతో విలువైన పనిగంటలు కూడా వృథా కాకుండా ఉంటాయి.
 ధన్యవాదములు
 మీ నవీన్ నడిమింటి 
                 *సభ్యులకు విజ్ఞప్తి* 
                ****************** 
 మన గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!! https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

పురుషులు లో అంగం చిన్న గా ఉంటే

చలికాలంలో పురుషులకు అంగం చిన్నగా మారిపోతుందా? డిసెంబర్ మాసం.. చల్లని వాతావరణం.. అప్పుడు అందరూ కోరుకుంటారు వెచ్చదనం. అందుకోసం దుప్పట్లో దూరేస్తుంటారు. ఆపైన తమ భాగస్వామితో కలిసి ఏదేదో చేయాలనుకుంటారు. ఈ చలి గాలికి తట్టుకోలేక కుర్రాళ్లందరూ బ్యాటింగ్ చేయలేక అవుటైపోతుంటారు. అయితే ఈ బ్యాటింగ్ ఎక్కడో ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. Reasons Why Your Penis Shrinks in the Cold అయితే చాలా మంది పురుషులకు చలికాలంలో అంగం పరిమాణం తగ్గిపోతుంది. అయితే దానిపై లేని పోని అపొహలను పెంచుకుని భయపడాల్సిన పని లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి చలికాలంలో వాతావరణ మార్పు వల్ల అంగం కొంత కుంచించుకుపోవడం అన్నది అత్యంత సహజమట. చల్లని వాతావరణానికి అంగంలోని స్పాంజ్ లాంటి కణజాలం కుంచించుకుపోవడం వల్ల ఇలా జరుగుతుందట. ఇంకా మీరు ఏయే విషయాలకు భయపడతారో.. మీకు దేని గురించి అయితే అనుమానాలున్నాయో ఈ స్టోరీ ద్వారా వాటిని నివృత్తి చేసుకోండి... ఫీలింగ్స్ కలిగినప్పుడు.. శృంగారానికి సంబంధించిన ఫీలింగ్స్ కలిగినప్పుుడు అంగం సైజు ఆటోమేటిక్ గా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చలి కాలంలో కూడా మీకు అంగం సైజు పెరుగుతుంటే మీరు దానికి కూడా భయపడాల్సిన పని లేదు. ఆ ఫీలింగ్స్ కలిగినప్పుడు అంగం స్తంభిస్తున్నా.. స్తంభించిన పురుషాంగం కనీసం మూడున్నర అంగుళాల మేర పెరుగుతున్నా ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. వృషణాలు కూడా.. అంగంతో పాటు వృషణాలు కూడా చలి కాలంలోని చల్లని వాతావరణానికి కుంచించుకుపోవడం అనేది అత్యంత సహజం. కాబట్టి ఇలాంటి మార్పులకు భయపడాల్సిన పని లేదు అని నిపుణులు చెబుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే మీ వృషణాలను బట్టి మీ ఆరోగ్యం కూడా అంచనా వేయొచ్చు. అవి కిందికి జారిపోతే మీరు అనారోగ్యంగా ఉన్నారని అర్థం. అవి మంచిగా ఫిట్ గా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని, మీరు బ్యాటింగుకు పూర్తి సామర్థ్యంతో ఉన్నారని అర్థం. కలయిక విషయంలో.. ఆ కార్యం మొదలు పెట్టేటప్పుడు పొడవు ఒక్కటే కాదు. తగినంత పరిమాణం (లావు) ఉండటం కూడా చాలా ముఖ్యమట. ఆ కార్యం మొదలయ్యాక మీ భాగస్వామికి ఆ విషయం జరిగినట్లు తెలియకపోతే కచ్చితంగా సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. సైజు చిన్నగా ఉంటే.. చాలా మంది పురుషులకు దాని సైజు విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా దాని సైజు చిన్నగా ఉంటే తాము ఆ కార్యానికి పనికి రామేమో అని తెగ భయపడిపోతుంటారు. ఇంకొందరు తామే చిన్నగా ఉన్నామని తమది ఇంకా చిన్నగా ఉందని తమ భాగస్వామి ఎక్కడ దూరం పెడుతుందో అని ఇన్ సెక్యూర్ గా ఫీలవుతుంటారు. అయితే ఇలాంటి విషయంలో అలాంటి అపొహలు ఏమి పెట్టుకోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. అది కేవలం అపొహ మాత్రమే.. ఆ కార్యానికి పరిమాణమే చాలా కీలకం అన్నది కేవలం అపొహ అని నిపుణులు స్పష్టం చేశారు. అయితే దాని పరిణామానికి ఏ మాత్రం ప్రాధాన్యత లేదనుకోవడం కూడా పెద్ద పొరపాటే. ఆ ఘట్టం జరగాలంటే అది సగటు పరిమాణంలో ఉండటం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. పొడవు విషయంలో.. ముఖ్యంగా మీ పొడవు ఒక్కటే కాదు. తగినంత మందం (లావు) కూడా ఉండాలి. అప్పుడే మీ భాగస్వామికి కార్యం జరిగినట్లు తెలుస్తుంది. ఆ ఘట్టంలో అలా జరగకపోతే ఏదో ఒక సమస్య కచ్చితంగా ఉండనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో అమ్మాయి మరియు అబ్బాయిలలో కూడా సమస్య ఉండొచ్చు. కారణాలు తెలుసుకోవాలి... అలాంటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు కారణం ఏంటో తెలుసుకోవాలి. ఆ సమస్యకు పరిష్కారం ఉందో లేదో కూడా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల అనేక దేశాల్లో సగటును పురుషాలకు పురుషాంగం పరిమాణం ఎంత ఉంటుందన్న దానిపై చాలా అధ్యయనాలు చేశారు. ఇవి మన దేశంలోనూ జరిగాయి. అందరూ కలిసి తేల్చిన లెక్క ఎంతంటే పురుషాంగం పొడవు సగటున నాలుగు అంగుళాలు ఉన్న చాలు అని నిపుణులు స్పష్టం చేశారు. తృప్తి పరచడం ఎలా.. అయితే పరిమాణం కన్నా మీ భాగస్వామిని ఎక్కడెక్కడ టచ్ చేస్తే ఆమెలో భావప్రాప్తి కలుగుతుందన్న విషయంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో చాలా మంది పురుషులు తమ పురుషాంగం పొడవు ఎక్కువగా ఉండాలని భావిస్తు ఉంటారని అయితే పొడవు కన్నా కూడా లావు చాలా ముఖ్యమని చెబుతున్నారు. లేని పోని భ్రమలో బతకొద్దు.. లావు ఎక్కువగా ఉండే వారిని చూసి మహిళలు ఎక్కువగా సంతృప్తి చెందుతారని నిపుణులు చెబుతున్నారు. స్ర్రీకి సుఖాన్ని కలిగించే కేంద్రాలన్నీ చాలా వరకు కింది భాగంలోనే ఉంటాయని చెబుతున్నారు. పోర్న్ సినిమాలు చూసి లేనిపోనివి ఊహించోవద్దని.. భ్రమలో బతకొద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. ధన్యవాదములు మీ నవీన్ నడిమింటి

పిల్లలు కలగక పోవడానికి కారణం నవీన్ నడిమింటి సలహాలు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సంతానలేమికి కారణాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

-ఆధునికత పెరిగిన కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, పొగతాగడం, మద్యపానం లాంటి అలవాట్లు కూడా సమస్యల కు కారణమవ్ఞతున్నాయి. అలాంటి వాటిలో సంతానలేమి కూడా ఒకటి. ప్రతి ఇరవై జంట ల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారని అంచనా. అందుకే సంతాన సాఫల్యత కేంద్రా లకు వచ్చే వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

సాధారణంగా పెళ్లయిన అయిదారు నెలల్లో గర్భం వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. ఏడాదిలోపైతే 75 శాతం అవకాశం ఉంటుంది. 85 నుంచి 90 శాతం మందిలో పెళ్లయిన రెండేళ్లలోగా గర్భం రావచ్చు. రానియెడల ఆ స్థితిని ప్రాధమిక సంతానలేమి (primary ifertility) అంటాము .

పిల్లలు ఎందుకు పుట్టడం లేదు?,
పెళ్లవగానే అందరూ ఎదురుచూసే తీపి కబురు కొత్త పెళ్లికూతురు నెల తప్పడం. కొంతమంది ఈ కబురు త్వరగా చెప్పేస్తారు. మరికొంతమందికి ఇలాంటి కబురు చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొంతమందికి అసలు పిల్లలే పుట్టరు .కారణము తెలియదు .

ఎవరు కారకులు?
బిడ్డలు పుట్టక పోవడానికి దోషం ఎవరిలో ఉంది? ఒకప్పుడయితే స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, ఆమె గొడ్రాలని, పనికి మాలినదని ముద్ర వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. దంపతుల మధ్య నిస్సారతకు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కారణం కావచ్చు, లేదా ఇద్దరూ కావచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఇటువంటి కేసుల్లో 33 శాతం మగవారు, 33 శాతం ఆడవారు కారణం కాగా మిగిలిన 34 శాతానికి కారణాలు పూర్తిగా తెలియరావడం లేదు. ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దీనివల్ల కొంతమందికి సంతాన సామర్ధ్యం ఉండడం లేదు. వేగంగా వాహనాలు నడపడం, అతిగా మద్యం సేవించడం, తినకూడనివి తినడం వంటి వాటివల్ల మగవారిలో పునరుత్పత్తి శక్తి దెబ్బతింటోంది. కొంతమంది మగవారిలో 35 సంవత్సరాలకే వీర్యంలో క్వాలిటీ తగ్గిపోతోంది. అటువంటి వారికి పిల్లలు పుట్టించే సామర్ధ్యం క్షీణించిపోతుంది. కొన్ని పరిశ్రమల్లో పనిచేసే మగవారి వృషణాలు ఎక్కువ ఉష్ణానికి గురికావడం వల్ల వారి వీర్యం పలుచబడిపోయి సంతానం పొందే సమర్థత కోల్పోతున్నారు. చిన్నతనంలో గవదలు వంటి రోగాల వల్ల శాశ్వతంగా వృషణాలు హానికి గురవుతుంటాయి.

మగవారిలో వంధత్వానికి కారణాలు

* ఏదో ఒక రకమైన అనారోగ్యం
* వైద్య చరిత్ర (గవద బిళ్లలు, సుఖరోగాల వంటివి)
* శస్త్రచికిత్సల చరిత్ర (వృషణాలకు శస్త్ర చికిత్స, గజ్జలలోని హెర్నియా మరమ్మతు, శస్త్రచికిత్స వంటివి)
* వృత్తిపరమైన ప్రమాదాలు ( అధికంగా వేడికి గురికావడం, విష పదార్థాల ప్రభావానికి లోను కావడం వంటివి)
* ఔషధాలు (కీమోథెరపీ)
* పొగతాగడం, మద్యం సేవించడం.

ఆడవారిలో కారణాలు

*వయసు కారణంగా చాలామందిలో సంతానం పొందే సమర్థత కోల్పోతుంటారు. వయసు పెరుగుతుంటే ఆడవారికి సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. వైద్య చికిత్స చేయించినా ఇటువంటి వారిలో సత్ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తక్కువ వయసుగల యువతుల్లో అండాశయం పలుచగా ఉంటుంది. ఫలితంగా సంతానం కలిగే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి.

* గైనకాలజీ పరిస్థితులు
* అండాశయం సరిగా పనిచేయలేకపోవడం, రుతుస్రావం బాగా తగ్గిపోవడం, సెర్వికల్‌ మ్యూకస్‌ లోపాలు, యుటిరిన్‌ ఫైబ్రాయిడ్స్‌, ఎండోమెట్రియోసిస్‌... మొదలైనవి.
* సంధాన సమస్యలు
* క్రమరహిత రుతుస్రావం
* పెల్‌విక్‌ ఇన్‌ఫెక్షన్స్‌ (ప్రస్తుతం లేదా పూర్వం)
* టి.బి (క్షయ) వంటి ప్రస్తుత రోగాలు
* పొగ తాగడం, మద్యం సేవించడం.
90 శాతం స్త్రీలు ఏడాదిలోపుగానే గర్భం ధరిస్తారు. క్రమం తప్పకుండా శృంగార జీవితం గడిపే దంపతుల విషయంలో 95 శాతం స్త్రీలు రెండు సంవత్సరాలలోపు గర్భం ధరిస్తారు. ఈ కాల వ్యవధిలో సంతానం కోసం చికిత్స అవసరం లేదు. ప్రయత్నించినా సాధారణంగా వైద్య చికిత్సకు వైద్యులు ఇష్టపడరు. ఈ సమయం దాటితే స్పెషలిస్టుని సంప్రదించడం మంచిది.

వైద్యుని దగ్గరకి ఎప్పుడు వెళ్లాలి?

*పెళ్లైన మూడు సంవత్సరాల తర్వాత కూడా సంతానం కలుగకపోతే ,
*స్త్రీ వయసు 38 సంవత్సరాలు దాటితే ,
*మగవారిలో తక్కువ లేదా అసాధారణ వీర్య కణాలు ఉన్నప్పుడు.
*వంధత్వానికి కారణాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత వైద్యచికిత్స ప్రారంభిస్తారు.

కొన్ని ముఖ్య సంగతులు

పిల్లలు కలుగని దంపతుల్లో 15శాతం మందిలో లోపానికి ఒకటికి మించి కారణాలు ఉంటాయి. మగవారికి వీర్యపరీక్ష ప్రాథమిక పరిశోధనగా చేయిస్తారు. వీర్యం ఉండాల్సిన స్థాయిలో ఉండకపోతే రెండు లేదా మూడు నెలల కాలవ్యవధిలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన వైద్యచికిత్సలు అవసరం మేరకు అందిస్తారు. ఆడవారి విషయంలో వైద్య పరీక్షలు కొంచెం ఎక్కువగా చేయాల్సి వస్తుంది. రుతుచక్రంలో వేర్వేరు సమయాల్లో అనేక హార్మోన్ల స్థాయిని కనుగొంటారు. దాన్ని బట్టి అండాశయంలో అండం విడుదల లోపాలను తెలుసుకుంటారు. సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లే ఆడవారిలో 20 శాతం మందికి అండాశయ సమస్యలు ఉంటాయి. క్రమ పద్ధతిలో అండం విడుదల కాకపోతే హార్మోన్ల చికిత్స చేస్తారు. ఆడవారికి సెర్వికల్‌ మ్యూకస్‌ దళసరిగా తయారై ఉండడం, మగవారికి శీఘ్రస్కలనం, మగతనం లేకపోవడం లేదా తదితర శారీరక అసాధారణాలు ఉంటే స్త్రీ సెర్విక్సులోకి వీర్యాన్ని పంపుతారు.

ఇటువంటి చికిత్స ఆరోగ్యకరమైన ఫెలోపియన్‌ ట్యూబులు గల ఆడవారికే వీలవుతుంది. గర్భం ధరించే అవకాశాలు పెంచేందుకు స్త్రీలకు ఫెర్టిలిటి ఔషధాలు ఇస్తారు. దీనివల్ల అండాశయం నుండి కనీసం ఒక అండమైనా విడుదలయ్యేందుకు ఉత్తేజం కలుగుతుంది. కొంతమందికి అండంతో వీర్యకణాలు ఫెలోపియన్‌ ట్యూబ్‌లో సాధారణ పరిస్థితిలో కలవడం చాలా కష్టం లేదా అసంభవం కావచ్చు. విట్రో ఫెర్టిలైజేషన్‌లో ఇటువంటి సమస్యలకు పరిష్కారంగా శరీరానికి వెలుపల ఒక గ్లాసు డిష్‌లో వీర్యం, అండం ఫలదీకరణ చెందిస్తారు. దీనినే కల్చర్‌ డిష్‌ అంటారు. సంతానం పొందేందుకు ఇంకా ఎన్నెన్నో అధునాతన విధానాలు అమల్లోకి వచ్చాయి. కేసును బట్టి వైద్య నిపుణులు తగిన పద్ధతి ఎన్నుకుంటారు.


ఇంకా కొన్ని కారణాలు :
హార్మోన్లలో తేడాలున్నా,
గర్భాశయంలో అనుకూల పరిస్థితులు లేకపోయినా గర్భం నిలవదు.
అండాశయాలు అండాలను ఉత్పత్తి చేయకున్నా,
లోపభూయిష్ఠ అండాలు విడుదలైనా,
ఫెలోపియన్‌ నాళాల్లో అడ్డంకులున్నా గర్భం రాకపోవచ్చు. అంతేకాదు ,
క్షయ, ‌ వ్యాధులుంటే ,
ఎండోమెట్రియాసిస్ వ్యాధులుంటే ,
గర్భా శయం, దాని ముఖద్వారంలో చిక్కని ద్రవాలు ఉత్పత్తి అయి అడ్డు యేర్పడినా.

ఈ ద్రవాల గాఢతలో చాలా మార్పులు ఉం టాయి. అందువల్ల వీర్యకణాలు లోపలికి రాలేవు . పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉం డటం ఎక్కువ మందిలో కనిపి స్తుంది. ఒక క్యూబిక్ మిల్లీమీటర్ వీర్యం లో 60 మిలియన్ల కంటే తక్కువ శుక్రకణాలు ఉంటే సం తానం కల గడం కష్టమవ్ఞతుంది. కాబట్టి సంతానలేమి సమస్య ఉన్నప్పుడు భార్యాభర్తలిద్దరికీ పరీక్ష చేస్తే తప్ప లోపం ఎవరిలో ఉందో, సమస్యకు పరిష్కారం ఏమిటో తేలదు.

ఫెలోపియన్‌ ట్యూబ్‌లో లోపం ఉన్నప్పుడు లాపరోస్కోపిక్‌ సర్జరీ ద్వారా సరిచేస్తారు. అలా వీలుపడకపోతే ఐవిఎఫ్‌ పద్ధతిలో అండాన్ని ఫలదీకరణ చేయిస్తారు. ఈ విధానాన్నే టెస్ట్‌ ట్యూబ్‌ పద్ధతి అంటారు. గర్భాశయ ముఖద్వారం లో సమస్యలుంటే ఐయుఐ పద్ధతి ద్వారా కృత్రిమంగా వీరాన్ని సరాసరి గర్భాశయ ముఖద్వారం వద్దకు పంపిస్తారు.

వీర్యకణాలు అతి తక్కువ ఉన్న యెడల ఇక్సీ టెక్నిక్‌ ద్వారా సంతానప్రాప్తి కలిగించవచ్చు. వీర్యంలో కణాలు లేకుంటే నేరుగా బీజము నుండి కణాలను తీసే పద్ధతిలో సంతాన ప్రాప్తిని కలిగించవచ్చు. సాదారణముగా వీర్యకణాలు 60,000,000/క్యూబిక్ మి.మీ. ఉండాలి .
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి*

గర్భం లో కానితలు నివారణ నవీన్ నడిమింటి సలహాలు

గర్భాశయ కంతులు లేదా కండరం యొక్క నిరపాయ కంతి కాన్సర్‌ లక్షణాలు లేకుండా గర్భాశయంలో అపాయకరం కాని పెరుగుదల. వీటిని ఫైబ్రోమియోమా, మియో ఫైబ్రోమా, ఫైజోలియా మియోమా అని కూడా అంటారు. కంతులు వివిధ పరిమాణాల్లో నెమ్మదిగా పెరుగుతుంటారుు. ఇవి సాధారణంగా గర్భాశయం గోడలలో లేదా గర్భాశయ కుహరం (కాలిటీ) లోపల లేదా గర్భాశయ ద్వారం (సర్విక్స్‌) గర్భాశయ కింది భాగంలో లేదా కొన్ని సందర్భాల్లో గర్భాశయం వెలుపల కూడా పెరుగుతుంటారుు.

qw40 సంవత్సరాల వయసు గల మహిళల్లో 20 నుండి 25% మందికి రావడం సహజం. సాధారణంగా 50% మంది మహిళలకు వస్తోంది. పెద్ద శస్తచ్రికిత్స జరగడానికి దారితీస్తోంది. 30 నుండి 50 సంవత్సరాల మధ్య వయసుగల మహిళల్లో ఇవి పెరుగుతున్నాయి.

గర్భాశయ కంతులు సమస్యలు
అధిక రక్తస్రావం కారణంగా రక్తహీనత, గర్భధారణ సమయంలో గర్భస్త పిండం పరిణితిలో కలయిక. ప్రసవ సమయంలో సమస్యకు దారి తీయవచ్చు.

హోమియో చికిత్సా విధానం
menగర్భాశయ కంతులకు సాధారణంగా అల్లోపతి అందించే పరిష్కారం శస్తచ్రికిత్స. ఇది సాధారణంగా గర్భాశయ తొలగింపు అనగా శస్తచ్రికిత్స ద్వారా పూర్తి గర్భాశయాన్ని తొలగించడంగా ఉంటుంది. కొన్ని సం దర్భాల్లో మియోమెక్టమీ అనగా కంతులను మాత్రమే తొలగించడం. మియోమెక్టమీ చేసిన 5 సంవత్సరాల తరువాత సుమారు 50% కేసు ల్లో కంతులు తిరిగిరావడం సాధారణం. గర్భాశయ తొలగింపు శస్త్ర చికిత్స ద్వారా మెనోపాజ్‌ దశ చేర్చినట్లవుతుంది. దీని ద్వారా హాట్‌ ప్లాషెస్‌, తలనొప్పి, ఉద్వేగాలలో మార్పు, నిద్రలేమీ, నిద్రాభంగం, చెమటలు పట్టడం, భావోద్వేగాలకు లోనుకావడం, వాంఛ లేదా కామాసక్తి తగ్గడం, యోని ఎండిపోవడం, తెల్లబట్ట, శారీరక అస్వస్థత, మొటిమలు, అవాంఛిత రోమాలు పెరుగుదల, డీపర్‌ వాయిస్‌, ఆస్టిరోపోరోసిస్‌ (అస్తి తగ్గడం) వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. 

Untitled-1రోగి శస్త్ర చికిత్స ద్వారా గర్భాశయ తొలగింపు నిరాకరిస్తే, అల్లోపతి హార్మోన్‌ మందులు, ఎస్‌ఎస్‌ఐడిలు, గర్భనిరోధక మాత్రలను సూచిస్తుంది. ఇవి పైన తెలిపిన దుష్ర్పభావాలతోపాటు మెనోపాజ్‌ దశ కు చేరుకునేలా చేస్తాయి. కంతులు అధికస్థాయిలో పెరగడానికి ముందే హోమియోపతి చికిత్సా విధానం కంతులు పెరుగుదలను నియంత్రించ డంతో పాటు ప్రస్తుతం ఉన్నవాటి పరిమాణాన్ని నెమ్మదిగా, క్రమంగా తగ్గిస్తుంది. హోమియెపతి మందులు అధిక రక్తస్రావం కారణంగా వచ్చే రక్తహీనత, మూత్ర సంబంధ సమస్యలు నిరోధిస్తుంది.
ఆ విధంగా గర్భాశయ కంతులకు హోమియెపతిలో సూచించదగిన అత్యుత్తమ చికిత్సా విధానం. హోమియోపతి చికిత్సను పొందడం ద్వారా మహిళలు శస్త్ర చికిత్సను నివారించడం వలన గృహసంబంధ, వృత్తి పరమైన కార్యాకలాపాలను నిర్వహించుకోగలుగుతారు. సమర్ధత గల హోమియోపతి డాక్టర్‌ పర్యవేక్షణలో చికిత్సా విధానం కాస్త ఆలస్యమవచ్చు కాని మహిళల గర్భధారణ సామర్ధ్యాన్ని రక్షిస్తుంది. 

గర్భాశయ కంతులు లక్షణాలు 
కంతులు లేదా నిరపాయ కంతులుగల రోగులకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. డాక్టర్లు అల్ట్రా సోనోగ్రఫీ పరీక్ష చేయుట ద్వారా గర్భాశయ కంతులను గుర్తిస్తారు.అధికమైన, తీవ్రమైన, ప్రమాదరహితమైన లేదా దీర్ఘకాల రక్తస్రావం. గర్భాశయం బరువుగా అనిపించడం. సాధారణంగా పొత్తి కడుపులో నొప్పి, రతి సమయంలో నొప్పి, ఉబ్బడం, వ్యంధత్వం, పొత్తికడుపులో కంతి తరచుగా మూత్రం రావడం, తరచుగా మలవిసర్జనకు వెళ్ళాలనిపించడంతో పాటు పేగులలో నొప్పి.గర్భాశయ కంతులకు సాధారణంగా అల్లోపతి అందించే పరిష్కారం శస్తచ్రికిత్స. ఇది సాధారణంగా గర్భాశయ తొలగింపు అనగా శస్తచ్రికిత్స ద్వారా పూర్తి గర్భాశయాన్ని తొలగించడంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మియోమెక్టమీ అనగా కంతులను మాత్రమే తొలగించడం. మియోమెక్టమీ చేసిన 5 సంవత్సరాల తరువాత సుమారు 50% కేసుల్లో కంతులు తిరిగిరావడం 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
******************

డిఫ్రెషన్ నివారణ కు

మానసిక ఒత్తిడిని డిప్రెషన్ అంటారు. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా మానసిక ఒత్తిడులకు గురి అవుతారంటున్నారు వైద్య నిపుణులు. పురుషులు అయితే త్వరగా బాధల నుంచి బయటపడగలరట. కానీ స్త్రీలు వాటిని అంటిపెట్టుకునే ఉంటారట. వియోగ బాధ నుంచి కూడా పురుషులు బయటపడ్డంత త్వరగా స్త్రీలు బయటపడలేరట. 
 
డిప్రెషన్ వల్ల పనిచేసే సాహసం చేయలేమట. ప్రత్యేక ప్రయత్నం చేసి కొత్తపని మొదలుపెట్టలేరట. మానసికంగా పుల్ స్టాప్ పడుతారట. పురుషుల కంటే స్త్రీలు భావనాత్మకంగా ఇతరులతో ముడి పడి ఉంటారు. తమ మనస్సులోని మాట చెప్పేసి ఇతరులతో సంబంధం ఏర్పరచుకోవడం వారిపై ఆధారపడి ఉండడం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకుంటారు.
 
స్త్రీలు ఇప్పుడు వంటింటి పనులే కాకుండా బయట ప్రపంచంలో అడుగుపెట్టారు. అందువల్ల మానసిక బంధాలకు పురుషుల వలే అతీతంగా ఉండగలుగుతున్నారు అనే వాదన ఉంది. కానీ అది ఎంతమాత్రం నిజం కాదంటున్నారు వైద్య నిపుణులు. 1975సంవత్సరంలో జరిగిన సర్వే ద్వారా ఆఫీసులో పనిచేసే వనితలు కూడా డిప్రెషన్ కు గురి అవుతున్నారట. ఇంటా బయటా పనిచేస్తున్నా స్త్రీల మానసిక స్థితిలో మార్పు లేదట. 
 
ఒక వ్యక్తి మానసికంగా ఒక వస్తువుతో గానీ, వ్యక్తితో కానీ ముడిపడినప్పుడు ఆ వస్తువు లేదా వ్యక్తిని పొగొట్టుకుంటే పోతున్నదన్న భయం పట్టుకుంటే డిప్రెషన్ కు గురి అవుతారట. ఈ డిప్రెషన్ మూడు నెలల కంటే ఉండదట. ఎక్కువ కాలం డిప్రెషన్ కొనసాగితే మానసిక రోగంగా రూపు దాల్చే ప్రమాదం ఉందట. నిరాశ, నిస్పృహ వల్ల ఇలాంటి స్థితి ఏర్పడుతుందట. ఆత్మన్యూనతాభావం కలుగుతుందట. తను ఎందుకూ పనికిరానని అనుకుంటుందట. శక్తిహీనురాలని భావిస్తుందట. 
 
అయితే ఎందులోనైనా విఫలమైనంత మాత్రాన మనం ఎందుకూ పనికిరామని అనుకోవడం పొరపాటు అంటున్నారు వైద్య నిపుణులు. అలాంటి వారికి నెగిటివ్ ఆలోచనలు అవసరమట. తార్కికంగా ఆలోచిస్తే డిప్రెషన్ త్వరగా తగ్గిపోతుందట. అనేకసార్లు డిప్రెషన్ ఒక్క రాత్రి ప్రశాంతంగా నిద్రపోతేనే దూరమవుతుందట. ప్రార్థన చెయ్యడం వల్ల, చింతన వల్ల మనస్సు నిర్మలమవుతుందట. వాస్తవిక స్థితిని అర్థం చేసుకుంటే డిప్రెషన్ అసలు ఉండదట. నిజానికి చురుకుదనం, సజావుగా కార్యనిర్వహణ చేయడం స్త్రీలలో ఎక్కువట. దోషరహితంగా పనులు కావాలంటే మహిళల చేతులు మీదుగానే జరగాలి. మనస్సులో నిక్షిప్తమైన చురుకుదనాన్ని ఆత్మవిశ్వాసాన్ని గుర్తించనప్పుడే డిప్రెషన్ బాధ ఉండదంటున్నారు వైద్యులు
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/


లీచ్ థెరపీ (జలగలు )అంటే ఏమిటే

*లీచ్ థెరపీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!అవగాహనా కోసం నవీన్ సలహాలు*

By :https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

       అనేక సాంకేతిక అధ్యయనాలు, నివేదికలు ఈ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలను నిర్ధారించడం వల్ల వైద్యులు నేడు ఎక్కువగా సిఫార్సుచేస్తున్నారు.

      లీచ్ థెరపీ ని గుండె సంబంధిత వ్యాధి చికిత్సలో దీనిని ఉపయోగిస్తున్నారు. లీచ్ నుండి విడుదలయ్యే లాలాజలం రక్తాన్ని చిక్కబరిచే లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల రక్తం గడ్డకట్టడాన్ని నయం చేస్తుంది. ఇది రక్త ప్రసరణను, నొప్పి తెలియదాన్ని మెరుగుపరుస్తుంది లేదా అనుసంధాన కణజాలాలలో నొప్పితో సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.
ఆల్టర్నేటివ్ మెడిసిన్ రివ్యూ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, లీచ్ థెరపీ కాలు లోని నొప్పిని, వాపును తగ్గిస్తుంది, చర్మం మెరుగైన రంగులో మారి, నడవలేని వారి నడక సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది, కాలులో లోపల నరంలో రక్తం గడ్డ కట్టడం వల్ల ఈ స్థితి వస్తుంది. ఈ పద్ధతిలో, నాలుగు నుండి ఆరు లీచ్ లు ప్రభావితమైన ప్రదేశంలో నేరుగా అప్లై చేస్తారు.

      సర్జెరీ తరువాత, లేదా సర్జరీ సమయంలో కణజాలాలు ఆరోగ్యంగా ఉండడానికి లీచ్ థెరపీ చాలా ఉపయోగపడుతుందని ఎక్కువమంది వైద్యులు నమ్ముతారు. సర్జెరీ సమయంలో లీచ్ థెరపీ చేస్తే, లీచ్ ల లాలాజలం రక్తం పల్చబడడానికి సహాయపడి, క్రమంగా వీనస్ సమస్యలను తగ్గిస్తుంది.
ఈ పరిస్థితి బాధాకరమైన గాయాలు, పునర్నిర్మాణ శాస్త్ర చికిత్సకు సంబంధించింది, ఇది వాపు, సెల్యులర్ మరణం, రక్త ప్రసరణ ఆగిపోవడం ఏర్పడుతుంది. లీచ్ థెరపీ శాస్త్ర చికిత్స తరువాత కూడా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

      లీచ్ లాలాజలంలో ఉన్న అంశాల కలయిక ప్రోటీస్ ఇన్హిబిటర్లు, ప్రతిస్కంధకాలని కాన్సర్ మందుగా ఉపయోగపడుతుందని అనేకమంది పరిశోధకులు సూచించారు.
లీచ్ లో ఉండే లాలాజలంలో జిలెటిన్ అనే కాంపౌండ్ అనేక రకాల ట్యూమర్ల పెరుగుదలను అరికడుగుతుందని నిపుణులు గుర్తించారు. ఇది హిరుడిన్ అని పిలువబడే పెప్టైడ్ ని కలిగి ఉండడం వల్ల గొప్ప ప్రతిస్కంధకంగా పనిచేసి క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది.

     లీచ్ థెరపీ ఆకస్మిక చెవుడు, చెవిలో తీవ్రమైన హోరు వంటి దీర్ఘకాల రోగాలకు చికిత్సగా ఉపయోగిస్తారు.
ఆయుర్వేద పరిశోధన జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, లీచ్ థెరపీ ని ఆస్టియో ఆర్ధరైటీస్ ఉన్న రోగి మోకాళ్ళకు చేస్తే, గణనీయమైన మార్పు కనిపిస్తుంది.
అయితే, లీచ్ థెరపీని చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే దీనికి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కూడా ఉంటాయి. వాటివల్ల ;చర్మం మీద మచ్చలు, బొబ్బలు, కణజాలం దెబ్బతినడం, దురదలు వంటివి కలుగుతాయ

*గమనికr👉🏿*

ఈ ట్రీట్మెంట్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుష్ హాస్పిటల్ లో అందు వుంది. గ్రేట్ ట్రీట్మెంట్. మా ఫ్రెండ్ చూసి చెప్తే విన్నాను. ఒక  అతనికి ఆక్సిడెంట్ లో కాలు విరిగిపోయింది. హైదరాబాద్ లో వున్న కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్తే కాలు పూర్తిగా సెప్టిక్ అయ్యింది. పూర్తిగా కట్ చేయాలి లేదా ప్రాణానికి నష్టం అని చెప్తే ఫైనల్ ఛాయస్ గా ఎర్రగడ్డ హాస్పిటల్ కి వస్తే కాలు తీసి వేయకుండా జలగ లతో ట్రీట్మెంట్ చేసారు. జలగ చెడు రక్తం మాత్రమే త్రాగుతుంది. ఆ  ట్రీట్మెంట్ కు  చేసే పార్ట్శ్ పైన ayurvedhic లిక్విడ్ apply చేసి జలగ ను పెడతారు. ఆ వ్యక్తి కి అతి కొద్ది రోజులలో  నయం అయ్యింది అని మా ఫ్రెండ్ చెప్పాడు. మా ఫ్రెండ్ అదే హాస్పిటల్ లో అప్పుడు ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ అయ్యాడు. తన ద్వారా నాకు ఈ విషయం 2010 లో తెలిసింది. Mind blowing treatment. జలగ వలన మనకు నొప్పి కూడా వుండదు.  ఇది నాకు తెలిసిన విషయం.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*

సూర్యగ్రహం రోజు సూర్యడు చేచిన అప్పుడు అపోహలు

*సూర్య గ్రహణం సందర్భంగా తీసుకోవాల్సిన కంటి జాగ్రత్తలు...>>> నవీన్ నడిమింటి   సలహాలు, సూచనలు...*

          గ్రహణ సమయంలో సూర్యుణ్ణి చూడటం వలన కళ్ళు దెబ్బతింటాయని, అనారోగ్యాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. కేవలం గ్రహణ సమయంలోనే కాదు మామూలు సమయంలోనూ సూర్యుణ్ణి తదేకంగా చూడటం వలన కళ్ళ నీళ్ళు, తుమ్ములు, తలనొప్పి, కళ్ళు మిరుమిట్లు, కంటి రెటీనా దెబ్బతింటుంది. గ్రహణ సమయంలో కన్న మాములు సమయంలో సూర్యుణ్ణి చూడటం ఎక్కువ ప్రమాదం. గ్రహణ సమయంలో సూర్యుని నుండి ప్రత్యేకమైన ప్రమాద కిరణాలు మామూలు సమయాలలో మంచి కిరణాలు ఏమిరావు. ఎప్పుడు ఒకే విధమైన కిరణాలు ప్రసరిస్తాయి. ఒకవేళ సూర్యుణ్ణి చూడాలనుకునే వారు ఒక మట్టి కుండలో నీటిని తీసుకొని గోమయాన్ని కలిపి సూర్యుని ప్రతిబింబాన్ని వీక్షించవచ్చును. 

మూర్ఛరోగులు, గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడటం వలన పుట్టే పిల్లలలో గ్రహణమొర్రి, కాళ్ళ వంకర తో పుడతారనేది మూడనమ్మకం. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంట్లో పడుకోకుండా బయట తిరగచ్చని, అన్నీ పనులు చేసుకోవచ్చని హైదరాబాద్  లో శాస్త్రవేత్తల ప్రయోగాల ఫలితంగా నిరూపించారు.

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/