25, డిసెంబర్ 2019, బుధవారం
పురుషులు లో అంగం చిన్న గా ఉంటే
చలికాలంలో పురుషులకు అంగం చిన్నగా మారిపోతుందా?
డిసెంబర్ మాసం.. చల్లని వాతావరణం.. అప్పుడు అందరూ కోరుకుంటారు వెచ్చదనం. అందుకోసం దుప్పట్లో దూరేస్తుంటారు. ఆపైన తమ భాగస్వామితో కలిసి ఏదేదో చేయాలనుకుంటారు. ఈ చలి గాలికి తట్టుకోలేక కుర్రాళ్లందరూ బ్యాటింగ్ చేయలేక అవుటైపోతుంటారు. అయితే ఈ బ్యాటింగ్ ఎక్కడో ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది.
Reasons Why Your Penis Shrinks in the Cold
అయితే చాలా మంది పురుషులకు చలికాలంలో అంగం పరిమాణం తగ్గిపోతుంది. అయితే దానిపై లేని పోని అపొహలను పెంచుకుని భయపడాల్సిన పని లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి చలికాలంలో వాతావరణ మార్పు వల్ల అంగం కొంత కుంచించుకుపోవడం అన్నది అత్యంత సహజమట. చల్లని వాతావరణానికి అంగంలోని స్పాంజ్ లాంటి కణజాలం కుంచించుకుపోవడం వల్ల ఇలా జరుగుతుందట. ఇంకా మీరు ఏయే విషయాలకు భయపడతారో.. మీకు దేని గురించి అయితే అనుమానాలున్నాయో ఈ స్టోరీ ద్వారా వాటిని నివృత్తి చేసుకోండి...
ఫీలింగ్స్ కలిగినప్పుడు..
శృంగారానికి సంబంధించిన ఫీలింగ్స్ కలిగినప్పుుడు అంగం సైజు ఆటోమేటిక్ గా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చలి కాలంలో కూడా మీకు అంగం సైజు పెరుగుతుంటే మీరు దానికి కూడా భయపడాల్సిన పని లేదు. ఆ ఫీలింగ్స్ కలిగినప్పుడు అంగం స్తంభిస్తున్నా.. స్తంభించిన పురుషాంగం కనీసం మూడున్నర అంగుళాల మేర పెరుగుతున్నా ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు.
వృషణాలు కూడా..
అంగంతో పాటు వృషణాలు కూడా చలి కాలంలోని చల్లని వాతావరణానికి కుంచించుకుపోవడం అనేది అత్యంత సహజం. కాబట్టి ఇలాంటి మార్పులకు భయపడాల్సిన పని లేదు అని నిపుణులు చెబుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే మీ వృషణాలను బట్టి మీ ఆరోగ్యం కూడా అంచనా వేయొచ్చు. అవి కిందికి జారిపోతే మీరు అనారోగ్యంగా ఉన్నారని అర్థం. అవి మంచిగా ఫిట్ గా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని, మీరు బ్యాటింగుకు పూర్తి సామర్థ్యంతో ఉన్నారని అర్థం.
కలయిక విషయంలో..
ఆ కార్యం మొదలు పెట్టేటప్పుడు పొడవు ఒక్కటే కాదు. తగినంత పరిమాణం (లావు) ఉండటం కూడా చాలా ముఖ్యమట. ఆ కార్యం మొదలయ్యాక మీ భాగస్వామికి ఆ విషయం జరిగినట్లు తెలియకపోతే కచ్చితంగా సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు.
సైజు చిన్నగా ఉంటే..
చాలా మంది పురుషులకు దాని సైజు విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా దాని సైజు చిన్నగా ఉంటే తాము ఆ కార్యానికి పనికి రామేమో అని తెగ భయపడిపోతుంటారు. ఇంకొందరు తామే చిన్నగా ఉన్నామని తమది ఇంకా చిన్నగా ఉందని తమ భాగస్వామి ఎక్కడ దూరం పెడుతుందో అని ఇన్ సెక్యూర్ గా ఫీలవుతుంటారు. అయితే ఇలాంటి విషయంలో అలాంటి అపొహలు ఏమి పెట్టుకోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.
అది కేవలం అపొహ మాత్రమే..
ఆ కార్యానికి పరిమాణమే చాలా కీలకం అన్నది కేవలం అపొహ అని నిపుణులు స్పష్టం చేశారు. అయితే దాని పరిణామానికి ఏ మాత్రం ప్రాధాన్యత లేదనుకోవడం కూడా పెద్ద పొరపాటే. ఆ ఘట్టం జరగాలంటే అది సగటు పరిమాణంలో ఉండటం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
పొడవు విషయంలో..
ముఖ్యంగా మీ పొడవు ఒక్కటే కాదు. తగినంత మందం (లావు) కూడా ఉండాలి. అప్పుడే మీ భాగస్వామికి కార్యం జరిగినట్లు తెలుస్తుంది. ఆ ఘట్టంలో అలా జరగకపోతే ఏదో ఒక సమస్య కచ్చితంగా ఉండనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో అమ్మాయి మరియు అబ్బాయిలలో కూడా సమస్య ఉండొచ్చు.
కారణాలు తెలుసుకోవాలి...
అలాంటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు కారణం ఏంటో తెలుసుకోవాలి. ఆ సమస్యకు పరిష్కారం ఉందో లేదో కూడా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల అనేక దేశాల్లో సగటును పురుషాలకు పురుషాంగం పరిమాణం ఎంత ఉంటుందన్న దానిపై చాలా అధ్యయనాలు చేశారు. ఇవి మన దేశంలోనూ జరిగాయి. అందరూ కలిసి తేల్చిన లెక్క ఎంతంటే పురుషాంగం పొడవు సగటున నాలుగు అంగుళాలు ఉన్న చాలు అని నిపుణులు స్పష్టం చేశారు.
తృప్తి పరచడం ఎలా..
అయితే పరిమాణం కన్నా మీ భాగస్వామిని ఎక్కడెక్కడ టచ్ చేస్తే ఆమెలో భావప్రాప్తి కలుగుతుందన్న విషయంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో చాలా మంది పురుషులు తమ పురుషాంగం పొడవు ఎక్కువగా ఉండాలని భావిస్తు ఉంటారని అయితే పొడవు కన్నా కూడా లావు చాలా ముఖ్యమని చెబుతున్నారు.
లేని పోని భ్రమలో బతకొద్దు..
లావు ఎక్కువగా ఉండే వారిని చూసి మహిళలు ఎక్కువగా సంతృప్తి చెందుతారని నిపుణులు చెబుతున్నారు. స్ర్రీకి సుఖాన్ని కలిగించే కేంద్రాలన్నీ చాలా వరకు కింది భాగంలోనే ఉంటాయని చెబుతున్నారు. పోర్న్ సినిమాలు చూసి లేనిపోనివి ఊహించోవద్దని.. భ్రమలో బతకొద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి