*సూర్య గ్రహణం సందర్భంగా తీసుకోవాల్సిన కంటి జాగ్రత్తలు...>>> నవీన్ నడిమింటి సలహాలు, సూచనలు...*
గ్రహణ సమయంలో సూర్యుణ్ణి చూడటం వలన కళ్ళు దెబ్బతింటాయని, అనారోగ్యాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. కేవలం గ్రహణ సమయంలోనే కాదు మామూలు సమయంలోనూ సూర్యుణ్ణి తదేకంగా చూడటం వలన కళ్ళ నీళ్ళు, తుమ్ములు, తలనొప్పి, కళ్ళు మిరుమిట్లు, కంటి రెటీనా దెబ్బతింటుంది. గ్రహణ సమయంలో కన్న మాములు సమయంలో సూర్యుణ్ణి చూడటం ఎక్కువ ప్రమాదం. గ్రహణ సమయంలో సూర్యుని నుండి ప్రత్యేకమైన ప్రమాద కిరణాలు మామూలు సమయాలలో మంచి కిరణాలు ఏమిరావు. ఎప్పుడు ఒకే విధమైన కిరణాలు ప్రసరిస్తాయి. ఒకవేళ సూర్యుణ్ణి చూడాలనుకునే వారు ఒక మట్టి కుండలో నీటిని తీసుకొని గోమయాన్ని కలిపి సూర్యుని ప్రతిబింబాన్ని వీక్షించవచ్చును.
మూర్ఛరోగులు, గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడటం వలన పుట్టే పిల్లలలో గ్రహణమొర్రి, కాళ్ళ వంకర తో పుడతారనేది మూడనమ్మకం. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంట్లో పడుకోకుండా బయట తిరగచ్చని, అన్నీ పనులు చేసుకోవచ్చని హైదరాబాద్ లో శాస్త్రవేత్తల ప్రయోగాల ఫలితంగా నిరూపించారు.
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....
https://vaidyanilayam.blogspot.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి