పిల్లల్లో కరోనా ఎలా గుర్తించాలి? కరోనా సోకిన తల్లి పాలు ఇవ్వొచ్చా?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
పిల్లల్లో కరోనా ఎలా గుర్తించాలి? కరోనా సోకిన తల్లి పాలు ఇవ్వొచ్చా?
కరోనా ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ వరస్ట్‌గా బీహేవ్ చేస్తోంది. కరోనా పిల్లలకు సోకదు.. వారిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుంటుంది అనుకుని ధైర్యంగా ఉన్నాం అందరం.. అయితే పాత కరోనా పిల్లలపై పెద్దగా ప్రభావం చూపకున్నా.. కొత్త కరోనా వారిపై కూడా ప్రతాపం చూపుతోంది. ఇప్పడు 18ఏండ్ల లోపున్న పిల్లలు కరోనా బారిన భారీగానే పడుతున్నారు. కేసులు ఎక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి.
ఇప్పుడెందుకిలా?
జనవరి నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పిల్లలంతా స్వేచ్ఛగా బయట ఆడుకోవడం మొదలుపెట్టారు. యూత్ కూడా బయట ఇష్టారాజ్యంగా తిరిగారు. అయితే ఇంతలోనే కరోనా కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు పుట్టుకొచ్చాయి. ఓపెన్ ప్లేసుల్లో రద్దీ పెరగడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడం, కొత్త కరోనాకు వేగంగా వ్యాపించే గుణం ఉండడమే కేసుల పెరుగుదలకు కారణాలుగా తెలుస్తోంది.
పిల్లలు, టీనేజర్లలో కరోనా లక్షణాలు ఇలా ఉంటాయి..
పిల్లల్లో జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి కరోనా సోకిన పిల్లల్లో ప్రధాన లక్షణాలు. వీటిత పాటు వాంతులు విరేచనాలు, తలనొప్పి, ఒళ్లునొప్పులు ఉంటే కచ్చితంగా కరోనా సోకిందని భావించాలి. చిన్నారులు నొప్పిగా ఉందని చెప్పరు కాబట్టి.. వాళ్లు నిరంతరం ఏడుస్తున్నా.. విచిత్రంగా ప్రవర్తిస్తున్నా.. నొప్పితో బాధపడుతున్నారని అనుమానించాలి.
వీరు కూడా రుచి, వాసన కోల్పోతారు. అయితే పిల్లలు చెప్పలేరు. సరిగ్గా అన్నం తినకపోతే వారు రుచి, వాసన కోల్పోయినట్లుగా అనుమానించాలి. అయితే పిల్లలకు కరోనా సోకినా ఫాస్ట్‌గానే క్యూర్ అవుతారు. ఐసీయూలో ఉంచాల్సిన అవసరం రాదని నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా లక్షణాల్లో మరి కొన్ని కీలక లక్షణాలను వారు చెబుతున్నారు. అవి ఏంటంటే.. చర్మంపై దద్దుర్లు, కళ్లు ఎర్రబడడం, వేలు గోర్లు లేదా బొటనవేలు నీలం రంగులోకి మారడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
టెస్టులు చేయించవచ్చా..? చికిత్స ఎలా తీసుకోవాలి?
చాలా వరకు పెద్దల లాగా వీరికి చికిత్స అవసరం పడదు. వ్యాధి లక్షణాలు కనపడితే టెస్టులు చేయించాల్సి ఉంటుంది. జ్వరం ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఒక వేళ తేలికపాటి లక్షణాలే ఉంటే ఇంట్లోనే ఉంచండి. హాస్పిటల్‌కు తీసుకెళ్తే అక్కడుండే వారి వలన పిల్లలకు వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండే ఆన్లైన్లో డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. జ్వరం ఉన్న పిల్లలకు ఏ సమయంలో ఎంత ఉందో రాసుకోవాలి. అలాగే ఆక్సిజన్ లెవల్స్, పల్స్ రేటు, వాంతులు, విరేచనాలు.. ఇతర వ్యాధి లక్షణాలు రాసి పెట్టుకోవాలి. ఆక్సిజన్ లెవల్ 94కంటే తగ్గిపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు ఉన్న పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. వారికి వేగంగా కోలుకునే శక్తి ఉంటుంది.
కరోనా సోకిన తల్లి పాలు ఇవ్వొచ్చా?
కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉన్న తల్లి తన బిడ్డను దగ్గరకు తీసుకోవచ్చు. మాస్క్ పెట్టుకుని తగిన జాగ్రత్తలు పాటించి పాలు కూడా ఇవ్వొచ్చు. ఎందుకంటే తల్లిపాల నుంచి బిడ్డకు వైరస్ సోకే అవకాశం చాలా తక్కువే. అయితే తల్లి పాలు తాగిస్తే నష్టం కంటే లాభాలే ఎక్కువుంటాయి.
పిల్లలకు వ్యాక్సిన్?
ప్రస్తుతానికైతే పిల్లలకు ఏ దేశంలో కూడా వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. 12–15సంవత్సరాల పిల్లలకు తమ వ్యాక్సిన్ వేసుకుంటే వంద శాతం రక్షణ ఉంటుందని అమెరికన్ సంస్థ ఫైజర్ ప్రకటించింది. 6 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు రిసెర్చ్ చేస్తున్నట్లు అస్ట్రాజెనికా చెప్పింది.
రిక్వెస్ట్: నచ్చితే లైక్ కొట్టండి.. వీలయితే కామెంట్ పెట్టండి.. దోస్తులకు షేర్ చేయండి. మరిన్ని వార్తలకు గూగుల్‌లో maatamuchata. com సెర్చ్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి