6, మే 2021, గురువారం

ఊపిరితిత్తుల పైన కరోనా దాడి పూర్తి వివరణ అవగాహనా కోసం లీంక్స్ లో చూడాలి

ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్ష‌న్ సోకినట్లు ఎలా గుర్తించాలి? అవగాహనా కోసం లీంక్స్ లో చూడాలి 

ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్ష‌న్ సోకినట్లు ఎలా గుర్తించాలి?

క‌రోనా వైర‌స్ ప్ర‌ధాన టార్గెట్ ఊపిరితిత్తులేనా! ఎందుకంటే కొవిడ్‌-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడ‌క‌నే ఇబ్బంది ప‌డుతున్నారు ! నిజానికి వైర‌స్ చాలావ‌ర‌కు మ‌న గొంతు ద్వారానే శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. శ్వాస‌మార్గం గుండా నేరుగా వైర‌స్ లంగ్స్‌కు చేరుతుంది. కాబ‌ట్టి ముందుగా వాటిపైనే ప్ర‌భావం చూపిస్తుంది. దీనివ‌ల్ల శ్వాస‌మార్గంలో ఇన్‌ఫెక్ష‌న్ ఏర్ప‌డి శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. గొంతు నొప్పి, పొడి ద‌గ్గు వస్తోంది. క‌రోనా సోకిన వారిలో దాదాపు 80 శాతం మందిలో ఇలాంటి ల‌క్ష‌ణాలే క‌నిపిస్తాయి. కొంత‌మందిలో న్యుమోనియా ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా ఊపిరితిత్తుల‌ను కాపాడుకోవ‌చ్చు. క‌రోనావైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డేస‌రికే 25 శాతం వ‌ర‌కు లంగ్స్ దెబ్బ‌తింటాయి. కాబ‌ట్టి ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే ఆల‌స్యం చేయకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం ద్వారా క‌రోనా నుంచి తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డొచ్చు.

ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?

శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉందంటే.. మీ ఊపిరితిత్తుల్లోకి వైర‌స్ ప్ర‌వేశించింద‌ని అనుమానించాల్సిందే. ఊపిరితిత్తుల దిగువ భాగంలో వాపు లేదా నొప్పి ఎక్కువ‌గా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పొడి దగ్గు, ద‌గ్గుతున్న‌ప్పుడు నొప్పి రావడం కూడా కొవిడ్‌-19 పాజిటివ్‌గా ఉండటానికి సంకేతాలు అని గుర్తించాలి.

ఇత‌ర స‌మ‌స్య‌లు ఏముంటాయి

కొవిడ్‌-10 కార‌ణంగా న్యుమోనియా రావ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బంది ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో లంగ్స్ మొత్తం పాడైపోయి ప్రాణానికే ప్ర‌మాదం ఏర్ప‌డ‌వ‌చ్చు. ఈ వైర‌స్ కార‌ణంగా న్యుమోనియా వ‌స్తే ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు మొత్తం ద్ర‌వంతో నిండిపోయి ఊపిరితిత్తుల వాపు వ‌స్తుంది. దీనివ‌ల్ల తీవ్ర‌త ద‌గ్గు రావ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మైపోతుంది.

ఊపిరితిత్తుల పనితీరును ఎలా మెరుగుపరచాలి..?

ఊపిరితిత్తుల ఆరోగ్యం ప్ర‌ధానంగా వాటి సామ‌ర్థ్యం, ప‌నితీరుపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఊపిరితిత్తుల ప‌నితీరు బాగుంటేనే శ‌రీరానికి కావాల్సిన ఆక్సిజ‌న్ స‌క్ర‌మంగా అందుతుంది. కాబ‌ట్టి ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌డాలంటే వ్యాయామం చేయ‌డం చాలా అవ‌స‌రం. శారీర‌క శ్ర‌మ వ‌ల్ల శ్వాస తీసుకునే సామ‌ర్థ్యం పెరుగుతుంది. త‌ద్వారా ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు పెరుగుతాయి. ఫ‌లితంగా ఊపిరితిత్తులు ఆక్సిజ‌న్‌ను గ్ర‌హించే సామ‌ర్థ్యం పెరుగుతుంది. కాబ‌ట్టి ప్ర‌తిరోజు రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయ‌డం మంచిది. పెద్ద‌లు అయితే క‌నీసం 30 నిమిషాలు, పిల్ల‌లు అయితే గంట పాటు వ్యాయామం చేయ‌డం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

లంగ్స్‌లో దీర్ఘ‌కాలిక మంట త‌గ్గాలంటే స‌రైన పోష‌కాహారం తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూర‌గాయలు తినాలి. అర‌టి పండ్లు, యాపిల్‌, ద్రాక్ష‌, టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ల‌భిస్తాయి.


కరోనా వైరస్ బారి నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవడం ఎలా?నవీన్ నడిమింటి సలహాలు 

కరోనా వైరస్ సోకితే అది మనిషి శరీరంలో శ్వాస వ్యవస్థను బలంగా దెబ్బతీస్తోంది. దీంతో మనిషికి ఆక్సిజన్ మరింత అవసరమవుతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే ముందస్తుగా మన శరీరంలోని ఊపిరితిత్తులను బలంగా చేసుకోవాలి. ఏ వైరస్ వచ్చినా తట్టుకుని నిలబడేలా చూసుకోవాలి. దీని కోసం ప్రతిరోజు 30 నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలోని చెడు వాయువు బయటకు వెళ్లి.. ప్రాణవాయువు లోపలకు వస్తుందని తెలిపారు. దీని వల్ల శరీరం ఉత్తేజంగా మారి రక్తం శుభ్రపడుతుందని పేర్కొన్నారు. ప్రాణాయామాన్ని ముఖ్యంగా మూడు పద్ధతుల్లో చేస్తారు. అవి కనిష్ఠ ప్రాణాయామం, మధ్యమ ప్రాణాయామం, ఉత్తమ ప్రాణాయామం.

1) కనిష్ట (అధమ) ప్రాణాయామం
ఈ పద్ధతిలో వజ్రాసనంలో కూర్చుని నిరంతరాయంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసలు తీసుకోవాలి. దీన్నే పూరక అంటారు. ఉదర కింది భాగం ఉబ్బేట్టుగా కింది ఊపిరితిత్తులోకి శ్వాస తీసుకోవాలి. శ్వాస బయటకు విడిచే ముందర కాసేపు అలాగే ఉండాలి. బయటకు శ్వాస విడిచేటపుడు నెమ్మదిగా పొట్టలోకి తీసుకోవాలి. మళ్లీ శ్వాసలోనికి తీసుకోవటానికి ముందు కొద్ది క్షణాలు అలాగే ఉండి.. అప్పుడు లోపలకు శ్వాస తీసుకోవాలి. ప్రశాంతంగా ఈ ప్రక్రియను మళ్లీ మళ్లీ చేయాలి

2) మధ్యమ ప్రాణాయామం
ఈ పద్ధతిలో వజ్రాసనంలో కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోవాలి. ఈ పద్దతిలో శ్వాస తీసుకునేటప్పుడు కేవలం ఛాతి మాత్రమే ఉపయోగించాలి. శ్వాసను ముక్కు రంధ్రాల నుంచి వదలాలి. పొట్టభాగం అసలు కదలకూడదు.

3) ఉత్తమ (ఆద్య) ప్రాణాయామం
ఈ పద్ధతిలో వజ్రాసనంలో కూర్చొని శ్వాస తీస్తూ భుజాలు పైకి లేపాలి. ఊపిరిని పైనున్న ఊపిరితిత్తులలోకి నింపాలి. చాలా అరుదుగా వాడే ఈ భాగం ఇలా చేయడం వల్ల సక్రమంగా పనిచేస్తుంది.

కనిష్ట, మధ్యమ, ఉత్తమ ప్రాణాయామాలు కలిసి చేయడమే పూర్ణయోగ శ్వాసక్రియ. ఈ పద్ధతిలో శ్వాస తీసుకునే సమయంలో అధమ, మధ్యమ, ఆద్య క్రియలు వరుసగా జరుగుతాయి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు పూర్తి సామర్థ్యంతో గాలిని తీసుకోగలుగుతాయి. ప్రాణాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వాన్ని కూడా సాధించవచ్చు. ప్రాణాయామం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. కాబట్టి ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మీ శరీర కాంతి పెంచుతుంది. సహజంగా మీ శరీరానికి గ్లో రావాలంటే రోజు ప్రాణాయామం చేయాలని

కామెంట్‌లు లేవు: