పక్క తడపడం అంటే ఏమిటి?
పక్క తడపడం, దానినే రాత్రి సమయ నిగ్రహరాహిత్యం (night-time incontinence) లేదా నిద్రలో మూత్ర విసర్జన (nocturnal enuresis) అని కూడా పిలుస్తారు, ఇది నిద్రలో పునరావృత్తమైయ్యే అసంకల్పిత మూత్ర విసర్జన వ్యాధి. ఇది సాధారణంగా 5 నుండి 7 ఏళ్ళ వయస్సు తర్వాత జరుగదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పాఠశాల వయస్కులైన పిల్లల్లో కనిపించే ఒక సాధారణ పరిస్థితి. పిల్లలు మరియు యుక్తవయస్కులలో పక్క తడపడం సాధారణం అయినప్పటికీ, ఇది భారతదేశంలో తగినంతగా నివేదించబడలేదు. ప్రపంచవ్యాప్తంగా దీని వ్యాప్తి 1.4% -28% గా ఉంది. భారతదేశంలో దీని ప్రాబల్యం 7.61% -16.3% గా ఉంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పిల్లలు సాధారణంగా 5 ఏళ్ళ నాటికి మూత్ర విసర్జన ఎలా చెయ్యాలో నేర్చుకుంటారు, కానీ పూర్తిగా మూత్రాశయ నియంత్రణ పొందడానికి ఏ విధమైన స్థిర వయస్సు లేదు. కొంతమంది పిల్లలు 5 మరియు 7 సంవత్సరాల మధ్య ఈ సమస్యను ఎదుర్కొంటారు. వైద్యుల దృష్టికి తీసుకు వెళ్ళవలసిన సంకేతాలు మరియు లక్షణాలు:
- పిల్లలు 7 సంవత్సరాల తర్వాత కూడా మంచం తడుపుతుంటే.
- పక్క తడపడం మానివేసిన కొన్ని నెలలు తర్వాత మళ్ళి మొదలుపెడితే.
- బాధాకరమైన మూత్రవిసర్జన, గులాబి లేదా ఎరుపు రంగులో మూత్రం, అధిక దాహం, గట్టి మలం లేదా గురక పెడుతుంటే.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కారణాలు స్పష్టంగా తెలియలేదు కానీ వాటిలో కొన్ని ఈ కింది కారణాలు కావచ్చు:
- చిన్నమూత్రాశయం: మూత్రాశయం పూర్తిగా అభివృద్ధి చెందకపోవచ్చు.
- మూత్రాశయం నిండిందని అని తెలుసుకోలేకపోవటం: మూత్రాశయాన్ని నియంత్రించే నరములు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంటే, నిండిన మూత్రాశయం పిల్లవాడిని నిద్ర నుండి మేల్కొనేలా చెయ్యదు.
- హార్మోన్ల అసమతుల్యత: రాత్రుళ్లు మూత్రం ఆలస్యంగా ఏర్పడెలా చేసే యాంటి డైయ్యూరెటిక్ హార్మోన్( antidiuretic hormone ) (ADH) తగినంత లేనప్పుడు.
- మూత్రాశయ సంక్రమణ (infection): సంక్రమణ (infection) వలన మూత్రాన్ని నియంత్రించడంలో పిల్లవాడికి కష్టంగా ఉండవచ్చు. (మరింత సమాచారం: యూటిఐస్ చికిత్స (UTIs treatment))
- స్లీప్ అప్నియా(Sleep apnoea): పెద్ద టాన్సిల్స్ లేదా అడెనాయిడ్ల కారణంగా నిద్రపోయినప్పుడు శ్వాస నిరోధించబడుతుంది.
- మధుమేహం: బిడ్డ సాధారణంగా రాత్రి పక్క తడపనప్పుడు, మధుమేహం ఒక మొదటి కారకం కావచ్చు.
- దీర్ఘకాలిక మలబద్ధకం: దీర్ఘకాల మలబద్ధకం మూత్రపిండాల పనితీరును తగ్గించగలదు.
- ఒత్తిడి: భయాన్ని ప్రేరేపించే ఒత్తిడి కూడా పక్క తడపడాన్ని ఉత్తేజపరచవచ్చు.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
మీ బిడ్డ యొక్క మూత్రవిసర్జన క్రమాన్ని తెలుసుకొనమనవచ్చు, మరియు డైరీని నిర్వహించమని అడగవచ్చు.
గమనించదగ్గ అంశాలు:
- మూత్ర విసర్జన తరచుదనం
- మల విసర్జన తరచుదనం మరియు చిక్కదనం
- నిద్రపోయే సమయంలో ద్రవం తీసుకోవడం
ఈ పరీక్షలు ఉండవచ్చు:
- మూత్ర సూక్ష్మజీవుల సాగు మరియు విశ్లేషణ: సంక్రమణ (infection), మధుమేహం, రక్తం యొక్క జాడలు లేదా ఏ ఇతర పదార్ధాల యొక్క తనిఖీ కోసం.
- రక్త పరీక్షలు: రక్తహీనత, మధుమేహం, మూత్రపిండ సమస్యలు మరియు ఇతర పరిస్థితుల తనిఖీ కోసం.
- మూత్రాశయ అల్ట్రాసౌండ్: మూత్ర విసర్జన తర్వాత మూత్రంలో ఎంత మూత్రం మిగిలివుందో తెలుసుకోవడానికి.
- మూత్రపిండ పరీక్ష(Urodynamic testing): మూత్రం యొక్క నిల్వ మరియు ఎలా ప్రవహిస్తుందో పరిశీలించడానికి.
- సిస్టోస్కోపీ (Cystoscopy): మూత్రాశయంలోని కెమెరాను పెట్టడం ద్వారా మూత్రాశయ పరిస్థితులను తనిఖీ చెయ్యడం కోసం.
పక్క తడపడం ఒక ప్రధాన సమస్య కాదు అది పిల్లల అభివృధ్ధి దశను సూచిస్తుంది, కానీ పిల్లలు అసహనంతో మరియు తక్కువ స్వీయ-గౌరవంతో బాధపడతారు. ఈ పరిస్థితిని సరిదిద్దడంలో తల్లిదండ్రులూ నిస్సహాయతను ఎదుర్కుంటారు.
నిర్వహణ అనేది ఈ క్రింది వాటిని కలిగి:
- తల్లిదండ్రులు మరియు పిల్లలకు మరియు పక్క తడపడాన్ని నయం చేయవచ్చని సలహా ఇవ్వడం.
- ADH కు సమానమైన ఒక ఔషధాన్ని వైద్యులు సూచించవచ్చు, ఇది ADH వంటి ప్రభావాలను అందిస్తుంది మరియు యాంటీడిప్రేంట్, మూత్రాశయాన్ని విశ్రాంతపరచేది సూచించవచ్చు.
మందులు లేని పద్ధతులు: ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు
- వాడిపడేసే లేదా పునర్వినియోగపరచదగిన పీల్చుకునే లోదుస్తులు.
- పక్క తడపడాన్ని సూచించే మొయిస్టుర్ అలరాలు (Moisture alarms).
స్వీయ రక్షణ చిట్కాలు:
- రోజులో ఉదయం పూట పిల్లలు ద్రవం ఎక్కువ తీసుకునేలా చేసి సాయంత్రం ద్రవం పరిమితిగా తీసుకునేలా ప్రయత్నించాలి.
- నిద్రపోయే ముందు పిల్లవాడితో మూత్ర విసర్జన చేయించాలి.
- బిడ్డను ప్రోత్సహించండి, తద్వారా అతను / ఆమె సౌకర్యవంతంగా మరియు నమ్మకంగా ధైర్యంగా ఉంటారు.
- మీ బిడ్డ మూత్రవిసర్జన చేసినా, తిట్టడం లేదా శిక్షించకూడదు లేదా అది ప్రయోజనం ఇవ్వదు.
- షీట్లను శుభ్రపరిచేటప్పుడు మీ బిడ్డను సహాయం చేయమని ప్రోత్సహించండి, అందువలన అతను / ఆమె సౌకర్యంగా ఉంటారు
పక్కతడుపుట కొరకు అల్లోపతి మందులు
Medicine Name | Pack Size | |
---|---|---|
D Void | D Void 0.01% Spray | |
Sycodep | Sycodep 2 /25 Tablet | |
ADEL 28 Plevent Drop | ADEL 28 Plevent Drop | |
Minirin | Minirin Melt 0.1 Tablet | |
Toframine | Toframine 2 Tablet | |
Allen A71 Urinary Tract Infections Drop | Allen A71 U.T.I. (Urinary Tract Infections) Drop | |
ADEL 29 Akutur Drop | ADEL 29 Akutur Drop | |
SBL Eschscholtzia californica Dilution | SBL Eschscholtzia californica Dilution 1000 CH | |
Trikodep | Trikodep Tablet | |
Trikodep Forte | Trikodep Forte Tablet |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి