Corona Vaccine: మొదటి డోసులో కోవ్యాగ్జిన్.. రెండో డోసులో కొవిషీల్డ్ టీకాలు తీసుకోవచ్చా..? వ్యాక్సిన్ వేసుకుంటే ఇతర మెడిసిన్స్ వాడొద్దా..?
‘నేను మొదటి డోసులో కోవ్యాగ్జిన్, రెండో డోసులో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా.? వ్యాక్సిన్ వేసుకుంటే ఇతర వ్యాధులకు వాడుతున్న మందులను ఆపేయాలా? మద్యం తాగొచ్చా‘ అంటూ ఎంతో మంది ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు. వాటికి సమాధానాలివే..
కోవిడ్ తీవ్రతను వ్యాక్సినేషన్ ద్వారా వీలైనంత వరకు అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి 18 ఏళ్లు నిండినవారికి టీకాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఎన్నో అపోహలు నెలకొన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లలో ఏదైనా మంచి ఫలితం ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీకాలపై నెలకొన్న అపోహలు, వాటికి సమాధానాలు తెలుసుకుందాం
* కోవ్యాగ్జిన్, కొవిషీల్డ్‌లలో ఏ వ్యాక్సిన్ మంచిది? />ప్రస్తుతం దేశంలో ఈ రెండు వ్యాక్సిన్లను ప్రజలకు అందిస్తున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకున్న లబ్ధిదారుల వివరాలను కోవిన్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ప్రజలు ఏదో ఒక వ్యాక్సిన్‌ను ఎంచుకునే అవకాశం లేదు. ఇవి రెండూ కరోనా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. అందువల్ల రెండింట్లో ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం
* మొదటి డోసు ఒక టీకా, రెండో డోసు మరో టీకా తీసుకోవచ్చా? />కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను వేర్వేరు పద్ధతుల్లో అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ప్లాట్‌ఫాంలపై ఆధారపడి ఉన్నాయి. కోవాగ్జిన్ ఒక ఇన్ యాక్టివేటెడ్ వ్యాక్సిన్. కొవిషీల్డ్ వైరల్ వెక్టార్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంది. అందువల్ల రెండు టీకాలను కలిపి తీసుకోవద్దు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్ మాత్రమే తీసుకోవాలి.(ప్రతీకాత్మక చిత్రం)
* మొదటి డోసు టీకా తీసుకున్న తరువాత కరోనా సోకితే.. ఎన్ని రోజుల తరువాత రెండో డోసు తీసుకోవాలి? />కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న నాలుగు వారాల తరువాత నేరుగా రెండో డోసు తీసుకోవచ్చు. వీరు మరోసారి మొదటి డోసు టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు.(ప్రతీకాత్మక చిత్రం)
* రెండో డోసు వ్యాక్సిన్ తీసుకునే వరకు ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలా? />మొదటి డోసు తరువాత ఎప్పుడూ తీసుకునే ఆహారాన్ని కొనసాగించాలి. ఆహారం విషయంలో ప్రత్యేక నియమాలు, డైట్ పాటించాల్సిన అవసరం లేదు.(ప్రతీకాత్మక చిత్రం)
* గర్భిణులు, పిల్లలు కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? />కరోనా మహమ్మారి గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. రెండో దశలో మహమ్మారి పిల్లలకు కూడా వ్యాపిస్తోంది. కానీ మన దేశంలో ఉపయోగిస్తున్న రెండు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్‌ను గర్భిణులు, పిల్లలపై నిర్వహించలేదు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ గర్భిణులకు, పిల్లలకు వ్యాక్సిన్లను సిఫారసు చేయలేదు.(ప్రతీకాత్మక చిత్రం)
* ఇంతకు ముందు COVID-19 బారిన పడి కోలుకున్నవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? />గతంలో కరోనా బారిన పడిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనివల్ల యాంటీ బాడీలు పూర్తి స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా వైరస్ వ్యాపించే ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం)తగ్గుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
* టీకాల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి? />సాధారణంగా వ్యాధుల నివారణకు తీసుకునే అన్ని రకాల టీకాలు కొద్దిపాటి దుష్ప్రభావాలు కలిగిస్తాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కొంతమందికి ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వరం, అలసట, తలనొప్పి, కీళ్ల నొప్పులు, అలసట వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కొన్ని గంటల్లోనే తగ్గిపోతాయి. అందువల్ల దుష్ప్రభావాలకు భయపడకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. (ప్రతీకాత్మక చి
* వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కరోనా సోకదా? />రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అభివృద్ధి చెందే యాంటీబాడీలు 6-12 నెలల వరకు రక్షణకు భరోసా ఇస్తాయి. అయితే టీ-కణాలు ఇచ్చే రక్షణ ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఇవి కూడా వైరస్‌ను సమర్థంగా నిరోధిస్తాయి. దేశ ప్రజలందరికీ రెండు డోసుల టీకా ఇచ్చిన తరువాత, అదనపు రక్షణ కోసం బూస్టర్ డోస్ ఇవ్వాలని వ్యాక్సిన్ తయారీ సంస్థలు భావిస్తున్నాయి. దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి.
కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు వేసుకోవాలి? వేసుకున్నవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి