13, జులై 2021, మంగళవారం

కీళ్ల నొప్పి నివారణ అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి


శరీరంలో మనం ప్రతిరోజు ఎక్కువగా వాడే ముఖ్యమైన అవయవాలలో మోకాలు ఒకటి. నడుస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మన మోకాలు చాలా ఒత్తిడిని భరిస్తుంది. దీంతో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నవారికి నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అన్ని వయసుల వారు మోకాలి నొప్పికి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎముకల్లో గట్టిదనం లేకపోవడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి.

    

ప్రధానాంశాలు:

  • అనేక కారణాలతో మోకాలి నొప్పులు
  • మోకాళ్ళ నొప్పులను దూరం చేసే ఇంటి చిట్కాలు
వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో క్షీణత కారణంగా మోకాలి నొప్పి ప్రమాదం కూడా పెరుగుతుంది. దీంతో చాలామంది మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుంటారు. భారత్‌లో ప్రతి ఏడాది 1.20 లక్షల మంది మోకాలి మార్పిడి ఆపరేషన్‌లు చేయించుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో నిరూపితమైంది. గతంలో 60 ఏళ్ల, 70 ఏళ్లు వచ్చాయంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వచ్చేవి. కానీ ప్రస్తుత రోజుల్లో కేవలం 30 ఏళ్లు, 40 ఏళ్లకు కీళ్ల నొప్పులు వస్తున్నాయి. మోకాలి నొప్పి నుంచి బయటపడేందుకు వ్యాయామం మంచి ప్రత్యామ్నాయం. వారంలో కొన్నిరోజులు వ్యాయామాలు చేయడం వల్ల మోకాలి శస్త్ర చికిత్సను నివారించవచ్చు.

ముఖ్యంగా యువకులలో, క్రీడాకారులలో గాయాల వల్ల, స్థూలకాయుల్లో కీళ్లు, మోకాలి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌ అనేది మృదులాస్థి అరిగిపోవడం వల్ల సంభవిస్తుంది. వృద్ధాప్యంలో మృదులాస్థి అరుగుదల వల్ల అధిక బరువు మోకాలు భాగంలో నిర్ధిష్టమై ఈ సమస్య ఎక్కువవుతుంది. ఈ సమస్య ఉన్నవారికి ప్రారంభదశలో మెట్లు ఎక్కేటప్పుడు, నడిచినప్పుడు మోకాలు నొప్పి కలుగుతుంది. ఆ తరువాత క్రమేపి కీళ్ల వాపు, మోకాలు ఎర్రబడటం, బలహీనంగా తయారవడం, ఆ తరువాత భరించలేని నొప్పి మోకాలు మొత్తం వ్యాపిస్తుంది. ఈ ప్రక్రియ సుమారు 2-5 సంవత్సరాల వ్యవధిలో జరుగుతుంది. మోకాలు నొప్పి ప్రారంభంలో రోగులు ఫిజియోథెరపిస్ట్‌ సలహా మేరకు కొన్ని రకాల శారీరక వ్యాయామాలు చేస్తారు. మరికొందరు నొప్పి తగ్గడానికి పెయిన్‌ కిల్లర్స్ వాడతారు. ఇలా చేయడం వల్ల తరువాత దశలో వారు పెయిన్‌ కిల్లర్స్‌కి బానిస అవుతారు. ఈ మందులు ప్రారంభంలో కలిగే రోగలక్షణాల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. వీటితో మూత్రపిండాలు పాడయ్యే ప్రమాదం ఉంది. ఇలా చేయడం వల్ల పూర్తిగా మోకాలుని మార్పిడి చేయాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది.

ఈ సమస్యకు సమర్థమైన ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా(పీఆర్‌పీ) చికిత్స అందుబాటులోకి వచ్చేవరకూ మిగతా చికిత్సలు అంత ప్రభావాన్ని చూపించలేకపోయాయి. ఈ చికిత్స ద్వారా ఆపరేషన్‌ లేకుండానే శాశ్వత పరిష్కారం దొరకుతుంది. రోగుల రక్తాన్ని (20-30 మి.లీ) తీసుకొని, ఒక ప్రత్యేకమైన పరిజ్ఞానం కలిగిన పరికరంతో వృద్ధి కారకాన్ని సేకరిస్తారు. ప్లేట్‌లెట్స్‌లో చాలా వృద్ధి కారకాలు ఉన్నాయి. వీటిని దెబ్బతిన్న కణజాలంలోకి ఇంజెక్ట్‌ చేసినప్పుడు, దెబ్బతిన్న కణజాలాన్ని రిపేర్‌ చేయడానికి ఈ వృద్ధి కారకం సహాయపడుతుంది. ఈ చర్య ఆరోగ్యకరమైన కణజాలం పునరుత్పత్తి అయి, క్షీణించిన మృదులాస్థితో చేరి, దానిని ఆరోగ్యవంతమైన కణజాలంతో మరమ్మతు చేయడానికి సహాయపడుతుంది. ఈ విధానంలో ఏర్పడే నొప్పి, మంట తగ్గడానికి, మృదులాస్థి పూర్తి పునరుత్పత్తికి దాదాపు మూడు నెలలు పడుతుంది.
మోకాలి నొప్పిని తగ్గించే వ్యాయామం

సాధారణంగా మోకాలిని చాచే వ్యాయామం చేయడం ద్వారా మోకాలి చుట్టూ కండరాలు బలపడతాయి. అయితే మోకాలిని సరిగ్గా చాచకుంటే నొప్పి మరింత తీవ్రమయ్యే అవకాశముంది. ఈ వ్యాయామాన్ని ఎలాంటి సాధనం లేకుండా కేవలం కుర్చీని ఉపయోగించి చేయవచ్చు. ఈ వ్యాయామం వారానికి రెండు సార్లు చేయడం వల్ల మోకాలి బలం పెరిగి నొప్పి తగ్గే అవకాశాలున్నట్లు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


మోకీళ్లు అరిగిపోయే ఆర్థరైటిస్‌ సమస్య ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మందులు వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. వాటితో పాటు నొప్పిని పెంచే పనులు తగ్గించి, కీళ్లను బలపరిచే వ్యాయామాలు సాధన చేయాలి. మోకాళ్ల సమస్యలు ఉన్నవారు మెట్లు ఎక్కడం, ఏటవాలు ప్రదేశాల్లో నడవడం వంటి పనులు చేయకూడదు. ఏరోబిక్‌, జుంబా వ్యాయామాల్లో భాగంగా స్టెప్పర్‌ను వాడడం వల్ల కీళ్ల మీద ఒత్తిడి పెరిగి నొప్పులు పెరుగుతాయి. కాబట్టి ఈ పనులు మానుకోవాలి. అలాగే మోకాళ్లు వంచి చేసే పద్మాసనం, వజ్రాసనం వంటి యోగాసనాలు వేయకూడదు. నేల మీద బాసింపట్టా వేసి కూర్చోకూడదు.

మోకాలి నొప్పుల నివారణకు శశంకాసనం

శశంకాసనంతో వెన్నెముక సాగి, మెదడు విశ్రాంతి పొందుతుంది. మోకాళ్లు బలపడుతాయి. పొత్తికడుపులోని అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శరీరం మొత్తం విశ్రాంతి పొందడం వల్ల ఈ అనుభూతి శరీరం అంతటా తెలుస్తుంద
శశంకాసనం చేసే విధానం..
దండాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా వజ్రాసనంలోకి రావాలి. శ్వాస వదులుతూ రెండు చేతులను తలపైకి నిటారుగా చాపాలి. నెమ్మదిగా ముందుకు వంగుతూ చేతులను నేలపై ముందుకు చాపాలి. నుదుటిని నేలపైన ఆనించాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో 30 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు ఉండాలి. శ్వాస తీసుకుంటూ చేతులు, వీపును పైకి ఎత్తి వజ్రాసనంలో కూర్చోవాలి. శ్వాస వదులుతూ చేతులను శరీరానికి ఇరుపక్కలా ఉంచి దండాసనంలో కూర్చొని


కీళ్లనొప్పులు - ఆయుర్వేద పరిష్కారాలు నవీన్ సలహాలు 

కీళ్లనొప్పులు - ఆయుర్వేద పరిష్కారాలు


ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు.
 
 ‘కీళ్లనొప్పులు’ ప్రస్తుత కాలంలో అతిచిన్న (30-40) వయసులోనే మొదలవుతున్నాయి. ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్‌ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం సామాన్య కారణాలుగా చెప్పవచ్చు.
 
 అలాగే దినచర్యలో సరైన వ్యాయామం, సరియైన సమయంలో నిద్రపోకపోవడం, (స్వప్న విపర్యం అనగా పగలు నిద్రించుట, రాత్రి ఎక్కువగా మేల్కొనుట వంటివి) కూడా సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే మానసికంగా ఎక్కువగా ఆలోచించటం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఈ కీళ్ల నొప్పులకు సామాన్య కారణాలుగా పరిగణించవచ్చు.
 
 ఈ కీళ్ల నొప్పులను ఆయుర్వేదశాస్త్రంలో మూడు విధాలుగా వర్ణించారు.
 1. సంధివాతం     -     Oesteo arthrities
 2. ఆమవాతం     -     Rheumatoid arthritis
 3. వాతరక్తం     -     Gout
 
 సంధి వాతం (Oesteo arthrities)


 సంధివాతాన్ని ఆస్టియో ఆర్ధరైటిస్‌గా ఆయుర్వేదం పరిగణిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా త్రిదోషపరంగా చూసినట్లయితే సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్లనుండి శబ్దాలు (Crepites) ఉంటాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియర్ ఫ్లూయిడ్) శ్లేషక కఫం తగ్గుతుంది.
 
 సంధివాతంలో కదలికల వలన నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి ఉంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమస్య 50-60 సంవత్సరాల మధ్య వయసు వారికి వస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈవ్యాధి ఎక్కువగా వస్తూంటుంది.
 
 ఈ సమస్యకు ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సోరియాసిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆహారంలో పోషకవిలువల లోపం వలన కూడా (విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్) ఈ వ్యాధి వస్తుంది.
 
 జీవన విధానంలో కొన్ని రకాలైన మార్పుల వలన ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, అధిక బరువులు తలపైన లేదా వీపుమీద మోయటం ఎక్కువగా కంప్యూటర్స్ ముందు కూర్చోవటం... ఇలాంటివి కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి.
 
 ఆమ వాతం (Rheumatoid arthritis)

Advertising
Advertising


 రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ముఖ్యంగా ఆమం, వాతం అనే రెండు దోషాల ప్రభావం వలన ఈ సమస్య వస్తుంది. మానసిక ఒత్తిడి వలన ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం వలన, సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన, వ్యాయామం లేకపోవటం వలన, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవటం లాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు (Swelling), తీవ్ర వేదన (Pain), మంద జ్వరం (Mild Temp) కీళ్లు బిగుసుకుపోవటం (Stiffness), ఆకలి మందగించటం, మలబద్దకం (Constipation) లాంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఈ వ్యాధి అన్ని కీళ్లలో వస్తుంది (Including small joints)
 
 వాత రక్తం  (Gout)


 Goutను వాతరక్తంగా పరిగణిస్తాం. ఇది మధ్యవయసు వారిలో ఎక్కువగా వస్తూంటుంది.
 
 కారణాలు: ఎక్కువగా మద్యపానం, అధిక మాంస సేవనం (హై ప్రొటీనిక్ ఆహారం) ఎక్కువగా పులుపు, ఉప్పు, మసాలాలు ఆహారపదార్థ సేవన, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉండే ఆహారపదార్థాలు తినటం వలన అలాగే వీటితోపాటు శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం వీటన్నిటివలన వాతం, రక్తం ఈ రెండు దుష్టి చెంది వాత రక్తంగా సమస్య ఏర్పడుతుంది. క్లినికల్‌గా చూసినట్లయితే ఈ సమస్యలో యూరిక్ ఆసిడ్ లెవెల్స్ రక్తంలో పెరుగుతాయి.
 
 లక్షణాలు: ఎరుపు, వాపు, నొప్పితో కూడిన కాలిబొటన వేలు నుండి ప్రారంభమై, తర్వాత మిగిలినటువంటి కీళ్లకు వ్యాపిస్తుంది. దీనిలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది.
 
 
 ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు
 
 ఆయుర్వేద శాస్త్రంలో...
 1. నిదాన పరివర్జనం

2. ఔషధ సేవన

 3. ఆహార విహార నియమాలు
 ఈ మూడు పద్ధతుల ద్వారా ఈ వ్యాధులకు పూర్తిగా చికిత్స చేయవచ్చు.
 
 1.నిదాన పరివర్జనం: వ్యాధి కారణాలను తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం. ఉదాహరణకు పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొనటం వంటి కారణాలను విడిచిపెట్టటం.
 
 2. ఆహార విహార నియమాలు: ఆహారం సరైన టైమ్‌కి తినటం, వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, తగు వ్యాయామం, సరైన టైమ్‌కి విశ్రాంతి లాంటి నియమాలు పాటించడం.
 
 3.ఔషధ సేవన: ఔషధ సేవన విషయానికి వస్తే, ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఎ) శమనం బి) శోధన ం
     
 ఎ) శమనం: అనగా వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం.
     
 బి) శోధనం: అంటే పంచకర్మ. పంచకర్మలలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు) తరువాత వమన, విరేచన, వస్తి (ప్రధాన కర్మలు) తరువాత పశ్చాత్ కర్మలు చేయించవలసిన అవసరం ఉంటుంది. ఇవికాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, బానువస్తి, పత్రపోటలీ, వాలుకాస్వేదం మొదలగు బాహ్యచికిత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.


మోకాలి నొప్పులకు హోం రెమిడీస్


కావాల్సిన పదార్థాలు: అర టీ స్పూన్ మిరియాలు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మెంతి గింజలు

తయారుచేసే విధానం: 
ముందుగా మిక్సీలో మెంతి గింజలను తీసుకుని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మెంతిగింజల పొడిని జల్లెడ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆతర్వాత అదే మిక్సీలో నల్ల మిరియాలు వేసి, మిక్సీ వేయండి. మెత్తని పిండిలా వచ్చేందుకు మళ్ళీ జల్లెడ పట్టండి. ఇప్పుడు మళ్లీ అదే మిక్సీ గిన్నెలోకి జీలకర్రను తీసుకుని, మిక్సీ పట్టండి. దీనిని జల్లెడ పట్టి, అన్ని పదార్ధాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక ఏర్ టైట్(గాలి చొరబడని) కంటైనర్‌లోకి తీసుకుని నిల్వచేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ నీరు తీసుకుని, అందులో సగం చెంచా మిశ్రమం వేసి కలపండి. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి రుచి కోసం బెల్లం కలుపుకుని తాగొచ్చు.
పొగతాగితే పిల్లలు పుట్టరా..
ఈ రసం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: మోకాలి నొప్పి తగ్గుతుంది, శరీరానికి బలం చేకూరుస్తుంది. 20 రోజుల నుంచి రెండు నెలల పాటు ఈ మిశ్రమాన్ని రోజూవారీ తీసుకోవడం మంచిది.

గమనిక: 
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిది
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660

కామెంట్‌లు లేవు: