గతంతో పోలిస్తే వైద్య రంగం చాలా పురోగతి సాధించింది. నిన్న మొన్నటి వరకు చికిత్సే లేదనుకున్న ఎన్నో వ్యాధులకు చికిత్స అందించగలుగుతున్నారు. కానీ అస్తమాకు మాత్రం ఇప్పటివరకు పర్మనెంట్ సొల్యుషన్ రాలేదు. అస్తమా ఏ వయసులో వారికైనా రావచ్చు, చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరికైనా అస్తమా బాధించవచ్చు.అస్తమా శ్వాస నాళాలకు సంబంధించిన వ్యాధి.
అస్తమా సాధారణంగా ఎలర్జీవల్ల కలుగుతుంది. మనం పీల్చిన గాలి, లోపలికి వెళ్ళేప్పుడు ఎలర్జీవల్లగాని, ఒత్తిడివల్ల గాని బ్రాంకియోల్స్ లోపల పొర వాస్తుంది. మ్యూకస్ మెంబ్రేన్ ముడుచుకుపోతుంది. గాలి ప్రసరించే దారులు ముడుచుకుపోయి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. గురకవస్తుంటుంది. దగ్గు రావచ్చు. ఉన్నట్టుండి ఆయాసం మొదలై శ్వాస పీల్చలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు.వర్షాకాలం వచ్చిందంటే చాలు అస్తమా రోగులు వణికిపోతుంటారు. కాస్త చల్లటి గాలులు వీచినా, చల్లటి ఆహారపదార్థాలు తిన్నా, తాగినా శ్వాసలో ఇబ్బంది మొదలవుతుంది. అందుకే అస్తమా బాధితులు ఇబ్బంది ఎక్కువ కాకముందే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
అస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
మన చుట్టూ వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి, వీలైతే ప్రతిరోజూ వాకింగ్ చేయాలి.
కొవ్వు పదార్థాలను తినడం తగ్గించాలి. నూనెలో వేయించిన ఫాస్ట్ ఫుడ్స్, చేపలు, తదితరాలను స్వీకరించకపోవడం మంచిది.
చల్లదనాన్నిచ్చే పుచ్చకాయ, బీరకాయ, ఖర్బూజా వంటివి తినకూడదు. ఫ్రిజ్ లో ఉంచిన వస్తువులు పెరుగు అసిడిక్ ఆమ్లం అధికంగా ఉన్న నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పళ్ళ రసాలను తీసుకోరాదు. ఇబ్బంది తగ్గే వరకు కారం, పులుపు తగ్గించడం మంచిది.
ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమిలి తినాలి, వీలయితే ఆహారం కడుపు నిండా కాకుండా, కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి.
పడుకోవడానికి కనీసం మూడు గంటలు ముందుగానే రాత్రి భోజనం తినేయడం మంచిది.
మునగాకులో కఫం తొలగించే గుణాలు పుష్కలం, కాబట్టి మునగాకు బాగా తినాలి.
అస్తమాకు చికిత్స లేదు , నివారణ ఒక్కటే మార్గం
అస్తమాకు చికిత్స లేదు, అలాగని అస్తమాను నిర్లక్ష్యం చేస్తే క్రానిక్ ఎయిర్ వేస్ డిసీజ్ గా మారి ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఎప్పటికప్పుడు డాక్టర్ ని సంప్రదిస్తూ ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, పౌష్టికాహారం తింటూ, మన చుట్టూ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అస్తమా తీర్వ్రతరాన్ కాకముందే ఇంట్లోనే కొన్ని నియమాలు పాటించడం ద్వారా అస్తమాను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
ఇంట్లోనే అస్తమాకు ఉపశమనం
తేనే
తేనే అస్తమాకు మంచి ఉపశమనకారిగా పని చేస్తుంది. రెండు చుక్కల తేనే అస్తమా వ్యాధి గ్రస్తుల ముక్కులో పోసినట్లయితే , అస్తమా వ్యాధి గ్రస్తులు శ్వాస ఇబ్బందుల నుండి కాస్త కోలుకునే అవకాశముంది.
అత్తిపండు తో ఉపశమనం
అత్తిపండు అస్తమా రోగులకు మంచి ఔషధకారి. అత్తిపండును వేడి నీళ్ళలో బాగా కడిగి రాత్రంతా ఉంచి మరునాడు ఉదయం రోగులకు ఇస్తే అస్తమాతో పాటు దగ్గు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
నిమ్మకాయ
ఒక నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి భోజనంతో పాటు తీసుకోవాలి.
ఉసిరికాయ
5 గ్రాముల ఉసిరికాయను ఒక టేబుల్ స్పూన్ తేనే తో కలిపి ప్రతి ఉదయం పరగడుపున సేవిస్తే మంచి టానిక్ లా పని చేస్తుంది.
కాకర వేళ్ళతో అస్తమా ఉపశమనం
కాకర వేళ్ళు అస్తమా వ్యాధిగ్రస్తులకు వరం. ఈ మందుకు వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది, ఒక టేబుల్ స్పూన్ నిండా కాకర వేళ్ళ ను పొడిచేసి తేనే లో లేదా తులసి రసంలో కలిపి రోజుకు ఒక పూట చొప్పున సేవిస్తే అస్తమా అస్తమా తగ్గుముఖం పడుతుంది.
ములక్కాడ ఆకులతో ఉపశమనం
180ml నీళ్ళలో గుప్పిట నిండా ములకాడ ఆకులను ఉడకబెట్టి కాస్త ఉప్పు, మిరియాల పౌడర్, కాస్తంత నిమ్మరసం కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
అల్లం
ఒక టీ స్పూన్ నిండా అల్లం రసం తీసుకుని ఒక కప్పు మెంతి డికాషన్ లో కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.
వెల్లుల్లి
అస్తమా ప్రారంభదశలో ఉన్న రోగులు రోజూ పది వెల్లుల్లి పాయల్ని తీసుకుని 30 ml పాలలో మరగబెట్టి రోజుకొకసారి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
వాము
అర టీ స్పూన్ నిండా వాము గింజల్ని తీసుకుని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి రోజు రెండు పూటలా సేవిస్తే అస్తమాతో పాటు దగ్గుతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. దీనితోపాటు వాము గింజల్ని వేడినీళ్ళలో వేసి అస్తమాతో బాధపడేవారికి ఆవిరి పడితే రిలీఫ్ గా ఉంటుంది.
కుంకుమ పువ్వు
5 గ్రాముల కుంకుమ పువ్వును ఒక టేబుల్ స్పూన్ నిండా తేనేలో కలిపి రోజుకు ఒకసారి సేవించినట్లయితే మంచి ఔషధకారిగా పని చేస్తుంది.
ఉపవాసం , ఎక్సర్ సైజు
వారానికొకసారైనా ఉపవాసం చేయడం, ఎక్సర్ సైజు చేయడం మంచిది. యోగాఎక్స్ పర్ట్ ను సంప్రదించి శ్వాసకు సంబంధించిన ఆసనాలు వేస్తే ఉపశమనం కలుగు
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింట్
విశాఖపట్నం
ఫోన్ -9703706660
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి