6, జులై 2021, మంగళవారం

కంటిలో శుక్ల వస్తే తగ్గాలంటే ఏమి చేయాలి తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

కంటికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

వయసుపైబడిన వారిలో కంటి సమస్యలు ఎదురవుతాయి. అందులో శుక్లాల సమస్య ఒకటి. అసలు ఈ సమస్యకు గల కారణాలు, నివారణ మార్గాలు ఏంటో.. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

    
వయసుపైబడినవారు కొన్ని రకాల సమస్యలతో బాధపడుతుంటారు. అందులో ఒకటి కళ్ల సమస్య. మలి వయసులో చూపుకు పట్టే గ్రహణాన్ని శుక్లం అంటారు. దీనికి మందుల వంటి ట్రీట్‌‌మెంట్ లేదు. సర్జరీనే పరిష్కారం.



eye cataract fnl
ఇందులోనూ గ్లకోమా, శుక్లాల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు అనేక కారణాలుండొచ్చు. అందులో ఒకటి అధికబరువు, మధుమేహంలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్య నుంచి మీ కళ్లను కాపాడుకోవచ్చు.

అసలు శుక్లం అంటే ఏమిటి?
ఓ రకంగా చెప్పాలంటే మన కన్ను కెమెరా లాంటిది.. కెమెరాలో లెన్స్ ఎలానో.. మన కళ్లల్లో కూడా అలాంటి ఓ నిర్మాణం ఉంటుంది. అది సహజమైన లెన్స్.. అద్దంలా పారదర్శకంగా, బయటి నుంచి కాంతి కిరణాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. దీని గుండా కాంతి ప్రయాణించడం వల్లే మనకు చూపు కనబడుతుంది. అయితే.. వయసు పైబడేకొద్దీ ఈ లెన్స్ గట్టిబడి.. లోపలికి కాంతి ప్రయాణించడానికి వీల్లేకుండా ఉంటుంది. ఇదే శుక్లం.

లక్షణాలు..


కంటి సమస్యలు ఉన్నవారికి కళ్లు ఎర్రబారడం, కళ్లు దురద పెట్టడం, చిరాగ్గా ఉంటాయి. దీంతో.. కళ్లు మసకమసకగా కనిపిస్తాయి. శుక్లాలు ఏర్పడుతున్న తొలిదశలో కళ్ల ముందు ఒక వస్తువు పలు వస్తువులుగా కనబడుతుంది. చూపులో స్పష్టత తగ్గుతుంది. కటకం మధ్యభాగం లో శుక్లం ఏర్పడుతుంటే రాత్రిపూట చూపు ఉన్నట్టుండి తగ్గినట్టు ఉంటుంది.

ఎవరికి వస్తుందంటే..

ఓ వయసు వచ్చేసరికి.. దాదాపు అందరికీ కంట్లో శుక్లాలు ఏర్పడతాయి. పెద్దవయసు కావడం శుక్లాలు ఏర్పడటానికి ఓ కారణమైతే.. మరికొంతమందికి వంశపారంపర్యంగా ముందే వస్తుంటాయి. స్టిరాయిడ్లు, కంటికి గాయాలు, మధుమేహం కూడా శుక్లాలు ఏర్పడటానికి కారణాలు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

కంటి సమస్యలతో బాధపడేవారు.. ముందు అందుకు కారణమయ్యే సమస్యలను అంటే అధికబరువు, మధుమేహం వంటివాటిని తగ్గించుకోవాలి. అదే విధంగా.. వాతావరణం చల్లగా ఉన్న సమయంలో కాసేపు అలా ఉండాలి. దీంతో కళ్లు పొడిబారడమనే సమస్య తగ్గిపోతుంది. అయితే.. మరీ చల్లని గాలి, తేమ తగలకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. మధుమేహం కారణంగా డయాబెటిక్ రెటినోపతి వల్ల కంటి వెనుకభాగంలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. ఈ కారణంగా కంటిచూపు మందగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా డైట్ పాటించాలి.


మందులతో పరిష్కారం ఉంటుందా..

శుక్లాలు తగ్గించేందుకు మందులేవీ లేవు. ఆయుర్వేదంలో కొన్ని మందులున్నాయని చెబుతారు కానీ, వాటిద్వారా ఖచ్చితంగా సమస్య తగ్గుతుందని చెప్పలేం. కాబట్టి ఆపరేషన్ ఒక్కటే దీనికి పరిష్కారం.

ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవచ్చంటే..

శుక్లాల వల్ల చూపు ఇబ్బందిగా ఉంటే ఆపరేషన్ చేయించుకోవచ్చు. శుక్లం మొదలైన కొద్దీ రోజుల్లోనే సర్జరీ చేయించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే, మరీ అవసరం అనుకున్నప్పుడే ఆపరేషన్ చేయించుకోవడం మంచిది.

ఆపరేషన్ ఎలా ఉంటుంది..

ఇదివరకటి రోజుల్లో శుక్లం ముదిరినపప్పుడే ఆపరేషన్ ద్వారా శుక్లాన్ని బయటికి తీసేవారు. కానీ.. ఇప్పుడు అదంతా అవసరం లేదు. ఖఫేకో ఎమల్సిఫికేషన్ అనే విధానంలో కనుగుడ్డు పై పొర మీద చిన్న రంధ్రం చేసి దాని గుండా సూదిలాంటి పరికరాన్ని లోనిక పంపి శుక్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ సన్నని రంధ్రం నుంచే వాటిని బయటికి తీస్తారు. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరుణంలో శుక్లం బాగా ముదరకముందే.. చూపు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడే ఆపరేషన్ చేయించుకోవటం ఉత్తమం.

సర్జరీ సమయంలో మత్తుమందు..

ముందుకాలంలో సర్జరీ చేసేటప్పుడు ఇంజక్షన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వాటి అవసరం లేకుండా కేవలం కంట్లో చుక్కల మత్తు మందు వేసి ఆపరేషన్ పూర్తి చేసే వెసలుబాటు ఉంది. దీన్ని టాపికల్ అనస్థీషియా అంటారు. మరీ పెద్ద వసు వారైతే.. నొప్పి అస్సలు తెలియకుండా ఉండాలంటే కంటి చుట్టూరా చిన్న చిన్న ఇంజెక్షన్లు ఇస్తారు. దీన్ని ఖపెరి బల్బార్ అనస్థీషియా అంటారు. అరుదుగా వచ్చే నొప్పి కూడా భరించలేకపోతుంటే.. కనుగుడ్డు లోపలికి ఇంజక్షన్ ఇస్తారు. దీన్ని ఇంట్రా కేమరల్ మత్తు అంటారు.

సర్జరీ ఎలా ఉంటుందంటే..

ముందుగా కనుగుడ్డు మీదుండే కార్నియాకు చిన్న కోతపెడతారు. దీని ద్వారా అల్ట్రాసౌండ్ పరికరాన్ని లోపలికి పంపుతారు. అక్కడ మబ్బుగా గట్టిపడిన సహజ కటకాన్ని ముక్కలు చేసి బయటికి లాగుతారు. సహజ కటకాన్ని తొలగిస్తున్నాం కాబట్టి దాని స్థానంలో కృత్రిమ కటకాన్ని అమరుస్తారు. ఈ కృత్రిమ కటకాన్నే ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అంటారు. దీన్ని అమర్చేందుకు అదే రంధ్రం నుంచి మడత పెట్టిన పల్చటి పొరలాంటి కృత్రిమ కటకాన్ని లోపలికి పంపిస్తారు. లోపల అది సహజమైన కటకం లాగే అదే స్థానంలో కుదురుకుంటుంది. చూపు చక్కబడుతుంది.

ఎంత సమయం పడుతుంది..

శుక్లాల ఆపరేషన్ చాలా తేలిగ్గా పూర్తవుతుంది. సర్జరీకి కేవలం 67 నిమిషాలే పడుతుంది.

మధుమేహులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

మధుమేహులు శుక్లాల సర్జరీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ కంట్రోల్‌లో లేకపోతే రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉంటుంది. ఇది కంటిలోని సహజ కటకంలోకి వెళ్లొస్తూ మబ్బుగా మారేలా చేస్తుంది. దీంతో మధుమేహుల్లో త్వరగా శుక్లాలు ఏర్పడతాయి. అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏమేం తీసుకోవాలి.. విటమిన్ ఎ.. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి వెలుపలి పొర, కార్నియాను ఇన్‌ఫెక్షన్స్ బారినుంచి రక్షణనిస్తుంది. ఆకుకూరలు ముఖ్యంగా బచ్చలి కూరలో ఎక్కువగా లభిస్తుంది. అదేవిధంగా.. విటమిన్ ఇ కూడా కంటి శుక్లాలు, కంటి సమస్యలను దూరం చేస్తాయి. ఇది ఆకుకూరలు, ఎర్రమిరియాలు, పండుమిర్చి, రెడ్ క్యాప్సికమ్ వంటి వాటిలో ఇ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల కంటి సమస్యలు తగ్గుతాయి.

నో ట్యానర్స్ .. సన్‌బాత్, సన్‌బెడ్స్ వాడడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదేవిధంగా.. అతినీలలోహిత కిరణాలు చర్మంపై కంటే కళ్ల మీద ఎక్కవ ప్రభావం చూపిస్తాయి. ఈ కారణంగా శుక్లాలు, కనుపాపలపై కణుతులు పెరుగుతాయి. అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి బయటపడేందుకు ఎండలో ఉన్నప్పుడు నల్ల కళ్లద్దాలు వాడాలి.

20-20-20 విజన్ : ఇక ముఖ్యంగా కంప్యూటర్ వర్క్ చేసేవారు కంటి సమస్యలను ఎదుర్కొంటారు. కంప్యూట్, ట్యాబ్లెట్ వైపు చూస్తుంటారు. దీని వల్ల కళ్లు పొడిబారుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. 20-20-20 విజన్ మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. ఇది ఎలా చేయాలంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఓ సారి కళ్లకు విశ్రాంతినివ్వాలి.. 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకన్లపాటు అలానే చూస్తూ ఉండాలి. దీంతో కంటి కండరాలకు కళ్లపై ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.

వీటితో పాటు సరైన జీవనవిధానం అలవర్చుకోవాలి. రోజుకి ఖచ్చితంగా 8 గంటల నిద్ర చాలా అవసరం. దీని కారణంగా కళ్లు రిలాక్స్ అవుతాయి. వీటితో పాటు కొన్ని కళ్లకు సంబంధించిన ఎక్సర్‌సైజెస్ చేయడం మంచిది.
*కంటి శుక్లాలు ( CATARACT )* 

 కంటిలో కను గుడ్డుపైన తెల్లటి పొర వస్తుంది . చూపులో స్పష్టత తగ్గుతుంది . వస్తువులు రెండుగా కనబడతాయి . పెద్ద వయసులో ఎలాంటి నొప్పి , బాధా లేకుండా క్రమేపీ చూపు తగ్గుతోందంటే , దానిని శుక్లంగా అనుమానించొచ్చు . 

*గృహ చికిత్సలు* : --- 

1. ఒక గ్లాసు క్యారట్ రసం ప్రతి రోజు ఉదయం , సాయంత్రం త్రాగండి . 

2 . రాత్రి కొన్ని ఎల్లిపాయ ( Garlic ) రెబ్బలను నీటిలో నానబెట్టండి . ఉదయం ఎల్లిపాయ రెబ్బలను నమిలి , నమిలి తినండి . తర్వాత ఆ నీళ్ళను త్రాగండి . 

3 . స్వచ్చమైన తేనెను కళ్ళకు పూయండి . 

4 . ధనియాలు + సోంపు + పటిక బెల్లం లను సమ పాళ్ళలో తీసుకొని , చూర్ణంగా తయారు చెయ్యండి . 
1 spoon చూర్ణం + 1 గ్లాసు నీళ్ళలో కలిపి త్రాగండి . ఉదయం , సాయంత్రం త్రాగండి . 

5 . తెల్ల ఉల్లిపాయ రసం + తేనెను సమపాళ్ళలో కలపండి. 
 1 భాగం రసం + 2 భాగాల గులాబి పూల నీళ్ళు ( Rose Water ) లను కలిపి , కొన్ని చుక్కలను కళ్ళలో వేయండి . 

   పై విధానాలలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .

ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660

కామెంట్‌లు లేవు: