24, జులై 2020, శుక్రవారం

మీలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఐదు సూత్రాలు పాటించండి.?Five Super Ways to Boost Your Immunity,.If you want to grow Immunity, follow these five principles.


రోగ నిరోధక శక్తి పెరగాలంటే రోజూ ఇలా చేయాల్సిందే...అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

ఇమ్యూనిటీ సిస్టమ్‌ను పెంచుకోవాలంటే ఏంచేయాలో తెలుసుకుందాం. ఇమ్యూనిటీ శరీరంలో ఉంటే శరీరం వ్యాధులతో పోరాడుతుంది. మంచి ఆరోగ్యం కావాలంటే జీవన విధానం, పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తాయి.

    ఇమ్యూనిటీ ఉంటే చాలు ఎలాంటి జబ్బులు రావు. లేకపోతే ప్రతీ చిన్న సమస్యకు శరీరం సహకరించక జలుబు దగ్గులాంటివి వెంటాడుతుంటాయి. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ సమస్య వస్తోంది. మరి ఇమ్యూనిటీ సిస్టమ్‌ను పెంచుకోవాలంటే ఏంచేయాలో తెలుసుకుందాం. ఇమ్యూనిటీ శరీరంలో ఉంటే శరీరం వ్యాధులతో పోరాడుతుంది. మంచి ఆరోగ్యం కావాలంటే జీవన విధానం, పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తాయి.


    ఇమ్యూనిటీ పెరగాలంటే పొగతాగడం, మద్యం తాగడంలాంటి అలవాట్లు మానివేయాల్సి ఉంటుంది. ఇలాంటి అలవాట్ల వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. త్వరగా ఆరోగ్యం పాడవుతుంది. స్మోకింగ్ చేస్తే ఎన్నో రకాల క్యాన్సర్ వ్యాధులు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. మద్యం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. నీళ్లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తాయి. కూరగాయల్లో కావల సినంతగా కాల్షియం, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి కేవలం బలం ఇవ్వడమే కాదు రోగాలతో పోరాడే శక్తిని కూడా పెంచుతాయి.


    మన శరీరంలో మంచి, చెడు రెండు రకాల బ్యాక్టీరియా ఎక్కువ పెరిగితే మనం తొందరగా అనారోగ్యానికి గురవుతాం. అందుకే పెరుగును భోజనంలో చేర్చుకోవడం తప్పనిసరి. ఇది మీ ఇమ్యూనిటీ పెంచుతుంది. శరీరానికి విటమిన్ ‘డి’ తప్పనిసరిగా అవసరం డ్రైఫ్రూట్స్‌ని జనం ఎక్కువగా తినరు. తాము ఎక్కడ లావెక్కిపోతామోనని వారి భయం. కానీ వాస్తవానికి ఇది వారి మనసులో ఉన్న భ్రమ. ఎందుకంటే డ్రైఫ్రూట్స్‌లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ లాంటివి అధిక మోతాదులో ఉండటంతో ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇలాంటి అలవాట్లు ఆహారంతోపాటు ఎంత బిజీగా ఉన్నాసరే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం మర్చిపోకూడదు. ఉదయం 15 20 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వ్యాయామంతో రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాదు, బరువు కూడా పెరగనివ్వదు. శరీరం రోగాలతో పోరాడే శక్తిని పెంచుతుంది. ప్రతి మనిషికి రోజూ ఏడెనిమిది గంటల నిద్ర తప్పనిసరిగా కావాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటుచేసుకోవాలి. అప్పుడే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

    సరైన ఆహారం, వ్యాయామం ఉన్నా, ఒత్తిడి కి గురవుతుంటే మాత్రం ఇమ్యూన్ సిస్టమ్ బలపడలేదు. ప్రస్తుతం ఇమ్యూన్ సిస్టం వీక్‌గా ఉన్నవారే ఎక్కువ రిస్క్ లో ఉన్నారు. కాబట్టి ఆ హై రిస్క్ జోన్‌లో మనం లేకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలో ఒక్కసారి చూద్దాం.

    ఆల్కలైన్ డైట్ తీసుకోవడం : పేరు చూసి ఏమిటో అనుకోకండి. ఆల్కలైన్ డైట్ అంటే తాజా పండ్లూ, కూరగాయలూ, సోయా ఉత్పత్తులూ, గింజలూ, పప్పు ధాన్యాలూ, మజ్జిగా, పెరుగూ ఆల్కలైన్ డైట్ లోకే వస్తాయి. ఈ డైట్ లోకి రానివి ఏమిటీ అంటే పాలూ, పాల పదార్ధాలూ (మజ్జిగా, పెరుగూ తప్ప), మాంసాహారం, ప్రాసెస్ చేసిన ఫుడ్స్. ఇవి తగ్గించి ఆల్కలైన్ డైట్ లో ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోవటం పెంచితే సరైన ఆహారం తీసుకుంటున్నట్లే. ఈ ఫుడ్ డిసీజెస్ రాకుండా చేస్తుంది. పీహెచ్ లెవెల్స్ ని బాలెన్స్ చేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. కారెట్, బీట్‌రూట్, ముల్లంగి, అల్లం, వెల్లుల్లి వంటివి కూడా ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోవద్దు.

    మన దగ్గర దొరికేవే తినడం : ఆహారం లో కంపల్సరీగా బత్తాయిలూ, నిమ్మ, వంటి విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఉండాలి. వీటితో పాటూ ఎగ్స్, చికెన్ వంటి ప్రోటీన్ ఫుడ్స్ కూడా ఉండాలి. గ్రీన్ టీ, గోరు వెచ్చని నీరు వంటివి రోజువారీ తీసుకోవాలి. అసలు కావలసినంత నీరు తాగితే టాక్సిన్స్ అన్నీ బైటికి వెళ్ళిపోయి శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం కంపల్సరీ. వేసవికాలం లో మామిడి పళ్ళూ, పుచ్చకాయలూ ఎలాగో వానాకాలంలో దానిమ్మలూ, యాపిల్స్, ఛెర్రీస్, పీచ్ పండ్లూ, సీతాఫలం అలాగా. దాంతో పాటు వానాకాలం, చలికాలంలో వేడి వేడి సూప్ తాగడం వల్ల పొట్టలో తేలిగ్గా ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన, పాకెట్స్ లో దొరికే ఫుడ్ కంటే ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకునే ఫుడ్ లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.

    ఒత్తిడి తగ్గించుకోండి : చేద్దామనుకుని ప్లాన్ వేసుకున్న పనులన్నీ ఎక్కడివక్కడ అగిపోయి ఉన్నాయి. దానికి తోడు వర్క్ ఫ్రం హోం. చాలా మందికి సగం జీతమే వస్తోంది. సగం జీతం వస్తోంది కాబట్టి సగం తిండి తినలేం కదా. దాంతో ఎక్కడ ఖర్చు తగ్గించుకోవాలో తెలీక పాట్లు పడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి గురవ్వకండి అని చెప్పటం తేలికే, ఆచరించడమే కష్టం. కానీ, ఒత్తిడి తగ్గించుకోలేకపోతే ఇమ్యూన్ సిస్టం వైరస్ తోనో, బాక్టీరియా తోనో ఫైట్ చెయ్యడం మానేసి ఒత్తిడి తో ఫైట్ చేస్తుంది. ఫలితం మనంతట మనమే డిసీజెస్ ని ఆహ్వానించినట్త్లు. వాకింగ్ కి వెళ్తారో, యోగా చేస్తారో... మీ ఇష్టం కానీ, వీలైనంత ఒత్తిడి తగ్గించుకోవడం అవసరం.

    ప్రశాంతంగా నిద్రపోండి : లాక్ డౌన్ తరవాత చాలా మందికి నిద్ర అలవాట్లు మారిపోయాయి. లేట్ గా పడుకుని లేట్ గా లేవడం చాలా మందికి అలవాటైపోయింది. కానీ, ఇలా స్లీప్ సైకిల్ దెబ్బ తినటం వల్ల కూడా ఇమ్యూన్ సిస్టం బలహీన పడుతుంది. లాక్ డౌన్ ముందు మీకు అలవాటైన స్లీప్ టైమింగ్స్ నే ఇప్పుడు కూడా ఫాలో అవ్వండి. ప్రతి వ్యక్తి కీ ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం. అది కూడా రాత్రి త్వరగా పడుకుని పొద్దున్న త్వరగా లేస్తే ఆరోగ్యం అన్న విషయం మర్చిపోకండి.

    కరోనాకు ఆయుర్వేద మందులు.. నవీన్ నడిమింటి సలహాలు 

     ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వ్యాక్సిన్​పై దృష్టి పెట్టింది. చాలా కంపెనీలు దానిపై పనిచేస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్ల ట్రయల్స్​ కూడా మొదలయ్యాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద మందులపైనా ఫోకస్​ పెట్టింది. వాటితో కరోనాకు చెక్​ పెట్టొచ్చా అన్న కోణంలో పరీక్షలు చేయడానికి రెడీ అయింది. ఓ ఐదు మందులపై ట్రయల్స్​ చేసేందుకు కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్​ అండ్​ రీసెర్చ్​ (సీఎస్​ఐఆర్​)తో జట్టు కట్టింది. అశ్వగంధ, తిప్పతీగ (గుడిచి), యస్తిమధు, పీప్లి అనే నాలుగు ఆయుర్వేద మూలికలతో పాటు ఇప్పటికే తయారు చేసిన ‘ఆయుష్​64’ అనే మందుపై ట్రయల్స్​ చేయనుంది.

    50 లక్షల మంది మీద ట్రయల్స్​

    మొదటి దశలో ఆరోగ్య సేతు యాప్​ గుర్తించిన రిస్క్​ ఎక్కువున్న జోన్లలోని హెల్త్​వర్కర్లపై కేంద్రం ఈ ట్రయల్స్​ మొదలుపెట్టనుంది. అంతేగాకుండా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్​, పుణే సిటీల్లోని 50 లక్షల మందిపై ట్రయల్స్​ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు కరోనా రాకుండా అడ్డుకునే ఆయుర్వేద మందులపైనా స్టడీ చేయనుంది. కరోనా పేషెంట్లకు తొలి దశలో అశ్వగంధను ఇవ్వనున్నారు. ఆ తర్వాత పేషెంట్​కు ఉండే లక్షణాల తీవ్రత, రోగి శరీరం స్పందించే తీరుకు తగ్గట్టు ఇతర మందులనూ ఇస్తారు.

    పిప్పలి: ఘాటుగా ఉండే ఇది శ్వాస ఇన్​ఫెక్షన్లు, బ్రాంకైటిస్​, సర్ది, దగ్గు, ఆస్తమా వంటి వాటికి మంచి మందుగా పనిచేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను బాగు చేస్తుంది. ఇమ్యూనిటీని మరింత శక్తిమంతం చేస్తుంది. నొప్పులనూ తగ్గిస్తుంది. వాతానికి పనిచేస్తుంది.

    అశ్వగంధ: నేటి కాలంలో దీనిని సూపర్​ఫుడ్​గా చెబుతుంటారు. సర్ది, దగ్గు, ఇతర క్రిముల ఇన్​ఫెక్షన్​ నుంచి శరీరానికి రక్షణగా ఉంటుందీ ఆయుర్వేద మూలిక. సహజంగా మనకు ఇమ్యూనిటీ పెరగాలంటే రోజూ దానిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్​ ఇన్​ఫెక్షన్లతో వచ్చే ఒత్తిడి, అలసట వంటి వాటినీ ఇది తగ్గిస్తుందట. గుండెకూ మంచి చేస్తుంది.

    తిప్పతీగ: దీన్ని మరణం లేని ఆయుర్వేద మూలిక అని పిలుస్తుంటారు. నొప్పులు, కేన్సర్​, జ్వరానికి ఇది మంచి మందుగా పనిచేస్తుంది. అంతేగాకుండా ఒంట్లో విష పదార్థాలు లేకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్​గానూ, ఇమ్యూనిటీని పెంచే మందుగానూ పనిచేస్తుంది. శ్వాస, జీర్ణ సంబంధ సమస్యలకూ ఇది బెటర్​ అని నిపుణులు చెబుతున్నారు.

    ఆయుష్​64: కేంద్ర ప్రభుత్వం ఈ మందును ప్రతిష్టాత్మకంగా తయారు చేయించింది. చాలా ఆయుర్వేద మూలికలన్నింటినీ కలిపి తయారైన మందు ఇది. మలేరియాను తగ్గించడంలో ఈ మందు బాగా పనిచేస్తున్నట్టు తేలింది. ప్రస్తుతం కరోనా పేషెంట్లకు క్లోరోక్విన్​ మందునూ ఇస్తుండడంతో దీనినీ ట్రయల్స్​ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    యస్తిమధు: ములేతి, లిక్కరైస్​ అని పిలిచే తియ్యటి మూలిక ఇది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వాటికి మంచి ఔషధమిది. నొప్పులు, వాతం రాకుండా చూస్తుంది. గొంతు చికాకును తప్పిస్తుంది. పుండ్లు తగ్గించే గుణాలపైనా స్టడీస్​ జరుగుతున్నాయి.

    ధన్యవాదములు 

    మీ నవీన్ నడిమింటి 
    విశాఖపట్నం 
    9703706660

    *సభ్యులకు విజ్ఞప్తి*
    ******************
    ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

    కరోనా లో 14 రకాల లక్షణాలు ఉన్నాయి ఎవరిలో ఎక్కువరీస్కు, ఎవరికీ రిస్క్ తక్కువ .?కరోనా పేషెంట్ కి ఈ ఆరు రకాల లక్షణాలు కీలకం.!

    కరోనావైరస్ సైలెంట్ స్ప్రెడర్స్: ఎటువంటి వ్యాధి లక్షణాలూ లేకుండా మన మధ్యే ఉంటూ... వైరస్‌ను వ్యాపింపచేస్తోంది వీరేనా? అవగాహనా కోసం నవీన్ సలహాలు 

    కోవిడ్-19 మహమ్మారి ఎలా మెల్లమెల్లగా ప్రపంచమంతా వ్యాపించిందో, అలాగే శాస్త్రవేత్తలకు కొత్త కరోనా వైరస్ గురించి విచిత్రమైన, ఆందోళనకరమైన ఆధారాలు లభిస్తూవచ్చాయి. ఈ వైరస్‌కు గురైన చాలామందిలో దగ్గు, జ్వరం, రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపించేవి.

    కానీ, వైరస్ వచ్చినా, అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించని వారు కూడా చాలామంది ఉన్నారు. దాంతో, తాము కోవిడ్-19 వ్యాధితో అంతా తిరిగేస్తున్నామనే విషయం వారికి ఎప్పటికీ తెలీకుండానే ఉండిపోయింది. ఇదంతా ఒక వ్యక్తి తనకు తెలీకుండానే జేబులో బాంబు పెట్టుకుని తిరిగినట్టు అనిపిస్తుంది.

    “ప్రపంచవ్యాప్తంగా ఇలా లక్షణాలు కనిపించని వైరస్ వ్యాపించిన వారు ఎంతమంది ఉన్నారో, వారందరి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం” అని కరోనావైరస్‌పై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు అంటున్నారు.

    ఎందుకంటే, ఈ ‘సైలెంట్ స్ప్రెడర్’ లేదా చడీచప్పుడు కాకుండా వైరస్ వ్యాప్తి చేస్తున్న వారే ఈ మహమ్మారి పరిధిని పెంచుతున్నారా అనే విషయం మనకు తెలిసేది అప్పుడే.

    కొత్త కరోనావైరస్ ‘సైలెంట్ స్ప్రెడర్’ గురించి మొట్టమొదట సింగపూర్ డాక్టర్లు అంచనా వేశారు. జనవరి 19న సింగపూర్‌లోని ఒక చర్చిలో సర్వీస్ కోసం జనం గుమిగూడినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తిపై ఆ ప్రార్థన సభ ప్రభావం ఉండబోతోందనే విషయం వారికి ఏమాత్రం తెలీదు.

    ఆరోజు ఆదివారం. చర్చిల్లో జరిగే ఒక మామూలు ప్రార్థన సభ లాగే ఆ చర్చిలో మాండరిన్ లేదా చైనా భాషలో సర్వీస్ జరుగుతోంది. ‘ద లైఫ్ చర్చ్ అండ్ మిషన్స్’ అనే ఆ ప్రార్థన సభ ఒక భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో జరుగుతోంది. అందులో ఒక భార్యాభర్తల జంట ఉంది. వాళ్లు ఆ రోజు ఉదయమే చైనా నుంచి సింగపూర్ వచ్చారు. ఇద్దరి వయసూ 56 ఏళ్లకు దగ్గరగా ఉంటుంది.

    మహమ్మారి విజృంభించటానికి ముందు.. వైరస్ వ్యాప్తిని అరికట్టటంలో సింగపూర్ మార్గదర్శి లాగా కనిపించింది

    రహస్యంగా కరోనావైరస్ వ్యాప్తి

    వారు ఆ చర్చి సమావేశంలో పాల్గొన్నప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా కనిపించారు. దాంతో వారికి కరోనా ఉందని ఎవరికీ ఎలాంటి సందేహం రాలేదు.

    ఈ ఏడాది జనవరి వరకూ కోవిడ్-19 అంటే అంటే తీవ్రమైన దగ్గు ఉంటుందని, దాని ద్వారానే ఆ వ్యాధి వ్యాపిస్తుందని అనుకుంటూ వచ్చారు. ఒక వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్టు అసలు ఎలాంటి లక్షణాలే కనిపించనప్పుడు, వ్యాధి వ్యాప్తికి అతడే కారణం అని ఎలా నమ్మగలం.

    చైనా నుంచి వచ్చిన దంపతులు ప్రార్థన సభలో పాల్గొన్న తర్వాత వెంటనే వెళ్లిపోయారు. కానీ, కొన్ని రోజుల తర్వాత పరిస్థితులు ఘోరంగా, ఎవరికీ అంతుపట్టని విధంగా మారిపోయాయి.

    ఆ సభలో పాల్గొన్న 3 రోజుల తర్వాత అంటే జనవరి 22న మొదట భార్యకు జబ్బు చేసింది. ఆ తర్వాత రెండ్రోజులకు భర్త అనారోగ్యానికి గురయ్యాడు. ఎందుకంటే వారిద్దరూ వైరస్‌కు కేంద్రం అయిన వుహాన్ నుంచి వచ్చారు. అయితే వారు అనారోగ్యానికి గురైనందుకు ఎవరూ కంగారు పడలేదు.

    కానీ, తర్వాత వారం రోజులకు మరో ముగ్గురు స్థానికులకు అంతుపట్టని విధంగా కరోనా వైరస్ సోకడంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు. సింగపూర్‌లో కరోనా వైరస్ మొదటి కేసులు అవే. అది వారికి ఎలా వచ్చిందో తెలుసున్నప్పుడు అత్యంత భయంకమైన వాస్తవం ఒకటి బయటపడింది.

    కొత్త కరోనావైరస్ కొత్త వారిని ఎంత సులభంగా వేటాడుతుంది అనే విషయం అందరికీ తెలిసింది అప్పుడే

    కరోనావైరస్

    'డిటెక్టివ్స్ ఫర్ డిసీజెస్' ప్రచారం

    సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలో సంక్రమిత వ్యాధుల విభాగం చీఫ్ డాక్టర్ వర్నాన్ లీ దాని గురించి చెప్పారు.

    “మేం వారికి వైరస్ వచ్చేసరికి చాలా కంగారు పడ్డాం. ఏమాత్రం సంబంధం లేనివారికి కూడా అది సోకింది. ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏదంటే, వారిలో వ్యాధి లక్షణాలు ఏమాత్రం కనిపించలేదు. అప్పటికి కోవిడ్-19 గురించి ప్రపంచానికి తెలిసినదాన్ని బట్టి, వారికి కరోనా రావడానికి బయట ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు” అన్నారు.

    డాక్టర్ వర్నాన్ లీ, ఆయన సహచరులు, పోలీసులు, వ్యాధి గురించి తెలిసిన మిగతా నిపుణులతో కలిసి ఈ కేసులను దర్యాప్తు చేయడం ప్రారంభించారు. వైరస్ వ్యాపించిన వాళ్లు ఎప్పుడెప్పుడు. ఎక్కడికెళ్లారు అనేదానిపై ఈ టీములన్నీ కలిసి వివరంగా ఒక లే-అవుట్ తయారుచేశాయి.

    అందులో ‘కంటాక్ట్ ట్రేసింగ్’ అనే అద్భుతమైన టెక్నిక్ ఉపయోగించారు. ఈరోజు బ్రిటన్ కూడా వైరస్ వ్యాప్తి గురించి తెలుసుకోడానికి ఇదే టెక్నిక్ ఉపయోగిస్తోంది. మహమ్మారి వ్యాపించిన సమయంలో వైరస్ వచ్చిన వారి జాడలు గుర్తించడానికి ఇది చాలా ముఖ్యం అని భావిస్తున్నారు.

    ఎందుకంటే, దీని సాయంతో కరోనా వచ్చిన వ్యక్తులు వేరే వారికి అది సోకేలా చేయకముందే, మిగతా వారి నుంచి వారిని వేరు చేయచ్చు. సింగపూర్ ఏ పనైనా చాలా సమర్థంగా, వేగంగా చేస్తుందని చెబుతారు. ఈ పనిని కూడా అది చేసి చూపించింది.

    సింగపూర్

    వైరస్ గుట్టు విప్పారు

    ఆశ్చర్యం కలిగించేలా తర్వాత కొన్ని రోజుల్లోనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నవారు 191 మందిని కలిసి, వారితో మాట్లాడారు. వారిలో 142 మంది ఆదివారం వుహాన్ దంపతులు హాజరైన చర్చి ప్రార్థన సభలో పాల్గొన్నట్టు తెలిసింది.

    “సింగపూర్‌లో పాజిటివ్ వచ్చిన ఈ ఇద్దరు కూడా ఆ చైనా దంపతులతో మాట్లాడారేమో, చర్చి సర్వీస్ సమయంలో పరస్పరం పలకరించుకున్నారేమో” అని డాక్టర్ వర్నాన్ లీ అన్నారు.

    కరోనావైరస్ గుట్టు విప్పే దిశగా ఇది చాలా ఉపయోగపడే ప్రారంభం. ఇప్పుడు కరోనావైరస్ ఇతరులకు ఎలా వ్యాపించింది అనే విషయం తెలిసింది.

    అయితే సింగపూర్ డాక్టర్లకు ఈ టెక్నిక్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకూ లభించలేదు.

    చైనా దంపతులకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేనపుడు, వారి నుంచి అది వేరేవారికి ఎలా వచ్చింది. దీనిని మించిన చిక్కుప్రశ్న ఇంకొకటి ఉంది.

    అదే చర్చికి వెళ్లినా, చైనా దంపతులు పాల్గొన్న ఆ సభకే వెళ్లని ఒక సింగపూర్ మహిళకు కూడా కరోనా వచ్చింది.

    ఆ మహిళ వయసు 52 ఏళ్లు. ఆమె అదే రోజు వుహాన్ దంపతులు పాల్గొన్న సభ జరిగిన కొన్ని గంటల తర్వాత జరిగిన మరో సర్వీస్‌లో పాల్గొన్నారు. అయితే, కరోనావైరస్ ఆ మహిళకు ఎందుకు వచ్చింది.

    కరోనావైరస్

    నమ్మలేని ఆధారాలు

    ఈ చిక్కుప్రశ్నకు సమాధానం కోసం అధికారులు ఆ రోజు చర్చిలో సీసీటీవీ కెమెరా రికార్డింగ్స్ పరిశీలించారు. వాటిలో ఎవరూ ఊహించని ఒక ఆధారం లభించింది.

    చైనా దంపతులు అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత జరిగిన సర్వీస్‌లో సింగపూర్ మహిళ పాల్గొన్నారు. అప్పుడు ఆమె వుహాన్ నుంచి వచ్చిన చైనా జంట కొన్ని గంటల ముందు కూర్చున్న అదే సీట్‌లో కూర్చున్నారు. దాంతో ఆ దంపతులకు ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు లేకపోయినా, వేరేవారికి వైరస్ వ్యాపించేలా చేశారనే విషయం స్పష్టమైంది.

    “బహుశా వైరస్ వారి చేతుల్లో ఉంది. వారు చర్చి సీటును తాకినప్పుడు ఆ వైరస్ అక్కడ వ్యాపించింది. లేదంటే, వారి శ్వాస ద్వారా ఆ వైరస్ నేలపై పడింది. అయితే ఇది అంచనా మాత్రమే. దీనిని పక్కాగా చెప్పలేం” అని లీ చెప్పారు.

    కానీ, కారణం ఏదైనా చైనా దంపతుల్లో వైరస్ లక్షణాలు లేవు. తెలిసో తెలీకో వారు మిగతా వారికి అది వచ్చేలా చేశారు. ఆ తర్వాత డాక్టర్ వర్నాన్ లీ ఆ లింకులన్నీ జోడించి ఒక నమూనాను సిద్ధం చేశారు. దాన్నుంచి ఒక విషయం స్పష్టమైంది. చాలా మంది తమకు తెలీకుండానే ఆ వైరస్‌ మిగతావారికి వచ్చేలా చేస్తున్నారు.

    ఇది ఎలాంటి రహస్యం అంటే, ఈ డాక్టర్లు గుర్తించిన ఈ విషయం మొత్తం ప్రపంచమంతా ప్రభావం చూపించబోతోంది. దానికి ఇంకో కారణం కూడా ఉంది. కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని సూచనల్లో “మీకుగానీ, మీ చుట్టుపక్కల వారికి గానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వారికి దూరంగా ఉండండి” అని మాత్రమే చెప్పారు.

    కానీ, అసలు లక్షణాలే కనిపించని వ్యక్తులు ఈ వైరస్ వ్యాపించేలా చేస్తున్నారు. వారు నిశ్శబ్దంగా తమకు తెలీకుండానే ఈ వైరస్‌ను మిగతావారికి చేరుస్తున్నారు. అలాంటప్పుడు ఈ వ్యాధిని ఎలా అడ్డుకోగలం అనే ప్రశ్న వస్తుంది.

    ఈ విషయం డాక్టర్ వర్నాన్ లీకి తెలిసినప్పుడు ఆయన తన ఆఫీసులో ఉన్నారు. “మనం ఎప్పుడైనా ఒక శాస్త్రీయ ఆవిష్కరణ చేసినప్పుడు, ముఖ్యంగా మనం కనిపెట్టింది చాలా ముఖ్యమైన విషయం అయినప్పుడు, ప్రపంచమే మనకు దాసోహం అయినట్లు ఉంటుంది. దానిని మేం చాలా కష్టపడి, టీమ్ వర్క్ ద్వారా సాధించాం” అని చెప్పారు

    లక్షణాలు కనిపించవు, వైరస్ ఉంటుంది

    సింగపూర్‌లో డాక్టర్ లీ, ఆయన టీమ్ కొత్త కరోనా వైరస్‌కు సంబంధించిన గుర్తించిన లక్షణాలను ‘ప్రీ సింప్టమాటిక్ ట్రాన్స్ మిషన్’ లేదా ‘లక్షణాలు కనిపించకుండానే వైరస్ వ్యాపించడం’ అంటారు. అందులో వైరస్ వ్యాపించిన వారికి తమలో ఆ వైరస్ ఉందనే విషయమే తెలీదు.

    ఎందుకంటే వారికి జ్వరం, దగ్గు, లాంటి వైరస్ వల్ల కనిపించే ఏ లక్షణాలూ ఉండవు. దీనితోపాటూ “ఎవరిలో అయినా కోవిడ్-19 లక్షణాలు కనిపించే ముందు 24 గంటల నుంచి 48 గంటల సమయం చాలా కీలకం” అని సింగపూర్ డాక్టర్ల పరిశోధనలో తెలిసింది.

    ఆ సమయంలో పాజిటివ్ వ్యక్తి మిగతా వారికి ఆ వైరస్ వ్యాపించేలా చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బహుశా ఆ సమయంలో వారు చాలా ఎక్కువగా వైరస్ వ్యాపించేలా చేస్తుంటారు. దాని గురించి హెచ్చరించడం అనేది చాలా ఉపయోగకరంగా ఉండచ్చు.

    ఎందుకంటే మీరు వ్యాదికి గురయ్యారని మీకు తెలీగానే, మీరు ఎంత మందికి దగ్గరగా వెళ్లారో వారందరికీ ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించవచ్చు. అంటే దానివల్ల వైరస్ వ్యాపించే ప్రమాదకరమైన సమయంలో, వైరల్ లక్షణాలు బయటపడేవరకూ వారంతా తమ తమ ఇళ్లలోనే ఒంటరిగా ఉంటారు..

    కానీ, దగ్గు తుంపరలు లేకపోయినా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఎలా వ్యాపిస్తుంది? ఈ చిక్కుముడిని విప్పడం ఇంకా మిగిలే ఉంది. ఈ ప్రశ్నకు ఒక సమాధానం చెప్పుకోవచ్చు.

    “శ్వాస తీసుకున్నా, లేదా ఒక వ్యక్తితో మాట్లాడినా కూడా వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురికావచ్చు”.

    ఒకవేళ, వైరస్ ఇంకా ఒక వ్యక్తి శ్వాసకోశ వ్యవస్థ పైభాగంలోనే ఉంటే, అతడు ఊపిరి వదులుతున్నప్పుడు కొంత వైరస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఎవరైనా వారికి దగ్గరగా ఉంటే, వారు ముఖ్యంగా మూసిన ఒక గదిలో ఉంటే, చాలా సులభంగా వైరస్‌ వచ్చే అవకాశం ఉంది.

    తాకడం అనేది కూడా కోరనావైరస్ వ్యాప్తికి ఒక భయంకరమైన మార్గం కావచ్చు. వైరస్ ఒక వ్యక్తి చేతుల్లో ఉన్నప్పుడు, అతడు వేరే వ్యక్తిని లేదా తలుపు హాండిల్, లేదా చర్చి సీటును తాకితే, ఆ వైరస్ అక్కడికి చేరుతుంది.

    వైరస్ వ్యాపించే దారి ఏదైనా, ఇప్పుడు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. “ఒక వ్యక్తిలో కరోనా లక్షణాలు స్పష్టంగా కనిపించకపోతే, అతడు తను ఉండాల్సినంత జాగ్రత్తగా ఉండడు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది”.

    కొందరికి అసలు లక్షణాలు కనిపించలేదు

    ఇది మరింత అంతుపట్టని రహస్యంలా అనిపిస్తోంది. శాస్త్రవేత్తల దగ్గర ఇప్పటివరకూ దీని గురించి బలమైన సమాధానం ఏదీ లేదు.

    లక్షణాలు కనిపించని ఒక వ్యక్తి వేరేవారికి కరోనా వైరస్ వచ్చేలా ఎలా చేయగలడు? అనేది ఒక వాదన.

    కానీ, ఒక వ్యక్తికి కరోనా ఉన్నా, అతడిలో లక్షణాలు కనిపించకపోతే అది మరింత ఆందోళన కలిగించే విషయం.

    దాన్నే శాస్త్రవేత్తలు ‘ఎసింప్టమాటిక్’ లేదా ‘ఎలాంటి లక్షణాలూ లేని కేస్’ అంటున్నారు. ఎందుకంటే వారు వ్యాధికి వాహకం అవుతున్నారు. మిగతా వారికి ఆ వైరస్‌ను చేరుస్తున్నారు. కానీ, దానివల్ల వారికి మాత్రం ఎలాంటి సమస్యలు ఉండవు.

    దీనికి ఐర్లాండ్‌లో నివసించిన ఒక మహిళ మంచి ఉదాహరణ. ఇది గత శతాబ్దం ప్రారంభంలో న్యూయార్కులో బయటపడింది.

    ఆ మహిళ పేరు మేరీ మెలన్. ఆమె ఎక్కడ పనిచేసినా, అక్కడున్న వారికి టైఫాయిడ్ వచ్చేది. మేరీ ఒక్కొక్కటిగా చాలా ఇళ్లలో పనిచేసేది. ప్రతి ఇంట్లో టైఫాయిడ్ వ్యాపించేలా చేసింది. దాంతో ముగ్గురు చనిపోయారు. కానీ మేరీకి మాత్రం ఆ వ్యాధి దుష్ప్రభావాలు ఏవీ కనిపించలేదు.

    చివరికి మేరీ, వ్యాధికి గురైన వారి మధ్య లింకు బయటపడింది. ఆమె తనకు తెలీకుండానే మిగతావారికి టైఫాయిడ్ వచ్చేలా చేసిందనే విషయం ధ్రువీకరించారు. కానీ ఆమెకు మాత్రం ఎలాంటి తేడా తెలిసేది కాదు.

    అప్పట్లో వార్తా పత్రికలు ఆమెకు ‘టైఫాయిడ్ మేరీ’ అనే పేరు పెట్టాయి. దాంతో మేరీకి చాలా కోపం వచ్చింది. కానీ మేరీకి, ఆ వ్యాధికి ఉన్న లింకు తెలీగానే అధికారులు ఆమెను, 1938లో చనిపోయేవరకూ, అంటే దాదాపు 23 ఏళ్ల పాటు ఒంటరిగా ఒక గదిలో ఉంచేశారు.

    మన నమ్మకం ముక్కలైతే

    బ్రిటన్ నర్స్ ఎమిలియా పావెల్‌ కూడా కరోనాకు సంబంధించిన ఏ లక్షణాలూ లేకపోయినా, పాజిటివ్ రావడంతో కంగారు పడ్డారు. ఆమె కేంబ్రిడ్జిలోని ఎడెన్‌బ్రూక్ ఆస్పత్రిలో పనిచేసేవారు. ఏప్రిల్ నెలలో ఆమెకు ఫోన్ చేసిన ఒక డాక్టర్ మీకు కరోనా పాజిటివ్ వచ్చింది అని చెప్పారు.

    అప్పట్లో ఎమిలియా పూర్తిగా మామూలుగా ఉండేవారు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్(పీపీఈ) వేసుకుని తను పూర్తి సురక్షితంగా ఉన్నానని అనుకునేవారు. ఆస్పత్రిలో ఆమె కోవిడ్-19 రోగులకు చికిత్స అందించేవారు. కానీ, హఠాత్తుగా ఆమె నమ్మకం ముక్కలైంది. తనకు కరోనా రావడంతో ఎమిలియా చాలా భయపడ్డారు.

    “డాక్టర్ ఫోన్ చేయగానే నాకు చావుకబురు చెప్పినట్లు అనిపించింది. దానిని అసలు ఊహించుకోలేకపోయాను, నేను బాగానే ఉన్నాను. నాకు కరోనా వచ్చే అవకాశమే లేదు అనుకున్నాను” అని 23 ఏళ్ల ఎమిలియా చెప్పారు.

    కరోనా ఉందని తెలీగానే ఆమె తన ఇంట్లో ఐసొలేట్ అయ్యారు. “ఆస్పత్రుల్లో నేను ఆరోగ్య పరిస్థితి ఘోరంగా ఉన్న చాలామంది రోగులను చూశాను.. నాక్కూడా అలాగే అవుతుందేమో అని భయపడ్డా. కానీ నాకు ఆ వైరస్ ఉన్నట్టే అనిపించేది కాదు. రోజూలాగే మామూలుగానే తిని, బాగా నిద్రపోయేదాన్ని” అని ఆమె చెప్పారు.

    ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పైకి లక్షణాలు కనిపించని ఎంత మందికి ఈ వైరస్ వ్యాపించిందో తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఎమిలియాకు కూడా ఈ వైరస్‌ వచ్చిందని ఆస్పత్రి సిబ్బంది మీద జరిగిన ఒక అధ్యయనంలో తెలిసింది. దానివల్ల షాక్ ఇచ్చే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.

    ఆ అధ్యయనంలో పాల్గొన్న వెయ్యి మందిలో మూడు శాతం మందికి వైరస్ వ్యాపించింది. కానీ వారిలో అప్పటివరకూ వైరస్ లక్షణాలు ఒక్కటి కూడా కనిపించ లేదు.

    ఈ ఏడాది ప్రారంభంలో జపాన్ తీరంలోనే ఆపేసిన క్రూయిజ్ షిప్ ‘డైమెండ్ ప్రిన్సెస్‌’లో కూడా చాలామంది అలాంటివారు కనిపించారు. వైరస్ వ్యాపించినా, వారిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదు. తర్వాత ఆ నౌకకు ‘పరివర్తన కప్’ అనే పేరు పెట్టారు.

    ఎందుకంటే డైమండ్ ప్రిన్సెస్‌లో ఉన్న మొత్తం 700 మందీ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలారు.

    అటు వాషింగ్టన్‌లోని ఒక కేర్ హోంలో కూడా సగానికి పైగా వైరస్‌కు గురయ్యారు. అయితే వీరిలో ఎవరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదు.

    ఏ అధ్యయనాలూ నమ్మలేం

    రకరకాల అధ్యయనాల ప్రకారం ఎలాంటి లక్షణాలూ లేని కేసులు ఐదు నుంచి 80 శాతం వరకూ ఉండచ్చు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్ల్ హెనెఘన్ ఆ నిర్ణయానికి వచ్చారు. ఆయన 21 రీసెర్చిలను అధ్యయనం చేసి ఈ ఫలితాలు రాబట్టారు.

    “ఎలాంటి లక్షణాలూ లేని వారు వైరస్ వ్యాపించేలా చేయడం గురించి జరిగిన అధ్యయనాల్లో ఒక్కటి కూడా నమ్మేలా లేదు. వారు లక్షణాలు కనిపించిన వారికి మాత్రమే కరోనా టెస్టులు చేస్తున్నారు. అంటే చాలా కేసులు పరీక్షల పరిధికి బయటే ఉండిపోతున్నాయి. వాటి సంఖ్య బహుశా చాలా ఎక్కువే ఉంటుంది” ” అని ప్రొఫెసర్ హెనెఘన్ టీమ్ చెప్పింది.

    ప్రస్తుతం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కరోనా లక్షణాలు కనిపించేవారికి మాత్రమే టెస్టులు చేస్తున్నారు.

    కరోనావైరస్

    సైలెంట్ స్ప్రెడర్ ఎంత iప్రమాదం?

    తెలీకుండానే ఎంతమందికి వైరస్ వచ్చేలా చేశానో అని బ్రిటన్ నర్స్ ఎమిలియా ఆందోళనకు కూడా గురయ్యారు. వారిలో ఎమిలియాతో పనిచేసినవారు కూడ ఉండచ్చు. లేదా చికిత్సకు అక్కడకు వచ్చిన రోగులకు కూడా అయ్యుండచ్చు.

    కరోనా లక్షణాలు కనిపించని వారు, ఆ వైరస్‌ వ్యాపించేలా చేయగలరా, లేదా అనేది మనకు ఇప్పటికీ తెలీడం లేదు. అది చాలా విచిత్రమైన విషయం. ప్రస్తుతం దాని గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది.

    చైనాలో జరిగిన ఒక అధ్యయనంలో కరోనా లక్షణాలు కనిపించే వారితో పోలిస్తే, వైరస్ లక్షణాలు ఏమాత్రం కనిపించని వారి సంఖ్యే ఎక్కువ ఉంటుందని తెలిసింది.

    ఈ స్టడీ చేసిన శాస్త్రవేత్తలు “సైలెంట్ స్ప్రెడర్‌ అనే ఏ లక్షణాలూ లేని ఈ కరోనా వైరస్ వాహకులపై దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే మనం ఈ మహమ్మారిని అడ్డుకోగలం” అన్నారు.

    “ముఖ్యంగా లక్షణాలు స్పష్టంగా కనిపించేవారితో పోలిస్తే, ఎలాంటి లక్షణాలూ కనిపించని వారిలో వైరస్‌ను ఇతరులకు వచ్చేలా చేసే సామర్థ్యం తక్కువ ఉందని” డైమండ్ ప్రిన్సెస్ క్రూజ్ నౌకలో ప్రయాణికులపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల టీమ్ గుర్తించింది.

    అయినా, కరోనా వ్యాపించడంలో కరోనా లక్షణాలేవీ కనిపించనివారు చాలా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

    లక్షణాలు లేని ఇన్ఫెక్షన్లు ‘డార్క్ మేటర్’

    ‘ఎసింప్టమాటిక్ సైలెంట్ స్ప్రెడర్’ చిక్కుముడిని విప్పడానికి ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని నార్విచ్ నగరంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. నగరంలో ఉన్న అందరికీ టెస్టులు చేయాలని వారు ఇప్పుడు పట్టుబడుతున్నారు. అర్ల్ హామ్ ఇన్‌స్టిట్యూట్ అనే ఒక రీసెర్చ్ సెంటర్ చీఫ్ ప్రొఫెసర్ నీల్ హాల్ “లక్షణాలు లేని కేసులు, ఈ మహమ్మారికి డార్క్ మేటర్” అన్నారు.

    ‘డార్క్ మేటర్’ అంటే అదృశ్య మూలకం. మొత్తం విశ్వం అంతా దీని నుంచే ఏర్పడిందని భావిస్తున్నారు. ఇప్పటివరకూ అది ఏదో గుర్తించలేకపోయారు.

    “ఏ లక్షణాలు కనిపించని వారు కోవిడ్-19 మహమ్మారి వ్యాపించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టినా, ఇలాంటి వారి వల్ల కరోనాను అడ్డుకునే విధానాలు విఫలం అవుతున్నాయి” అని ప్రొఫెసర్ హాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

    “మీ చుట్టుపక్కల అలాంటి వారు ఉంటారు. తమకు వైరస్ ఉన్నట్లు వారికి అనిపించదు. దాంతో వారు ప్రజా రవాణాను ఉపయోగిస్తారు. ఆస్పత్రులకు, బహిరంగ ప్రాంతాలకు వెళ్తారు. అలాంటప్పుడు ఈ ఇన్ఫెక్షన్లు మరింత వ్యాపిస్తాయి” అని హాల్ చెప్పారు.

    “వైరస్ లక్షణాలు కనిపించిన తర్వాతే జనం డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటే, వారికి చికిత్స చేసినంత మాత్రాన ఈ మహమ్మారిని తరిమికొట్టలేం. అది ఈ సమస్యకు అరకొర పరిష్కారం అవుతుంది” అన్నారు.

    ఎవరికి వైరస్ లక్షణాలు కనిపించడం లేదో, ఎవరు కరోనాతో తిరుగుతున్నారో మనం తెలుసుకోలేనప్పుడు అది ఒక పెద్ద కుట్రలా అవుతుంది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోడానికి అది ఒక పెద్ద సవాలు కూడా” అని కాలిఫోర్నియాలోని ఒక శాస్త్రవేత్తలక టీమ్ చెప్పింది.

    ఈ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మహమ్మారిని అడ్డుకోడానికి ఒకే ఒక పద్ధతి ఉంది.

    లక్షణాలు కనిపించకపోయినా, ఈ వైరస్ ఎవరెవరికి వచ్చిందో తెలుసుకోవడం. దానికోసం భారీస్థాయిలో కరోనా పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

    బ్రిటన్ ఎంపీల కామన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ కూడా ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు ఇదే సిఫారసు చేసింది.

    ఈ మహమ్మారి వ్యాపించడంలో ఏ లక్షణాలు కనిపించని వారు చాలా కీలక పాత్ర పోషించారు. కరోనావైరస్ వ్యాపించిన వారిని చూసుకునే వారికి కూడా క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు చేస్తూ ఉండాలని కూడా వీరు తమ ప్రధానికి సూచించారు.

    కరోనా మహమ్మారికి కేంద్రమైన చైనాలోని వుహాన్‌లో కూడా దీనిని విస్తృతంగా పాటిస్తున్నారు. కోవిడ్ కేసులను గుర్తించడానికి నగరంలో 9 రోజుల్లో 65 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు. వారిలో ఎలాంటి లక్షణాలూ కనిపించని వారు కూడా ఉన్నారు.

    లాక్‌డౌన్‌లో సడలింపులు ప్రారంభం

    ఇప్పుడు భారత్ సహా మిగతా దేశాల్లో లాక్‌డౌన్ సడలిస్తున్నారు. దీంతో జనం మెట్రో, బస్సులు, రైళ్లు లాంటి ప్రజా రవాణా ఉపయోగించడం ప్రారంభించారు. కొనుగోళ్ల కోసం మార్కెట్లకు, మాల్స్ వెళ్తున్నారు. అలాంటప్పుడు ఈ కనిపించని ముప్పుపై పట్టు బిగించడం చాలా అవసరం.

    ప్రస్తుతం ప్రజల్లో కరోనావైరస్ ఎవరికుందో తెలుసుకోడానికి ఎలాంటి దారీ లేదు. ముఖ్యంగా పరీక్షలు చేయకుండా అది తెలుసుకోవడం అసాధ్యం. అందుకే వైరస్ వచ్చిన వారు కాంటాక్ట్ అయిన వారి వివరాలు తెలుసుకోవడానికి పూర్తిగా సహకరించాలని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కోరుతున్నాయి.

    స్వయంగా మీరు కరోనా వచ్చిన వ్యక్తిని కాంటాక్ట్ అయితే సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లండి. కరోనాను ఎదుర్కునే అత్యంత బలమైన ఆయుధం సోషల్ డిస్టెన్సింగ్ మాత్రమే అని ఇప్పటికీ చెబుతున్నారు. మీరు జనాలకు ఎక్కడ దూరంగా ఉండడానికి వీలున్నా, ఆ దూరాన్ని పాటించండి.

    ఒకవేళ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం సాధ్యం కాకుంటే, మీ ముఖాన్ని కప్పి ఉంచండి. కనీసం ఇంట్లో తయారుచేసిన మాస్క్ అయినా ఉపయోగించండి.

    అమెరికా ప్రభుత్వం ఇదే విషయాన్ని ప్రకటించినపుడు సింగపూర్ చర్చిలో జనవరిలో జరిగిన రీసెర్చ్ గురించి ప్రస్తావించింది.

    “అలా చేయడం వల్ల మనల్ని మనం రక్షించుకోవడమే కాదు, మీ నుంచి వైరస్ సోకకుండా ఇతరులను రక్షించవచ్చు. ఎందుకంటే, మీరు వైరస్‌కు గురైనా, ఆ విషయం మీకు తెలీదు” అనేది అమెరికా వాదన.

    మాస్క్ ధరించాలని పట్టుబట్టడం కంటే, జనం చేతులు శుభ్రం చేసుకోవడం, సోషల్ డిస్టన్సింగ్ పాటించడం లాంటి వాటిని నిర్ళక్ష్యం చేయకుండా చూడాలని చాలామంది నిపుణులు చెబుతున్నారు. వాటిని నిర్లక్ష్యం చేస్తే, కరోనా వ్యాపించే భయం అలాగే ఉంటుందని అంటున్నారు.

    కానీ ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలూ మాస్క్ ధరించడం వల్ల ఈ వైరస్‌ను ఎక్కువ అడ్డుకోగలమని నమ్ముతున్నాయి. అయితే, మాస్కుతో ముఖం కప్పుకున్నంత మాత్రాన ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడుతుందనేం లేదు.

    కానీ, లక్షణాలు కనిపించని వారి గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. అందుకే చెప్పిన జాగ్రత్తల్లో ఏదైనా పాటించడం వల్ల మనకు వచ్చే నష్టమేం ఉండదు. అలా చేయడం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగితే, మరీ మంచిది.

    కరోనా వైరస్‌కు గురై తీవ్రంగా జబ్బుపడిన రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్ల విషయానికి వస్తే వరసగా వారాల తరబడి విధుల్లో ఉండడం వల్ల డాక్టర్లు పూర్తిగా అలిసిపోయినట్లు కనిపిస్తున్నారు. వారిలో చాలా మంది నోట ఒకే మాట వస్తోంది. “మేం ఇలాంటి చికిత్స ఇంతకు ముందు ఎప్పుడూ చూళ్లేదు”.

    ఒక కొత్త వ్యాధి వ్యాపించబోతోందనే విషయం డాక్టర్లకు తెలుసు. శ్వాసకు సంబంధించిన ఈ కొత్త వ్యాధితో రోగులు భారీగా తరలివస్తే, ఆస్పత్రుల వనరులపై తీవ్ర ఒత్తిడి పడుతుందని కూడా వారికి తెలుసు.

    కరోనా పాజిటివ్ ఉన్న వారికీ మందులు డాక్టర్ సలహాలు మేరకు వాడాలిఈ ఏజ్ మరియు ఆరోగ్యం సమస్య బట్టి మెడిసిన్ డోస్ ఇవ్వబడును 





    కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

    ఇవి కూడా చదవండి:

    ధన్యవాదములు 

    మీ నవీన్ నడిమింటి 

    విశాఖపట్నం 

    9703706660

    *సభ్యులకు విజ్ఞప్తి*

    ******************

    ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమని

    22, జులై 2020, బుధవారం

    యోగలో జలనేతి క్రియ వల్ల మైగ్రేన్ తలనొప్పి ఎలా పరిష్కారం అవగాహనా కోసం

    యోగషట్కర్మలు లేక యోగశుద్ధి క్రియలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


    శరీరానికి బాహ్య రూపం ఎంతవున్నదో, అంతర్ స్వరూపం అంతకంటె ఎక్కువగా వున్నది. అంతేగాక అంతర్ స్వరూపం సమస్యల వలయం. శరీర బాహ్య స్వరూపానికి శుద్ధి ఎంత అవసరమో, అంత కంటే అంతర్ స్వరూపానికి శుద్ధి ఎక్కువ అవసరం. అందువల్లనే యోగులు, మునులు శరీరం లోపలి అవయవాల శుద్ధి కోసం యోగ షట్కర్మలు లేక యోగశుద్ధి క్రియలు ప్రతిపాదించారు. వీటివల్ల శరీరంలోపలి మలిన వ్యర్థపదార్యాలు బయటికి వెళ్లిపోతాయి. యీ క్రియల్ని పరగడుపున, ప్రాత:కాలం యోగసనాలు వేసే ముందు గాని లేక తరువాత గాని లేక విడిగా గాని చేయవచ్చు.
    యోగశుద్ధి క్రియలు
    ఇవి 6 రకాలుగా విభజించ బడ్డాయి.
    1. జల, కీర, తైల, ఘృత, సూత్ర, స్వమూత్ర, గోమూత్ర నేతి క్రియలు.
    2. జల, వమన, వస్త్ర, దండ, భౌతిక్రియలు
    3. వస్తే (ఎనిమా) క్రియ మరియు శంఖ ప్రషాళనం
    4. అగ్నిసార, ఉడ్డియాన మరియు నౌలి క్రియలు
    5. కపాలభాతి, భక్రిక క్రియలు
    6. త్రాటక క్రియలు

    నేతి క్రియల వల్ల సామాన్యంగా ముక్కు, నోరు, గొంతు, భౌతిక్రియల వల్ల ఆమాశయం అనగా పొట్ట, వస్తే క్రియల వల్ల మలాశయం, నౌలిక్రియల వల్ల ఉదరం, కపాలభాతి క్రియల వల్ల మస్తిష్కం, తాటక క్రియలవల్ల నేత్రాలు శుద్ధి అవుతాయి. యీ ఆరు క్రియలు సున్నితమైనవి గనుక సాధకులు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

    I. నేతి క్రియలు


    కాలుష్యంతో బాగా నిండిపోయిన వాయువు వీస్తున్నయీ కాలంలో జలనేతి క్రియ చాలా ముఖ్యమైన యోగశుద్ధి క్రియ.

    1) 1. జలనేతి క్రియ

    ఒక పర్సెంటు ఉప్ప కలిపిన గోరువెచ్చని నీరు కొమ్ముచెంబులో నింపి దాన్ని చేతుల్లోకి తీసుకోవాలి. కూర్చొని గాని లేక నిలబడి గాని తలను కొంచెం ముందుకు వంచి, కుడివైపుకు కొద్దిగా త్రిప్పాలి. ఎడమ ముక్కు రంధ్రంలో చెంబు కొవ్కు వుంచి నీటిని లోనికి పోనిచ్చి, ఆ నీటిని కుడి ముక్కురంధాన్నుంచి బయటికి వదిలివేయాలి. నోటితో శ్వాస పీల్చాలి. నోటితో వదలాలి. చెంబులో గల నీళ్లు అంుపోయేదాకా అలాగే వుంచాలి. ఇదే విధంగా కుడి ముక్కు రంథాన్నుంచి నీళ్లు లోనికి పోనిచ్చి, ఎడమ ముక్కు రంధాన్నుంచి క్రిందికి వదిలి పేయాలి.

    రెండు వైపుల నుంచి యీ క్రియ చేసిన తరువాత రెండు చెవుల్ని రెండు చేతుల బొటన ప్రేళ్లతో మూయాలి. నోటితో గాలి పీల్చి ముక్కు ద్వారా ఫోర్సుగా బయటికి చీదిపేయాలి. అదే విధంగా కుడివైపుకు, ఎడమవైపుకు తలవంచి చీదిపేయాలి. ముక్కు నందలి నీరు పూర్తిగా బయటికి రానంత వరకు అలా చేయాలి. లేని యెడల జలుబు రావచ్చు. ప్రత్యేకించి తయారు చేయబడిన కొమ్ము చెంబులు యోగ కేంద్రాల్లో లభిస్తాయి. యీ శుద్ధి క్రియ రోజూ చేయడం మంచిది.

    2) కొమ్ము చెంబులో గాని, గ్లాసులో గాని గోరువెచ్చటి నీటినిపోసి, ఒక్క పర్సెంట్ ఉప్ప కలిపి ఒక నాసికా రంధ్రం ద్వారా లోనికి పీల్చి, గొంతు ద్వారా బయటికి, క్రిందికి వదలాలి. తరువాత రెండవ నాసికారం (ధం ద్వారా కూడా చేయాలి.

    ఆ తరువాత రెండు నాసికా రంధాల ద్వారా నీటిని లోనికి పీల్చి నోటి ద్వారా బయటికి వదలాలి. నోటి ద్వారా నీళ్లలోనికి పీల్చి ముక్కు ద్వారా బయటికి వదిలివేయాలి, యీ క్రియలు కొంచెం కఠినమైనవి.


    3) జలనా సాపానం
    ముక్కు రంధాల ద్వారా లోనికి పీల్చిన నీటిని నోటితో నీరు త్రాగినట్లు తాగడాన్ని నాసాపానం అని అంటారు. నాసాపానం చేసే ముందు జలనేతి క్రియు ద్వారా వంుక్కును శుభ్రం చేయూలి. తరువాత ముక్కు ద్వారా లోనికి పీల్చిన இx నీటిని, నోటి నుంచి బయటికి ఉమ్మివేయాలి. ఆ తరువాతనే నాసాపానం చేయాలి.

    2) క్షీరనేతి క్రియ

    1) జలనేతి క్రియ వలె ముక్కు రంధాల నుంచి గోరువెచ్చని పాలు కొమ్ముచెంబు ద్వారా లోనికి పోనిచ్చి, బయటికి విసర్జించడాన్ని కీరనేతి క్రియ అని అంటారు.

    2) ఏమీ కలపని పాలు గోరువెచ్చగా కాచి, జలనాసాపానం వలె క్షీరనాసాపానం చేయాలి. పాలలో మీగడ వుండకూడదు. పాలు చిక్కగా వుంటే కొద్దిగా నీరు కలిపి పల్చన చేయాలి.

    3) స్వమూత్ర – గోమూత్ర నేతి క్రియ

    ప్రాతఃకాల సమయంలో విసర్జించు స్వమూత్రమును కొమ్ముచెంబులో పట్టి, జలనేతి క్రియు వలె స్వమూత్ర నేతి క్రియు చేయవచ్చు. అదే విధంగా తాజా గోమూత్రమును పట్టి పై విధంగా చేయవచ్చును.

    కీర, స్వమూత్ర, గోమూత్ర నేతి క్రియలు అవసరాన్నిబట్టి చేయవచ్చును.

    4) తైల, ఫ్భత నేతి క్రియ

    మధ్యాహ్నం గాని లేక రాత్రిగాని వెల్లికల పడుకొని తలను కొంచెం వెనుకకు వంచి గోరువెచ్చని నూనె లేక నేతి చుక్కలు 5 లేక8, ముక్కు రంధ్రంలో పేసి శ్వాసతో లోపలికి పీల్చాలి. విశ్రాంతి తీసుకోవాలి. నువ్వుల నూనె లేక కొబ్బరి నూనె లేక శుద్ధమైన ఘృతము (నెయ్యి)ను యిందుకు వాడాలి. డాలను వాడకూడదు.

    5) సూత్ర నేతి క్రియ

    i

    మధ్యన ముడిపేయని నూలు దారానికి మైనం పూసి, నునుపుచేసి, సూత్ర నేతి శుద్ధి క్రియ చేయాలి. యోగ కేంద్రాల్లో యిట్టి దారం దొరుకుతుంది.

    దారానికి బదులు నాల్గవ నెంబరు కేథడర్ (రబ్బరు దారం) కూడా వాడవచ్చు.

    రెండిటిలో ఒక దాన్ని కుడి ముక్కు రంధం ద్వారా గొంతు వరకు పోనివ్వాలి. రెండు చూపుడు వేళ్లు గొంతులో పెట్టి, ముక్కులో నుంచి లోనికి వచ్చిన దారం కొసను ప్రేళ్లతో మెల్లిగా పట్టుకొని నోటి నుంచి బయటికి తీసుకురావాలి. ముక్కుబైట వున్న దారం కొసను, నోటి బయటవున్న దారం కొసను రెండు చేతులతో విడివిడిగా పట్టుకొని ముందుకు వెనుకకు పది నుంచి ఇరువది సార్ల వరకు జాగ్రత్తగా మొల్లగా లాగాలి. తరువాత ఆ దారాన్ని నోటి నుంచి మొల్లగా బయటికి తీసివేయాలి.

    అదే విధంగా రెండవ ముక్కు రంధాంన్నుంచి దారం కొసను గొంతులోనికి పోనిచ్చి, బయటికి తెచ్చి పైవిధంగా వెనక్కి ముందుకి జాగ్రత్తగా, మొల్లగా లాగాలి.

    సూత్రనేతి క్రియు పూర్తికాగానే, ఉప్పకలిపిన గోరు వెచ్చని నీటిని కొద్దిగా గొంతులో ప్రోసుకొని, కొద్దిసేపు గుటగుట, గురగురలాడించి ఆ నీటిని బయటికి విసర్జించాలి. ఆరంభంలో కొద్దిగా 0ుబ్బంది కలిగినా కంగారు పడకూడదు.

    జలనేతిక్రియ చేసిన తరువాత సూత్రనేతి క్రియ చేయాలి. సూత్రనేతి క్రియ చేసిన తరువాత తిరిగి జలనేతి క్రియ చేయాలి. దారం గరుకుగా వుంటే రక్తం కొంచెం కారవచ్చు. భయపడకూడదు. అప్పడు కొద్దిసేపు సూత్ర సేతిక్రియను ఆపాలి. సూత్రనేతి క్రియ చేసే ఒక రోజు ముందు ముక్కులో గోరువెచ్చని నూనెగాని లేక నెయ్యి గాని మూడు నాలుగు చుక్కలు తప్పక పేయాలి. ఆరంభంలో నిపుణుల ద్వారా ఈ క్రియ చేయించుకోవాలి. తరువాత తామే చేసుకోవచ్చు.

    జలనేతి క్రియను ప్రతిరోజూ చేయవచ్చు. తైల, ఘృత, సూత్రనేతి క్రియ వారానికి ఒక్కసారి చేయాలి. యీ క్రియలు ఒకటి రెండు నిమిషాల్లో పూర్తి అవుతాయి గనుక నియమ బద్ధంగా చేయడం వలన ఎన్నో లాభాలు కలుగుతాయి.

    పైన తెలిపిన క్రియలు చేసిన తరువాత జలనేతి క్రియ మళ్లీ చేయాలి. లోపలి నీటిని బయటికి చీదిపేయాలి.

    లాభాలు
    ముక్కు, నోరు, గొంతు, నేత్రాలు, మస్తిష్కమునకు సంబంధించిన జబ్బులు నయమవుతాయి. చెముడు, చెవుల్లో చీము, రక్తంకారడం, చెవుల్లో ఏమేమో ధ్వనులు వినబడటం, ముక్కు దిబ్బడ, ముక్కులో 2১66 దుర్మాంసం, ముక్కుకు వాసన తెలియకపోవడం, సైనస్, ఆస్తమా, ఎలర్జీ, దగు, జలుబు, కంటిమంట, కండ్ల నుంచి నీరుకారుట, కండు ఎరుపెక్కుట, కండ్లకలక, చత్వారం, మెదడుకు సంబంధించిన జబ్బులు, జర్ణాపకశక్తి తగుట, ధారణాశక్తి తగుట, తలనొప్పి, అర్ధతల నొప్పి, మొదలగు వ్యాధుల తీవ్రత తగుతుంది. గొంతు నుంచి నెత్తి మీద మాడు వరకు గల అవయవాలు శుద్ధి అవుతాయి.

    II. ధౌతిక్రియలు

    1. జలవమన ధౌతిక్రియ

    భౌతి అంటే ఉతుకుట అని అర్థం. యోగ విద్యలో దీన్ని ఉదర శుద్ధి అని అంటారు. ఏనుగుకు జ్వరం వస్తే యీ క్రియ చేస్తుంది. కనుక దీన్ని కుంజల క్రియ లేక గజకరణి క్రియ అని కూడా అంటారు. ఏనుగును చూచి మనిషి నేర్చుకున్న క్రియ యిది. మలవిసర్జన చేస్తున్నప్పడు కూర్చునే విధంగా కూర్చొని ఫిల్టరు చేసిన లేక వడబోసిన గోరువెచ్చని నీరు కొద్దిగా ఉప్ప కలిపి కడుపు నిండా తాగాలి. నీరు త్రాగిన తరువాత నిలబడి పొట్టను, నడుమును అటు యిటు, వెనకకు ముందుకు మరియు గుండంగాను కదిలించాలి. యీ విధంగా కదిలించడం వల్ల పొట్ట యందలి

    యాసిడ్, శ్లేష్మము, గ్యాసు రూపంలో వున్న చెడు పదారాలు తాగిన నీటిలో కలిసిపోతాయి. తరువాత ఎడమచేతితో పొట్టను అదిమి పెట్టి, కుడి చేతి రెండు చూపుడు ప్రేళ్లను నోటిలోనికి పోనిచ్చి కొండనాలుకను ఆ వేళ్ల కొసలతో (T కొంచెం కుదిపి కదిలించాలి. ంుJ” విధంగా చేయగానే, ఉదరము నందలి నీటితో బాటు చెడు పదారాలన్నీకక్కు లేక వమనం ద్వారా బయటికి వచ్చి పేస్తాయి.

    ఉదరమునందలి నీరు పూర్తిగా బయటికి వెడలునంత వరకు ప్రేళ్లు నోటిలోనే ఉంచాలి. కొద్దిగా నీరు మిగిలితే అది మూత్ర రూపంలో బయటికి వెళ్లిపోతుంది.

    వ్రేళ్లకు గోళ్లు పెరిగి ఉండకూడదు. రక్తపుపోటు వున్నవాళ్లు ఉప్పకు బదులు నిమ్మరసం నీటిలో కలిపి తాగాలి. గుండె జబ్బు, అల్సరు, పొట్టకు సంబంధించిన ఆపరేషను చేయించుకున్న వాళ్లు మరియు గర్భిణీ స్త్రీలు యీ క్రియ చేయకూడదు.

    ఈ క్రియ చేసినప్పడు ఎరుపు రంగు నీరు బయటికి రావచ్చు. అది రక్తం కాదు. యీ క్రియ చేసిన తరువాత గోరువెచ్చని పాలుగాని లేక ఆరోగ్యావృతం గాని తాగాలి. కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవాలి, క్రియ చేసిన వెంటనే మిర్చి మసాలా పదారాలు, అంటే పకోడీలు, మిరపకాయ బజ్జీలు వగైరా తినకూడదు. వనాంసాహారం తినకూడదు. వారానికి ఒక్కసారి తప్పక యీ క్రియ చేయాలి. అవసరాన్ని బట్టి రోజూ వరుసగా రెండు మూడు రోజులు యీ క్రియ చేయవచ్చు.
    లాభాలు :
    ఆవూశయం శుభ్ర పడుతుంది. గ్యాసు, అజీర్ణం, కడుపులో వుంట, తలనొప్పి, శరీరం బరువు తగ్గిపోతాయి. ప్రతిరోజూ చేస్తే పచ్చకామెర్ల వ్యాధిరాదు. శ్వాసప్రశ్వాసలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి.

    2. వస్త్ర, ధౌతి క్రియ

    మూడు అంగుళాల వెడల్పు ఏడు మీటర్ల పొడవు గల పల్చని మల్లగుడ్డను కొద్దిగా ఉప్ప కలిపిన గోరువెచ్చని నీటిలో తడిపి మెల్లమెల్లగా లోపలికి మింగాలి. తరువాత దాన్ని బయటికి తీయాలి. దీన్నే వస్త్రధౌతి క్రియ అని అంటారు. నిపుణుల సాయంతో యీ క్రియను జాగ్రత్తగా చేయాలి. పాలలోగాని, తేనెలో గాని తడిపి కూడా గుడ్డను మింగవచ్చు. మొదటి రోజున ఒక్క అడుగు పేలికను మాత్రమే మింగాలి. 8 లేక 10 రోజుల్లో అభ్యాసం అవుతుంది. యీ క్రియను 10, 15 నిమిషాలు మాత్రమే చేయాలి. మింగిన బట్టను మెల్లగా బయటకి తీయాలి. బట్టను పూర్తిగా మింగివేయకూడదు. పేలిక కొసలు బయటకు వుండటం అవసరం. అవసరం అనుకుంటే బయటి కొసను ప్రేలికి ముడిపేసుకోవడం మంచిది. ఆ విధంగా చేస్తే ఆ పేలిక కొసను పటుకొని మెల్లగా జాగ్రత్తగా పేలికను బయటికి లాగవచ్చు.

    వస్త్ర భౌతి క్రియ చేసిన తరువాత తిరిగి జలభౌతి క్రియ చేయాలి.

    ఈ క్రియ పూర్తికాగానే గోరువెచ్చని పాలు తాగాలి. ఆ రోజున ఆహారం తేలికగా తీసుకోవాలి.

    ఏడు రోజుల పాటు వరుసగా జలభౌతి క్రియ చేసిన తరువాతనే వస్త్ర భౌతిక్రియ చేయాలి.

    ఈ క్రియ వల్ల దగు, కఫం, ఆస్తమా, గ్యాసు మొదలగు ఉదర వ్యాధులు తలనొప్పి, జ్వరం, గట్టి, ఏనుగు గట్టి తదితర చర్మవ్యాధులు, కుష్క మొదలగు రోగాలు నయమవుతాయి. జఠరాగ్నిపెరుగుతుంది. యోగులు, మునులు, కర్ర ముక్క కూడా ప్రిమింగి భౌతిక్రియ చేసే వారు, యీ క్రియను దండధౌతి క్రియ అని అంటారు. యిప్పడు యీ క్రియ చేసే వాళ్లు తగ్గిపోయారు.


    III. 3. వస్తే (ఎనీమా) క్రియ


    వులరంధం ద్వారా నీటిని పొత్తికడుపులో నింపి కొద్దిసేపు ఆ నీటిని పొత్తికడుపులో వుంచి, చేతులతో పొత్తికడుపు నిమిరి, తరువాత ఆ నీటిని మలంతో బాటు విసర్జించడాన్ని వస్తిక్రియ అని అంటారు. ప్రాచీన కాలంలో తొట్టెలో గాని, నదిలోగాని, చెరువులో గాని కూర్చొని సాధకులు, వులరంధాన్నుంచి నీటిని పొత్తికడుపులోకి పీల్చేవారు. యిందుకు మన:శక్తి ఉపయోగపడేది. వస్తిక్రియ పరిశోధకులు శంఖ ప్రషాళన క్రియ అను శుద్ధి క్రియను కూడా యిందు చేర్చారు. దాని వివరం వేరే అధ్యాయంలో వివరించాము. ఈ క్రియ చేయగలిగిన వారు యిప్పడు బహు కొద్దిగా ఉన్నారు. అందువల్ల యీ క్రియను ఎనిమా సాయంతో సులభం చేయడం జరిగింది.

    గోరువెచ్చని నీటిలో, కొద్దిగా నిమ్మరసం గాని, ఉప్పగాని, త్రిఫల చూర్ణం గానికలిపి, ఆ నీటిని ఎనిమా డబ్బాలో పోసి రబ్బరు గొట్టం ద్వారా మలరంధాన్నుంచి పొత్తికడుపులోకి పటాలి. తరువాత కాసేపు ఆగి ఆ నీటిని పొత్తికడుపు నుంచి మలరంధ్రం ద్వారా బయటికి విసర్జించాలి. ఆ నీటితో బాటు మలం, ශ්‍රීකුට, تهيئة عن బయటికి వెళ్లిపోతాయి. ఎనిమా వల్ల పెద్ద పేగు శుభ్రపడుతుంది. అజీర్ణం తగ్గి ఆకలి పెరుగుతుంది. పరగడుపున యీ ఎనిమా క్రియ చేయాలి. నెలకు ఒక్క సారి లేక అవసరమైనప్పడు యీ క్రియ చేయవచ్చు. ఎనిమా చేసుకున్న తరువాత సాధకుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. తరువాత తేలికగా ఆహారం తీసుకోవచ్చు.

    IV. నొలిక్రియలు

    వాయువుకు సంబంధించినవి నౌలి(క్రియలు. పూరకం, కుంభకం, రేచకం అను మూడు యీ క్రియల యందు ప్రాధాన్యం వహిస్తాయి. యివి మూడు విధాలు
    (1) అగ్నిసార క్రియ (2) ఉడ్డియాన క్రియ (జి) నౌలిక్రియ.

    1. అగ్నిసార క్రియ

    మంచిబట్టగాని, తివాచీగాని, కంబళీగాని క్రిందపరచి, దాని మీద వజ్రాసనం వేసి కూర్చొని పూరకం చేయాలి. అంటే గాలిని లోనికి పీల్చాలి. ఆ తరువాత రేచకం చేయాలి. అంటే గాలిని బయటికి వదిలివేయాలి. సాధ్యమైనంతగా పొట్టను అణచి, లోనికి ముడిచి సాధ్యమైనంతసేపు అలానే ఉంచాలి. ఇది ఒక చక్రం అనగా రౌండు అన్నమాట. ఇట్టి రౌండ్లను మూడు నాలుగు సార్లు చేయవచ్చు.

    ఈ అగ్నిసార క్రియను నిలబడి కూడా అదే విధంగా చేయవచ్చు.

    2. ఉడ్డియాన క్రియ

    సుఖాసనం లేక పద్మాసనంవేసి పూరకం చేయాలి. తరువాత రేచకం, కుంభకం చేయూలి. పొట్టను వీపులోపలి భాగానికి అంటుకునేలా లోనికి ముడచాలి. కొద్దిసేపు ఆగి శ్వాస తీసుకోవాలి. యీ క్రియను నిలబడి కూడా చేయవచ్చు.

    3. నొలిక్రియ

    అగ్నిసారక్రియ, ఉడ్డియాన క్రియు చేయడం అభ్యసించిన తరువాత నౌలి క్రియ చేయవచ్చు. యీ క్రియలో పొట్ట మధ్యభాగాన్ని కడ్డీలా చేయడం ముఖ్యం. సాధకుడు నిలబడి, రెండుచేతుల్ని రెండు తొడల మీద వుంచి, పూరకం చేసూ, గాలినిలోనికి పీల్చాలి. రేచకం చేసూ గాలిని బయటికి వదలాలి. పొట్టను వీపుకు అంటుకొనేలా లోనికి ముడచాలి. అయితే పొట్ట మధ్యభాగాన్ని కడ్డీలా చేసి వుంచాలి. తరువాత రెండు తొడల మీద గల ఒక్కొక్క చేతిని ఎత్తుతూ, కడ్డీగా వున్న పొట్ట యందలి భాగాన్ని అటు ఇటు కదపాలి.

    ఉదయం మలమూత్ర విసర్జన చేసిన తరువాత పరగడుపున నౌలి(క్రియ చేయాలి. భోజనం చేసిన తరువాత నౌలిక్రియ చేయకూడదు. 14 సంవత్సరాల లోపువారు, జబ్బుపడిన వారు, రక్తపువోటు ఎక్కువగా వున్నవారు, అల్సరుతోను, హెర్నియాతోను బాధపడేవారు నౌలి క్రియ చేయకూడదు.

    నౌలిక్రియలవల్ల లివరు మరియు ఉదర సంబంధమైన జబ్బులు నయమవుతాయి. ఆకలి పెరుగుతుంది. వీర్య దోషాలు పోతాయి.

    నౌలిక్రియల్లో మధ్య నౌలి, దక్షిణ నౌలి, వామ నౌలి వంటి క్రియలు నిపుణుల సాయంతో చేయవచ్చు.

    V. కపాలభాతి, భస్త్రిక క్రియలు కపాలభాతి క్రియ

    1. కపాలభాతి

    దీనికి కపాల శుద్ధి అని అర్థం. యీ క్రియ వల్ల మెదడు చురుగా వుంటుంది. జర్థానం పెరుగుతుంది. నాభి వరకు గాలిని లోపలికి బాగా పీల్చాలి. తరువాత ఆ గాలిని ఫోర్చుగా బయటికి వదలాలి. బయటికి వదిలివేసే గాలికి వత్తిడితో కూడిన గట్టి ఫోర్సు వస్తుందన్నమాట. శక్తిని బట్టి మూడు నాలుగు సార్లు యీ క్రియను చేయవచ్చు. శ్వాస సహజంగా లోనికి వస్తుంది. యీ క్రియ చేయునప్పుడు ముక్కు ద్వారా ధ్వని రావాలి.

    2. భస్త్రిక క్రియ

    భక్రిక కూడా కపాలభాతి వంటి క్రియయేు. భక్రిక క్రియయందు పూరకం, ‘රිසරඡට රිටර්ඤ క్రియలూ ఆపకుండా గట్టిగా వరుసగా చేయాలి. దీని వల్ల గ్యాసు, మలబద్దకం, ఎసిడిటీ తగుతాయి.

    కపాలభాతిలో రేచకం ముఖ్యం. కాని భక్రికలో పూరకం, రేచకం రెండూ ခဲဃမြို့မရွိခံဃ.

    కపాలభాతి, భక్రిక రెండు క్రియల్లోను పొట్టను సాధ్యమైనంత వరకు లోనికి ముడచడం అవసరం. పూరకం చేసూ ఉదరాన్ని ఉబ్చించాలి.

    VI. (తాటక క్రియ

    అ. ఇది కంటికి సంబంధించిన క్రియ. కదలకుండా ఒక చోట కూర్చొని, ఏదేని ఒకానొక వస్తువును తదేకంగా చూసూ వుండాలి, కాగితం మీద ఓం అని వ్రాసిగాని లేక యిష్టమైన ఎగ – 0° చి “బ్నాం వ్రాసిగాని, దాన్నికంటికి రెండడుగల దూరాన, కంటి కి సవూన సాంులో ఎదురుగా వుంచి రెప్పవాల్చకుండా సాధ్యమైనంత వరకు చూసూ వుండాలి.

    ఆ, మైనం వత్తిగాని, దీపం గాని వెలిగించి కంటికి రెండడుగల దూరాన, కంటికి తిన్నగా సమాన స్థాయిలో వుంచి త్రాటక క్రియ చేయవచ్చు.

    ఇ. బొటన ప్రేలిని ఎదురుగా నిలబెట్టి వుంచి దాన్ని తదేకంగా చూసూ కూడా వుండవచ్చు.

    కండ్లలో మంట బయలుదేరినా లేక నీరుకారినా యీ క్రియను ఆపాలి. అప్పడు కండు మూసుకొని మనస్సుతో యీ క్రియను చేయాలి.

    యీ క్రియ పూర్తికాగానే రెండు అరచేతులు కలిపి రుద్ది మూసిన కండ్ల మీద కొద్దిసేపు వుంచాలి. ఆ తరువాత యోగకేంద్రాల్లో లభించు రెండు కంటిశుద్ధి కప్పల్లో పరిశుద్ధమైన నీరు నింపి, ఆ కప్పలను రెండు కండ్ల పై వుంచి నేత్రములు తెరుస మూసూతల యెత్తాలి. తిరిగి తలను క్రిందకు దించి కప్పలు తొలిగించాలి. ఇందువల్ల కండ్ల యందలి భాగములు జలంతో శుద్ధి అవుతాయి. ఈ కండ్ల శుద్ధి క్రియ విడిగా కూడా చేసుకోవచ్చు.

    త్రాటక క్రియవల్ల కంటికి సంబంధించిన జబ్బులు నయమవుతాయి. కంటి చూపు పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మనస్సుకు శాంతి లభిస్తుంది. ఆత్మశక్తి పెరుగుతుంది.


    పూర్వకాలంలో ఈ షట్క్రియలు జనం సహజంగా చేసూ వుండేవారు. కాని యిప్పడు జలం, గాలి, ఆహార పదారాలు పరిశుద్ధంగా లేకపోవడం వల్ల యీ షట్ క్రియల మహత్తు పెరిగిపోయింది. కనుక పరిస్థితిని బట్టి వీటి ప్రయోజనాల్ని సర్వులూ తప్పక పొందాలి.

    శరీర శుద్ధి యొక్క మహత్తును తెలుసుకొని పైన తెలిపిన క్రియల్ని ఆచరించి ప్రతి వారు తమ తమ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అవసరం 

    ధన్యవాదములు 

    మీ నవీన్ నడిమింటి 

    విశాఖపట్నం

    9703706660

    మంగు మచ్చలు,నల్లబొంగు మచ్చలను..తుడిచిపెట్టె అధ్భూతమైన face pack రూపాయి కూడా ఖర్చుపెట్టాల్సిన పనిలేదు###@$మంచి ఆరోగ్య చిట్కాలకు మా పేజీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ...

    ముఖంపై నల్లని మంగు మచ్చలు ఉన్నాయని బాధపడుతున్నారా.అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
          అందమైన ముఖాన్ని అందహీనంగా మార్చే నల్లని మచ్చలనే మంగు మచ్చలని అంటారు. సీతాకోకచిలుక రెక్కలను పోలి ఉండే ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గలపై నుండి ముక్కు వరకూ వ్యాపిస్తాయి. ఇవి ముఖంతో పాటు మెడ, భుజాలు, వీపు వెనుకభాగంలో ఏర్పడే అవకాశం ఉంది. 
     
    కారణాలు
    శరీరతత్వాన్ని బట్టి బొబ్బలు, మొటిమలు వ్యాపించటం.. చర్మానికి తగిలిన గాయాలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు, పుట్టు మచ్చలు మొదలైనవి కారణాలుగా చెప్పవచ్చు. వంశపారంపర్యం గానూ, హార్లోన్లలో సమతుల్యత లోపించడం వల కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను పోగొట్టడానికి మెరుగైన చికిత్స తీసుకోవాలి
         మీరు సహజ మార్గంలో నల్లని మచ్చలను తొలగించుకోవాలి అనుకుంటున్నారా? తెల్లని ఛాయ కలిగిన స్త్రీల అందమైన మొహంలో నల్ల మచ్చలు చాలా స్పష్టంగా ఇబ్బందికరంగా కనిపిస్తాయి. అయితే ముఖం మీద కనిపించే ఈ నల్లని మచ్చలు మీద ప్రభావంతంగా పనిచేసే ఎన్నో రకాల కాస్మొటిక్ ఉత్పత్తులు సులభంగా నేడు లభిస్తున్నాయి. కానీ చాలామంది మార్కెట్ లో లభించే ఈ క్రీములని అధిక మొత్తంలో ఉపయోంచడం వలన చర్మ సమస్యలు ఏర్పడి ఎంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి మీరు కొన్ని గృహ నివారణలు పాటించడం వలన ఎంతో సులభంగా ముఖం మీద నల్లని మచ్చలను తొలగించడానికి చికిత్స చేయవచ్చు. చర్మపు పొరల మీదగా నల్ల మచ్చల వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. కొంతమంది చర్మములో అదనపు మెలానిన్ స్రావాలను కలిగి ఉండటం వలన, మరి కొందరు సూర్య రశ్మిలో ఎక్కువసేపు గడపడం వలన చర్మం ప్రభావితం కాబడినప్పుడు ఇదే సమస్యని పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ ముఖం మీద నల్లని మచ్చలను తొలగించడానికి గొప్ప సహజమైన చిట్కాలను అందిస్తున్నాం. గర్భం దాల్చిన స్త్రీలు అలాగే కొన్ని ప్రత్యేకమైన మందులు వాడుతున్న ప్రజలు కూడా చర్మం మీదగా నల్లని మచ్చలు ఏర్పడి ఇబ్బంది పడుతూ ఉంటారు.

    *👉🏿ముఖం మీద నల్లని మచ్చల చికిత్సకు*

    *1.-నిమ్మకాయ మరియు తేనెలతో ఫేస్ ప్యాక్*

    సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయ పుష్కలమైన విటమిన్ సి మూలకాలను కలిగి తేనెతో అది కలిసినప్పుడు ముఖ చర్మం మీద మొటిమలు, మచ్చలు, కురుపులు వంటి అన్ని రకాల సమస్యలకు అద్భుతమైన నివారిణిగా పనిచేస్తుంది. దీనికోసం మీరు కొన్ని తాజా నిమ్మ చెక్కలను గ్రైండ్ చేసి దానికి ఒక చెంచా తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాసుకోండి. దానిని కాసేపు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోండి. ఈ చిట్కాని రోజు తప్పించి రోజు అనుసరించండి.
    *2.-వేప ఫేస్ ప్యాక్*
    పురాతన ఆయుర్వేదం వేప యొక్క చర్మ సంరక్షిత అద్భుత లక్షణాలను విశదీకరిస్తుంది. వేప ఆకులు ముఖం మీద మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను అధిగమించడానికి ఎంతో గొప్ప ఉపకరణాలు అని చెప్పవచ్చు. దీనికోసం చేతి నిండా తాజా వేప ఆకులని తీసుకుని దానికి చూర్ణం ఏర్పడడానికి సరిపడా రోజ్ వాటర్ కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి ఒక 15 నిముషాలపాటు ఆరనివ్వాలి. ప్యాక్ పూర్తిగా ఎండిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి 
    *3.-ఉసిరికాయ:* విటమిన్ సి పుష్కలంగా కలిగివుండే ఉసిరిని కేశ సంరక్షణ కోసం ఉపయోగించుకోవచ్చు. కొబ్బరినూనెలో ఉసిరికాయలను వేసి తలకు పట్టిస్తే మృదువైన, దట్టమైన కేశాలు మీ సొంతం అవుతాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. 

    *4.-సున్నిపిండి:* సున్నిపిండిని రోజూ స్నానానికి ముందు ముఖానికి పట్టిస్తే చర్మం కాంతివంతం అవుతుంది. అంతేగాకుండా సున్నిపిండి పాల క్రీమ్ కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. 
    *5-ఆలివ్ ఆయిల్:* ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే మొటిమలకు చెక్ పెట్టడంతో పాటు చర్మం పొడిబారకుండా ఉంటుంది.
    *6.-పసుపు :* క్రిములను నాశనం చేసే పసుపును చర్మానికి ఉపయోగించడం ద్వారా అలెర్జీలకు చెక్ పెట్టవచ్చు. 
    *7.-ఆపిల్ :* మొటిమలు, మచ్చలను ఆపిల్ దూరం చేస్తుంది. ఆపిల్ మాస్క్ ద్వారా ఇంకా చర్మం మృదువుగా తయారవుతుంది. ముందుగా ఆపిల్ ముక్కలతో ముఖానికి మసాజ్‌లా చేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ పేస్ట్‌తో ఒక టేబుల్ స్పూన్ బంగాళాదుంప పేస్ట్ చేర్చి ముఖానికి పట్టించాలి. 10 లేదా 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది 
    *8.-కుంకుమ పువ్వు:* మీరు అందంగా తెల్లగా కనిపించాలంటే కుంకుమ పువ్వును వాడాలి. పాలులో కుంకుమపువ్వును చేర్చి ముఖానికి పట్టిస్తే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు, కంటి కింద ఉండే నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చు. 
     *9.-రోజా పువ్వులు:*  తాజా పువ్వులతో తయారు చేసే రోజ్ వాటర్‌ను టోనర్‌గా ఉపయోగించవచ్చు. ఇది జిడ్డుకు చెక్ పెట్టవచ్చు 
    *10.-ముఖము పైన నల్లని మచ్చలు ఏర్పడిన కలబంద గుజ్జు తీసుకొని అందులో తగు మాత్రం పసుపు కలిపి ముఖము నకు రాసి ఒక గంట సమయం వరకు ఆరనిచ్చి తర్వాత ముఖము కడుక్కోవాలి. ఈ విదంగా చేసిన చో ముఖము పై నల్లని మచ్చలు పోయి కాంతి వఁతముగా యుండును .
    *11.-మెడ నల్లగా వున్నా వాళ్ళ కోసం*
    ముల్తానీ మట్టి, వేప, రోజ్ వాటర్ వాడటం వలన నల్లని మచ్చలు తొలగుతాయి. వీటితో ప్యాక్ తయారు చేసి మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి. మొటిమలతో బాధపడే వారికి ఇది ఒక మంచి చిట్కా.
    టాన్ చర్మం కోసం
    ముల్తానీ మట్టి, తేనే, శనగపిండి మరియు దోసకాయ రసం తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇది టాన్ చర్మాన్ని తొలగించుటకు వేసవిలో ఉపయోగపడుతుంది.
    *13.-మంగు మచ్చలు పోవుటకు:-
    సీమబాదంపప్పును నీళ్ళతోఅరగదీసి.మంగు ఉన్నచోట పైన పట్టంచుచుండిన యెడల మంగు మచ్చలు పోవును.

    ధన్యవాదములు 🙏
    మీ నవీన్ నడిమింటి
    విశాఖపట్నం 
    9703706660
           *సభ్యులకు విజ్ఞప్తి*
    ******************
     మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించలి 

    https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

    21, జులై 2020, మంగళవారం

    కొరోనా టైమ్స్ లో ట్రేస్ ఒత్తిడి నివారణ పరిష్కారం మార్గం

    Coronavirus: మానసిక ఒత్తిడిని జయించడం ఎలా..?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

    లాక్‌డౌన్ నిబంధనలు, కరోనా భయంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటక రాలేక.. ఇంట్లోనే ఉండిపోవడంతో ఒత్తిడికి, కుంగుబాటుకు లోనవుతున్నారు.

                     కోవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబళిస్తోంది. కరోనావైరస్ సోకి ఇప్పటి వరకు లక్షా 20 వేల మందికిపైగా మరణించారు. లక్షలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఐతే కరోనా వైరస్‌ గురించి టీవీలో వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానని చూసి చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు.అంతేకాదు లాక్‌డౌన్ నిబంధనలు, కరోనా భయంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటక రాలేక.. ఇంట్లోనే ఉండిపోవడంతో ఒత్తిడికి, కుంగుబాటుకు లోనవుతున్నారు.


      మానసిక ఒత్తిడికి గురైన వారిలో కనిపించే లక్షణాలు:


      ఆందోళనగా కనిపించడం, ఒళ్ళంతా చెమట పట్టడం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, నోరు పొడిబారినట్లు అవడం, గుండెదడ వంటి లక్షణాలతో పాటు మానసిక ఒత్తిడి, అధికంగా ఆందోళన చెందడం, ఏ పనిమీద సరిగా దృష్టి పెట్టలేకపోవడం, ఆసక్తి చూపకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


      పరిష్కార మార్గాలు మానసిక ఒత్తిడికి గురైనపుడు మనకు లభించిన సమయాన్ని సరైన కార్యక్రమాలు ఎంచుకోవడంతో పాటు సానుకూల దృక్పథం గల ఆలోచనలు చేస్త్తూ సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనగా టి‌విలలో మానసిక ఉల్లాసం కలిగించేటువంటి కార్యక్రమాలు చూడడం


      మనిషి ఉల్లాసంగా ఉండడానికి ఈ క్రింది హార్మోన్లు ఎంతగానో ఉపయోగడతాయి. ఈహార్మోన్లు మనందరి శరీరంలో ఉంటాయి. వాటిని ఉత్తేజపరచడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఉల్లాసవంతంగా ఉండవచ్చు. మనలో ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు:


      1. ఎండార్ఫిన్స్ (Endorphins)

      2. డోపామైన్ (Dopamine)

      3. సెరిటోనిన్ (Serotonin)

      4. ఆక్సిటోసిన్ (Oxytocin)


      ఈ నాలుగు హార్మోనుల గురించి  తెలుసుకుంటే  జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోగలం.


      1. ఎండార్ఫిన్స్ (Endorphins):


      - మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ ఎండార్ఫిన్స్ మన శరీరంలో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి.

      - నవ్వడం వలన కూడా ఈ ఎండార్ఫిన్ ఎక్కువగా విడుదల అవుతాయి.

      - ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ, చక్కటి హాస్య భరిత జోకులు చదువుతూ ఉండండి


      2. డోపామైన్ (Dopamine):


      - నిత్య జీవితంలో ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో డోపామైన్ హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం ఆనందంగా ఉంటాము.

      - ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన వంట చేసిన వారిలో డోపామైన్ స్థాయిని మీరు పెంచగలరు

      ఆఫీస్ లో బాస్ మీ పనిని మెచ్చుకుంటే మీలో డోపామైన్ స్థాయి పెరుగుతుంది.

      - అలాగే కొత్త బైక్/కార్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు, కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినపుడు మీరు సంతోషంగా ఉండడానికి కారణం ఈ డోపామైన్ విడుదల కావడమే.



      3. సెరిటోనిన్ (Serotonin):


      - ఇతరులకు సాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్ హార్మోన్ విడుదల అవుతుంది

      - మన స్నేహితులకు ఏదైనా మంచి పని చేసినపుడు మనలో సెరిటోనిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది.

      - ఇందుకు మనం ఏమేమి పనులు చెయ్యవచ్చు?

      - స్నేహితుల ఇళ్ళకు వెడుతూ ఉండడం, మొక్కలు నాటడం, రోడ్ల గుంతలు పూడ్చడం, రక్త దానం, అనాధ సేవ, యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాలు చేయడం.

      - మంచి విషయాలు సోషల్ మీడియాలో, బ్లాగ్స్ లో పోస్ట్ చెయ్యడం

      ఇలా మన సమయాన్ని, మన జ్ఞానాన్ని పంచుతున్నాం కాబట్టి మనలో సెరిటోనిన్ విడుదల అవుతుంది


      4. ఆక్సిటోసిన్ (Oxytocin):

      - మరపురాని సంఘటనలను గుర్తుచేసుకున్నపుడు, అలాగే మీ పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అవుతుంది.


      మానసిక కుంగుబాటుకు గురయినపుడు ఏం చేయాలంటే..?


      - మనిషి మానసికంగా కుంగుబాటుకు గురైనపుడు దాన్ని అధిగమించడంతోపాటు బలంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

      - వ్యాయామాలు చేయడం, ఇంట్లో వారికి పనుల్లో సాయం చేయడం, కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడడం, కుటుంబసభ్యులతో కలసి ఉండడం చేస్తూ ఉండాలి.

      - మరీ ఎక్కువ ఒత్తిడికి గురైనపుడు గదిలో ఒంటరిగా ఉండకూడదు. అలాగే ఇలాంటి సందర్బాలు ఎదురైనపుడు సొంత వైద్యం చేసుకుని ఇబ్బంది పడకుండా అందుబాటులో ఉన్న సరైన వైద్యున్ని సంప్రదించి తగిన సహాయం పొందాల



      ఒత్తిడితో సతమతమౌతున్నారా..? ఇలా చేసి చూడండి


      ఆఫీసుకు వెళ్లిన తర్వాత పని ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి..? ఏం చేయాలని అని కంగారు పడే బదులు.. ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల ఒత్తిడి కొంత వరకు తగ్గుతుంది. వీలైనంత వరకు పనులు వాయిదా వేసుకోకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి.
       

      How To Deal With Depression and stress

      మనం ఎంత ఒత్తిడి తీసుకోకూడదు... ప్రశాంతంగా ఉండాలని భావించినా... పనిలో ఒత్తిడి సర్వసాధారణం. కానీ ఆ ప్రభావం మనపై ఎక్కువగా చూపిస్తేనే అసలు సమస్య మౌదలౌతుంది. మరి ఒత్తిడి ఉన్నా... ఆ ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే ఇలా చేసి చూడాలి అంటున్నారు నిపుణులు. అవేంటో మనమూ తెలుసుకుందామా..

      మీరు పని చేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. చుట్టుపక్కల చెత్త, పనికిరాని కాగితాలు, అవసరం లేని వస్తువులు ఇలా ఏమి ఉన్నా వాటిని అక్కడి నుంచి తీసేయాలి. ఒక్కసారి అలా చేసి చూడండి. మార్పు మీకే కనిపిస్తుంది.

      ఆఫీసుకు వెళ్లిన తర్వాత పని ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి..? ఏం చేయాలని అని కంగారు పడే బదులు.. ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల ఒత్తిడి కొంత వరకు తగ్గుతుంది. వీలైనంత వరకు పనులు వాయిదా వేసుకోకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి.

      ఒక్కోరోజు.. రోజంతా కష్టపడినా చేయాల్సిన పని పూర్తి కాదు. దీంతో ఆ పని పూర్తి చేయాలని కదలకుండా కుర్చుండిపోతాం. దాని వల్ల కూడా ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పనిచేసే స్థలం నుంచి ప్రతి గంట లేదా రెండు గంటలకు ఒకసారి విరామం తీసుకోవాలి.  తర్వాత ఓ పది నిమిషాలు ఆగి మళ్లీ పని మొదలుపెట్టడం మంచిది.

      ఆఫీసు టేబుల్ దగ్గర మీకు నచ్చిన ఫోటోలు, కుటుంబసభ్యుల ఫోటోలు పెట్టుకోండి. ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆ ఫోటోలు చూస్తే... కాస్త రిలీఫ్ దొరుకుతంది. మరీ ఎక్కువ ఒత్తిడి అనిపించినప్పుడు పని చేయవద్దు. ఆ సమయంలో చేస్తే... ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. దీంతో మళ్లీ ఆ పనిని చేయాల్సి ఉంటుంది.  దానికి బదులు కాస్త విశ్రాంతి తీసుకొని తర్వాత పని మొదలుపెట్టడం మంచిది.


      లాక్‌డౌన్‌తో తీవ్ర‌మైన ఒత్తిడికి గుర‌వుతున్నారా..? ఇలా చేయండి..!


      క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల గ‌త 40 రోజుల నుంచీ మ‌నం ఇండ్ల‌లోనే ఉంటున్నాం. కేవ‌లం కుటుంబ స‌భ్యుల‌తో త‌ప్ప ఇత‌రుల‌తో మాట్లాడ‌డం లేదు. బంధువులు, స్నేహితుల‌కు ఫోన్ లేదా వీడియో కాల్స్ చేసినా.. వారు మ‌న ద‌గ్గ‌ర లేర‌న్న బాధ మ‌న‌కు క‌లుగుతోంది. ఇక ఉద్యోగుల‌కు అయితే త‌మ జాబ్ పోతుందేమోన‌న్న భ‌యం.. నెల తిరిగే స‌రికి జీతం ఎలా..? ఈఎంఐలు, బిల్లు చెల్లింపులు ఎలా చేయాల‌న్న బెంగ కలుగుతోంది. మ‌రోవైపు క‌రోనా మ‌హ‌మ్మారి మ‌న‌కు సోకితే ఎలా..? ఇంట్లో చిన్న పిల్ల‌లు, వృద్ధులు ఉంటే.. వారు క‌రోనా బారిన ప‌డే వారిని ఎలా కాపాడుకోవాలి..? అన్న భ‌యం చాలా మందికి క‌లుగుతోంది. ఇలాంటి ఎన్నో భ‌యాలు, ఆందోళ‌న‌ల న‌డుమ స‌గ‌టు జీవి నిత్యం తీవ్ర‌మైన ఒత్తిడికి గుర‌వుతున్నాడు. అయితే కింద తెలిపిన పలు సూచ‌న‌లు పాటిస్తే.. లాక్‌డౌన్ వ‌ల్ల మ‌నకు ఎదుర‌వుతున్న ఒత్తిడి నుంచి చాలా సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే…

      feeling corona lock down stress try these tips

      * క‌రోనా బారిన ప‌డ‌కుండా మ‌నం ఇండ్ల‌లోనే క్వారంటైన్‌లో ఉంటున్నాం.. క‌నుక భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. అంద‌రికీ ధైర్యం చెప్పాలి. ఒక వేళ వైర‌స్ వ‌చ్చినా.. వేగంగా స్పందించాలి. వెంట‌నే చికిత్స తీసుకోవాలి. నేడు ఎమ‌ర్జెనీలో ఉన్న క‌రోనా పేషెంట్ల‌ను కూడా బ‌తికిస్తున్నారు. క‌నుక కరోనా వ‌స్తుంద‌నో, వ‌చ్చాక ఎలా.. అనో ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. ఎవ‌రికి వారు ధైర్యం చెప్పుకోవాలి. దీంతో ఒత్తిడి త‌గ్గుతుంది.

      * ఇండ్ల‌లో ఉండే చిన్నారులు, వృద్ధులను ఎట్టిప‌రిస్థితిలోనూ బ‌య‌టకు వెళ్ల‌నీయ‌కూడ‌దు. బ‌య‌టి నుంచి వ‌చ్చే వారు శానిటైజ్ అయ్యాకే ఇండ్ల‌లోకి వెళ్లాలి. దీంతో క‌రోనా చైన్ బ్రేక్ అవుతుంది. ఈ క్ర‌మంలో క‌రోనా సోకుతుందేమోన‌న్న భ‌యం నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు. ఒత్తిడి, ఆందోళ‌న కూడా త‌గ్గుతాయి.

      * నిత్యం 8 గంట‌ల పాటు క‌చ్చితంగా నిద్ర‌పోవాలి. నిద్ర ఎంత ఎక్కువ పోతే.. అంత ఎక్కువ‌గా ఒత్తిడి త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న‌విధానానికి మొద‌టి మెట్టు నిద్ర‌. క‌నుక నిత్యం ఎవ‌రైనా స‌రే.. 8 గంట‌ల పాటు నిద్రించాలి. లాక్‌డౌన్ వ‌ల్ల ఎలాగూ ఇండ్ల‌లోనే ఉంటున్నాం క‌నుక‌.. ఎవ‌రైనా సుల‌భంగా నిత్యం 8 గంట‌ల పాటు నిద్రించ‌వ‌చ్చు. అది ఎలాగూ ఇబ్బంది కాదు.

      * యోగా, మెడిటేష‌న్ వంటివి చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

      * చాలా త‌క్కువ సౌండ్‌తో మీకు ఇష్ట‌మైన సంగీతం విన్నా.. పుస్త‌కాలు చ‌దివినా.. ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో కాసేపు గ‌డిపినా.. లేదా ఇండ్ల‌లో చిన్న పిల్ల‌ల‌తో కాసేపు ఆడుకున్నా.. ఒత్తిడి క్ష‌ణాల్లోనే మ‌టుమాయం అవుతుంది.

      * వంట చేయ‌డం, మొక్క‌ల‌కు నీళ్లు పెట్ట‌డం, కూర‌గాయ‌లు క‌ట్ చేయ‌డం.. వంటి ప‌నులు చేసినా.. ఒత్తిడి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

      * స్విమ్మింగ్‌, సైక్లింగ్‌, ర‌న్నింగ్‌, జాగింగ్, వాకింగ్ వంటివి చేసినా ఒత్తిడి త‌గ్గుతుంది.

      * ఒత్తిడిని త‌గ్గించుకోవాలంటే.. వీలైనంత వ‌ర‌కు జంక్ ఫుడ్‌, ఆయిల్ ఫుడ్‌ను మానేయాలి. అన్ని పోషకాలు క‌లిగిన పౌష్టికాహారాన్ని నిత్యం తీసుకోవాలి. దీంతో ఆందోళ‌న‌, మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.

      ధన్యవాదములు 
      మీ నవీన్ నడిమింటి 
      విశాఖపట్నం 
      9703706660

      *సభ్యులకు విజ్ఞప్తి*
      ******************
      ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.