యోగషట్కర్మలు లేక యోగశుద్ధి క్రియలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


శరీరానికి బాహ్య రూపం ఎంతవున్నదో, అంతర్ స్వరూపం అంతకంటె ఎక్కువగా వున్నది. అంతేగాక అంతర్ స్వరూపం సమస్యల వలయం. శరీర బాహ్య స్వరూపానికి శుద్ధి ఎంత అవసరమో, అంత కంటే అంతర్ స్వరూపానికి శుద్ధి ఎక్కువ అవసరం. అందువల్లనే యోగులు, మునులు శరీరం లోపలి అవయవాల శుద్ధి కోసం యోగ షట్కర్మలు లేక యోగశుద్ధి క్రియలు ప్రతిపాదించారు. వీటివల్ల శరీరంలోపలి మలిన వ్యర్థపదార్యాలు బయటికి వెళ్లిపోతాయి. యీ క్రియల్ని పరగడుపున, ప్రాత:కాలం యోగసనాలు వేసే ముందు గాని లేక తరువాత గాని లేక విడిగా గాని చేయవచ్చు.
యోగశుద్ధి క్రియలు
ఇవి 6 రకాలుగా విభజించ బడ్డాయి.
1. జల, కీర, తైల, ఘృత, సూత్ర, స్వమూత్ర, గోమూత్ర నేతి క్రియలు.
2. జల, వమన, వస్త్ర, దండ, భౌతిక్రియలు
3. వస్తే (ఎనిమా) క్రియ మరియు శంఖ ప్రషాళనం
4. అగ్నిసార, ఉడ్డియాన మరియు నౌలి క్రియలు
5. కపాలభాతి, భక్రిక క్రియలు
6. త్రాటక క్రియలు

నేతి క్రియల వల్ల సామాన్యంగా ముక్కు, నోరు, గొంతు, భౌతిక్రియల వల్ల ఆమాశయం అనగా పొట్ట, వస్తే క్రియల వల్ల మలాశయం, నౌలిక్రియల వల్ల ఉదరం, కపాలభాతి క్రియల వల్ల మస్తిష్కం, తాటక క్రియలవల్ల నేత్రాలు శుద్ధి అవుతాయి. యీ ఆరు క్రియలు సున్నితమైనవి గనుక సాధకులు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

I. నేతి క్రియలు


కాలుష్యంతో బాగా నిండిపోయిన వాయువు వీస్తున్నయీ కాలంలో జలనేతి క్రియ చాలా ముఖ్యమైన యోగశుద్ధి క్రియ.

1) 1. జలనేతి క్రియ

ఒక పర్సెంటు ఉప్ప కలిపిన గోరువెచ్చని నీరు కొమ్ముచెంబులో నింపి దాన్ని చేతుల్లోకి తీసుకోవాలి. కూర్చొని గాని లేక నిలబడి గాని తలను కొంచెం ముందుకు వంచి, కుడివైపుకు కొద్దిగా త్రిప్పాలి. ఎడమ ముక్కు రంధ్రంలో చెంబు కొవ్కు వుంచి నీటిని లోనికి పోనిచ్చి, ఆ నీటిని కుడి ముక్కురంధాన్నుంచి బయటికి వదిలివేయాలి. నోటితో శ్వాస పీల్చాలి. నోటితో వదలాలి. చెంబులో గల నీళ్లు అంుపోయేదాకా అలాగే వుంచాలి. ఇదే విధంగా కుడి ముక్కు రంథాన్నుంచి నీళ్లు లోనికి పోనిచ్చి, ఎడమ ముక్కు రంధాన్నుంచి క్రిందికి వదిలి పేయాలి.

రెండు వైపుల నుంచి యీ క్రియ చేసిన తరువాత రెండు చెవుల్ని రెండు చేతుల బొటన ప్రేళ్లతో మూయాలి. నోటితో గాలి పీల్చి ముక్కు ద్వారా ఫోర్సుగా బయటికి చీదిపేయాలి. అదే విధంగా కుడివైపుకు, ఎడమవైపుకు తలవంచి చీదిపేయాలి. ముక్కు నందలి నీరు పూర్తిగా బయటికి రానంత వరకు అలా చేయాలి. లేని యెడల జలుబు రావచ్చు. ప్రత్యేకించి తయారు చేయబడిన కొమ్ము చెంబులు యోగ కేంద్రాల్లో లభిస్తాయి. యీ శుద్ధి క్రియ రోజూ చేయడం మంచిది.

2) కొమ్ము చెంబులో గాని, గ్లాసులో గాని గోరువెచ్చటి నీటినిపోసి, ఒక్క పర్సెంట్ ఉప్ప కలిపి ఒక నాసికా రంధ్రం ద్వారా లోనికి పీల్చి, గొంతు ద్వారా బయటికి, క్రిందికి వదలాలి. తరువాత రెండవ నాసికారం (ధం ద్వారా కూడా చేయాలి.

ఆ తరువాత రెండు నాసికా రంధాల ద్వారా నీటిని లోనికి పీల్చి నోటి ద్వారా బయటికి వదలాలి. నోటి ద్వారా నీళ్లలోనికి పీల్చి ముక్కు ద్వారా బయటికి వదిలివేయాలి, యీ క్రియలు కొంచెం కఠినమైనవి.


3) జలనా సాపానం
ముక్కు రంధాల ద్వారా లోనికి పీల్చిన నీటిని నోటితో నీరు త్రాగినట్లు తాగడాన్ని నాసాపానం అని అంటారు. నాసాపానం చేసే ముందు జలనేతి క్రియు ద్వారా వంుక్కును శుభ్రం చేయూలి. తరువాత ముక్కు ద్వారా లోనికి పీల్చిన இx నీటిని, నోటి నుంచి బయటికి ఉమ్మివేయాలి. ఆ తరువాతనే నాసాపానం చేయాలి.

2) క్షీరనేతి క్రియ

1) జలనేతి క్రియ వలె ముక్కు రంధాల నుంచి గోరువెచ్చని పాలు కొమ్ముచెంబు ద్వారా లోనికి పోనిచ్చి, బయటికి విసర్జించడాన్ని కీరనేతి క్రియ అని అంటారు.

2) ఏమీ కలపని పాలు గోరువెచ్చగా కాచి, జలనాసాపానం వలె క్షీరనాసాపానం చేయాలి. పాలలో మీగడ వుండకూడదు. పాలు చిక్కగా వుంటే కొద్దిగా నీరు కలిపి పల్చన చేయాలి.

3) స్వమూత్ర – గోమూత్ర నేతి క్రియ

ప్రాతఃకాల సమయంలో విసర్జించు స్వమూత్రమును కొమ్ముచెంబులో పట్టి, జలనేతి క్రియు వలె స్వమూత్ర నేతి క్రియు చేయవచ్చు. అదే విధంగా తాజా గోమూత్రమును పట్టి పై విధంగా చేయవచ్చును.

కీర, స్వమూత్ర, గోమూత్ర నేతి క్రియలు అవసరాన్నిబట్టి చేయవచ్చును.

4) తైల, ఫ్భత నేతి క్రియ

మధ్యాహ్నం గాని లేక రాత్రిగాని వెల్లికల పడుకొని తలను కొంచెం వెనుకకు వంచి గోరువెచ్చని నూనె లేక నేతి చుక్కలు 5 లేక8, ముక్కు రంధ్రంలో పేసి శ్వాసతో లోపలికి పీల్చాలి. విశ్రాంతి తీసుకోవాలి. నువ్వుల నూనె లేక కొబ్బరి నూనె లేక శుద్ధమైన ఘృతము (నెయ్యి)ను యిందుకు వాడాలి. డాలను వాడకూడదు.

5) సూత్ర నేతి క్రియ

i

మధ్యన ముడిపేయని నూలు దారానికి మైనం పూసి, నునుపుచేసి, సూత్ర నేతి శుద్ధి క్రియ చేయాలి. యోగ కేంద్రాల్లో యిట్టి దారం దొరుకుతుంది.

దారానికి బదులు నాల్గవ నెంబరు కేథడర్ (రబ్బరు దారం) కూడా వాడవచ్చు.

రెండిటిలో ఒక దాన్ని కుడి ముక్కు రంధం ద్వారా గొంతు వరకు పోనివ్వాలి. రెండు చూపుడు వేళ్లు గొంతులో పెట్టి, ముక్కులో నుంచి లోనికి వచ్చిన దారం కొసను ప్రేళ్లతో మెల్లిగా పట్టుకొని నోటి నుంచి బయటికి తీసుకురావాలి. ముక్కుబైట వున్న దారం కొసను, నోటి బయటవున్న దారం కొసను రెండు చేతులతో విడివిడిగా పట్టుకొని ముందుకు వెనుకకు పది నుంచి ఇరువది సార్ల వరకు జాగ్రత్తగా మొల్లగా లాగాలి. తరువాత ఆ దారాన్ని నోటి నుంచి మొల్లగా బయటికి తీసివేయాలి.

అదే విధంగా రెండవ ముక్కు రంధాంన్నుంచి దారం కొసను గొంతులోనికి పోనిచ్చి, బయటికి తెచ్చి పైవిధంగా వెనక్కి ముందుకి జాగ్రత్తగా, మొల్లగా లాగాలి.

సూత్రనేతి క్రియు పూర్తికాగానే, ఉప్పకలిపిన గోరు వెచ్చని నీటిని కొద్దిగా గొంతులో ప్రోసుకొని, కొద్దిసేపు గుటగుట, గురగురలాడించి ఆ నీటిని బయటికి విసర్జించాలి. ఆరంభంలో కొద్దిగా 0ుబ్బంది కలిగినా కంగారు పడకూడదు.

జలనేతిక్రియ చేసిన తరువాత సూత్రనేతి క్రియ చేయాలి. సూత్రనేతి క్రియ చేసిన తరువాత తిరిగి జలనేతి క్రియ చేయాలి. దారం గరుకుగా వుంటే రక్తం కొంచెం కారవచ్చు. భయపడకూడదు. అప్పడు కొద్దిసేపు సూత్ర సేతిక్రియను ఆపాలి. సూత్రనేతి క్రియ చేసే ఒక రోజు ముందు ముక్కులో గోరువెచ్చని నూనెగాని లేక నెయ్యి గాని మూడు నాలుగు చుక్కలు తప్పక పేయాలి. ఆరంభంలో నిపుణుల ద్వారా ఈ క్రియ చేయించుకోవాలి. తరువాత తామే చేసుకోవచ్చు.

జలనేతి క్రియను ప్రతిరోజూ చేయవచ్చు. తైల, ఘృత, సూత్రనేతి క్రియ వారానికి ఒక్కసారి చేయాలి. యీ క్రియలు ఒకటి రెండు నిమిషాల్లో పూర్తి అవుతాయి గనుక నియమ బద్ధంగా చేయడం వలన ఎన్నో లాభాలు కలుగుతాయి.

పైన తెలిపిన క్రియలు చేసిన తరువాత జలనేతి క్రియ మళ్లీ చేయాలి. లోపలి నీటిని బయటికి చీదిపేయాలి.

లాభాలు
ముక్కు, నోరు, గొంతు, నేత్రాలు, మస్తిష్కమునకు సంబంధించిన జబ్బులు నయమవుతాయి. చెముడు, చెవుల్లో చీము, రక్తంకారడం, చెవుల్లో ఏమేమో ధ్వనులు వినబడటం, ముక్కు దిబ్బడ, ముక్కులో 2১66 దుర్మాంసం, ముక్కుకు వాసన తెలియకపోవడం, సైనస్, ఆస్తమా, ఎలర్జీ, దగు, జలుబు, కంటిమంట, కండ్ల నుంచి నీరుకారుట, కండు ఎరుపెక్కుట, కండ్లకలక, చత్వారం, మెదడుకు సంబంధించిన జబ్బులు, జర్ణాపకశక్తి తగుట, ధారణాశక్తి తగుట, తలనొప్పి, అర్ధతల నొప్పి, మొదలగు వ్యాధుల తీవ్రత తగుతుంది. గొంతు నుంచి నెత్తి మీద మాడు వరకు గల అవయవాలు శుద్ధి అవుతాయి.

II. ధౌతిక్రియలు

1. జలవమన ధౌతిక్రియ

భౌతి అంటే ఉతుకుట అని అర్థం. యోగ విద్యలో దీన్ని ఉదర శుద్ధి అని అంటారు. ఏనుగుకు జ్వరం వస్తే యీ క్రియ చేస్తుంది. కనుక దీన్ని కుంజల క్రియ లేక గజకరణి క్రియ అని కూడా అంటారు. ఏనుగును చూచి మనిషి నేర్చుకున్న క్రియ యిది. మలవిసర్జన చేస్తున్నప్పడు కూర్చునే విధంగా కూర్చొని ఫిల్టరు చేసిన లేక వడబోసిన గోరువెచ్చని నీరు కొద్దిగా ఉప్ప కలిపి కడుపు నిండా తాగాలి. నీరు త్రాగిన తరువాత నిలబడి పొట్టను, నడుమును అటు యిటు, వెనకకు ముందుకు మరియు గుండంగాను కదిలించాలి. యీ విధంగా కదిలించడం వల్ల పొట్ట యందలి

యాసిడ్, శ్లేష్మము, గ్యాసు రూపంలో వున్న చెడు పదారాలు తాగిన నీటిలో కలిసిపోతాయి. తరువాత ఎడమచేతితో పొట్టను అదిమి పెట్టి, కుడి చేతి రెండు చూపుడు ప్రేళ్లను నోటిలోనికి పోనిచ్చి కొండనాలుకను ఆ వేళ్ల కొసలతో (T కొంచెం కుదిపి కదిలించాలి. ంుJ” విధంగా చేయగానే, ఉదరము నందలి నీటితో బాటు చెడు పదారాలన్నీకక్కు లేక వమనం ద్వారా బయటికి వచ్చి పేస్తాయి.

ఉదరమునందలి నీరు పూర్తిగా బయటికి వెడలునంత వరకు ప్రేళ్లు నోటిలోనే ఉంచాలి. కొద్దిగా నీరు మిగిలితే అది మూత్ర రూపంలో బయటికి వెళ్లిపోతుంది.

వ్రేళ్లకు గోళ్లు పెరిగి ఉండకూడదు. రక్తపుపోటు వున్నవాళ్లు ఉప్పకు బదులు నిమ్మరసం నీటిలో కలిపి తాగాలి. గుండె జబ్బు, అల్సరు, పొట్టకు సంబంధించిన ఆపరేషను చేయించుకున్న వాళ్లు మరియు గర్భిణీ స్త్రీలు యీ క్రియ చేయకూడదు.

ఈ క్రియ చేసినప్పడు ఎరుపు రంగు నీరు బయటికి రావచ్చు. అది రక్తం కాదు. యీ క్రియ చేసిన తరువాత గోరువెచ్చని పాలుగాని లేక ఆరోగ్యావృతం గాని తాగాలి. కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవాలి, క్రియ చేసిన వెంటనే మిర్చి మసాలా పదారాలు, అంటే పకోడీలు, మిరపకాయ బజ్జీలు వగైరా తినకూడదు. వనాంసాహారం తినకూడదు. వారానికి ఒక్కసారి తప్పక యీ క్రియ చేయాలి. అవసరాన్ని బట్టి రోజూ వరుసగా రెండు మూడు రోజులు యీ క్రియ చేయవచ్చు.
లాభాలు :
ఆవూశయం శుభ్ర పడుతుంది. గ్యాసు, అజీర్ణం, కడుపులో వుంట, తలనొప్పి, శరీరం బరువు తగ్గిపోతాయి. ప్రతిరోజూ చేస్తే పచ్చకామెర్ల వ్యాధిరాదు. శ్వాసప్రశ్వాసలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి.

2. వస్త్ర, ధౌతి క్రియ

మూడు అంగుళాల వెడల్పు ఏడు మీటర్ల పొడవు గల పల్చని మల్లగుడ్డను కొద్దిగా ఉప్ప కలిపిన గోరువెచ్చని నీటిలో తడిపి మెల్లమెల్లగా లోపలికి మింగాలి. తరువాత దాన్ని బయటికి తీయాలి. దీన్నే వస్త్రధౌతి క్రియ అని అంటారు. నిపుణుల సాయంతో యీ క్రియను జాగ్రత్తగా చేయాలి. పాలలోగాని, తేనెలో గాని తడిపి కూడా గుడ్డను మింగవచ్చు. మొదటి రోజున ఒక్క అడుగు పేలికను మాత్రమే మింగాలి. 8 లేక 10 రోజుల్లో అభ్యాసం అవుతుంది. యీ క్రియను 10, 15 నిమిషాలు మాత్రమే చేయాలి. మింగిన బట్టను మెల్లగా బయటకి తీయాలి. బట్టను పూర్తిగా మింగివేయకూడదు. పేలిక కొసలు బయటకు వుండటం అవసరం. అవసరం అనుకుంటే బయటి కొసను ప్రేలికి ముడిపేసుకోవడం మంచిది. ఆ విధంగా చేస్తే ఆ పేలిక కొసను పటుకొని మెల్లగా జాగ్రత్తగా పేలికను బయటికి లాగవచ్చు.

వస్త్ర భౌతి క్రియ చేసిన తరువాత తిరిగి జలభౌతి క్రియ చేయాలి.

ఈ క్రియ పూర్తికాగానే గోరువెచ్చని పాలు తాగాలి. ఆ రోజున ఆహారం తేలికగా తీసుకోవాలి.

ఏడు రోజుల పాటు వరుసగా జలభౌతి క్రియ చేసిన తరువాతనే వస్త్ర భౌతిక్రియ చేయాలి.

ఈ క్రియ వల్ల దగు, కఫం, ఆస్తమా, గ్యాసు మొదలగు ఉదర వ్యాధులు తలనొప్పి, జ్వరం, గట్టి, ఏనుగు గట్టి తదితర చర్మవ్యాధులు, కుష్క మొదలగు రోగాలు నయమవుతాయి. జఠరాగ్నిపెరుగుతుంది. యోగులు, మునులు, కర్ర ముక్క కూడా ప్రిమింగి భౌతిక్రియ చేసే వారు, యీ క్రియను దండధౌతి క్రియ అని అంటారు. యిప్పడు యీ క్రియ చేసే వాళ్లు తగ్గిపోయారు.


III. 3. వస్తే (ఎనీమా) క్రియ


వులరంధం ద్వారా నీటిని పొత్తికడుపులో నింపి కొద్దిసేపు ఆ నీటిని పొత్తికడుపులో వుంచి, చేతులతో పొత్తికడుపు నిమిరి, తరువాత ఆ నీటిని మలంతో బాటు విసర్జించడాన్ని వస్తిక్రియ అని అంటారు. ప్రాచీన కాలంలో తొట్టెలో గాని, నదిలోగాని, చెరువులో గాని కూర్చొని సాధకులు, వులరంధాన్నుంచి నీటిని పొత్తికడుపులోకి పీల్చేవారు. యిందుకు మన:శక్తి ఉపయోగపడేది. వస్తిక్రియ పరిశోధకులు శంఖ ప్రషాళన క్రియ అను శుద్ధి క్రియను కూడా యిందు చేర్చారు. దాని వివరం వేరే అధ్యాయంలో వివరించాము. ఈ క్రియ చేయగలిగిన వారు యిప్పడు బహు కొద్దిగా ఉన్నారు. అందువల్ల యీ క్రియను ఎనిమా సాయంతో సులభం చేయడం జరిగింది.

గోరువెచ్చని నీటిలో, కొద్దిగా నిమ్మరసం గాని, ఉప్పగాని, త్రిఫల చూర్ణం గానికలిపి, ఆ నీటిని ఎనిమా డబ్బాలో పోసి రబ్బరు గొట్టం ద్వారా మలరంధాన్నుంచి పొత్తికడుపులోకి పటాలి. తరువాత కాసేపు ఆగి ఆ నీటిని పొత్తికడుపు నుంచి మలరంధ్రం ద్వారా బయటికి విసర్జించాలి. ఆ నీటితో బాటు మలం, ශ්‍රීකුට, تهيئة عن బయటికి వెళ్లిపోతాయి. ఎనిమా వల్ల పెద్ద పేగు శుభ్రపడుతుంది. అజీర్ణం తగ్గి ఆకలి పెరుగుతుంది. పరగడుపున యీ ఎనిమా క్రియ చేయాలి. నెలకు ఒక్క సారి లేక అవసరమైనప్పడు యీ క్రియ చేయవచ్చు. ఎనిమా చేసుకున్న తరువాత సాధకుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. తరువాత తేలికగా ఆహారం తీసుకోవచ్చు.

IV. నొలిక్రియలు

వాయువుకు సంబంధించినవి నౌలి(క్రియలు. పూరకం, కుంభకం, రేచకం అను మూడు యీ క్రియల యందు ప్రాధాన్యం వహిస్తాయి. యివి మూడు విధాలు
(1) అగ్నిసార క్రియ (2) ఉడ్డియాన క్రియ (జి) నౌలిక్రియ.

1. అగ్నిసార క్రియ

మంచిబట్టగాని, తివాచీగాని, కంబళీగాని క్రిందపరచి, దాని మీద వజ్రాసనం వేసి కూర్చొని పూరకం చేయాలి. అంటే గాలిని లోనికి పీల్చాలి. ఆ తరువాత రేచకం చేయాలి. అంటే గాలిని బయటికి వదిలివేయాలి. సాధ్యమైనంతగా పొట్టను అణచి, లోనికి ముడిచి సాధ్యమైనంతసేపు అలానే ఉంచాలి. ఇది ఒక చక్రం అనగా రౌండు అన్నమాట. ఇట్టి రౌండ్లను మూడు నాలుగు సార్లు చేయవచ్చు.

ఈ అగ్నిసార క్రియను నిలబడి కూడా అదే విధంగా చేయవచ్చు.

2. ఉడ్డియాన క్రియ

సుఖాసనం లేక పద్మాసనంవేసి పూరకం చేయాలి. తరువాత రేచకం, కుంభకం చేయూలి. పొట్టను వీపులోపలి భాగానికి అంటుకునేలా లోనికి ముడచాలి. కొద్దిసేపు ఆగి శ్వాస తీసుకోవాలి. యీ క్రియను నిలబడి కూడా చేయవచ్చు.

3. నొలిక్రియ

అగ్నిసారక్రియ, ఉడ్డియాన క్రియు చేయడం అభ్యసించిన తరువాత నౌలి క్రియ చేయవచ్చు. యీ క్రియలో పొట్ట మధ్యభాగాన్ని కడ్డీలా చేయడం ముఖ్యం. సాధకుడు నిలబడి, రెండుచేతుల్ని రెండు తొడల మీద వుంచి, పూరకం చేసూ, గాలినిలోనికి పీల్చాలి. రేచకం చేసూ గాలిని బయటికి వదలాలి. పొట్టను వీపుకు అంటుకొనేలా లోనికి ముడచాలి. అయితే పొట్ట మధ్యభాగాన్ని కడ్డీలా చేసి వుంచాలి. తరువాత రెండు తొడల మీద గల ఒక్కొక్క చేతిని ఎత్తుతూ, కడ్డీగా వున్న పొట్ట యందలి భాగాన్ని అటు ఇటు కదపాలి.

ఉదయం మలమూత్ర విసర్జన చేసిన తరువాత పరగడుపున నౌలి(క్రియ చేయాలి. భోజనం చేసిన తరువాత నౌలిక్రియ చేయకూడదు. 14 సంవత్సరాల లోపువారు, జబ్బుపడిన వారు, రక్తపువోటు ఎక్కువగా వున్నవారు, అల్సరుతోను, హెర్నియాతోను బాధపడేవారు నౌలి క్రియ చేయకూడదు.

నౌలిక్రియలవల్ల లివరు మరియు ఉదర సంబంధమైన జబ్బులు నయమవుతాయి. ఆకలి పెరుగుతుంది. వీర్య దోషాలు పోతాయి.

నౌలిక్రియల్లో మధ్య నౌలి, దక్షిణ నౌలి, వామ నౌలి వంటి క్రియలు నిపుణుల సాయంతో చేయవచ్చు.

V. కపాలభాతి, భస్త్రిక క్రియలు కపాలభాతి క్రియ

1. కపాలభాతి

దీనికి కపాల శుద్ధి అని అర్థం. యీ క్రియ వల్ల మెదడు చురుగా వుంటుంది. జర్థానం పెరుగుతుంది. నాభి వరకు గాలిని లోపలికి బాగా పీల్చాలి. తరువాత ఆ గాలిని ఫోర్చుగా బయటికి వదలాలి. బయటికి వదిలివేసే గాలికి వత్తిడితో కూడిన గట్టి ఫోర్సు వస్తుందన్నమాట. శక్తిని బట్టి మూడు నాలుగు సార్లు యీ క్రియను చేయవచ్చు. శ్వాస సహజంగా లోనికి వస్తుంది. యీ క్రియ చేయునప్పుడు ముక్కు ద్వారా ధ్వని రావాలి.

2. భస్త్రిక క్రియ

భక్రిక కూడా కపాలభాతి వంటి క్రియయేు. భక్రిక క్రియయందు పూరకం, ‘රිසරඡට රිටර්ඤ క్రియలూ ఆపకుండా గట్టిగా వరుసగా చేయాలి. దీని వల్ల గ్యాసు, మలబద్దకం, ఎసిడిటీ తగుతాయి.

కపాలభాతిలో రేచకం ముఖ్యం. కాని భక్రికలో పూరకం, రేచకం రెండూ ခဲဃမြို့မရွိခံဃ.

కపాలభాతి, భక్రిక రెండు క్రియల్లోను పొట్టను సాధ్యమైనంత వరకు లోనికి ముడచడం అవసరం. పూరకం చేసూ ఉదరాన్ని ఉబ్చించాలి.

VI. (తాటక క్రియ

అ. ఇది కంటికి సంబంధించిన క్రియ. కదలకుండా ఒక చోట కూర్చొని, ఏదేని ఒకానొక వస్తువును తదేకంగా చూసూ వుండాలి, కాగితం మీద ఓం అని వ్రాసిగాని లేక యిష్టమైన ఎగ – 0° చి “బ్నాం వ్రాసిగాని, దాన్నికంటికి రెండడుగల దూరాన, కంటి కి సవూన సాంులో ఎదురుగా వుంచి రెప్పవాల్చకుండా సాధ్యమైనంత వరకు చూసూ వుండాలి.

ఆ, మైనం వత్తిగాని, దీపం గాని వెలిగించి కంటికి రెండడుగల దూరాన, కంటికి తిన్నగా సమాన స్థాయిలో వుంచి త్రాటక క్రియ చేయవచ్చు.

ఇ. బొటన ప్రేలిని ఎదురుగా నిలబెట్టి వుంచి దాన్ని తదేకంగా చూసూ కూడా వుండవచ్చు.

కండ్లలో మంట బయలుదేరినా లేక నీరుకారినా యీ క్రియను ఆపాలి. అప్పడు కండు మూసుకొని మనస్సుతో యీ క్రియను చేయాలి.

యీ క్రియ పూర్తికాగానే రెండు అరచేతులు కలిపి రుద్ది మూసిన కండ్ల మీద కొద్దిసేపు వుంచాలి. ఆ తరువాత యోగకేంద్రాల్లో లభించు రెండు కంటిశుద్ధి కప్పల్లో పరిశుద్ధమైన నీరు నింపి, ఆ కప్పలను రెండు కండ్ల పై వుంచి నేత్రములు తెరుస మూసూతల యెత్తాలి. తిరిగి తలను క్రిందకు దించి కప్పలు తొలిగించాలి. ఇందువల్ల కండ్ల యందలి భాగములు జలంతో శుద్ధి అవుతాయి. ఈ కండ్ల శుద్ధి క్రియ విడిగా కూడా చేసుకోవచ్చు.

త్రాటక క్రియవల్ల కంటికి సంబంధించిన జబ్బులు నయమవుతాయి. కంటి చూపు పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మనస్సుకు శాంతి లభిస్తుంది. ఆత్మశక్తి పెరుగుతుంది.


పూర్వకాలంలో ఈ షట్క్రియలు జనం సహజంగా చేసూ వుండేవారు. కాని యిప్పడు జలం, గాలి, ఆహార పదారాలు పరిశుద్ధంగా లేకపోవడం వల్ల యీ షట్ క్రియల మహత్తు పెరిగిపోయింది. కనుక పరిస్థితిని బట్టి వీటి ప్రయోజనాల్ని సర్వులూ తప్పక పొందాలి.

శరీర శుద్ధి యొక్క మహత్తును తెలుసుకొని పైన తెలిపిన క్రియల్ని ఆచరించి ప్రతి వారు తమ తమ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అవసరం 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం

9703706660