కరోనాకు ఆయుర్వేద మందులు.. నవీన్ నడిమింటి సలహాలు 

 ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వ్యాక్సిన్​పై దృష్టి పెట్టింది. చాలా కంపెనీలు దానిపై పనిచేస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్ల ట్రయల్స్​ కూడా మొదలయ్యాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద మందులపైనా ఫోకస్​ పెట్టింది. వాటితో కరోనాకు చెక్​ పెట్టొచ్చా అన్న కోణంలో పరీక్షలు చేయడానికి రెడీ అయింది. ఓ ఐదు మందులపై ట్రయల్స్​ చేసేందుకు కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్​ అండ్​ రీసెర్చ్​ (సీఎస్​ఐఆర్​)తో జట్టు కట్టింది. అశ్వగంధ, తిప్పతీగ (గుడిచి), యస్తిమధు, పీప్లి అనే నాలుగు ఆయుర్వేద మూలికలతో పాటు ఇప్పటికే తయారు చేసిన ‘ఆయుష్​64’ అనే మందుపై ట్రయల్స్​ చేయనుంది.

50 లక్షల మంది మీద ట్రయల్స్​

మొదటి దశలో ఆరోగ్య సేతు యాప్​ గుర్తించిన రిస్క్​ ఎక్కువున్న జోన్లలోని హెల్త్​వర్కర్లపై కేంద్రం ఈ ట్రయల్స్​ మొదలుపెట్టనుంది. అంతేగాకుండా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్​, పుణే సిటీల్లోని 50 లక్షల మందిపై ట్రయల్స్​ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు కరోనా రాకుండా అడ్డుకునే ఆయుర్వేద మందులపైనా స్టడీ చేయనుంది. కరోనా పేషెంట్లకు తొలి దశలో అశ్వగంధను ఇవ్వనున్నారు. ఆ తర్వాత పేషెంట్​కు ఉండే లక్షణాల తీవ్రత, రోగి శరీరం స్పందించే తీరుకు తగ్గట్టు ఇతర మందులనూ ఇస్తారు.

పిప్పలి: ఘాటుగా ఉండే ఇది శ్వాస ఇన్​ఫెక్షన్లు, బ్రాంకైటిస్​, సర్ది, దగ్గు, ఆస్తమా వంటి వాటికి మంచి మందుగా పనిచేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను బాగు చేస్తుంది. ఇమ్యూనిటీని మరింత శక్తిమంతం చేస్తుంది. నొప్పులనూ తగ్గిస్తుంది. వాతానికి పనిచేస్తుంది.

అశ్వగంధ: నేటి కాలంలో దీనిని సూపర్​ఫుడ్​గా చెబుతుంటారు. సర్ది, దగ్గు, ఇతర క్రిముల ఇన్​ఫెక్షన్​ నుంచి శరీరానికి రక్షణగా ఉంటుందీ ఆయుర్వేద మూలిక. సహజంగా మనకు ఇమ్యూనిటీ పెరగాలంటే రోజూ దానిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్​ ఇన్​ఫెక్షన్లతో వచ్చే ఒత్తిడి, అలసట వంటి వాటినీ ఇది తగ్గిస్తుందట. గుండెకూ మంచి చేస్తుంది.

తిప్పతీగ: దీన్ని మరణం లేని ఆయుర్వేద మూలిక అని పిలుస్తుంటారు. నొప్పులు, కేన్సర్​, జ్వరానికి ఇది మంచి మందుగా పనిచేస్తుంది. అంతేగాకుండా ఒంట్లో విష పదార్థాలు లేకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్​గానూ, ఇమ్యూనిటీని పెంచే మందుగానూ పనిచేస్తుంది. శ్వాస, జీర్ణ సంబంధ సమస్యలకూ ఇది బెటర్​ అని నిపుణులు చెబుతున్నారు.

ఆయుష్​64: కేంద్ర ప్రభుత్వం ఈ మందును ప్రతిష్టాత్మకంగా తయారు చేయించింది. చాలా ఆయుర్వేద మూలికలన్నింటినీ కలిపి తయారైన మందు ఇది. మలేరియాను తగ్గించడంలో ఈ మందు బాగా పనిచేస్తున్నట్టు తేలింది. ప్రస్తుతం కరోనా పేషెంట్లకు క్లోరోక్విన్​ మందునూ ఇస్తుండడంతో దీనినీ ట్రయల్స్​ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

యస్తిమధు: ములేతి, లిక్కరైస్​ అని పిలిచే తియ్యటి మూలిక ఇది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వాటికి మంచి ఔషధమిది. నొప్పులు, వాతం రాకుండా చూస్తుంది. గొంతు చికాకును తప్పిస్తుంది. పుండ్లు తగ్గించే గుణాలపైనా స్టడీస్​ జరుగుతున్నాయి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.