Coronavirus: మానసిక ఒత్తిడిని జయించడం ఎలా..?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
లాక్‌డౌన్ నిబంధనలు, కరోనా భయంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటక రాలేక.. ఇంట్లోనే ఉండిపోవడంతో ఒత్తిడికి, కుంగుబాటుకు లోనవుతున్నారు.
కోవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబళిస్తోంది. కరోనావైరస్ సోకి ఇప్పటి వరకు లక్షా 20 వేల మందికిపైగా మరణించారు. లక్షలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఐతే కరోనా వైరస్ గురించి టీవీలో వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానని చూసి చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు.అంతేకాదు లాక్‌డౌన్ నిబంధనలు, కరోనా భయంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటక రాలేక.. ఇంట్లోనే ఉండిపోవడంతో ఒత్తిడికి, కుంగుబాటుకు లోనవుతున్నారు.
మానసిక ఒత్తిడికి గురైన వారిలో కనిపించే లక్షణాలు:
పరిష్కార మార్గాలు మానసిక ఒత్తిడికి గురైనపుడు మనకు లభించిన సమయాన్ని సరైన కార్యక్రమాలు ఎంచుకోవడంతో పాటు సానుకూల దృక్పథం గల ఆలోచనలు చేస్త్తూ సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనగా టివిలలో మానసిక ఉల్లాసం కలిగించేటువంటి కార్యక్రమాలు చూడడం
మనిషి ఉల్లాసంగా ఉండడానికి ఈ క్రింది హార్మోన్లు ఎంతగానో ఉపయోగడతాయి. ఈహార్మోన్లు మనందరి శరీరంలో ఉంటాయి. వాటిని ఉత్తేజపరచడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఉల్లాసవంతంగా ఉండవచ్చు. మనలో ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు:
1. ఎండార్ఫిన్స్ (Endorphins)
2. డోపామైన్ (Dopamine)
3. సెరిటోనిన్ (Serotonin)
4. ఆక్సిటోసిన్ (Oxytocin)
ఈ నాలుగు హార్మోనుల గురించి తెలుసుకుంటే జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోగలం.
1. ఎండార్ఫిన్స్ (Endorphins):
- మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ ఎండార్ఫిన్స్ మన శరీరంలో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి.
- నవ్వడం వలన కూడా ఈ ఎండార్ఫిన్ ఎక్కువగా విడుదల అవుతాయి.
- ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ, చక్కటి హాస్య భరిత జోకులు చదువుతూ ఉండండి
2. డోపామైన్ (Dopamine):
- నిత్య జీవితంలో ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో డోపామైన్ హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం ఆనందంగా ఉంటాము.
- ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన వంట చేసిన వారిలో డోపామైన్ స్థాయిని మీరు పెంచగలరు
ఆఫీస్ లో బాస్ మీ పనిని మెచ్చుకుంటే మీలో డోపామైన్ స్థాయి పెరుగుతుంది.
- అలాగే కొత్త బైక్/కార్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు, కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినపుడు మీరు సంతోషంగా ఉండడానికి కారణం ఈ డోపామైన్ విడుదల కావడమే.
3. సెరిటోనిన్ (Serotonin):
- ఇతరులకు సాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్ హార్మోన్ విడుదల అవుతుంది
- మన స్నేహితులకు ఏదైనా మంచి పని చేసినపుడు మనలో సెరిటోనిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది.
- ఇందుకు మనం ఏమేమి పనులు చెయ్యవచ్చు?
- స్నేహితుల ఇళ్ళకు వెడుతూ ఉండడం, మొక్కలు నాటడం, రోడ్ల గుంతలు పూడ్చడం, రక్త దానం, అనాధ సేవ, యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాలు చేయడం.
- మంచి విషయాలు సోషల్ మీడియాలో, బ్లాగ్స్ లో పోస్ట్ చెయ్యడం
ఇలా మన సమయాన్ని, మన జ్ఞానాన్ని పంచుతున్నాం కాబట్టి మనలో సెరిటోనిన్ విడుదల అవుతుంది
4. ఆక్సిటోసిన్ (Oxytocin):
- మరపురాని సంఘటనలను గుర్తుచేసుకున్నపుడు, అలాగే మీ పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అవుతుంది.
మానసిక కుంగుబాటుకు గురయినపుడు ఏం చేయాలంటే..?
- మనిషి మానసికంగా కుంగుబాటుకు గురైనపుడు దాన్ని అధిగమించడంతోపాటు బలంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
- వ్యాయామాలు చేయడం, ఇంట్లో వారికి పనుల్లో సాయం చేయడం, కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడడం, కుటుంబసభ్యులతో కలసి ఉండడం చేస్తూ ఉండాలి.
- మరీ ఎక్కువ ఒత్తిడికి గురైనపుడు గదిలో ఒంటరిగా ఉండకూడదు. అలాగే ఇలాంటి సందర్బాలు ఎదురైనపుడు సొంత వైద్యం చేసుకుని ఇబ్బంది పడకుండా అందుబాటులో ఉన్న సరైన వైద్యున్ని సంప్రదించి తగిన సహాయం పొందాల
ఆఫీసుకు వెళ్లిన తర్వాత పని ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి..? ఏం చేయాలని అని కంగారు పడే బదులు.. ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల ఒత్తిడి కొంత వరకు తగ్గుతుంది. వీలైనంత వరకు పనులు వాయిదా వేసుకోకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి.
మనం ఎంత ఒత్తిడి తీసుకోకూడదు... ప్రశాంతంగా ఉండాలని భావించినా... పనిలో ఒత్తిడి సర్వసాధారణం. కానీ ఆ ప్రభావం మనపై ఎక్కువగా చూపిస్తేనే అసలు సమస్య మౌదలౌతుంది. మరి ఒత్తిడి ఉన్నా... ఆ ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే ఇలా చేసి చూడాలి అంటున్నారు నిపుణులు. అవేంటో మనమూ తెలుసుకుందామా..
మీరు పని చేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. చుట్టుపక్కల చెత్త, పనికిరాని కాగితాలు, అవసరం లేని వస్తువులు ఇలా ఏమి ఉన్నా వాటిని అక్కడి నుంచి తీసేయాలి. ఒక్కసారి అలా చేసి చూడండి. మార్పు మీకే కనిపిస్తుంది.
ఆఫీసుకు వెళ్లిన తర్వాత పని ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి..? ఏం చేయాలని అని కంగారు పడే బదులు.. ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల ఒత్తిడి కొంత వరకు తగ్గుతుంది. వీలైనంత వరకు పనులు వాయిదా వేసుకోకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి.
ఒక్కోరోజు.. రోజంతా కష్టపడినా చేయాల్సిన పని పూర్తి కాదు. దీంతో ఆ పని పూర్తి చేయాలని కదలకుండా కుర్చుండిపోతాం. దాని వల్ల కూడా ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పనిచేసే స్థలం నుంచి ప్రతి గంట లేదా రెండు గంటలకు ఒకసారి విరామం తీసుకోవాలి. తర్వాత ఓ పది నిమిషాలు ఆగి మళ్లీ పని మొదలుపెట్టడం మంచిది.
ఆఫీసు టేబుల్ దగ్గర మీకు నచ్చిన ఫోటోలు, కుటుంబసభ్యుల ఫోటోలు పెట్టుకోండి. ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆ ఫోటోలు చూస్తే... కాస్త రిలీఫ్ దొరుకుతంది. మరీ ఎక్కువ ఒత్తిడి అనిపించినప్పుడు పని చేయవద్దు. ఆ సమయంలో చేస్తే... ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. దీంతో మళ్లీ ఆ పనిని చేయాల్సి ఉంటుంది. దానికి బదులు కాస్త విశ్రాంతి తీసుకొని తర్వాత పని మొదలుపెట్టడం మంచిది.
లాక్‌డౌన్‌తో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారా..? ఇలా చేయండి..!
* కరోనా బారిన పడకుండా మనం ఇండ్లలోనే క్వారంటైన్‌లో ఉంటున్నాం.. కనుక భయపడాల్సిన పనిలేదు. అందరికీ ధైర్యం చెప్పాలి. ఒక వేళ వైరస్ వచ్చినా.. వేగంగా స్పందించాలి. వెంటనే చికిత్స తీసుకోవాలి. నేడు ఎమర్జెనీలో ఉన్న కరోనా పేషెంట్లను కూడా బతికిస్తున్నారు. కనుక కరోనా వస్తుందనో, వచ్చాక ఎలా.. అనో ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎవరికి వారు ధైర్యం చెప్పుకోవాలి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.
* ఇండ్లలో ఉండే చిన్నారులు, వృద్ధులను ఎట్టిపరిస్థితిలోనూ బయటకు వెళ్లనీయకూడదు. బయటి నుంచి వచ్చే వారు శానిటైజ్ అయ్యాకే ఇండ్లలోకి వెళ్లాలి. దీంతో కరోనా చైన్ బ్రేక్ అవుతుంది. ఈ క్రమంలో కరోనా సోకుతుందేమోనన్న భయం నుంచి బయట పడవచ్చు. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.
* నిత్యం 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలి. నిద్ర ఎంత ఎక్కువ పోతే.. అంత ఎక్కువగా ఒత్తిడి తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన జీవనవిధానానికి మొదటి మెట్టు నిద్ర. కనుక నిత్యం ఎవరైనా సరే.. 8 గంటల పాటు నిద్రించాలి. లాక్‌డౌన్ వల్ల ఎలాగూ ఇండ్లలోనే ఉంటున్నాం కనుక.. ఎవరైనా సులభంగా నిత్యం 8 గంటల పాటు నిద్రించవచ్చు. అది ఎలాగూ ఇబ్బంది కాదు.* యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు.
* చాలా తక్కువ సౌండ్‌తో మీకు ఇష్టమైన సంగీతం విన్నా.. పుస్తకాలు చదివినా.. పచ్చని ప్రకృతిలో కాసేపు గడిపినా.. లేదా ఇండ్లలో చిన్న పిల్లలతో కాసేపు ఆడుకున్నా.. ఒత్తిడి క్షణాల్లోనే మటుమాయం అవుతుంది.
* వంట చేయడం, మొక్కలకు నీళ్లు పెట్టడం, కూరగాయలు కట్ చేయడం.. వంటి పనులు చేసినా.. ఒత్తిడి నుంచి తప్పించుకోవచ్చు.
* స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్, జాగింగ్, వాకింగ్ వంటివి చేసినా ఒత్తిడి తగ్గుతుంది.
* ఒత్తిడిని తగ్గించుకోవాలంటే.. వీలైనంత వరకు జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్‌ను మానేయాలి. అన్ని పోషకాలు కలిగిన పౌష్టికాహారాన్ని నిత్యం తీసుకోవాలి. దీంతో ఆందోళన, మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి