✍నెగిటివ్ మైండ్ ఆలోచన నుండి పాజిటివ్ లైఫ్ లో ఉండాలి అంటే నవీన్ నడిమింటి సలహాలు
https://m.facebook.com/story.php?story_fbid=2337284613203077&id=1536735689924644
పాజిటవ్ ఆలోచనలతో శక్తివంతులం అవుతాం.. నెగటివ్ థాట్స్ తో శక్తిహీనులం అవుతాం. ఏది పాVvజిటివ్, ఏది నెగటివ్ అన్న కొద్దిపాటి విచక్షణ ఉంటే చాలు..లైఫ్ అద్భుతంగా ఉంటుంది.
లైఫ్‌లో ఎప్పుడూ రెండు రకాల పనులు, ఆలోచనలు ఉంటాయి..
1. జీవితం పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేవి, జీవితాన్ని డైనమిక్‌గా ఉంచేవీ, నిరంతరం ఉత్సాహంగా ఉంచేవీ!
2. జీవితం పట్ల విరక్తి కలిగించేవీ.. జీవితం పట్ల నెగిటివ్ దృక్పధాన్ని కలిగి ఉన్నవీ... ఈసురోమంటూ బ్రతికేవీ!!
ఈ రెండింటిలో అధికశాతం నువ్వు వేటిని ఎంటర్‌టైన్ చేస్తున్నావన్నదీ, వేటిలో బ్రతుకుతున్నావన్నదీ, వేటిని ఇష్టపడుతున్నావన్నదీ... నీ పర్‌ఫెక్ట్ "డెఫినిషన్". అంటే ఫలానా నల్లమోతు శ్రీధర్ ఏంటి అని ఎవరైనా డిఫైన్ చెయ్యాల్సి వస్తే పై నా దృక్పధం ఓ బేస్.. అలాగే మీకు కూడా!!
అందరికీ ఒకటే లైఫ్... మహా అయితే కష్టాలూ, సుఖాలూ కాస్త అటూ ఇటూగా మారతాయి, పర్సంటేజ్‌లు మారతాయి.. అంటే ఫార్ములా కొద్దిగా తేడాగా ఉంటుందంతే.. మిగతా అంతా సేమ్ టు సేమ్...
సో లైఫ్‌ని నువ్వెలా చూస్తున్నావన్నది అన్నింటికన్నా అల్టిమేట్ పాయింట్.. డిసైడింగ్ ఫేక్టర్..! లైఫ్‌ని ఎప్పుడూ నీరసంగా, దిగాలుగా, ఏదో కోల్పోయిన వాడిగా చూడకు.. నీ మీద నీకే కాదు.. నీ మీద నీ చుట్టూ ఉన్న వాళ్లకీ చిరాకు వస్తుంది.
కష్టాలు ఎవరికి లేవు..? నువ్వొక్కడివే గ్లోబ్ మొత్తం నీ తలపై మోస్తున్నట్లు ఫీలవుతావెందుకు? ఫస్ట్ ఆ థాట్ ప్రాసెస్ మార్చుకో.. ప్రపంచాన్ని మార్చడం తర్వాత.. నువ్వు మారితే ప్రపంచం ఆటోమేటిక్‌గా మారుతుంది. బయట కన్పిస్తున్నదే ప్రపంచం అని భ్రమపడుతున్నావు.. నీ ఆలోచనలన్నీ ఓ మినీ ప్రపంచం.. అక్కడ మొదలయ్యే నెగిటివ్ థాట్సే ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలో తెలీక బయట ప్రపంచం మీద ఫోకస్ అవుతున్నాయి.
కంఫర్ట్ జోన్ ఎప్పుడూ ఫీలవ్వకు.. నువ్వు రిలాక్స్ అవడానికి మున్ముందు చాలానే లైఫ్ ఉంది. నీలో పెరిగిపోతున్న బద్ధకాన్ని పట్టించుకోపోతే ఈ క్షణం నుండే నీ పతనం మొదలవుతుంది. లే.. తలకు పట్టిన బద్ధకం మొత్తం విదిలించి కొట్టి పనిచెయ్యడం మొదలెట్టు.
నిన్ను అడిగేవాళ్లు ఎవరూ లేనంత మాత్రాన.. నువ్వు ఏ పనీ చెయ్యకపోయినా తిండికి ఢోకా లేకపోవడం వల్ల నువ్వు ఎంత బాధ్యత లేకుండా ఇంత విలువైన జీవితాన్ని టైమ్‌పాస్ చేస్తున్నావో ఫస్ట్ గుర్తించు! నువ్వు పని చెయ్యకపోయినా ఎవరూ అడగరు.. నిన్ను నువ్వే గట్టిగా క్వశ్చన్ చేసుకోవడం మొదలెట్టు.. అలా చేస్తే నీ బద్ధకాన్ని క్షణం కూడా తట్టుకోలేవు. పొట్ట తగ్గడానికీ... దేవుళ్లకి ఉపవాసాలకీ పస్తు ఉండడం మానేసి.. పనిచెయ్యని రోజున అసలు ఫుడ్డే తిననని రూల్ పెట్టుకో. చచ్చినట్లు పనిచేస్తావు. కష్టపడి పనిచేస్తే పొట్టా ఉండదు.. నెగిటివ్ థాట్స్ ఉండవు, దేవుళ్లతో పనీ ఉండదు.
సాధించు... సంతోషం వస్తువుల్లో లేదు.. సాధించడంలో ఉంది. "నేను ఈరోజు ఇంత పనిచేశాను" అని గర్వంగా ఫీలవడంతో ఉన్న సంతృప్తి ఎన్ని సినిమాలు చూస్తే వస్తుంది, ఎన్ని పోసుకోలు కబుర్లు చెప్పుకుంటే వస్తుంది, ఎన్ని బిర్యానీలు తింటే వస్తుంది? ఈ క్షణం నుండే మొదలెట్టు... నీపై నీకు గౌరవం పెరుగుతుంది..
అందరికీ ఒకటే లైఫ్... మహా అయితే కష్టాలూ, సుఖాలూ కాస్త అటూ ఇటూగా మారతాయి, పర్సంటేజ్‌లు మారతాయి.. అంటే ఫార్ములా కొద్దిగా తేడాగా ఉంటుందంతే.. మిగతా అంతా సేమ్ టు సేమ్...
👉రియల్ లైఫ్‌లోనే కాదు.. Facebook వంటి చోట్లా నెగిటివ్ మైండ్‌సెట్, నిరంతరం నెగిటివ్ భావాలు వెదజల్లే వ్యక్తులను unfollow చెయ్యడం చాలా అవసరం. ఒక విషపు ఆలోచనా, ఓ అసంతృప్తీ అది నేరుగా మనల్ని ద్వేషించేది కాకపోయినా సమాజం, ఇతర మనుషులపై నెగిటివ్ మైండ్ సెట్ కలిగిన వారు వెదజల్లే ఆలోచనలు కొన్నాళ్లకు మనకు తెలీకుండానే మనల్నీ విపరీతంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి.
నేను వ్యక్తిగతంగా చాలామందిని చూస్తుంటాను. ఎంత పాజిటివ్ మైండ్ ఉండే వాళ్లయినా timelineలో తమ మిత్రుల నెగిటివ్ థాట్స్ కన్పించిన వెంటనే మొదట ఇదేదో బాగుంది, భలే రాశారు అని ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఫీలవుతుంటారు. నిజమే, నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడూ ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటాయి. కానీ వాటిని అలా వినోదంగా ఎంటర్‌టైన్ చేస్తూ పోతే మనకు తెలీకుండానే మనలోనూ నెగిటివిటీ మెల్లగా పేరుకుపోతుంది.
చెడ్డ మనుషులతో, చెడు, విషపు ఆలోచనలు ఉన్న మనుషులతో తిరగాల్సిన పనిలేదు. వాళ్ల ఆలోచనలు రోజూ కాసేపు చదివితే చాలు. జీవితం విషమైపోతుంది. అందుకే నిరంతరం మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తులనే ఫాలో అవడం మంచిది అది నిజజీవితం అయినా వర్చ్యువల్ ప్రపంచమైనా!
మన ఆలోచనలకి ఓ స్పష్టత లేనప్పుడు.. కాలంతో పాటు ముందుకూ వెనక్కీ చీటికి మాటికీ ట్రావెల్ చేస్తున్నప్పుడు.. విపరీతమైన ఆలోచనలు కంట్రోల్‌లో లేనప్పుడు మన ఆలోచనే మనల్ని నాశనం చేస్తుంది.
ప్రతీ ఆలోచనతో విడుదలయ్యే న్యూరోకెమికల్స్, సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ ద్వారా శరీరంలో జరిగే మార్పులూ మనషుల్ని విధ్వంసం చేస్తున్నాయి. యోగిలా ఈ క్షణంలో మాత్రమే బ్రతకడం చేతనైతే సరే, లేదంటే 90 శాతం మానవ జాతి భౌతికంగా ఒకర్నొకరు ద్వేషించుకుంటూ, గొడవలు పడుతూ, సమాజంతో ఘర్షణ పడుతూ బాధలకి గురవుతారు. మరో వైపు మానసికంగా సైకోసోమాటిక్ డిసీజెస్ బారిన పడి క్వాలిటీ లైఫ్ కోల్పోతారు. తమని తామే మరణం అంచులకి చేర్చుకుంటారు.
ధన్యవాదములు🙏
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి