20, ఫిబ్రవరి 2020, గురువారం

వారం కు ఒక్కరోజు ఉపవాసం చేయడం వాళ్ళు లాభాలు తెలుసుకొండి


'ఉపవాసం' అనే పదం వినగానే, మీ మనస్సులో ఏం మెదులుతుంది? చాలామందికి మతాచారాల వల్ల తప్పనిసరి అనే భయం మెదులుతుంది.

ఇంకా, ఉపవాసాన్ని తొందరగా బరువు తగ్గే సాధనం అనుకుని, ఆహారం తగ్గించటానికి వాడతారు.

ఉపవాసం ఎలా చేయాలి, ఎంత సమయం చేయాలి?

కానీ ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుని ఈ తప్పుడు నమ్మకాలకి స్వస్తి పలకండి. మీ శరీరాన్ని సౌష్టవంగా మార్చుకోండి.

ఇక చదవండి, ఉపవాసం వల్ల కలిగే అనూహ్య లాభాలను మనం తెలుసుకుందాం.

మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది

శరీరంలో అతిముఖ్యమైన అవయవం అయిన మెదడుపై ఉపవాసం యొక్క అనేక సానుకూల ప్రభావాలున్నాయి. ఎలానో తెలుసుకుందాం !

ఆరోగ్యకర నాడీకణాల ఉత్పత్తిలో సాయపడే ప్రొటీన్ బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (BDNF), ఉపవాసం వల్ల ఉత్తేజితమై, అల్జీమర్స్, డిమెన్షియా, డిప్రెషన్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి, నాడీకణాల మధ్య సమాచార వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

సాధారణంగా, అవసరమైనప్పుడు మీ మెదడు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండటాన్ని మీరు గమనిస్తారు.

రక్తాన్ని శుద్ధిచేసి, వయస్సు తొందరగా పెరగకుండా చేస్తుంది

వయస్సు పైబడడం సహజప్రక్రియ మరియు దాన్ని ఎవరూ కావాలంటే వద్దనుకోలేరు ! ఉపవాసం వల్ల జరిగే అద్భుతం ఏంటంటే అది హెచ్ ఎస్ హెచ్ ( గ్రోత్ హార్మోన్) ను ప్రేరేపించి వయస్సు మీరకుండా ఆలస్యం చేస్తుంది.

నిజంగా అధ్భుతమే కదా ! అంతేకాక జీర్ణక్రియకి తాత్కాలికంగా సెలవు దొరకటంతో, అనవసర విష పదార్థాలను అదే రక్తంలోంచి పోయేట్లుగా చేస్తుంది.

టైప్-2 డయాబెటిస్ మరియు గుండెజబ్బులను రాకుండా చేస్తుంది

నమ్మండి నమ్మకపోండి, ఉపవాసం వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి, అనగా చిన్న చిన్న మొత్తాల్లోని ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి, టైప్ 2 డయాబెటిస్ రాకుండా చేస్తుంది.

గుండెజబ్బుల నివారణ

ఉపవాసం చెడ్డ కొవ్వు స్థాయిలు తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పై ప్రభావం చూపకుండా వివిధ గుండెకి సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తుంది.

ఆకలి తీరును సమన్వయపరుస్తుంది

కొంతమందికి నిజంగానే తమకు ఎప్పుడు నిజంగా ఆకలి వేస్తుందో తెలీక ఏదిపడితే ఆ చెత్త తింటూ ఉంటారు. ఉపవాసం, శరీరానికి ఆకలి వేస్తోందని తెలిపే హార్మోన్ ఘెర్లిన్ ను సమన్వయపరుస్తుంది. ఉపవాసం వల్ల మీ ఆకలి తీరుతెన్నులు కూడా సరవుతాయి.

వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల పొందే గ్రేట్ బెన్ఫిట్స్..!!

అందమైన చర్మం పొందేందుకూ సాయపడుతుంది ;

ఉపవాసం చేస్తున్నప్పుడు, ఎక్కువ శక్తిని వాడుకునే జీర్ణక్రియకి విశ్రాంతి దొరికి, శరీరానికి మిగతాపనులు అంటే చచ్చిపోయిన లేదా పాడైన కణజాలాలను బాగుచేసుకోవటం, రక్తాన్ని శుభ్రం చేయటం వంటి వాటికి సమయం దొరుకుతుంది. దీని వల్ల చర్మంపై మంచి ప్రభావం ఉండి దాన్ని అందంగా మారుస్తుంది.

ఉపవాసం వలన ఇతర లాభాలు బరువు తగ్గుతారు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుంది.

హెచ్చరిక

ఉపవాసం సరిగ్గా చేయకపోతే, అది ప్రమాదకరం కావచ్చు. అందుకే సరైన పద్ధతులు, దారులు తెలుసుకోండి. అందరూ ఉపవాసాలు చేయలేరు. గర్భవతులు, పాలిచ్చే తల్లులు చచ్చినా ఉపవాసం చేయకూడదు. బిడ్డపై ప్రభావం పడవచ్చు.

ఉపవాసం అంటే భయపడాల్సిన తప్పనిసరి ఆచారం కాదు. దానిపై ఇప్పుడు పెరిగిన అవగాహనతో, సరైన విధానంలో పాటించి అనేక లాభాలు పొందండి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 


కామెంట్‌లు లేవు: