10, ఫిబ్రవరి 2020, సోమవారం

ఆత్మ హత్య చేచికోవాలి అనుకున్న వాళ్ళు కు నా సలహాలు

జీవితంలో ఇంకేం లేదు, అంతా అయిపోయింది, సూసైడ్ చేసుకోవాలి, అని భావించే వారు ఇవి చ‌ద‌వండి..!

మన జీవితం లో మనం ప్రతీ రోజు ఎన్నో పరిస్థితులని ఎదురుకుంటాం. వాటిలో కొన్ని మనకి అనుకూలంగా జరిగినప్పుడు ఆనందపడడం, అదే కష్టం ఎదురైతే బాధ పడిపోవడం అతి సాధారణం. అయితే జీవితం లో సంతోషం విలువ తేలియాలన్న, దాన్ని మనం పూర్తిగా ఆస్వాదించాలంటే ముందు కష్టాలని, సమస్యల్ని ఎదురుకోవాలి అనే విషయాన్నీ మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడు మన లైఫ్ సాఫీగా, ఏ కష్టము లేకుండా గడిచిపోతే అది సంపూర్ణమైన జీవితం అవ్వదు.అయితే తాత్కాలికం అయిన ఒక కష్టాన్నో, ఇబ్బందినో తలుచుకుంటూ దాని మీద భయంతో ఇక చావే మార్గం అని అనుకుంటారు అనేకమంది. ఇంట్లో వాళ్ళు తిట్టారనో, ఆఫీస్ లో ఒత్తిడి పెరిగిపోతుందనో ఇలా చిన్న చిన్న కారణాలతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడుతూ ఉంటారు అనేకులు.అయితే నిర్ణయాలు తీసుకోవాలి అనుకునే వారు, డిప్రెషన్ లో ఉన్న వారు కొన్ని చిన్న చిన్న సూచనలనూ పాటిస్తే చనిపోవాలి అనే తమ నిర్ణయాన్ని మార్చుకుంటారు. మరి ఆ సూచనలు ఏమిటో దాని ద్వారా అలాంటి వారిలో బ్రతికుంది ఆ సమస్యని ఎదురుకోవాలి అన్న ఆశ ఎలా కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.

1)ప్రతి మనిషిలోను పాజిటివ్, నెగటివ్ ఆలోచనలు ఉంటూనే ఉంటాయి, అయితే కష్టాల్లో ఉన్నప్పుడు మన పాజిటివ్ థింకింగ్ ని నెగటివ్ మైండ్ డామినెటే చేస్తూ ఉంటుంది. అయితే ఈ పరిస్థితుల్లో మనం నెగటివ్ ఆలోచనలని పూర్తిగా నిర్లక్ష్యం చేయాలి. పాజిటివ్ గా ఆలోచిస్తే ప్రతి సమస్యకూ పరిష్కారం దొరికి తీరుతుంది.

2) మనకి ఎదురయ్యే సమస్య ఎక్కడికి దారితీస్తుందో అనే భయం ఎక్కువగా ఉంటుంది. ముందు ఆ భయాన్ని మన నుండి పారదోలాలి. కష్టాన్ని ఎదురుకోవాలి అనే ధైర్యం తో ముందుకి సాగాలి.

3) వచ్చిన సమస్యని మనలో మనమే తలుచుకుంటూ బాధపడకుండా నలుగురితో చెప్పుకుంటే, ఉదాహరణకి స్నేహితులతో చెప్పుకుంటే ఎంతో ఊరట గా ధైర్యం గా అనిపిస్తుంది.

4) పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, సినిమాలు చూడ‌డం, పాట‌లు విన‌డం, క్రికెట్ చూడ‌డం, లాంటి మన రోజువారీ హాబీలను మనం చేయడాఎం ద్వారా ఆ సమస్య తాలూకు భాధ మనకి ఎక్కువగా గుర్తుకు రాకుండా ఉంటుంది.

5) జీవితంలో ఎన్నో సమస్యలని ఎదురుకొని నిలబడిన వ్యక్తులకి సంభందించిన పుస్తకాలు చదవడం ద్వారా మనకి కొందత ధైర్యం వస్తుంది.

6) ప్రపంచంలో ఏ కష్టానికైనా ఒక పరిస్కారం ఉంటుందన్న ఆలోచన కలిగి ఉండాలి ఆ పరీస్థితులన్నీ కేవలం మనల్ని పరిపూర్ణ మనిషిగా మార్చడానికి గుర్తెరగాలి.

7) ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే చాలా కష్టాలు మరియు చాలా బాధలు మరియు అన్నీ అనుభవించి ముందుకు వెళ్తే నే  అప్పుడు అతనికి విజయం లభిస్తుంది 

8) మనకు జీవితంలో సాధారణంగా కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అందువలన ప్రతి చిన్నవిషయానికి బాధపడుతూ మనం మానసికంగా కుంగిపోతూ బాధపడకుండా ఆ సమస్యను పోరాడుతూ ఉండాలి

9) ప్రస్తుత జీవన విధానంలో చాలా హడావుడి బిజీ లైఫ్ లో మనం చాలావరకు యాంత్రికంగా జీవించడం అలవాటైపోయింది అందువలన ప్రశాంతమైన జీవితం అందరూ గడపడం లేదు ఎందుకనగా పెరుగుతున్న నాగరికత మరియు టెక్నాలజీ ఇందుకు ప్రధాన కారణం మనకు టెక్నాలజీ అవసరమే కానీ అది మన జీవితాలను నాశనం చేయడానికి అవకాశం ఇవ్వకూడదు
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: