8, ఫిబ్రవరి 2020, శనివారం

నిద్ర పట్టక పోవడానికి కారణం


*లేటుగా తిండి తింటే.. నిద్రెక్కడ పడుతుంది..*
నిద్రపట్టట్లేదా.. అయితే లేటుగా తిండి తినడం.. మానేయండి. రాత్రి భోజనం లేటుగా తీసుకునే అలవాటుంటే.. వెంటనే మార్చుకోండి. పదికి తర్వాత రాత్రిపూట అన్నం తీసుకుంటే నిద్రలేమి సమస్య తప్పదు. లేటుగా తింటే కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి, నిద్ర కష్టమవుతుంది. నిద్ర పోవటానికి 2-3 గంటల ముందే భోజనం చేసెయ్యాలి. ఆకలి అనిపిస్తే పడుకోబోయే ముందు ఏదైనా తేలికపాటి చిరుతిండి తినొచ్చు.
 
అలాగే మద్యం సేవించడం.. శారీరక శ్రమ లేకపోవడం కూడా నిద్రలేమికి కారణం అవుతుంది. పగలు కాఫీ టీలు రెండు మూడు కప్పులకంటే ఎక్కువ తీసుకోకండి. నిద్రపోయేందుకు 2-3 గంటల ముందు నుంచీ వీటిని తాగొద్దు. అలాగే ఒంటికి శ్రమ ఉంటేనే తర్వాత విశ్రాంతి తీసుకోగలుగుతుంది. కాబట్టి రోజూ కొంత వ్యాయామం తప్పనిసరి. రాత్రిపూట శ్రమ ఎక్కువగా ఉండే వ్యాయామం చెయ్యొద్దు.
 
 నిద్రపోయే ముందు ఇంట్లో పెద్ద లైట్లు, ధ్వనులు, టీవీ షోస్‌ వంటివన్నీ బంద్‌ చెయ్యాలి. పడుకోవటానికి ఓ అరగంట ముందు నుంచీ.. సంగీతం వినటం, పుస్తకం చదవటం వంటి మనసుకు ప్రశాంతతనిచ్చే పనులు చెయ్యాలి. నిద్రించేందుకు 15 నిమిషాల ముందు అరటిపండు, ఓ గ్లాసుడు పాలు తీసుకోవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు మి నవీన్ నడిమింటి అంటున్నారు.
రాత్రి మేల్కొని ఉంటే ఎలాంటి ఆహారం? పెరుగు - అరటిపండు కలిపి తీసుకుంటే...

ల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రకు వెళ్లే ముందువరకు ఎన్నో రకాల ఆహారాన్ని తీసుకుంటుంటాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనం ఎక్కువ మంది అనుసరించే విధానం. కానీ, కొందరు తమకునచ్చినట్టు, వీలైన వేళల్లో ఆహారం తీసుకుంటుంటారు. మరికొందరిలో ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినే అలవాటు ఉంటుంది. ఇంకొందరు రాత్రి వేళల్లో మేల్కొని... ఆసమయంలో తమకు అందుబాటులో ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. 
 
అయితే, ఇలాంటివారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలన్న అంశంపై పరిశీలిస్తే.. సాధారణంగా అధిక పని కారణంగా రాత్రి నిద్రపోయే అవకాశం ఉండదు. లేదంటే మద్యపానం వల్ల ఉదయం లేచేసరికి తల పట్టేసినట్టుగా అనిపించింది. అప్పుడు ఏం చేయాలి...? ఇలాంటి సమయంలో టమోటా జ్యూస్ తీసుకోవాలి. ఇది శరీరం కోల్పోయిన నీటిని, ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి భర్తీ చేస్తుంది.
 
అలాగే, రాత్రంతా సరిగా నిద్రపట్టకుంటే మర్నాడు ఉదయం బలహీనంగా, నీరసంగా అనిపించడం సహజం. రాత్రిసరిగా నిద్ర లేకపోవడం వల్ల ఆకలి పెరిగిపోయి బాగా తినాలనిపిస్తుంది. ఇలాంటివారు డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ తీసుకోవడం ఉత్తమం. లేదంటే లీన్ మీట్ తీసుకోవాలి. దీంతో ఆకలి నెమ్మదిస్తుంది. లేదంటే పెరుగుకు అరటిపండు కలిపి తీసుకున్నప్పటికీ మంచిదే.మి నవీన్  నడిమింటి 
 నిద్రపోకుంటే ఇన్నిరకాల ఇబ్బందున్నాయి. డాక్టర్ని సంప్రదించి తగిన సలహా తీసుకొని హాయిగా నిద్రపోవడము మంచిది .

చికిత్స :పెద్దవారికి --
Tab. Triptomer(Amitryptoline Hcl) 10 or 25 mg .... daily one at bed Time .
లేదా, 
Tab. Decolic (Dizepam 2mg + Dicyclomin Hcl) ... Daily one at bed time.
లేదా, 
Tab. Stresnil (Alprozolam 0.25 +Melatonin 5mg) ... Daily one at bedtime.
For more infremeshon about link
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: