24, ఫిబ్రవరి 2020, సోమవారం

షుగర్ (మధుమేహం )అదుపులో ఉండాలి అంటే నవీన్ నడిమింటి డైట్ ప్లాన్ అవగాహనా కోసం

*షుగర్ కంట్రోల్ రావాలి అంటే ప్రతి రోజులు మీరు చేయవలిసిన నవీన్ నడిమింటి డైట్ అవగాహనా కోసం*

          డయాబెటిస్ అనేది తీవ్ర అనారోగ్య సమస్య అయింది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి రోగుల సంఖ్య పెరుగుతోంది. నయం చెయ్యడం కుదరని ఈ వ్యాధిని నియంత్రించాల్సి వుంటుంది. అలా నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు

ప్రతిరోజు ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీళ్ళు తాగి, నానిన మెంతులు తింటే అది ఇన్సులిన్‌లా పనిచేస్తుందంటారు.ఇంకా వివరాలు కు లింక్స్ లో చూడాలి 

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా విత్తనాలు తీసేసిన కాకరకాయ రసాన్ని తాగాలి.

పచ్చి అరటిపండు పైతొక్క తీసి ఒక పాత్రలో వేసి దానిమీద నీళ్ళు పోసి రాత్రంతా వుంచి తెల్లవారిన తర్వాత ఆ నీటిని మూడు భాగాలు చేసి పగలు మూడుసార్లు తాగాలి.

ఒక కప్పు నీళ్ళలో మామిడి ఆకులు 13 నుండి 16 వేసి బాగా మరిగించి, రాత్రంతా చల్లారనిచ్చి ఉదయం వడకట్టి ఆ నీటిని పరగడుపున తాగాలి.

వెల్లుల్లి తినాలి లేదా వెల్లుల్లి కలిగిన మాత్రలు సేవిస్తే షుగర్ వ్యాధి అదుపులో వుంటుంది.

లేత మునగాకుని కూరలా వండుకుని తింటే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. చిన్నపిల్లలకి రాత్రిళ్లు పక్కలో మూత్రం పోసే అలవాటు ఉంటే, ఈ కూర పెట్టడం మంచిది.

రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంటే కరక్కాయ చూర్ణాన్ని ప్రతిరోజూ క్రమం తప్పక తేనెతో తీసుకోవడం మేలు.

షుగరు వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ పరగడుపున వేపాకురసం అరగ్లాసు తీసుకుంటే షుగర్ తగ్గుతుంది. అలాగే నేరేడు చెక్కను కాల్చి ఆ పొడి భద్రపరచుకుని రోజూ పరగడుపున ఓ చెంచా ఒక గ్లాసు నీళ్లతో కలిపి తాగితే షుగరు తగ్గుతుంది.

మునగచెట్టు వేరును బాగా దంచి రసం తీసి దానిలో తేనె కలిపి పాలతో తాగిస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి

        డయాబెటిస్ (షుగర్) వ్యాధిగ్రస్తులకు మెంతికూర రొట్టెలు మంచి పౌష్టికాహారం, మెంతికూర రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. విటమిన్స్ , మినరల్స్ , ఫైబర్ లభిస్తుంది. మెంతికూర స్కిన్ ఇన్ఫెక్షన్ కాకుండా నివారిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. కొంచెం మెంతికూర పేస్టు , గోధుమ పిండి , జొన్న పిండి కలిపి రొట్టెలుగా చేసుకొని పెరుగు పచ్చడి తో తింటే మన ఆరోగ్యం - మన చేతుల్లో ఉంటుంది. షుగర్ లెవెల్స్ మన కంట్రోల్ లో ఉంటాయి. 

        నేరేడుపళ్లు షుగర్ రోగులకు చాలా మేలు చేస్తాయి. 
షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి. 
అతి దాహం , 
అతి మూత్రం ,
 తీపి తినాలనే కోరికను , 
అతి ఆకలి సమస్యలను దూరం చేస్తాయి. 
కాబట్టి షుగర్ రోగులు రెగ్యులర్ డైట్ లో చేర్చుకొంటే మంచిది
          మనం తీసుకునే ఆహారం, మన ఆహారపు అలవాట్లపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ఆధునిక వాతావరణంలో నివసించడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కలుషిత వాతావరణం కారణంగా.. రకరకాల తెలియని ఎన్నో కొత్త వ్యాధుల రిస్క్ పొంచి ఉంది.
అంతేకాకుండా.. ఈ బిజీ లైఫ్ లో హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం కూడా.. కష్టంగా మారింది. *అన్ని సమయాల్లో నవీన్ నడిమింటి హెల్తీ డైట్ ఫాలో అవలేకపోతున్నాం.* కానీ.. మనం హెల్తీగా ఉండాలంటే.. హెల్తీ డైట్ ఫాలో అవడం కంపల్సరీ. కొన్ని సందర్భాల్లో హై, లో బ్లడ్ షుగర్ లెవెల్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటాం. మనకు ఈ సమస్య ఉందన్న విషయం కూడా తెలియదు. కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో లేకపోతే.. అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 

*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: