13, ఫిబ్రవరి 2020, గురువారం

నులిపురుగు నివారణ పరిష్కారం మార్గం

మీ పిల్లలు బరువు పెరగకుండ మరియు కడుపు  నొప్పి వంటి సమస్య కు అవగాహనా కోసం  పరిశుభ్రతతోనే నులిపురుగుల సమస్యకు చెక్

        పిల్లల్లో ఎదుగుదల లోపాలకు నులి పురుగుల సమస్య ఒక ముఖ్య కారణం. పెద్దలు సైతం ఈ సమస్యకు మినహాయింపు కాదు. కలుషిత ఆహారం, చేతులు శుభ్రంగా ఉంచుకోకపోవడం, ఉడకని మాంసం తినటమే ఈ సమస్యకు ప్రధానకారణాలు. కడుపులోని పేగులను ఆవాసంగా చేసుకొనే ఈ నులిపురుగులు ఆహారం ద్వారా అందే పోషకాలను అందిపుచ్చుకొని క్రమంగా వృద్ధి చెందుతాయి. సమయం గడిచే కొద్దీ ఇవి మరింత బలబడతాయి. అయితే వాటి ఉనికిని చాటే ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు గనుక ఈ సమస్యను త్వరగా గుర్తించటం కష్టం. ఈ సమస్య బాధితుల్లో పోషకాల లోపం తలెత్తి నానాటికీ క్షీణిస్తూ పోతారు. రోగ నిరోధక శక్తి తక్కువగా వుండేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
లక్షణాలు
కడుపులో నులిపురులు ఉన్నప్పుడు జననాంగాల దగ్గర దురద పెట్టటం, రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరకడం, ఎంత తిన్నా బరువు పెరగకపోవడం, నానాటికీ బరువు తగ్గటం , తరచూ కనిపించే కడుపు నొప్పి, తిన్నది పూర్తిగా జీర్ణం కాకపోవడం, మానసిక, శారీరక అస్థిరత, మలవిస్జరనలో తెల్లని, సన్నని చిన్న పురుగులు పడటం, మలబద్ధకం, వికారం, వాంతులు, కడుపులో గ్యాస్ పేరుకున్నట్లు అనిపించడం ,కలత నిద్ర, రక్తహీనత, చర్మంపై దద్దుర్లు, చర్మం చిట్లటం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కనిపిస్తాయి.
నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు 

పూర్తిగా ఉడికిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మాంసం విషయంలో ఈ జాగ్రత్త పాటించాలి.

శుద్ధిచేసిన నీటినే తాగాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

ఆరుబయట మల మూత్ర విసర్జన చేయరాదు.

ఇంట్లోకి పురుగులు,ఈగలు, ఇతర కీటకాలు రాకుండా జాగ్రత్త పడాలి.

కాలకృత్యాలు తీర్చుకున్న ప్రతిసారి, ఆహారం తీసుకునేముందు సబ్బుతో చేతులు బాగా కడుక్కోవాలి.

చేతి గోళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోళ్లు బాగా పెరగకముందే కత్తిరించుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ కొరక్కూడదు.

పిల్లలు నోటిలో చేతులు పెట్టుకోవడం, మట్టిలో ఆడుకోవటం వంటివి చేయకుండా చూడాలి.

రోడ్డు వెంబడి చిరుతిండ్లు వద్దేవద్దు.
ఇంక వివరాలు కు లింక్స్ లో చుడండి 
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

చికిత్స ..
పిల్లల్లో ఏలికపాములు, నులిపురుగులు, కొంకిపురుగులు అనే 3 రకాల పురుగులు ఉండే అవకాశం ఉంది. వీటి నిర్మూలనకు ఆల్బెండజోల్‌ మాత్రలు వాడాలి. 1-2 ఏళ్ళ వయసున్న పిల్లలకు 200ఎంజీ మాత్రను, మిగతావారు 400 ఎంజీ మాత్రను వేసుకోవాలి. భోజనం తర్వాత వేసుకోవచ్చు. కడుపులో పురుగులు ఉంటే మాత్రలు వాడిన 2 రోజులకు మలం ద్వారా బయట పడిపోతాయి. ధీర్ఘకాలిక రోగాల బాధితులు, ఇతర రోగాలకు మందులు వాడేవారు ఈ మాత్రలు వాడకూడదు. కడుపులో నులిపురుగులు ఉంటే.. ఈ మాత్రలు వేసుకొన్నతర్వాత వికారం, వాంతులు, కొద్దిగా జ్వరం వచ్చే అవకాశముంది. దాని వల్ల భయపడాల్సిన అవసరం లేదు

 *చిన్న పిల్లల కడుపులో దాదాపు 85 శాతం పురుగులు ఉంటాయట*. 

ఈ పురుగులనే నులి పురుగులు, బద్దె పురుగులు, సూది పురుగులు అని అంటారు. ఇవి చిన్న పిల్లల కడుపులో ఉండటం వలన బరువు తగ్గిపోయి అనారోగ్యానికి గురవుతారు. అసలు ఈ పురుగులు రావడానికి కారణాలేంటి? వీటి నుండి ఎలా బయటపడాలో వివరంగా తెలుసుకోండి.

పిల్లల కడుపులోకి పురుగులు చేరడానికి కారణాలు

చిన్న పిల్లల కడుపులోకి పురుగులు చేరడానికి ప్రధాన కారణం నీరు మరియు ఆహారమే. కలుషితమైన నీరు తీసుకోవడం వలన, సరిగ్గా ఉడకని ఆహారాన్ని తీసుకున్నప్పుడు, ఆరు బయటే మల విసర్జన, కాళ్ళు, చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకుండా ఆహారం తీసుకోవడం, పిల్లలందరూ ఒకే చోట ఉండటం వలన ఒకరి నుండి మరికొకరి బాక్టీరియా సులువుగా వ్యాపించడం జరుగుతుంది.ఇంక సమస్య ఉంటే నవీన్ గారిని కొనుకొని మందులు వాడాలి 

పిల్లల కడుపులో పురుగులు - లక్షణాలు

కడుపు నొప్పి, తలనొప్పి. మలద్వారం చుట్టూ దురద మంట ఉండటం, వాంతులు, రాత్రి పూత సరైన నిద్ర కలగకపోవడం, చర్మంపై దద్దుర్లు, ఆకలి ఉన్నా తినలేకపోవడం, రోజురోజుకీ బక్కచిక్కి పోవడం, రక్తహీనత, కళ్ళ చుట్టూ నల్లని వలయాలు, రాత్రి నిద్రలో పళ్ళు కొరకడం, ముఖం పాలిపోవడం, మలం తర్వాత చిన్న చిన్న పురుగులు పడటం జరుగుతుంటుంది.

కడుపులో పురుగులు తగ్గడానికి ఏం చేయాలి?
వెల్లుల్లి రసం - వెల్లుల్లి మంచి యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. అందుకని ప్రతి రోజూ చిన్న గ్లాస్ చొప్పున ముడి వెల్లుల్లి రసంలో కాస్త నీరు కలిపి ఇవ్వడం వలన ఈ ఎలాంటి పురుగులైనా సరే నశిస్తాయి.

మరిగించిన నీరు - పిల్లలకు ఎప్పుడూ నీరు ఇచ్చినా సరే మరిగించిన తర్వాత చల్లార్చి ఇవ్వడం చేయాలి. ఇలా చేస్తే బాక్టీరియా వారి శరీరంలోకి ప్రవేశించదు.

లవంగాల నీరు - రెండు లవంగాలు ఒక గ్లాస్ నీటిలో వేసి, ఆ నీటిని తాగించినా మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయి జ్యూస్ - ఇది మంచి రెమెడీగా చెప్పుకోవచ్చు. ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ లో ఒక స్పూన్ తేనే కలిపి ఇవ్వడం వలన పురుగులు అనేవి వారి కడుపు నుండి దూరమవుతాయి.

పాలు - పసుపు - ప్రతి రోజూ రెండు పూటలా ఒక గ్లాస్ పాలు ఇవ్వడం అందులో ఒక స్పూన్ పసుపు కలిపి పాలు తాగించడం వలన పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వారవుతారు.

చేతులు, మలద్వారం - మలద్వారం తర్వాత శుభ్రంగా కడగడం, చేతులు, కాళ్ళు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం, పండ్లు ఇచ్చేటప్పుడు శుభ్రంగా కడిగి ఇవ్వడం చేయాలి.

పిల్లలు ఆనందంగా ఆరోగ్యంగా లేకపోతే ఏ తల్లితండ్రులు సంతోషంగా ఉండలేరు కాబట్టి ప్రతి తల్లితండ్రులకు తెలిసేలా SHARE చేయండి.
ధన్యవాదములు 🙏 
మి నవీన్ నడిమింటి 
ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే

కామెంట్‌లు లేవు: