2, ఫిబ్రవరి 2020, ఆదివారం

చిన్న పిల్లలు పాలఉబ్బసం పరిష్కారం మార్గం


పాలఉబ్బసం అనేది శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యం, సాధారణంగా ఇది ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వయస్సులోని పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఇది స్వరపేటిక , వాయు నాళము మరియు శ్వాసనాళికల యొక్క వాపు వలన ఏర్పడే సమస్య. ఈ వాపు చివరికి ఉపిరి తిత్తులలో  వాయు మార్గాల అడ్డంకికి దారితీస్తుంది తద్వారా బాగా శబ్దముతో కూడిన దగ్గుకు కారణమవుతుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణంగా రాత్రి సమయంలో పాలఉబ్బసం యొక్క లక్షణాలు మరింతగా ముదురుతాయి. పిల్లవాడు  ప్రశాంతంగా ఉన్నాడా లేదా విసుగుగా ఉన్నాడా అనేదాని పై ఆధారపడి లక్షణాలు వేగంగా మారుతూ ఉంటాయి.

  • ప్రారంభ లక్షణాలు:
  • తర్వాతి లక్షణాలు:
    • బొంగురు గొంతు
    • మొండి , పిల్లికూతల దగ్గు (దానిని సీల్స్ బార్క్ అని కూడా పిలుస్తారు)
    • ఊపిరి పీల్చేటప్పుడు అధిక శబ్దం (స్ట్రిడోర్, stridor)
    • వేగంగా లేదా శ్రమతో కూడిన శ్వాస
  • తీవ్రమైన సందర్భాల్లో లక్షణాలు:
    • గందరగోళమైన మరియు నీరసమైన ప్రవర్తన
    • తినేటప్పుడు మరియు త్రాగేటప్పుడు సమస్యలు
    • మాట్లాడే సమయంలో కష్టం
    • ఛాతీ లోపలికి పోవడం (శ్వాస తీసుకునే సమయంలో కింది ఛాతీ గోడ లోనికి నొక్కుకుపోవడం)
    • నోటి చుట్టూ నీలం రంగు ఏర్పడడం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పాలఉబ్బసం  యొక్క అత్యంత సాధారణ కారణం పారాఇన్ఫ్లుఎంజా వైరస్ (parainfluenza virus) అనే వైరల్ సంక్రమణ. ఇది ప్రాథమికంగా సంక్రమిత వ్యక్తి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. 
శ్వాసకోశము యొక్క సంక్రమణ ఎగువ శ్వాసమార్గం మరియు స్వరపేటికలో  ఎడెమా (ఉబ్బడం) మరియు వాపులకు కారణమవుతుంది, దీని వలన ఊపిరితిత్తులలోకి గాలి ప్రవేశించే మార్గము ఇరుకుగా మారుతుంది. ఇది శ్వాసించడంలో కస్టానికి దారితీస్తుంది.

ఎలా నిర్ధరిస్తారు మరియు చికిత్స ఏమిటి?

ఆరోగ్య చరిత్ర మరియు వైద్య పరీక్ష పాలఉబ్బసం యొక్క నిర్దారణకు సహకరిస్తాయి.

వైద్యులు పరిశోధన కోసం ఈ పరీక్షలను కూడా సిఫారసు చేయవచ్చు:

  • ఛాతీ మరియు మెడ ఎక్స్-రే
  • సంక్రమణను గుర్తించి నిర్ధారించడానికి రక్త పరీక్షలు

చికిత్స వయస్సు, రోగి యొక్క ఆరోగ్యం చరిత్ర మీద ఆధారపడి ఉంటుంది.

చికిత్స వీటిని కలిగి ఉంటుంది:

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల ఉపశమనానికి పీల్చుకునే మందులు (Inhaled medicines)
  • స్టెరాయిడ్లు (సూది మందు ద్వారా లేదా నోటి ద్వారా)
  • అలెర్జీ లేదా రిఫ్లక్స్ కోసం మందులు

స్వీయ సంరక్షణ:

  • బిడ్డను ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆందోళన చెందుతున్నప్పుడు శ్వాసలో ఇబ్బంది మరింత తీవ్రతరం అవుతుంది.
  • పిల్లలకి పుష్కలంగా ద్రవాలు అందించాలి, కానీ కొంచెం కొంచెంగా తాగించాలి.
  • శ్వాస సులభంగా తీసుకోవటానికి పిల్లాడిని నిటారుగా కూర్చొనబెట్టలి లేదా మంచం మీద దిండులతో సౌకర్యవంతంగా చెయ్యాలి.
  • ఇంటిలో ధూమపానాన్ని తప్పకుండా నివారించండి. ధూమ

పాల ఉబ్బసం (క్రౌప్ వ్యాధి)మందులు 

పాల ఉబ్బసం (క్రౌప్ వ్యాధి) పిల్లలు కోసం కొన్ని మందు ఇవ్వబనది పెద్ద వాళ్ళు కు పని చేయవు 

Medicine NamePack Size
FormonideFormonide 0.5mg Respules 2ml
BudamateBUDAMATE FORTE TRANSCAP
ForacortFORACORT 0.5MG/2ML
BudecortBUDECORT 0.25MG RESPULES 2ML
BudetrolBUDETROL 100MG CAPSULE 30Nos
Combihale FbCOMBIHALE FB 100 REDICAPS 30S
SymbicortSYMBICORT 160 120MDI TURBUHALER
Vent EcVent Ec Capsule
Vent FbVENT FB 100MG EASE CAPSULE 30S
Budamate ForteBudamate Forte 12 Mcg/400 Mcg Transcaps
Budetrol ForteBudetrol Forte 12 Mcg/400 Mcg Capsule
Digihaler FbDigihaler Fb 6 Mcg/200 Mcg Inhaler
Fomtide NfFomtide Nf 12 Mcg/100 Mcg Inhaler
FomtideFOMTIDE 200 OCTACAPS CAPSULE 30S
Peakhale FbPEAKHALE FB 100MG DPI CAPSULE 30S
Quikhale FbQUIKHALE FB 100MG ROTACAP 30S
SymbivaSymbiva 100 Mcg Capsule
IbinideIBINIDE 200 NEXHALER 240MD
Ibinide RIBINIDE R 0.5MG NEXPULES 2ML
Nebulair RespulesNEBULAIR RESPULES 2ML
NebulairNEBULAIR 0.5 RESPULES 2ML
Budamate Neb RespulesBudamate Neb 1mg Respules 2ml
NebzmartNEBZMART 1MG SUSPENSION 2ML

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: