22, ఫిబ్రవరి 2020, శనివారం

మీకు OCD ఉంటే వెంటనే డాక్టర్ కావండి

మీకు ఓ.సి.డి సమస్య  ఉందా అయితే OCD ఎక్కువ అయితే ఏమి జరుగుతుంది నిజం గా జరిగిన సంఘటన

నిన్నను నేను చదివిన విషాదవార్త కింద తెలిపాను. దీన్నే ఓసిడి అంటారు..సైకియాట్రిస్టు చక్కటిమందులిచ్చి మామూలుమనిషి అయినట్టు బాగుచేయగలరు..

ఇటువంటి మానసిక వ్యాధి ఎందుకు వస్తుంది..రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? వస్తే నివారించుటకు ఎటువంటి చికిత్సలు తీసుకోవాలి..మామూలు మనిషిగా మారతారా? ఇది అంటువ్యాధిలాగా ఒకరికుంటే మరొకరికి వస్తుందా? *నవీన్ రాయ్ నడిమింటి* గారు దయచేసి వివరంగా తెలపగలరు.

వార్తా కథనం
*****
రోజుకు 10 సార్లు స్నానం.. భార్యను నరికి చంపి భర్త ఆత్మహత్య

చివరకు కరెన్సీ నోట్లను కూడా పుట్టమణి కడిగేది. నోట్లను సబ్బు నీటితో శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టేది. ఆమె అతిశుభ్రత వలన భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి.

రోజుకు 10 సార్లు స్నానం చేయాలి. కరెన్సీ నోట్లను కడిగి ఆరబెట్టాలి. ఇంట్లోకి ఎవరొచ్చినా స్నానం చేసే అడుగు పెట్టాలి. ఇవి ఆ భార్య పెట్టిన కండిషన్లు..! ఎక్కడికి వెళ్లినా.. అతి శుభ్రత..! ఏం చేసినా అతి శుభ్రత..! ఈ స్వచ్ఛతా టార్చర్‌ని భరించలేని ఆ భర్త.. భార్యను నరికిచంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నాటకలోని మైసూర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శాంతమూర్తి (40), పుట్టమణి (38) దంపతులకు 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 12, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ఐతే పుట్టమణి ప్యూరిటనిజాన్ని ఎక్కువగా అనుసరించేది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేది. కాలకృత్యాలకు వెళ్లినా.. బయటి వ్యక్తులను ముట్టుకున్నా.. స్నానం చేయాలని భార్తా పిల్లలకు కండిషన్లు పెట్టేది. అలా వారంతా రోజుకు కనీసం 10 సార్లు స్నానం చేయాల్సి వచ్చేది. అన్ని సార్లు స్నానం చేయడం వల్ల పిల్లలు చాలాసార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఐనా అస్సలు వినేది కాదు.

అంతేకాదు చివరకు కరెన్సీ నోట్లను కూడా పుట్టమణి కడిగేది. నోట్లను సబ్బు నీటితో శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టేది. ఆమె అతిశుభ్రత వలన భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం దంపతులిద్దరు పొలం పనులకు వెళ్లారు. అక్కడ కూడా ఈ శుభ్రత విషయంలో వాగ్వాదం జరిగింది. భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శాంతమూర్తి.. పొలంలో ఉన్న కొడవలితో పుట్టమణిని నరికాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయిన శాంతమూర్తి.. ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు.. ఫ్యాన్‌కు వేలాడుతూ అతడు కనిపించాడు. తీవ్ర భయభ్రాంతులకు లోనైన చిన్నారులు, చుట్టు పక్కల స్థానికులకు ఇంటికి తీసుకొచ్చారు. అతడు చనిపోయాడని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పుట్టమణి కోసం గాలించగా ఆమె కూడా పొలంలో శవమై కనిపించింది.

పుట్టమణి లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. 8 ఏళ్లుగా వారి చూస్తున్నా. మూఢనమ్మకాలను ఎక్కువగా అనురిస్తుంది. వాళ్ల ఇంట్లోకి వెళ్లాలంటే మాకు భయమేసేది. ఎందుకంటే స్నానం చేయనిదే ఇంట్లోకి రానిచ్చేది కాదు. పిల్లలను రోజుకు ఆరేడు సార్లు స్నానం చేయమని చెప్పేది. చివరకు కరెన్సీ నోట్లను కూడా కడిగేది. వేరే కులం, వేలం మతానికి చెందిన వ్యక్తులను నోట్లని ముట్టుకొని ఉంటారని, అందుకే కడుగుతానని చెప్పేది. నోట్లను కడిగే వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా? అతి శుభ్రతతో తమను టార్చర్ పెడుతోందని శాంతమూర్తి చాలాసార్లు నాతో చెప్పాడు. పిల్లలు టాయిలెట్‌కు వెళ్లినా, పశువులకు మేత వేసినా, వేరే వ్యక్తులను ముట్టుకున్నా స్నానం చేయడం తప్పనిసరి. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

— ప్రభుస్వామి, స్థానికుడు

మొత్తంగా అతి పరిశుభ్రత.. ఏకంగా ఓ జంట ప్రాణాలను తీసి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. శాంతమూర్తి, పుట్టమణి చనిపోవడంతో వారి పిల్లలు అనాథలయ్యారు. చిన్నారుల పరిస్థితిని చూసి స్థానికులు కూడా కంటతడిపెట్టారు.ఇంకా వివరాలు కు లింక్స్ లో చుడండి 

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

మానవ మనస్సు స్పందించే విధానం భిన్నంగా ఉంటుంది. మనస్సు భాష వేరు మనిషి భాష వేరు. ఏదయితే విషయం మనస్సులోకి తీసుకు రాబడుతుందో ఆ విషయం మనస్సు మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది ఏ రూపంలో వచ్చినా సరే.

ఉదాహరణకు ఒక వ్యక్తికి తరచూ తన ఆలోచనలలో పాములు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు తనను ఇబ్బందికి గురిచేస్తుంటాయి. అప్పుడు ఆ వ్యక్తి ఆ ఆలోచన వద్దు అని కోరుకుంటాడు. అలా ఆ ఆలోచనను ఆ వ్యక్తి ఎంత తిరస్కరిస్తే అది అంత బలంగా వస్తుంది. దానికి కారణం ఫలానా ఆలోచన వద్దు అనుకుంటున్నాడు అంటేనే ఆ ఆలోచన మనస్సులోకి వచ్చేసింది. తద్వారా ఆ ఆలోచనకు బలాన్ని తనే తెలియకుండా చేకూర్చుతాడు. ఈ విధమయిన ప్రాసెస్‌లో వ్యక్తి OCDకి గురవుతాడు.

OCD ఒక భయంకరమైన మానసిక సమస్య. సరైన కౌన్సిలింగ్ తీసుకోక పోతే ఇది జీవిత కాలం ఉంటుంది. మందులతో ఈ సమస్య తగ్గక పోగా వయస్సు పెరిగే కొద్ది ఈ సమస్య పెరుగుతుంది. ఇదొక ఊబి వంటిది. వ్యక్తి తనకు తను మోటివేట్ చేసుకునే ప్రయత్నంలో మరింత సమస్యలో ఇరుక్కుంటాడు.

ఈ సమస్యతో మనుషులు తీవ్రమైన డిప్రెషన్‌కి గురవుతారు. జీవితమంతా అస్తవ్యస్తం అవుతుంది. కొందరు సమస్య నుండి బయటపడలేక ఆత్మ హత్యకు పాల్పడతారు. ఎక్సిస్టేన్షియల్ థెరపీతో OCD సమస్యను అధిగమించ వచ్చు. ఈ థెరపీలను దీర్ఘకాలం ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంభ సభ్యులు థెరపిస్ట్ కి సహకరించాల్సి ఉంటుంది.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి  
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: