8, ఫిబ్రవరి 2020, శనివారం

మధుమేహం ఉన్న వారికి గాయంలు పరిష్కారం మార్గం

*షుగర్ ఉన్నవారికి గాయం ఐతే , ఎంతకాలానికి తగ్గక పోతే గ్యాంగ్రిన్ గా మారే అవకాశం ఉంది. అలాంటి గాయాలను పరిష్కారం మార్గం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
         పదేళ్లకు పైగా మధుమేహం బారిన పడిన వారు గ్యాంగ్రిస్ విషయంలో ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గ్యాంగ్రిస్ ఏర్పాడ్డాక జాగ్రత్తలు తీసుకుందాం, ముందు నుంచీ ఎందుకనే ధోరణి మధుమేహులకు పనికిరాదు. మధుమేహులు సూది మొన గుచ్చుకున్నా, గాజు పెంకు కోసుకున్నా, మట్టి పెడ్డ నొక్కుకున్నా, ఇలాంటి ప్రతి చిన్న గాయమూ గ్యాంగ్రిన్ కు దారితీసే అవకాశం ఉంటుందన్న అతి జాగ్రత్తతోనే ఉండాలి. ఎంత చిన్న గాయం తగిలినా, గ్యాంగ్రిస్ అవుతుందా, లేదా? అని ఆలోచిస్తూ ఎదురు చూడడం కన్నా గ్యాంగ్రిస్ అవుతుందనే
భావించి ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

గ్యాంగ్రిస్ లక్షణాలు ఇంకా వివరాలు కు లింక్ చుడండి👇
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/


గాయం/పుండు గ్యాంగ్రిన్ గా మారుతోందనటానికి సంకేతం.. అక్కడ నలుపు రంగు వస్తుండడమే. అంటే.. గాయమైన చోట ఉండే కణాలన్నీ మరణిస్తున్నాయని అర్థం. మిగతా గాయాల్లో అక్కడ ఉండే కణాలు చనిపోయినా చీము రూపంలో బయటికి వచ్చేస్తూ, కొత్త కణాలు ఏర్పడుతుంటాయి. గాయాల్లో ఎరుపు, పసుపు రంగు కనిపిస్తుంటుంది. నల్లగా మారదు. అదే గ్యాంగ్రిన్ లో నలుపు రంగు వస్తుంటుంది. అయితే, ఇక్కడ మీరు గుర్తించుకోవలసినది ‘‘గాయం ఒకసారి నలుపు రంగులో కనిపించిందంటే, అప్పుడు చికిత్సగా పెద్దగా చేసేదేమీ ఉండదు’’. నల్లగా మారిన ప్రాంతాన్నంతా తొలగించాల్సి ఉంటుంది. అది మామూలుగా మారే అవకాశం ఉండదు. అందుకని, ఏ చిన్న గాయమైనా నలుపు రంగులోకి మారక ముందే జాగ్రత్త పడాలి. ప్రతి చిన్న గాయమూ గ్యాంగ్రిన్ అవుతుందేమోనని అనుమానించి, గాయం తగిలిన వెంటనే జాగ్రత్త పడుతూ చికిత్స తీసుకోవాలి.

కాబట్టి డయాబెటీస్ ఉన్నవారిలో అరికాలికి కలిగిన గాయం గ్యాంగ్రిన్ మారే అవకాశాలే ఎక్కువ. అంతే కాకుండా, మధుమేహ చికిత్సలో బాగంగా మందులు వాడినంత మాత్రాన గ్యాంగ్రిస్ తగ్గుతుందనేదేమీ లేదు. దీనికి ప్రత్యేక చికిత్స తీసుకోవాలి. ఏదైనా గాయం గ్యాంగ్రిన్ గా మారుతుందనే అనుమానం ఉంటే, మధుమేహానికి మాత్రలకన్నా ఇన్సులిన్ తీసుకోవడం మంచిది. మధుమేహుల్లో ఒకకాలికి గాయమై, పుండు పడిందంటే, అక్కడ రక్తప్రసరణ జరగడం లేదని గుర్తించాలి. అలాంటి వారిలో శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్ మందులు నోటిద్వారా తీసుకున్నా వాటి ప్రభావం గాయం వరకూ చేరదు. అందుకని ఇంజక్షన్ రూపంలోనే తీసుకోవడం మంచిది. ఇంజక్షన్ తీసుకున్నంత కాలమే గాయమైన చో ఇస్ఫెక్షస్ రాకుండా అడ్డుకోవడం సాధ్యమతుంది. అందుకని, దీర్ఘకాలం పాటు  తీసుకోవాల్సి ఉంటుంది. గాయం దగ్గరి చీమును కల్చర్ పరీక్ష చేసి దాని ప్రకారం యాంటిబయాటిక్స్ మందుల్ని డాక్టర్ సలహాతో తరచూ మార్చాల్సిన అవసరమూ ఉంటుంది. కాలికి కట్టు కట్టినప్పుడు రోజూ రుద్దడం, నల్లబడిన చోట సొంతంగా కోయటానికి ప్రయత్నించం వంటివి చేయకూడదు. ఇది సర్జన్లు మాత్రమే చేయాలి. స్పిరిట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, బోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ ఆసిడ్ వంటివి వాడరాదు 
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: