25, ఫిబ్రవరి 2020, మంగళవారం

థైరాయిడ్ 'రైడ్' చేయకుండా...?నెలసరి సరిగ్గా రాకపోయినా.. పెళ్త్లె ఏళ్లు గడిచి పిల్లలు పుట్టకపోయినా.. విపరీతంగా బరువు పెరిగిపోతున్నా.. వెంటనే వైద్యులు సూచించే పరిష్కారం మార్గం ....



థైరాయిడ్ హార్మోన్లు థైరాయిడ్ గ్రంధి ద్వారా స్రవించబడతాయి, థైరాయిడ్ గ్రంధి అనేది గొంతు భాగంలో  ఉండే ఒక చిన్న అవయవం అది శరీరం యొక్క హోమియోస్టాసిస్ను (సమస్థితి) నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. ఈ హార్మోన్ల స్థాయిలలో ఏదైనా అసమతుల్యత ఏర్పడితే అది శరీరంలోని వివిధ వ్యవస్థల వైఫల్యానికి దారితీస్తుంది. థైరాయిడ్ రుగ్మతలు అనేవి సర్వసాధారణం, మరియు పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతారు. రెండు ప్రధాన థైరాయిడ్ సమస్యలు హైపర్ థైరాయిడిజం మరియు హైపోథైరాయిడిజం.హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ హార్మోన్ల అధిక ఉత్పత్తితో సంబంధం కలిగి ఉంటుంది ఐతే, హైపో థైరాయిడిజంలో ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ థైరాయిడ్ గ్రంధికి సంభవించే మరోక తీవ్రమైన సమస్యగా  ఉంది మరియు ఇది ప్రపంచంలోని అత్యంత సాధారణ ఎండోక్రైన్ క్యాన్సర్లలో ఒకటి. ఈ సమస్యల యొక్క అంతర్లీన కారణాలు కూడా బాగా వివరించబడ్డాయి మరియు అవి నిర్దారణ (డయాగ్నొస్టిక్) పరీక్షలు ద్వారా సులువుగా గుర్తించబడతాయి. థైరాయిడ్ గ్రంథి యొక్క సాధారణ పనితీరును పునరుద్ధరించడానికి సరైన తక్షణ చికిత్స సహాయపడుతుంది. జీవనశైలి మార్పులలో తగినంత అయోడిన్తో సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మరియు ఒత్తిడిని ఎదుర్కొనేందుకు యోగా మరియు ధ్యానం చెయ్యడం వంటివి ఉంటాయి. దీనితో పాటుగా ఎండోక్రయినోలోజిస్ట్ (endocrinologist) ను క్రమముగా సంప్రదించడం మరియు చెక్-అప్ చేయించుకోవడం అనేది థైరాయిడ్ సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

థైరాయిడ్ సమస్యలు అంటే ఏమిటి?

థైరాయిడ్ గ్రంధి అనేది ఒక ఎండోక్రైన్ గ్రంధి, ఇది రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అవి, ట్రైఅయోడోథైరోనిన్ (T3, triiodothyronine) మరియు థైరాక్సిన్ (T4, thyroxine). ఈ హార్మోన్ల ఉత్పత్తి మరియు స్రావం ఆంటీరియర్ పిట్యూటరీలో ఉత్పత్తి చేయబడిన థైరాయిడ్-స్టిములేటింగ్ హార్మోన్ (TSH) చే నియంత్రించబడతాయి, ఇది థైరాయిడ్ రిలీసింగ్ హార్మోన్ (thyroid releasing hormone) లేదా TRH చేత ప్రారంభించబడుతుంది. ఈ హార్మోన్లు శరీరం యొక్క ప్రాథమిక జీవక్రియ (మెటబాలిజం) కు బాధ్యత వహిస్తాయి. థైరాయిడ్ గ్రంథి యొక్క సరికాని ప్రేరేపణ కారణంగా అధికంగా లేదా తక్కువగా (సరిపోని) ఈ హార్మోన్లు ఉత్పత్తి చేసినప్పుడు థైరాయిడ్ సమస్యలు ఏర్పడతాయి. అటువంటి సమస్యలకు కారణాలు ఆటో ఇమ్యూన్ కావచ్చు లేదా థైరాయిడ్ గ్రంధిలో క్యాన్సర్ లేదా క్యాన్సర్ కానీ (non-cancerous) పెరుగుదలల ఉండటం వల్ల కావచ్చు లేదా గ్రంథి యొక్క వాపు కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా, పురుషులలో కంటే థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా మహిళల్లో కనిపిస్తాయి; దాదాపు 5% మహిళలు మరియు 0.5% మంది పురుషుల ఈ సమస్య వలన ప్రభావితం అవుతారు. ప్రతి థైరాయిడ్ సమస్య చివరికి థైరాయిడ్ హార్మోన్ల యొక్క అధిక లేదా తక్కువ స్రావానికి దారితీస్తుంది, ఇది శరీరంలో దాదాపు ప్రతి కణాన్ని ప్రభావితం చేస్తుంది.

థైరాయిడ్ సమస్యలు యొక్క రకాలు మరియు వాటి నిర్వహణ - Types of Thyroid problems and their management 

 థైరాయిడ్ హార్మోన్లు బేసల్ మెటబోలిక్ రేటు, ఆహార వినియోగం మరియు థర్మోజెనిసిస్ (thermogenesis) ను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఓవర్ ఆక్టివ్ థైరాయిడ్ అని కూడా పిలువబడే హైపర్ థైరాయిడిజంలో, T3 మరియు T4లు అధిక స్థాయిలో మరియు TSH తక్కువ స్థాయిలలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి యొక్క వాపు తరచుగా తాత్కాలిక హైపర్ థైరాయిడిజంకు దారితీస్తుంది. హైపోథైరాయిడిజం లేదా అండర్ ఆక్టివ్ (underactive) థైరాయిడ్ లో T3 మరియు T4 యొక్క సీరం స్థాయిల తక్కువగా మరియు TSH యొక్క స్థాయి అధికంగా ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ ఒక తీవ్రమైన థైరాయిడ్ సమస్య మరియు ప్రపంచంలో అత్యంత సాధారణ ఎండోక్రైన్ క్యాన్సర్.

అత్యంత సాధారణ థైరాయిడ్ సమస్యలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • హైపర్ థైరాయిడిజం: ఈ పరిస్థితిలో థైరాయిడ్ గ్రంథి యొక్క అతి చురుకుదనం  (ఓవర్ ఆక్టివ్) కారణంగా థైరాయిడ్ హార్మోన్ అధికంగా స్రవిస్తుంది.
  • హైపోథైరాయిడిజం: హైపోథైరాయిడిజం అనే పరిస్థితిలో, థైరాయిడ్ హార్మోన్ సాధారణ స్థాయిల కన్నా తక్కువగా స్రవిస్తుంది.
  • థైరాయిడ్ క్యాన్సర్: థైరాయిడ్ క్యాన్సర్ అత్యంత సాధారణ మెలింగ్నెంట్ (కాన్సర్ కారక) ఎండోక్రైన్ ట్యూమర్. కణాల లక్షణాలపై ఆధారపడి, థైరాయిడ్ క్యాన్సర్ను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు:
    • డిఫరెన్షియల్ థైరాయిడ్ క్యాన్సర్ (Differential thyroid cancer): దీనిలో పాపిల్లారి థైరాయిడ్ క్యాన్సర్ (papillary thyroid cancer [PTC]) మరియు ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ (follicular thyroid cancer [FTC]) ఉంటాయి. ఈ రకమైన క్యాన్సర్ ఎపిథీలియల్ కణాల నుండి ఉత్పన్నమవుతుంది మరియు థైరాయిడ్ క్యాన్సర్ యొక్క సాధారణ రకం.
    • అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ (Anaplastic thyroid cancer [ATC]): అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ అనేది తీవ్రమైన కానీ అరుదైన థైరాయిడ్ క్యాన్సర్ యొక్క రకం; థైరాయిడ్ క్యాన్సర్లలో 2% మాత్రమే అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్లు. దీనిలో థైరాయిడ్ కణజాలంతో పోలిక ఉండని వేరే రకమైన కణాలు ఏర్పడతాయి.

ఈ సమస్యలు మరింత వివరంగా తర్వాత చర్చించబడ్డాయి.

థైరాయిడ్ సమస్యల లక్షణాలు - Symptoms of Thyroid problems 

హైపర్ థైరాయిడిజం

హైపర్ థైరాయిడిజం యొక్క అత్యంత సాధారణ లక్షణాలు:

హైపోథైరాయిడిజం

హైపో థైరాయిడిజం సంకేతాలు మరియు లక్షణాలు:

  • బరువు పెరుగుట
  • అలసట
  • జుట్టు మరియు గోర్ల యొక్క పెళుసుదనం
  • చర్మం పొడిబారడం మరియు మందముగా మారడం
  • జుట్టు రాలడం
  • చల్లదనానికి సున్నితత్వం
  • కుంగుబాటు
  • కండరాల తిమ్మిరి
  • గొంతు బొంగురుపోవడం
  • మానసిక ఆందోళనలు

థైరాయిడ్ క్యాన్సర్

థైరాయిడ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు మెడ క్యాన్సర్ లేదా శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే ఇతర వ్యాధుల లక్షణాలకి సమానంగా ఉంటాయి. వ్యక్తి ఏవైనా అటువంటి లక్షణాలను అనుమానించినట్లయితే, తదుపరి పరీక్షల కోసం ఎండోక్రయినోలోజిస్ట్ ను సంప్రదించడం ఉత్తమం. థైరాయిడ్ క్యాన్సర్ సంకేతాలు మరియు లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి:

థైరాయిడ్ సమస్యల కారణాలు మరియు ప్రమాద కారకాలు - Causes and risk factors of thyroid problems 

హైపర్ థైరాయిడిజం

కారణాలు

హైపర్ థైరాయిడిజంకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాలను వివరంగా పరిశీలిద్దాం:

  • గ్రేవ్స్ వ్యాధి: హైపర్ థైరాయిడిజం యొక్క అత్యంత సాధారణ కారణం గ్రేవ్స్ వ్యాధి. ఇది ఒక  ఆటో ఇమ్యూన్ స్థితి, దీనిలో ఆటో యాంటీబాడీలు థైరాయిడ్ గ్రంధిని ప్రేరేపించి అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను స్రవించేలా చేస్తాయి. ఈ పరిస్థితి సాధారణంగా పురుషులు కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
  • థైరాయిడ్ గ్రంధి మీద గడ్డలు: థైరాయిడ్ గ్రంధిపై నిరపాయమైన (కేన్సర్ కాని) గడ్డలు ఏర్పడడం కూడా హార్మోన్ల అధిక స్రావానికి దారితీయవచ్చు.
  • అయోడిన్ తీసుకోవడం అధికమవ్వడం: థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ ఒక అత్యవసర సూక్ష్మపోషకం (micronutrient). అయినప్పటికీ, అధిక మొత్తంలో అయోడిన్ తీసుకోవడం వలన అది హైపర్ థైరాయిడిజానికి దారితీస్తుంది.
  • గర్భధారణ: గర్భధారణ సమయంలో ఏర్పడే హార్మోన్ల మార్పులు హైపర్ థైరాయిడిజంను కలిగించవచ్చు.
  • పిట్యూటరీ గ్రంథి యొక్క కణితి: పిట్యూటరీ గ్రంథిలో క్యాన్సర్ కాని (non-cancerous) కణితి పెరుగుదల కూడా థైరాయిడ్ హార్మోన్ల యొక్క అధిక ఉత్పత్తికి దారి తీస్తుంది.

ప్రమాద కారకాలు

హైపోథైరాయిడిజం

కారణాలు

హైపోథైరాయిడిజం అనేది హార్మోన్ లోపం వల్ల సంభవించే అత్యంత సాధారణ రుగ్మత. ఇది థైరాయిడ్ గ్రంధి రుగ్మత కారణంగా ఏర్పడే ప్రైమరీ (ప్రాథమిక) హైపోథైరాయిడిజం కావచ్చు లేదా పిట్యూటరీ గ్రంధి లేదా హైపోథాలమస్ యొక్క రుగ్మత వలన ఏర్పడే సెకండరీ (ద్వితీయ) హైపోథైరాయిడిజం కావచ్చు .

ప్రైమరీ హైపోథైరాయిడిజం యొక్క కారణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • హషిమోటోస్  వ్యాధి: థైరాయిడ్ గ్రంధిలో దీర్ఘకాలం పాటు ఏర్పడే ఒక ఆటోఇమ్మ్యూన్ రుగ్మత, ఇది వాపును కలిగిస్తుంది, ఇది థైరాయిడ్ గ్రంధి యొక్క పనితీరును తగ్గిస్తుంది, తద్వారా థైరాయిడ్ హార్మోన్లు తగినంతగా స్రవించలేవు.
  • అయోడిన్ లోపం: థైరాయిడ్ గ్రంధి అయోడిన్ ను గ్రహించిన తర్వాత థైరాయిడ్ హార్మోన్ల సిన్థసిస్ (సంయోజనం)లో అయోడిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది, మరియు దాని లోపం హైపో థైరాయిడిజంకు దారి తీస్తుంది.
  • థైరాయిడెక్టమీ (Thyroidectomy): హైపర్ థైరాయిడిజం యొక్క చికిత్సగా థైరాయిడ్ గ్రంధిని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తే తరువాత అది హైపో థైరాయిడిజంకు దారితీస్తుంది.
  • బాహ్య (External) రేడియోథెరపీ.
  • హైపర్ థైరాయిడిజంను తగ్గించడం కోసం యాంటీ-థైరాయిడ్ మందులతో అతిగా చికిత్స చేస్తే అది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవడానికికి దారి తీస్తుంది.
  • థైరాయిడ్ డైస్జెన్సిస్ [Thyroid dysgenesis] (సరిగ్గా అభివృద్ధి చెందని థైరాయిడ్ గ్రంథి).
  • పుట్టుకతో ఏర్పడే హైపోథైరాయిడిజం.

సెకండరీ హైపోథైరాయిడిజం కారణాలు:

  • పిట్యూటరీ అడెనోమా (క్యాన్సర్ కాని పెరుగుదల)
  • పిట్యూటరీ సర్జరీ
  • తలకు ​​గాయం కావడం
  • హైపోథాలమిక్ కణితులు

ప్రమాద కారకాలు

హైపో థైరాయిడిజం యొక్క కుటుంబ చరిత్ర వ్యక్తికీ హైపో థైరాయిడిజం సంభవించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సందర్భంలో పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం చాలా సాధారణం. అంతేకాకుండా, అయోడిన్ తక్కువగా ఉండే  ఆహార విధానం కూడా ఒక ముఖ్యమైన ప్రమాద కారకంగా ఉంటుంది.

థైరాయిడ్ క్యాన్సర్

కారణాలు

థైరాయిడ్ క్యాన్సర్ సంభవించడానికి అనేక కారణాలు దోహదపడతాయి, వాటిలో సర్వసాధారణమైన కారణం జన్యుపరముగా ఏర్పడేది. యొక్క థైరాయిడ్ క్యాన్సర్ కారణాలు చూద్దాం:

  • జన్యు కారకాలు: థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న చాలా మంది వ్యక్తులలో ఈ క్యాన్సర్కు కారణమయ్యే జన్యువులు వారికి తల్లితండ్రుల నుండి జన్యుపరంగా సంక్రమించినవే. జీన్ మ్యుటేషన్ (జన్యు ఉత్పరివర్తనలు) లు మరియు మ్యుటేషన్లకు గురైయ్యే జన్యువులు ఉండడం అనేవి థైరాయిడ్ క్యాన్సర్కు ప్రధాన కారణాలు.
  • రేడియేషన్కు గురికావడం: రేడియేషన్ అనేది ఒక బాగా తెలిసిన కార్సినోజెన్ (క్యాన్సర్ కారకం). చిన్న వయస్సులో థైరాయిడ్ గ్రంథి అయోనైసింగ్ రేడియేషన్లకు (ionising radiation) చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రేడియేషన్లు క్యాన్సర్ కారక మ్యూటేషన్లను కలిగిస్తాయి. డయాగ్నొస్టిక్ ఇమేజింగ్ ప్రక్రియలు కూడా థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
  • మధుమేహం: మధుమేహ రోగుల్లో ఇన్సులిన్ నిరోధకత పెరిగడం మరియు పెరిగిన TSH స్థాయిలు కూడా థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారణాలు.
  • హార్మోన్లు: థైరాయిడ్ క్యాన్సర్ అభివృద్ధిలో ఈస్ట్రోజెన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంకా, ఒక అధ్యయనం ప్రకారం గర్భాశయం తొలిగించబడిన (hysterectomy) స్త్రీలలో థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
  • జీవనశైలి కారకాలు: అధిక స్థాయిలో నైట్రేట్ మరియు వివిధ ఆహార సంకలితాలు (food additives) ఉండే ఆహారం కూడా థైరాయిడ్ క్యాన్సర్కు దోహదం చేయవచ్చు. ధూమపానం మరియు శారీరక శ్రమ లేకపోవటం కూడా థైరాయిడ్ క్యాన్సర్ సంభవనంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
  • ఆటోఇమ్యూనిటీ: గ్రేవ్స్ వ్యాధి మరియు హషిమోటోస్ థైరాయిడైటిస్ రోగులు థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని అధికంగా కలిగి ఉంటారు.

థైరాయిడ్ క్యాన్సర్ కలిగించడంలో అయోడిన్ పాత్ర వివాదాస్పదంగా ఉంది. తగినంత అయోడిన్ తీసుకోకపోవడం థైరాయిడ్ క్యాన్సర్కు దారితీస్తుంది అని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి, అయితే అయోడిన్ అధికంగా ఉన్న సముద్ర ఉత్పత్తులను తీసుకునే వారు థైరాయిడ్ క్యాన్సర్కు గురయ్యే అవకాశం ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే దాని గురించి పూర్తిగా తెలియలేదు అందువలన సిఫార్సు చేయబడిన పరిధిలో అయోడిన్ ను తీసుకోవడం ఉత్తమం.

ప్రమాద కారకాలు

థైరాయిడ్ క్యాన్సర్ యొక్క ప్రధాన ప్రమాద కారకాలు క్రింది విధంగా ఉన్నాయి:

  • స్త్రీలు
  • జన్యు కారకాలు
  • TSH స్థాయిలు పెరగడం
  • ఆటో ఇమ్యూన్ వ్యాధులు
  • టాక్సిక్ కెమికల్స్ మరియు రేడియేషన్లకు గురికావడం

థైరాయిడ్ సమస్యల నివారణ - Prevention of Thyroid Problems

హైపర్ థైరాయిడిజం

ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి ఈ పరిస్థితిని నిరోధించడం కష్టం. అయినప్పటికీ, ఒత్తిడిని తగ్గించడం, ధూమపానం మానివేయడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

హైపోథైరాయిడిజం

హైపోథైరాయిడిజం యొక్క అత్యంత సాధారణ కారణాలు కుటుంబ చరిత్ర మరియు హార్మోన్లు, అందువల్ల దాని నివారణ కష్టం. ; అయితే, పరిస్థితిని సులభంగా నిర్ధారించవచ్చు మరియు చికిత్స చేయవచ్చు. తగినంత అయోడిన్ తీసుకోవడంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితి నివారించవచ్చు.

థైరాయిడ్ క్యాన్సర్

థైరాయిడ్ క్యాన్సర్ నివారణ ఒక సవాలుగా ఉంటుంది; అయితే, లోపాయుక్త జన్యువులను గుర్తించడం మరియు థైరాయిడ్ గ్రంథిని తొలగించడం అనేవి క్యాన్సర్ను నిరోధించడంలో సహాయపడతాయి. రేడియేషన్కు దూరంగా ఉండటం కూడా థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

థైరాయిడ్ సమస్యల నిర్ధారణ - Diagnosis of thyroid problems 

హైపర్ థైరాయిడిజం

సమస్య యొక్క సకాల నిర్ధారణ తక్షణ చికిత్సకు సహాయపడుతుంది. ప్రాధమిక విచారణలో రోగి యొక్క ఆరోగ్య చరిత్రను గురించి పూర్తిగా తెలుసుకోవడం మరియు మెడ ప్రాంతం యొక్క భౌతిక పరిశీలన ఉంటుంది. క్రింది నిర్ధారణ విధానాలు అందుబాటులో ఉన్నాయి:

  • రక్త పరీక్షలు: TSH, T3 మరియు T4 స్థాయిల తనిఖీ
  • థైరాయిడ్ గ్రంధి యొక్క అయోడిన్ గ్రహకాన్ని (uptake) తెలుసుకోవడానికి న్యూక్లియర్ ఇమేజింగ్
  • గ్రంధిపై ఏర్పడిన గడ్డల యొక్క అల్ట్రాసౌండ్ ఇమేజింగ్
  • గ్రంధిపై ఏర్పడిన అసాధారణ పెరుగుదల యొక్క జీవాణుపరీక్ష (బయాప్సీ)
  • కంటి పరీక్ష

హైపోథైరాయిడిజం

హైపో థైరాయిడిజం యొక్క నిర్ధారణ ఆకస్మిక బరువు పెరుగుట వంటి లక్షణాల ఆధారంగా ఉంటుంది, అలాగే థైరాయిడ్ హార్మోన్ల యొక్క ఖచ్చితమైన స్థాయిలను గుర్తించేందుకు పరీక్షలు ఉంటాయి. కుటుంబం మరియు ఆరోగ్య చరిత్ర యొక్క సమగ్ర సమీక్ష కూడా నిర్ధారణలో ఒక ముఖ్యమైన భాగం. సాధారణంగా ఈ క్రింది విశ్లేషణ పరీక్షలు నిర్వహిస్తారు:

  • రక్త పరీక్షలు: TSH, T3 మరియు T4 స్థాయిలు తనిఖీ
  • థైరాయిడ్ గ్రంధి యొక్క అల్ట్రాసౌండ్ ఇమేజింగ్.

థైరాయిడ్ క్యాన్సర్

వ్యక్తి యొక్క సంకేతాలు మరియు లక్షణాలు థైరాయిడ్ క్యాన్సర్ సంభావ్యతను కలిగి ఉంటే, వైద్యులు మెడ అలాగే శోషరస కణుపులలో (లింఫ్ నోడ్లలో) వాపు యొక్క తనిఖీ కోసం క్షుణ్ణమైన శారీరక పరీక్ష నిర్వహిస్తారు. కుటుంబ చరిత్రను కూడా తెలుసుకుంటారు. కింది విశ్లేషణ విధానాలు ఉపయోగిస్తారు:

  • రక్త పరీక్షలు: TSH, T3, T4, కాల్సిటోనిన్ మరియు థైరోగ్లోబులిన్ స్థాయిల తనిఖీ కోసం
  • ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ (Fine needle aspiration biopsy)
  • టిష్యూ బయాప్సీ (Tissue biopsy)
  • ఇమేజింగ్ పరీక్షలు: ఎక్స్- రే, అల్ట్రాసౌండ్, రేడియోఆక్టీవ్ అయోడిన్ అప్టెక్ ఇమేజింగ్, సిటి (CT) మరియు ఎంఆర్ఐ (MRI) స్కాన్లు క్యాన్సర్ను గుర్తించడంలో సహాయపడతాయి.
  • స్వరపేటిక (vocal cords) కదలికను గుర్తించడానికి లారింజోస్కోపీ (Laryngoscopy)
  • లోపపూర్వక జన్యువులను గుర్తించటానికి జన్యు పరీక్ష. అయితే, ఇది విస్తృతంగా అందుబాటులో లేదు మరియు ఖరీదైనది.

థైరాయిడ్ సమస్యలకు చికిత్స - Treatment of thyroid problems 

హైపర్ థైరాయిడిజం

చికిత్స

సాధారణ చికిత్స పద్ధతులు ఈ విధంగా ఉంటాయి:

  • మందులు: రేడియోఆక్టివ్ అయోడిన్ అబ్లేషన్ (Radioactive iodine ablation), హార్మోన్ల విడుదలను నెమ్మది చేయడానికి నియోమెర్కజోల్ (neomercazole) వంటి యాంటీ థైరాయిడ్ మందులు మరియు లక్షణాలను తగ్గించడానికి యాంటీ ఇన్ఫలమేటరి మందులను సూచించవచ్చు
  • థైరాయిడ్ గ్రంధి యొక్క చిన్న భాగపు శస్త్రచికిత్సా తొలగింపు లేదా థైరాయిడెక్టోమీ.
  • కళ్ళ యొక్క పొడిదనానికి ఉపశమనం కలిగించడం కోసం కృత్రిమ కన్నీళ్లు (Artificial tears).

జీవనశైలి నిర్వహణ

సాధారణంగా ఉపయోగించే మందులు మాత్రమే కాకుండా, కొన్ని సులభమైన జీవనశైలి మార్పులు, థైరాయిడ్ గ్రంధిని నిర్వహించడంలో అద్భుతాలు చేస్తాయి. క్రమముగా హెల్త్ చెక్-అప్స్ చేసుకోవడం, ధూమపానం మానివేయడం, యోగ సాధన చేయడం వంటివి పరిస్థితి నిర్వహణకు సహాయపడతాయి. విటమిన్లు, ప్రోటీన్లుకాల్షియం, అయోడిన్ మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం లక్షణాలను తగ్గించడానికి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.

హైపోథైరాయిడిజం

చికిత్స

థైరాక్సిన్ ను తగినంత మోతాదులో రోజువారీ ఓరల్ (నోటి ద్వారా) గా తీసుకోవడం అనేది సాధారణ చికిత్సా పద్ధతి. కొన్నిసార్లు, కలయిక (combination) చికిత్స సిఫారసు చేయబడవచ్చు. చికిత్స మొదలుపెట్టిన తర్వాత కూడా క్రమముగా రక్త పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇవ్వబడుతుంది, తద్వారా రక్తంలో హార్మోన్ల స్థాయిల ప్రకారం మందుల మోతాదును సవరించవచ్చు. ఆయుర్వేదంలో, అనేక మూలికలు హైపో థైరాయిడిజం చికిత్సకు ఉపయోగించబడ్డాయి. వాటి ఉపయోగాలు మరియు మోతాదు గురించి తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించవచ్చు.

జీవనశైలి నిర్వహణ

రోజువారీ మందులతో పాటుగా, క్రమమైన పరీక్షలు, తగినంత వ్యాయామం మరియు యోగా థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.

థైరాయిడ్ క్యాన్సర్

చికిత్స

థైరాయిడ్ క్యాన్సర్ యొక్క చికిత్స థైరాయిడ్ క్యాన్సర్ రకం మరియు దశపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ క్రింది చికిత్సా పద్ధతులను ఉపయోగిస్తారు:

  • శస్త్రచికిత్స: థైరాయిడ్ గ్రంధి యొక్క పాక్షిక లేదా పూర్తి తొలగింపు మరియు మెడలో శోషరస కణుపులను (లింఫ్ నోడ్లను) తొలగించడం
  • శస్త్రచికిత్స తర్వాత మిగిలిన థైరాయిడ్ కణజాలాన్ని తీసివేయడానికి రేడియోఆక్టివ్  అయోడిన్ థెరపీ
  • బాహ్య (External) రేడియేషన్ థెరపీ
  • కెమోథెరపీ: క్యాన్సర్ వ్యతిరేక మందుల ఇంట్రావీనస్ (నరాలలోకి) గా ఎక్కించడం
  • టార్గెటెడ్ థెరపీ (Targeted therapy): క్యాన్సర్ కణజాలాన్నిలక్ష్యం చేసుకుని పనిచేసే ఓరల్ మందులు

జీవనశైలి నిర్వహణ

సమతుల్య ఆహార తీసుకోవడం, క్రమమైన శారీరక శ్రమ చెయ్యడం మరియు ధూమపానం  మానివేయడం వంటి జీవనశైలి సవరణలు కొంత వరకు సహాయపడతాయి.

థైరాయిడ్ సమస్యల యొక్క రోగసూచన మరియు సమస్యలు - Prognosis and Complications of Thyroid problems 

హైపర్ థైరాయిడిజం

రోగసూచన

వ్యాధి యొక్క వైద్యపరమైన మార్పులు రోగి యొక్క వయస్సు, లింగం మరియు పూర్తి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటాయి. చికిత్స చేయకపోతే, వ్యాధి పురోగించి రోగి కళ్ళు మరియు చర్మంపై ప్రభావం చూపుతుంది.

సమస్యలు

హైపర్ థైరాయిడిజం కొన్ని తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు, అవి:

  • స్ట్రోక్ మరియు గుండెపోటు వంటి కార్డియోవాస్క్యులర్ సమస్యలు
  • పక్షవాతం
  • ఆస్టియోపొరోసిస్
  • అంతేకాక సంతానలేమికి దారి తీసే ఋతుక్రమ అసాధారణతలు.
  • థైరాయిడ్ స్ట్రోమ్ (Thyroid storm) అత్యవసర స్థితికి దారి తీసేంతగా థైరాయిడ్ హార్మోన్లు అధిక మొత్తంలో విడుదలవుతాయి.

హైపోథైరాయిడిజం

రోగసూచన

రోజువారీగా థైరాక్సిన్ యొక్క సరైన మోతాదు ఉపయోగంతో ఈ వ్యాధికి చికిత్స చేయవచ్చు. సరైన చికిత్స లేనప్పుడు, ఇది మరింతగా ముదురుతుంది మరియు తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.

సమస్యలు

హైపోథైరాయిడిజంకు చికిత్స చేయకుండా వదిలివేస్తే ఆర్టరీల లోపల కొలెస్ట్రాల్ పోగుపడి అథెరోస్క్లెరోసిస్ వంటి సమస్యలకు అది దారితీస్తుంది. కొన్నిసార్లు, హార్మోన్ల అవసరాలను తీర్చడానికి థైరాయిడ్ గ్రంధి విస్తరించడానికి కూడా ఇది కారణమవుతుంది. ఇంకా ఈ పరిస్థితి యొక్క మరోక తీవ్రమైన సమస్య మిక్సోడిమా (myxoedema) అని పిలువబడే ఒక ప్రాణాంతక పరిస్థితి, దీనిలో వ్యక్తి యొక్క ముఖం ముసుగు కప్పినట్లు (masked appearance) ఉంటుంది మరియు హైపోథెర్మియా, బ్రాడీప్నియా మరియు మూర్ఛ కూడా కలుగవచ్చు.

థైరాయిడ్ క్యాన్సర్

రోగసూచన

ప్రారంభ దశలో గుర్తించడం మరియు చికిత్స క్యాన్సర్ పెరుగుదలను నియంత్రించడానికి సహాయం చేస్తాయి. కార్సినోమా (క్యాన్సర్) థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తుంది మరియు హృదయనాళ (కార్డియోవాస్క్యూలర్) మరియు జీవక్రియ (మెటబోలిక్) సమస్యలు వంటి సమస్యలకు దారి తీస్తుంది.

సమస్యలు

క్యాన్సర్ చుట్టుప్రక్కల భాగాలకు వ్యాపించి స్వరపేటిక (వోకల్ కార్డు) పనితీరును ప్రభావితం చేయవచ్చు. ఇది శోషరస కణుపులకు (లింఫ్ నొడ్లు) కూడా వ్యాప్తి చెందుతుంది, ఫలితంగా మరిన్ని సమస్యలు సంభవిస్తాయి.

ఉపసంహారం - Takeaway 

మొత్తంమీద, సకాలంలో ఎండోక్రయినోలోజిస్ట్ ను సంప్రదించడం ద్వారా థైరాయిడ్ సమస్యలను సులువుగా గుర్తించవచ్చు మరియు నిర్వహించవచ్చు.  అదనంగా కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవడం, మందులను క్రమముగా తీసుకోవడం మరియు ఎప్పటికప్పుడు చెక్-అప్ లు చేయించుకోవడం వంటివి ఈ పరిస్థితిని నియంత్రించడానికి మరియు మరింత తీవ్రమైన సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.

థైరాయిడ్ సమస్యలు కొరకు మందులు

థైరాయిడ్ సమస్యలు

Medicine NamePack Size
Schwabe Natrum muriaticum TabletSchwabe Natrum muriaticum Biochemic Tablet 200X
ADEL 31 Upelva DropADEL 31 Upelva Drop
ADEL 34 Ailgeno DropADEL 34 Ailgeno Drop
ADEL 43 Cardinorma DropADEL 43 Cardinorma Drop
Bjain Natrum muriaticum TabletBjain Natrum muriaticum Tablet 12X
SBL Spongia pulvis DilutionSBL Spongia pulvis Dilution 1000 CH
ADEL 79 Ferrodona TonicADEL 79 Ferrodona Tonic
Bjain BC 2 TabletBjain BC 2 Tablet
Bjain BC 5 TabletBjain BC 5 Tablet
Bjain BC 13 TabletBjain BC 13 Tablet
ADEL 9 Co-Hypert DropADEL 9 Cri-Regen Drop
Bjain BC 16 TabletBjain BC 16 Tablet
Bjain Lycopus europaeus DilutionBjain Lycopus europaeus Dilution 1000 CH
SBL B Trim DropsSBL B Trim Drops
Bjain Lycopus virginicus DilutionBjain Lycopus virginicus Dilution 1000 CH
Schwabe Lycopus europaeus CHSchwabe Lycopus europaeus 1000 CH
Schwabe Lycopus virginicus CHSchwabe Lycopus virginicus 1000 CH
Bjain BC 28 TabletBjain BC 28 Table
Bjain Spongia pulvis DilutionBjain Spongia pulvis Dilution 1000 CH
Bjain Fucus Vesiculosus TabletBjain Fucus Vesiculosus Tablet 3X
ADEL Kali Carb DilutionADEL Kali Carb Dilution 1000 CH
SBL Fucus vesiculosus DilutionSBL Fucus vesiculosus Dilution 1000 CH
ADEL BC 1ADEL BC 1
ADEL BC 2ADEL BC 2మా గురించి

కామెంట్‌లు లేవు: