బరువు తగ్గడం ఎలా నవీన్ నడిమింటి డైట్ ప్లాన్ అవగాహనా కోసం? ?
ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఉంటే ఉన్న అదనపు బరువు ఉన్న వారిని ఊబకాయులు అంటారు. వీరిలో అదనంగా ఉన్న లావును బట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అసలు అలా ఉండటమే ఒక అనారోగ్యం. ఏవో కొన్ని వైద్య పరమైన సమస్యలు ఉన్న వారిలో తప్ప లావు కావటం అనేది నూటికి 98 పాళ్ళు "తిండి-కష్టం"ల మధ్య మనకు మనమే తూకాన్ని దెబ్బ తీయటం వల్ల కొని తెచ్చు కొనే సమస్య. అంటే "ప్రవర్తనా" పరమయిన సమస్య. గతంలో ఈ సమస్య ధనవంతులది. ఇప్పుడు ఉన్న వారు- లేని వారు, నలుపు-తెలుపు, ఆడా-మగ, చిన్నా-పెద్ద, ఉత్తరం-దక్షిణం అనే తేడాలు చూపని అసలయిన "సోషలిస్టు' సమస్య.
చాల మంది సమస్యను పట్టించు కోరు. కొంత మంది తగ్గటానికి నానా రకాల పాట్లు పడుతుంటారు. అందులో పూర్తిగా అశాస్త్రీయ పద్ధతుల నుండి శాస్త్రీయ పద్ధతుల వరకూ ఉండొచ్చు. ఇక్కడ మీకు ఇచ్చింది శాస్త్రీయ పద్ధతుల్లో బరువు తగ్గే పద్ధతుల్లో ఒకటి. ప్రయత్నం చేసే ఓపిక ఉంటే మొదలు పెట్టండి. పాటించటంలో మీ నిజాయితీని బట్టి వారం రోజుల్లో 2 నుండి 5 కేజీల బరువు తగ్గ వచ్చు.
ఇదేదో ఒబేసిటి సెంటర్ల వ్యాపార ప్రకటనో, టీవీల్లో చూపే టెలిబ్రాండ్ ప్రకటనో కాదు. ఎక్కడికి వెళ్ళకుండా, ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే శాస్త్రీయ పద్ధతుల్లో బరువు తగ్గే పద్ధతి. దీనికి కావల్సిందల్లా అదనపు బరువు తగ్గాలన్న బలమైన కోరికా, అమలు పరిచే దృఢ సంకల్పం. ఆ తరువాత బరువు పెరగ కూడదన్న తలంపు మీకుంటే చాలు. ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని "జాన్‌హప్‌కిన్స్ రీసెర్చ్ సెంటర్" రూపొందించింది. ప్రయోగాత్మకంగా నిరూపణ చేసిన పధ్ధతి.
వారం రోజుల పాటు మీరు తీసుకునే ఆహారం శరీరానికి ఏ మాత్రం అదనపు కాలరీలను ఇవ్వకుండా మీ వంట్లో ఉన్న అదనపు నిల్వలను (కొవ్వు, ప్రొటీన్లను) కరిగించడానికి ఉద్దేశించిన డైట్ చార్టు ఇది. మరైతే ఆలస్యం దేనికి ? వెంటనే ప్రారంభించండి.
ముందుగా మీ అదనపు బరువు లెక్క వేసుకోండి
ముందుగా మీరు ఉండాల్సిన దానికన్నా అదనంగా ఎంత బరువు ఉన్నారో చూడండి. అదనపు బరువును లెక్కించటానికి ఒక చిన్న లెక్క. ముందుగా మీ బరువును కేజీలలో, మీ ఎత్తును సెంటీమీటర్లలో కొలుచు కోండి. సెంటీ మీటర్లలో మీ ఎత్తు నుండి 100 తీసెయ్యండి. వచ్చిన విలువను 0.9తో పెంచండి. అది మీరుండాల్సిన బరువు. మీరు ఉన్న బరువులో నుండి ఉండాల్సిన బరువు తీసి వేస్తే మీరు ఎంత అదనంగా ఉన్నారో తెలుస్తుంది. ఇక వారం రోజుల 'డైట్ చార్టు'లోకి వెళ్లి మీరు ఏమేం తినాలో, ఎలా తినాలో చూద్దాం. ప్రతి రోజు ఆహార నియమాలతో పాటు చివర ఇచ్చిన సాధారణ నియమాలను ఖచ్చితంగా పాటించాలి.
మొదటిరోజు
అరటి పండు తప్ప అన్నిరకాల తాజా పళ్ళు: ఈ రోజు మీ ఆహారం. మీకు నచ్చిన అన్ని రకాల పండ్లను తినొచ్చు. అరటి పండు మాత్రం లేదు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కిరిణికాయలు (కడప దోసకాయలు) ఎక్కువ తింటే మంచిది. పరిమితి ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు. పళ్ళను ఆహారంగా తీసు కోవటం వల్ల రా బోయే ఆరు రోజులకు మీ శరీరాన్ని, జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారన్న మాట.
రెండవరోజు
అన్నిరకాల కూరగాయలు : ఈ రోజు మీ ఆహారం కేవలం కూరగాయలు మాత్రమే తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక పెద్ద బంగాళ దుంపను ఉడికించి తినటం ద్వారా ఈ రోజును ప్రారంభించండి. తరువాత బంగాళా దుంప తినొద్దు. మిగతా కూరగాయలు పచ్చివి కాని, ఉడికించినవి కాని తినొచ్చు. ఉప్పు, కారం మీ ఇష్టం. నూనె మాత్రం వాడొద్దు. ఈ రోజు కూడా పరిమితి అంటూ ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు.
మూడవరోజు
పళ్ళు, కూరగాయలు : పళ్లలో అరటి పండు, కూరగాయల్లో బంగాళా దుంప తప్ప మిగిలిన పళ్ళు, కూరగాయలు కలిపి తీసుకోండి. ఈ రోజు కూడా పరిమితి ఏమీ లేదు. అవసరం మేరకు తినొచ్చు. ఈ రోజు నుండి మీ శరీరంలో అదనపు కొవ్వు విలువలు కరగటం ప్రారంభిస్తాయి.
నాల్గవ రోజు
8 అరటిపళ్లు, మూడు గ్లాసుల పాలు : నాల్గవరోజు దాదాపు ఆకలి ఉండదు. రోజంతా హాయిగా గడచి పోవడం గమనిస్తారు. 8 అరటి పళ్ళు తినాల్సిన అవసరం రాక పోవచ్చు. తగ్గించగలిగితే తగ్గించండి. (ఒక గ్లాసు 200 మి.లీ.) పాలల్లో చక్కెర ఎక్కువ ఉండ కూడదు. ఇంకా అవసరం అనిపిస్తే 100 మి.లీ. వెజిటబుల్ సూప్ తాగవచ్చు. (తాజా కూరగాయలతో మీ అభిరుచికి తగ్గట్లు మీ ఇంట్లో తయారు చేసింది మాత్రమే తాగండి).
ఐదవ రోజు
ఒక కప్పు అన్నం, 6 టమోటాలు : మీకిది విందు రోజు. మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, దాని లోకి కూరగాయలు లేదా ఆకు కూరతో నూనె లేకుండా వండిన కూరతో తినండి. ఉదయం టిఫిన్‌గా రెండు టమోటాలు తీసుకోండి. మిగిలినవి అవసరం అయినప్పుడు తినండి. కప్పు అన్నం తినొచ్చు కదా ఏమవుతుందని ఇంకాస్త లాగించే పని చేయ వద్దు. వీలయితే కప్పు కన్నా కాస్త తక్కువే తినండి.
ఆరవ రోజు
ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం : రెండవ రోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు (బగాళ దుంప మినహా) తీసుకోండి. అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే. కూరగాయలకు లిమిట్ లేదు. అయినప్పటికి ఆకలి లేకపోవడం వల్ల రెండవ రోజు తిన్నంత అవసరం లేదు.
ఏడవ రోజు
ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం: ఆరవరోజులాగే తింటూ, అదనంగా కూరగాయలను కాస్త తగ్గించి, పళ్ళ రసం (చక్కెర లేకుండా) తీసుకోండి. మధ్యాహ్నం యథా విధిగా ఒక కప్పు లేదా అంత కంటే తక్కువ అన్నం తినండి. ఇక రేపటి కోసం ఎదురు చూడండి.
వారం తరువాత
మీలో మార్పును మీరే కాకుండా పక్కవాళ్ళు సైతం గుర్తించేలా ఉంటుంది. మీ బరువు ఎంత వున్నారో చూసు కోండి. ఈ పద్ధతి కచ్చితంగా పాటిస్తే, శరీరం అవసరం మేరకు తింటే, 4 నుండి 5 కేజీల బరువు తగ్గుతారు. మినహాయింపులూ, ఉల్లంఘనలు ఉంటే దానికి తగ్గట్టే తగ్గుతారు. ఇంకా మీరు బరువు తగ్గాలంటే కనీసం రెండు వారాల విరామం తర్వాత లేదా మళ్లీ మీ ఇష్టం వచ్చినప్పుడు ఇదే వారం చార్టుని తిరిగి ప్రారంభించండి. ఈ విధంగా మధ్య మధ్యలో విరామంతో మీ బరువు తగ్గించ దలచుకున్నంత వరకు ఈ చార్టుని ఫాలో కావచ్చు. వారం రోజుల పాటు ఈ పద్ధతిని పాటించడం వల్ల ఆ తరువాత కూడా మీకు పెద్దగా ఆకలి ఉండదు. అంటే ఆకలి స్థాయి తగ్గుతుంది. కాబట్టి ఇక నుండి మీ ఆహారపు అలవాట్లను పక్కాగా మార్చుకుని పరిమితంగా తింటూ వుంటే మీ బరువు అదుపులో ఉంటుంది. లేదంటే మళ్ళీ లావు పెరుగుతారు.
సాధారణ నియమాలు
ఈ వారం రోజులు మీరు 20 నిమిషాల పాటు ఒక మోస్తరు వ్యాయామం అంటే నడక, సైక్లింగ్, ఎరోబిక్స్, స్విమ్మింగ్ లాంటి వాటిలో ఏదో ఒకటి చెయ్యాలి.
రోజూ 10 గ్లాసులకు తక్కువ కాకుండా నీళ్ళు తాగాలి
పైన చెప్పిన ఆహారం అవసరం మేరకు తినాలే తప్ప తినమన్నాం కదా అని అవసరం లేకపోయినా తింటే ఫలితం అనుకున్నంత రాదని గుర్తించండి.
ఏడు రోజులు మీరు తినే ఆహారంతో పాటు ఈ క్రింద వాటితో చేసిన వెజిటబుల్ సూప్ పరిమితి లేకుండా ఎప్పుడైనా తాగవచ్చు.
వెజిటబుల్ సూప్ తాయారు చేసే విధానం:
పెద్ద ఉల్లిపాయలు రెండు, క్యాప్సికప్ ఒకటి, టమోటాలు మూడు, 30 గ్రాముల క్యాబేజి, కాస్తంత కొత్తి మీర, 500 మిల్లీ లీటర్ల నీరు, ఉప్పు, మిరియాల పొడి మీ ఇష్టాన్ని బట్టి. వీటితో సూప్ చేసు కోవచ్చు.
గమనిక : బరువు పెరగడం అనేది మనిషి తినే ప్రవర్తనకు సంబంధించిన సమస్య. తిండి విషయంలో మీ ప్రవర్తన మార్చు కోకుండా బరువు తగ్గాలను కోవడం జరగని పని. ఇందుకు మీరు ఒబెసిటి సెంటర్ల చుట్టూ తిరిగితే చేతి డబ్బులు వదలటం, ఆరోగ్యం పాడు కావడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఓబెసిటి సెంటర్లది ప్రచార ఆర్భాటం, మోసం తప్ప మరేమి కాదు. సలహాల కోసం మీ కుటుంబ డాక్టరును లేదా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించండి.
బరువు తగ్గారా ?బాగానే ఉంది! కాని జాగర్తలు తీసు కోక పొతే తగ్గిన బరువును సరిగ్గా నెల నుండి రెండు నెలల్లో తిరిగి మామూలుగా అంతకు ముందు ఎంత బరువు ఉన్నారో అంతకు వస్తారు! బరువు తగ్గించు కోవటంలో ముఖ్యమయిన 'కిటుకు'(సూత్రం) ఏమిటంటే తగ్గిన బరువును పెరగకుండా చూసు కోవటం.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
అసలు అలా బరువు తగ్గటం ఎవరెవరు చేయ్యోచు ? అధిక బరువు ఉన్నమరీ వారం రోజుల్లో అలా బరువు తగ్గితే ఇబ్బందులు ఏమి రావా ?
వాళ్లు అందరు అర్హులు కారని నా అభిప్రాయం.
నవీన్ నడిమింటి కొన్ని సలహాలు
1.-డయాబెటిస్ ఉన్నవారు, దానికి మాత్రలు, ఇన్సులిన్ వాడే వారు ఈ పద్ధతిని పాటించి బరువు తగ్గటానికి పనికి రారు. మందులు వాడుతూ ఇలా చేయటం ప్రమాదం. అలాగే మానసిక రోగులు కుడా పనికి రారు. ఇతరత్రా ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు. త్వరగా కొంత బరువు తగ్గటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. జాగర్తలు లేకపొతే తిరిగి అదే వేగంతో బరువు పెరగటం తారు
2.- PCOD సమస్య తొ మెడిసిన్స్ వాడుతోంది. తను ఈ పద్దతిని అనుసరించవచ్చా? తెలప
తప్పకుండా ఆచరించ వచ్చు. అయితే ఎక్కువ మంది మహిళల్లో ఊబకాయం రావటానికి ముఖ్య కారణం పి. సి. ఓ. డి. శాస్వత ప్రాతిపదికన దానికి బట్టి బరువు తగ్గుతారు
2.-ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం నవీన్ నడిమింటి సలహాలు ఒకే సారి భారీగా బరువు తగ్గటం మంచిది కాదు.ఈ పద్దతి డైట్ ప్రకారం ఒకసారి తగ్గిన బరువును పెరగకుండాకనీసం ఆరు నెలలు కాపాడాలి. ఆ తరువాత మరో ప్రయత్నం చేయవచ్చు. అప్పుడు కూడా దాన్ని ఆరు నెలల పాటు కాపడాలి. ఇలా రెండు మూడేళ్ళలో మీరు తగ్గాలనుకున్న బరువుకు వచ్చి దాన్ని నిలుపు కోవాలి. మీరు హాయిగా ఈ చార్టును ఫాలో కావచ్చు. మీరే కాదు అదుపులో లేని చక్కెర జబ్బు ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన ఎవరు అయినా పాటించ వచ్చు. మిగిలిన ఎవెరు అయినా పాటించ వచ్చు.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి Naveen Nadiminti
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
మన గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి