10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

గాళ్ళబాడర్ స్టోన్ ఉన్న వాళ్ళు కు తీసుకోని వలసిన జాగ్రత్త లు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

పిత్తాశయం రాళ్లు అంటే ఏమిటి?

ఉదర కోశంలో కుడివైపున పిత్తాశయం ఉంటుంది అది పియర్ పండు ఆకారంలో ఉంటుంది. పిత్తాశయ రాళ్ళు లేదా కోలెలిథియాసిస్ (cholelithiasis) అనేవి  పిత్తాశయంలోని ఏర్పడిన కాల్షియం మరియు ఇతర లవణాలు యొక్క గట్టి రాయి వంటి డిపాజిట్లు (నిక్షేపణలు).

ఈ  రాళ్లు పిత్తాశయ నాళాలను నిరోధిస్తాయి, దీనివల్ల నొప్పి మరియు ఇతర లక్షణాలు సంభవిస్తాయి.కొందరు  అప్పుడప్పుడు, లక్షణాలు స్పష్టంగా కనిపించే వరకు వారి పిత్తాశయంలోని రాళ్ళు కలిగి ఉన్నారని గుర్తించలేరు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అనేక సందర్భాల్లో, పిత్తాశయ రాళ్ళు ఏ లక్షణాలను చూపవు. అవి చాలా కాలం పాటు పిత్తాశయంలో ఏవిధమైన  లక్షణాలు చూపకుండా ఉండవచ్చు. అయినప్పటికీ, రాళ్ళు పిత్తాశయ నాళాలను అడ్డగించడం మొదలు పెట్టినప్పుడు లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ఇవి ఉంటాయి

రాళ్ళు రెండు రకాలుగా ఉంటాయి:

  • కొలెస్ట్రాల్ రాళ్ళు (Cholesterol stones)
  • పిగ్మెంట్ రాళ్ళు (Pigment stones)

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

  • బైల్ (పైత్య రసం) లో అధిక కొలెస్టరాల్ ఉండడం వలన అది కొలెస్ట్రాల్ రాళ్ళను కలిగించవచ్చు. బైల్ లో అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే, అది కరగదు మరియు గట్టిపడి రాళ్లుగా రూపొందుతుంది.
  • బైల్ (పైత్య రసం) బిలిరుబిన్ (bilirubin) అనే పిగ్మెంట్ను కలిగి ఉంటుంది. కొన్ని రకాలైన కాలేయ వ్యాధులు లేదా రక్త కణలా రుగ్మతలలో, బిలిరుబిన్ అధికంగా ఏర్పడుతుంది, ఇది పిగ్మెంట్ రాళ్ళను ఏర్పరుస్తుంది.
  • పిత్తాశయం సరిగ్గా పని చేయకపోతే, దానిలోని పదార్దాలు ఖాళీ చేయబడవు (బయటకు వెళ్ళలేవు) మరియు అవి అధికంగా పోగుపడి రాళ్ళను ఏర్పరుస్తాయి.
  • మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత, ఊబకాయం మరియు నోటి ద్వారా గర్భనిరోధకాలు వంటివి కొన్ని ప్రమాద కారకాలు.

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు లక్షణాలను అంచనా వేసి రాళ్ళను పరిశీలించడం కోసం సిటి (CT) స్కాన్ లేదా అల్ట్రాసౌండ్ ను సూచిస్తారు.రోగ నిర్ధారణలో కాలేయం మరియు పిత్తాశయం యొక్క ఆరోగ్యాన్ని (పరిస్థితిని) పరీక్షించడానికి కాలేయ పనితీరు పరీక్ష(liver function) ను నిర్వహిస్తారు. పిత్త వాహిక అడ్డంకిని/నిరోధాన్ని తనిఖీ చేయడానికి, పిత్త వాహిక ద్వారా ప్రయాణించే ఒక ప్రత్యేక డైను ఉపయోగించి దానిని ఎక్స్-రే ద్వారా పరీక్షిస్తారు. రక్త పరిశోధనలు కూడా ఏవైనా సంబంధిత సమస్యలను మరియు అంటురోగాలను/సంక్రమణలను తెలుసుకోవడానికి సహాయపడతాయి.

పిత్తాశయ రాళ్లు ఉన్న రోగికి ఏవిధమైన లక్షణాలు లేకుండా ఉంటే, చికిత్స అవసరం లేదు. పిత్తాశయ రాళ్లు పునరావృత్తమవుతూ ఉంటే వాటిని పరిష్కరించడానికి శస్త్రచికిత్స చేసి పిత్తాశయాన్ని తొలగించడం అనేది ఒక ఉత్తమ మార్గం. శస్త్రచికిత్స తర్వాత పిత్తాశయం లేకపోవడం అనేది శారీరక విధులను ప్రభావితం చేయదు. అరుదుగా, రాళ్ళు కరిగించడానికి మందులను ఉపయోగిస్తారు. అయితే, ఇవి శస్త్రచికిత్స పద్ధతి వలె సమర్థవంతంగా ఉండవు, మరియు రాళ్లు పునరావృత్తమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పిత్తాశయ రాళ్లు కొరకు అల్లోపతి మందులు


Medicine NamePack Size
UrsocolUrsocol SR 450 Tablet (15)
Udiliv TabletUdiliv 450 Tablet
Wheezal Livcol SyrupWheezal Livcol Syrup
ADEL 34 Ailgeno DropADEL 34 Ailgeno Drop
SBL Eupatorium cannabinum DilutionSBL Eupatorium cannabinum Dilution 1000 CH
SBL Carduus marianus Mother Tincture QSBL Carduus marianus Mother Tincture Q
Schwabe Anthamantha oreoselinum CHSchwabe Anthamantha oreoselinum Dilution 1000 CH
Adven Ad Liv DropAdven Ad Liv Drop
Lord's L 170 Veins DropsLord's L 170 Veins Drop




*గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించుకోవడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్ ఆయుర్వేదం నవీన్ నడిమింటి సలహాలు 

     ఇప్పుడు మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే,గాల్ బ్లాడర్లోని స్టోన్ సైజ్ ను బట్టి, ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది.
    🔊 *గాల్ బ్లాడర్ స్టోన్స్ నివారించే నేచురల్ హోం రెమెడీస్*

🧖‍♀ *తరచూ అజీర్తి, పొట్టనొప్పి, వాంతులు మరియు వెన్నునొప్పితో బాధపడుతున్నారా? అయితే తప్పనిసరిగా చెకప్ చేయించుకోవాల్సిందే,. గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు కనబడుతాయి.*

❄ *పిత్తాశయం ఆరోగ్యంగా ఉంటేనే తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. శరీరంలో అంతర్గతంగా ముఖ్యమైన అవయవాల్లో గాల్ బ్లాడర్ ఒకటి. ఇది జీర్ణ శక్తినిపెంచడం మాత్రమే కాదు, ఫ్యాట్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది.*

📛 *గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడుటకు కారణం ఏమిటి? పేగుల్లోన్ని ఎక్సెస్ కొలెస్ట్రాల్ ను గ్రహించడం వల్ల రాళ్ళు రూపంలో ఏర్పడుతుంది. అలాగే గాల్ బ్లాడర్లో ఏర్పడే రాళ్ళు యొక్క పరిమణం కూడా ఒక్కో వ్యక్తిలో ఒక్కో సైజ్ లో ఉంటాయి. కొంత మందిలో చిన్నవిగా ఉంటే , మరికొంత మందిలో పెద్దవిగా ఉంటాయి.*

⭕ *గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించుకోవడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే,గాల్ బ్లాడర్లోని స్టోన్ సైజ్ ను బట్టి, ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ బెస్ట్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది.*

🌁 *ఈ నేచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వీటిని ఉపయోగించడం సురక్షితం . అటువంటి నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...*

🥐 *పసుపు:*

*పసుపు పురాత కాలం నాటి హోం రెమెడీ. ఇందులో ఆయాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించడానికి బెస్ట్ నేచురల్ హోం రెమెడీ. రెగ్యులర్ వంటల్లో పసుపును చేర్చడం లేదా పాలల్లో లేదా నీటిలో చేర్చి తాగడం వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ కరిగిపోతాయి.*

🍋 *నిమ్మరసం:*

*గాల్ బ్లాడర్ లో కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేయడానికి నిమ్మరసంను రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది తిరిగి స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది.*

🥖 *పెప్పర్ మింట్ టీ:*

*కొన్ని పుదీనా ఆకులు తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత దీన్ని వడగట్టి, కొద్దిగా తేనె మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు తాగించి మంచి ఫలితం ఉంటుంది. గాల్ బ్లాడర్ లో ఉండే రాళ్ళను కరిగించడంలో పెప్పర్ మింట్ గ్రేట్ గా సహాయపడుతుంది.*

🌰 *బీట్ రూట్ జ్యూస్ :*

*బీట్ రూట్ ను శుభ్రంగా తొక్క తీసి, కడిగి, ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి పేస్ట్ చేసి, జ్యూస్ తయారుచేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ కు పంచదార మిక్స్ చేయకుండా తాగడం వల్ల లివ్ శుభ్రపడుతుంది. గాల్ స్టోన్ నివారించడంలో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కూడా. దీనికి బేరిపండ్లు, ఆపిల్ జ్యూస్ ను కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇలా చేయడంవల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించుకోవచ్చు.*

🍀 *గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :*

*గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ విచ్ఛిన్నం చేయడానికి , పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా చేయడానికి సహాయపడుతుంది.*

🥗 *పండ్లు :*

*ఫైబర్ అధికంగా ఉండే మరో ఆహార పదార్థం పండ్లు. ఇది కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. రాళ్ళు కరిపోయేందుకు సహాయపడుతుంది.*

 🍜 *బార్లీ:*

*గాల్ బ్లాడర్ స్టోన్స్ నివారించడంలో బార్లీ గ్రేట్ గా సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ కానీ, దాని ద్వారా గాల్ స్టోన్స్ కానీ ఏర్పడకుండా నివారిస్తుంది.*

🍎 *ఆపిల్ సైడర్ వెనిగర్:*

*గాల్ బ్లాడర్ స్ట్రోన్ ను కరిగించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా గ్రేట్ గా సమాయపడుతుంది. దీన్ని రోజూ వాటర్ లో కలుపుకుని తాగడంవల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మరియు బ్లాడర్ లో రాళ్ళు కరిగిపోతాయి.*
 
*Treatment for Gall Bladder or Kidney stones.*

గాళ్ బ్లాడర్ స్తొన్ అలాగె కిడ్ని స్తొన్ రెంటికి ఒకె మందు

. కాని మికు రెమెడిస్ చెయడం వల్ల కొన్ని నెలలు పడుతుంది ఒపిక గ చెసుకొండి, లెధా అతి తక్కువ సమయంలొ పొవాలంటె నన్ను సంప్రదించండి లెధా అయుర్వెద వైద్దులను సంప్రదింమ్చండి.

రెమెడి, 

1 spoon కొండ పిండి ఆకుల పొడి *or* కొండ పిండి చెట్టు ఆకులు + 1 గ్లాసు నీళ్ళలో వేసి మరిగించి , వడ బోసి త్రాగవలెను.

ఉదయం Breakfast తర్వాత మరియు రాత్రి భోజనం తర్వాత త్రాగవలెను. లెదా ముందు తిసుకున్నా ఇబ్బందిలెదు.

గమనిక.. కొండ పిండి ఆకుల పొడి ఆయుర్వేధ షాపులో లభించును.

మూత్రపిండములలో రాళ్లు ఉన్నట్టు చాలమందికి తెలియదు. వారికి ఒక్కసారిగా వీపు భాగంలో విపరీతమైన నొప్పి మొదలై విలవిలలాడిపోతారు . చాలా భయంకరంగా నొప్పి వస్తుంది . ఈ విధమైన నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తి కి
మూసామ్బరం ని కంది గింజ అంత పరిమాణం లో తీసుకుని ఒక ద్రాక్ష పండు తీసుకుని దానిలో గింజలు తీసివేసి లొపల మూసామ్బరం పెట్టి మింగించి నీటిని త్రాగించా కేవలం 5 నిమిషములలో నొప్పి నుంచి విముక్తి లభించినది. 

          బొడ్డుకింద బాగంలో నొప్పి వచ్చినను ఇదే యోగం ఉపయోగపడుతుంది 

 గమనిక - 

      మూసామ్బరం మీకు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అగును. కలబంద ఆకులోని గుజ్జుని ఎండించి తయారుచేస్తారు. చంటిపిల్లలకు పాలు మాన్పించడానికి తల్లి యొక్క చనుమొనలు కు రాస్తారు.

*కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలంటే? ?*

 కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమేమిటంటే..? ఎముకలు విరిగినపుడో, గుల్లబారినపుడో ఎక్కువ కాలం కాల్షియం ట్యాబ్లెట్లను వాడితే అవి కాల్షియం ఆక్సలేట్‌గా మారి రాళ్లవుతాయి. క్యాల్షియం, ఫాస్పేట్స్, ఆక్సిలేట్స్, రసాయనాలుండే ఆహారాన్ని తీసుకున్నా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి. 

కిడ్నీలో రాళ్లు రాకుండా చేయాలంటే.. ఎక్కువగా మంచి నీళ్లు తాగాలి. ఇతర ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవటం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
 

*మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోవాలంటే* 

* తులసి రసం: ముందుగా తులసీ ఆకులతో రసం చేసుకోవాలి. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే తేనె కలిపి ప్రతీరోజూ ఉదయాన్నే సేవించాలి. కనీసం ఆరు నెలలు ఇలాగే చేస్చే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. 
 
*ఉలవచారు:*
                     కావలసినవి... ఉలవలు-ముల్లంగి ఆకులు, నీరు. ఉలవల్లో ముల్లంగి ఆకులను సన్నగా తరిగి కలపాలి. నీళ్లు బాగా పోసి ఉడికించాలి. పై నీటిని తీసి చారు చేసుకోవాలి. ఈ ఉలవచారును రోజు తాగితే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.

*వేపాకులు ఎండించికాల్చిన బూడిద స్పూన్  , ముల్లంగి రసంలో కలిపి త్రాగుతున్న రాళ్లు కరిగి పడిపోవును.

*మూత్రంలో రాళ్లు పోయేందుకు చిట్కాలు...*
***
వేపాకులు కాల్చి బూడిద చేసి పూటకు ఒకటిన్నర గ్రాములు ఒకరోజు నిల్వవుంచి నీటిలో కలిపి రెండుపూటలా త్రాగిన రాళ్లు కరిగిపోవును.
×. ప్రొద్దు తిరుగుడు చెట్టువేళ్లు పొడి 24 గ్రాములు లీటరు మజ్జిగలో కలిపి త్రాగాలి.
× పెసరపప్పు అరకేజి గ్రామును లీటరు మంచినీళ్లలో కలిసి కాచిపైన తేరినకట్టు త్రాగుచుంటే రాళ్లు పడిపోవును. 
× సీమగోరింట విత్తనాలు 1 నుంచి 2 గ్రాములు ప్రతిరోజు ఉదయం మంచినీటితో కలిసి సేవించిన రాళ్లు కరిగుతాయి

*గాల్ బ్లాడర్ స్టోన్స్*

పిత్తాశయంలో రాళ్లు ఏర్పడితే శస్త్రచికిత్స ఒక్కటే మార్గం అనుకుంటారు చాలా మంది. కానీ ఆయుర్వేద చికిత్సతో ఆ అవసరం లేకుండా రాళ్లు కరిగిపోతాయి. మళ్ళీ మళ్ళీ సమస్య పునరావృతం కాదు.

ఆయుర్వేదంలో గాల్‌స్టోన్స్‌ను పిత్తాశ్మరీ అంటారు. ప్రకోపించిన వాతము పిత్తాశయంలో చేరి తన రూక్ష్మ గుణంచే పైత్యరసాన్ని ఎండింపజేస్తుంది. పిత్తము తన పాకగుణంచే దీనిని ఒక రాయిలా తయారుచేయును. దీనిని పిత్తాశ్మరీ అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది కొలెస్ట్రాల్ స్టోన్ . పైత్యరసంలో ఎక్కువగా కొలెస్ట్రాల్‌ చేరినపుడు అది పిత్తాశయంలో పేరుకుని కొలెస్ట్రాల్‌ స్టోన్ గా మారుతుంది. 

*రెండవది ఫిగ్మెంటెడ్‌ స్టోన్‌.* కాలేయంలోని చనిపోయిన ఎర్రరక్తకణాలు నాశనం చేసేటప్పుడు (హీమోలైసిస్‌) బైలిరూబిన్‌ అనే పదార్థం విడుదలవుతుంది. ఇది ఎక్కువగా పోగై పిత్తాశయం చేరుకున్నప్పుడు పిగ్మెంటెడ్‌ స్టోన్స్  ఏర్పడతాయి.


*పిత్తాశయం లో రాళ్లు నివారణ* -

         కొందరిలో కొవ్వు పదార్ధం (కొలెస్టరాల్ ) గట్టి పడటం వాలా పిత్తాశయం లో రాళ్లు ఏరపడతాయి. ఉదరం లోని కుడి పక్క ఉండే ఎముకల కింద తెరలు తెరలుగా నొప్పి వస్తుంటుంది.

1.-ఆవు మూత్రంలో కరక్కాయ పొడిని వేసి మరిగించి చల్లార్చి అందులో లోహ భస్మం + బెల్లం వేసి తాగిస్తే రాళ్లు కరిగి పోతాయి.

2.-వేపాకు రసాన్ని కూడా 2 స్పూన్లు తాగించాలి.

3.- ఆహారం లో ముల్లంగిని వాడాలి అరటి దూట రసం తగ్గించినా రాళ్లు కరిగి పోతాయి.

4.-ఉలవలు తరచూ ఆహారంలో వాడాలి. ఉలవ చారు చేసుకొని తాగాలి. గాల్ బ్లాడర్ లోని రాళ్లు కరిగి పోతాయి.

5.-గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటుగా చేసుకుంటే శరీరం లోని కొవ్వు గట్టి పడకుండా కాపాడుతుంది.

6.=వ్యాయామం , యోగా , ప్రతిరోజూ నడక ఉపయోగకరంగా ఉంటుంది.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

https://t.me/HelathTipsbyNaveen

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి

కామెంట్‌లు లేవు: