22, డిసెంబర్ 2019, ఆదివారం

ఎసిడిటి నివారణ

  1. ఎసిడిటీ నివారణ కు అవగాహనా నవీన్ నడిమింటి సలహాలు 

    మన శరీరం రైలు లాంటిది. ఆ బండికి ఇంజన్‌ జీర్ణక్రియ. ఇంజన్‌ సరిగా పనిచేస్తే కానీ బండి సవ్యంగా ముందుకు కదలదు. ఇంజన్‌ దెబ్బతింటే ఆరోగ్యవ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమవుతుంది. ఛిన్నాభిన్నం అవుతున్న నేటి ఆధునిక జీవనశైలివల్ల అజీర్తి, ఎసిడిటి, మలబద్ధకం వంటి సమస్యలు జీర్ణక్రియల్ని దెబ్బతీస్తున్నాయి.
    ఆ సమస్యకు పరిష్కారాలు చూపిస్తున్నారు సర్జికల్‌ గ్యాసో్ట్ర ఎంట్రాలజిస్ట్‌, బేరియాట్రిక్‌
    అండ్‌ అడ్వాన్స్‌డ్‌ లాప్రోస్కోపిక్‌ సర్జన్‌
    డాక్టర్‌.టిఎల్‌విడి. ప్రసాద్‌ బాబు
    సహజసిద్ధంగా మన జీర్ణవ్యవస్థ ఎంతో పటిష్టమైనది. కాబట్టే ఏ రకమైన ఆహారాన్నైనా ఆరగించేసుకుని వ్యర్ధాన్ని విసర్జించేస్తుంది. అలాగని ఎప్పుడంటే అప్పుడు చేతికందిన ప్రతి పదార్థాన్నీ పొట్టలో తోసేయకూడదు. అలాచేస్తే కొంతకాలానికి జీర్ణవ్యవస్థ పనిచేయటం మొరాయిస్తుంది. అలాంటప్పుడే అజీర్తి, అల్సర్లు, విరేచనాలు, మలబద్ధకంలాంటి సమస్యలు మొదలవుతాయి. జీర్ణవ్యవస్థలో ప్రధాన అవయవాలు... జీర్ణకోశం, చిన్న పేగులు, పెద్దపేగులు. ఈ మూడిట్లో తలెత్తే ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్య అయినా జీర్ణవ్యవస్థ రుగ్మతల కోవ కిందకే వస్తుంది. జీర్ణసంబంధ రుగ్మతలలో ప్రధానమైనవి ఇవే.
    అజీర్తి
    ఆహారం అరుగుదల మందగించటమే అజీర్తి. కడుపు ఉబ్బరం, త్రేన్పులు, ఆహారం తింటున్నప్పుడే పొట్ట నిండిపోయినట్టు అనిపించటం, పొట్టలో శబ్దాలు... ఇవన్నీ అజీర్తి లక్షణాలు. అయితే అజీర్తి ప్రతి ఒక్కరూ ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొనే సమస్యే! కానీ పొట్టలో అల్సర్లు, ఇన్‌ఫెక్షన్లు, హార్మోన్‌ సమస్యలు ఉన్నవాళ్లలో అజీర్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి రుగ్మతలేవీ లేనివాళ్లలో తరచుగా అజీర్తి తలెత్తుతుందంటే...అందుకు కొన్ని కారణాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం.
    ఒత్తిడి
    అస్తవ్యస్త జీవనశైలి (రాత్రుళ్లు ఎక్కువసేపు మేలుకోవటం)
    కొవ్వులు, నూనెలు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తరచు తీసుకోవటం.
    నిద్రలేమి
    ఆహారం పూర్తిగా నమలకుండా తినటం
    చికిత్స: సహజంగా అజీర్తి ఓ వారంలోగా దానంతట అదే తగ్గిపోతుంది. అలాకాకుండా రెండు వారాలు దాటినా అదుపు కాకపోతే తప్పనిసరిగా వైద్యుల్ని కలవాలి. క్యాన్సర్‌ రోగుల్లో ప్రధానంగా కనిపించే లక్షణం అజీర్తి కాబట్టి స్వల్ప రుగ్మతే కదా అని నిర్లక్ష్యం చేస్తే అంతర్గతంగా దాగిఉన్న ప్రాణాంతక వ్యాధి మరింత ముదిరిపోయే ప్రమాదం ఉంది.
    ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే..
    రాత్రి నిద్రకు రెండు గంటల ముందుగానే భోజనం ముగించాలి.
    తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి.
    మసాలా, కారాలు ఉన్న ఆహారం తగ్గించాలి.
    అల్కహాల్‌, సిగరెట్లు మానేయాలి.
    ఒత్తిడి తగ్గించుకోవాలి.
    రోజు మొత్తంలో 6 నుంచి 8 సార్లు స్వల్ప పరిమాణాల్లో ఆహారం తీసుకోవాలి.
    ఎసిడిటీ
    తిన్న ఆహారం అరగకపోతే తలెత్తే మొదటి సమస్య ‘ఎసిడిటీ’. ఛాతీలో మంట, గొంతులోకి యాసిడ్‌ తన్నుకురావటం, పొట్టలో నొప్పి దీని ప్రధాన లక్షణాలు. ఎసిడిటీని తగ్గించుకోవటం కోసం యాంటాసిడ్‌లు వాడినా అవన్నీ తాత్కాలికంగా ఉపశమనాన్నిస్తాయి తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపించలేవు. ఎసిడిటీకి ప్రధాన కారణాలు..
    భోజనవేళలు పాటించకపోవటం.
    నూనెలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం
    స్థూలకాయం
    శారీరక వ్యాయామం చేయకపోవటం
    నొప్పి నివారణ మందుల వాడకం
    ఆందోళన, ఒత్తిడి
    ఏరేటెడ్‌ డ్రింక్స్‌, కాఫీలు, టీలు పరిమితికి మించి తాగటం.
    ఆల్కహాల్‌
    చికిత్స: ఎసిడిటీకి కారణం జీర్ణాశయంలో అవసరానికి మించి యాసిడ్‌ ఉత్పత్తి కావటమే! కాబట్టి ఆ యాసిడ్‌ ఉత్పత్తి తగ్గించటం లేదా దాన్ని న్యూట్రలైజ్‌ చేసే మందులతో ఎసిడిటీని సమర్ధంగా నివారించవచ్చు. అలాగే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. ప్రధానంగా ఈ జాగ్రత్తలు పాటించాలి.
    వేళకు ఆహారం తీసుకోవాలి.
    ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండాలి.
    వైద్యులు సూచించిన యాంటాసిడ్లు వాడాలి.
    సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగాలి.
    ఎసిడిటీకి కారణమయ్యే పదార్థాలను గుర్తించి వాటికి దూరంగా ఉండటం.
    అల్సర్లు
    ఎసిడిటీని నిర్లక్ష్యం చేస్తే జీర్ణకోశంలో పుండ్లు పడే ప్రమాదం ఉంది. వీటినే అల్సర్లు అంటారు. పొట్టలో ఉత్పత్తయ్యే యాసిడ్‌ వల్ల జీర్ణాశయానికి రంధ్రాలు పడకుండా మ్యూకస్‌ అనే పొర కాపాడుతూ ఉంటుంది. అయితే ఏ కారణం వల్లనైనా ఈ మ్యూకస్‌ పలచబడితే యాసిడ్‌ చొచ్చుకునివెళ్లి జీర్ణాశయానికి రంధ్రాలు చేస్తుంది. ఈ రంధ్రం మరింత లోతుగా వెళ్లి రక్తనాళాలను దెబ్బతీస్తే రక్తపు వాంతులు, పొట్టలో తట్టుకోలేనంత నొప్పి, రక్తపు విరేచనాలులాంటి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అప్పుడిక సర్జరీ ఒక్కటే పరిష్కారం. అల్సర్లకు దారితీసే పరిస్థితులు ఇవే!
    ఎసిడిటీని నిర్లక్ష్యం చేయటం.
    అల్సర్‌కు కారణమయ్యే హెలికోబాక్టర్‌ పైలోరి అనే బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స తీసుకోకపోవటం.
    పెయిన్‌ కిల్లర్స్‌ విచ్చలవిడిగా వాడటం.
    ఆల్కహాల్‌, సిగరెట్లు విపరీతంగా తాగటం.
    చికిత్స: అల్సర్‌కు అసలు కారణాన్ని గుర్తించకుండా యాంటాసిడ్‌లతో కాలం గడిపేయకూడదు. రెండు వారాలకు మించి ఎసిడిటీ వేధిస్తూ ఆహారం తినలేకపోతుంటే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. అప్పుడే అల్సర్‌కు అసలు కారణాన్ని వైద్యులు కనుక్కుని తగిన చికిత్స అందించగలుగుతారు. బ్యాక్టీరియా కారణమైతే దాన్ని నిర్మూలించే సమర్ధమైన మందులు సూచిస్తారు. ఎసిడిటీ కారణంగా అల్సర్‌ తలెత్తితే యాసిడ్‌ ఉత్పత్తిని తగ్గించే మందుల్ని సూచిస్తారు. ఒకవేళ అల్సర్‌ వల్ల జీర్ణాశయంలో రంధ్రాలు ఏర్పరిస్తే ఎండోస్కోపీ ద్వారా ఆ రంధ్రాన్ని మూసి రక్తస్రావాన్ని ఆపేస్తారు. అయితే ఈ చికిత్సల అవసరం పడేవరకూ తెచ్చుకోకుండా ఈ ముందు జాగ్రత్తలు పాటించాలి.
    నొప్పి నివారణ మందులు వాడేవాళ్లు తప్పసరిగా వైద్యుల సూచన మేరకు యాంటాసిడ్‌లు వాడాలి.
    ఆల్కహాల్‌, స్మోకింగ్‌ మానేయాలి.
    తిన్న వెంటనే వాంతి అవుతున్నా, దాన్లో రక్తం కనిపించినా తక్షణమే వైద్యుల్ని సంప్రదించాలి.
    ఇరిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌
    పెద్ద పేగులకు సంబంధించిన రుగ్మత ఇది. పేగుల్లో శబ్దాలు, పొట్టలో నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్‌, డయేరియా లేదా మలబద్ధకం, మోషన్‌లో మ్యూక్‌స...ఈ సమస్య ప్రధాన లక్షణాలు. ఇవే లక్షణాలు పెద్దపేగు క్యాన్సర్‌లో కూడా కనిపిస్తాయి. ఇరిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ కారణాలు ఇవే!
    జీర్ణాశయం పరిమితికి మించి సంకోచ వ్యాకోచాలకు గురవటం.
    ఫుడ్‌ అలర్జీ
    ఒత్తిడి
    హార్మోన్లలో అవకతవకలు
    పేగుల్లో బ్యాక్టీరియా చేరుకోవటం
    చికిత్స: అసలు కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఫుడ్‌ అలర్జీ అయితే ఆ పదార్థాలకు దూరంగా ఉండటం, ఒత్తిడి తగ్గించుకోవటం చేయాలి. పేగుల్లో బ్యాక్టీరియాను సమర్ధమైన మందులతో వదిలించాలి. సాధారణంగా జీవనశైలిని సవరించుకోవటం ద్వారా ఎక్కువశాతం వ్యాధి లక్షణాలను తగ్గించుకోవచ్చు. సె్ట్రస్‌ మేనేజ్‌మెంట్‌, లైఫ్‌స్టయిల్‌ ఛేంజె్‌సతో ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ అదుపులోకొస్తుంది. వీటితోపాటు ఈ జాగ్రత్తలు కూడా పాటించాలి.
    కంటి నిండా నిద్ర తప్పనిసరి.
    ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి.
    గ్యాస్‌ ఉత్పత్తి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి.
    అలర్జీ కలిగించే డైరీ ప్రొడక్ట్స్‌, సోయాలాంటి గింజలు మానేయాలి.
    వైద్యులు సూచించిన యాంటీ డిప్రెసెంట్‌, యాంటీబయాటిక్స్‌ వాడాలి.
    మలబద్ధకం
    మలవిసర్జన తేలికగా జరగటం లేదంటే మలబద్ధకానికి గురయ్యామని అర్థం. ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకి ఒకటి లేదా రెండుసార్లు మలవిసర్జన చేయగలగాలి. ఇలాకాకుండా రోజులతరబడి మలవిసర్జన జరగకుండా ఇబ్బంది పెడుతుంటే అది కచ్చితంగా మలబద్ధకమే! ఈ సమస్యను మరింత నిర్లక్ష్యం చేస్తే మొలలు, ఫిషర్స్‌లాంటి సమస్యలు కూడా తోడవుతాయి. మలబద్ధకానికి ప్రధాన కారణాలు ఇవే.
    మానసిక ఒత్తిడి
    తగినంత నీరు తాగకపోవటం
    మాంసకృత్తులు ఎక్కువ, పీచు పదార్థం తక్కువ ఉన్న ఆహారం తీసుకోవటం.
    కాలకృత్యవేళల్ని పాటించకపోవటం.
    మానసిక రుగ్మతలకు వాడే మందులు
    నిద్రలేమి
    వ్యాయామం చేయకపోవటం
    ఒబెసిటీ
    చికిత్స: ఎక్కువశాతం మంది మలబద్ధక సమస్య ఉన్న వ్యక్తులు పైల్స్‌ తలెత్తేవరకూ ఆగి ఆ తర్వాతే వైద్యుల్ని కలుస్తూ ఉంటారు. అప్పటివరకూ ఆగకుండా మందుగానే మలబద్ధకాన్ని నివారించుకోగలిగితే పైల్స్‌ సమస్యే ఉండదు. సింపుల్‌ టెక్నిక్స్‌తో నివారించుకోవలసిన ఈ సమస్య మీద అవగాహన లేక జటిలం చేసుకుంటూ ఉంటారు. ఈ సమస్యను వైద్యులు సూచించే లాక్సేటివ్స్‌, ఫైబర్‌ సప్లిమెంట్స్‌తో పరిష్కరించుకోవచ్చు..
    ఒత్తిడి తొలగించే ధ్యానం, యోగాలాంటి వ్యాయామాలు చేయాలి.
    బరువు తగ్గాలి.
    అవసరం అనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా కాలకృత్యాలు తీర్చుకోవాలి.
    తగినన్ని నీళ్లు తాగాలి.
    పళ్లరసాలు, సలాడ్స్‌ తీసుకోవాలి.
    ఆకలి లేకపోవటం
    రెండు వారాలకు మించి ఆకలి మందగించినా, బరువులో విపరీతమైన తగ్గుదల కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. క్యాన్సర్‌ కాకుండా ఆకలి లోపానికి ఇతర కారణాలు ఇవే!
    బ్యాక్టీరియా లేదా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌
    మానసిక సమస్యలు
    ఒత్తిడి, బోర్‌డమ్‌
    హైపోథైరాయిడిజం
    చికిత్స: ఆకలి మందగించటానికి కారణాన్ని వైద్యులు కనిపెట్టి వైద్యపరమైన సమస్యలుంటే వాటికి చికిత్స చేయటం ద్వారా ఆకలిని పెంచుతారు. ఈ చికిత్సతోపాటు ఆకలి పెరగటానికి ఈ సూచనలు పాటించాలి.
    తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవటం.
    ప్రొటీన్‌ డ్రింక్స్‌ తీసుకోవటం.
    శారీరక వ్యాయామం చేయటం
    మానసిక ప్రశాంతత.
    ఇవి పాటించండి..
    జీర్ణవ్యవస్థ సమర్థంగా పనిచేయాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.
    పిజ్జాలు, బర్గర్లులాంటి ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ సమతులాహారం తీసుకోవాలి.
    బయటి ఆహారానికి బదులుగా హోమ్‌ఫుడ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి.
    కాఫీలు, టీలు, ఆల్కహాల్‌, ఏరేటెడ్‌ డ్రింక్స్‌ సాధ్యమైనంత తగ్గించాలి.
    జీవనగడియారం దెబ్బతినకుండా పరిమిత వేళల్లో నిద్ర పోవాలి.
    రాత్రి నిద్రకు రెండు గంటలముందే ఆహారం ముగించాలి.
    తొందరగా పడుకుని తొందరగా లేవాలి.
    శారీరక వ్యాయామం తప్పనిసరి.
    ఉదయం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి.
    రాత్రివేళ తేలికైన ఆహారం తీసుకోవాలి.
    తాజా ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు, పొట్టు తీయని పప్పులు వాడాలి.
    నీళ్లు ఎక్కువగా తాగాలి.
    ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉదయం అల్పాహారం మానకూడదు.
    ఫుడ్‌ అలర్జీలను గమనించి తదనుగుణంగా ఆహార నియమాలు పాటించాలి.
    జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎంత చిన్న ఇబ్బందైనా రెండు వారాలకు మించి వేధిస్తూ ఉంటే వెంటనే వైద్యుల్ని కలవా

    1. ధన్యవాదములు 
    2. మీ నవీన్ రోయ్ 


    Loading

    గుండె నొప్పి కు తీసుకోవాలిసిన జాగ్రత్తలు

    గుండెల్లో నొప్పి , అవగాహనా కోసం ఆయాసం నవీన్ నడిమింటి సలహాలు 

    ఛాతీ నొప్పి, ఆయాసం


    మనం ఒక్కొక్కసారి ఛాతీలో నొప్పిని, ఆయాసాన్ని అనుభవిస్తుంటాం. ఇవి గుండె, ఆహారనాళాలకు సంబంధించిన వ్యాధుల వలన మాత్రమే కాక, ఛాతీ భాగంలో ఉండే ఊపిరితిత్తుల వల్ల కూడా కలుగవచ్చు. స్థూలకాయులలోనూ, 40 సంవత్సరాలు పైబడిన వారిలోనూ, హై బిపి, మధుమేహం వ్యాధి ఉన్నవారిలో, ధూమపానం చేసే వారిలో (వీరిని హైరిస్క్‌ గ్రూప్‌ అంటారు) ఛాతీలోని నొప్పి, ఆయాసం వస్తే, గుండెకు సంబంధించిన వ్యాధులేమైనా ఉన్నాయేమో అనుమానించాలి.
    ఛాతీ ప్రదేశంలో ముందు భాగంలో గుండె,వెనుక భాగంలో ఆహార నాళం కొద్దిగా ఎడమవైపు ఉంటాయి.అందుకనే మనం ఒక్కొక్కసారి ఆహారనాళంలో (ఈసోఫేగస్‌) మంటను గుండె నొప్పిగా భ్రమపడుతుంటాము. అలా ఛాతీ నొప్పిగా ఉన్నపుడు ఆహార నాళాన్ని పరీక్ష చేయించుకోవాలి. ఛాతీ భాగంలోని ఛాతీకుహరంలో ఊపిరితిత్తులు ఉంటాయి. ఛాతీలోని చర్మం, కండరాలు, ఎముకలు, ఊపిరి తిత్తుల వ్యాధులున్నా ఛాతీలో నొప్పి అనుభవమవుతుంది.
    న్యుమోనియా వల్ల…
    న్యుమోనియా వల్ల కూడా ఛాతీ నొప్పి వస్తుంది.ఈ వ్యాధిగ్రస్థుల్లో దగ్గు,జ్వరం ఉంటుంది.న్యుమోనియా తగ్గేంత వరకూ ఈ ఛాతీ నొప్పి ఉంటుంది. ఊపిరితిత్తుల పై పొరలో (ఫూ్లరల్‌ కేవిటీ) గాలి నిండితే న్యూమోథొరాక్స్‌, నీరు నిండితే ప్లూరల్‌ ఎఫ్యూజన్‌, అనే వ్యాధులు వచ్చినా ఛాతీలో నొప్పి ఉంటుంది. ఈ వ్యాధులు నెమ్మదిగా రావచ్చు. లేదా హఠాత్తుగా సంభవించవచ్చు. దీంతో నొప్పితో పాటుగా ఛాతీ బరువు కూడా అనిపిస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.
    శ్వాస నాళాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలలో (పల్మొనరి ఆర్టరీస్‌) రక్తం కొన్ని సందర్భాలలో గడ్డకడుతుంది. ఈ గడ్డలు పెద్దవిగా ఉంటే రక్త నాళాల్లో అడ్డుపడతాయి.
    అప్పుడు ఆ రక్తనాళం ఏయే ప్రాంతాలకు రక్తాన్ని సరఫరా చేయాలో ఆ ప్రాంతాలకు రక్త సరఫరా నిలిచిపోతుంది.అటువంటి సమయంలో ఆ భాగాలు దెబ్బతింటాయి. దీనిని పల్మొనరీ ఇన్‌ఫెక్షన్‌ అని అంటారు. దీనిలో ఛాతీ నొప్పి, ఆయాసం దగ్గుతో పాటుగా రక్తం పడుతుంది. సరైన చికిత్స లేకుండా ఈ స్థితి కొనసాగితే శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా తగ్గి క్రమంగా రక్తపోటు పడిపోతుంది. ఫలితంగా ప్రాణాపాయ స్థితి సంభవిస్తుంది. ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్‌, అడినోమా వ్యాధిలో ప్రారంభ దశ నుంచి నొప్పి మందంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో చికిత్స చేస్తే తప్ప నొప్పి తగ్గదు.
    సిగరెట్లు తాగే వారిలో…
    దీర్ఘకాలంగా సిగరెట్లు తాగే వారిలో శ్వాసనాళాలలో అడ్డంకి ఏర్పడుతుంది.దీనిని క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ఎయిర్‌వే డిసీజ్‌ అంటారు.ఈ వ్యాధికి గురైన వారు అస్తమాతో బాధపడుతున్న వారు బరువుగా ఊపిరి తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా కండరాలు అలిసిపోయి మెడ, గొంతు, ఛాతీ, కడుపు కండరాలు నొప్పి పెడతాయి.మనం తీసుకున్న ఆహారం జీర్ణకోశంలోకి వెళ్లడానికి ఆహార నాళంలో పెరిస్టాటిక్‌ కదలికలు ఉపయోగపడతా యి. ఉదరవితానం (డయాఫ్రం) కూడా శ్వాసక్రియలో పైకి కిందకు జరుగుతూ దాని ప్రభావాన్ని ఆహారనాళంపై చూపుతుంటుంది. ఆస్తమా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ఎయిర్‌వే డిసీజ్‌లు ఉన్న వారిలో ఉదరవితానం కిందకు, జీర్ణాశ యం మీదకు జారిపోయి హయాటస్‌ హెర్నియా వస్తుంది. కడుపులోని ఆమ్లాలు ఛాతీలోకి నెట్టబడతాయి. ఈ కారణంగా ఆహారనాళంలో మంట, నొప్పి వస్తాయి. దీనిని కూడా మనం ఛాతీ నొప్పిగా భ్రమపడుతుంటాం.
    ప్రమాదం జరిగినప్పుడు…
    ఏదేని ప్రమాదానికి గురైనప్పుడు ఛాతీ ఎముకలు విరిగి, అవి ఊపిరితిత్తులలో గుచ్చుకోవచ్చు. అప్పుడు ఊపిరితిత్తుల నుంచి గాలి, రక్తం బైటకు రావచ్చు. ఎముకలు విరగకపోయినా, ఛాతీకి మూగ దెబ్బలు తగలడం వలన ఊపిరితిత్తులు వత్తుకుపోయి పల్మొనరీ కంట్యూషన్‌ స్థితి రావచ్చు. అప్పుడు ఛాతీలో నొప్పి. దగ్గులో రక్తం పడుతాయి. రోడ్డు ప్రమాదాలలో ఛాతీ వత్తుకుపోయి, పైకి కనిపించని దెబ్బలు తగిలి రక్తనాశాలు, శ్వాసనాళాలు దెబ్బతిని ప్లూరల్‌ కేవిటీలో రక్తం, గాలి జమకూడవచ్చు. ఫలితంగా హీమోథొరాక్స్‌ కాని, న్యూమోథొరాక్స్‌ కాని రావచ్చు. లేదా రెండూ రావచ్చు. రక్తం మామూలుగా ప్రవహించే ప్రాంతాలలో కాకుండా, కొత్త ప్రాంతాలలో చేరితే ఆ భాగంలో ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. పయోథొరాక్స్‌ అనే స్థితి కలిగి చీము ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఛాతీలో నొప్పి ఉంటుంది.
    గుండె వ్యాధులున్న కొందరికి కాళ్లలో నీరు చేరి వాపులు కనబడతాయి. ఇటువంటి వారు పడుకున్నప్పుడు ఆ నీరు గుండెలోకి చేరుతుంది. అక్కడ నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ స్థితిని ఆర్ధోప్నియా అంటారు. అప్పుడు ఆయాసం, ఊపిరి భారమై రోగికి నిద్రాభంగమవుతుంది. దీనిని పెరాక్సిస్మల్‌ నాక్టర్నల్‌ డిసీజ్‌ అంటారు. ఊపిరితిత్తుల వ్యాధులుంటే ఆయాసంతో పాటు పొడి దగ్గు ఉంటుంది. వీరిలో రాను రాను తలదువ్వుకోవడం వంటి చిన్న పనులు చేసినా ఆయాసం ఎక్కువతుంది. ఊపిరితిత్తులలో పారంకైమా కణాలుంటాయి. వాటిలో అల్వియోలైలు ఉంటాయి. వాటి చుట్టూ ఇంటర్‌స్టీషియమ్‌ అనే పొర ఉంటుంది. ఇది దెబ్బ తినడం వలన ఇంటర్‌స్టీషియల్‌ లంగ్‌ డిసీజ్‌ రావచ్చు. ఇది ప్రైమరీ, సెంకడరీ అని రెండు రకాలుగా ఉంటుంది. ఏ కారణం తెలియకుండా ఈ వ్యాధి సోకితే ప్రైమరీ అనీ, ఏదో ఒక కారణం వలన వస్తే సెకండరీ అని అంటారు. ఈ రెండింటిలోనూ ఆయాసం ఎక్కువగా ఉంటుంది.
    ఊపిరితిత్తులలోని పారంకైమా కణాలు క్షయ వంటి వ్యాధులు సోకినప్పుడు దెబ్బ తింటుంటాయి. ఆ వ్యాధి తగ్గినా, దాని వలన కలిగే మచ్చల వలన ఊపిరితిత్తులలో కొంతభాగం దెబ్బతిని, మిగిలిన భాగం మీద ఒత్తిడి ఎక్కువై ఆయాసం వస్తుంది. అలాగే శ్వాసనాళాలు కఫంతో మూసుకునిపోవడం వలన శ్వాస సరిగ్గా అందక ఆయాసం వస్తుంది. ఏదైనా పదార్థం ఊపిరితిత్తులలోకి వెళితే శ్వాసనాళాలలో అడ్డంపడి ఊపిరి అందక ఆయాసం వస్తుంది.
    లింఫోమా, క్షయ, వ్యాధులలో లింఫ్‌ నోడ్స్‌ పెరుగుతాయి. అవి ఊపిరితిత్తుల మీద వత్తిడిని కలిగించి, శ్వాస నాళాలు మూసుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా ఆయాసం వస్తుంది. ఎపిగ్లాటిస్‌కు ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా కోరింత దగ్గు వచ్చినా, ఎడతెరిపి లేని దగ్గుతో ఆయాసం వస్తుంది. లారింజో ట్రేకియో బ్రాంకైటిస్‌. ఎక్స్‌ట్రిన్సిక్‌ ఎలర్జిక్‌ ఆల్వియోలైటిస్‌, ధూమపానం వనల సోకే బ్రాంకైటిస్‌లతో కూడా ఆయాసం వస్తుంది.స్థూలకాయులలో ఊపిరి తీసుకున్నప్పుడు ఛాతీ పెరుగుదల ఆశించినంత ఉండకపోతే ఆయాసం కలుగుతుంది. నరాలకు, ఛాతీ కండరాలకు సంబంధించిన పోలియో మెలైటిస్‌, మయస్థీనియా గ్రావిస్‌, సెర్వికల్‌ సై్పనల్‌ కార్డ్‌ గాయాలు మొదలైన వాటిలో నరాలు, కండరాలు బలహీనమై ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఫలితంగా ఆయాసం కలుగుతుంది.

    కొంతమంది ముక్కు దిబ్బడ వేసి ఊపిరాడక ఇబ్బంది పడుతుంటారు. దీనికి, శ్వాసావయావాలు ఇబ్బందుల వలన ఊపిరి ఆడక పోవడానికి తేడా ఉంది. ఆవిరి పడితే లోపలి తేమ పలుచనై, అడ్డంకి తొలగిపో తుంది. శ్వాసావయ వాల లోపాల వలన కలిగే ఊపిరి ఇబ్బందు లు ఆ అనారోగ్యాన్ని తగ్గిస్తే తొలగుతాయి.

    -ఛాతీకి తీసే స్కాన్‌ పరీక్షను భోజనం ముందు లేదా తరువాత కూడా చేయించుకోవచ్చు.
    -ఛాతీలో ఇంటర్‌కాస్టల్‌ ట్యూబ్‌ ఉన్నవారు నిలబడినా, కూర్చున్నా, పడుకున్నా బ్యాగ్‌ ఒక మీటరు క్రిందకే ఉండేటట్లు చూసుకోవాలి. దాన్ని చేత్తో పట్టుకొని కాలకృత్యాలకు కూడా వెళ్ళవచ్చు.
    - ఆస్తమా ఉన్న చిన్న పిల్లలను స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలి. అన్ని పోషకాహార పదార్థాలు ఇవ్వాలి. వారికి వ్యాధి నిరోధకత, పెరుగుదల ముఖ్యం.
    - దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే గాలి తుంపర్లలో వైరస్‌, బాక్టీరియాలు ఉంటాయి. అవి దగ్గినపుడు ఇతరులకు వ్యాపిస్తాయి, కాబట్టి విధిగా మోహానికి రుమాలు అడ్డం పెట్టుకోవడం మంచిది.
    - ఛాతీలోని నీరు, చీము పరీక్ష కోసం నొప్పి తెలియకుండా మత్తు మందు (లోకల్‌ ఎనస్తీషియా) ఇచ్చి తీస్తారు.
    -ప్రాణాయామ, ఈత వంటివి ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే వ్యాయామాలు.
    -డాక్టర్‌ నవీన్ రోయ్

    స్కిన్ ఇన్ఫెక్షన్ సలహాలు

    అలర్జీ వ్యాధులకు నివారణ కు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు …

    అలర్జీ వ్యాధులకు చెక్‌ ఇలా…


    నేడు చాలామంది రకరకాల అలర్జీ వ్యాధుల బారిన పడు తున్నారు. కొందరికి ఆహార పదార్థాలు సరిపడక పోవటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, మరి కొందరికి దుమ్ము, ధూళి, చల్లని పదార్థాలు మొదలైన వాటి వల్ల అలర్జీ కలుగుతుంది.
    ఏ మనిషిలోనైన అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్‌ అంటారు. ఒక వ్యక్తి తనకు సరిపడని పదార్థాలు (అలర్జెన్స్‌) తీసుకున్నప్పుడు అతడి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ తేలికగా, అతి ఎక్కువగా స్పందించి అలర్జీని కలిగిస్తుంది.
    కారణాలు
    అలర్జీ కలిగించే వాటిలో ముఖ్యమైనవి దుమ్ము, ధూళి, బూజు, ఫంగస్‌, సరిపడని ఆహారం, వంశపారంపర్యంగా, కొన్నిరకాల ఔషధాలు, కాస్మొటిక్స్‌, స్ప్రేలు, పౌడర్లు, హెయిర్‌ డైస్‌.
    లక్షణాలు
    అలర్జీ వల్ల ముక్కునుండి నీరు కారడం, ముక్కు బిగుసుకుపోయి శ్వాస ఆడకపోవడం, ఉదయం లేవగానే ఆగకుండా తుమ్ములు రావటం, దగ్గుతో పాటు ఆయాసం రావటం, ఛాతి బరువుగా అనిపించటం, కళ్లు ఎర్రబడి నీరు కారడం, ఒంటిపై దద్దుర్లు, చర్మం పొడిగా అనిపించటం, దురద రావటం, ఘాటైన వాసనలు పడకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండటం.
    జాగ్రత్తలు
    శీతల పానీయాలు, చల్లటి పదార్థాలు మానివేయాలి. దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాలలోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్కు తప్పని సరిగా ధరించాలి. సరిపడని పదార్థాలను గుర్తించి వాటిని కొద్ది రోజులు తినకుండా ఉండాలి. కాస్మొటిక్స్‌, స్ప్రేలు, పౌడర్లు, డైస్‌ వాడేముందు వైద్యుల సలహా తప్పని సరిగా తీసుకోవాలి. ప్రతి రోజు విధిగా శారీరక వ్యాయామం చేయాలి.
    చికిత్స
    హోమియోవైద్యంలో అలర్జీ వ్యాధులకు చికిత్స ఉంది. వ్యాధి లక్షణాలను, వ్యక్తి మానసిక, శరీరక లక్షణాలను పరిగణలోకి తీసుకొని మందులను ఎంపిక చేస్తారు. ఈ మందులతో అలర్జీ వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు. ఆ మందులు..
    ఆర్సినికం ఆల్బం
    ఈ మందు ఎలర్జీ వ్యాధులకు ఆలోచించదగినది. ముక్కునుండి నీరు కారడం, దగ్గు, జ్వరంతో పాటు వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, కళ్ల నుండి నీరు కారడం, ఒంటిపై దద్దుర్లు, చర్మం పొడిగా మంటగా అనిపించడం, దురద రావడం, విపరీతమైన నీరసం, తరుచుగా దాహం, ఒళ్లు నొప్పులు, మానసిక ఆందోళన, భయం వంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.
    జెల్సీమియం
    దాహం లేకపోవట, రోగి మగతగా, నీరసంతో అలిసిపోయినట్లుగా ఉండి ముక్కునుండి నీరు కారడం, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలున్న వారికి ఈ మందు ఆలోచించదగినది. మానసిక స్థాయిలో వీరు తేలికగా ఆందోళన చెందుతారు.
    ఎకోనైట్‌
    చల్ల గాలిలో తిరగడం వలన ముక్కు బిగుసుకుపోయి, తుమ్ములు, గొంతు నొప్పి వెంటనే ప్రారంభమవుతుంది. మింగటం కష్టంగా మారి గొంతు మంటమండుతుంది. దాహం విపరీతంగా ఉండి బాధ పడుతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ఆవిరికి చలికాలంలో బాధలు ఎక్కువగా ఉంటాయి.
    హెపార్‌సల్ఫ్‌
    వీరు చాలా సున్నిత స్వభావులు. తేలికగా అలర్జీ బాధలకు గురవుతారు. చల్లగాలి సోకగానే బాధలు మొదలవుతాయి. గొంతులో ముల్లు గుచ్చుతున్నట్లుగా అనిపించి మింగినప్పుడు విపరీతమైన నొప్పి రావడం ప్రత్యేక లక్షణం. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రధానమైనది. ఈ మందులే కాకుండా ఇపికాక్‌, రస్‌టాక్స్‌, నైట్రోమోర్‌, టుబర్కులినం, ఎల్లియం సెఫా,ఫెర్రంపాస్‌, కాలిమోర్‌, మెగ్‌ఫాస్‌, లేకసిస్‌, కాల్కేరియా కార్బ్‌, సల్ఫర్‌ ఎపిస్‌, పల్సటిల్లా వంటి కొన్ని మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్‌ సలహ మేరకు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
    ధన్యవాదములు 
    మీ నవీన్ నడిమింటి 

    చిన్న ఏజ్ లో కీళ్ల నొప్పులు నివారణకు

    కీళ్లనొప్పులు ఉన్న వాళ్ళు తీసుకోవాలిసిన జాగ్రత్తలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహా  - ఆయుర్వేదం మందులు 

    కీళ్లనొప్పులు 


    ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు.
    ‘కీళ్లనొప్పులు’ ప్రస్తుత కాలంలో అతిచిన్న (30-40) వయసులోనే మొదలవుతున్నాయి. ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్‌ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం సామాన్య కారణాలుగా చెప్పవచ్చు.
    అలాగే దినచర్యలో సరైన వ్యాయామం, సరియైన సమయంలో నిద్రపోకపోవడం, (స్వప్న విపర్యం అనగా పగలు నిద్రించడం, రాత్రి ఎక్కువగా మేల్కొని ఉండటం వంటివి) కూడా సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే మానసికంగా ఎక్కువగా ఆలోచించటం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఈ కీళ్ల నొప్పులకు సామాన్య కారణాలుగా పరిగణించవచ్చు.
    ఈ కీళ్ల నొప్పులను ఆయుర్వేదశాస్త్రంలో మూడు విధాలుగా వర్ణించారు.
    1. సంధివాతం – Oesteo arthritis
    2. ఆమవాతం – Rheumatoid arthritis
    3. వాతరక్తం – Gout
    సంధి వాతం (Oesteo arthrities)
    సంధివాతాన్ని ఆస్టియో ఆర్ధరైటిస్‌గా ఆయుర్వేదం పరిగణిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా త్రిదోషపరంగా చూసినట్లయితే సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్లనుండి శబ్దాలు (Crepites) ఉంటాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియల్ ఫ్లూయిడ్) శ్లేషక కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వలన నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి ఉంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమస్య 50-60 సంవత్సరాల మధ్య వయసు వారికి వస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈవ్యాధి ఎక్కువగా వస్తూంటుంది.
    ఈ సమస్యకు ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సోరియాసిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆహారంలో పోషకవిలువల లోపం వలన కూడా (విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్) ఈ వ్యాధి వస్తుంది.
    జీవన విధానంలో కొన్ని రకాలైన మార్పుల వలన ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, అధిక బరువులు తలపైన లేదా వీపుమీద మోయటం ఎక్కువగా కంప్యూటర్స్ ముందు కూర్చోవటం… ఇలాంటివి కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి.
    ఆమ వాతం (Rheumatoid arthritis)
    రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ముఖ్యంగా ఆమం, వాతం అనే రెండు దోషాల ప్రభావం వల్న ఈ సమస్య వస్తుంది. మానసిక ఒత్తిడి వలన ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం వలన, సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన, వ్యాయామం లేకపోవటం వలన, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవటం లాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు (Swelling), తీవ్ర వేదన (Pain), కొద్దిపాటి జ్వరం (Mild Temp) కీళ్లు బిగుసుకుపోవటం (Stiffness), ఆకలి మందగించటం, మలబద్దకం (Constipation) లాంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఈ వ్యాధి అన్ని కీళ్లలో వస్తుంది (Including small joints).
    వాత రక్తం (Gout)
    Goutను వాతరక్తంగా పరిగణిస్తాం. ఇది మధ్యవయసు వారిలో ఎక్కువగా వస్తూంటుంది.
    కారణాలు: ఎక్కువగా మద్యపానం, అధిక మాంస సేవనం (హై ప్రొటీనిక్ ఆహారం) ఎక్కువగా పులుపు, ఉప్పు, మసాలాలు ఆహారపదార్థ సేవన, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉండే ఆహారపదార్థాలు తినటం వలన అలాగే వీటితోపాటు శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం వీటన్నిటివలన వాతం, రక్తం ఈ రెండు దుష్టి చెంది వాత రక్తంగా సమస్య ఏర్పడుతుంది. క్లినికల్‌గా చూసినట్లయితే ఈ సమస్యలో యూరిక్ ఆసిడ్ లెవెల్స్ రక్తంలో పెరుగుతాయి.
    లక్షణాలు: ఎరుపు, వాపు, నొప్పితో కూడిన కాలిబొటన వేలు నుండి ప్రారంభమై, తర్వాత మిగిలినటువంటి కీళ్లకు వ్యాపిస్తుంది. దీనిలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది.
    ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు
    ఆయుర్వేద శాస్త్రంలో…
    1. నిదాన పరివర్జనం
    2. ఔషధ సేవన
    3. ఆహార విహార నియమాలు
    ఈ మూడు పద్ధతుల ద్వారా ఈ వ్యాధులకు పూర్తిగా చికిత్స చేయవచ్చు.
    1. నిదాన పరివర్జనం: వ్యాధి కారణాలను తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం. ఉదాహరణకు పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొనటం వంటి కారణాలను విడిచిపెట్టటం.
    2. ఆహార విహార నియమాలు: ఆహారం సరైన టైమ్‌కి తినటం, వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, తగు వ్యాయామం, సరైన టైమ్‌కి విశ్రాంతి లాంటి నియమాలు పాటించడం.
    3. ఔషధ సేవన: ఔషధ సేవన విషయానికి వస్తే, ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఎ) శమనం బి) శోధన ం
    ఎ) శమనం: అనగా వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం.
    బి) శోధనం: అంటే పంచకర్మ. పంచకర్మలలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు) తరువాత వమన, విరేచన, వస్తి (ప్రధాన కర్మలు) తరువాత పశ్చాత్ కర్మలు చేయించవలసిన అవసరం ఉంటుంది. ఇవికాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, బానువస్తి, పత్రపోటలీ, వాలుకాస్వేదం మొదలగు బాహ్యచికిత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు 
    ధన్యవాదములు 
    మీ నవీన్ నడిమింటి 

    గ్యాస్ట్రిక్ సమస్య నివారణ


    1. అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

      Why You Must Avoid Deep Fried Foods?సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జంక్ ఫుడ్ తినటానికి ఇష్టపడతారు. అయితే వీటిలో బాగా నూనెలో వేయించిన ఆహారాలు మీ పొట్టకు హాని కలిగిస్తాయి. జంక్ ఆహారం తిన్న తర్వాత పొట్టలో నొప్పి, కొంత అసౌకర్యం కలుగుతుంది. దీనికి కారణం బాగా వేయించిన ఆహారంలో కొవ్వు అధికంగా వుండి మీకు అధిక కేలరీలు చేరుస్తుంది. అటువంటి సమస్యలు రాకుండా వేపుడు పదార్ధాలు తక్కువగా తినాలి. వాటికొరకు ప్రత్యేకంగా ఇష్టపడకండి. ఈ ఆహారాలు మీకు గ్యాస్ సమస్యలు, ఇతర పొట్ట అసౌకర్యాలు కలిగిస్తాయి.

      జంక్ ఫుడ్ వలన వచ్చే సమస్యలు!
      గుండె మంట - బాగా వేయించిన ఆహారాలు అనేక సమస్యలు తెస్తాయి. వాటిలో గుండె మంట ఒకటి. తరచుగా వేపుడు ఆహారాలు తింటే ఛాతీలో కిందిభాగంలో మంట వస్తుంది. అది పొట్టకు కూడా వ్యాపిస్తుంది. దీనినే గుండెమంట అంటారు. గుండె మంట తరచుగా వస్తూంటే, సమస్యలు ఎక్కువవుతాయి. అటువంటి సమస్యలు రాకుండా వేపుడు ఆహారాలు తగ్గించి, ఉడికించిన ఆహారం తినండి.
      గ్యాస్ సమస్యలు - పొట్ట లైనింగ్ లో మంట వస్తే గ్యాస్ సమస్యలు వస్తాయి. దీని లక్షణాలు అజీర్ణం, వాంతులు, వికారం, బరువు తగ్గటం, కడుపు ఉబ్బరించటం, ఆకలి లేకపోవుట, త్రేన్పులు గా వుంటాయి. అధిక వేపుడు ఆహారం తింటే పొట్ట గ్యాస్ ఏర్పడి త్వరగా నిండిపోయిందనుకుంటాం. కనుక వేపుడులు లేదా జంక్ ఫుడ్ బాగా తగ్గించండి.
      కడుపులో పుండ్లు - పొట్ట లోపలి భాగంలో లేదా పెద్ద పేగు పైన పుండ్లు వస్తాయి. వీటిని పెప్టిక్ అల్సర్ అంటారు. పైలోరి అనే బాక్టీరియా ఈ సమస్య కలిగిస్తుంది. దీనికి కారణం వేపుడు ఆహారాలు పొట్టలో ఎసిడిటీ, పుండ్లు కలిగించడమే. కనుక జంక్ ఫుడ్ మాని పొట్ట సమస్యలు తగ్గించుకోండి. వేపుడులు తింటే పొట్ట యాసిడ్లు కూడా పెరుగుతాయి. ఇవి తగ్గటానికి చాలా సమయం పడుతుంది.
      అజీర్ణం - పొట్టలో అసౌకర్యం మొదలై అది అజీర్ణానికి దోవతీస్తుంది. ఇది తీవ్ర సమస్య కానప్పటికి సాధారణ సమస్య. ఇది ఫ్యాటీ ఫుడ్ అంటే యాసిడ్ కలిగి పొట్టకు బరువుగా వుంటుంది. ఈ పొట్ట సమస్య ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా మెల్లగా తింటూ తగ్గించుకోవచ్చు. మీ ఆహారం మీరు బాగా నమిలితే, అది తేలికగా జీర్ణం అవుతుంది మీ పొట్ట సమస్యలు తగ్గిస్తుంది.
      జంక్ ఫుడ్ బదులుగా వండిన ఆహారాలు - జంక్ ఫుడ్ అధికమైతే గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకుగాను బాగా వేయించిన ఆహారాలు వదలండి. బదులుగా వండిన లేదా ఉడికించిన పదార్ధాలు తినండి. నొప్పి కొనసాగితే, డాక్టర్ ను సంప్రదించి రోగ నిర్ధారణ చేయించుకొని చక్కని ఆహార ప్రణాళిక రూపొందించండి.

      మీరు ఏ రకం ఆహారాలు తినాలి? శాకాహారాలైన, తోటకూర, బచ్చలికూర, బ్రక్కోలి, బీన్స్, కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పెరుగు వంటివి అధికంగా తినాలి.

      వివరించిన ఈ సమస్యలు గ్యాస్, అధిక యాసిడ్ల ఉత్పత్తి తగ్గించే వేపుడు ఆహారాలు ఎందుకు తినరాదో తెలుపుతాయి.

      పొట్టలో గ్యాస్ ఏర్పడితే ఏం చేయాలి నవీన్ సలహాలు ?

      Effects of Gas In Stomachనేటి రోజులలో పొట్టలో గ్యాస్ ఏర్పడటం సర్వసాధారణమైపోయింది. ప్రతివారూ కూల్ డ్రింకులు తాగడం లేదా బేకరీ ఫుడ్ వంటి జంక్ ఫుడ్ లు అధికంగా తినటంతో అజీర్ణం, మలబద్ధకం వంటివి ఏర్పడి పొట్టలో గ్యాస్ పుడుతుంది. పొట్టలో గ్యాస్ వున్నపుడు ఏమీ చేయలేము. అది తోచనివ్వదు, స్ధిమితంగా వుండలేము. ఈ సమస్యకు కారణం జీవనశైలిలో మార్పు అని గ్రహించాలి.

      గ్యాస్ ఏర్పడటానికి కారణాలను మరింత వివరంగా పరిశీలిస్తే, వ్యాయామం లేకపోవడం, తిన్న వెంటనే అతిగా నిద్రపోవడం, కొన్ని మందుల వలన జీర్ణాశయంలో, కొన్ని సూక్ష్మ జీవుల వలన అని చెప్పవచ్చు. గ్యాస్ ఏర్పడితే, పైనుండి నోటి ద్వారా త్రేన్పులవలన లేదా కిందనుండి అపాన వాయువగా గాని బయటికి పోవాలి. లేకుంటే ఎంతో అసౌకర్యంగా వుంటుంది. జీర్ణవ్యవస్థ, పేగుల ఇన్ ఫెక్షన్ లోపంవంటివాటి వల్ల, కార్బోహైడ్రేట్లు అంటే దుంపకూరలు, పప్పులు వంటివి ఎక్కువగా వాడడం వల్ల పేగులలో వుండే ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల కూడా గ్యాస్‌ ఏర్పడుతుంది.
      కడుపు ఉబ్బరిస్తుంది. ఆయాసంకలుగుతుంది, గుండెలో మంట, తేన్పులు వస్తాయి.

      కడుపు ఉబ్బరాన్ని నివారించడానికిగాను వ్యాయామం అతిముఖ్యమైంది. అందుకుగాను ప్రతి రోజు అరగంట నుండి ఒక గంట వరకు ఉదయం, లేక సాయంత్రంవేగంగా నడవాలి. లేదా అరబిక్, స్విమ్మింగ్, సైకిలింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. నీళ్లు బాగా తాగాలి. రాత్రిపూట ఆహారం తిన్న వెంటనే నిద్రించరాదు. ఆహారానికి నిద్రకు ఉపక్రమించటానికి కనీసం రెండు లేదా మూడు గంటల వ్యవధి వుండాలి. గ్యాస్‌ ఎక్కువ చేసే ఆహారాలు తగ్గించాలి. మసాలాలు, బేకరీ ఆహారాలు తగ్గించాలి. ఒకే సమయానికి మితంగా ఆహారం తినాలి. ఈ చిట్కాలతో గ్యాస్ ఏర్పడటం తగ్గకపోతే, వైద్యులను సంప్రదించి తగిన మందులు వా
    2. ధన్యవాదములు 
    3. మీ నవీన్ నడిమింటి 
    4. *సభ్యులకు విజ్ఞప్తి*
      ******************
       మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 
      ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
      https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/


    Loading
    1. అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

      Why You Must Avoid Deep Fried Foods?సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జంక్ ఫుడ్ తినటానికి ఇష్టపడతారు. అయితే వీటిలో బాగా నూనెలో వేయించిన ఆహారాలు మీ పొట్టకు హాని కలిగిస్తాయి. జంక్ ఆహారం తిన్న తర్వాత పొట్టలో నొప్పి, కొంత అసౌకర్యం కలుగుతుంది. దీనికి కారణం బాగా వేయించిన ఆహారంలో కొవ్వు అధికంగా వుండి మీకు అధిక కేలరీలు చేరుస్తుంది. అటువంటి సమస్యలు రాకుండా వేపుడు పదార్ధాలు తక్కువగా తినాలి. వాటికొరకు ప్రత్యేకంగా ఇష్టపడకండి. ఈ ఆహారాలు మీకు గ్యాస్ సమస్యలు, ఇతర పొట్ట అసౌకర్యాలు కలిగిస్తాయి.

      జంక్ ఫుడ్ వలన వచ్చే సమస్యలు!
      గుండె మంట - బాగా వేయించిన ఆహారాలు అనేక సమస్యలు తెస్తాయి. వాటిలో గుండె మంట ఒకటి. తరచుగా వేపుడు ఆహారాలు తింటే ఛాతీలో కిందిభాగంలో మంట వస్తుంది. అది పొట్టకు కూడా వ్యాపిస్తుంది. దీనినే గుండెమంట అంటారు. గుండె మంట తరచుగా వస్తూంటే, సమస్యలు ఎక్కువవుతాయి. అటువంటి సమస్యలు రాకుండా వేపుడు ఆహారాలు తగ్గించి, ఉడికించిన ఆహారం తినండి.
      గ్యాస్ సమస్యలు - పొట్ట లైనింగ్ లో మంట వస్తే గ్యాస్ సమస్యలు వస్తాయి. దీని లక్షణాలు అజీర్ణం, వాంతులు, వికారం, బరువు తగ్గటం, కడుపు ఉబ్బరించటం, ఆకలి లేకపోవుట, త్రేన్పులు గా వుంటాయి. అధిక వేపుడు ఆహారం తింటే పొట్ట గ్యాస్ ఏర్పడి త్వరగా నిండిపోయిందనుకుంటాం. కనుక వేపుడులు లేదా జంక్ ఫుడ్ బాగా తగ్గించండి.
      కడుపులో పుండ్లు - పొట్ట లోపలి భాగంలో లేదా పెద్ద పేగు పైన పుండ్లు వస్తాయి. వీటిని పెప్టిక్ అల్సర్ అంటారు. పైలోరి అనే బాక్టీరియా ఈ సమస్య కలిగిస్తుంది. దీనికి కారణం వేపుడు ఆహారాలు పొట్టలో ఎసిడిటీ, పుండ్లు కలిగించడమే. కనుక జంక్ ఫుడ్ మాని పొట్ట సమస్యలు తగ్గించుకోండి. వేపుడులు తింటే పొట్ట యాసిడ్లు కూడా పెరుగుతాయి. ఇవి తగ్గటానికి చాలా సమయం పడుతుంది.
      అజీర్ణం - పొట్టలో అసౌకర్యం మొదలై అది అజీర్ణానికి దోవతీస్తుంది. ఇది తీవ్ర సమస్య కానప్పటికి సాధారణ సమస్య. ఇది ఫ్యాటీ ఫుడ్ అంటే యాసిడ్ కలిగి పొట్టకు బరువుగా వుంటుంది. ఈ పొట్ట సమస్య ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా మెల్లగా తింటూ తగ్గించుకోవచ్చు. మీ ఆహారం మీరు బాగా నమిలితే, అది తేలికగా జీర్ణం అవుతుంది మీ పొట్ట సమస్యలు తగ్గిస్తుంది.
      జంక్ ఫుడ్ బదులుగా వండిన ఆహారాలు - జంక్ ఫుడ్ అధికమైతే గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకుగాను బాగా వేయించిన ఆహారాలు వదలండి. బదులుగా వండిన లేదా ఉడికించిన పదార్ధాలు తినండి. నొప్పి కొనసాగితే, డాక్టర్ ను సంప్రదించి రోగ నిర్ధారణ చేయించుకొని చక్కని ఆహార ప్రణాళిక రూపొందించండి.

      మీరు ఏ రకం ఆహారాలు తినాలి? శాకాహారాలైన, తోటకూర, బచ్చలికూర, బ్రక్కోలి, బీన్స్, కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పెరుగు వంటివి అధికంగా తినాలి.

      వివరించిన ఈ సమస్యలు గ్యాస్, అధిక యాసిడ్ల ఉత్పత్తి తగ్గించే వేపుడు ఆహారాలు ఎందుకు తినరాదో తెలుపుతాయి.

      పొట్టలో గ్యాస్ ఏర్పడితే ఏం చేయాలి నవీన్ సలహాలు ?

      Effects of Gas In Stomachనేటి రోజులలో పొట్టలో గ్యాస్ ఏర్పడటం సర్వసాధారణమైపోయింది. ప్రతివారూ కూల్ డ్రింకులు తాగడం లేదా బేకరీ ఫుడ్ వంటి జంక్ ఫుడ్ లు అధికంగా తినటంతో అజీర్ణం, మలబద్ధకం వంటివి ఏర్పడి పొట్టలో గ్యాస్ పుడుతుంది. పొట్టలో గ్యాస్ వున్నపుడు ఏమీ చేయలేము. అది తోచనివ్వదు, స్ధిమితంగా వుండలేము. ఈ సమస్యకు కారణం జీవనశైలిలో మార్పు అని గ్రహించాలి.

      గ్యాస్ ఏర్పడటానికి కారణాలను మరింత వివరంగా పరిశీలిస్తే, వ్యాయామం లేకపోవడం, తిన్న వెంటనే అతిగా నిద్రపోవడం, కొన్ని మందుల వలన జీర్ణాశయంలో, కొన్ని సూక్ష్మ జీవుల వలన అని చెప్పవచ్చు. గ్యాస్ ఏర్పడితే, పైనుండి నోటి ద్వారా త్రేన్పులవలన లేదా కిందనుండి అపాన వాయువగా గాని బయటికి పోవాలి. లేకుంటే ఎంతో అసౌకర్యంగా వుంటుంది. జీర్ణవ్యవస్థ, పేగుల ఇన్ ఫెక్షన్ లోపంవంటివాటి వల్ల, కార్బోహైడ్రేట్లు అంటే దుంపకూరలు, పప్పులు వంటివి ఎక్కువగా వాడడం వల్ల పేగులలో వుండే ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల కూడా గ్యాస్‌ ఏర్పడుతుంది.
      కడుపు ఉబ్బరిస్తుంది. ఆయాసంకలుగుతుంది, గుండెలో మంట, తేన్పులు వస్తాయి.

      కడుపు ఉబ్బరాన్ని నివారించడానికిగాను వ్యాయామం అతిముఖ్యమైంది. అందుకుగాను ప్రతి రోజు అరగంట నుండి ఒక గంట వరకు ఉదయం, లేక సాయంత్రంవేగంగా నడవాలి. లేదా అరబిక్, స్విమ్మింగ్, సైకిలింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. నీళ్లు బాగా తాగాలి. రాత్రిపూట ఆహారం తిన్న వెంటనే నిద్రించరాదు. ఆహారానికి నిద్రకు ఉపక్రమించటానికి కనీసం రెండు లేదా మూడు గంటల వ్యవధి వుండాలి. గ్యాస్‌ ఎక్కువ చేసే ఆహారాలు తగ్గించాలి. మసాలాలు, బేకరీ ఆహారాలు తగ్గించాలి. ఒకే సమయానికి మితంగా ఆహారం తినాలి. ఈ చిట్కాలతో గ్యాస్ ఏర్పడటం తగ్గకపోతే, వైద్యులను సంప్రదించి తగిన మందులు వా
    2. ధన్యవాదములు 
    3. మీ నవీన్ నడిమింటి 
    4. *సభ్యులకు విజ్ఞప్తి*
      ******************
       మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 
      ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
      https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/




    20, డిసెంబర్ 2019, శుక్రవారం

    కామెర్లు మూర్చ ఫ్రీ గా ట్రీట్మెంట్

    మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

    https://vaidyanilayam.blogspot.com/
    ==================
    👉 మూర్ఛ వ్యాధికి కామెర్లకు  ఉచితంగా మందులు ఇవ్వబడును
    ***********************
     ప్రతి ఆదివారం ఉదయం, మూర్ఛ వ్యాధి, కామెర్ల వ్యాధికి, ఆకు పసరు మందు ఉచితంగా ఇవ్వబడును.
     పై సమస్యలు ఉన్న వాళ్ళు, ఉదయం పరగడుపున టీ కాఫీలు అల్పాహారం సేవించు కుండా  రావాలి.మీరు వచ్చేటప్పుడు ఒక గ్లాసు మజ్జిగ మీ వెంబడి తెచ్చుకోండి. ఎందుకంటే మందు తిని మజ్జిగ తాగా వలసి వస్తుంది. శనివారం ఫోన్ చేసి, తెలియజేసి రావలెను. పై రెండు సమస్యలకు ఎలాంటి పైకము తీసుకోకుండా ఉచితంగా ఇస్తారు.
     👉కామెర్ల వ్యాధికి మూడు ఆదివారాలు మందు తీసుకోవాలి
    👉 మూర్ఛ వ్యాధికి ఆరువారాలు మందు తీసుకోవాల్సి వస్తుంది.
     పచ్చను ఏమి తినాలి ఏమి తినకూడదు అనె  వివరాలు
     మీకు మందు ఇచ్చేటప్పుడు తెలియజేస్తారు.
    అనువంశిక వైద్యులు చింత రఘునాథ్ రెడ్డి గారు. ఈ సమస్యలకే కాకుండా, తెల్లబట్ట,
     మలబద్దక సమస్య లు, వాత నొప్పులు  మొదలగు వాటికి కూడా వైద్యం చేయబడును. మరి కొన్ని హెల్త్ ప్రొడక్ట్ కూడా వీరి దగ్గర దొరుకుతాయి.వీటికి అమౌంట్ ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తోంది. రాయలసీమ జిల్లా వాసులు, కర్ణాటక వాసులు ఈ అవకాశాన్ని వినియోగించు వలసినదిగా కోరుతున్నాను ఈ ప్రాంతం వారికి దగ్గర పడుతుంది కాబట్టి.

    👉 ఇలాంటి వైద్యులు ప్రపంచానికి తెలియక మారుమూల ప్రాంతాలలో ఉంటున్నారు. అలాంటి వారిని వెలికితీసే ప్రయత్నం లోనే, నా ఈ చిరు ప్రయత్నం, అలాగే మీ ప్రాంతంలో కూడా ఎవరైనా వైద్యం చేస్తుంటే, వారి వివరాలు ఇస్తే వాట్సాప్ గ్రూప్ లో పెడతాను.
     మందుల ద్వారా మెడికల్  సైన్స్ లో తగ్గని, ఇలా ఎన్నో వ్యాధులకు ఆయుర్వేదంలో సులభమైన చికిత్సలు ఉన్నాయి, అందరూ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి
     మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోండి
     గ్రామీణ వైద్యులనుప్రోత్సహించండి
     వారి సేవలను గుర్తించండి
    👉 వైద్యుని చిరునామా:-
    చింతా రఘునాథ రెడ్డి,
     గ్రామం :-ఊట్కూరు,
     మండలం :-పరిగి
     తాలూకా :- హిందూపురం
    జిల్లా  :-అనంతపురం. (AP)
     ఫోన్ నెంబర్:-8099266166
    =====================
     తెలంగాణలో పై సమస్యలకు ఇక్కడ కూడా మందు ఇవ్వబడును
    🔹 మద్యపానం మానడానికి, మూర్ఛ వ్యాధికి, కామెర్లకు, క్యాన్సర్ కు ఆదివారం ఉచితంగా మందులు ఇవ్వబడును
    👉 చిరునామా:-
     మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్
     భీమారం, చింతగట్టు.
     కరీంనగర్ రోడ్డు. హనుమకొండ
     హనుమకొండ బస్టాండ్ నుండి 8కిలోమీటర్ల దూరం ఉంటుంది.
     వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్లు ఉంటా ది.
     కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి 12 కిలోమీటర్లు ఉంటా ది
    👉 ముందుగా ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి.

     👉ఫోన్ నెంబర్-984941040


     జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం

    చలి కాలం జలుబు దగ్గు ఇతర సమస్య కు జాగ్రత్తలు సలహాలు

    *చలి కాలం లో వచ్చే  అన్ని రకాల జ్వరాలు మరియు దగ్గు జలుబు &అధిక  బరువు  తగ్గటానికి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

    1.జ్వరాలు - నల్ల జీలకర్ర
    -----------------
    నల్ల జీలకర్ర ను మెత్తగా చూర్ణించి
    పూటకు అరటీ స్పూన్ పొడిని వేడి వేడిపాలలో కలుపుకొని తాగుతూ వుంటే అయిదారు రోజుల్లో అన్ని రకాల జ్వరాలు, పాత జ్వరాలు కూడాహరించిపోతయ్.

    2.జ్వరాలకు వేప:--

    వంద గ్రాములు వేప చెట్టు మాను
    బెరడును కచ్చాపచ్చాగా నలగొట్టి,
    అరలీటర్ మంచినీళ్ళలో వేసి,
    పావులీటర్ నీళ్ళు మిగిలేవరకు
    మరిగించి గుడ్డలో వడపోయాలి.
    చల్లార్చిన తర్వాత అందులో 50 గ్రా
    తేనె కలిపి, జ్వరం వచ్చిన వారిచేత
    తాగించాలి. తాగిన వెంటనే చెమటలుపట్టి జ్వరం దిగిపోతుంది. అవసరమైతేరెండవ రోజు కూడా ఇలాగే చేస్తే ఏజ్వరమైనా సునాయాసంగా తగ్గిపోతుంది. పిల్లలకు వయసును బట్టి
    మోతాదు తగ్గించి  ఇవ్వాలి

    *3.- విరేచనాలు తగ్గడానికి*
         👉పాత బెల్లం ఆవాలు ఈ రెండు సమంగా కలిపి మెత్తగా నూరి అర చెంచా మోతాదుగా రెండు పూటలా తింటుంటే నీళ్ల విరేచనాలు తగ్గిపోతాయి.
    👉 పాత బెల్లం అల్లం సమభాగాలుగా తీసుకొని దంచి రోజూ రెండు పూటలా అరచెంచా మోతాదుగా తీసుకొని నీళ్లు తాగుతూ ఉంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.

    *4.-నోటిపూతకు*
       
    1. వస చూర్ణం 50 గ్రాములు
    2. ధనియాల చూర్ణం 50 గ్రాములు
    3.లోద్దుగచెక్క 50 గ్రాములు
    ఈ మూడు సమభాగాలు కొంచెం మంచి నీళ్ళతో మెత్తగా నూరి
    ఆ గంధాన్ని నోట్లు పూచిన చోట పట్టిస్తూ ఉంటే నోటి పూత తగ్గిపోతుంది.
    " ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ లో మరిన్ని హెల్త్ టిప్స్ చూడండి

     *5.-అధిక బరువు నడకతో తరుగు*

    నగరంలో ప్రతి 10 మందితో ఏడుగురున్నారు.సహజంగా పురుషుల కంటే మహిళలే ఈస్టోజన్ హార్మోను ఎక్కు
    వగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమ
    వుతోంది. దీంతో మహిళలు తక్కువ
     తిన్నా లావు అవుతున్నట్లు బాధపడుతుంటారు. ఇంటి పనికి ఒంటి బరువు కు సంబంధం లేదు వ్యాయాయం లేకపోవడం కారణమే వంట చేయగామిగిలినవి, ఫ్రిజ్ లో పెట్టుకొనితర్వాత వేడి చేసుకొని తినడం,రోజుకు నాలుగైదుసార్లు టీ, కాఫీలు తాగడం వలన బరువు పెరిగి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాను.

    👉• అధిక బరువు వలన పని -
    చేసుకోలేరు. కొంచెంసేపు
    పనిచేసినాఅలసిపోతుంటారు. కొద్ది
    దూరం నడిచినా ఆయాసం
    వస్తుంది.
    👉బరువు చికాకు పెరిగి రక్త
    పోటు కూడా వచ్చేప్రమాదం ఉంది.
    👉ఒక రకమైన ఆత్మన్యూనతా
    భావానికి గురవుతుంటారు.
    👉నివారణ చర్యలు
    🔹ఎంత తీరిక లేని పని ఉన్న రోజు
    తప్పనిసరిగా అరగంటసేపు నడవాలి
    🔸 అరగంటసేపు నడిస్తే 🏃‍♀200 క్యాలరీలుకరుగుతాయి. ప్రతిరోజు 500 క్యాలరీల శక్తిని కరిగించాలి.
    🔹నూనె పదార్థాలు తక్కువగా తినాలి.పోషకాలు ఎక్కువగా ఉండే పప్పుధాన్యాలు, చిక్కుడు గింజలు, కూరగాయలు , పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
    🔹 టీ, కాఫీ తగ్గించాలి. రోజుకు
    ఒకసారి తీసుకుంటే చాలు.
    🔸🏃‍♀ ముఖ్యంగా మీరు వాకింగ్ చేసి వచ్చిన వెంటనే కాఫీ తాగకూడదు. ఏదైనా పళ్లరసాలు తాగండి.

    https://www.blogger.com/u/1/blogger.g?blogID=7084904128746559076#allposts

    థైరాయిడ్ సమస్య పై అవగాహనా సలహాలు నవీన్ నడిమింటి

    🙏థైరాయిడ్ సమస్యతో ఉన్నవారికి శుభవార్త,
    ========================
     మీరు థైరాయిడ్ సమస్యతో  బాధపడుతున్నారా? జీవితాంతం మీరు ఇక గోలీలు వాడనవసరం లేదు. ఆయుర్వేదం ఔషధం ద్వారా
     మీరు రెండు పూటలా ఒక చెంచా చూర్ణాన్ని మంచినీళ్లతో సేవిస్తూ ఉంటే, మూడు నుంచి నాలుగు నెలల్లో శాశ్వతంగా థైరాయిడ్ తగ్గిపోతుంది. మీరు100 ఎం జి లోపల  మాత్రలు వాడుతుంటే,
     ఆయుర్వేద మందు వాడిన 20 రోజుల తర్వాత టాబ్లెట్స్ ను వాడడం ఆపివేయాలి.
     అల్లోపతిలో మీరు జీవితాంతం వాడవలసి వస్తుంది. కానీ నేను ఇచ్చే ఔషధం వాడుట వలన కేవలం మూడు నుంచి నాలుగు నెలలో
     పూర్తిగా తగ్గిపోతుంది.
    పత్యం - మాంసాహారాలు పూర్తిగా మానివేయాలి. ఇక అన్ని రకాల కూరగాయలు తినవచ్చు.
      మందు కావలసినవారు సంప్రదించండి. కొరియర్ ద్వారా పంపిస్తాను.
     సమయం లేనప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి
    ధన్యవాదములు
    మీ నవీన్ నడిమింటి 

    నెగిటివ్ మైండ్ నుండి ఎలా బయట పడాలి నవీన్ నడిమింటి సలహాలు

    *నెగిటివ్ థాట్స్ పోవాలంటే..   ఆ మాయ నుంచి బయటపడే మార్గం నవీన్ నడిమింటి సలహాలు*.
                కొన్నిసార్లు ఏ పనీ చేయాలన్పించదు.. చాలా బద్ధకంగా ఉంటుంది. అలాగే చాలా నెగిటివ్ ఎమోషన్లలో కొట్టుకుపోతూ ఉంటాం.
       
    *👉మీరు ఆఫీస్‌లో చేసే వర్క్ ఇంట్లో కూడా చేస్తుంటారా ?* ఇంట్లో ల్యాప్‌టాప్ ముందేసుకుని ప్రాజెక్ట్ వర్క్ పేరుతో అర్థరాత్రి వరకూ నిద్ర మేల్కొని ఉంటారా ? ఈ కేటగిరీలో మీరు కూడా ఉంటే నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమే ఇది. యూనివర్సిటీ ఆఫ్ బెర్జిన్ దాదాపు 16, 426 వర్క్‌హాలిక్స్‌పై సర్వే జరిపింది. ఈ సర్వేలో ఆందోళన కలిగించే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆఫీస్ వర్క్ ఇంట్లో చేసేవాళ్లలో అత్యుత్సాహ థోరణే కారణమని తేలింది. ఇలాంటి వారిని భార్యాపిల్లలు కూడా పట్టించుకోరట. అలాంటి వర్క్‌హాలిక్స్ కూడా సంపాదనకే పరిమితమై… బంధాలకు దూరమవుతారని సర్వే వెల్లడించింది. ఇలా ఇళ్లలో కూడా ఆఫీస్ పనులను చక్కబెట్టేవాళ్లలో 32.7 శాతం మంది ఈ కోవలోకే వస్తారట. 8.9 శాతం మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని సర్వే వెల్లడించింది.
    *👉మొట్టమొదటిగా బరువు తగ్గి , ఆరోగ్యాన్ని పొందాలి అనే ఒక దృఢ‌మైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి.*
    * ఉదయం లేవగానే పొట్ట భాగంలో నూనెతో (కొబ్బరి నూనె /నువ్వులనూనె /ఆలివ్ నూనె ) 5 నుండి 10 నిముషాలు మసాజ్ చేసుకోవాలి.
    * తర్వాత రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని త్రాగాలి.
    * 30 నిముషాలు వ్యాయామం (వాకింగ్ /జాగింగ్) చేయాలి.
    * 10 నిముషాల పాటు ఉదయపు సూర్యకాంతిలో ఉండాలి.
    * స్నానానికి గోరువెచ్చని నీళ్ళను ఉపయోగించాలి.
    * 9 గంటల్లోపు అల్పాహారం పోషకాలు ఉండేట్లు పుష్టికరంగా తీసుకోవాలి.
    * 1 గంట లోపు లంచ్ మధ్యమంగా తీసుకోవాలి.
    * 9 గంటల్లోపు రాత్రి భోజనం ముగించుకోవాలి.
    * సి -విటమిన్ ఉన్న పండ్లు బత్తాయి, నారింజ, కమల, నిమ్మ, స్ట్రాబెర్రీ, ఆపిల్, బెర్రీస్ తీసుకోవాలి.
    * రోజులో కనీసం 3-4 లీటర్ల నీటిని త్రాగాలి.
    * భోజనంలో ఆకుకూరలు, నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి.
    * బయట దొరికే జంక్‌ఫుడ్‌కి పూర్తి దూరంగా ఉండాలి.
    *మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి.
    *👉చాలా మంది చిన్న విషయం కు చాలా ఆందోళన ...ఆందోళన ఆందోళన ఆందోళన ఆందోళన .....వెళ్లడం కారణం*

    నిజానికి ఆందోళన మనల్ని సమస్య పరిష్కారం వైపు వేగంగా నెడుతుంది. శక్తియుక్తులన్నీ ఒకే సమస్యపై లగ్నమయ్యేలా చేస్తుందంటున్నారు మానసిక నిపుణులు.

    మంచి జరుగుతుంది..' అన్నభావన మనకు తక్షణ శక్తినివ్వొచ్చు. కానీ ఆపదంటూ వచ్చినప్పుడు అది సమస్యకు పరిష్కారం వెతక్కుండా చేస్తుంది.

    వ్యక్తి స్థాయిలో అభివృధ్ధి చాలా ముఖ్యం. వ్యక్తి  ఎదుగుదల అనేక సామాజిక సమస్యలకు సరైన పరిష్కారం. కానీ చాలా సందర్భాల్లో మనం ఎదగడం కన్నా సమాజం గురించి ఎక్కువ physical, mental energyలను వృధా చేస్తుంటాం.
    ధన్యవాదములు 🙏
    మీ నవీన్ నడిమింటి

    మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

    https://vaidyanilayam.blogspot.com/

    పాదాలు వాపు ఉన్న అప్పుడు తీసుకోవాలిసి జాగ్రత్తలు

    *పాదాల వాపు మరియు నొప్పి వాళ్ళు నడవడం కష్టం అయినా అప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు నవీన్ నడిమింటి సలహాలు*

    పాదాలు వాచుకోవడాన్ని పాదాల వాపు అని కూడా
    పిలుస్తారు. అది ఎక్కువ ద్రవం  లేదా నీరు పేరుకుపోవడానికి సంకేతం. పాదాలు, చీలిమండలలో నొప్పి లేనట్టి వాపు సాధారణ సమస్య. ఇది ప్రధానంగా వయసు మళ్లిన వారిలో మరియు గర్భిణులలో కనిపిస్తుంది. వాపు దానికి అది ఒక వ్యాధి కాదు.  అయితే అది వ్యాధి కారకానికి ముఖ్యమైనట్టి సంకేతం లేదా సూచన కావచ్చు. ఇట్టి వాపునకు వ్యాయామం, బరువు తగ్గించుకోవడం , పెచ్చుపెరిగే జబ్బులకు మందులు , ఆహారంలో మార్పులు  మరికొన్నింటి ద్వారా చికిత్స నిర్వహిస్తారు
    *👉పాదాల వాపు యొక్క లక్షణాలు* -
          వాపు పాదమునకు గానీ లేదా చీలమండ ప్రాంతానికి గాని  సంబంధించి నొప్పి లేకుండా  ఉండి కాలముతో పాటు నొప్పి పెరిగితే , చర్మం రంగు మరియు చర్మం నిర్మాణంలో మార్పు రావచ్చు. జబ్బుఇతర లక్షణాలు చర్మం ఉష్ణోగ్రత పెరగడం,  తాకినప్పుడు వేడి స్పర్శ  కలగడం, పుండు ఏర్పడటం మరియు చీము ఉత్సర్గం వంటివి.

    చర్మాన్ని వేలుతో క్రిందికి నొక్కినప్పుడు గుంట లేదా మాంద్యం ఏర్పడుతుంది, తర్వాత వేలును తీసినప్పుడు గుంటమూతబడి చర్మం వాపుతో కూడిన యధాస్థితికి వస్తుంది.

    షూ మరియు సాక్స్ తీసిన తర్వాత పాదాల చర్మంపై కనిపించే చిన్న గుంటలు ( మాంద్యానికి గురైనట్టి ప్రాంతాలు) వాపునకు ముఖ్యమైన సంకేతం

    గుంటలు నల్లగా ఉండి వాటి చుట్టూ గల చర్మం సాధారణ చర్మం రంగు కంటే లేతగా ఉంటుంది.
    *👉పాదాల వాపు యొక్క చికిత్స* -
    ఎక్కువ సమయం నిలబడిన కారణంగా వాపు ఏర్పడినప్పుడు దానిని విశ్రాతి తీసుకోవడం ద్వారా లేదా పాదాలను ఎత్తులో ఉంచడం ద్వారా నయం చేసుకోవచ్చు. పడుకొన్నప్పుడు మీ కాళ్లను తలదిండుపై గుండె కంటె ఎక్కువ ఎత్తులో ఉండే విధంగా ఉంచుకోండి..

    వాపు వేడి వాతావరణం కారణంగా ఏర్పడితే  మీరు దానిని సులభంగా నివారించవచ్చు, దానికోసం  వేడి వాతావరణానికి దూరంగ ఉండండి. మీ పాదాలను చల్లగా ఉంచుకోంది, దీనికై 15-20 నిమిషాలపాటు మీ పాదాలను చల్లని నీటిలో ఉంచండి.

    పాదాల వాపు గుండె జబ్బుల కారణంగా ఏర్పడితే, లేదా ద్రవం నిలవడం వల్ల జరిగితే,  మీ డాక్టరు ఉప్పు వాడకాన్ని నియంత్రిఛమని సలహా ఇవ్వవచ్చు.(తక్కువ ఉప్పుతో ఆహారం) మరియు ఎక్కువగా నీరు త్రాగమని సూచించవచ్చు.

    మీ శరీరపు బరువు ఎక్కువ కావడం వల్ల కూడా పాదాల వాపు కావచ్చు. ఈ సందర్భంగా మీ డాక్టరు తగిన ఆహారాన్ని తీసుకోమని, వ్యాయామం చేయమని  చెప్పవచ్చు. ఇవి శరీరపు బరువును తగ్గిస్తాయి.

    గర్భం కారణంగా వాపు ఏర్పడితే, ఎలాంటి చికిత్స అవసరం ఉండదు. అయితే తీవ్రమైన వాపును నిర్లక్ష్యం చేయకూడదు. అది ఎక్లాంసియా (మూర్చ) కారణంగా ప్రబలి ఉండవచ్చు.

    వాపు ఉన్న చోట వీలయిన వెంటనే ఐసును 15- 20 నిమిషాలపాటు ఉంచండి. తర్వాత ఈ ప్రక్రియను మూడు నాలుగు గంటలకు ఒకమారు కొనసాగించంది.. ఈ చర్య తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.

    తీవ్రమైన గాయాల సందర్భంగా డాక్టరు బలవంతంగా తోయడం, శస్త్రచికిత్స మరియు ప్రక్రియలు మరియు హెచ్చు నొప్పి నివారణకై విశ్రాంతి సూచించవచ్చు

    నొప్పితో కూడిన వాపు సందర్భంగా మీ డాక్టరు నొప్పి నివారణ మాత్రలను సూచించవచ్చు. అవి పారసెటమాల్ మరియు ఇబుప్రొఫెన్ వంటివి. తర్వాత విశ్రాంతి సూచించవచ్చు

    వ్యాయామం  హెచ్చు రక్తప్రసారానికి వీలు కల్పిస్తుంది మరియు శోషరస ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది దీనితో  మీ డాక్టరు లేదా ఫిట్ నెస్ నిపుణుని  సలహాతో కనీసం రోజుకు ఒక వ్యాయామం చేయడం ప్రారంభించండి వాకింగ్ లేదా జాగింగ్ వంటి ఏదైనా ఒక వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయండి

    పాదాలలో వాపు అనగా పాదాలలో ద్రవం పేరుకుపోవడం.  పాదం, చీలమండ మరియు కాలు వాపు గురించి చెప్పడానికి నొప్పి కలిగిన చోట వాటిని వేలితో నొక్కినప్పుడు గుంట పడుతుంది.
    పాదాల వాపు చాలా సాధారణమైన  జబ్బు. మీరు ఎక్కువ సమయం నిలబడి ఉంటే లేదా ఎక్కువ దూరం  నడిస్తే జబ్బుకు చికిత్స అవసరం లేదు. అయితే, వాపు ఎక్కువ కాలం ఉండి, ఇతర లక్షణాలతో కలిసి కనిపిస్తే, అంటే శ్వాసక్రియకు ఇబ్బంది, నొప్పి లేదా అల్సర్లు కనిపిస్తే అవి జబ్బు  తీవ్రరూపంలో ఉన్నదనడానికి సంకేతం.
    మీ పాదాలలో ఒకటిగానీ లేదా రెండు కూడా గానీ వాచుకొంటే అది అసౌకర్యానికి, నొప్పికి, దైనందిన కార్యకలాపాలు జరపడానికి ఇబ్బంది కలిగిస్తుంది. మీరు గర్భంతో ఉన్నట్లయితే  పాదాలు సహజంగా వాపునకు గురవుతాయి. ఎందుకంటే గర్భిణీ స్త్రీ శరీరంలో  సాధారణ స్త్రీ కంటే హెచ్చుగా నీరు నిల్వ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీరు ఎక్కువ సమయం నిలబడి ఉంటే, రోజు చివరన నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. అది తల్లికి, లేద శిశువుకు తీవ్రమైన సమస్య కానప్పటికీ తల్లికి అసౌకర్యంగా ఉంటుంది.
    పాదాలలో వాపును కేశనాళిక వడపోతలో పెరుగుదలకు పోల్చవచ్చు. దీనివల్ల  పాదాల వాపు మందుల కారణంగా ప్రబలి ఉంటే లేదా రోగలక్షణం నిర్ధారణ అయితే డాక్టరును సంప్రతించడం అవసరం.
    *💊పాదాల వాపు కొరకు మందులు*

    1.-Telsartan HTELSARTAN H 40MG TABLET
    2.-Telma HTELMA H 40MG TABLET
    3.-Co DiovanCo Diovan 160 Mg/25 Mg Tablet
    4.-Tazloc TrioTazloc Trio 40 Mg Tablet
    5.-Hopace HHOPACE H 10MG TABLET
    6.-S0LasixLASIX 150MG INJECTION 15ML
    7.-PolycapPOLYCAP CAPSULE 8.-FrumideFrumide 40 Mg/5 Mg Tablet
    9.-Misart HMISART H 40/12.5MG TABLET 10.-FrumilFrumil 40 Mg/5 Mg Tablet
      ధన్యవాదములు 🙏
    మీ నవీన్ నడిమింటి
    *సభ్యులకు విజ్ఞప్తి*
    ******************
     మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..
    మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

    https://vaidyanilayam.blogspot.com/

    కిడ్నీ సమస్య లు ఉన్న వారికీ తీసుకోవాలిసిన జాగ్రత్త లు

    *తీవ్ర మూత్రపిండాల వైఫల్యం అవగాహనా కోసం నవీన్  నడిమింటి సలహలు*

             మూత్రపిండాల ప్రాధమిక కర్తవ్యం రక్తం నుండి వ్యదార్థాలను తొలగించడం, తద్వారా అవి మూత్రం ద్వారా శరీరం నుండి తొలగించబడతాయి. మూత్రపిండాలు వాటి పనిని సరిగ్గా నిర్వహించడంలో విఫలమవడంతో పాటు పూర్తిగా మూసివేయబడితే అది చాలా తక్కువ మూత్ర ఉత్పత్తికి దారితీసింది, దానిని తీవ్ర మూత్రపిండాల వైఫల్యం అని పిలుస్తారు.
    దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
    తీవ్ర మూత్రపిండాల వైఫల్యం యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

    శరీరంలో మూత్ర ఉత్పత్తి మరియు ద్రవం నిలుపుదల తగ్గుతుంది. ఇది చేతులు మరియు కాళ్ళు, లేదా ముఖం లో వాపు గా కనిపిస్తుంది.

    శ్వాస ఆడకపోవడం, వికారం, మరియు వాంతులు కూడా సాధారణం.

    ఆకలి తగ్గిపోవడం, మానసిక గందరగోళం, మరియు బలహీనత ఒక వ్యక్తి చూపించే ఇతర లక్షణాలు.

    అధిక రక్తపోటును కూడా కలిగి ఉండవచ్చు, చేతి స్పర్శను తగ్గిస్తుంది మరియు గాయాలు నయం కావడానికి ఆలస్యం అవ్వవచ్చు.

    ప్రధాన కారణాలు ఏమిటి?
    ఈ పరిస్థితి యొక్క ప్రధాన కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

    మూత్రపిండాలకు రక్త సరఫరా తగ్గితే తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం సంభవించవచ్చు.

    మూత్ర నాళాలలో అడంకులు మూత్రపిండాలు నుండి మూత్రాశయం వరకు మూత్రాన్ని మృదువు ప్రవేశించడాన్ని నిరోధిస్థాయి. కాలక్రమేణా, మూత్రం ఒకటి లేదా రెండు మూత్రపిండాలలో ఎక్కువగా చేరి మూత్రపిండాల వాపుకు చేరతాయి (హైడ్రోనెఫ్రోసిస్). ఇది కూడా మూత్రపిండ వైఫల్యాన్ని కలిగిస్తుంది.

    రసాయనాలు లేదా భారీ లోహాల లేదా మూత్రపిండాల కణజాలంపై శరీరంలో రోగనిరోధక వ్యవస్థ దాడి చేసే గ్లోమెరులోనెఫ్రిటిస్ వంటి స్వయం ప్రతిరక్షక దాడుల పరిస్థితులు ఏర్పడతాయి. మూత్రపిండాలకు ఏదైనా గాయం అవ్వడం కూడా మూత్రపిండ వైఫల్యాన్ని కలిగించవచ్చు.

    తీవ్ర మూత్రపిండాల వైఫల్యం యొక్క అభివృద్ధి ప్రమాదాన్ని పెంచే కొన్ని అంశాలు:

    తీవ్రమైన డీహైడ్రేషన్ .

    తక్కువ రక్తపోటు.

    ఆస్పిరిన్ వంటి మందులు.

    మధుమేహం

    ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
    తీవ్ర మూత్రపిండాల వైఫల్య నిర్ధారణ ఈ క్రింది పరిశోధనలను కలిగి ఉంటుంది:

    వైద్యుడు శరీరం యొక్క వేర్వేరు ప్రాంతాల్లో వాపు మరియు ఇతర లక్షణాలకు పరిశీలిస్తాడు.

    యూరియా, పొటాషియం మరియు సోడియం స్థాయిని అంచనా వేయడానికి రక్త, మూత్ర పరిశోధనలు నిర్వహిస్తారు. క్రియటిన్ (creatine) స్థాయిల అంచనా కూడా కీలకమైనదే.

    ఒక వ్యక్తి మూత్రపిండాల వైఫల్యం యొక్క సంకేతాలను చూపించినట్లయితే, వైద్యులు గ్లోమెర్యులర్ ఫిల్ట్రేషన్ రేట్(Glomerular Filtration Rate) (GFR) ను తనిఖీ చేయడానికి కూడా పరిశోధనలకు ఆదేశిస్తాడు. ఇది మూత్రపిండాల యొక్క రక్తం వేడకట్టే లెక్కను తెలియజెస్తుంది మరియు మూత్రపిండాల వైఫల్యాన్ని నాటకీయంగా తగ్గిస్తుంది.

    మూత్రపిండ అల్ట్రాసౌండ్, MRI, CT స్కాన్, మరియు ఉదర X- రే వంటి ఇతర పరీక్షలు ఉన్నాయి.

    *తీవ్ర మూత్రపిండాల వైఫల్య చికిత్స:*

    మూత్రపిండాల వైఫల్యం యొక్క చికిత్స మూలాధారమైన కారణం మరియు మూత్రపిండాల పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం పై దృష్టి పెడుతుంది.

    ప్రధానంగా, వైద్యులు ద్రవం, ఉప్పు, మరియు ప్రోటీన్ తీసుకోవడం తగ్గించడానికి ఆహారం లో మార్పులను సిఫారసు చేస్తారు.

    శరీరంలో ద్రవం నిలుపుదల నివారించే ఔషధాలు డయ్యూరిటిక్స్. కాల్షియం అనుబంధకాలు రక్త పొటాషియం స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

    డయాలసిస్ అనే ఒక ప్రక్రియ, ఒక యంత్రం ద్వారా రక్తాన్ని వడకట్టడంలో సహాయం చేస్తుంది. పరిస్థితి యొక్క తీవ్రతపై ఆధారపడి, డయాలసిస్ ఒక వారంలో అనేక సార్లు అవసరమవుతుంది.

    *💊తీవ్ర మూత్రపిండాల వైఫల్యం కొన్ని మందులు డాక్టర్ సలహా మేర కు వాడాలి*

     1.-TorsinexTORSINEX A TABLET
    2.-S0LasixLASIX 150MG INJECTION 15ML
    3.-DytorDYTOR 10MG TABLET
    4.-TormisTormis 10 Tablet
    5.-FrumideFrumide 40 Mg/5 Mg Tablet
    6.-TorsedTorsed 100 Mg Tablet0FrumilFrumil 40 Mg/5 Mg Tablet
    7.-TorsemiTorsemi 10 Mg Tablet
    8.-AmifruAMIFRU PLUS TABLET
    9.-TorsidTorsid 10 Mg Tablet
    10.-Exna KExna K 40 Mg/5 Mg Tablet
    11.-TorvelTorvel 10 Mg Tablet
    12.-TorvigressTORVIGRESS 10MG TABLET
    ఆయుర్వేదం లో 👉
    .పునర్నవ చూర్ణం కిడ్నీ ఎంత పాడుఅయిన మళ్ళీ ఆరోగ్య వంతంగా చేస్తుంది. పల్లేరు చూర్ణం క్రియటిన్ తగ్గిస్తుంది. చూర్ణాలకు ప్రామాణికం, పేరు తెలియాలి.శుద్దిచేయనవి వాడరాదు. ఉదాహరణకు : విషముష్టి, ఎర్ర చిత్రములం
    *మూత్రం వెళ్లినపుడు మంట ఉంటే*
    చంద్రప్రభావతి  (ఉదయం, రాత్రి )
    చంద్రనసాన (2cap +నీరు )
    కర్పూరశీరాజిత్ (3చిటెకలు +తేనే కలపాలి )

     *సభ్యులకు విజ్ఞప్తి*
    ******************
     మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

    https://m.facebook.com/groups/113863975967610?view=permalink&id=449683769052294