అలర్జీ వ్యాధులకు నివారణ కు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు …
అలర్జీ వ్యాధులకు చెక్ ఇలా…
నేడు చాలామంది రకరకాల అలర్జీ వ్యాధుల బారిన పడు తున్నారు. కొందరికి ఆహార పదార్థాలు సరిపడక పోవటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, మరి కొందరికి దుమ్ము, ధూళి, చల్లని పదార్థాలు మొదలైన వాటి వల్ల అలర్జీ కలుగుతుంది.
ఏ మనిషిలోనైన అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. ఒక వ్యక్తి తనకు సరిపడని పదార్థాలు (అలర్జెన్స్) తీసుకున్నప్పుడు అతడి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ తేలికగా, అతి ఎక్కువగా స్పందించి అలర్జీని కలిగిస్తుంది.
కారణాలు
అలర్జీ కలిగించే వాటిలో ముఖ్యమైనవి దుమ్ము, ధూళి, బూజు, ఫంగస్, సరిపడని ఆహారం, వంశపారంపర్యంగా, కొన్నిరకాల ఔషధాలు, కాస్మొటిక్స్, స్ప్రేలు, పౌడర్లు, హెయిర్ డైస్.
లక్షణాలు
అలర్జీ వల్ల ముక్కునుండి నీరు కారడం, ముక్కు బిగుసుకుపోయి శ్వాస ఆడకపోవడం, ఉదయం లేవగానే ఆగకుండా తుమ్ములు రావటం, దగ్గుతో పాటు ఆయాసం రావటం, ఛాతి బరువుగా అనిపించటం, కళ్లు ఎర్రబడి నీరు కారడం, ఒంటిపై దద్దుర్లు, చర్మం పొడిగా అనిపించటం, దురద రావటం, ఘాటైన వాసనలు పడకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండటం.
జాగ్రత్తలు
శీతల పానీయాలు, చల్లటి పదార్థాలు మానివేయాలి. దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాలలోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్కు తప్పని సరిగా ధరించాలి. సరిపడని పదార్థాలను గుర్తించి వాటిని కొద్ది రోజులు తినకుండా ఉండాలి. కాస్మొటిక్స్, స్ప్రేలు, పౌడర్లు, డైస్ వాడేముందు వైద్యుల సలహా తప్పని సరిగా తీసుకోవాలి. ప్రతి రోజు విధిగా శారీరక వ్యాయామం చేయాలి.
చికిత్స
హోమియోవైద్యంలో అలర్జీ వ్యాధులకు చికిత్స ఉంది. వ్యాధి లక్షణాలను, వ్యక్తి మానసిక, శరీరక లక్షణాలను పరిగణలోకి తీసుకొని మందులను ఎంపిక చేస్తారు. ఈ మందులతో అలర్జీ వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు. ఆ మందులు..
ఆర్సినికం ఆల్బం
ఈ మందు ఎలర్జీ వ్యాధులకు ఆలోచించదగినది. ముక్కునుండి నీరు కారడం, దగ్గు, జ్వరంతో పాటు వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, కళ్ల నుండి నీరు కారడం, ఒంటిపై దద్దుర్లు, చర్మం పొడిగా మంటగా అనిపించడం, దురద రావడం, విపరీతమైన నీరసం, తరుచుగా దాహం, ఒళ్లు నొప్పులు, మానసిక ఆందోళన, భయం వంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.
జెల్సీమియం
దాహం లేకపోవట, రోగి మగతగా, నీరసంతో అలిసిపోయినట్లుగా ఉండి ముక్కునుండి నీరు కారడం, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలున్న వారికి ఈ మందు ఆలోచించదగినది. మానసిక స్థాయిలో వీరు తేలికగా ఆందోళన చెందుతారు.
ఎకోనైట్
చల్ల గాలిలో తిరగడం వలన ముక్కు బిగుసుకుపోయి, తుమ్ములు, గొంతు నొప్పి వెంటనే ప్రారంభమవుతుంది. మింగటం కష్టంగా మారి గొంతు మంటమండుతుంది. దాహం విపరీతంగా ఉండి బాధ పడుతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ఆవిరికి చలికాలంలో బాధలు ఎక్కువగా ఉంటాయి.
హెపార్‌సల్ఫ్
వీరు చాలా సున్నిత స్వభావులు. తేలికగా అలర్జీ బాధలకు గురవుతారు. చల్లగాలి సోకగానే బాధలు మొదలవుతాయి. గొంతులో ముల్లు గుచ్చుతున్నట్లుగా అనిపించి మింగినప్పుడు విపరీతమైన నొప్పి రావడం ప్రత్యేక లక్షణం. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రధానమైనది. ఈ మందులే కాకుండా ఇపికాక్, రస్‌టాక్స్, నైట్రోమోర్, టుబర్కులినం, ఎల్లియం సెఫా,ఫెర్రంపాస్, కాలిమోర్, మెగ్‌ఫాస్, లేకసిస్, కాల్కేరియా కార్బ్, సల్ఫర్ ఎపిస్, పల్సటిల్లా వంటి కొన్ని మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహ మేరకు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి