22, డిసెంబర్ 2019, ఆదివారం

ఎసిడిటి నివారణ

  1. ఎసిడిటీ నివారణ కు అవగాహనా నవీన్ నడిమింటి సలహాలు 

    మన శరీరం రైలు లాంటిది. ఆ బండికి ఇంజన్‌ జీర్ణక్రియ. ఇంజన్‌ సరిగా పనిచేస్తే కానీ బండి సవ్యంగా ముందుకు కదలదు. ఇంజన్‌ దెబ్బతింటే ఆరోగ్యవ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమవుతుంది. ఛిన్నాభిన్నం అవుతున్న నేటి ఆధునిక జీవనశైలివల్ల అజీర్తి, ఎసిడిటి, మలబద్ధకం వంటి సమస్యలు జీర్ణక్రియల్ని దెబ్బతీస్తున్నాయి.
    ఆ సమస్యకు పరిష్కారాలు చూపిస్తున్నారు సర్జికల్‌ గ్యాసో్ట్ర ఎంట్రాలజిస్ట్‌, బేరియాట్రిక్‌
    అండ్‌ అడ్వాన్స్‌డ్‌ లాప్రోస్కోపిక్‌ సర్జన్‌
    డాక్టర్‌.టిఎల్‌విడి. ప్రసాద్‌ బాబు
    సహజసిద్ధంగా మన జీర్ణవ్యవస్థ ఎంతో పటిష్టమైనది. కాబట్టే ఏ రకమైన ఆహారాన్నైనా ఆరగించేసుకుని వ్యర్ధాన్ని విసర్జించేస్తుంది. అలాగని ఎప్పుడంటే అప్పుడు చేతికందిన ప్రతి పదార్థాన్నీ పొట్టలో తోసేయకూడదు. అలాచేస్తే కొంతకాలానికి జీర్ణవ్యవస్థ పనిచేయటం మొరాయిస్తుంది. అలాంటప్పుడే అజీర్తి, అల్సర్లు, విరేచనాలు, మలబద్ధకంలాంటి సమస్యలు మొదలవుతాయి. జీర్ణవ్యవస్థలో ప్రధాన అవయవాలు... జీర్ణకోశం, చిన్న పేగులు, పెద్దపేగులు. ఈ మూడిట్లో తలెత్తే ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్య అయినా జీర్ణవ్యవస్థ రుగ్మతల కోవ కిందకే వస్తుంది. జీర్ణసంబంధ రుగ్మతలలో ప్రధానమైనవి ఇవే.
    అజీర్తి
    ఆహారం అరుగుదల మందగించటమే అజీర్తి. కడుపు ఉబ్బరం, త్రేన్పులు, ఆహారం తింటున్నప్పుడే పొట్ట నిండిపోయినట్టు అనిపించటం, పొట్టలో శబ్దాలు... ఇవన్నీ అజీర్తి లక్షణాలు. అయితే అజీర్తి ప్రతి ఒక్కరూ ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొనే సమస్యే! కానీ పొట్టలో అల్సర్లు, ఇన్‌ఫెక్షన్లు, హార్మోన్‌ సమస్యలు ఉన్నవాళ్లలో అజీర్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి రుగ్మతలేవీ లేనివాళ్లలో తరచుగా అజీర్తి తలెత్తుతుందంటే...అందుకు కొన్ని కారణాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం.
    ఒత్తిడి
    అస్తవ్యస్త జీవనశైలి (రాత్రుళ్లు ఎక్కువసేపు మేలుకోవటం)
    కొవ్వులు, నూనెలు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తరచు తీసుకోవటం.
    నిద్రలేమి
    ఆహారం పూర్తిగా నమలకుండా తినటం
    చికిత్స: సహజంగా అజీర్తి ఓ వారంలోగా దానంతట అదే తగ్గిపోతుంది. అలాకాకుండా రెండు వారాలు దాటినా అదుపు కాకపోతే తప్పనిసరిగా వైద్యుల్ని కలవాలి. క్యాన్సర్‌ రోగుల్లో ప్రధానంగా కనిపించే లక్షణం అజీర్తి కాబట్టి స్వల్ప రుగ్మతే కదా అని నిర్లక్ష్యం చేస్తే అంతర్గతంగా దాగిఉన్న ప్రాణాంతక వ్యాధి మరింత ముదిరిపోయే ప్రమాదం ఉంది.
    ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే..
    రాత్రి నిద్రకు రెండు గంటల ముందుగానే భోజనం ముగించాలి.
    తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి.
    మసాలా, కారాలు ఉన్న ఆహారం తగ్గించాలి.
    అల్కహాల్‌, సిగరెట్లు మానేయాలి.
    ఒత్తిడి తగ్గించుకోవాలి.
    రోజు మొత్తంలో 6 నుంచి 8 సార్లు స్వల్ప పరిమాణాల్లో ఆహారం తీసుకోవాలి.
    ఎసిడిటీ
    తిన్న ఆహారం అరగకపోతే తలెత్తే మొదటి సమస్య ‘ఎసిడిటీ’. ఛాతీలో మంట, గొంతులోకి యాసిడ్‌ తన్నుకురావటం, పొట్టలో నొప్పి దీని ప్రధాన లక్షణాలు. ఎసిడిటీని తగ్గించుకోవటం కోసం యాంటాసిడ్‌లు వాడినా అవన్నీ తాత్కాలికంగా ఉపశమనాన్నిస్తాయి తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపించలేవు. ఎసిడిటీకి ప్రధాన కారణాలు..
    భోజనవేళలు పాటించకపోవటం.
    నూనెలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం
    స్థూలకాయం
    శారీరక వ్యాయామం చేయకపోవటం
    నొప్పి నివారణ మందుల వాడకం
    ఆందోళన, ఒత్తిడి
    ఏరేటెడ్‌ డ్రింక్స్‌, కాఫీలు, టీలు పరిమితికి మించి తాగటం.
    ఆల్కహాల్‌
    చికిత్స: ఎసిడిటీకి కారణం జీర్ణాశయంలో అవసరానికి మించి యాసిడ్‌ ఉత్పత్తి కావటమే! కాబట్టి ఆ యాసిడ్‌ ఉత్పత్తి తగ్గించటం లేదా దాన్ని న్యూట్రలైజ్‌ చేసే మందులతో ఎసిడిటీని సమర్ధంగా నివారించవచ్చు. అలాగే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. ప్రధానంగా ఈ జాగ్రత్తలు పాటించాలి.
    వేళకు ఆహారం తీసుకోవాలి.
    ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండాలి.
    వైద్యులు సూచించిన యాంటాసిడ్లు వాడాలి.
    సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగాలి.
    ఎసిడిటీకి కారణమయ్యే పదార్థాలను గుర్తించి వాటికి దూరంగా ఉండటం.
    అల్సర్లు
    ఎసిడిటీని నిర్లక్ష్యం చేస్తే జీర్ణకోశంలో పుండ్లు పడే ప్రమాదం ఉంది. వీటినే అల్సర్లు అంటారు. పొట్టలో ఉత్పత్తయ్యే యాసిడ్‌ వల్ల జీర్ణాశయానికి రంధ్రాలు పడకుండా మ్యూకస్‌ అనే పొర కాపాడుతూ ఉంటుంది. అయితే ఏ కారణం వల్లనైనా ఈ మ్యూకస్‌ పలచబడితే యాసిడ్‌ చొచ్చుకునివెళ్లి జీర్ణాశయానికి రంధ్రాలు చేస్తుంది. ఈ రంధ్రం మరింత లోతుగా వెళ్లి రక్తనాళాలను దెబ్బతీస్తే రక్తపు వాంతులు, పొట్టలో తట్టుకోలేనంత నొప్పి, రక్తపు విరేచనాలులాంటి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అప్పుడిక సర్జరీ ఒక్కటే పరిష్కారం. అల్సర్లకు దారితీసే పరిస్థితులు ఇవే!
    ఎసిడిటీని నిర్లక్ష్యం చేయటం.
    అల్సర్‌కు కారణమయ్యే హెలికోబాక్టర్‌ పైలోరి అనే బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స తీసుకోకపోవటం.
    పెయిన్‌ కిల్లర్స్‌ విచ్చలవిడిగా వాడటం.
    ఆల్కహాల్‌, సిగరెట్లు విపరీతంగా తాగటం.
    చికిత్స: అల్సర్‌కు అసలు కారణాన్ని గుర్తించకుండా యాంటాసిడ్‌లతో కాలం గడిపేయకూడదు. రెండు వారాలకు మించి ఎసిడిటీ వేధిస్తూ ఆహారం తినలేకపోతుంటే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. అప్పుడే అల్సర్‌కు అసలు కారణాన్ని వైద్యులు కనుక్కుని తగిన చికిత్స అందించగలుగుతారు. బ్యాక్టీరియా కారణమైతే దాన్ని నిర్మూలించే సమర్ధమైన మందులు సూచిస్తారు. ఎసిడిటీ కారణంగా అల్సర్‌ తలెత్తితే యాసిడ్‌ ఉత్పత్తిని తగ్గించే మందుల్ని సూచిస్తారు. ఒకవేళ అల్సర్‌ వల్ల జీర్ణాశయంలో రంధ్రాలు ఏర్పరిస్తే ఎండోస్కోపీ ద్వారా ఆ రంధ్రాన్ని మూసి రక్తస్రావాన్ని ఆపేస్తారు. అయితే ఈ చికిత్సల అవసరం పడేవరకూ తెచ్చుకోకుండా ఈ ముందు జాగ్రత్తలు పాటించాలి.
    నొప్పి నివారణ మందులు వాడేవాళ్లు తప్పసరిగా వైద్యుల సూచన మేరకు యాంటాసిడ్‌లు వాడాలి.
    ఆల్కహాల్‌, స్మోకింగ్‌ మానేయాలి.
    తిన్న వెంటనే వాంతి అవుతున్నా, దాన్లో రక్తం కనిపించినా తక్షణమే వైద్యుల్ని సంప్రదించాలి.
    ఇరిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌
    పెద్ద పేగులకు సంబంధించిన రుగ్మత ఇది. పేగుల్లో శబ్దాలు, పొట్టలో నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్‌, డయేరియా లేదా మలబద్ధకం, మోషన్‌లో మ్యూక్‌స...ఈ సమస్య ప్రధాన లక్షణాలు. ఇవే లక్షణాలు పెద్దపేగు క్యాన్సర్‌లో కూడా కనిపిస్తాయి. ఇరిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ కారణాలు ఇవే!
    జీర్ణాశయం పరిమితికి మించి సంకోచ వ్యాకోచాలకు గురవటం.
    ఫుడ్‌ అలర్జీ
    ఒత్తిడి
    హార్మోన్లలో అవకతవకలు
    పేగుల్లో బ్యాక్టీరియా చేరుకోవటం
    చికిత్స: అసలు కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఫుడ్‌ అలర్జీ అయితే ఆ పదార్థాలకు దూరంగా ఉండటం, ఒత్తిడి తగ్గించుకోవటం చేయాలి. పేగుల్లో బ్యాక్టీరియాను సమర్ధమైన మందులతో వదిలించాలి. సాధారణంగా జీవనశైలిని సవరించుకోవటం ద్వారా ఎక్కువశాతం వ్యాధి లక్షణాలను తగ్గించుకోవచ్చు. సె్ట్రస్‌ మేనేజ్‌మెంట్‌, లైఫ్‌స్టయిల్‌ ఛేంజె్‌సతో ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ అదుపులోకొస్తుంది. వీటితోపాటు ఈ జాగ్రత్తలు కూడా పాటించాలి.
    కంటి నిండా నిద్ర తప్పనిసరి.
    ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి.
    గ్యాస్‌ ఉత్పత్తి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి.
    అలర్జీ కలిగించే డైరీ ప్రొడక్ట్స్‌, సోయాలాంటి గింజలు మానేయాలి.
    వైద్యులు సూచించిన యాంటీ డిప్రెసెంట్‌, యాంటీబయాటిక్స్‌ వాడాలి.
    మలబద్ధకం
    మలవిసర్జన తేలికగా జరగటం లేదంటే మలబద్ధకానికి గురయ్యామని అర్థం. ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకి ఒకటి లేదా రెండుసార్లు మలవిసర్జన చేయగలగాలి. ఇలాకాకుండా రోజులతరబడి మలవిసర్జన జరగకుండా ఇబ్బంది పెడుతుంటే అది కచ్చితంగా మలబద్ధకమే! ఈ సమస్యను మరింత నిర్లక్ష్యం చేస్తే మొలలు, ఫిషర్స్‌లాంటి సమస్యలు కూడా తోడవుతాయి. మలబద్ధకానికి ప్రధాన కారణాలు ఇవే.
    మానసిక ఒత్తిడి
    తగినంత నీరు తాగకపోవటం
    మాంసకృత్తులు ఎక్కువ, పీచు పదార్థం తక్కువ ఉన్న ఆహారం తీసుకోవటం.
    కాలకృత్యవేళల్ని పాటించకపోవటం.
    మానసిక రుగ్మతలకు వాడే మందులు
    నిద్రలేమి
    వ్యాయామం చేయకపోవటం
    ఒబెసిటీ
    చికిత్స: ఎక్కువశాతం మంది మలబద్ధక సమస్య ఉన్న వ్యక్తులు పైల్స్‌ తలెత్తేవరకూ ఆగి ఆ తర్వాతే వైద్యుల్ని కలుస్తూ ఉంటారు. అప్పటివరకూ ఆగకుండా మందుగానే మలబద్ధకాన్ని నివారించుకోగలిగితే పైల్స్‌ సమస్యే ఉండదు. సింపుల్‌ టెక్నిక్స్‌తో నివారించుకోవలసిన ఈ సమస్య మీద అవగాహన లేక జటిలం చేసుకుంటూ ఉంటారు. ఈ సమస్యను వైద్యులు సూచించే లాక్సేటివ్స్‌, ఫైబర్‌ సప్లిమెంట్స్‌తో పరిష్కరించుకోవచ్చు..
    ఒత్తిడి తొలగించే ధ్యానం, యోగాలాంటి వ్యాయామాలు చేయాలి.
    బరువు తగ్గాలి.
    అవసరం అనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా కాలకృత్యాలు తీర్చుకోవాలి.
    తగినన్ని నీళ్లు తాగాలి.
    పళ్లరసాలు, సలాడ్స్‌ తీసుకోవాలి.
    ఆకలి లేకపోవటం
    రెండు వారాలకు మించి ఆకలి మందగించినా, బరువులో విపరీతమైన తగ్గుదల కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. క్యాన్సర్‌ కాకుండా ఆకలి లోపానికి ఇతర కారణాలు ఇవే!
    బ్యాక్టీరియా లేదా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌
    మానసిక సమస్యలు
    ఒత్తిడి, బోర్‌డమ్‌
    హైపోథైరాయిడిజం
    చికిత్స: ఆకలి మందగించటానికి కారణాన్ని వైద్యులు కనిపెట్టి వైద్యపరమైన సమస్యలుంటే వాటికి చికిత్స చేయటం ద్వారా ఆకలిని పెంచుతారు. ఈ చికిత్సతోపాటు ఆకలి పెరగటానికి ఈ సూచనలు పాటించాలి.
    తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవటం.
    ప్రొటీన్‌ డ్రింక్స్‌ తీసుకోవటం.
    శారీరక వ్యాయామం చేయటం
    మానసిక ప్రశాంతత.
    ఇవి పాటించండి..
    జీర్ణవ్యవస్థ సమర్థంగా పనిచేయాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.
    పిజ్జాలు, బర్గర్లులాంటి ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ సమతులాహారం తీసుకోవాలి.
    బయటి ఆహారానికి బదులుగా హోమ్‌ఫుడ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి.
    కాఫీలు, టీలు, ఆల్కహాల్‌, ఏరేటెడ్‌ డ్రింక్స్‌ సాధ్యమైనంత తగ్గించాలి.
    జీవనగడియారం దెబ్బతినకుండా పరిమిత వేళల్లో నిద్ర పోవాలి.
    రాత్రి నిద్రకు రెండు గంటలముందే ఆహారం ముగించాలి.
    తొందరగా పడుకుని తొందరగా లేవాలి.
    శారీరక వ్యాయామం తప్పనిసరి.
    ఉదయం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి.
    రాత్రివేళ తేలికైన ఆహారం తీసుకోవాలి.
    తాజా ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు, పొట్టు తీయని పప్పులు వాడాలి.
    నీళ్లు ఎక్కువగా తాగాలి.
    ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉదయం అల్పాహారం మానకూడదు.
    ఫుడ్‌ అలర్జీలను గమనించి తదనుగుణంగా ఆహార నియమాలు పాటించాలి.
    జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎంత చిన్న ఇబ్బందైనా రెండు వారాలకు మించి వేధిస్తూ ఉంటే వెంటనే వైద్యుల్ని కలవా

    1. ధన్యవాదములు 
    2. మీ నవీన్ రోయ్ 


    Loading

    కామెంట్‌లు లేవు: