17, మార్చి 2020, మంగళవారం

గర్భం రావడానికి మరియు వచ్చినాక తీసువలిసిన జాగ్రత్తలు


Pregnant - గర్భం

గర్భం పొందుటకు ఏది మంచి సమయం?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 
  • స్త్రీలలో నెలకి ఒకసారి మాత్రమె అండం విడుదల అవుతుంది.
  • స్త్రీలలో అండం 7 గంటల నుండి 12 గంటల వరకి మాత్రమె సజీవంగా ఉంటుంది.
  • అండోత్సర్గ సమయాన్ని గుర్తుంచుకొని తగిన సమయంలో సంభోగంలో పాల్గొనాలి.
  • తగిన ప్రణాలికను అనుసరించి పాటించటం వలన గర్భం సులువుగా పొందవచ్చు.
గర్భం - స్త్రీలకు మరొక జన్మగా చెప్పవచ్చు. గర్భం అనేది చాలా సంకిష్ట సమస్యలతో కూడుకున్న దశ. గర్భం ధరించుటకు సరైన సమయం ఉంటుంది అనగా సరైన వయసు, ఆరోగ్య పరిస్థితులు, మానసిక పరిస్థితుల వంటి చాలా కారణాలను పరిగణలోకి తీసుకోవాలి. సరైన సమయంలో కాకుండా, ఇతర సమయంలో గర్భాన్ని ధరించినట్లయితే చాలా రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

స్త్రీ శరీరంలో నెలకు ఒకసారి మాత్రమె అండం విడుదల అవుతుందని తెలిసినదే, కానీ పురుషులలో ఒకే సమయంలో కొన్ని వేల సంఖ్యలో శుక్రకణాలు విడుదల అవుతాయి. అవునా! అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది గర్భ, పొందటం చాలా కష్టం అని. కానీ సరైన ప్రణాలికను రూపొందించి, అనుసరించటం వలన గర్భాన్ని పొందవచ్చు. మీరు తయారుచేసే ప్రణాళిక కూడా అండం విడుదల సమయానికి తగినట్టుగా ఉండాలి అపుడే ఫలితాన్ని పొందుతారు.

జననాంగాలు మరియు గర్భం
స్త్రీల జననాంగాల విషయానికి వస్తే,  స్త్రీలలో విడుదలైన్ అండం 7 నుండి 12 గంటలలో మాత్రమే సజీవంగా ఉంటుంది, అంతేకాకుండా స్త్ర్రీ శరీరంలోకి ప్రవేశించిన శుక్రకణాలు 5 రోజుల వరకు చైతన్యవంతంగా ఉంటాయి. అంటే గర్భం ధరించాలి అంటే విడుదలైన అండంతో 12 గంటలలో శుక్రకణం ఫలదీకరణం చెందాలి. స్త్రీ శరీరంలోకి చేరిన వేల సంఖ్య శుక్రకణాలలో ఒకే ఒక శుక్రకణం మాత్రమే అండంతో కలిసి పిండాభివృద్ధి జరుగుతుంది. అండం ఫలదీకరణం చెంది, పిండం ఏర్పరుచుటకు కనీసం 10 గంటల సమయం పడుతుంది. కావున అండం విడుదల అవటానికి 5 ముందు రోజుల నుండే సెక్స్'లో పాల్గొనాలి.

అండం విడుదల (అండోత్సర్గము) అవటానికి ముందు రోజు
ప్రతినెలలో అండం విడుదల అయ్యే సమయాన్ని నోట్ చేసుకోవాలి, ఆ సమయంలో సంభోగంలో పాల్గోనటం వలన త్వరగా గర్భాన్ని పొందుతారు. గర్భాన్ని పొందే సరైన సమయం, మీకు మాత్రమె తెలిసి ఉంటుంది. మిగతా సమయంలో సంభోగంలో పాల్గొనటం వలన గర్భాన్ని పొందలేరు, కావున గర్భాన్ని పొందాలంటే, అండం విడుదలైన ముందు రోజు సంభోగంలో పాల్గొనటం వలన విడుదల అయిన శుక్రకణాలు నేరుగా అండంతో కలిసి ఫలదీకరణ జరిపి, పిండ ఏర్పాటును ప్రేపిస్తాయి.

అండం విడుదల అవటానికి రెండు రోజుల ముందు
గర్భాన్ని పొందుటకు వైద్యుడిని కలిసినట్లయిటే - అండోత్సర్గానికి రెండు రోజుల ముందు సంభోగంలో పాల్గొనమని సలహా ఇస్తారు అవునా! శుక్రకణాలు స్త్రీ శరీరంలో 5 రోజుల పాటు నిల్వ ఉంటాయి కావున రెండు రోజుల ముందు నుండి సంభోగంలో పాల్గొనటం వలన సులభంగా గట్భాన్ని పొందవచ్చు.

అండోత్సర్గానికి మొద్దు లేదా నాలుగు రోజుల ముందు
మీ రుతు చక్రం గురించి మీకు తెసుసు అవునా! కావున 3 నుండి 4 రోజుల ముందు సెక్స్ చేస్తే గర్భం పొందే అవకాశం ఉంది, కానీ మూడు రోజుల ముందుగా సంభోగంలో పాల్గొనటం కన్నా, ముందు రోజు సంభోగంలో పాల్గొనటం వలన తప్పక గర్భాన్ని ధరించవచ్చు.

నెల తప్పడం

స్త్రీలు రజస్వల అయినప్పటి నుండి మెనోపాజ్ వరకు నెలకు ఒకసారి వారి శరీరంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ప్రతినెల జరిగే ఈ మార్పు స్త్రీ గర్భం ధరించడంతో మామూలుగా జరిగే మార్పు తప్పిపోతుంది. ప్రతి నెల జరిగే ఈ మార్పు గర్భం ధరించడంతో తప్పిపోవడంతో ఈ సందర్భాన్ని నెల తప్పడం అంటారు.

నెల తప్పడానికి కారణం
ప్రతి నెల మధ్య వయసు స్త్రీ గర్భాశయంలో అండం ఏర్పడుతుంది. అది ఫలదీకరణం చెందకపోతే అది స్రావమైపోతుంది. ఈ విధంగా ప్రతి నెల అండం స్రావం కావడాన్ని ఋతుస్రావం అంటారు. అండం ఫలదీకరణం చెంది పిండోత్పత్తి జరిగితే ఆ నెలలో ఋతుస్రావం జరగదు. గర్భం ధరించిన స్త్రీ బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ప్రతి నెల జరిగే ఈ రుతుస్రావం ఆగిపోతుంది.

హార్మోన్ ప్రభావం
ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ ప్రభావం వల్ల స్త్రీలలో రెగ్యులర్ గా పీరియడ్స్ 25 నుంచి 30 రోజుల లోపు వస్తాయి.

నెల తప్పింది అని చెప్పడానికి ప్రత్యేక కారణం
జంతువులు (ఆడ జంతువులు) గర్భం ధరిస్తున్నాయి, మనుషులు (స్త్రీలు) గర్భం ధరిస్తున్నారు. కాని రెగ్యులర్ గా పిరియడ్స్ వస్తున్న స్త్రీ మాత్రమే గర్భం ధరించినపుడు నెల తప్పింది అనడానికి ప్రత్యేక కారణం ఉంది. స్త్రీలలో అండము ప్రతి రోజు విడుదల కాదు. స్త్రీలు బహిస్టు అయిన రోజు నుండి 14 వ రోజున అండం విడుదల అయ్యే రోజుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. స్త్రీలలో అండము నెలకు ఒక్కసారి మాత్రమే విడుదల అవుతుంది. విడుదలయిన అండము 24 గంటలు జీవించి ఉంటుంది. ఈ సమయంలో అండము పురుష బీజముతో కలిస్తే స్త్రీకి గర్భం ధరించే అవకాశము ఉంటుంది. అంటే ఒక స్త్రీ నెలలో 24 గంటలు మాత్రమే గర్భం ధరించడానికి అవకాశం కలిగి ఉంటుంది. ఈ సమయం దాటితే మళ్ళీ నెల రోజులు ఆగవలసి ఉంటుంది. ఈ కారణంగానే రెగ్యులర్ గా పిరియడ్స్ వస్తున స్త్రీ గర్భం ధరించినప్పుడు మాత్రమే నెల తప్పింది అంటారు.

నెలసరిని వాయిదా వేయడం నెల తప్పడం కాదు
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో నెలసరిని వాయిదా వేస్తుంటారు. ప్రమోలట్-ఎన్ అనే మాత్రల ద్వారా రెగ్యులర్ గా వచ్చే పిరియడ్స్ ను ఒకటి నుంచి ఐదు రోజుల పాటు వాయిదా వేస్తుంటారు. కొన్ని అత్యవసర పరిస్థితులలో 15రోజులు కూడా వాయిదా వేస్తుంటారు. అంతకు మించి వాడటం దుష్పరిణామాలకు దారితీస్తుంది. నెలసరిని వాయిదా వేసుకోవాలని అనుకున్నవారు మెన్సస్ వస్తుందనకున్న ఒక రోజు ముందుగానే ఒక ప్రమోలట్-ఎన్ మాత్రను ఉపయోగిస్తారు. ఈ మాత్ర వేసుకోవడం ద్వారా 24 గంటల పాటు అనగా ఒకరోజు పాటు మెన్సస్ రాకుండా వాయిదా పడుతుంది. అలాగే మరొక్క రోజు మెన్సస్ (పిరియడ్స్) రాకుండా వాయిదా వేయలంటే ఒక ప్రమోలట్-ఎన్ మాత్ర వేసుకున్న 23 గంటలకు మరొక ప్రమోలట్-ఎన్ మాత్ర వేసుకోవాలి. ఈ విధంగా పిరియడ్స్ ను వాయిదా వేయడాన్ని నెల తప్పడం అని అనకూడదు. కేవలం స్త్రీ గర్భం ధరించినప్పుడు మాత్రమే నెల తప్పిందని చెప్పాలి.

సులభంగా మరియు త్వరగా గర్భాన్ని పొందటం ఎలా?
  • ఋతుచక్రం గురించి తెలుసు కావున అండం విడుదలయ్యే సమయం కూడా తెలిసే ఉంటుంది.
  • ఒత్తిడిని అధిగమించటం వలన శరీరంలో కలిగే హార్మోన్ల మార్పులను అధిగమించవచ్చు.
  • మహిళలకు వైద్యుడిని కలిసిన తరువాత ఫోలిక్ ఆసిడ్ ఉపభాగాలను తీసుకుంటారు.
  • సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించండి.
ఆరోగ్యకర శిశువుకు జన్మను ఇచ్చి మరియు తల్లిగా మారటం అనేది ప్రతి స్త్రీ యొక్క కళ మరియు అదృష్టంగా భావిస్తుంటారు. అయితే కొంత మంది స్త్రీలలో గర్భం పొందటం అనేది చాలా కష్టతరంగా మారి, వారి కళను నెరవేర్చుకోలేకపోతుంటారు. దీని కోసం గానూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలను తీసుకోవాలి.

కొన్ని ప్రత్యేక జాగ్రత్తలను, ప్రణాళికలను పాటించటం వలన గర్భాన్ని పొందటం చాలా సులభం. ముఖ్యంగా, సరైన సమయంలో సంభోగంలో పాల్గొనటం వలన మరియు ప్రీనేటాల్ విటమిన్ లను తీసుకోవటం వంటి జాగ్రత్తలను పాటించటం వలన గర్భం పొందవచ్చు. సులభంగా మరియు త్వరగా గర్భాన్ని పొందేలా చేసే సూచనల గురించి కింద వివరించబడింది.

ఋతుచక్రం
గర్భాన్ని ధరించటానికి ముఖ్యంగా తెలుసి ఉండాల్సిన విషయం ఏమిటంటే మీ ఋతుచక్రం ఎపుడు ప్రారంభం అవుతుందని తప్పక తెలిసి ఉండాలి. ఎవరికైతే క్రమంగా, ఎలాంటి లోపాలు లేకుండా ఋతుక్రమం జరిగితే అనగా ప్రతి 28 రోజులకి ఒకసారి తప్పని సరిగా ఋతుక్రమం వచ్చే స్త్రీలలో అండం విడుదలయ్యే సమయం తెలుస్తుంది. ఋతుక్రమం జరిగిన తరువాత రోజు నుండి వరుసగా 14 రోజులలో అండం విడుదల అవుతుంది. కావున ఈ సమయంలో భాగస్వామితో సంభోగంలో పాల్గొనటం వలన గర్భాన్ని పొందవచ్చు. అండోత్సర్గము క్యాలెండర్ మరియు అండోత్సర్గము కాలిక్యులేటర్ ల సహాయంతో ఫలదీకరణ సమయాన్ని సరిగ్గా గుర్తించవచ్చు.

సరైన భంగిమ
సరైన భంగిమలో సంభోగంలో పాల్గొనటం వలన త్వరగా మరియు సులభంగా గర్భాన్ని పొందవచ్చు. ఉదాహరణకు- స్త్రీ తన భాగస్వామి పైన ఉండి రతి జరపటం వలన పురుషాంగం నుండి విడుదలయ్యే శుక్రకణాలు స్త్రీ యోని ద్వారా ప్రవేశించబడవు. అంతేకాకుండా, మీరు గర్భాన్ని ధరించాలి అనుకుంటే,  సేన్టేడ్ టాంపోస్, వెజైనల్ స్ప్రే మరియు కృత్రిమ లుబ్రికేంట్స్ లను వాడకండి. వీటి వాడకం వలన గర్భాశయ కండరాలు ఇన్ఫెక్షన్ లకు గురవుతాయి. గర్భాన్ని ధరించే అవకాశాలు అధికంగా అవటానికి గానూ ఒక పద్దతి అందుబాటులో ఉంది అది- స్త్రీపై పురుషుడి ఉండి రతి జరిపే సమయంలో స్త్రీ నడుము కింద భాగంలో ఎత్తుగా అనగా దిండును ఉంచి రతి జరపటం వలన పురుషాంగం నుండి విడుదలయ్యే శుక్రకణాలు యోని ద్వారా ప్రవేశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా, ఈ భంగిమలో రతి జరిపేటపుడు, పురుషాంగం నుండి శుక్రకణాలు యోనిలో ప్రవేశించిన తరువాత స్త్రీ నడుమును 10 నుండి 15 నిమిషాల వరకు ఎత్తి అనగా దిండుపైనే ఉంచాలి.

గర్భాశయ నిర్మాణం & పరిమాణం
స్త్రీ, ఫలదీకరణ సిద్దంగా ఉన్న సమయంలో గర్భాశయ శ్లేష్మ ఉత్పత్తి అధికమవుతుంది. శ్లేష్మం శుభ్రంగా, మందంగా ఉంటె స్త్రీ ఫలదీకరణకు సిద్దంగా ఉందని అర్థం.

ఆరోగ్యకర జీవనశైలి
గర్భాన్ని ధరించాలి అనుకునే వారు ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించాలి. ఇలా అనుసరించటం వలన గర్భధారణ అవకాశాలు అధికం అవుతాయి. స్త్రీ మరియు పురుషులు ఇద్దరు సమతుల్య ఆహారాలను తీసుకోవటం వలన హార్మోన్లు సరైన స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. సమతుల్య ఆహార సేకరణ వలన పురుషులలో స్పెర్మ్ ఉత్పత్తి మెరుగుపడుతుంది మరియు స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు కూడా మెరుగుపడతాయి. శరీరంలో హార్మోన్ల అసమతుల్యతల వలన గర్భం ధరించే అవకాశాలు చాలా తగ్గుతాయి.

ఒత్తిడిని జయించండి
గర్భం ధరించాలి అనుకునే వారిలో దంపతులుద్దరు ఒత్తిడిని అధిగమించాలి. ఒత్తిడి వలన స్త్రీ మరియు పురుషుల శరీర హార్మోన్లలో వ్యత్యాసాలు కలుగుతాయి. ఫలితంగా, గర్భధారణలో సమస్యలు కలుగుతాయి. కావున ఒత్తిడిని జయించే పద్దతులను (వ్యాయామాలు, యోగా) అనుసరించాలి.

ఫోలిక్ ఆసిడ్
ఫోలిక్ ఆసిడ్ (B విటమిన్) అధికంగా తీసుకునే వారిలో గర్భాన్ని పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సహజంగా, ఫోలిక్ ఆసిడ్ పాలకూర, బ్రోకలీ ఆస్పరాగస్ వంటి పచ్చని ఆకుకూరలలో పుష్కలంగా ఉంటుంది. ఫోలిక్ ఆసిడ్ ను పుష్కలంగా కలిగి ఉండే మరొక సహజ మూలాధారంగా బీట్రూట్ ను చెప్పవచ్చు. వీటితో పాటుగా, ఫోలిక్ ఆసిడ్ ఉపభాగాలను కూడా తీసుకోవటం మంచిది. కానీ, ఫోలిక్ ఆసిడ్ ఉపభాగాలను తీసుకునే ముందు వైద్యుడిని కలవటం మంచిది.

గర్భం ధరించాలనుకునే స్త్రీలు పైన తెలిపిన చిట్కాలను అసరించటమేకాకుండా, అనారోగ్యర జీవనశైలి, సిగరెట్, ఆల్కహాల్ మరియు డ్రగ్స్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.

పిల్లలు పుట్టాలంటే ఎప్పడు కలవాలి ? 
చాలామంది స్త్రీలు పెళ్లి అవ్వగానే పిల్లలు పుట్టేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటారు. అయితే ఇటీవల పెరుగుతున్న అనేక వ్యాధుల వల్ల , ఇన్ ఫెక్షన్స్ , థైరాయిడ్ , పొలిసిస్టిక్ ఒవరీస్ , ట్యూబల్ బ్లాక్స్ , నెలసరి సమస్యలు , అండం సరిగా రాకపోవడం ఇలాంటి అనేక కారణాల వల్ల గర్భం దాల్చడం చాలా కష్టసాధ్యంగా మారింది. అసలు గర్భం ఎప్పడు వస్తుంది ? ఎలా వస్తుంది అనే అవగాహన చాలామందికి లేదనే చెప్పాలి.

సాధారణంగా పీరియడ్స్ వచ్చిన 12 నుంచి 18 రోజుల్లోపు అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తేనే  గర్బం వచ్చే అవకాశాలుంటాయు. మగవారి వీర్యకణాలు అండంతో కలిసి ఫలదీకరణం చెంది పిండంగా మారతాయి. ఈ గర్భాన్ని నెలసరి మిస్ అయిన రెండు మూడు రోజుల్లోనే తెలుసుకునే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది.

గర్భం కావాలనుకునే స్త్రీలు గర్భదారణకు ముందు, గర్భం దాల్చిన తర్వాత కూడ డాక్టర్ సలహా మేరకు పోలిక్ యాసిడ్ మందులు వాడాల్సిఉంటుంది. నేటి ఆధునిక యుగంలో చాలామంది స్త్రీలకు ఐరన్ లోపం వల్ల సంతానలేమి సమస్య కలుగుతోందని , అందుకే రజస్వల అయినప్పటి నుంచే ఐరన్ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకుంటే ఇలాంటి సంతానలేమి సమస్యలు తలెత్తవని చెబుతున్నారు గైనిక్ డాక్టర్స్.

ఎక్కువ సేపు సెక్స్ చేస్తే..!
ఆరోగ్యవంతమైన జీవితంలో సెక్స్ కూడా కీలకమని వైద్యులు చెబుతుంటారు. అయితే ఒకరితోనే సెక్స్ లైఫ్ కొనసాగిస్తే ఇది సాధ్యమవుతుంది. సాధారణంగా  సెక్స్ ని 4-5 నిమిషాలు మాత్రమే చేసే సామర్థ్యం కలిగి ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సమయాన్ని పెంచి ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనాలన్న ఆలోచన ఈ మధ్య పెరుగుతోంది. ఫలితంగా వినాశనానికి దారితీస్తోంది.

కొన్నిరకాల డ్రగ్స్ తో సెక్స్ సమయాన్ని పెంచడమే కాదు ఒకేసారి ఇద్దరి ముగ్గురుతో చేయాలనే ఆలోచన లండన్ యువతలో పెరుగుతోంది. ఈ విధమైన సెక్స్ క్రియను కెమ్ సెక్స్ అంటారు. మెపిడ్రోన్, క్రిస్టల్ మెథాంపెటమైన్, గామా హైడ్రో బ్యుటరేట్ అనే డ్రగ్స్ వాడడం వల్ల సెక్స్ సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో వాళ్లు అన్నపానీయాలకు దూరంగా ఉంటారు. ఆలోచనంతా కోరిక తీర్చకోవడంపైనే ఉంటుంది కాబట్టి ఒకరితో కాకుండా ఇద్దరుముగ్గురుతో సెక్స్ లో గంటల తరబడి పాల్గొంటారు.

ఈ కెమ్ సెక్స్ 72గంటల పాటు ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపిస్తుంది. ఇద్దరు ముగ్గురుతో సెక్స్ వల్ల కూడా HIV, హెపటైటిస్ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. మానసికంగా కూడా దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 






*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

లేచిన వెంటనే చేయవలిసిన పనులు గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా ఉండాలి అంటే


పరగడుపున పొట్టను శుభ్రపర్చడం ఎలా? అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

పరగడుపున పొట్టను శుభ్రపర్చడం ఎలా?
నిద్ర లేచిన దగ్గర నుంచి టిఫిన్‌ తినే ముందు వరకు ఉన్న సమయాన్ని పరగడుపు సమయం అంటారు. ఈ సమయంలో 2 నుంచి 3 లీటర్ల వరకు నీటిని తాగవచ్చు. ఎవరి స్థితిని బట్టి వారు ఇబ్బంది పడకుండా తాగండి. ఫ్రిజ్‌లో పెట్టిన నీరు తాగవద్దు. రాగి పాత్ర ఉన్నవారు రాత్రి అందులో నీరు పోసి ఉదయాన్నే తాగడం శ్రేష్ఠం. కడుపులో మంటలు, పేగుపూత లేదా అల్సర్‌, ఆస్తమా, దగ్గు లేదా కఫం, ముక్కురొంప, ఇస్నోఫిలియా మొదలగు ఇబ్బందులున్న వారు 5 లీటర్ల నీటిని తాగబోయేముందు గోరువెచ్చగా చేసుకుని తాగడం మంచిది. ఇలా సమస్యలు తగ్గేవరకూ చేయాలి.

మొదటి దఫా నీరు
నిద్ర లేచిన వెంటనే అవసరమైతే మూత్రానికి వెళ్లివచ్చి, నోరు వాసనగా ఉంటే పుక్కిలించి ఊసి నీటిని తాగడం ప్రారంభించండి. సీసాతో గానీ చెంబుతో గానీ నిండుగా తీసుకొని ఎత్తి పట్టుకొని తాగడానికి ప్రయత్నించండి. ఒక్క బిగువన ఎంత వరకు ఇబ్బంది లేకుండా తాగగలిగితే అంత నీరు తాగండి. లీటరు కంటే తక్కువగా నీరు తాగిన వారు 4, 5 నిమిషాలు విశ్రాంతి ఇచ్చి మిగతా నీటిని తాగే ప్రయత్నం చేయవచ్చు. మరీ కష్టంగా ఉంటే మళ్లీ 2, 3 నిమిషాలు ఆగి తాగవచ్చు. మొత్తంమీద ఒక్కసారిగా గానీ, 2, 3 సార్లుగా గానీ 5, 6 నిముషాల వ్యత్యాసంలో లీటరు నుంచి లీటరున్నర వరకు మీ ఓపికను బట్టి (లీటరుంపావు-మధ్యస్తంగా అందరికీ బాగుంటుంది) నీటిని తాగండి. కొత్తలో కొన్ని రోజులు వికారంగా ఉండడం గానీ, తిప్పడం గానీ, వాంతులు కావడం గానీ జరగవచ్చు. అయినా ఏమీ కాదు. అలాంటి వారు కొద్దిగా నీటిని తగ్గించి తాగడం మంచిది. ఇలా నీటిని తాగాక మీరు టీవీ చూసినా, కబుర్లు చెప్పుకున్నా, పేపరు చదువుతున్నా, పనిలో పడినా మీకు విరేచనం సాఫీగా కాదు. విరేచనం లేచిన వెంటనే జాడించి వెళ్లాలంటే నేను చెప్పినట్లు చేస్తే తేలిగ్గా పనవుతుంది.

నీళ్లను తాగాక మీ మనసును, ఆలోచనలను పొట్ట, పేగులపై (బొడ్డు కిందిభాగం) పెట్టి 5, 10 నిముషాల అటూ ఇటూ నడుస్తూ పరిశీలించండి. మీరు తాగిన ఎక్కువ నీటి బరువు మీ మలం పేగుపై పడి మలాన్ని ముందుకు గెంటుతూ ఉంటుంది. వేరే ఆలోచనలు మీరు చేయకపోతే మలం పేగుకు ఉండే నరాలు బాగా రిలాక్సయ్యి ఎక్కువ మలం జరిగి ముందుకు వస్తుంది. నీళ్లు తాగాక పేగులపై మనసు లగ్నం చేయడమనేది సుఖ విరేచనానికి అతి ముఖ్యమైన రహస్యం. బాగా అర్జంట్‌ అయ్యేవరకు బయటే తిరగండి. ఇక ఆపుకోలేకుండా వచ్చేస్తున్నదీ అన్నపుడు దొడ్లోకి వెళితే, ఒకే ఇన్‌స్టాల్‌మెంటులో ముక్కకుండా తేలిగ్గా పడిపోతుంది. మీకు హమ్మయ్య ! అనిపిస్తుంది. ఇలా మొదటి విరేచనం అయితే మీరు నిన్న మధ్నాహ్నం తిన్న భోజనం తాలూకు మల పదార్థం పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. మీరు తాగిన నీరు పొట్ట, పేగుల నుంచి 15, 20 నిముషాల్లో రక్తంలోనికి వెళ్లి, అక్కడ నుంచి కణాలలోనికి వెళ్లి కాలుష్యాన్నంతా నానబెడుతుంది. నీళ్లను తాగిన 20 నిమిషాల తర్వాత ఏదన్నా పని చేసుకోవచ్చు లేదా వ్యాయామాలు చేయడం ప్రారంభించవచ్చు. మొదటిసారి నీరు తాగి విరేచనం అయ్యాక ఎవరన్నా వ్యాయామం చేసినా లేదా రెక్కలు కదిలే పనులు చేసుకున్నా ప్రాణవాయువు లోపలకు బాగా వెళ్లి లోపల ఉన్న చెడు బాగా దహనం చెంది, అదంతా బాగా నీటిలో కరుగుతూ ఉంటుంది.

రెండవ దఫా నీరు
మొదటిసారి లీటరు నీటిని మాత్రమే తాగిన వారు గంట విరామం తర్వాత రెండవ దఫా నీరు తాగవచ్చు. మొదటిసారి లీటరుంపావు తాగిన వారు గంటంపావు గ్యాప్‌, లీటరున్నర తాగిన వారు గంటన్నర గ్యాప్‌ ఇవ్వడం మంచిది. ఇలా తాగితే శరీరానికి ఇబ్బంది ఉండదు. కొంతమంది టైమ్‌ లేక తొందరగా రెండవసారి నీరు తాగేసరికి ముఖం ఉబ్బడం, తల డిమ్‌ అవ్వడం, కళ్లు తిరగడం జరుగుతాయి. అలా ఎవరూ చేయకండి. నీటిని మళ్లీ ముందులా బాటిల్‌లో గానీ చెంబులో గానీ తీసుకొని లీటరు నుంచి లీటరుంపావు వరకు 5, 6 నిమిషాల గ్యాప్‌లో తాగడానికి ప్రయత్నించండి. అలా నీటిని తాగాక మనసును పేగులపై పెట్టి అటూ, ఇటూ నడుస్తూ రెండవ విరేచనం అవ్వడానికి ప్రయత్నించండి. మొదటిసారే చాలా వెళ్లిపోయింది, ఇంకా ఏముంటుంది అని అనిపించవచ్చు లేదా ఒకసారి వెళితే రోజుకు సరిపడా అనుకోవచ్చు. ఇది పొరపాట. మన విరేచనం పేగు మీటరున్నర పొడవు ఉంటుంది. మొదటిసారి వచ్చిన విరేచనం అర మీటరు భాగం పేగులోనిదై ఉంటుంది. మిగతా పేగులోని బోలెడు మలమంతా మొదటి విరేచనం అయిన అరగంటలోనే మలద్వారం వద్దకు జరిగి విసర్జనకు రెడీగా ఉంటుంది. మీరు నేను చెప్పినట్లు ప్రయత్నం చేయండి.

అర్జెంట్‌ అనిపించే వరకూ బయటే తిరగండి. అప్పుడు వెళ్లండి. రెండవ విరేచనం ఇంకా సాఫీగా, కాస్త పలుచగా, మరికొందరికి నీళ్లలా వచ్చేస్తుంది. నీళ్లుగా రెండవ విరేచనం అయినా కంగారు పడనవసరం లేదు. మనం తాగిన నీళ్లే కొన్ని అలా వచ్చి పేగుల్ని క్లీన్‌ చేస్తున్నాయి. రెండవ విరేచనంలో వచ్చే మల పదార్థం నిన్న సాయంకాలం తిన్న టిఫిన్‌ తాలూకు, రాత్రి తిన్న భోజనం తాలూకు పదార్ధమై ఉంటుంది. ఇలా రెండు విడతలా విరేచనం అయితే మీ పేగు మొత్తం పూర్తిగా పరిశుభ్రం అయినట్లుగా భావించండి. కొంతమందికి రెండవసారి విరేచనం అవ్వదు. కంగారు వద్దు. నిదానంగా దారిలో పడుతుంది. మీరు తాగిన రెండవ దఫా నీరు 15, 20 నిముషాల్లో మీ రక్తంలోనికెళ్లి ఇంతకు ముందు నానిన కాలుష్యాన్ని, రక్తంలోని దోషాలను పట్టుకొని అటు చెమట గుండా, ఇటు మూత్రం గుండా బయటకు లాక్కొచ్చేస్తుంది. ఇలా రెండు దఫాలుగా మీరు తాగిన నీరు మీలోని 5 లీటర్ల రక్తాన్ని, 70 శాతం నీటిని, కోటానుకోట్ల జీవకణాలను స్నానం చేయిస్తుది. ఇన్నాళ్ళూ మనకు పైకి స్నానం చేయడమే తెలిసింది గానీ లోపలకు స్నానం చేయడం ఇప్పుడు తెలుసుకున్నారు. మన శరీరం తనలో ఉన్న కాలుష్యాన్ని తెల్లవారుజాము సమయం నుంచి టిఫిన్‌ తినే ముందు వరకూ బయటకు గెంటుకునే ప్రయత్నంలో ఉంటుంది. కాబట్టి మనం పరగడుపున నీటిని తాగి శరీరానికి భారాన్ని తగ్గించిన వారమయ్యాం. ఇలా ప్రతిరోజూ మనం శరీరానికి అవసరమైన నీటినిచ్చి ఆరోగ్యాన్ని పుచ్చుకుందాం. మొదటి, రెండవ దఫాలలో నీటిని బాగా తక్కువ తాగిన వారు మూడవ దఫాగా ఇంకొంచెం తాగవచ్చు. అలవాటులో నీటిని రెండు దఫాలుగా ముగించి వేయడం మంచిది. ప్రయాణాల్లో లేదా ఎప్పుడన్నా కుదరనప్పుడు కాస్త సడలించుకోండి.

స్మార్ట్ ఫోన్ అతిగా వాడుక వల్ల వచ్చే ప్రమాదం ఏమిటి


స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించుకోకుంటే ఎన్నో సమస్యలు!అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 





అన్నింటికీ స్మార్ట్ ఫోనే ఆధారంగా మారింది. నేటి అవసరాలు, ఆధునిక టెక్నాలజీ కారణంగా స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. కానీ, అదొక తీవ్రమైన అలవాటుగా మారి, రోజులో ఓ రెండు గంటలకు మించి స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్టయితే జాగ్రత్త. లేకుంటే తర్వాత వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కోసం లక్షలాది రూపాయలు వైద్యం రూపంలో ఖర్చు చేయక తప్పదంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పరిశోధకులు, వైద్యులు. కనుక స్మార్ట్ ఫోన్ వినియోగం వెనుక ఉన్న దుష్ప్రభవాల గురించి స్మార్ట్ యూజర్లుగా తెలుసుకుందాం.

వెన్నెముక సమస్యలు
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్న సమయంలో ఫొటో తీయమని మీ స్నేహితుడికి చెప్పండి. ఫొటో తీసే సమయంలో మీరు ఎప్పుడు మాదిరిగానే స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉండండి. ఆ తర్వాత ఆ ఫొటోను పరిశీలించండి. మీ మెడ ముందుకు బెండ్ అయి ఉంటుంది. ఒకే కోణంలో తలను కిందకు వంచి ఉంచడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతుంది.అమెరికన్ వెన్నెముక వైద్య నిపుణులు డాక్టర్ కెన్నెత్ హన్స్ రాజ్ నిర్వహించిన ఓ పరిశోధన ప్రకారం.... మన తల బరువు 4.5 కిలోల నుంచి 5.5 కిలోల బరువు ఉంటుంది. తలను ముందుకు వంచి స్మార్ట్ ఫోన్ ను చూస్తున్న సమయంలో మెడపై భారం పెరుగుతుంది. 30 డిగ్రీల కోణంలో మెడ వంచినప్పుడు  వెన్ను ఎముకపై 18 కిలోలంత భారం పడుతుంది. ఈ స్థాయిలో భారం దీర్ఘకాలం పాటు కొనసాగితే వెన్నుపాములో డిస్క్ ల అరుగుదల (కణజాల క్షీణత) ముందుగానే మొదలువుతంది. వృద్ధాప్యం రాకముందే, నడి వయసులోనే వెన్నెముక సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని డాక్టర్ హన్స్ రాజ్ పరిశోధన తెలియజేస్తోంది. దీనికి ఆయన సూచిస్తున్న సూచన ఏమిటంటే... మెడ భాగం ముందుకు వంగకుండా, వెన్నెముకను ఎప్పటిలానే తటస్థంగా ఉంచుతూ స్మార్ట్ ఫోన్ వాడుకోవాలి. మరో సూచన ఏమిటంటే సాధ్యమైనంత వరకు వినియోగం తగ్గించడం. కాల్స్, మెస్సేజ్ లు, అత్యవసర మెయిల్స్ వీటికోసమే వాడుకోవడం. వినోద కార్యక్రమాలకు ఫోన్ కు బదులు టీవీ, ఇతరత్రా సాధనాలను ఎంచుకోవడం.

representative imageయవతీ, యువకుల్లోనూ స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల వెన్ను సంబంధిత సమస్యలు గత కొన్ని సంవత్సరాల్లో బాగా పెరిగిపోయాయని బ్రిటిష్ చిరో ప్రాక్టిక్ అసోసియేషన్ చెబుతోంది. 2015 గణాంకాల ప్రకారం 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 45 శాతం మంది నడుం నొప్పి సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. వెన్నెముక డిస్క్ లపై భారం మోపడమే దీనికి కారణం.

నరాలు దెబ్బతినిపోవడం
స్మార్ట్ ఫోన్ వినియోగంతో దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒసిప్టల్ న్యూరాల్జియా. ఇదో నరాల సంబంధిత సమస్య. వెన్నుపూస పైభాగం నుంచి వెళ్లే నరాలు ఒత్తిడికి గురై వాచిపోవడం ఈ స్థితిలో జరుగుతుంది. దీంతో తలనొప్పి లేదా తీవ్రమైన తలనొప్పికి కారణమయ్యే మైగ్రేయిన్ ఎదురవుతుంది. ఇది వస్తే మాత్రం నయం కాదు. నొప్పిని అదుపు చేసేందుకు మందులు వాడుకోవడం, విశ్రాంతి తీసుకోవడమే. యోగా చేయడం, స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేయడం ద్వారా రిలీఫ్ ఉంటుంది.

ప్రమాదాలు
స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటడం, స్మార్ట్ ఫోన్ చూస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం... ఈ పరధ్యానంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్న వారు, గాయలపాలవుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉంటున్నారు. అంగవైకల్యం బారిన పడి బాధపడుతున్న వారి పరిస్థితి ఏంటో ఆలోచించండి. అందుకే రోడ్డుపైన, రద్దీ ప్రదేశాల్లో ఫోన్ వాడడం ఎంత మాత్రం సురక్షితం కాదు. ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధనలో ఏటా 1,500 మందికి పైగా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు తేలింది. 100 కోట్ల మొబైల్ కనెక్షన్లున్న మన దేశంలో ఎంత మంది ఇలా ప్రమాదం బారిన పడుతున్నారో ఆలోచించండి.

కళ్లతో చూడలేరు
స్మార్ట్ ఫోన్ ఎక్కువ వాడకంతో వచ్చే పెద్ద ముప్పు కంటిచూపు దెబ్బతినిపోవడం. కంటిలోని రెటీనా సామర్థ్యాన్ని స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి విడుదలయ్యే నీలి కాంతి (బ్లూ లైట్) దెబ్బతీస్తుంది. దీంతో మయోపియా (దగ్గర దృష్టి) పెరిగిపోతుంని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు గంటల పాటు స్మార్ట్ ఫోన్ వినియోగించే వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందట. స్మార్ట్ ఫోన్లు విడుదల చేసే బ్లూ వయలెట్ కాంతి కంటి చూపునకు కీలకమైన రెటీనాపై హాని కారక ప్రభావాన్ని కలిగిస్తుంది. దీంతో రెటీనా కేంద్రక భాగంలోని మాక్యులా క్షీణత మొదలవుతుంది. దీంతో కంటిచూపు క్రమంగా క్షీణించడం మొదలవుతుంది. దీంతో శాశ్వతంగా సెంట్రల్ విజన్ కోల్పోవాల్సి వస్తుందని అమెరికన్ మాక్యులర్ డీజనరేషన్ ఫౌండేషన్ హెచ్చరిస్తోంది. అంటే ఎదురుగా ఎవరున్నారో చూడలేరు. కేవలం పక్కనున్నవి మాత్రమే కనిపిస్తాయి.

స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్న వారు తరచూ తలనొప్పి, కళ్లు మంటలకు గురవుతుంటే అదో ముందస్తు హెచ్చరికగా భావించాలి. ఇక కంటి చూపులో తేడా వచ్చిందంటే ఫోన్ ను కాల్స్ కు తప్ప దేనికీ ఉపయోగించకుండా పక్కన పెట్టేసి వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ఉత్తమం. లేదంటే 20-20-20 విధానాన్ని అనుసరించాలి. ప్రతీ 20 నిమిషాలకు 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలోని వాటిని చూడాలి.ఇటీవల బెంగళూరులో పలు ఆస్పత్రులకు వచ్చిన కేసులను పరిశీలిస్తే... 17 ఏళ్ల యువతి రోజులో ఎక్కువ సమయం తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్లలోనే గడిపేది. అదే పనిగా గేమ్స్ ఆడుతూ ఉండేది. కొంత కాలానికే ఆమె కంటి చూపులో మార్పు వచ్చేసింది. మైనస్ 1.5 నుంచి మైనస్ 3కి పడిపోయింది. కళ్లు ఎర్రబారడం వంటి సమస్యలు ఎదురయ్యాయి.  45 ఏళ్లు పై బడిన వారిలో కనిపించే పొడిబారిన కళ్లు (డ్రై ఐస్) సమస్య ఆమెలో ఉన్నట్టు గుర్తించారు వైద్యులు. దాంతో ఆమెను స్మార్ట్ ఫోన్ ఉపయోగించొద్దని సూచించారు. తీసుకునే ఆహారంలో మార్పులు సూచించడంతోపాటు బయటకు వెళ్లి చేసే పనుల్లో పాల్గొనాలని కూడా చెప్పారు.

మరో ఘటనలో 32 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తీవ్రమైన తలనొప్పితో వైద్యులను ఆశ్రయించాడు. తీవ్రమైన తలనొప్పి, కళ్ల అలసటతో ఆయన ఆరు నెలలుగా బాధపడుతున్నాడు. అదే పనిగా స్మార్ట్ ఫోన్ వినియోగం, కంప్యూటర్ ముందు పని కారణంగా కంటిలోని కండరాల నొప్పి, కళ్లు పొడిబారడంగా వైద్యులు గుర్తించారు. నెల రోజుల చికిత్స అనంతరం ఫోన్ వినియోగం కాల్స్ కు మినహా ఇంక దేనికీ వాడకుండా అదుపు చేయడం వల్ల అతడు కోలుకున్నాడు.

‘‘కళ్లు రెప్పార్పుతూ ఉండడం అన్నది ఎంతో అవసరం. దీనివల్ల కంట్లో నీరు స్రవిస్తుంటుంది. కానీ, కళ్లను ఆర్పకపోవడంతో కళ్లు పొడిబారతాయి.దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి’’ అని సక్రా వరల్డ్ హాస్పిటల్ కంటి వైద్యులు శిరీష్ నెలివిగి తెలిపారు. ప్రతీ నెలా 300మంది యువతీ యువకులు డ్రై ఐస్ సమస్యతో వస్తున్నట్టు నారాయణ నేత్రాలయ వైస్ చైర్మన్ రోహిత్ శెట్టి అంటున్నారు. ‘‘టియర్ గ్లాండ్స్ (కంట్లో నీటిని విడుదల చేసే గ్రంధులు) అనేవి స్పష్టమైన కంటిచూపునకు ఎంతో అవసరం. ఒకవేళ కళ్లు తేమ లేక పొడిబారితే అప్పుడు టియర్ గ్లాండ్స్ తేమతో కూడిన అక్వెస్ లేయర్ అనే పొరను ఉత్పత్తి చేయలేవు. దీంతో చూపు తగ్గిపోతుంది’’ అని రోహిత్ శెట్టి తెలిపారు.

వినికిడి శక్తికీ నష్టమే
స్మార్ట్ ఫోన్ లో పాటలు పెట్టుకుని హెడ్ ఫోన్స్ తో చక్కగా వినేస్తున్నారా...? అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ డెఫ్ నెస్ సమాచారం మేరకు... ఆ దేశంలో 2.6 కోట్ల మంది శబ్ద ఆధారిత వినికిడి శక్తి లోపంతో బాధపడుతున్నారు. అలా వచ్చే శబ్దాలలో సెల్ ఫోన్ హెడ్ సెట్స్ కూడా ఉన్నాయి. చాలా తక్కువ సౌండ్ తో వింటే  ఈ సమస్య రాదు. 85 డెసిబుల్స్ దాటిన శబ్దాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అధిక సౌండ్ కు గురైనప్పుడు చెవి అంతర్భాగంలోని సూక్ష్మ కేశాలు దెబ్బతింటాయి.

రేడియేషన్
సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల హాని కలుగుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎటువంటి హాని లేదని మరికొందరి వాదన. కానీ, సెల్ ఫోన్ రేడియేషన్ తో కచ్చితంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని 200 మంది వైద్య పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. సెల్ ఫోన్లు మనుషులకు హానిచేసే అవకాశం ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రకటించింది. బ్రెయిన్ కేన్సర్,  పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గడం, ఎముకల సాంద్రత తగ్గడం వంటి పలు సమస్యలు వస్తాయని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. అయితే, పూర్తి స్థాయి, కచ్చితమైన నిర్ధరణల కోసం ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే సెల్ ఫోన్ ను పూర్తి సిగ్నల్ ఉన్న సమయంలోనే కాల్స్ చేసుకోవడం, నేరుగా చెవి దగ్గర పెట్టుకోకుండా స్పీకర్ వాడడం, పని లేనప్పుడు సెల్ ఫోన్ ను చేతిలో ఉంచుకోకుండా దూరంగా ఉంచడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.

ఆందోళన
ఆఫీసులో అప్పటి వరకు పని ఒత్తిడి ముగించుకుని ఇంటికి రాగా, ఆ తర్వాత కూడా ఫోన్ తో కమ్యూనికేషన్ నడుస్తూనే ఉంటుంది. ఇది ఆందోళనకు, ఒత్తిడికి కారణమవుతుందని, రక్తపోటు తదితర సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ లో మెస్సేజ్ వచ్చిందా అని తరచూ చూసుకోవడం లేదంటే ఫేస్ బుక్ లో కొత్త పోస్ట్ ఇలా తరచూ ఫోన్ వైపు చూసుకునే వ్యసనం కారణంగా మానసిక గందరోగళ పరిస్థితి ఎదురవుతుందట.

నిద్రాభంగం
స్మార్ట్ ఫోన్ వినియోగం నిద్రపై చెడ్డ ప్రభావం చూపిస్తుంది. రాత్రి పడకగదిలో మంచంపైకి ఎక్కిన తర్వాత స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ వంటి వాటిలో ఏదైనా పట్టుకున్నారంటే నిద్ర సరిగా పట్టదు. 63 శాతం మంది నిద్రాభంగాన్ని ఎదుర్కొంటున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. కారణం స్మార్ట్ ఫోన్ల నుంచి వెలువడే బ్లూలైట్. నిద్రించే ముందు కాఫీలు తాగొద్దని చెబుతుంటారు. ఇందులోని కెఫైన్ నిద్రరానీయదు. అయితే, కాఫీ కంటే స్మార్ట్ డివైజ్ ల స్క్రీన్ల నుంచి వెలువడే బ్లూలైట్ చాలా హానికరమట.

హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు దీనిపైనే ఓ అధ్యయనం నిర్వహించారు. ఆరున్నర గంటల పాటు బ్లూలైట్, గ్రీన్ లైట్ ప్రభావాన్ని కళ్లపై పడేేలా చూశారు. ఆ తర్వాత ఫలితాలను చూడగా బ్లూ లైట్ గ్రీన్ లైట్ కంటే రెండు రెట్లు అధికంగా మెలటోనిన్ అనే హర్మోన్ ను అణిచేసింది. నిద్ర పట్టడాన్ని బ్లూలైట్ మూడు గంటల పాటు ఆలస్యం చేయగా, గ్రీన్ లైట్ గంటన్నర పాటు ఆలస్యం చేసినట్టు గుర్తించారు. నిద్ర కోసం మెలటోనిన్ అనేది చాలా అవసరం. అది సరిగ్గా విడుదల అయితేనే విశ్రాంతి కావాలన్న సంకేతం మెదడుకు వెళుతుంది.

బ్యాక్టీరియా
టాయిలెట్ సీటుపై ఉండే బ్యాక్టీరియా కంటే స్మార్ట్ ఫోన్ పై 10 రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా పరిశోధకులు గుర్తించారు. టాయిలెట్ బేసిన్ ను పవర్ ఫుల్ లిక్విడ్లతో శుభ్రం చేసుకుంటాం. కానీ, స్మార్ట్ ఫోన్ ను శుభ్రం చేసేవారు ఎంత మంది ఉంటారు...? ఆల్కహాల్ లేని క్రిమిసంహారక వైప్స్ మందుల షాపుల్లో లభిస్తాయి. వాటితో ఫోన్ ను శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా లేకుండా చూసుకోవచ్చు.

మొద్దుగా మార్చేస్తుంది?
స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైతే మెదడుకు సహజ సిద్ధంగా ఉండే సామర్థ్యం తగ్గుతుందంటున్నారు వైద్యులు. ఫలితంగా మెమరీ పవర్ దెబ్బతింటుంది. మెదడు పాత విషయాలను తిరిగి స్మరణకు చేసుకునే శక్తి బలహీనపడుతుంది. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ పరిశోధకులు 600 మందిపై ఓ పరిశోధన నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ పై తక్కువ సమయం వెచ్చించేవారికి అధిక సమయం వెచ్చించేవారి కంటే ఎక్కువ మేధోశక్తి, విశ్లేషనా శక్తి ఉంటోందని తెలిసింది. ఇక స్మార్ట్ ఫోన్ల కారణంగా శారీరక వ్యాయామాలు, ఇతర పనులు చేసుకునేందుకు కూడా ఆసక్తి తగ్గుతుందంటున్నారు పరిశోధకులు. స్మార్ట్ ఫోన్ వ్యసనం వల్ల సమయం దొరికితే దానిపైనే గడిపేయాలనుకోవడమే దీనికి కారణం.

ఏకాగ్రత లోపం
స్మార్ట్ ఫోన్ అతిగా వాడే వారిలో ఏకాగ్రత్త శక్తి బలహీనపడుతుంది. సాధారణంగా మన ఏకాగ్రత సమయం 12 సెకండ్ల కంటే ఎక్కువే ఉంటున్నట్టు 2000లో నిర్వహించిన పరిశోధన ఫలితాలు చెబుతుండగా, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత ఇది 8 సెకండ్లకు తగ్గిందని తేలింది.

చేతివేళ్లలో సమస్యలు
స్మార్ట్ ఫోన్ ను దీర్ఘకాలంపాటు రోజులో అధిక సమయం చొప్పున వాడే వారిలో అరచేయి, వేళ్లలోని ఏముకలు, మణికట్టులో నొప్పులు వంటివి కనిపిస్తాయంటున్నారు.

వ్యక్తిగత సమాచారానికి ముప్పు
స్మార్ట్ ఫోన్లో నేడు దాదాపుగా అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. పొరపాటుగా సెల్ ఫోన్ పోయినా, ఎవరైనా తస్కరించినా అందులో ఉన్న మీ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలు, బ్యాంకు ఖాతాల సమాచారం, కాంటాక్టులు, పర్సనల్ ఫైల్స్, మీడియా ఇలా అన్నీ ఇతరుల చేతుల్లో పడితే వచ్చే అనర్థం ఎలా ఉంటుందో ఓ సారి ఆలోచించుకోండి.

ఒంటరితనం.. అందరూ దూరం
స్మార్ట్ ఫోన్ తో వచ్చిన మరో పెద్ద చిక్కు దాన్నే లోకంగా భావిస్తూ అందులోనే గంటల తరబడి సమయం గడుపుతూ మిగిలిన వారిని, మిగిలిన లోకాన్ని విస్మరించడం. భౌతిక ప్రపంచం కంటే ఆన్ లైన్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడిపేందుకు అలవాటు పడడానికి ఇష్టపడతారు. నలుగురిలో ఉన్నా, ఇంట్లో భార్యా పిల్లలతో ఉన్నా, బంధువుల ఇంటికి వెళ్లినా, మన ఇంటికి బంధువులు వచ్చినా వారితో వెచ్చించే సమయం స్వల్పమే. ఎక్కడున్నా స్మార్ట్ ఫోన్ పై చేతి వేళ్లు కదులుతూనే ఉంటాయి. దీనివల్ల వ్యక్తిగత సంబంధాలు, అనుబంధాలు సైతం దెబ్బతింటాయి. యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ పరిశోధకుల అధ్యయనంలో తేలిందేమంటే... స్మార్ట్ ఫోన్ మనుషుల్ని మరింత స్వార్థపరులుగా మారుస్తుందని. సామాజికంగా, స్నేహంగా జీవించడం తగ్గుతుందట. అంటే ఇతరులకు సాయం చేసే గుణం తగ్గిపోతుంది.

శృంగార జీవితంపైనా...
స్మార్ట్ ఫోన్ పడకగదిలోకి ఎప్పుడో ప్రవేశించింది. దీంతో జీవిత భాగస్వామితో సన్నిహితంగా మెలగడానికి సమయం తగ్గిపోతోంది. నిద్ర కూడా కరువవుతోంది. పడకమంచంపై విశ్రాంతిగా పడుకున్నా చేసే పని స్మార్ట్ ఫోన్ లో విహరించడమే. దీనివల్ల శృంగారంపై ఆసక్తి తగ్గిపోతోంది. శృంగారం మధ్యలోనూ మెస్సేజ్ లు చూసుకునే వారు ఎంతో మంది ఉంటున్నారు.

మధుమేహం ఉన్నారు ఆహారం నియమాలు తీసుకోవలిసిన జాగ్రత్తలు


మధుమేహం ఉన్న వారు ఆహారం నియమాలు అవగాహనా కోశం నవీన్ నడిమింటి సలహాలు  Diabetes





మధుమేహులు తీసుకోదగ్గ ఆహారం


మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) నియంత్రణలో ఉండడం అన్నది ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. కనుక వారు తీసుకోవాల్సిన ఆహారం, పండ్ల గురించి పోషకాహార, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

కాకరకాయషుగర్ ఉన్న వారు కాకరకాయలు తింటే మంచిదని మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది చెబుతుంటారు. రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా నియంత్రిస్తుందని అలా చెబుతారు. ఎందుకంటే కాకరకాయలో ప్లాంట్ ఇన్సులిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్  స్థాయులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. రోజూ ఉదయం రెండు నుంచి మూడు కాకరకాయల నుంచి రసం తీసుకుని తాగొచ్చు. అలాగే, కాకరకాయల్లోని గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ఓ చెంచాడు నీటిలో కలుపుకుని రోజూ తాగినా మంచి ఫలితం ఉంటుంది.

మెంతిమధుమేహ నియంత్రణకు మనలో ఎక్కువ మంది మెంతులను తీసుకోవడం చూస్తుంటాం. ఓ చెంచాడు మెంతులను రోజూ రాత్రి గ్లాసు నీటిలో వేసుసుకుని మరుసటి రోజు ఉదయం నీటిని మాత్రం తాగాలి. మిగిలిన మెంతులను చట్నీ చేసుకుని తినడం లేదా చపాతీలో కలుపుకుని తినడం చేయొచ్చు.

వెల్లుల్లివెల్లుల్లి సహజంగా రక్తపోటు నియంత్రణకు మంచిగా ఉపకరించే ప్రకృతి సిద్ధ ఔషధం. అంతేకాదు డయాబెటిస్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో జింక్, సల్ఫర్ ఇన్సులిన్ కాంపోనెంట్స్ వుంటాయి. ఇక వెల్లుల్లిలో  ఉండే పొటాషియం మూత్రం ద్వారా వెళ్లిపోయే దాన్ని భర్తీ చేస్తుంది. అందుకే ప్రతీ రోజూ ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవాలి.

అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్)అవిసె గింజల్లో ఓమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ప్రొటీన్, ఫైబర్ ఈ గింజల నుంచి లభిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కణాలు ఇన్సులిన్ ను గ్రహించేందుకు తోడ్పడతాయి. ప్రతీ రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓ చెంచాడు గింజలను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

దాల్చిన చెక్కగ్లూకోజ్ ఉత్పత్తిని మెరుగుపరిచి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తేల్చాయి. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే మధుమేహంతో బాధపడేవారు మార్పును గుర్తిస్తారు.

పీచు పదార్థాలుఆహారంలో భాగంగా పీచు అధికంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే పీచు ఉండే పదార్థాలు వెంటనే గ్లూకోజ్ గా మారవు. వీటి జీర్ణ ప్రక్రియ నిదానంగా ఉంటుంది. కనుక చక్కెరలు కొంచెం కొంచెంగా విడుదల అవుతాయి. ఓట్స్, పాలిష్ పట్టని ముడి బియ్యం, గోధుమల్లో పీచు ఎక్కువగా లభిస్తుంది.

బీన్స్బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఒకటి. ఇందులో పీచు దండిగా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థలో ఎక్కువ సమయం పాటు ఇది ఉంటుంది. దీంతో కడుపు నిండినట్టు భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడేవారికి ఎక్కువ ప్రయోజనకారి.

బార్లీబార్లీలో నీటిలో కరిగిపోయే ఫైబర్, కరిగిపోని ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. సూప్ గానూ లేదా సలాడ్స్ లోనూ కలిపి తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ఆహార సేవన అనంతరం రక్తంలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగడాన్ని 70 శాతం వరకు నియంత్రిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.

క్యారెట్స్క్యారట్లలో కొద్ది మోతాదులో షుగర్ ఉంటుంది. కనుక మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకోవద్దని చెబుతుంటారు. కానీ, ఈ మోతాదు తక్కువే గనుక తీసుకోవచ్చు. ఎందుకంటే క్యారట్లలో సహజమైన బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది డయాబెటిస్ నియంత్రణకు ఉపకరించేదన్న విషయాన్ని గుర్తించాలి.

తోటకూరరోజూ తోటకూరను ఆహారంలో భాగం చేసుకున్నా ఫలితం కనిపిస్తుంది. తోటకూర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని... దాంతో రక్తంలోని చక్కెర నిల్వలను కణాలు చక్కగా అందిపుచ్చుకుంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గుర్తించడం జరిగింది.

పాలుఫ్యాట్ తక్కువగా ఉండే పాలను రోజూ రెండు కప్పుల వరకు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇందులో ఉండే ప్రొటీన్లు రక్తంలో షుగర్ నిల్వల నియంత్రణకు తోడ్పడతాయి. పెరుగు, మజ్జిగ తీసుకోవడం కూడా మంచిదే.  

ఓట్ మీల్ఓట్స్ లో నీటిలో కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. నీటితో కలిపితే పేస్ట్ గా మారడం జరుగుతుంది. ఈ ఫైబర్ జీర్ణ ఎంజైమ్ లు, ఆహారంలోని పిండి పదార్థాల మధ్య ఓ లేయర్ గా పనిచేస్తుంది. దీంతో ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరగా మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగిపోదు. బ్రేక్ ఫాస్ట్, సూప్ లలో భాగంగా దీన్ని తీసుకోవడం ఫలితాన్నిస్తుంది.

ఆలివ్ ఆయిల్ఆలివ్ ఆయిల్ లో ఉండే మంచి ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఆలివ్ ఆయిల్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

క్యాబేజీక్యాబేజీలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో క్రోమియం అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలో రక్తంలో షుగర్ నియంత్రించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవడం మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.

కొద్ది కొద్దిగా ఆహారంషుగర్ వ్యాధితో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ భోజనాల జోలికి వెళ్లొద్దు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు అమాంతం పెరిగిపోతాయి. దీనికి బదులు స్వల్ప పరిమాణంలో ప్రతీ మూడు గంటలకోసారి తీసుకోవడం మంచిది. అలాగే, ఎట్టి కారణాల వల్లనూ ఆహారాన్ని మానేయకూడదు.

నట్స్నట్స్ లో మంచి ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ నియంత్రణ తేలిక అవుతుంది. నట్స్ లోని విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కణాలను కాపాడతాయి. దీంతో నాడులు, నయనాలు దెబ్బతినకుండా రక్షణ ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్, మెగ్నీషియం రక్తంలో చక్కెరల నియంత్రణకు తోడ్పడతాయి.

దానిమ్మ (పొమెగ్రనేట్స్)ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధ పడేవారికి దానిమ్మ చాలా మంచిది. ఇందులో చక్కెరలు స్వల్ప స్థాయిలో ఉంటాయి గనుక మధుమేహం గల వారు తీసుకోవచ్చు.

పుచ్చకాయ (వాటర్ మెలాన్)ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి మధుమేహులు గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉన్న వాటినే తీసుకోవాలి. ఎందుకంటే జీఐ ఎక్కువగా ఉంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అయితే, పుచ్చకాయలో జీఐ ఎక్కువగానే ఉన్నా గ్లైసిమిక్ లోడ్ అన్నది తక్కువ. కనుక పరిమితంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతారు. పుచ్చకాయలో అధికంగా ఉండే పొటాషియం కిడ్నీల పనితీరు చక్కగా ఉండేందుకు ఉపకరిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారిలో కిడ్నీల వైఫ్యలం ముప్పు ఉంటుంది. ఇక డయాబెటిస్ లో నరాలు దెబ్బతినడం కూడా జరుగుతుంది. కానీ, పుచ్చకాయలో ఉండే లైకోపీన్ దీన్ని నివారిస్తుంది.

కమలాలుడయాబెటిస్ ఉన్న వారు విటమిన్ సి తీసుకోవడం ఎంతో అవసరం. కమలా పండు రోజుకు ఒక్కటి తీసుకున్నా ఆ మేరకు లభిస్తుంది. ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు పెరిగిపోతాయన్న భయం అక్కర్లేదు. చక్కెర స్థాయులు తక్కువే.

బొప్పాయిబొప్పాయిలో విటమిన్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి గనుక మధుమేహులకు ఈ పండు మంచి చేస్తుంది.

జామ
మధుమేహాన్ని నియంత్రించే గుణాలు జామలో ఉన్నాయి. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మలబద్దకం సమస్య వేధిస్తుంది. జామకాయలో ఉండే పీచు కారణంగా విరేచనం సాఫీగా జరుగుతుంది. జామలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. జీఐ మోస్తరు స్థాయిలో ఉంటుంది గనుక జామపండును రోజుకు ఒక్కటి తినడం ప్రయోజనదాయకం.

నేరేడుపండ్లు (జామూన్)
ఈ పండ్లు మధుమేహాన్ని మంచిగా కంట్రోల్ చేయగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే గింజల్లో గ్లూకోసైడ్ ఉంటుంది గనుక. ఈ గ్లూకోసైడ్ ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారకుండా అడ్డుకుంటుంది.

యాపిల్స్యాపిల్ లో ఉండే జీఐ వేల్యూ 20. కొన్ని రకాల యాపిల్స్ లో ఇంతకంటే తక్కువే ఉంటుంది. కనుక రోజూ యాపిల్ ను నిక్షేపంగా తీసుకోవచ్చు. బ్లూ బెర్రీస్ లేదా ద్రాక్ష పండ్లతో కలిపి యాపిల్ తినడం వల్ల  టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పేర్కొంది.  

ఉసిరిఉసిరిలో పుష్కలంగా విటమిన్ సి, ఫైబర్ వుంటాయి. కనుక మధుమేహం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటలు తీసుకోవడం మంచిది.

వీటిని తగ్గించేయడం శ్రేయస్కరంసాల్ట్ ను విడిగా తీసుకోవద్దు. వంటల్లోనూ చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఎందుకంటే కూరగాయల్లో సహజంగానే ఉప్పు లభిస్తుంది. అది మన శరీరానికి సరిపోతుంది. ఎక్కువైతే ఇది సైలంట్ కిల్లర్. అలాగే, పంచదారను కూడా దాదాపుగా మానేయడమే ఉత్తమం. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చాలా వరకు తగ్గించేయాలి. ఆయిల్ మోతాదు మించకుండా చూసుకోవాలి. మాంసాహారులు దాన్ని విడిచి శాకాహారానికి మళ్లడం మంచిది. హోల్ మిల్క్ (ఎక్కువగా ఫ్యాట్ ఉండేవి) తీసుకోవద్దు. టీ, కాఫీ ఏదైనా రెండు కప్పులు మించకుండా చూసుకోండి. గోధుమలను బాగా శుద్ధి చేయగా చివరికి పిప్పిగా మిగిలే మైదా వినియోగాన్ని మానేయాలి. జీఐ ఎక్కువగా ఉండే పాలిష్డ్ రైస్ ను మానేయాలి. బ్రౌన్ రైస్ మంచిది. ఇది అరగడం కష్టంగా ఉంటే ఒక్కసారి పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుకోవచ్చు. ఆలుగడ్డలు, బ్రెడ్స్, అరటి పండ్లు వీటిలో జీఐ ఎక్కువగా ఉంటుంది. వీటికి దూరంగా ఉండాలి.

ఈ వేళల్లో తప్పనిసరిగా....ఉదయం 5-7 గంటల్లోపు నిద్ర లేచే వారు తప్పకుండా వేకప్ స్నాక్ తీసుకోవాలి. 7 గంటల తర్వాత నిద్ర లేచే వారు 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లాలి. ఉదయం 7 లోపు లేచిన వారు వేకప్ స్నాక్ తీసుకున్నా... వారు కూడా 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10-11.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. మధ్యాహ్నం 12-2.30 మధ్య లంచ్ కు సమయం నిర్ణయించుకోవాలి. మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. డిన్నర్ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయం కేటాయించుకోవాలి. ఆహారం నుంచి ఆహరానికీ మధ్య 3 గంటలకు మించకుండా చూసుకోవాలి. డిన్నర్ తర్వాత గంటన్నర నుంచి రెండు గంటల విరామం ఇచ్చి అప్పుడు నిద్రకు వెళ్లడం మంచిది. ఏ ఆహారం తీసుకున్నా గానీ అది 60:20:20 రేషియోలో ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్, ప్రొటీన్లు ఈ నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి.

వేకప్ స్నాక్రాత్రి నీళ్లలో నాన బెట్టిన మెంతులను ఉదయం వేకప్ స్నాక్ గా తీసుకోవచ్చు. లేదా యాపిల్ పండు. లేదా రాత్రి నీటిలో నానబెట్టిన ఐదారు బాదం గింజలు. వాటికి తోడు మూడు వాల్ నట్స్. లేదా చెంచాడు అవిసె గింజలను వేయించుకుని తినొచ్చు. ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్. టమాటాను జ్యూస్ లా చేసుకుని అందులో కాస్త మిరియాల పొడి వేసుకుని ఖాళీ కడుపుతో లాగించేయవచ్చు.

బ్రేక్ ఫాస్ట్
ఓట్స్ ను ఉప్మాగా చేసుకుని తీసుకోవచ్చు. ఇడ్లీ, మినప దోశ లేదా పెసర దోశ (ఆయిల్ తక్కువతో), కాయగూరలతో చేసిన సేమ్యా ఉప్మా. లేదంటే నానబెట్టిన పెసలు లేదా శనగలు వంటి వాటితో గుగ్గిళ్ల వంటివి చేసుకుని లేదా విడిగానూ తీసుకోవచ్చు. వీటికి కొన్ని బీట్ రూట్, బాదం, టమాటా వంటివి కలుపుకున్నా సరే. పాలకూరతో కలిపి చేసిన చపాతీ లేదా మెంతులతో కలిపి చేసిన చపాతీ తినొచ్చు.

స్నాక్ (11 గంటల సమయంలో)యాపిల్ తీసుకోవచ్చు. లేదా పైన చెప్పుకున్న పండ్లలో ఏదేనీ ఒకదాన్ని తీసుకోవచ్చు. ఓ గ్లాసుడు బటర్ మిల్క్ తాగితే అందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలోకి చేరి ఆ రోజు జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు తోడ్పడుతుంది. కీరదోస, క్యారట్ ముక్కలు తీసుకోవచ్చు. సమోసా లేదా పకోడి వంటివి. బటర్ మిల్క్ తీసుకోకపోతే గ్లాసు పాలు.

లంచ్బ్రౌన్ రైస్ లేదా పరిమితంగా వైట్ రైస్, కాయగూరల మిక్స్ (కీరదోస, క్యారట్లు వంటి ముక్కలు), ఓ చపాతీని, పప్పు తీసుకోవచ్చు. అరటి కూర తీసుకోవచ్చు. ఆలూ పరాటాను కూడా భాగం చేసుకోవచ్చు.

సాయంత్రం స్నాక్టీ లేదా కాఫీ, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ (డేట్స్, వాల్ నట్స్, అంజీర, జీడిపప్పు తదితర). షుగర్ లేని బిస్కెట్లు రెండు లేదా మూడు. లేదా వేయించిన శనగపప్పు.

డిన్నర్మల్టీ గ్రెయిన్ ఆటా పిండితో చేసిన రోటీలు, క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్ తో చేసిన కూరను తీసుకోవచ్చు. రాగి పిండితో చేసిన దోశను తీసుకోవచ్చు. డిన్నర్ తర్వాత నిద్రకుముందు ఓ కప్పు వేడి పాలు.






'షుగర్' ఉన్న వాళ్లు కూడా మామిడిపండు తినవచ్చట!
మామిడి పండ్ల సీజన్ వచ్చేస్తోంది. మామిడి పండును చూసినా... ఆ పండు వెదజల్లే పరిమళం ముక్కుపుటాలను చేరినా తినకుండా ఉండడం కష్టతరం. అయితే, ఇంతటి మధురమైన పండును తినే విషయంలో షుగర్ వ్యాధి ఉన్నవారికి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. తింటే బ్లడ్ షుగర్ పెరిగిపోతుందేమోనన్న భయం వారిని వేధిస్తుంటుంది. మరి మామిడి పండును నిర్భయంగా తినవచ్చా...?

నిశ్చింతగా తినవచ్చు అంటున్నారు ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ పంకజ్ అగర్వాల్.  కాకపోతే, ఎక్కువ కాకుండా చూసుకోవాలి అంతే. మామిడి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఒక మ్యాంగోలో ఉన్న కేలరీలు ఒకటిన్నర రోటీలో ఉండే కేలరీలతో సమానం. ఒక మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరిగిపోదు. 

కాకపోతే అన్నం తిన్న వెంటనే లేదా, అన్నంతోపాటు మామిడి పండు తినకూడదు. స్నాక్స్ టైమ్ లో స్నాక్స్ కు బదులు మామిడి పండు సగం మేర తీసుకోవచ్చు. దానివల్ల తగినంత శక్తి లభిస్తుంది. పైగా తీసుకుంటున్నది కొద్ది పరిమాణంలోనే కాబట్టి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కూడా పెరగవు. కనుక రోజులో నాలుగు గంటల విరామంతో మూడు పర్యాయాలు మామిడి పండును, ప్రతిసారి సగానికి మించకుండా తీసుకోవచ్చు. వేయించిన శనగలు లేదా పెసరపప్పుతో పాటు మామిడి పండును తీసుకున్నట్లయితే ప్రొటీన్స్, ఫైబర్ తగినంత లభించి రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోకుండా నియంత్రణలో ఉంటుంది. 






జాగ్రత్తలు పాటిస్తే మధుమేహాన్ని జయించవచ్చు!
మధుమేహం.. చక్కెర (షుగర్) వ్యాధిగా పిలిచే దీనిపేరులో చక్కెర ఉన్నా.. దీని బారినపడివారి నిత్య జీవితం చేదుగా మారుతుంది. వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ గా పిలిచే ఈ వ్యాధి బారిన పడినవారు ఆహారం నుంచి పరిశుభ్రత దాకా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం ఉండిపోతుంది. అయితే మధుమేహం ప్రాణాంతకమైన వ్యాధేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. మిగతావారిలాగే అన్ని రకాల ఆహార పదార్థాలనూ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

గ్లూకోజ్ పెరిగిపోవడమే..
రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పరిమితికి మించి పెరిగిపోవడాన్నే మధుమేహంగా చెప్పవచ్చు. దీని వల్ల శరీర పనితీరు దెబ్బతింటుంది. ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా గ్లూకోజ్ స్థాయులు పెరిగిపోవడానికి కారణం క్లోమ గ్రంథి ఇన్సూలిన్ ను తగిన స్థాయిలో విడుదల చేయకపోవడమే. రక్తంలో చక్కెర శాతాలను పరీక్షించడం ద్వారా ప్రాథమికంగా డయాబెటిస్ ను గుర్తించవచ్చు. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతుండగా అందులో 25 శాతానికిపైగా అంటే 4.5 కోట్ల మంది ఒక్క భారతదేశంలోనే ఉన్నట్లు అంచనా. దేశంలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఈ వ్యాధి మరింత అధికంగా ఉంది.

జీవనశైలిలో మార్పే కారణం
మారుతున్న జీవన శైలి.. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం.. పెద్దగా శ్రమించవలసిన అవసరం లేకుండా పోవడం.. భోజనం, నిద్ర సమయాల్లో క్రమబద్ధత లోపించడం వంటివి మధుమేహానికి కారణాలు. వీటితోపాటు వంశపారంపర్యంగా అంటే తల్లిదండ్రులకు, వారికన్నా ముందు తరాల వారికి మధుమేహం ఉంటే అది తర్వాతి తరాల వారికి వచ్చే అవకాశం ఎక్కువ. ఒక్కోసారి కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వచ్చే అవకాశముంది. మధుమేహంలో మూడు రకాలు ఉన్నాయి. టైప్-1, టైప్-2, గెస్టేషనల్ (మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్).

లక్షణాలివే..
తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, దాహం ఎక్కువగా వేయడం, కారణం లేకుండానే బరువు తగ్గడం, విపరీతమైన నీరసం, చూపు మందగించడం, పంటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు, శరీరంపై తగిలిన గాయాలు ఎప్పటికీ తగ్గకపోవడం, తరచూ ఆకలి వేయడం, కాళ్లలో స్పర్శ తగ్గిపోవడం వంటివి మధుమేహం లక్షణాలు. మూత్రపిండాలకు కూడా హాని కలుగుతుంది. టైప్-1, టైప్-2, గెస్టేషనల్ డయాబెటిస్ అన్నింటిలోనూ లక్షణాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కానీ టైప్-1 డయాబెటిస్ మిగతావాటికన్నా ప్రమాదకరం. దీని బారిన పడినవారు దాదాపుగా జీవితాంతం ఇన్సూలిన్ ను తీసుకోవాల్సి రావడంతోపాటు పూర్తి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

గ్లూకోజ్ ఎంత మోతాదులో ఉండాలి?
- సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి భోజనం చేసిన ఎనిమిది గంటల తర్వాత (ఫాస్టింగ్ బ్లడ్ షుగర్) 100 మిల్లీగ్రాముల లోపు ఉంటుంది. ఒక వేళ ఇది 126 మిల్లీగ్రాములకన్నా ఎక్కువగా ఉంటే వారు మధుమేహం బారిన పడినట్లే. అదే 100 నుంచి 126 మిల్లీగ్రాముల మధ్య ఉంటే వారు త్వరలోనే డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉన్నట్లే. అదే 100 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉంటే మధుమేహం వచ్చే అవకాశాలు లేనట్లే.

- ఇక భోజనం చేసిన తర్వాత చేసే సాధారణ రక్త పరీక్ష (ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్)లో గ్లూకోజ్ స్థాయి 140 మిల్లీగ్రాముల నుంచి 200 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇది 200 మిల్లీగ్రాములు దాటితే మధుమేహం దరి చేరినట్లే. అదే 140కన్నా తక్కువగా ఉంటే మధుమేహం గురించి భయపడాల్సిన పనిలేదు. ఇక 200 మిల్లీగ్రాముల కన్నా కొద్దిగా తక్కువగా ఉంటే మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని గుర్తించవచ్చు.

- రక్తంలో చక్కెర శాతాన్ని ఎప్పటికప్పడు పరీక్షించుకోవడానికి బ్లడ్ గ్లూకోజ్ మానిటర్లు అందుబాటులో ఉన్నాయి. వేలిపై సూదితో గుచ్చి, ఓ ప్రత్యేకమైన స్ట్రిప్ పై రక్తపుబొట్టును వేసి పరికరంలో ఉంచడం ద్వారా నిమిషాల్లోనే గ్లూకోజ్ స్థాయిని తెలుసుకోవచ్చు.

- ఇక మూత్రంలో గ్లూకోజ్ శాతాన్ని పరీక్షించడం ద్వారా కూడా మధుమేహాన్ని నిర్ధారించవచ్చు. కానీ శరీరంలో ఇతర రుగ్మతల కారణంగా కూడా మూత్రంలో గ్లూకోజ్ వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఓజీటీటీ పరీక్ష చేయించుకోవడం అత్యుత్తమం.

ఓజీటీటీతో కచ్చితంగా గుర్తించొచ్చు
మధుమేహాన్ని కచ్చితంగా గుర్తించే పరీక్ష ‘ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ)’. ఇది చాలా సులువైనది. ముందుగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తారు. తర్వాత 75 గ్రాముల గ్లూకోజ్ ను తాగిస్తారు. తర్వాత గంట, రెండు గంటలు, మూడు గంటల వ్యవధిలో మూడుసార్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పరీక్షిస్తారు. మొదటిదానిలో గ్లూకోజ్ స్థాయి 200 మిల్లీగ్రాములలోపు, రెండో దానిలో 140 మిల్లీగ్రాములలోపు ఉంటే డయాబెటిస్ లేనట్లే. అంతకన్నా ఎక్కువగా ఉంటే మధుమేహం వచ్చినట్లు. ఫాస్టింగ్ టెస్ట్ లో 126 మిల్లీగ్రాములలోపు గ్లూకోజ్ స్థాయి ఉన్నా.. ఓజీటీటీలోని రెండో పరీక్షలో 140 నుంచి 199 మధ్య ఉంటే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

హిమోగ్లోబిన్ ఏ1సీ (HB A1C)(హెచ్ బీ ఏ1సీ) పరీక్ష
మధుమేహంతో ఉన్నవారికి సాధారణంగా చేసే రక్త పరీక్షలు ఆ సమయంలో పరిస్థితిని మాత్రమే తెలియజేస్తే.. హిమోగ్లోబిన్ ఏ1సీ పరీక్ష దాదాపు మూడు నెలల నుంచి రక్తంలో గ్లూకోజ్ నిల్వలు ఏ స్థాయిలో కొనసాగాయనే అంశాన్ని తేల్చుతుంది. అంటే దీనివల్ల A1C పరీక్షకు ముందు మూడు నెలల పాటు మధుమేహ బాధితులు తీసుకున్న ఆహారం, చేసిన వ్యాయామంతోపాటు ఇతర జాగ్రత్తలను వైద్యులు సమీక్షించవచ్చు. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ కు అంటుకున్న గ్లూకోజ్ స్థాయిని లెక్కించడం ద్వారా ఈ పరీక్ష చేస్తారు. అధిక స్థాయిలో ఉండే గ్లూకోజ్ శరీరంలోని పలు రకాల కణాలపై చేరుతూ ఉంటుంది. అదే తరహాలో ఎర్రరక్త కణాలకూ అంటుకుంటుంది. ఈ కణాల జీవితకాలం మూడు నెలలు. అందువల్ల గత మూడు నెలల గ్లూకోజ్ పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఈ హిమోగ్లోబిన్ A1C పరీక్షలో సాధారణ వ్యక్తులకు వచ్చే ఫలితం 4% నుంచి 5.6% వరకు ఉంటుంది. అదే 6.5శాతానికి మించితే మధుమేహం ఎక్కువగా ఉన్నట్లే లెక్క. అదే 7 శాతానికి మించితే మధుమేహం వల్ల వచ్చే దుష్పరిణామాలు చాలా తీవ్రమవుతాయి. ఇక 5.7% నుంచి 6.4% వరకు ఉంటే వారికి త్వరలోనే మధుమేహం వచ్చే అవకాశం ఉన్నట్లే

మధుమేహం వచ్చే ముందు లక్షణాలు
రక్తంలో చక్కెరల స్థాయులు నిర్ధారిత మోతాదుకు మించి పెరుగుతుండడాన్ని బట్టి మధుమేహం వచ్చే అవకాశాలను గమనించవచ్చు. అయితే ఇవి మధుమేహం వచ్చినప్పటి గ్లూకోజ్ స్థాయులకంటే తక్కువగా ఉంటాయి. అంటే శరీరంలోని కణాల్లో ఇన్సూలిన్ కు నిరోధకత పెరుగుతున్నట్లు. దానితో పాటు మూత్రంలో గ్లూకోజ్ ఉంటే త్వరలోనే మధుమేహం బారినపడే అవకాశమున్నట్లే. ఇక తగినంతగా ఆహారం తీసుకుంటున్నా కూడా సన్నబడుతూ.. అదే సమయంలో పొట్ట మాత్రం పెరుగుతూ ఉంటుంది. కొందరిలో తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. అయితే కొంత మందిలో ఇలాంటి ఏ లక్షణాలూ కనిపించకుండానే మధుమేహం వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

టైప్-1తో ప్రమాదం ఎక్కువ
మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ క్లోమగ్రంథిలోని బీటా కణాలను స్వయంగా నాశనం చేయడం వల్ల టైప్-1 మధుమేహం కలుగుతుంది. దీన్ని ఇన్సూలిన్ డిపెండెంట్ డయాబెటిక్ లేదా జువెనైల్ డయాబెటిక్ అని కూడా పేర్కొంటారు. ఇది పెద్దలలో గానీ పిల్లలలోగాని ఎవరిలోనైనా రావచ్చు. మొత్తం మధుమేహ బాధితుల్లో టైప్-1 వారు పది శాతం వరకూ ఉంటారు. దీని బారినపడిన వారిలో క్లోమగ్రంథి ఇన్సూలిన్ ను కొంత మొత్తంలోగానీ లేదా మొత్తంగా విడుదల చేయలేకపోవడం గానీ జరుగుతుంది. అందువల్ల వారు జీవితాంతం బయటి నుంచి ఇన్సూలిన్ ను ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాల్సిందే. టైప్-1 మధుమేహం ఏ దశలో ఉన్నా కూడా రక్తంలోని గ్లుకోజ్ నిల్వల స్థాయులను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. వీరు ప్రత్యేకమైన ఆహార నియంత్రణను పాటించాల్సి ఉంటుంది.

టైప్-2కు కొన్ని జాగ్రత్తలు చాలు
మారుతున్న జీవన శైలి కారణంగా వచ్చే డయాబెటిస్ టైప్-2. ఇందులో శరీరంలోని కణాలు ఇన్సూలిన్ కు నిరోధకత పెంచుకుంటాయి. దాంతో మరింత ఎక్కువ ఇన్సూలిన్ అవసరమవుతుంది. జంక్ ఫుడ్, వేపుళ్లు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం.. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం.. వాతావరణ కాలుష్యం, శారీరక శ్రమ లోపించడం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, స్థూలకాయం, పొట్టచుట్టూ విపరీతంగా కొవ్వు పేరుకుపోవడం వంటివి ఈ తరహా మధుమేహానికి కారణం అవుతాయి. మొత్తంగా మధుమేహ బాధితుల్లో 90 శాతం వరకూ టైప్-2కు చెందినవారే ఉంటారు. 

దక్షిణాసియా వాసులకు ఈ తరహా మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. శారీరక శ్రమ అంటే వ్యాయామం, నడక, ఇతరత్రా పనులు చేసుకోవడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లకు దూరంగా ఉండడం, కూర్చుని పనిచేయాల్సి వచ్చినప్పుడు మధ్యలో లేచి కాసేపు స్వల్పస్థాయి వ్యాయామాలు చేయడం వంటివాటితో ఈ రకం మధుమేహాన్ని చాలా వరకూ అదుపులో పెట్టుకోవచ్చు. కొంతమంది మాత్రం నిత్యం మందులు వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో ఇన్సూలిన్ తీసుకోవాల్సి వస్తుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో చాలా మంది తొలి దశలో తమకు మధుమేహం ఉన్నట్లు గుర్తించలేరు. తర్వాతి దశకు చేరేసరికి గుర్తించినా.. అప్పటికే మూత్రపిండాల సమస్యలు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

గర్భిణులూ జాగ్రత్త
మహిళలకు గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. దీనిని గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. దాదాపు 2 నుంచి 5 శాతం మందిలో గర్భంతో ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతుంటాయి. ఇది కూడా గర్భధారణ సమయంలో హార్మోన్లు, శారీరక మార్పుల కారణంగా ఇన్సూలిన్ నిరోధకత ఏర్పడడం వల్ల వస్తుంది. అంతేగాకుండా రక్తంలోని గ్లూకోజ్ మొత్తాన్నీ రవాణా చేయగలిగేంతగా వారిలో ఇన్సూలిన్ ఉత్పత్తి కాదు. గర్భిణులు రక్త పరీక్షల ద్వారా దీనిని గుర్తించడం అత్యంత ఆవశ్యకం. లేకపోతే తల్లీ బిడ్డలకు ప్రమాదం సంభవించే అవకాశముంది. పిల్లలు ఉండవలసిన దానికంటే అధిక బరువుతో జన్మిస్తారు. దాంతో సాధారణ ప్రసవం కష్టమై.. సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీయాల్సి ఉంటుంది. అయితే ఈ తరహా మధుమేహం ప్రసవం తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. కానీ ఇలా గెస్టేషనల్ డయాబెటిస్ వచ్చి తగ్గిపోయిన మహిళల్లో దాదాపు సగం మందికి తర్వాత పది ఇరవై ఏళ్లలో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇక కొంత మంది మహిళల్లో ప్రసవం తర్వాత అదే మధుమేహం కొనసాగే అవకాశముంది.

పరిమితికి మించి తినొద్దు
మధుమేహంతో ఉన్నవారు ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా మొత్తంగా శరీరానికి ఆ సమయంలో అందే మొత్తం శక్తి (కేలరీలు) నిర్ధారిత మొత్తానికి మించకూడదు. మామూలుగా మధ్య స్థాయిలో శారీరక శ్రమ ఉన్న పనిచేసే వ్యక్తులకు రోజుకు 1,800 నుంచి 2,200 వరకూ కేలరీల శక్తి సరిపోతుంది. కష్టమైన పనులు చేసేవారికి 2,500 కేలరీల వరకూ అవసరం. ఇంతకు మించి శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే.. అది శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. ఇది మధుమేహంతో బాధపడేవారికి మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది.

తీపి పదార్థాలూ తినొచ్చు
సాధారణంగా మధుమేహులు తీపి పదార్థాలు తినకూడదని భావిస్తుంటారు. కానీ మధుమేహంతో ఉన్నవారు ఏ ఆహార పదార్థాలనైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అయితే కొంత వరకూ పరిమితులు పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు తీపి పదార్థాలు త్వరగా జీర్ణమై వెంటనే రక్తంలోకి గ్లూకోజ్ విడుదలవుతుంది. దీంతో ఒక్కసారిగా గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి. అదే చపాతీలు, అన్నం కాస్త ఆలస్యంగా జీర్ణమవుతూ గ్లూకోజ్ రక్తంలోకి మెల్లమెల్లగా చేరుతుంది. ఈ కారణం వల్లే తీపి పదార్థాలు తీసుకోవద్దని చెబుతూ ఉంటారు. కానీ తీపి పదార్థాలను కూడా స్వల్ప స్థాయిలో నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అంటే తక్కువ మొత్తాల్లో నాలుగైదు గంటల విరామంతో తీసుకోవాలి. ఉదాహరణకు ఒక లడ్డూను సాధారణ వ్యక్తులు ఒకేసారి తినేస్తే... మధుమేహ బాధితులు ఆ లడ్డూను ముడు నాలుగు భాగాలు చేసి, నాలుగైదు గంటల విరామంతో ఒక్కో భాగాన్ని తినాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అంత మేరకు మిగతా ఆహారాన్ని తగ్గించడం మర్చిపోవద్దు.

ఎందుకీ ఇన్సూలిన్?
మన శరీరానికి ఆహారం నుంచి శక్తి లభిస్తుంది. ఆహారం జీర్ణమైనప్పుడు గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తుంది. శరీరంలోని ప్రతి కణం జీవించి ఉండేందుకు, శక్తిని పొందేందుకు ఇది అత్యవసరం. అయితే మనం తరచూ శరీరానికి సరిపడేకన్నా ఎక్కువగానో, తక్కువగానో ఆహారాన్ని తీసుకుంటాం. ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పడు అధిక స్థాయిలో గ్లూకోజ్ తయారవుతుంది. అది శరీరంలో కొవ్వు రూపంలోకి మార్చబడి నిల్వచేయబడుతుంది. ఇలా గ్లూకోజ్ ను కొవ్వుగా మార్చేందుకు ఇన్సూలిన్ అత్యంత ఆవశ్యకం. దీనిని క్లోమగ్రంథిలోని లాంగర్ హాన్స్ పుటికల్లో ఉండే బీటా కణాలు ఉత్పత్తి చేస్తాయి. ఇన్సూలిన్ లేకపోతే గ్లూకోజ్ అంతా రక్తంలోనే ఉండిపోతుంది.

నియంత్రణ మన చేతుల్లోనే..
ఒకసారి మధుమేహం వచ్చాక దాదాపుగా జీవితాంతం తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇన్సూలిన్ ఉత్పత్తి సరిపడినంతగా లేకపోవడంతో రక్తంలో గ్లూకోజు స్థాయిని శరీరం దానంతట అది అదుపు చేసుకోలేదు. కాబట్టి మనమే బయట నుంచి దానిని అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. దానినే ప్రత్యేకంగా ‘డయాబెటిక్ జీవన విధానం’ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో మందుల వాడకం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయులను అదుపులో ఉంచుకోవడం కేవలం 25 శాతమే. మిగతా 75 శాతం మన ఆహార అలవాట్లలో మార్పులు, సరైన స్థాయిలో నిద్ర, రోజూ వ్యాయామం చేయడం వంటి అంశాల చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా అదనపు కేలరీలను శరీరంలోకి పోకుండా ఆహారం మీద అదుపు, తిన్న ఆహారం నిలువలుగా పేరుకు పోకుండా ‘శ్రమ’ ద్వారా ఖర్చు చేయుట అవసరం. అప్పటికీ మధుమేహం అదుపులో ఉండకపోతే మందులు వాడాల్సి వస్తుంది. మందుల వల్ల కూడా ప్రయోజనం లేని పరిస్థితుల్లో బయటి నుంచి ఇన్సూలిన్ ను అందించడమే చివరి మార్గం.

వైద్యుల సూచనలు పాటించాలి
డయాబెటీస్‌ కలిగిన రోగులు వైద్యులు సూచించిన ఆహార ప్రణాళికలను తప్పనిసరిగా పాటించాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. అది కూడా వైద్యులు సూచించిన తేలికపాటి వ్యాయామాలు మాత్రమే చేయాలి. మందులు వాడాల్సిన అవసరమున్నవారు నిర్ధారిత వేళల్లో తప్పనిసరిగా తీసుకోవాలి. క్రమబద్ధంగా రక్తపు గ్లూకోజ్‌ స్థాయిని పరీక్షించుకుంటూ.. వివరాలను ఎప్పటికప్పడు ఒక నోట్ పుస్తకంలో నమోదుచేసి పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు వైద్యులకు చూపించి సరైన వైద్యం చేయించుకోవాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు. అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ సూచనల మేరకు ఇన్సూలిన్‌ తీసుకోవాలి. తర్వాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలకే పరిమితం కావచ్చు. ఒకసారి ఇన్సూలిన్‌ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్‌ తీసుకోవలసి వస్తుందన్నది సరికాదు.

హైపోగ్లైసేమియా రాకుండా చూసుకోండి
హైపోగ్లైసేమియా అంటే రక్తంలో సాధారణంగా ఉండాల్సిన దానికంటే తక్కువగా చక్కెర స్థాయులు ఉండడం. ఇది చాలా ప్రమాదకరం. దీంతో రోగులు కోమాలోకి వెళ్లిపోయే అవకాశముంది. మధుమేహం ఉన్నవారు మాత్రలు వేసుకుని, ఇన్సూలిన్ తీసుకుని ఎక్కువ శారీరక శ్రమ చేసినా, వ్యాయామం చేసినా హైపోగ్లైసేమియా సమస్య తలెత్తుతుంది. అంతేగాకుండా ఇన్సూలిన్ మోతాదుకు మించి తీసుకోవడం, ఎక్కువ సమయం పాటు తినకుండా ఉండడం వల్ల కూడా వస్తుంది. ఇలాంటపుడు రక్తంలో చక్కెర స్థాయులను వేగంగా పెంచుకునేలా వైద్యుల సూచనల మేరకు చర్యలు చేపట్టాలి.

ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎన్నో..
మధుమేహం వచ్చినవారిలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా హైపోగ్లైసీమియా, కీటో అసిడోసిస్ వంటివి చాలా ప్రమాదకరం. డయాబెటిక్ కీటో అసిడోసిస్ వల్ల కణాల స్థాయిలో జరిగే ప్రక్రియల్లో నియంత్రణ లోపిస్తుంది. దానివల్ల కణాల్లోంచి రక్తంలోకి కార్బన్ డయాక్సైడ్ తో పాటు అసిటోన్ కూడా చేరుతుంది. ఇది ఊపిరితిత్తుల్లోంచి శ్వాసక్రియలో భాగంగా బయటకు విడుదలవుతుంది. దీనివల్ల వేగంగా శ్వాస తీసుకోవడం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితి తీవ్రమైతే కోమాలోకి వెళ్లిపోతారు. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. ఇది టైప్-1 మధుమేహ బాధితుల్లోనే కనిపిస్తుంది. ఇక తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం కారణంగా శరీరంలో నీటిశాతం తగ్గిపోయి నాన్ కీటోటిక్ హైపర్ ఆస్మొలార్ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కూడా కోమాలోకి వెళ్లిపోయే అవకాశముంది. ఇది టైప్-2 మధుమేహ బాధితుల్లో అదికూడా చాలా అరుదుగా సంభవిస్తుంది. ఇక ఎక్కువ కాలం రక్తంలో అధిక గ్లూకోస్ నిలువలు ఉండడం వల్ల కంటి లెన్స్‌లో గ్లూకోస్ పేరుకుపోతుంది. దానితో గ్లకోమా సమస్య ఏర్పడి దృష్టి లోపాలు తలెత్తతుతాయి. చాలా అరుదుగా అయినా కంటిలోని రెటీనా దెబ్బతిని అంధత్వం వచ్చే అవకాశముంది. నాడీ కణాలు, సూక్ష్మ నాళికలు దెబ్బతినడం మూలంగా పురుషత్వ లోపం ఏర్పడుతుంది. కాళ్ళలో గాంగ్రీన్ తో ఒక్కోసారి అవిటితనం కూడా రావచ్చు.

ముఖ్యమైన జాగ్రత్తలివీ..

  • మధుమేహం బారినపడిన వారు దీనిపై పూర్తిగా అవగాహన పెంచుకోవడం అవసరం.
  • రోజూ వ్యాయామం చేయడం, ఆహారం, నిద్రలకు సరైన సమయాలను పాటించాలి.
  • రక్తపోటు, కొలెస్టరాల్, గ్లూకోజ్ స్థాయుల పరీక్షలను నియమిత సమయాల్లో తప్పనిసరిగా చేయించుకోవాలి.
  • మధుమేహం ఉన్నవారు తమ కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు గుర్తించలేరు. అందువల్ల అప్పుడప్పుడు తమ పాదాల్లో స్పర్శ ఎలా ఉందో పరిశీలించుకోవాలి.
  • పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనించి.. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి.
  • పాదాలకు ఎలాంటి గాయాలూ తగలకుండా జాగ్రత్త వహించాలి. అవసరమైతే ప్రత్యేకమైన బూట్లు ధరించాలి.
  • మధుమేహం ఉన్న వారికి మూత్ర పిండాలు దెబ్బతిని, మూత్రంలో ఆల్బుమిన్‌ అనే ప్రొటీన్‌ వెళ్లిపోతుంటుంది. దానివల్ల కిడ్నీ ఫెయిలయ్యే అవకాశముంది. అందువల్ల మూడునాలుగు నెలలకోసారి మూత్ర పరీక్ష చేయించుకోవాలి.
  • మధుమేహం ఉన్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల ఎలాంటి సమస్యలూ లేకపోయినా ఏటా ఈసీజీ, ట్రెడ్‌మిల్‌, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలి.

(ఆయా నిపుణుల అభిప్రాయాలు క్రోడీకరించి రాసిన ఈ ఆర్టికల్ ఉద్దేశం కేవలం ఆయా వ్యాధుల పట్ల పాఠకులలో అవగాహన కల్పించడం కోసం మాత్ర
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

 






దంతాలు పలుచ బడుతుంది తీసుకోవాలిసిన జాగ్రత్త లు


దంతాలు పచ్చబడుతున్నాయా.. కారణాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అవగాహనా కోశం నవీన్ నడిమింటి సలహాలు 



టీవీ యాడ్స్ లోనో, సినిమాల్లోనో సెలబ్రిటీల దంతాలు తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంటాయి. కానీ చాలా మంది దంతాలు ఎంతో కొంత పసుపు రంగులోకి మారి కనిపిస్తుంటాయి. చాలా మంది దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు కారణాలు, వాటి నుంచి బయటపడడం అనేది మన చేతిలోనే ఉంది. కొంచెం శ్రద్ధ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దంతాల సమస్యల నుంచి బయటపడొచ్చు. మరి దంతాలు ఎలా ఏర్పడుతాయి, దంతాలు, చిగుళ్లకు వచ్చే సమస్యలేమిటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి వంటి వివరాలు తెలుసుకుందాం..  


దంతాల నిర్మాణం ఎలా ఉంటుంది?
మన శరీరంలోనే అత్యంత దృఢమైనవి దంతాలు. ఎముకల తరహాలో బలమైన పదార్థాలతో ఇవి ఏర్పడతాయి. దంతాల్లో ఎనామిల్ పొర, డెంటిన్ పొర, మెత్తటి కణజాలం అని మూడు భాగాలు ఉంటాయి.అన్నింటికన్నా పైన ఉండేది ఎనామిల్ పొర. ఇది పాక్షికంగా పారదర్శకంగా, తెలుపు రంగులో ఉంటుంది. దంతాలకు అత్యంత దృఢత్వాన్ని ఇచ్చేది ఇదే. ఇది ఎంత గట్టిగా ఉంటుందంటే అదే పరిమాణమున్న ఉక్కు కంటే ఎనామిల్ ఎక్కువ దృఢంగా ఉంటుంది.
  • ఎనామిల్ పొర కింద డెంటిన్ పొర ఉంటుంది. డెంటిన్ అంటే ఎముకల వంటి కణజాలం. ఇది కూడా దృఢంగా ఉంటుంది. లేత పసుపు రంగులో ఉంటుంది.
  • ఈ రెండింటికన్నా లోపల సున్నితమైన కణజాలం ఉంటుంది. దీనినే పల్ప్ గా కూడా పేర్కొంటారు. దంతాలను, చిగుళ్లను కలిపి ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది. దీనిలోనే రక్త నాళాలు, నాడులు ఉంటాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి, పెరగడానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలను రక్త నాళాలు సరఫరా చేస్తాయి.
రూట్ కెనాల్ అంటే..?
దంతంలో మనకు పైన కనిపించే భాగాన్ని క్రౌన్ అని, చిగుళ్లలోపల ఉండే భాగాన్ని రూట్ (మూలం) అని అంటారు. ఈ క్రౌన్ మధ్య భాగం నుంచి మూలం వరకు దంతం మధ్యలో నిలువుగా కాలువలా లేదా సొరంగంలా ఉండే ప్రదేశాన్ని రూట్ కెనాల్ అంటారు. ఈ రూట్ కెనాల్ లోని సున్నిత కణజాలం (పల్ప్) ద్వారానే రక్త నాళాలు, నాడులు దంతం లోపలి వరకు అమరి ఉంటాయి.

క్యావిటీలు (పిప్పి పళ్లు) అంటే..
మనం తినే ఆహారం నోటి మూలల్లో, దంతాల మధ్య ఉండిపోయినప్పుడు దానిపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్లాక్ గా మారి.. దాని నుంచి కొన్ని రకాల యాసిడ్ (ఆమ్లాలు) లు వెలువడతాయి. ఈ యాసిడ్ ల కారణంగా దంతాలకు రక్షణగా ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని, రంధ్రాలు ఏర్పడతాయి. వాటినే కావిటీలు లేదా పిప్పిపళ్లు అంటారు. ఈ కావిటీలను నిర్లక్ష్యం చేస్తే.. చివరికి దంతాలు పూర్తిగా దెబ్బతిని, రాలిపోవడానికి కారణమవుతాయి.

పన్ను నొప్పి ఎందుకు వస్తుంది?
దంతాలు గట్టి ఎముకలే కదా మరి నొప్పి ఎందుకు వస్తుందనే సందేహం చాలా మందికి వస్తుంది. దంతాలు ఎముకతో నిర్మితమైనా.. అత్యంత దృఢంగా ఉన్నా అవి పూర్తి స్థాయి ఎముకలు కాదు. పైన ఉండే ఎనామిల్ పొర మినహా లోపల మరో రెండు పొరల జీవ కణజాలంతో దంతాలు తయారవుతాయి. ఆ కణజాలానికి రక్త నాళాలు, నాడులు అనుసంధానమై ఉంటాయి కూడా. అయితే దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని క్యావిటీలు (రంధ్రాలు) ఏర్పడినప్పుడు.. ఏవైనా చల్లటి లేదా వేడి పదార్థాలు తీసుకుంటే నేరుగా డెంటిన్ పొరపై, దాని లోపల ఉన్న మెత్తని కణజాలంపై ప్రభావం పడుతుంది. దానిని నాడులు గ్రహించి, మెదడుకు సంకేతాలు పంపడంతో నొప్పి కలుగుతుంది.

రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ ఎందుకు?
క్యావిటీలు ఎనామిల్ పొరతోపాటు డెంటిన్ పొరకు కూడా విస్తరిస్తే.. దంతాల పరిస్థితి బాగా దెబ్బతిన్నట్లే లెక్క. దృఢమైన రెండు పొరలకు రంధ్రాలు పడడంతో లోపలి మెత్తని కణజాలం (పల్ప్)లోకి బ్యాక్టీరియా చొరబడుతుంది. దాంతో అక్కడ ఇన్ఫెక్షన్, వాపు వస్తాయి. దాని కారణంగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అంతేకాదు, దంతం లోపలి వరకు రంధ్రాలు పడి, ఇన్ఫెక్షన్ వస్తే దంతంలో పగుళ్లు వస్తాయి. ఏదైనా ఆహారాన్ని నమిలినప్పుడు ఈ పగుళ్లు కదిలి.. చిగుళ్లు, పల్ప్ పై తీవ్ర ఒత్తిడి పడి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. ఇలా ఇన్ఫెక్షన్ కు లోనైన పల్ప్ భాగాన్ని తొలగించి, రబ్బరు వంటి పదార్థంతో నింపడమే రూట్ కెనాల్ చికిత్స అంటారు.ఇన్ఫెక్షన్ సోకిన పల్ప్ ను తొలగించడం కోసం దంతానికి పై నుంచి రంధ్రం చేస్తారు. రబ్బరు వంటి పదార్థాన్ని నింపిన అనంతరం దంతానికి దృఢమైన క్యాప్ ను ఏర్పాటు చేస్తారు.

చిగుళ్ల సమస్యలు ఎందుకు వస్తాయి?
నోటిలో పెరిగే ప్లాక్ బ్యాక్టీరియా దంతాలు, చిగుళ్ల మధ్యలోకి ప్రవేశించినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. అది చిగుళ్ల వాపు, నొప్పికి దారి తీస్తుంది. ఇక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన శరీరంలోని రోగనిరోధక శక్తి ప్లాక్ బ్యాక్టీరియాను చంపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ కొన్నిసార్లు బ్యాక్టీరియాకు బదులుగా చిగుళ్ల కణాలపైనా దాడి చేస్తుంది. దీనివల్ల చిగుళ్ల వ్యాధి వస్తుంది.
  • ఏదైనా ఆహారం తిన్నప్పుడు కాస్త గట్టిగా, పదునుగా ఉన్న ఆహారం గుచ్చుకుంటే చిగుళ్లకు గాయాలవుతాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది.
  • చిగుళ్ల వాపు వచ్చినప్పుడు అవి దంతాలను బలంగా పట్టి ఉంచలేక వదులవుతాయి. అలాంటప్పుడు ఏదైనా నమిలితే దంతాలు కదిలి నొప్పి పుడుతుంది. చల్లటి, వేడి పదార్థాలు తీసుకుంటే చిగుళ్లు, దంతాల మధ్య ఏర్పడిన ఖాళీ నుంచి ప్రభావం చూపి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. చిగుళ్ల సమస్యలకు పలు రకాల ఔషధాలు, లోషన్లతో చికిత్స అందుబాటులో ఉంది.
దంతాలు ఎందుకు పచ్చబడుతాయి?
మన దంతాలు పచ్చబడడానికి చాలా రకాల కారణాలున్నాయి. మనం తినే ఆహారం దగ్గరి నుంచి మన ఆరోగ్య పరిస్థితి వరకు ఎన్నో అంశాలు దంతాలపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా దంతాల పైపొర ఎనామిల్ తెలుపు రంగులో పాక్షికంగా పారదర్శకంగా ఉంటుంది. లోపల ఉండే డెంటిన్ లేత పసుపు రంగులో ఉంటుంది. ఎనామిల్ మందంగా ఉంటే దంతాలు తెల్లగా కనిపిస్తాయి. సన్నగా ఉంటే పసుపు రంగులో కనిపిస్తాయి. మనలో వయసు పెరిగిన కొద్దీ ఎనామిల్ మందం తగ్గిపోతుంటుంది. దాంతో దంతాలు పసుపురంగులో కనిపిస్తుంటాయి. దీనికితోడు శుభ్రత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఎనామిల్ పొరపై మరకలు పడతాయి. వీటిని ఎక్స్ ట్రిన్సిక్, ఇంట్రిన్సిక్ అని రెండు రకాలుగా చెప్పవచ్చు.
  • దంతాల్లోని పై పొర అయిన ఎనామిల్ పైన ఏర్పడే మరకలు, పసుపుదనాన్ని ఎక్స్ ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటారు. ప్రధానంగా మన ఆహార అలవాట్లు, దంతాలు సరిగా శుభ్రపరచుకోకపోవడం దీనికి కారణాలు. ముఖ్యంగా యాసిడిక్, ముదురు రంగు ఆహార పదార్థాలు, ద్రాక్ష, నేరేడు, దానిమ్మ వంటి పండ్లు, రెడ్ వైన్, శీతల పానీయాలు, పొగాకు ఉత్పత్తులు వంటి వాటితో దంతాలు ఎక్కువగా పసుపుబారుతాయి. దంతాలకు అంటుకుపోయే క్రోమోజెన్స్ అనే రసాయనాలు వాటిల్లో ఉండడమే దీనికి కారణం. ఇక కాఫీ, టీ, వైన్ లాంటి వాటిలో ఉండే టానిన్లు అనే రసాయనాల వల్ల కూడా ఎనామిల్ పై మరకలు ఏర్పడతాయి.
  • దంతాల లోపలి భాగంలో ఏర్పడే మరకలను ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటారు. వివిధ రకాల మందులు, అనారోగ్య కారణాల వల్ల ఇవి ఏర్పడుతాయి. పిల్లల్లో టెట్రాసైక్లిన్, డోక్సిసైక్లిన్ వంటి యాంటీ బయాటిక్స్ వినియోగించినప్పుడు వారి పళ్లు పసుపు బారుతాయి. చిగుళ్లవ్యాధికి చికిత్సలో ఇచ్చే మందులు, మొటిమలను నివారించేందుకు వాడే మందులు, రక్తపోటును నియంత్రణలో ఉంచే ఔషధాల వల్ల కూడా దంతాలు పసుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది. ఇక తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడం వల్ల దంతాలు పూర్తిగా పచ్చబడతాయి.
  • ఇక రెండు రకాల జన్యులోపాల కారణంగా కూడా దంతాల రంగు ప్రభావితం అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాంటివారికి సంబంధించి.. దంతాలు ఏర్పడడమే మామూలు కన్నా బాగా తెల్లగా.. లేదా బాగా పసుపు రంగులో ఏర్పడతాయని తేల్చారు.
దెబ్బతిన్న దంతాలకు చికిత్స ఇలా..
  • దంతాలు దెబ్బతిన్న స్థాయిని, పరిస్థితిని బట్టి చికిత్స చేస్తారు. క్యావిటీలు ప్రారంభ దశలోనే ఉంటే ఎనామిల్ పునరుద్ధరణకు తోడ్పడేలా ఫ్లోరైడ్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న టూత్ పేస్ట్, జెల్, లిక్విడ్ రూపాల్లో దంతాలపై నేరుగా అప్లై చేసేలా.. మౌత్ వాష్ రూపంలోనూ క్యావిటీలకు చికిత్స చేస్తారు.
  • క్యావిటీలు ఎక్కువగా లోతుగా ఏర్పడితే.. ఆ రంధ్రాన్ని శుభ్రపర్చి, పలు రకాల పదార్థాలతో నింపుతారు. దీనినే టూత్ ఫిల్లింగ్ లేదా రీస్టోరేషన్ అంటారు. ఇలా నింపడం కోసం దంతాల రంగులోనే ఉండే కాంపోజిట్ రెజిన్లు, పోర్సలీన్, పలు రకాల పదార్థాలతో కూడిన సిల్వర్ అమాల్గం వంటి వాటిని వినియోగిస్తారు.
  • క్యావిటీలు దంతం చుట్టూ ఎక్కువగా ఏర్పడి, దంతం బలహీనపడితే.. దెబ్బతిన్న మేరకు పైపొరను తొలగించి కృత్రిమ క్యాప్ ను ఏర్పాటు చేస్తారు. దీనిని ‘క్రౌన్’ అంటారు. దీనిని బంగారం, పోర్సలీన్, రెజిన్, పోర్సలీన్-లోహ మిశ్రమం వంటి పదార్థాలతో ఏర్పాటు చేస్తారు. ఇలా బంగారం క్రౌన్ (బంగారు పన్ను)ను పెట్టించుకోవడం కొంతకాలం కింద ఫ్యాషన్ గా కూడా చలామణీ అయింది.
  • దంతాలు ఏ మాత్రం పునరుద్ధరించేందుకు వీలు లేకుండా దెబ్బతింటే.. వాటిని పూర్తిగా తొలగించి, కృత్రిమ పన్నును అమర్చుతారు.
దంతాలను రక్షించే ఆహారం
కొన్ని రకాల ఆహార పదార్థాలు నోటి శుభ్రతకు, దంతాల రక్షణకు, బలంగా ఉండడానికి తోడ్పడతాయని పరిశోధకులు గుర్తించారు. వాటిని వినియోగిస్తే దంతాల సమస్యల నుంచి కొంత వరకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు.
  • బ్లాక్ టీ/ గ్రీన్ టీ: బ్లాక్ టీ (డికాక్షన్), గ్రీన్ టీలలో ఉండే పాలిఫెనాల్స్ అనే రసాయనాలు నోటిలో బ్యాక్టీరియా ఎదుగుదలను నియంత్రిస్తాయి. దాంతోపాటు నోటి దుర్వాసనను కూడా అరికడతాయి. రోజూ ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని బ్లాక్ టీతో నోరు పుక్కిలించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
  • వెన్న(చీజ్): దంతాల మధ్య ప్లాక్ నుంచి ఉత్పత్తయ్యే యాసిడ్లు దంతాలపై ప్రభావం చూపించకుండా చీజ్ అడ్డుకుంటుందని పరిశోధకులు గుర్తించారు.
  • ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్ష పళ్ల రుచి తియ్యగా ఉన్నా వాటిలో సుక్రోజ్ (సాధారణ చక్కెరలో ఉండే రసాయనం) ఉండదు. వీటిలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి కావిటీలకు, చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను సంహరిస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
  • క్యారెట్, యాపిల్స్, దోసకాయ: బాగా నమిలి తినాల్సిన పండ్లు, కూరగాయలు దంతాలపై ఏర్పడే ప్లాక్ ను తొలగిస్తాయి. ముఖ్యంగా క్యారెట్లు పళ్ల మధ్య సందుల్లో ఉండిపోయిన పదార్థాలను కూడా అక్కడి నుంచి తొలగిస్తాయి. దీనివల్ల దంతాలు, చిగుళ్లలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం తగ్గుతుంది.
  • చక్కెర లేని బబుల్ గమ్స్: ఆహారం తీసుకున్న తర్వాత చక్కెర పదార్థాల్లేని బబుల్ గమ్ ను నమలడం ద్వారా దంతాలు దెబ్బతినకుండా రక్షించుకోవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఇలా బబుల్ గమ్ నమలడం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి పెరుగుతుందని.. అది బ్యాక్టీరియాను నిర్మూలిస్తుందని వారు చెబుతున్నారు.
  • కాల్షియం ఎక్కువగా ఉండే చీజ్, బాదాం, ఆకు కూరలు.. ఫాస్పరస్ ఎక్కువగా ఉండే మాంసం, గుడ్లు, చేపలు వంటివాటితోపాటు విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే దంతాలు, వాటిపై ఉండే ఎనామిల్ దృఢంగా మారుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆమ్లయుత ఆహారం, కూల్ డ్రింక్స్ కారణంగా దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుదని.. ఈ ఆహారం ద్వారా అది రికవరీ అవుతుందని వెల్లడిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
  • ఎప్పటికప్పుడు నోటిని శుభ్రపర్చుకోవడం దంతాల సంరక్షణలో అన్నింటికన్నా ఉత్తమమైన అంశం. నోటిని శుభ్రపర్చుకోవడమంటే కేవలం బ్రషింగ్ చేయడమే కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదైనా తిన్న తర్వాత నీటితో పుక్కిలించి ఉమ్మేసే అలవాటు చేసుకుంటే దంతాలు దెబ్బతినే సమస్యను దాదాపుగా నివారించినట్లే.
  • ఎక్కువసేపు ఏమీ తినకుండా ఉన్నా కూడా మధ్య మధ్యలో నీటితో పుక్కిలిస్తే దంతాల మధ్య బ్యాక్టీరియా పెరగడాన్ని నియంత్రించవచ్చు. ఈ విధంగా నోటి దుర్వాసనను కూడా అరికట్టవచ్చు.
  • రోజూ ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు దంతాలను బ్రష్ చేయడం వల్ల అవి దెబ్బతినకుండా ఉంటాయి.
  • ఆహారంలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే అవి దంతాల మధ్య చేరి.. బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతాయి. అందువల్ల ఇవి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోవాలి.
  • కూల్ డ్రింక్స్, యాసిడిటిక్ పదార్థాల్లోని యాసిడ్లు దంతాలను దెబ్బతీస్తాయి. అందువల్ల దంతాల సంరక్షణ కోసం అలాంటి వాటి వినియోగాన్ని తగ్గించాలి. కూల్ డ్రింక్స్ వంటి వాటిని స్ట్రాలతో తాగడం వల్ల అవి దంతాలకు తగలకుండా జాగ్రత్తపడొచ్చు.
  • దంతాలపై ఉండే ఎనామిల్ పొర మందం తగ్గిపోకుండా ఉండాలంటే శరీరానికి తగినంత ఫ్లోరైడ్ అందుతుండాలి. నోట్లో లాలాజలం ఊరుతూ ఉండాలి. ఫ్లోరైడ్ ఎనామిల్ ఏర్పడేందుకు తోడ్పడుతుంది. ఇక లాలాజలం ఎనామిల్ ను దెబ్బతీసే బ్యాక్టీరియాను ఎప్పటికప్పుడు సంహరిస్తుంది.
  • సాధారణంగా నిత్యం శుద్ధి చేసిన మంచి నీటిని తాగేవారికి ఫ్లోరైడ్ అందే అవకాశం తక్కువ. అందువల్ల వారు ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ ను వినియోగించడం మంచిది. అయితే దీర్ఘకాలం అధిక స్థాయిలో ఫ్లోరైడ్ అందితే విపత్కర పరిణామాలు తలెత్తుతాయి. శరీరంలో ఎముకలు దెబ్బతింటాయి.
  • దంతాలు తెల్లగా అవుతాయి కదాని టూత్ వైటెనింగ్ ఉత్పత్తులు, మౌత్ వాష్ లు విపరీతంగా వాడడం మంచిదికాదు. దానివల్ల ఎనామిల్ దెబ్బతింటుంది.
  • ఇక అప్పుడప్పుడూ దంత వైద్యుడిని సంప్రదించి దంతాలను పరీక్షించుకోవడం మంచిది. దానివల్ల ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రారంభ స్థాయిలోనే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

థైరాయిడ్ సమస్య పరిష్కారం మార్గం


థైరాయిడ్‌ సమస్య పరిష్కారం మార్గం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 



వచ్చీ.. రాని.. థైరాయిడ్‌!

డోలాయమానం! సమస్య ఉన్నట్టే ఉంటుంది. కానీ చికిత్స ఆరంభించాల్సిన అవసరం ఉందా? లేదా? అర్థం కాదు. నిజంగా సమస్య ఉందా? లేక అది సహజంగా తలెత్తిన శారీరక పరిణామమేనా? అనుమానం పీడిస్తుంటుంది.

శరీరం మొత్తాన్ని చురుకెత్తించే అత్యంత కీలకమైన ‘థైరాయిడ్‌’ హార్మోన్ల విషయంలో తరచూ ఎదురయ్యే సంశయమే ఇది. పరీక్ష చేసి చూస్తే విలువల్లో ‘కొద్దిగా’ తేడా కనబడుతుంది. మరీ ఎక్కువుంటే చికిత్స ఎలాగూ తప్పదు. కానీ కొద్దిగా పెరిగినప్పుడు చికిత్స ఆరంభించాలా? అక్కర్లేదా?

స్థాయులు పెరిగి ఉన్నంత మాత్రాన అందరికీ చికిత్స ఆరంభించాల్సిన అవసరంలేదు. వ్యక్తిని బట్టి, బరువును బట్టి, వయసును బట్టి, పరిస్థితులను బట్టి దీనిపై నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అవసరమైతే మరికొన్ని పరీక్షలు చేసి అయినా.. ఏం చెయ్యాలన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అందుకే దీనికి సంబంధించిన వివరాలను సులభంగా మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!

శరీరం మొత్తాన్ని చురుకెత్తించే అత్యంత కీలక హార్మోన్లు... థైరాయిడ్‌ హార్మోన్లు! మన శరీర అవసరాలకు తగినట్లుగా థైరాయిడ్‌ గ్రంథి స్రవించే ఈ హార్మోన్లు రెండు. T3, T4.

అయితే శరీరంలో వీటి మోతాదులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఇవి సరిపోతున్నాయా? లేక వీటి అవసరం ఇంకా ఎక్కువ ఉందా? వీటిని ఇంకా స్రవించాలా? లేక తగ్గించాలా? అన్నది గమనిస్తూ... అందుకు తగ్గట్టుగా థైరాయిడ్‌ గ్రంథిని ప్రేరేపించే హార్మోను మరోటి మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో ఉత్పత్తి అవుతుంటుంది. దీన్నే ‘థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ ’ (టీఎస్‌హెచ్‌) ‘Thyroid Stimulating Hormone‌’ (TSH‌) అంటారు. థైరాయిడ్‌ సమస్యలను నిర్ధారించేందుకు ఈ ‘టీఎస్‌హెచ్‌’ అత్యంత కీలకం.

TSH.. ఎందుకు కీలకం?
థైరాయిడ్‌ గ్రంథి నేరుగా స్రవించే T3, T4 కంటే కూడా పిట్యూటరీ గ్రంథి స్రవించే టీఎస్‌హెచ్‌ మరింత కీలకమైనది. ఇది థైరాయిడ్‌ గ్రంథిని ప్రేరేపించి- T3, T4 హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తుంది. T3, T4 హార్మోన్లు తక్కువగా ఉంటే ఈ TSH మరికాస్త ఎక్కువగా విడుదలై.. థైరాయిడ్‌ గ్రంథిని మరింతగా ప్రేరేపిస్తుంటుంది. మరోవైపు రక్తంలో T3, టి4లు ఎక్కువైతే- అవి TSH విడుదలను నిరోధిస్తుంటాయి. ఇలా ఒకవైపు T3, T4; మరోవైపు టీఎస్‌హెచ్‌.. ఇవో చక్రంలా పని చేస్తుంటాయి.

* థైరాయిడ్‌ గ్రంథి సరిగా పని చేయకపోతే.. అంటే T3, T4 అవసరమైనంత లేకపోతే.. TSH ఉత్పత్తి పెరిగి, థైరాయిడ్‌ గ్రంథిని ఎక్కువగా ప్రేరేపిస్తుంటుంది. అంత మాత్రాన T3, T4 నార్మల్‌ కన్నా తక్కువగా ఉండాల్సిన పని లేదు. ఇవి నార్మల్‌ స్థాయుల్లో ఉండేలా చూసేందుకు కూడా TSH ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుండొచ్చు. అంటే T3, T4 స్థాయులు పడిపోవటాని కన్నా ముందుగానే TSH స్థాయులు పెరుగుతాయన్న మాట. కాబట్టి T3, T4 స్థాయుల కంటే కూడా TSH పెరగటమన్నదే మనకు సమస్యను పట్టిచూపే అత్యంత కీలకమైన అంశం అవుతుంది.

చికిత్సా సమయంలోనూ TSH పరీక్షే కీలకం!
థైరాయిడ్‌ సమస్యను అర్థం చేసుకునేందుకు సాధారణంగా T3, T4, టీఎస్‌హెచ్‌.. మూడు పరీక్షలూ చేయిస్తుంటారు. అయితే చాలామందికి TSH ఒక్కటే సరిపోతుంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు ఒక్క దీంతోనే తెలిసిపోతుంది. హైపోథైరాయిడిజమ్‌, హైపర్‌థైరాయిడిజమ్‌ రెండింటినీ దీని ద్వారానే నిర్ధరించొచ్చు. చికిత్స సమర్థంగా జరుగుతోందా? లేదా? అన్నది కూడా TSH ద్వారానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హైపోథైరాయిడ్‌ సమస్యకు చికిత్స తీసుకుంటున్న వారికి బయటి నుంచి థైరాయిక్సిన్‌ (T4) హార్మోన్‌నే ఇస్తారు. కాబట్టి వీరిలో పరీక్ష చేసినప్పుడు రక్తంలో T3, T4 హార్మోన్‌ స్థాయులు ఎక్కువగానే ఉంటాయి. ఇది చూసి చాలామంది ఆందోళన చెందుతుంటారు. అందువల్ల T3, T4 పరీక్షలతో ప్రయోజనం ఉండదు. TSH ఒక్కటే సరిపోతుంది.

చికిత్స తీసుకుంటున్నప్పుడు ఈ TSH పరీక్ష కూడా నార్మల్‌కు వచ్చేస్తే ఆర్నెల్లకోసారి, తేడాలుంటే 3 నెలలకోసారి చేయించుకోవటం అవసరం. గర్భిణులు మాత్రం 2 నెలలకోసారి చేయించుకోవాలి.

అయితే- ఎదుగుదల సరిగా లేని పిల్లల్లో మాత్రం పిట్యుటరీ గ్రంథి సరిగా పని చేయకపోవచ్చు. వీరిలో T3, T4 తక్కువగానూ.. TSH కూడా తక్కువగానూ లేదా నార్మల్‌గానూ ఉండొచ్చు. ఇలాంటి పిల్లలకు మాత్రం మూడు పరీక్షలూ, వీటితో పాటు మరికొన్ని పరీక్షలూ చేయాల్సి ఉంటుంది.





యాంటీబోడీ పరీక్ష: ఒక్కసారే
థైరాయిడ్‌ సమస్య కచ్చితంగా నిర్ధారణ కానప్పుడు.. TSH బోర్డర్‌ లైన్లో ఉన్న వారికి కచ్చితమైన నిర్ధారణకు థైరాయిడ్‌ యాంటీబోడీ పరీక్ష ఉపయోపడుతుంది. చాలాసార్లు కొన్ని తెలియని కారణాలు, పర్యావరణ అంశాల మూలంగా థైరాయిడ్‌ గ్రంథి వాపు వస్తూ పోతుంటుంది (ట్రాన్సియెంట్‌ థైరాయిడైటిస్‌). వాపు ఉన్నప్పుడు థైరాయిడ్‌ హార్మోన్లు తగ్గిపోతాయి. వాపు తగ్గినపుడు తిరిగి మామూలు స్థాయికి వచ్చేస్తాయి. కొందరిలో వాపు అలాగే ఉండిపోవచ్చు కూడా. ఇలాంటి వారిలో శాశ్వతంగా హైపోథైరాయిడిజమ్‌ తలెత్తుతుంది. శాశ్వతంగా ఉండిపోయే థైరాయిడైటిస్‌ సమస్యకు- మనలోని రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున మన థైరాయిడ్‌ గ్రంథి మీదే దాడి చేసి, దాన్ని దెబ్బతీయటమే (ఆటో ఇమ్యూన్‌) ప్రధాన కారణం. ప్రస్తుతం చాలామందిలో కనబడుతున్న హైపోథైరాయిడిజం సమస్యలకు మూలం ఇదే. వీరికి పరీక్ష చేస్తే థైరాయిడ్‌ యాంటీబోడీలు కనబడతాయి. కాబట్టి TSH మోతాదులు అటూఇటూ కాకుండా మధ్యస్థంగా ఉన్నవారికి థైరాయిడ్‌ యాంటీబోడీ పరీక్ష చేస్తే సమస్య కచ్చితంగా నిర్ధరణ అవుతుంది. ఈ యాంటీబోడీలు ఉండి, TSH ఎక్కువగా ఉన్నవారికి జీవితాంతం చికిత్స చేయాల్సి ఉంటుంది.

* అయితే యాంటీబోడీలు ఉన్నా కూడా - TSH స్థాయులు పూర్తి నార్మల్‌గా ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే సాధారణ ఆరోగ్యవంతుల్లో కూడా 10% మందిలో థైరాయిడ్‌ యాంటీబోడీలు ఉండే అవకాశముంది.

* థైరాయిడ్‌ యాంటీబోడీ పరీక్ష ఎవరికైనా జీవితంలో ఒకసారి చేస్తే సరిపోతుంది. తరచుగా చేయాల్సిన పనిలేదు.




TSH ఎంత నార్మల్‌?

0.5 - 5.5 మధ్య ఉంటే: నార్మల్‌
5.5 -10 మధ్య ఉంటే: బోర్డర్‌ లైన్‌ (దీన్నే ‘సబ్‌క్లినికల్‌ హైపోథైరాయిడిజమ్‌’ అంటారు.)
10 కంటే ఎక్కువ: హైపోథైరాయిడిజం సుస్పష్టం!

ఇక్కడ TSH 5.5 నుంచి 10 మధ్య.. అంటే బోర్డర్‌ లైన్‌లో ఉన్న వారికి ఏం చెయ్యాలన్నది కీలకం. దీన్నే ‘Subclinical Hyperthyroidism’ అంటారు. వీరిలో T3, T4 నార్మల్‌గానే ఉంటాయి. TSH మాత్రం ఇలా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అందరికీ చికిత్స ఆరంభించాల్సిన అవసరమేం లేదు. వ్యక్తులను బట్టి, వారి వయసు, పరిస్థితులను బట్టి చికిత్స చెయ్యాలా? వద్దా? అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ వయసులో ఉన్న యువతులకు, గర్భిణులకు, వృద్ధులకు, ఎదుగుదల మందగించిన పిల్లల విషయంలో చికిత్స అవసరమా? కాదా? అన్నది లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది.






చికిత్స ఎవరికి?
సుమారు 2-3 శాతం మంది స్పష్టంగా ‘హైపో థైరాయిడిజమ్‌’తో బాధపడుతున్నట్టు అంచనా. కానీ 6-7 శాతం మందిలో TSH స్థాయులు ఇంత స్పష్టంగా పెరిగి ఉండవు. ఓ మోస్తరుగానే (సబ్‌ క్లినికల్‌) పెరిగి ఉంటాయి. అందుకే వీరి విషయంలో ఏం చెయ్యాలన్నది కీలకంగా మారుతోంది. ఆయా వ్యక్తులను, లక్షణాలను బట్టి చికిత్స అవసరమా? లేదా? అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది.

వృద్ధులు
సాధారణంగా TSH 0.5-5.5 ఉండటం నార్మల్‌. అయితే 65 ఏళ్లు పైబడిన చాలా మంది వృద్ధుల్లో ఇది 7 నుంచి 10 వరకూ కూడా ఉంటుండొచ్చు. అయినా వీరికి చికిత్స అవసరం ఉండదు. దీని గురించి ఇంకా లోతుగా పరీక్షలు చెయ్యాల్సిన అవసరమూ ఉండదు.

యువతులు
నెలసరి సరిగా రాకపోతుండటం, గర్భధారణకు ప్రయత్నిస్తుండటం వంటి సందర్భాల్లో వీరు TSH స్థాయులు బోర్డర్‌ లైన్లోనే (5.5-10 మధ్య) ఉన్నా కూడా విధిగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

గర్భిణులు
గర్భిణుల్లో TSH 3 లోపే ఉండాలి. అంతకు మించి ఉంటే దానికి చికిత్స అవసరం. వాస్తవానికి గర్భధారణ తర్వాత తొలి మూడు నెలల్లో TSH స్థాయులు పడిపోతాయి. కొందరిలో 0.1-0.2 వరకూ కూడా తగ్గొచ్చు. దీనికి గర్భధారణ సమయంలో తలెత్తే శారీరక మార్పులే కారణం. రెండో త్రైమాసికంలో తిరిగి TSH పెరుగుతాయి. అయితే ఇది 3 కంటే ఎక్కువకు పెరిగితే మాత్రం కాన్పు అయ్యేంత వరకూ కూడా చికిత్స తీసుకోవాలి. దీన్ని ‘జెస్టేషనల్‌ థైరోటాక్సికోసిస్‌’ అంటారు. వీరికి చికిత్స చేయటం ద్వారా పుట్టబోయే బిడ్డల్లో విషయగ్రహణ, తెలివితేటలు, చురుకుదనం, మానసిక స్థితి ప్రభావితం కాకుండా చూసుకోవచ్చని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

* ఒకవేళ గర్భిణులకు పరీక్షల్లో T3, T4 ఎక్కువగా ఉన్నా గాబరా పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ హార్మోన్లు రెండూ థైరాయిడ్‌ బైండింగ్‌ గ్లోబులిన్‌ (టీబీజీ)  (Thyroxine Binding Globulin - TBG) అనే ప్రోటీన్‌కు అంటుకొని ఉంటాయి. గర్భధారణ సమయంలో ఈ TBG మోతాదులు సహజంగానే పెరుగుతాయి. అందువల్ల గర్భిణులందరిలోనూ T3, T4 స్థాయులూ ఎక్కువగానే ఉంటాయి. దీనికి గాబరా పడాల్సిన పనిలేదు. T3, T4 ఎక్కువగా ఉండి, TSH నార్మల్‌గానే అంటే.. 0.5-3 మధ్యలో ఉంటే దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు.

* మరీ అనుమానంగా ఉంటే గర్భిణుల్లో- సమస్య నిర్ధారణకు ఫ్రీ T3, T4 అనే పరీక్షలు చెయ్యాల్సి ఉంటుంది.

* ఇక కాన్పు తర్వాత.. గర్భధారణ సమయంలో ఓ మోస్తరుగా పెరిగిన TSH స్థాయులు.. కాన్పు తర్వాత అలాగే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందువల్ల వీరికి కాన్పు తర్వాత చికిత్స కొనసాగించాలా? అవసరం లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు థైరాయిడ్‌ యాంటీబోడీ పరీక్ష ఉపయోగపడుతుంది. యాంటీబోడీ పాజిటివ్‌గా ఉంటే చికిత్స కొనసాగించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా TSH మధ్యస్థంగా ఎక్కువగా ఉన్నప్పుడు చెయ్యాల్సింది. ఒకవేళ గర్భధారణ మొదట్లోనే TSH 10 కన్నా ఎక్కువున్నట్టు గుర్తిస్తే అసలీ యాంటీబోడీ పరీక్ష అవసరమేమీ ఉండదు. అది హైపోథైరాయిడిజమ్‌కు స్పష్టమైన సూచిక. కాబట్టి వీరికి కాన్పు తర్వాత కూడా చికిత్స కొనసాగించాల్సి ఉంటుంది.

అల్ట్రాసౌండ్‌-డాప్లర్‌ పరీక్ష:
గర్భిణుల్లో కొందరికి ఈ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గర్భధారణ మూలంగా కూడా కొందరిలో గుండె వేగం పెరగుతుంటుంది. అలాగే గర్భం ధరించినపుడు థైరాయిడ్‌ హార్మోన్‌ అవసరం కూడా పెరుగుతుంది. దీంతో హార్మోన్‌ ఉత్పత్తి పెరిగి, జీవక్రియలూ వేగవంతమవుతాయి. దీనివల్ల గొంతు దగ్గర ఉబ్బు (గాయిటర్‌) కూడా రావచ్చు. ఇలాంటి వారిలో T3, T4 అధికంగానూ, TSH మాత్రం తక్కువగా ఉంటాయి. ఇది సరిగ్గా హైపర్‌ థైరాయిడిజమ్‌ మాదిరిగానే కనబడుతుంది. దీనికి శారీరక మార్పులే కారణమని తెలుసుకోవటానికి ఈ డాప్లర్‌ పరీక్ష ఉపయోగపడుతుంది.

థైరాయిడ్‌ సమస్యను అర్థం చేసుకునేందుకు సాధారణంగా T3, T4, టీఎస్‌హెచ్‌.. మూడు పరీక్షలూ చేయిస్తుంటారు. అయితే మూడూ తప్పనిసరేమీ కాదు. చాలామందికి TSH ఒక్కటే సరిపోతుంది.



థైరాయిడ్‌ గ్రంథి
గొంతు దగ్గర.. ముందు వైపు.. మన గాలి గొట్టానికి చిన్న సీతాకోక చిలుకలా కరుచుకుని ఉంటుంది థైరాయిడ్‌ గ్రంథి. చూడటానికి ఇది చిన్నదేగానీ పనిలో మాత్రం చాలా పెద్దది. మన శరీరం మొత్తాన్ని.. ఒంట్లోని ప్రతి కణాన్నీ, ప్రతి అవయవాన్నీ చురుకెత్తించే బృహత్తరమైన బాధ్యత నిర్వర్తిస్తుంటుందీ గ్రంథి! ఈ గ్రంథి స్రవించే హార్మోన్లే దేహానికి చురుకుదనాన్ని ఇస్తుంటాయి.




స్థూలంగా థైరాయిడ్‌ గ్రంథి వల్ల తలెత్తే సమస్యలు ఈ రెండే. వీటికి చికిత్స కూడా సులభమే. కాకపోతే ఎవరికి చికిత్స అవసరమన్నది నిర్ధరించటం కీలకం. ముఖ్యంగా పరీక్షల రిపోర్టుల్లో విలువలు - అటూ ఇటూ కాకుండా- మధ్యస్థంగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలన్నది తెలుసుకోవటం మరీ కీలకం.




ఊబకాయులు
ఊబకాయం మూలంగా TSH కాస్త పెరుగుతుంది. చాలామంది ఊబకాయులు TSH 6.5-7 ఉంటే.. తమకు థైరాయిడ్‌ సమస్య వచ్చిందనీ, దాని మూలంగానే బరువు పెరిగామనీ భావిస్తుంటారు. ఇది నిజం కాదు. సాధారణంగా వీరికి థైరాయిడ్‌ చికిత్స అవసరముండదు. కానీ బరువు తగ్గుతామని భావిస్తూ చాలామంది థైరాయిడ్‌ చికిత్స తీసుకుంటుంటారు. వీరు మందులు వేసుకుంటే TSH కొంత తగ్గొచ్చు, అయినా దాంతో ప్రయోజనం ఉంటుందని చెప్పలేం. అయితే యాంటీబోడీ పాజిటివ్‌గా ఉంటే మాత్రం చికిత్స తీసుకోవాలి. యాంటీబోడీలు లేకపోతే- తమకు వచ్చిన బార్డర్‌ లైన్‌ హైపో థైరాయిడిజమ్‌కు ఊబకాయమే కారణమనీ, బరువు తగ్గితే ఆ పెరిగిన TSH స్థాయి కూడా తగ్గుతుందనీ గుర్తించటం అవసరం!

నవీన్ నడిమింటి కెటో డైట్


బరువు తగ్గాలి అంటే కీటో డైట్‌ 

కీటో డైట్‌
ఆసక్తి సరే.. అతి విశ్వాసం వద్దు!
ఊబకాయం.. 
ప్రపంచానికే పెద్ద గుదిబండ! అందుకే ఒంటి బరువు వదిలించుకునేందుకు నోరు కట్టుకోవటం, ఒళ్లు వంచటం నుంచి పొట్ట కుట్టేయటం వరకూ.. రకరకాల విధానాలపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఇప్పటికే బాగా ప్రాచుర్యంలోకీ వచ్చాయి. అయితే వీటిలో ఏది సమర్థమైనదన్న దానిపై చర్చ నడుస్తూనే ఉంది.
మధుమేహం..  
నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఆధునిక ఉపద్రవం. విస్మరిస్తే ఒళ్లంతా కబళించివేసే ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు మందులున్నాయి. వీటిని జీవితాంతం తీసుకోవటం తప్పించి మధుమేహాన్ని పూర్తిగా నయం చేసే చికిత్సలు మాత్రం ఇప్పటి వరకూ లేవు.
తాజాగా...  
ఒక్క బాణంతో ఈ రెండు ఉపద్రవాలనూ ఖాయంగా జయించొచ్చన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కేవలం ఆహార విధానం మార్చుకుని, అంతా కేవలం ‘కొవ్వు ఎక్కువగా తినటం’ ద్వారానే అటు ఊబకాయాన్నీ, ఇటు మధుమేహాన్ని కూడా జయించి తీరతారన్న వాదన బలంగా వినపడుతుండటంతో.. సహజంగానే ప్రజల్లోనూ దీనిపై ఆసక్తి పెరుగుతోంది.
అయితే ఈ తరహా ఆహార నియంత్రణ సరైనదేనా? దీంతో బరువు తగ్గే మాట నిజమే కావొచ్చుగానీ.. ఇతరత్రా ఎలాంటి సమస్యలూ తలెత్తవా? అన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న!
ఈ తరహా డైట్‌తో కొంత ప్రయోజనాలు కనిపించొచ్చు.. కానీ దీంతో సమస్యలు తలెత్తే అవకాశమూ ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించకూడదని హెచ్చరిస్తున్నారు వైద్య ప్రముఖులు.
నిజానికి ఈ తరహా ఆహార విధానం కొత్తదేం కాదు గానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఆసక్తి పెరుగుతున్న మాట వాస్తవం. అందుకే విఖ్యాత వైద్య పత్రిక ‘జామా’ కూడా దీనిపై తాజా సంచికలో సమగ్రమైన సమీక్షా వ్యాసాన్ని ప్రచురిస్తూ.. ఈ తరహా డైట్‌ తీసుకోవాలనుకుంటున్న వారికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. అందుకే దీనికి సంబంధించిన వివరాలన్నీ సాధ్యమైనంత సమగ్రంగా మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!

బరువు తగ్గిపోయేందుకు ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఆహార నియంత్రణ పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నాయిగానీ.. కొవ్వు పదార్ధాలు అధికంగా, పిండిపదార్ధాలు చాలా తక్కువగా ఉండే ఆహారం (లో కార్బ్‌, హై ఫ్యాట్‌ ఆహారం- ఇదే కీటోజెనిక్‌ డైట్‌) తీసుకుంటున్న వారిపై విస్తృతస్థాయిలో జరిగిన 13 అధ్యయన ఫలితాలు, వాటి విశ్లేషణలను పరిశీలిస్తే... ఈ ‘కీటో డైట్‌’ మీద ఉన్న వాళ్లు బరువు ఎక్కువగా తగ్గుతున్నారని వెల్లడవుతోంది. దీంతో ఊబకాయాన్ని ఎదుర్కొనేందుకు చాలామంది పరిశోధకులు పిండిపదార్ధాలు బాగా తగ్గించేసే ‘కీటోజెనిక్‌’ ఆహార విధానం వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇది న్యూట్రిషనల్‌ కీటోసిస్‌
కీటోజెనిక్‌ ఆహారంలో పిండిపదార్ధాలను బాగా తగ్గించేయటంతో- శరీరం ఇన్సులిన్‌ ఉత్పత్తిని తగ్గించేస్తుంది. ప్రధానంగా ఒంట్లోని కొవ్వును కరిగించుకుని, వారంలోపే దాన్నే శక్తిగా వినియోగించుకోవటానికి అలవాటుపడిపోతుంది. ఈ దశనే వైద్యపరంగా ‘న్యూట్రిషనల్‌ కీటోసిస్‌’ అంటారు. ఈ స్థితిలో మన కాలేయం ఒంట్లోని కొవ్వును, కొవ్వు ఆమ్లాలను ‘కీటోన్‌ బోడీస్‌’ అనే రకం రసాయనాలుగా మార్చటం మొదలుపెడుతుంది. అనివార్యపరిస్థితుల్లో ఈ కీటోన్‌ బోడీలే మన శరీరానికీ, మెదడుకు అవసరమైన శక్తిని అందించటం మొదలుపెడతాయి. ఇదీ ఈ రకం డైట్‌ ప్రత్యేకత.
కొవ్వు తిన్నా బరువు తగ్గుతున్నారు!
కొవ్వు ఎక్కువగా తినమని చెప్పినా కూడా ‘కీటో డైట్‌’ మీద ఉండేవాళ్లు బాగా, వేగంగా బరువు తగ్గిపోతున్నారు. రెండు వారాల్లోనే దాదాపు 10 పౌండ్లు (4.5 కేజీలు) తగ్గిపోతున్న వాళ్లూ ఉంటున్నారని బర్మింగ్‌హామ్‌లోని అలబామా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అమీ గాస్‌ తదితరులు గుర్తించారు. కీటోడైట్‌ వల్ల ఒంట్లో నీరు బాగా బయటకుపోతుంది, కాబట్టి మొదట్లో వేగంగా తగ్గిన బరువులో నీటిదే అధిక భాగం కావొచ్చు. క్రమేపీ ఇన్సులిన్‌ స్థాయులు తగ్గిపోతూ, మన శరీరం కొవ్వును కరిగించుకునే దశలోకి వెళుతున్న కొద్దీ.. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటం ఆరంభిస్తుంది, దానివల్ల బరువు బాగా తగ్గుతున్నారని గాస్‌ అంటున్నారు.
ఆకలి ఉండటం లేదు
కారణం స్పష్టంగా తెలియకపోయినా కీటోడైట్‌ మీద ఉన్నవాళ్లకు పెద్దగా ఆకలిగా అనిపించటం లేదు. కాబట్టి సహజంగానే వాళ్లు తీసుకునే మొత్తం క్యాలరీలు తగ్గిపోతున్నాయి, బరువు తగ్గటానికి ఇది కూడా దోహదం చేస్తుండొచ్చని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్‌ బ్రూస్‌ బిస్ట్రియన్‌ అభిప్రాయపడుతున్నారు. వీరి అధ్యయనంలో- పూర్తి కీటో డైట్‌ మీద ఉన్న వారికి శరీరంలో 9.7% కొవ్వు తగ్గిపోగా కేవలం కొద్దిగా కొవ్వు తగ్గించినవారిలో 2.1% మాత్రమే తగ్గింది. అలాగే కీటో డైట్‌ మీద ఉన్న వారిలో పొట్టలో పేరుకున్న కొవ్వు కూడా 3 రెట్లు ఎక్కువగా తగ్గిపోయినట్లు గుర్తించారు.
బరువు ఒక్కటే కాదు..
‘‘కీటో డైట్‌ బరువు తగ్గేందుకే కాదు, మధుమేహుల్లో మందుల అవసరాన్ని తగ్గించేందుకు కూడా దోహదం చేస్తోంది. అలాగే రక్తంలో గ్లూకోజు స్థాయుల మూడు నెలల సగటును చెప్పే హెచ్‌బీఏ1సీ కూడా బాగా మెరుగవుతోంది’’ అంటున్నారు లూసియానా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన మెటబాలిజం విభాగం ప్రొఫెసర్‌ స్టీవెన్‌ హెమ్స్‌ఫీల్డ్‌. ‘‘కానీ ఇక్కడ సమస్యల్లా ఒక్కటే.. ఈ ఆహారాన్ని దీర్ఘకాలం తిని తట్టుకోగలరా? అన్నదే’’ అంటారాయన. కాలిఫోర్నియా యూనివర్సిటీలో మెడిసిన్‌ విభాగం ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ ఫినే 2015 నుంచి కొంతమంది మధుమేహ రోగులకు కీటోడైట్‌ ఇచ్చి ఫలితాలను అధ్యయనం చేస్తున్నారు. 10 వారాల తర్వాత 56.1% మందిలో హెచ్‌బీఏ1సీ అదుపులో ఉన్నట్టు తేలింది. 56.8% మందిలో మధుమేహం మందుల అవసరం తగ్గిపోయింది. త్వరలో ఏడాది ఫలితాలు రాబోతున్నాయి.
ఏ కొవ్వు మంచిదో ఇంకా తేలలేదు!
కీటో డైట్‌తో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు, పొట్టచుట్టుకొలత తగ్గుతున్నాయి, బీపీ కూడా మెరుగవుతోంది. అయితే కొందరిలో చెడ్డ (LDL) కొలెస్ట్రాల్‌ పెరుగుతున్నట్టు గుర్తించారు. కాబట్టి ఏ రకం కొవ్వులు మంచివో నిపుణుల్లో ఇంకా ఏకాభిప్రాయం లేదు. దీనిపై దీర్ఘకాలిక ఫలితాలు ఎలా ఉన్నాయన్నది కచ్చితంగా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు క్యాలిఫోర్నియా యూనివర్సిటీ వైద్యవిభాగం ప్రొఫెసర్‌ రిక్‌ హెట్‌.  ఆహారపరంగా తేలికగా పాటించటానికి వీలైన ఈ కీటో డైట్‌ అనేది బేరియాట్రిక్‌ సర్జరీలకు, బరువు తగ్గించే మందులకు మంచి ప్రత్యామ్నాయం కావొచ్చనీ అభిప్రాయపడుతున్నారు.
నిబంధనలు పాటిస్తేనే సురక్షితం!
ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎప్పటి నుంచో అనివార్యంగా ఈ తరహా ఆహారం తింటూనే ఉన్నారు. ఇదేకాదు, మూర్ఛలు అస్సలు అదుపులోకి రాని చిన్నపిల్లలకు చికిత్సలో భాగంగా ఈ కీటో డైట్‌ను దాదాపు శతాబ్ద కాలంగా సిఫార్సు చేస్తున్నారు. కాబట్టి ‘‘సాధారణంగా చూసుకుంటే ఈ డైట్‌ సురక్షితమైనదనే చెప్పుకోవచ్చు’’ అన్నది హెమ్స్‌ఫీల్డ్‌ భావన. కీటోడైట్‌తో ఎక్కువమందిలో తలెత్తుతున్న సర్వసాధారణ దుష్ప్రభావం- ఆరంభించిన కొత్తలో తల తేలిపోతున్నట్టు, కళ్లు తిరిగినట్లు ఉండటం, బాగా అలసట, శారీరక శ్రమ కష్టంగా ఉండటం, నిద్ర పట్టకపోవటం, ముఖ్యంగా మలబద్ధకం వంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీటన్నింటినీ కలిపి వైద్యులు ‘కీటో ఫ్లూ’ అంటున్నారు. అయితే ఈ లక్షణాలన్నీ కొద్ది రోజుల్లోనో, వారాల్లోనే సర్దుకుంటున్నాయి. ఇక ఈ డైట్‌లో భాగంగా తీసుకునే కొద్దిపాటి మాంసకృత్తులను కూడా- బాగా శుద్ధి చేసిన వాటి నుంచి కాకుండా.. ముడి పదార్ధాల నుంచి వచ్చేలా చూసుకోవటం వల్ల సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి, దాంతో ఈ రకం దుష్ప్రభావాలు బాగా తగ్గిపోవచ్చు.
ఇది సొంత వైద్యం కాదు!
కొన్ని సుగుణాలున్నట్టు చెప్పుకున్నా కూడా... ఈ డైట్‌ అందరికీ సమర్థంగా, సురక్షితంగా ఉండాలంటే దీన్ని ‘ఎవరికి వాళ్లు చేసేసుకునే సొంత వైద్యంలా’ భావించకూడదన్నది ఈ వైద్యులందరూ ముక్తకంఠంతో చేస్తున్న హెచ్చరిక. ముఖ్యంగా మధుమేహానికి మందులు, ఇన్సులిన్‌ తీసుకుంటున్న వాళ్లు ఈ కీటోడైట్‌ మొదలుపెడితే వాళ్లు గ్లూకోజు స్థాయులు బాగా పడిపోయి తీవ్రమైన ‘హైపోగ్లైసీమియా’లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని బిస్ట్రియన్‌ హెచ్చరిస్తున్నారు. కాబట్టి దీన్ని మొదలుపెట్టే ముందే కచ్చితంగా అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించి మందుల మోతాదులను సరిచేయించుకుని, వాళ్ల పర్యవేక్షణలో వాడుకోవటం అవసరం.
మధుమేహులు బరువు తగ్గితే మంచిదే! 
తాజా అధ్యయనాన్ని ప్రచురించిన లాన్సెట్‌  
బరువు తగ్గితే టైప్‌-2 మధుమేహం కూడా అదుపులోకి వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం స్కాట్లండ్‌, ఇంగ్లండ్‌లలో తాజాగా ఓ విస్తృత అధ్యయనం జరిగింది. 2014-2017 మధ్య చాలామంది ఊబకాయ మధుమేహులపై జరిగిన ఈ అధ్యయన విశేషాలను విఖ్యాత బ్రిటన్‌ వైద్య పత్రిక లాన్సెట్‌ తాజా సంచికలో ప్రచురించింది. బీఎంఐ 27-45 మధ్య ఉన్నవారికి కొన్ని నెలల పాటు ఆహారం చాలా పరిమితంగా (రోజుకు 800 క్యాలరీలు మించకుండా) ఇచ్చి పరిశీలించారు. ఫలితంగా వీళ్లంతా ఏడాదిలో 15 కేజీలకు పైగా బరువు తగ్గిపోయారు. విశేషమేమంటే 46% మందిలో మధుమేహం మందుల అవసరం పూర్తిగా తగ్గిపోయింది కూడా. మొత్తమ్మీద దాదాపు సగం మంది కేవలం బరువు తగ్గిన కారణంగానే మధుమేహం నుంచి పూర్తిగా బయటపడ్డారు. వీరికి మధుమేహం మందుల అవసరం కూడా ఉండటం లేదు. కాబట్టి బరువు తగ్గటం వల్ల మధుమేహం విషయంలో మంచి ప్రయోజనం ఉంటుందన్నది స్పష్టం. అయితే ఈ అధ్యయనాన్ని ఊబకాయుల మీదే చేశారు, రెండోది- బరువు తగ్గేందుకు మొత్తం ఆహార పరిమాణాన్ని తగ్గించారేగానీ కేవలం కొవ్వు పదార్థాల వంటివి ఇచ్చే ప్రయోగాలు మాత్రం చెయ్యలేదు!
ఆసక్తి ప్రపంచవ్యాప్తం
అమెరికా వైద్యుల సంఘానికి చెందిన ప్రముఖ వైద్య పత్రిక ‘జామా’ తాజాగా (జనవరి 16, 2018) ఊబకాయంపై ఒక ప్రత్యేక సంచిక తీసుకువచ్చింది. దీనిలో ఇటీవలి కాలంలో బరువు తగ్గటానికీ, టైప్‌-2 మధుమేహానికీ ప్రపంచవ్యాప్తంగా ‘కీటోజెనిక్‌ డైట్‌’ మీద సర్వత్రా ఆసక్తి పెరుగుతోందంటూ ప్రత్యేక సమీక్షా వ్యాసం ప్రచురించింది. ఈ తరహా డైట్‌ మీద ప్రముఖ వైద్య పరిశోధన, అధ్యయన కేంద్రాల్లో జరిగిన, జరుగుతున్న అధ్యయనాలను పరిశీలించి.. వాటి ఫలితాలతో పాటు దీంతో ఎదురవుతున్న సమస్యలేమిటి? దీన్ని అనుసరించే వాళ్లు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో కూడా కొన్ని హెచ్చరికలు చేసింది. ఆ వివరాలు క్లుప్తంగా ఇక్కడ ఇస్తున్నాం.
అంతా పాటించే డైట్‌ కాదు! 
మనదేశంలో చాలామందికి తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే తెలియదు. తరచూ పరీక్షలు చేయించుకునే అలవాటు లేకపోవటం మూలంగా చాలామందికి గుండె జబ్బులకు సంబంధించిన ముప్పులు, కిడ్నీ- లివర్‌ వంటి సమస్యలున్నా కూడా ఆ విషయమే తెలియటం లేదు. ఇలాంటి వాళ్లు వేగంగా బరువు తగ్గాలనో, మధుమేహాన్ని వదిలించుకోవాలనో తాపత్రపయడుతూ ‘కీటో డైట్‌’ వంటివి ఆరంభిస్తే తీవ్ర సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఆహారం మొదలుపెట్టిన తర్వాత- ఒంట్లోని కొవ్వు ఎక్కువగా కరిగిపోతుంటే కీటోన్‌ బోడీస్‌ తయారై, వాటి స్థాయులు పెరిగి స్పృహ తప్పటం వంటి ‘కీటోసిస్‌’ సమస్యలు తలెత్తే ముప్పు ఒకటి. అదొక్కటే కాదు, మరో ముఖ్య విషయం ఏమంటే- ఎవరైనా కొవ్వు చాలా ఎక్కువగా (లేదా కొవ్వు మాత్రమే) తింటుంటే వాళ్ల శరీరం- ఒంట్లో నిల్వ ఉన్న కొవ్వులు, ప్రోటీన్ల నుంచి గ్లూకోజును తయారు చేసుకోవటం ఆరంభిస్తుంది. ఈ క్రమంలో 1. యూరియా 2. క్రియాటినైన్‌  3. యూరిక్‌ యాసిడ్‌ 4. పొటాషియం వంటివన్నీ పెరుగుతాయి. ఇవన్నీ ఒక మోస్తరు వరకూ మూత్రంలో వెళ్లిపోతుంటాయిగానీ.. ఒకస్థాయి దాటితే  వీటితో తీవ్ర దుష్ప్రభావాలు మొదలవుతాయి. ప్రాణహాని కూడా జరగొచ్చు. ముఖ్యంగా గుండె, లివర్‌, కిడ్నీలు దెబ్బతినిపోవచ్చు.
రెండోది- ప్రోటీన్లనేవి మన ఒంట్లో రోగనిరోధక శక్తికి కూడా అత్యంత కీలకమైనవి. ఇవి తగ్గిపోతే రోగనిరోధక శక్తీ తగ్గి, రకరకాల జబ్బులు, ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కీటోడైట్‌ వంటివి తీసుకోవాలని అనుకుంటుంటే- ముందు వైద్యులను సంప్రతించి కొన్ని పరీక్షలు చేయించుకుని.. గుండె, లివర్‌, కిడ్నీల వంటి కీలక అవయవాల పనితీరు బాగుందని నిర్ధారించుకున్న తర్వాతే ప్రయత్నించటం మంచిది.
అంతా గుర్తించాల్సిన విషయం ఏమంటే- ఎవరైనా బరువు తగ్గటమన్నది ఆరోగ్యకరంగా తగ్గాలి. దానివల్ల ఇతరత్రా సమస్యలు ముంచుకొచ్చేలా ఉండకూడదు. కానీ ‘కీటో డైట్‌’ వంటివి నెలల తరబడి తీసుకుంటే ఎలాంటి ప్రభావం లేదా దుష్ప్రభావాలు ఉంటాయన్నది చెప్పేందుకు దీర్ఘకాలిక అధ్యయనాలేవీ లేవు. బరువు తగ్గేందుకు ఆహార నియంత్రణ, వ్యాయామం వంటి తంటాలు పడేకంటే ‘కీటో డైట్‌’ ఒక్కటి చేసేస్తే పోతుందన్న భావనా సరికాదు. ఎందుకంటే వ్యాయామం వల్ల ఇతరత్రా కూడా ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి, అవన్నీ ఇప్పటికే కచ్చితంగా నిరూపణ అయ్యాయి. కాబట్టి మితాహారం, రోజూ చక్కటి శారీరక శ్రమ.. వీటితో బరువు తగ్గేందుకు ప్రయత్నించటమే అన్ని విధాలా శ్రేయస్కరం!
మధుమేహులూ.. బహుపరాక్‌!  
మధుమేహులు ‘కీటో డైట్‌’ వంటివి ఆరంభించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మధుమేహుల్లో సహజంగానే ‘ఫ్యాట్‌ మెటబాలిజం’ ఎక్కువగా జరుగుతుంటుంది. వీరిలో పిండిపదార్థాల కంటే కూడా కొవ్వు పదార్థాలను శక్తిగా మార్చుకోవటమన్నది ఎక్కువ. ఇది స్వతహాగానే మధుమేహంలో ఉండే ఒక లక్షణం. దాన్ని సరిచేసేందుకే మనం బయటి నుంచి మందులు, ఇన్సులిన్‌ తదితరాలు ఇస్తుంటాం. కాబట్టి మధుమేహులు సహజంగానే ‘కీటోజెనిక్‌’గా ఉంటారన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. దీనివల్ల మనం ఏ కొంచెం మార్పులు తీసుకువచ్చినా వీరిలో రక్తంలో ‘కీటోన్‌ బోడీస్‌’ అనేవి తయారై, ఆమ్ల అయాన్లు పెరిగిపోయి.. ‘కీటోసిస్‌’ అనే ప్రమాదకర స్థితిలోకి వెళ్లిపోతారు. సాధారణ ఆరోగ్యవంతులకు రక్తంలో ఈ ‘కీటోన్‌ బోడీస్‌’కు సంబంధించిన ‘సీరం ఎసిటోన్‌’ అనేది 1 ఎంజీ/డీఎల్‌ లోపే ఉండాలి. మధుమేహుల్లో ఇది 1 నుంచి 3 మధ్య ఉన్నా కూడా దీనివల్ల రకరకాల దుష్ప్రభావాలు బయల్దేరతాయి. ఇక ఇది 5 ఎంజీ/డీఎల్‌ దాటిపోతే వాళ్లు స్పృహతప్పి కోమాలోకి కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కీటోడైట్‌ వంటివి పాటించే మధుమేహులు ఈ దుష్ప్రభావాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
రోజూ మూత్ర పరీక్ష తప్పనిసరి
మధుమేహుల్లో సీరం ఎసిటోన్‌ అనేది పెరగటం వల్ల- 1. శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ అందటం తగ్గిపోతుంది. 2. ఒకవైపు కణాల నుంచి.. మరోవైపు కిడ్నీల నుంచి అధికంగా నీరు బయటకు వెళ్లిపోతుంటుంది. దీంతో రక్తం చిక్కబడటం మొదలవుతుంది. వీటి కారణంగా మనిషి ‘ఇంట్రాసెల్యులార్‌ డీహైడ్రేషన్‌’, ‘హైపర్‌ఆస్మలారిటీ’ల్లోకి వెళ్లి.. వీటి ఫలితంగా ఊపిరితిత్తుల శ్వాస సామర్థ్యం, గుండె కండరాల పంపింగ్‌ సామర్థ్యం తగ్గుతాయి. మెదడుకు కూడా ఆక్సిజన్‌ తగ్గుతుంది.  3. ఎముకల్లోంచి  క్యాల్షియం కరగటం మొదలై, చివరికి మూత్ర అవయవాల్లో గట్టిపడి క్యాల్షియం రాళ్లు ఏర్పడొచ్చు. కాబట్టి మధుమేహులంతా కూడా అసలీ స్థితి తలెత్తకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి ‘కీటో డైట్‌’ వంటివి పాటించేవాళ్లు రోజూ మూత్ర పరీక్ష చేయించుకుంటూ ఉండాల్సిందే. మూత్రంలో ‘కీటోన్‌ బోడీస్‌’ అనేవి ఉండకూడదు. అవి కనిపించాయంటే అప్పటికే రక్తంలో ‘సీరం ఎసిటోన్‌’ పెరిగిందని అర్థం. (అయితే మూత్రంలో కీటోన్‌ బోడీస్‌ కనబడకుండా కూడా సీరం అసిటోన్‌ పెరిగి ఉండొచ్చు). కాబట్టి వీళ్లు రోజూ మూత్రపరీక్ష, తరచూ రక్తంలో సీరం అసిటోన్‌ స్థాయులు పరీక్ష చేసి చూసుకుంటూ ఉండాల్సిందే. మూత్రంలో కీటోన్‌ బోడీస్‌ను గుర్తించటమన్నది చాలా తేలికైన, చవకైన పరీక్ష కూడా. ప్రతి దీన్ని చేసుకోవటం ఉత్తమం. ఇక ఒంట్లో లవణాలు, సూక్ష్మపోషకాలు తగ్గకుండా రోజూ విటమిన్‌ మాత్రలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్‌ స్థాయులనూ చూసుకుంటూ ఉండాలి.
ఎంత బరువు తగ్గొచ్చు?
వైద్యపరంగా నెలకు 2 కేజీలకు మించి ఎక్కువ బరువు తగ్గటం ప్రమాదకరం. కాబట్టి పాటిద్దామని అనుకునేవాళ్లు వారానికి 4 రోజులు మాత్రమే కీటోడైట్‌ వంటివి తీసుకుని, మిగతా రెండుమూడు రోజులైనా సమతుల ఆహారం తీసుకోవటం మంచిది. అలా చేస్తే నెలకి ఒక్కసారే 5-10 కేజీలు తగ్గిపోకుండా.. నెలకు 2 కిలోల వరకు తగ్గుతారు. ఎక్కువ సమయం పట్టినా కూడా నెమ్మదిగా తగ్గటం మంచిది. బరువు ఎక్కువ ఉన్నవాళ్లు (అంటే బీఎంఐ 23 కంటే ఎక్కువున్నవాళ్లు) బరువు తగ్గేందుకు మాత్రమే కీటోడైట్‌ వంటి ప్రయోగాలు చేసుకోవచ్చేమోగానీ.. కేవలం మధుమేహం తగ్గించుకోవటం కోసమే ఇలాంటి ప్రయోగాలు చెయ్యటం అస్సలు శ్రేయస్కరం కాదు! ముఖ్యమైన విషయం ఏమంటే- బరువు తగ్గేందుకు చేసే ఇలాంటి ఆహార ప్రయోగాలతో మధుమేహం తగ్గినట్లు కనబడినా అది తాత్కాలికమేనని గుర్తించాలి. ఇలాంటి పరిశోధనలు/ప్రయోగాలేవీ కూడా 3-4 నెలలకు మించి చేసిన దాఖలాల్లేవు. 3-4 నెలలు ఈ డైట్‌ను పాటిస్తే ఆ ప్రభావంతో తర్వాత కూడా కొద్ది వారాలు, నెలల పాటు మధుమేహం అదుపులో ఉన్నట్టే ఉండొచ్చు (లెగసీ ఎఫెక్ట్‌). కానీ ఈ ప్రయోజనాలు శాశ్వతంగా ఉంటాయనుకోకూడదు. కాబట్టి అందరూ బరువు తక్కువగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇందుకు పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు.. ఈ మూడూ తగుపాళ్లలో ఉండే సమతులాహారం తీసుకుంటూ, వాటి మొత్తం పరిమాణాన్ని తగ్గించుకుని, మితంగా తింటూ నిదానంగా బరువు తగ్గించుకోవటమే ఉత్తమం.