షిలాజిత్ యొక్క అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకోండి | అన్ని అనారోగ్యాలు దూరం చేసుకోండి | Shilajit Uses
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి చాలా మంది అనేకరకాల సప్లిమెంట్లు, మల్టీవిటమిన్స్ ,ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, బీ కాంప్లెక్స్, విటమిన్ సి, కాల్షియం, బరువు తగ్గడానికి గ్రీన్ టీ, రకరకాల టానిక్స్, ప్రొటన్ కోసం ప్రొటీన్ పౌడర్, వీటివలన ఎటువంటి దుష్ప్రభవాలు లా కపోయినా ఇన్ని రకాలు వాడకుండా షీలాజిత్ ఒక చిటికెడు తీసుకుంటే మీ ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి.
షీలాజిత్ అమృతంలాంటిది.దీనిని పూర్వకాలం నుండి అనేక వైద్య విధానాలలో వాడతారు. శారీరిక, మానసిక శక్తిని పెంచడానికి వాడతారు. షీలాజిత్ అనగానే పురుషులలో శృంగారశక్తిని పెంచే గుళికలు అనుకుంటారు. అలా అనుకుంటే అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పోగొట్టుకున్నట్టే. ఇది సహజసిద్ధమైన ఆయుర్వేద ఔషధం. అనేక రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చు.
బరువు పెరగడం తగ్గడం కూడా ఈ షీలాజిత్ తో సాధ్యమే. షీలాజిత్ లో ఉండే ఔషధం ఏంటి. అది శరీరంపై ఎందుకు ఇంతబాగా పనిచేస్తుంది అని. ఇందులో పుల్విక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అది శరీరంలో ఉండే సెల్యురిక్ మెమరిన్స్ ద్వారా శరీరమంతా ప్రయాణిస్తుంది. అందుకే మన షరీరంపై దీని ప్రభావం చాలా త్వరగా కనిపిస్తుంది. కొన్నిరోజుల్లోనే మీ శరీరంపై జుట్టుపై చర్మంపై మెదడుపై దీని అద్బుత ప్రభావం చూపడం మొదలుపెడుతుంది.
అనేక చర్మ సమస్యలు తగ్గిస్తుంది. అలసట, నీరసంతో బాధపడుతున్నా షీలాజిత్ మీకు మంచి ఔషధం. రకరకాల వయసుల వారు షీలాజిత్ ఎలా ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకుందాం. అలాగే ఎవరెవరు తీసుకోకూడదో కూడా తెలుసుకుందాం. షీలాజిత్ ని పర్వతాలనుండి సేకరిస్తారు. హిమాలయాల్లో చివరి పర్వతంపైన ఉండే జిగురు ఈ షీలాజిత్. కొన్ని రకాల చెట్లపైనుండి వచ్చే జిగురులా పర్వతంనుండి వస్తుంది ఈ షీలాజిత్.
దీనిని పర్వతం యొక్క చమురు అంటారు. దీనిని పర్వతాల నుండి తీసాక శుద్ధి చేసి ఫిల్టర్ చేస్తారు. తర్వాత ఘన లేదా ద్రవ రూపంలో అమ్ముతారు. ఆయుర్వేద షాపుల్లో లేదా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. గుళికల రూపంలో కల్తీ జరిగే అవకాశం ఉంటుంది. కనుక ద్రవరూపంలో ఉన్నది తీసుకోవాలి. పెద్దలకయితే 150 నుండి 250 మిల్లీగ్రాముల వరకూ తీసుకోవచ్చు. రోజుకు ఆరొందల మిల్లీగ్రాములకు మించి తీసుకోకూడదు.
ద్రవరూపంలో అయితే చెంచా వెనుక నుండి అంగుళంలోపు ద్రవంలో ముంచి ఎంత వస్తే అంత వేడినీటిలో వేసి కలపాలి. అల్పాహారం కి అరగంట ముందు తీసుకోవాలి. ఎప్పుడూ పొయ్యి పై షీలాజిత్ మరిగించకూడదు. వేడినీటిలో మాత్రమే కలిపి తాగాలి. పిల్లలకయితే చిన్న బియ్యంగింజల్లా ఉండే గుళికలు చేసి ఇవ్వాలి. ద్రవం రూపంలో అయితే రెండు చెంచాలు నీళ్ళు కలిపిన ద్రవం తాగించవచ్చు. ఇది శరీరంలోని అన్ని అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
అలాగే గర్బవతులు, పన్నెండేళ్ళలోపు పిల్లలు, ఐరన్ శాతం శరీరంలో ఎక్కువగా ఉన్నవారు తీసుకోకూడదు. గుండెసంబంధ వ్యాధులు, హైబీపీ ఉన్నవారు, హైఫీవర్ ఉన్నవారు , హర్మనల్ టాబ్లెట్స్ వాడేవారు తీసుకోకూడదు. శరీరంలో వేడి ఎక్కువగా చేస్తుంది కనుక చలికాలంలో మాత్రమే వాడాలి. మూడు నెలలకు మించి వాడకూడదు. తర్వాత నెల గ్యాపిచ్చి వాడుకోవచ్చు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, నికెల్, స్టోర్నీటియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్ని శరీరాన్ని ఆరోగ్యంగా చేయడంలో దోహదపడతాయి.
షీలాజిత్ గురించి మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
1 కామెంట్:
nice article i read this article and my 100 % of doughts cleared thanks
please visit my site and suggest your openion
https://www.prajavaradhi.com
కామెంట్‌ను పోస్ట్ చేయండి