19, సెప్టెంబర్ 2019, గురువారం

ప్రాణాయామ వాళ్ళు ఉపయోగం ఏమిటి నవీన్ నడిమింటి సలహాలు

*Universal Breathing – Pranayama యోగ వలన ఆరోగ్యం మెరుగుపడినప్పటికి ప్రాణాయామ వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి...*

     Stressed? Balance your life and experience a relaxed meditative state to relieve your daily stresses and tensions. Pranayama’s simple and intuitive guide to deep breathing features a progressive course based on the principles of yoga, to help you find balance and stress relief.
Continue reading
 
   యోగా, ద్యానం !
.
యోగా, ద్యానం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చాలామంది
నమ్ముతారు.
యోగా మార్గంలోని (8) యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యహార,
ద్యాన, దారణ, సమాది ల లో ద్యానానికి అదిక ప్రాదాన్యత ఇస్తారు. దైవ భక్తి
ఉన్నవారైతే యోగాద్యానం తో ఏకంగా దేవుడినే దర్శించవచ్చని
ఆశపడుతారు.
"యోగా, ద్యానం ఆభగవంతున్ని భక్తున్ని దగ్గరకు చేస్తుందని
అనాధిగా వస్తున్న నమ్మకం".
అయితే ద్యానం వల్ల కలుగుతాయని నమ్మే ఉపయోగాలను పాయింట్స్
వారిగా చూద్దాం.
1.ద్యానం తో ఎన్నో మొండి జబ్బులు నయమవుతాయి.
2.ద్యానం మన ఆలోచనలు అలజడిని తగ్గిస్తుంది. తద్వార ఎంతో
మానసిక ప్రశాంతత మనశ్శాంతి పొందవచ్చు.
3.విధ్యార్థుల లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
4.యోగాలోని ఒక్కోఆసనంతో ఒక్కో జబ్బును నయం చేయవచ్చు.
యోగాద్యానంలోని ఒక్కోవెరైటీ (సిద్దసమాదియోగ, కుండళియోగ, పిరమిడ్ యోగ)
ఒక్కో ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుతూ, సిద్దులను పొందుతూ
జబ్బులను సైతం నయంచేయవచ్చు.

కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది.మూలాధారం లో దాగివున్న ఈ కుండలినీ శక్తినిసుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.

శక్తి రెండు రకాలుగా ఉంటుంది.

ఒకటి స్థితి శక్తి (Potential Energy),

రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy).

 శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయవచ్చు. కామ, క్రోధ,లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.

కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు

దేహ శుద్ధి (purification of body),
నాడీ శుద్ధి (purification of nadis/nervous system),
మనో శుద్ధి (purification of mind),
బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి.

నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.

చక్రాలు

వెన్నెముక లో ఉండే చక్రాలు

ప్రధాన వ్యాసం: సప్తచక్రాలు

షడ్చక్రాలు లేదా సప్తచక్రాలు మన శరీరంలోని వెన్నుపూస లోనున్న ప్రదేశాలు.

మూలాధార చక్రము (Mooladhara) : గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం లం. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

స్వాధిష్ఠాన చక్రము (Swadhisthana) : లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం వం.

మణిపూరక చక్రము (Manipura) : నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము. దీని బీజ మంత్రం రం.

అనాహత చక్రము (Anahatha) : హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం యం.

విశుద్ధి చక్రము (Vishuddha) : కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజ మంత్రం హం.

ఆజ్ఞా చక్రము (Ajna) : భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం ఓం.

సహస్రార చక్రము (Sahasrara) : బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానమునెరిగిన నరునకు పునర్జన్మలేదు.
Yoga and Ayurveda is much more than asanas and diet. Extends to the healing of mind and consciousness through pranayama, mantra and meditation.
Note our special online course on the interface of Pancha Kosha Yoga and Pancha Kosha Ayurvveda, examining the entire human being from body, prana and mind to Pure Consciousness.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
 9703706660
  *సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: