18, సెప్టెంబర్ 2019, బుధవారం

ముఖము క్రాంతి వంతం గా రావాలి అంటే అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు

1,కలబంద గుజ్జులో రోజ్ వాటర్ వేసి బాగా కలిపి మొహానికి అప్ప్లై చేసి బాగ రుద్దాలి .తరువాత చల్లటి నీళ్లతో కడగాలి వారానికి ఒకసారి ఇలా చేయడం వలన పిగ్మెంటేషన్ మచ్చలు తొలగిపోతాయి.

2,కలబంద ఆకులను ముల్లులు తీసేసి ముక్కలుగా చేసుకుని వాటిని ఒక గిన్నెలొ నీళ్లుపోసి దాంట్లొ వెసి ఉడకబెట్టాలి చల్లారిన తరువాత పేస్టు చూసుకోవాలి దీంట్లో ఉడకబెట్టిన నీరును పడబోయకుండా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం తేనె వేసీ బాగ కలిపి పేస్ కి అప్ప్లై చేయాలి ఇలా వారానికి రెండు మూడుసార్లు చేయాలి ఒక అరగంట తరువాత చల్లటి నీళ్లతో కడగాలి.

3,కలబంద గుజ్జులో పెరుగు బాగా కలిపి మొహానికి మెడకు పెట్టి రుద్దాలి ఆరిన తరువాత కడుక్కొవాలి ఇలా చేయడం వలన చర్మంపై ఉండే మురికి రాషెష్ తొలగిపోతాయి .ఇది చాల అద్భుతంగా పని చేస్తుంది.

4,కలబంద గుజ్జులో ఖర్జూర పేస్టు నిమ్మరసం వేసి బాగ కలిపి మొహానికి అప్ప్లై చూసి అరగంట తరువాత చల్లటి నీటితో కడిగెయ్యాలి దీనితో పొడిబారిన చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది వారానికి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది .

5,అరటిపండును ముక్కలుగా చేసి మిక్సిలో పేస్టు చేసుకుని దాంట్లొ కలబంద గజ్జు నిమ్మరసం వేసీ బాగ కలిపి పేస్ కి అప్ప్లై చూసి 20 నిమిషాల తరువాత కడిగెయ్యాలి దీంతో చర్మం కాంతివంతంగా అవుతుంది .

6,ఓట్స్ లో కలబంద గజ్జు నిమ్మరసం కలిపి మొహానికి అప్ప్లై చేసి గుండ్రంగా మసాజ్ చేయాలి ఒక పదినిమిషాల తరువాత కడిగేయాలి తద్వారా చర్మం మీది మృతకణాలు తొలగిపోయి చర్మం నున్నగా కాంతివంతంగా అవుతుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు: