16, అక్టోబర్ 2019, బుధవారం

కెళ్ళునొప్పులు జాయింట్ నొప్పులు తగ్గాలి అంటే

*కీళ్లనొప్పులు నివారణ తీసువలిసిన జాగ్రత్తలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

     నొప్పి అనేది  వినడానికి చిన్న సమస్యలా ఉన్నా ఆ సమస్యతో ఇబ్బంది పడేవారికి మాత్రమే తెలుస్తుంది. అదెంత పెద్ద ఇబ్బందో!
చాలామంది కీళ్లనొప్పులు వేధిస్తే.. కదలకుండా మంచానికి పరిమితం అవ్వడమో, వ్యాయామాలు చేస్తే ఆ నొప్పులు ఇంకా బాధిస్తాయనే భ్రమలో వాటికి దూరంగా ఉండటమో చేస్తారు. ఏవో కొన్ని పరిస్థితుల్లో తప్పించి తక్కిన వాటికి వ్యాయామం మేలే చేస్తుందని అంటున్నారు నిపుణులు...
       ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు రోజూ వ్యాయామం చేయడం ద్వారా కీళ్ల నొప్పులను దూరంపెట్టొచ్చని తాజా పరిశోధనలో వెల్లడైంది. శరీర జీవక్రియకు, ఆస్టియోఆర్థరైటి్‌సకు మధ్య సంబంధంపై సర్రే యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. పోషక పదార్థాలు పెద్దగాలేని ఆహారం తీసుకోవడం, రోజులో ఎక్కువ భాగం కూర్చుని ఉండే జీవనశైలితో శరీరంలోని కణాలపై చెడు ప్రభావం పడుతుందని తేలింది. ఫలితం గా సదరు కణాల ఉత్పాదక సామర్థ్యం పడిపోతుంది. ఈ పరిణామాలన్నీ గ్లూకోజ్‌ ఉత్పత్తి పెరగడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
*👉🏿కీళ్లనొప్పులు:-*
         వెల్లులిని తీసుకొని పేస్ట్ లా చేసుకోవాలి ఆ పేస్ట్ ని కొబ్బరి నూనెతో కలిపి మర్దన చేసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

*👉🏿వేయించిన జిలకర్రను సగం పచ్చి జిలకర్రను నూరి దానికి సమానముగా చెక్కెర కలిపి రోజు మూడు పూటలా అర చెంచా చొప్పున 10-15 రోజులు*

*👉🏿రోజూ మీరు తీసుకునే ఆహారంలో చింతపండును తగ్గించండి. కొత్త చింతపండును ఆహారంలో తక్కువగా తీసుకుంటే. అది మన శరీరంలోని ఎముకల చుట్టూ ఉన్న కార్డిలేజ్‌కు ఎలాంటి ముప్పు తలపెట్టదు.*

అలాగే బంగాళాదుంపలు వంటివి ఆహారంలో ఎక్కువగా చేర్చుకోకండి.

పసుపు పొడి, వెల్లుల్లి పాయలను తీసుకుని బాగా పేస్ట్ చేసుకుని మోకాలి పట్టిస్తే కీళ్ల నొప్పులు మటుమాయం అవుతాయి.

*👉🏿ఇంకా కూల్‌డ్రింక్స్‌ను తీసుకోవడం ద్వారా ఎముకలు బలహీన పడతాయి. కాబట్టి కూల్‌డ్రింక్స్‌ను తాగడం ఆపేస్తే మంచిది.*

*👉🏿 కీళ్లనొప్పులు, పైనాపిల్‌ తింటే ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. కారణం ఈ బ్రొమిలైన్‌కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా మెండు. అయితే దీన్ని ఉదయం భోజనం అయిన తరువాత అంటే మధ్యాహ్న సమయంలో తింటే మంచిది.*

*👉🏿ఆముదపు గింజల పొట్టు తీసివేసి మెత్తగా నూరాలి. అందులోంచి చెంచా ముద్దను ఒక గ్లాసు ఆవు పాలతో కాచి సేవిస్తే, నరాల నొప్పి, సయాటికా నొప్పి తగ్గిపోతాయి.*

ఒక చెంచా ఆముదాన్ని, 50 మి.లీ శొంఠి కషాయంతో కలిపి సేవించినా ఈ కీళ్లనొప్పులు, సయాటికా నొప్పి నుంచి బయటపడవచ్చు.

6 గ్రాముల ఆముదపు వేరు పొడిని రోజుకు రెండు సార్లు సేవిస్తే మెడనొప్పి, నడుము నొప్పి తగ్గుతాయి.

ఓ నాలుగైదు ఆముదపు చిగుళ్లను ఒక వెల్లుల్లితో కలిపి నూరి ఆ ముద్దను రోజుకు రెండు సార్లు సేవిస్తే పచ్చకామెర్లు తగ్గుతాయి అయితే దీనికి తోడు ఉప్పులేకుండా ఉడికించిన మినుప కుడుమును కూడా ఆహారంగా తీసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది.

*👉🏿త్రిఫలా కషాయంలో కాస్తంత ఆముదం వేసి తాగుతూ ఉంటే అర్శమొలల వ్యాధి తగ్గుతుంది*.

ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కీళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు.
*👉🏿తుంటినొప్పులు, భుజాలనొప్పులు, వెన్ను, మోకాళ్లు, మడమల నొప్పులు.... వంటివి మన ఆనందాలని దోచుకుంటాయి. తోటపని, ఇంటిపని, వంటపని వంటి చిన్నచిన్న పనులు చేసుకోవడానికి కూడా సహకరించవు. కానీ సరైన వ్యాయామాలని సరైన పద్ధతిలో చేస్తే కనుక ఈ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని అంటున్నారు నిపుణులు* వ్యాయామం చేయడం వల్ల కీళ్ల దగ్గర, వాటి చుట్టూ ఉండే కండరాలు, కండర బంధనాలు బలపడి వాటి కదలికలు సులభంగా జరిగేటట్టు చేస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజూ పరిమితంగా వ్యాయామం చేయడం వల్ల సైనోవియల్‌ ద్రవం విడుదలయి తుంటి, నడుము ప్రాంతాల్లో ఒత్తిడిని తగ్గించి, బిగదీసుకుపోయినట్టుగా ఉండే సమస్య అదుపులోకి వస్తుంది. కీళ్లలో ఉండే సైనోవియల్‌ ద్రవం.. సహజంగా ఆక్సిజన్‌ విడుదల అయ్యేటుట్టు చేసి, ఎముకలకు కావాల్సిన పోషకాలని కూడా అందిస్తుంది. ఓ రకంగా ఈ ద్రవం సహజ నొప్పి నివారిణి అన్నమాట. అదే వ్యాయామం లేకపోతే లిగమెంట్లు ఎక్కడికక్కడ బిగదీసుకుపోతాయి. తుంటి, మోకాళ్లు, నడుము వంటి బరువుపడే ప్రాంతాలకు ఈ ద్రవం రక్షణ కవచంలా పనిచేస్తుంది. అన్నింటికి మించి వ్యాయామం... శరీరం సంతోషంగా ఉండటానికి కావాల్సిన హార్మోన్లని విడుదల చేస్తుంది.
*ధన్యవాదములు 🙏*
 *మీ నవీన్ నడిమింటి*
  *సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

i

కామెంట్‌లు లేవు: