10, అక్టోబర్ 2019, గురువారం

డెంగ్యూ పేవర్ వచ్చాక తీసుకోవాలిసిన జాగ్రత్తలు

*డెంగ్యూ ఫీవర్ యొక్క లక్షణాలు నివారణ పరిష్కారం మార్గం నవీన్ నడిమింటి సలహాలు*

ఈ వైరస్ సోకిన మొదటి 2 నుండి 4 రోజుల వరకు ఇది మన రక్తంలో ప్రవహిస్తూ క్రమంగా క్రింద చెప్పిన కొన్ని లక్షణాలను చూపుతుంది.

అకస్మాత్తుగా, అధిక జ్వరం (38°C/ 100°F)
తీవ్రమైన తలనొప్పి
కళ్ల వెనుక నొప్పి
తీవ్రమైన కీళ్ల మరియు కండరాల నొప్పి
అలసట
వికారం
వాంతులు
శోషరస వ్యవస్థ చెడిపోవటం
రక్తప్రసరణ వ్యవస్థ యొక్క వైఫల్యం
చర్మపు దద్దుర్లు (ఇవి జ్వరం ప్రారంభమయిన రెండు నుండి ఐదు రోజుల తర్వాత కనిపిస్తాయి)
స్వల్ప రక్తస్రావం (ముక్కు రక్తస్రావం, చిగుళ్లలో రక్తస్రావం లాంటివి)
రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతుంది.
చాలా మందిలో ఈ వ్యాధి యొక్క లక్షణాలు చాలా తేలిక పాటుగా ఉంటాయి, కనుక అది కేవలం మామూలు జ్వరం అని లేదా వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ అని పొరపాటుపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ‘ డెంగ్యూ హెమోర్రేజిక్ జ్వరం’ అనే పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. ఇది భారీ రక్తస్రావం, షాక్ మరియు మరణానికి దారితీయవచ్చు. దీనిని ‘డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DSS)’ అని అంటారు.

*☝పై చెప్పిన లక్షణాలు మీలో కనిపించినట్లయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి*. డెంగ్యూ వ్యాధిని కనుగొనేందుకు వైద్యులు రక్త పరీక్షలు చేస్తారు.

*డెంగ్యూ చికిత్స*

డెంగ్యూ జ్వరంకు ప్రత్యేకమైన చికిత్స ఇంకా కనుగొన లేదు. రోగులు వైద్య సలహాలను తీసుకుంటూ, విశ్రాంతి తీసుకోవాలి మరియు పుష్కలంగా ద్రవాలను త్రాగాలి. తీవ్రమైన డెంగ్యూ జ్వరం వచ్చినట్లయితే పూర్తిగా నయం అయ్యే వరకు వైద్యులు మరియు నర్సులచే పూర్తి వైద్య సంరక్షణ తీసుకోండి.

*డెంగ్యూ నివారణ పద్ధతులు*

డెంగ్యూని నిరోధించడానికి ఇంకా టీకాలను కనుగొన లేదు. దీనికి ఒక ఉత్తమమైన పద్దతి దోమల కాటులను నివారించడం మరియు దోమల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలను చేయండి.

*పర్యావరణ నిర్వహణ*

మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి రోజు ఇంటిలోని చెత్తను డిస్పోజ్ చేయాలి. ఎక్కడా చెత్త చేరకుండా చూసుకోవాలి. చిన్న చిన్న తొట్లలో లేదా పాత్రలలో నీరు చేరకుండా చూసుకోవాలి. నీటిని సరఫరా చేసే పద్దతులను మార్చాలి. ప్రతి చోటా పైపులను బిగించి వాటి ద్వారా నీటిని సరఫరా చేయాలి. ఇలా చేయటం వలన దోమల ఉత్పత్తి తగ్గుతుంది.

*జీవ నియంత్రణ*

దోమల యొక్క ఉత్పత్తిని తగ్గించేందుకు నీటిలో చేపలను వదలండి. ఎందుకంటే ఈ చేపలు దోమల యొక్క గుడ్లను తినడం ద్వారా వాటి సంఖ్యను తగ్గించడంలో తోడ్పడుతుంది.

*కెమికల్ స్ప్రే*

కెమికల్ స్ప్రే ను ఉపయోగించి కూడా దోమలను అరికట్టవచ్చు. కానీ వీటికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ కెమికల్స్ ని మనం తినే ఆహారాలపై ఉపయోగించ కూడదు. ఇవి నిరంతర రక్షణ ఇవ్వనప్పటికీ తక్షణ పరిష్కారాలను ఇస్తాయి.

*ఇంటి లోపల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు*

వీలైనంత వరకు, భారీ నివాస ప్రాంతాల నుండి దూరంగా ఉండండి.

ఇంట్లో కూడా మస్కిటో రెపెలెంట్స్ ఉపయోగించండి.
బయటకి వెళ్ళేటప్పుడు, పొడవైన స్లీవ్ చొక్కాలు మరియు పొడవైన ప్యాంటులను ధరించాలి.
ఇంట్లో ఉన్నప్పుడు, ఎయిర్ కండిషనింగ్‌ను వాడండి.
కిటికీ మరియు తలుపు తెరలు సురక్షితంగా మరియు రంధ్రాలు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోండి.
పడుకొనేటప్పుడు దోమ తెరలను ఉపయోగించండి.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఎవరికీ వ్యక్తిగతంగా మందులు సూచించడం జరగదు..దయచేసి గమనించండి.

"మీ ఫేమిలీ డాక్టరుని గాని..దగ్గరలో డాక్టరుని గాని సంప్రదించండి..ఇంకాఏదైనా వ్యాధి వివరాలు కావాలంటే ఈ గ్రూపులో నేను ముందు పెట్టిన పోస్టులు చూడండి..అవగాహన పెంచుకోండి... *ఎవరికీ మందులు సూచించడం ఈ గ్రూపులో సాధ్యం కాదు*"


సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: