10, డిసెంబర్ 2020, గురువారం

జ్ఞాపశక్తి పెరగాలి పెరగాలి అంటే (మతి మరుపు పిల్లలు కు )తీసుకోవాలిసిన డైట్ ప్లాన్ నవీన్ సలహాలు


జ్ఞాపకశక్తి కోల్పోవడమనే రుగ్మత అంటే ఏమిటి?

జ్ఞాపకశక్తి కోల్పోవడం అనే రుగ్మతనే “మతి మెరుపు” అని కూడా అంటారు. ‘మర్చిపోవడమ’నే దానికి ‘మతి మరుపు’ లేక ‘జ్ఞాపకశక్తి కోల్పోవడమ’నేది ఓ అసాధారణమైన రూపం. మతిమరుపు కల్గిన వ్యక్తి కొత్తగా రాబోయే సంఘటనలను మర్చిపోవచ్చు లేదా గతంలో కొన్ని జ్ఞాపకాలనూ మర్చిపోవచ్చు, లేదా కొన్నిసార్లు ఈ రెండింటినీ-అంటే రాబోయేవాట్ని, గత జ్ఞాపకాల్ని కూడా మర్చిపోవచ్చు. వయసు-సంబంధ జ్ఞాపకశక్తి కోల్పోవడమనే రుగ్మత సాధారణం మరియు సాధారణంగా తీవ్రమైనది కాదు. “వృద్ధాప్య చిత్తవైకల్యం” అని దీన్ని పిలుస్తారు. మీ తాళంచెవుల్ని (keys) లేదా గొడుగు లేదా గడియారాన్ని చివరిగా ఎక్కడ ఉంచారో మర్చిపోవడమనే దాన్ని మామూలుగా అనుకున్నట్టు “జ్ఞాపకశకి కోల్పోవడం”  అనరు. మీ తర్కం, తీర్పు, భాష మరియు ఇతర ఆలోచనా నైపుణ్యాలతో మీ జ్ఞాపకశక్తి నష్టం జోక్యం చేసుకుంటే, ఇది “చిత్తవైకల్యం” (dementia) అని పిలవబడుతుంది మరియు దీనికి వైద్యునిచే ఒక వివరణాత్మక పరిశోధన అవసరం.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మెమరీ నష్టంతో సంబంధం ఉన్న అత్యంత సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

  • పాత సంఘటనలు లేదా మరీ ఇటీవలి సంఘటనలను మరచిపోవటం
  • తగ్గిన ఆలోచనా సామర్థ్యం
  • నిర్ణయాలు తీసుకోవడంలో సమస్య
  • ఒక సంక్లిష్ట విధిలో దశల క్రమాన్ని గుర్తుచేసుకోవడంలో సమస్య

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మరచిపోవడమనేదాన్లో కొంత మొత్తం వృద్ధాప్యంతో సంబంధం కలిగి ఉన్న ఒక సహజ దృగ్విషయం. వయసు-సంబంధ జ్ఞాపకశక్తి నష్టానికి కారణాలు:

  • మెదడు యొక్క ఏ భాగానికైనా దెబ్బ తగలడంవల్ల నష్టం, ఇది కిందివాటివల్ల  కావచ్చు:
  • కింది మానసిక రుగ్మతల వంటివాటి కారణంగా జ్ఞాపకశక్తి నష్టం
  • జ్ఞాపకశక్తి నష్టం చిత్తవైకల్యం యొక్క చిహ్నంగా కనిపించవచ్చు:
  • ఫ్రంటోటెంపరల్ డిమెన్షియా
  • లెవీ బాడీ చిత్తవైకల్యం (మెదడులో ఆల్ఫా-సైనూక్లిన్ అనే ప్రోటీన్ అసాధారణంగా జమవడంవల్ల వచ్చే రుగ్మత)  
  • ఇతర కారణాలు:
    • మద్యపానం లేదా మాదకద్రవ్య వ్యసనం
    • మూర్ఛ
    • థయామిన్ పోషక పదార్ధం లోపం వలన కొర్సాకోఫ్ రుగ్మత

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

జ్ఞాపకశక్తి కోల్పోవడమనే రుగ్మత నిర్ధారణకు, డాక్టర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలకు మీ సమాధానాలు మీ ఆలోచనా సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తిని నిర్ణయిస్తాయి. జ్ఞాపకశక్తి నష్టం రుగ్మతను సరి చేయగల కారణాలను గుర్తించడంలో సహాయపడే ఇతర పరీక్షల్లో కొన్ని ఇలా ఉన్నాయి:

  • ప్రత్యేక అంటువ్యాధులు లేదా పోషక స్థాయిలు గుర్తించడం కోసం రక్త పరీక్షలు
  • CT స్కాన్ మరియు MRI వంటి మెదడు ఇమేజింగ్ పద్ధతులు
  • అభిజ్ఞాత్మక (కాగ్నిటివ్) పరీక్షలు
  • కటి రంధ్ర పరీక్ష (లేక లుంబార్ పంక్చర్)
  • సెరిబ్రల్ ఆంజియోగ్రఫీ

జ్ఞాపకశక్తి కోల్పోవడమనే రుగ్మతకు చికిత్స ఆ పరిస్థితి కారణంపై ఆధారపడి ఉంటుంది. పోషకాహార లోపం విషయంలో, అనుబంధకాహారాల సేవనం జ్ఞాపకశక్తి నష్టాన్ని సులభంగా సరి చేస్తుంది. వయసు సంబంధిత జ్ఞాపకశక్తి నష్టం మరియు అల్జీమర్స్ వ్యాధి వంటి కొన్ని పరిస్థితులు పూర్తిగా నయం చేయబడవు. అంటువ్యాధులకు సంబంధిత సూక్ష్మజీవనాశక మందులతో (యాంటీమైక్రోబియల్స్తో) చికిత్స చేయవచ్చు. కొన్ని వ్యసనాల్ని అధిగమించడానికి కుటుంబం మద్దతు, వృత్తిపరమైన సలహాలు మరియు వ్యక్తియొక్క ఒక బలమైన దృఢ నిశ్చయం అవసర

జ్ఞాపకశక్తి కోల్పోవడం అలౌపతి కొరకు మందుల

Medicine NamePack Size
DonepDonep 10 Tablet
Dr. Reckeweg Kali Brom 3x TabletDr. Reckeweg Kali Brom 3x Tablet
Schwabe Aethusa cynapium MTSchwabe Aethusa cynapium MT
Schwabe Anacardium orientale CHSchwabe Anacardium orientale 10M CH
Bjain Anatherum muricatum Mother Tincture QBjain Anatherum muricatum Mother Tincture Q
ADEL 2 Apo-Ham DropADEL 2 Apo-Ham Drop
Schwabe Anatherum muricatum CHSchwabe Anatherum muricatum 12 CH
Bjain Cannabis indica DilutionBjain Cannabis indica Dilution 1000 CH
SBL Euonymus atropurpurea DilutionSBL Euonymus atropurpurea Dilution 1000 CH
ADEL 36 Pollon DropADEL 36 Pollon Drop
Bjain Withania somnifera Mother Tincture QBjain Withania somnifera Mother Tincture Q
Schwabe Aethusa cynapium LMSchwabe Aethusa cynapium 0/1 LM
ADEL 40 And ADEL 86 KitAdel 40 And Adel 86 Kit
SBL Hydrocotyle Asiatica LMSBL Hydrocotyle Asiatica 0/1 LM
ADEL 48 Itires DropADEL 48 Itires Drop
Schwabe Anacardium orientale LMSchwabe Anacardium orientale 0/1 LM
Bjain Conium Maculatum DilutionBjain Conium Maculatum Dilution 1000 CH
Dr. Reckeweg Anacardium Ori DilutionDr. Reckeweg Anacardium Ori Dilution 1000 CH
ADEL 51 Psy-Stabil DropADEL 51 Psy-Stabil Drop
ADEL Anacardium Ori DilutionADEL Anacardium Ori Dilution 1000 CH
SBL Kali Bromatum LMSBL Kali Bromatum 0/1 LM
ADEL 6 Apo-Strum DropADEL 6 Apo-Strum Drop
Schwabe Anacardium orientale MTSchwabe Anacardium orientale MT


*మతి  మరుపు (LOSS OF REMEMBRANCE) ఎందు వలన కలుగుతుంది ? దీనిని అధిగమించడం ఎలా ? అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

ప్ర : మతి మ రుపు  (LOSS OF REMEMBRANCE)  అంటే ఏమిటి ? మతి మ రుపు  ఎందు వలన కలుగుతుంది ? దీనిని  అధిగమించడం ఎలా ?

మతి మ రుపు  (LOSS OF REMEMBRANCE)  అంటే ఏమిటి ?

జ : మతి మరుపు  (LOSS OF REMEMBRANCE) అనగా  జరిగిన, జరుగ బోయే  సంఘటనలు  , చేసిన , చేయ బోయే  పనులు  మరియు  పేర్లు , వస్తువులు  గుర్తు లేక పోవడం  , బంధు మిత్రులను గుర్తు పట్టలేక పోవడం , మరిచి పోవడం  మొదలైన వాటిని  మతి మరుపు  అంటారు . ఒక్కోసారి  మన  మైండు , అనుకోకుండానే  ఆన్  క్యాన్సియస్  లోకి వెళ్లి పోతుంది . ఎంతటి తెలివి గల వారైనా , క్షణ క్షణం ఎన్ని జాగ్రత్తలు  తీసుకున్నా ,  ఒక్కో సారి  మతి మరుపు  బారినుండి  ఎవ్వరూ  తప్పించుకోలేరు . ఎవ్వరూ ఎదో ఒకటి  పోగొట్టుకో కుండా  , మరిచి పోకుండా  ఉండ లేరు . ఇది నగ్న సత్యం . అంత మాత్రాన   వీరిని  తెలివి తక్కువ  వారు  అని గాని, ఎందుకు  పనికి  రాని  వారు అని గాని  అనడం , నిందించడం  తగదు.   ఒక సారి   గొప్ప శాస్త్ర వేత్త ' ఆల్బర్ట్  ఐనస్టీన్' డబ్బులు  డిపాజిట్  చేద్దామని  బ్యాంకుకు  వెళ్ళాడట .  గొప్ప  శాస్త్ర  వేత్త  కాబట్టి , తెలిసిన వారు దగ్గర వచ్చి  పలకరించడం  , నమస్కరించడం  చేస్తున్నారు . డబ్బులు డిపాజిట్ చేద్దామని  వచ్చాక  తన పేరునే  మరిచిపోయాడు . అప్పుడు  అతను  తన ప్రక్కనున్న వారిని  తన  పేరు ఏమిటో  చెప్పమన్నా డట .  వారు ముందుగా ఆశర్యపోయినా  చెప్పక తప్పలేదు . మీ పేరు  ' ఆల్బర్ట్  ఐనస్టీన్'  అని చెప్పారట .  దీని బట్టి మనకు ఏమి అర్ధమవుతుంది . మాటి  మాటికీ  పిల్లలను గాని , పెద్దలను గాని  , మతి మరుపు  అని అనడం వలన , నిందించడం వలన మతి మరుపు  అనేది మరింత  పెరిగే అవకాశం  ఉంది.  మతి  మరుపు  అనేది  ఒక జబ్బు కాదు . ఇది దీర్ఘ కాలం  ఉండదు .  
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

👉🏾మతి మరుపు  ఎందు వలన కలుగుతుంది ? 

మతి  మరుపు కలగడానికి  అనేక మైన కారణాలను  చెప్పుకోవచ్చు . అందులో ముఖ్యమైన  కారణాలు :

01. పుట్టుకతోనే , జన్యు పరమైన  మానసిక లోపాలుండటం  వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

02.  అనారోగ్యం  బారిన పడటం . ఉదా : తీవ్ర  జ్వరం , హై  బి . పి  ,  టైపు 2  షుగర్  వ్యాధి , క్యాన్సర్  ,  మూర్ఛ  , హార్ట్ అటాక్ , దీర్ఘ కా ల వ్యాధులు  మొ. లైన  వాటి వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

03.  ఒక్కో  సారి  కొన్ని  కుటుంభ సమస్యల వలన లేదా  బయటి సమస్యల వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు .

04.  కొన్ని  అనుకోని సంఘటనల  వలన  మనసు కంట్రోల్ తప్పి  మతి మరుపు  ఏర్పడవచ్చు .

05. ఆర్ధిక  , సామజిక , రాజకీయ , శారీరక  బాధల  వలన , ఆందోలనల  వలన మతి మరుపు  ఏర్పడవచ్చు .

06. ఆహార లోపం  వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు .

07.  చుట్ట , బీడీ , సిగరెట్లు  త్రాగడం వలన  మరియు  పొగాకు , తంబాకు నమలడం వలన , మత్తు పదార్ధాలు , డ్రగ్స్ వాడటం వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు .

08. రెగ్యులర్  గా  మాంసాహారం  తీసుకోవడం  వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

09. ఇష్టం  లేని  వ్యక్తులు  తారస పడినా , ఇబ్బంది  అనిపించే  వ్యక్తులు  ఇంటికి వచ్చినా , ఇష్టం  లేని  వ్యక్తుల తో  ప్రయాణం చేసినా  , షాపింగ్ చేసిన మైండు కంట్రోల్ తప్పి , మైండ్  ఆన్  క్యాన్సియస్  లోకి వెళ్లి పోతుంది  . అప్పుడు ఏమి జరిగింది , జరుగా బోయేదేదో   గుర్తుండదు .  మన పంచేంద్రియాలు  అచేతనంగా  ఉంది పోతాయి .  ఆ విధంగా  చేతిలోని  స్టీరింగ్  చేయి సడలి  ఆక్సిడెంట్లు  కావచ్చు . చేతిలోని  వస్తువులను  మరిచి పోవచ్చు  . అందువలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

10. అత్యంత ఇష్టమైన  వ్యక్తులు  చూసినా , కలిసినా , మాట్లాడినా  ఆ సంతోషంలో   , ఆ మైకంలో పడి  , మన  పంచేంద్రియాలు  గాడి తప్పి  నష్టాల  బారిన  లేదా  కష్టాల  బారిన  పద వచ్చు . 

11. ఆయాసం , అలసట , గాయాల పాలవడం , నిద్రలేమి  మొదలగునవి  కూడా  మతి మరుపుకు  దరి తీయవచ్చు .  

12.  వయస్సు మీద  పడుతున్న కొలది   మన పంచేంద్రియాల  శక్తి తగ్గి పోతుంది .  సుమారుగా  50 - 60 సం . రాలు  దాటా మంటే   వినికిడి శక్తి  తగ్గి పోతుంది .  కంటి చూపు  మందగిస్తుంది  , స్పర్శ  జ్ఞ్యానం  కోల్పోతాం .   రుచి  వాసన   గుర్తించ లేక పోవచ్చు . మతి మరుపు  ఏర్పడవచ్చు .

13. ఒంటరి తనం గా జీవించడం  వలన  మతి మరుపు  పెరుగుతుంది . అలానే  ఆయుస్సు కూడా  తగ్గిపోతుంది . 

👉🏾మతి మ రుపు ను  అధిగమించడం ఎలా ?

మతి మరుపు  బారిన పడకుండా  ఎవ్వరూ  తప్పించుకోలేరు . అయినా  కొన్ని  ముందస్తు జాగ్రత్తలు  తీసుకోవడం వలన మతి మరుపు  బారిన పడకుండా  కొంత వరకు  తగ్గించు కోవచ్చు . అవి ,

01.  జన్యు పర లోపాలు జరుగకుండా  రక్త సంబంధీకులైన  , దగ్గరి  మేన రికాలతో వివాహాలు  జరుప కూడదు . 

02. ముందు జాగ్రత్తగా  ఆరోగ్య పరమైన  చర్యలు తీసుకోవడం వలన , జన్యులోపాలు  లేకుండా  , మెంటల్ డిజార్డర్  లోపాలు లేని  పిల్లలు జన్మించడానికి  అవకాశముంటుంది . 

03. రెగ్యులర్ గా  హెల్త్ చెకప్ చేయించుకుని  సరియయిన మందులు  వాడటం వలన  మతి మరుపును  నివారించవచ్చు . 

04. రెగ్యులర్  గా  సమతుల్య ఆహారం  ,  పాలు,  పండ్లు , గ్రుడ్లు తీసుకోవడం  వలన  మతి మరుపును  దూరం చేయవచ్చు . 

05. రెగ్యులర్ గా మెడిటేషన్ , వ్యాయామం  చేయడం వలన  మతి మరుపును తగ్గించ వచ్చు .

06. ఎల్లప్పుడూ  మానసికంగా , శారీరకంగా  ఉత్సహంగా , ఉల్లాసంగా  ఉండే విధంగా  ప్లానింగ్ చేసుకోవాలి . 

07. కనీసం  రోజుకు   6 గంటలు  (  వీలు కాకా పోతే  ఏ  సమయమైనా కావచ్చు )  నిద్రించే విధంగా  ఏర్పాటు చేసుకోవాలి . 

08. క్రమ బద్దంగా   భోజనం చేయడం  అలవరచు కోవాలి . 

09.  చుట్ట , బీడీ , సిగరెట్లు  త్రాగడం వలన  మరియు  పొగాకు , తంబాకు నమలడం  , మత్తు పదార్ధాలు , డ్రగ్స్ వాడటం  మొదలైన వాటిని  తగ్గించాలి . 

10. రెగ్యులర్  గా  మాంసాహారం  తీసుకోవడం  తగ్గించి , శాకాహారులు గా  మారాలి  . 

11.  ప్రతి వ్యక్తికి  నిత్యం ఏర్పడే సమస్యలకు  , బాధలకు  , నష్టాలకు   వేంటనే   భీతి   చెంద  కూడదు . ఆందోళనకు గురి కాకూడదు . 

12. అందరిలో  కలిసి జీవించడం  ,  ఆడటం , పాడటం , ఆహ్లాద కర వాతావరణంలో  నివసించడం వలన  మతి మరుపు ను  నివారించ వచ్చు .   

మ‌తిమ‌రుపు పెరిగిపోతుందా? చ‌దివింది గుర్తుండ‌డం లేదా? ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌టి ప‌రిష్కారం క్యాండిల్ ట్రిక్.!
ఉద‌యం నిద్ర లేవ‌గానే….. ప‌ద్మాస‌నం లో కూర్చొని, కొద్ది దూరంలో స‌రిగ్గా మ‌న కంటికి స‌మాన‌మైన దిశ‌లో ఓ వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తూ ఉండాలి…. మారుతున్న దాని మంట రంగు, గాలికి క‌దులుతూ త‌న షేప్ ను మార్చుకుంటున్న తీరును కూడా ఓ 5 నిమిషాల పాటు త‌దేకంగా ప‌రిశీలిస్తూ ఉండాలి…అటు త‌ర్వాత… ఆ వెలుగుతున్న కొవ్వొత్తిని ఆర్పివేసి…ఇప్పుడు క‌ళ్లు మూసుకొని ఇంత‌కు ముందులా కొవ్వొత్తి వెలుగుతున్న‌ట్టు ….మ‌నో నేత్రంతో చూడాలి (ఊహించుకోవాలి).
ఇలా ప్ర‌తిరోజు..చూస్తూ ఉండాలి…. అయితే మొద‌టి రోజు 5 నిమిషాల పాటు వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తే…క్ర‌మంగా ఆ స‌మ‌యాన్ని త‌గ్గించుకుంటూ పోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తితో పాటు ఊహాశ‌క్తి కూడా అమాంతం పెరుగుతుంది. మీరు ట్రై చేసి మీ అనుభ‌వాన్ని మాతో పంచుకోండి
• జ్ఞాపకశక్తిని నిలబెట్టండి!

మన జీవితంలో జ్ఞాపకశక్తి కీలకపాత్ర పోషిస్తుంది. మనం చేసే అన్ని పనులకూ ఇదే మూలం. కాబట్టి జ్ఞాపకశక్తి తగ్గకుండా చూసుకోవటం చాలా అవసరం. రోజూ కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని కాపాడుకోవచ్చు.

* రోజువారీ పనుల ఒత్తిళ్లో.. లేనిపోని వాగ్వాదాలో.. ఇలాంటివన్నీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తాయి. నిజానికివి కొద్దిరోజుల్లో సర్దుకుపోతాయి గానీ దీర్ఘకాలంగా కొనసాగితే జ్ఞాపకశక్తిపై  విపరీత ప్రభావం చూపొచ్చు. కాబట్టి ఒత్తిడిని నియంత్రించుకోవటం, తగ్గించుకోవటం అత్యవసరం. గాఢంగా శ్వాస తీసుకోవటం, యోగా, ఒక అంశం మీద దృష్టి నిలపటం వంటి పద్ధతులతో ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు. 

* కంటి నిండా నిద్రపట్టకపోతే ఆ రోజంతా చికాకుగా ఉండటం తెలిసిందే. ఏ విషయాలూ చప్పున గుర్తుకురావు కూడా. జ్ఞాపకశక్తికి నిద్ర ఎంత అవసరమో దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. నిద్రలోనే మనం నేర్చుకున్న విషయాలు జ్ఞాపకాలుగా స్థిరపడతాయి. కాబట్టి రాత్రిపూట కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి. కొందరు నిద్రలేమికి మాత్రలు వేసుకుంటుంటారు గానీ ఇవి మెదడు పనితీరుకు ఆటంకం కలిగించి జ్ఞాపకశక్తి తగ్గేలా చేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి ముందుగా రోజూ సమయానికి నిద్రపోవటం, లేవటం.. పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవటం.. సాయంత్రం తర్వాత కాఫీ, టీలు తాగకపోవటం వంటి పద్ధతులను పాటించటం మంచిది. 

* పొగ అలవాటు గుండె, ఊపిరితిత్తులకే కాదు.. మెదడుకూ చేటే. వయసుతో పాటు వచ్చే మతిమరుపు, ఇతర జ్ఞాపకశక్తి సమస్యలు పొగ తాగేవారిలోనే ఎక్కువ. పొగతాగనివారితో పోలిస్తే.. మధ్యవయసులో రోజుకు 2 పెట్టెల కన్నా ఎక్కువ సిగరెట్లు కాల్చేవారికి వృద్ధాప్యంలో డిమెన్షియా ముప్పు రెట్టింపు అవుతుంది. 
 
* మద్యం మితిమీరినా మతిమరుపు, డిమెన్షియా ముప్పు పెరుగుతుంది. మద్యం అలవాటు గలవారు సరకులను గుర్తుంచుకోలేకపోవటం వంటి పనులను సరిగా చేయలేరు. ఇక దీర్ఘకాలంగా విటమిన్‌ బి1 లోపం గలవారికి మద్యం దుష్ప్రభావాలు కూడా తోడైతే హఠాత్తుగా మతిమరుపు తలెత్తే ప్రమాదమూ ఉంది. 
         ఆయుస్సును కూడా  పెంచుకోవచ్చు . 

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: