స్పోండిలోసిస్ అంటే ఏమిటి?
స్పోండిలోసిస్ వెన్నెముక యొక్క ఎముకలలో అలాగే కార్టిలేజ్ మరియు డిస్కులలో మార్పులు కలిగించే ఒక రకమైన వ్యాధి. కాలక్రమేణా, స్పోండిలోసిస్ వెన్నెముక యొక్క ఎముకలకు మెత్తని మద్దతు/సహకారము ఇచ్చే వెన్నెముక కణజాలమును (డిస్కులు) చిలేలా/పగిలేలా చేస్తుంది. స్పోండిలోసిస్ చివరకు వెన్నెముక యొక్క బిరుసుదనానికి లేదా ఆస్టియోఆర్థరైటిస్ కు దారితీస్తుంది. సాధారణంగా అది మెడలోని వెన్నుపూస ఎముకలను మరియు నడుము దగ్గర వెన్నుపూస ఎముకలను ప్రభావితం చేస్తుంది, అదే నడుముకి సంబంధించిన భాగం.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
స్పోండిలోసిస్ యొక్క రకాన్ని బట్టి స్పోండిలోసిస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఉంటాయి:
లంబర్ స్పోండిలోసిస్
- ఉదయం వేళా బిరుసుదనం మరియు వెన్నునొప్పి
- ఎక్కువ సమయం కూర్చుని ఉంటే నొప్పి
- వంగటం మరియు పైకి ఏవైనా ఎత్తడం వంటి కదలికల వలన నొప్పి
సెర్వికల్ స్పోండిలోసిస్
- తల వెనుక ఒక తలనొప్పి
- కాళ్ళు మరియు చేతులలో బలహీనత మరియు తిమ్మిరి
- మెడలో బిరుసుదనం
- సంతులనం లేనట్టు అనిపించడం
- భుజానికి క్రిందికి వ్యాపించే మెడ నొప్పి
- కాళ్ళు లేదా భుజాలలో అసాధారణ సంచలనాలు/అనుభూతులు
- మలం మరియు మూత్రాన్ని నియంత్రించడంలో సమస్య
థొరాసిక్ స్పోండిలోసిస్
- వెనుకకు వంగినప్పుడు వీపు మధ్యలో నొప్పి
- వెన్నెముకను ముందుకు మరియు వెనుకకు కదిలించేటప్పుడు నొప్పి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
స్పోండిలోసిస్ యొక్క ప్రధాన కారణాలు:
- వృద్ధాప్యం
- గతంలో మెడకు గాయం కావడం ఉదా., మోటారు వాహన ప్రమాదంలో మెడ బెణకడం
- తీవ్రమైన ఆర్థ్రరైటిస్
- గతంలో వెన్నెముకకు తీవ్ర గాయం
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
స్పోండిలోసిస్ ఈ క్రింది విధానాల ద్వారా నిర్ధారణ చేయబడుతుంది:
- వీపు మరియు మెడ యొక్క ఫ్లెక్సిబిలిటీ (వంగే గుణం)ని పరిశీలించడానికి వివరణాత్మక ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం మరియు భౌతిక పరీక్ష
- నడక యొక్క తీరుని అంచనా వెయ్యడం
- కాళ్ళు, చేతులు మరియు భుజముల దృఢత్వం మరియు రిఫ్లెక్స్(ప్రతిచర్యలు) లను పరీక్షించడం
- అవసరమైతే ఎక్స్- రే, ఎంఆర్ఐ (MRI) లేదా సిటి (CT) స్కాన్ ఆదేశించవచ్చు
స్పోండిలోసిస్కు ఈ క్రింది పద్ధతులను ఉపయోగించి చికిత్స చేస్తారు:
- నొప్పి ఉపశమనం కోసం ఓవర్ ది కౌంటర్ ఔషధాలు (మందుల షాపులో సులభంగా దొరికేవి)
- బ్రేస్ (భుజములకు కట్టే తాడు) లేదా మృదువైన కాలర్ (A brace or a soft collar)
- ప్రభావిత ప్రాంతం యొక్క కండరాలను బలోపేతం చేయడానికి వ్యాయామాలు
- భౌతిక చికిత్స
- తీవ్ర నొప్పి విషయంలో నొప్పి నివారణల ఇంజెక్షన్
- ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) లేదా ఇంజక్షన్ ద్వారా ఇచ్చే నొప్పి నివారుణుల వల్ల ఉపశమనం కలగకపోతే లేదా రోజువారీ పనులకు ఇబ్బంది కలిగించే తీవ్రమైన సందర్భాలలో శస్త్రచికిత్స
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి