12, డిసెంబర్ 2020, శనివారం

ఫిస్టులా నొప్పి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్త లు ఈ లింక్స్ లో చూడాలి అవగాహన కోసం

భగందర పుండు (ఆనల్ ఫిస్టులా) అంటే ఏమిటి?

భగందర పుండు (ఆనల్ ఫిస్టులా) అనేది అసాధారణమైన చిన్న పుండు, ఇది పెద్దప్రేగు మరియు మలద్వార చర్మం మధ్య ఏర్పడుతుంది. మలద్వార/పాయువు గ్రంధిలో చీము ఫిస్టులా/భగందర పుండుకు దారితీస్తుంది. పెద్దప్రేగు మరియు పాయువు మధ్య గొట్టం అనేది మలద్వార మార్గము, ఇక్కడ అనేక పాయువు గ్రంధులు ఉంటాయి. ఈ గ్రంధులలో సంక్రమణం (infection) చీము ఏర్పడటానికి కారణమవుతుంది, ఈ చీము పాయువు వైపు మార్గం ద్వారా ప్రవహించి పుండును తెరిచి ఉంచుతుంది.

ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మలద్వారం చుట్టూ నొప్పి మరియు చికాకు అనేవి ప్రధాన లక్షణాలు. కూర్చున్నపుడు లేదా కదలుతున్నప్పుడు లేదా ప్రేగు కదలిక సమయంలో తీవ్రమైన కండర నొప్పి;మలంలో చీము లేదా మలంలో రక్తం కారడం లేదా మలద్వార చర్మం సమీపంలో ఒక మురికి వాసన; మలద్వారం చుట్టూ వాపు మరియు ఎరుపు; జ్వరముచలి, అలసట మరియు అనారోగ్యం వంటివి అదనపు లక్షణాలు.

ప్రధాన కారణాలు ఏమిటి?

ఆనల్ ఫిస్ట్యులాలు సాధారణంగా మలద్వార కురుపులు కారణంగా అభివృద్ధి చెందుతాయి. చీము పోయిన తర్వాత ఈ కురుపులు సరిగ్గా నయం అవ్వకపోతే ఆనల్ ఫిస్ట్యులాలు సంభవిస్తాయి. తక్కువ శాతంలో క్రోన్'స్ వ్యాధిక్షయవ్యాధిడైవర్టికులిటిస్ (diverticulitis), లైంగికంగా సంక్రమించిన వ్యాధులు (STD), గాయాలు, లేదా క్యాన్సర్ వంటి పరిస్థితులు కూడా కారణమవుతాయి.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

మలాశయ లక్షణాలు మరియు మునుపటి ఆరోగ్య పరిస్థితి యొక్క జాగ్రత్త పరిశీలన అనేది ఈ సమస్యను నిర్ధారించడానికి సహాయపడుతుంది. జ్వరం, నీరసం, వాపు మరియు ఎరుపుదనం వంటి లక్షణాల గురించి వైద్యులు పరిశీలిస్తారు. కొన్ని పుండ్లు పై చర్మంలో ఒక గడ్డలా బయటకి కనిపిస్తాయి. రక్తం లేదా చీము యొక్క పారుదలను శారీరక పరీక్షలో చూడవచ్చు. చీము లేదా రక్తం ఉందా అని చూడటానికి వైద్యులు ఆ ప్రాంతాన్ని నొక్కవచ్చు. ఒక ఫిస్టులా ప్రోబ్ (fistula probe), అనోస్కోప్ (anoscope), మరియు ప్రతిబింబన (ఇమేజింగ్) అధ్యయనాలు (ultrasound, MRI లేదా CT స్కాన్) కూడా ఉపయోగించవచ్చు. అంకాత్మక(డిజిటల్) మలాశయ పరీక్ష బాధాకరముగా ఉంటుంది మరియు చీమును విడుదల చేయవచ్చు. ఫిస్ట్యులాలు మూసివేయబడవచ్చు కానీ అప్పుడప్పుడు కారవచ్చు అది నిర్ధారణకు కష్టం అవుతుంది.

చికిత్స కోసం ఇప్పటి వరకు మందులు లేదా ఔషధాలు అందుబాటులో లేవు. ఫిస్ట్యులాలను ఎక్కువగా శస్త్రచికిత్సతోనే చికిత్స చేస్తారు. వాటికవే నయం కాలేవు. చికిత్స కోసం శస్త్రచికిత్సతో పాటు యాంటీబయాటిక్స్ ను కూడా వాడతారు. శస్త్ర చికిత్సలో క్రింది ఎంపికలు ఉంటాయి:

  • ఫిస్టులోటమీ (Fistulotomy)
    ఈ విధానంలో మొత్తం ఫిస్టులాను కత్తిరించడం జరుగుతుంది మరియు దానిని నయం చేయటానికి దానిని తెరవడం జరుగుతుంది .
  • సెటాన్ విధానము (Seton procedure)
    సెటన్ అని పిలువబడే సన్నని శస్త్రచికిత్స రబ్బరును ఫిస్టులాలో ఉంచుతారు మరియు ఒక రింగ్ను ఏర్పడెలా చివరన కలిపి ఉంచుతారు. ఫిస్టులా నయం కావడం కోసం వారాల పాటు ఇది ఉంచబడుతుంది, తరువాత చికిత్సకు అవసరమైన ఇతర శస్త్రచికిత్సా పద్ధతులు ఉంటాయి.
  • ఇతర పద్ధతులు
    జిగురు, కణజాలం లేదా ప్రత్యేకమైన మూత వంటి ఇతర పద్ధతులు కూడా ఉపయోగకరంగా ఉన్నాయి.
  • పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు(Reconstructive Surgeries)
    పూర్తిగా ఫిస్టులా మూసి వేసే విధానా

భగందర పుండు (ఆనల్ ఫిస్టులా) కొరకు అలోపతి మందులు

Medicine NamePack Size
AngiwellAngiwell 2.6 Mg Tablet
NitrocerinNITROCERIN 2.6MG TABLET 10S
SBL Parietaria DilutionSBL Parietaria Dilution 1000 CH
G3NG3N 2.6 Tablet
NitzoNitzo Tablet
Bjain Parietaria DilutionBjain Parietaria Dilution 1000 CH
Bmd MaxBmd Max 2.5 Mg Capsule
GlyinGlyin Tablet
GlytrateGlytrate 2.6 Mg Tablet
GTN SorbitrateGTN Sorbitrate 0.5 Tablet
NitrobidNitrobid Tablet
NitroglycerinNitroglycerin 5 Mg Injection
Nitro (Three Dots)Nitro 6.4 Mg Tablet
Vasovin XlVasovin XL 2.5 Capsule
Schwabe Parietaria CHSchwabe Parietaria 1000 CH
MyovinMyovin Ointment
NoanginaNOANGINA 2.6MG CAPSULE 30S
New GTNNew GTN 2.6 Tablet CR

మల ద్వారం వద్ద నొప్పి ఆయుర్వేదం లో 

1. మలబద్దకం (కాన్ స్టిపేషన్):

మలబద్దకం అనేది మలద్వారంలో నొప్పికి ఒక ప్రధానమైన కారణం. పురీషనాళాన్ని (రెక్టమ్) చేరిన మలం ఒకవేళ ఎక్కువసేపు నిలువ ఉంటే దాన్నుంచి నీరంతా శోషింపబడి మలం మరింత గట్టిగా తయారవుతుంది. ఫలితంగా మలద్వారం పైన ఒత్తిడి ఏర్పడి నొప్పి మొదలవుతుంది. ఆహారంలో పీచు పదార్థాలను ఎక్కువగా తినడం, సమృద్ధిగా నీళ్ళు తాగటం, రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో చెంచాడు నెయ్యి కలుపుకుని తాగటం, ప్రతిరోజూ ఉదయం పూట మూడు నాలుగు గ్లాసుల గోరు వెచ్చని నీళ్లు తాగటం, పొట్టమీద ఒత్తిడి పడేలా మసాజ్ చేసుకోవడం వంటి చిన్న చిన్న ఉపాయాలతో మలబద్దకాన్నీ, తద్వారా మలద్వారంలో నొప్పినీ తగ్గించుకోవచ్చు.

గృహచికిత్సలు: 1. కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని చెంచాడు మోతాదుగా అంతే భాగం ఉప్పు కలిపి రాత్రి పడుకునేముందు తీసుకోవాలి. 2. రేలపండు గుజ్జును చెంచాడు మోతాదుగా రెండు చెంచాలు చక్కెర కలిపి గోరువెచ్చని నీళ్లతో తీసుకోవాలి. 3. రోజూ కనీసం పావుకిలో నల్ల ద్రాక్షపండ్లను తినాలి, తాజా పండ్లు దొరకని పక్షంలో ఎందు ద్రాక్షలను 24 గంటలు నీళ్లలో నానేసి నీళ్ళతో సహా తీసుకోవాలి. 4. వస కొమ్ము, కరక్కాయ పెచ్చులు, చిత్రమూలం వేరు, పిప్పళ్ళు, అతివస, చెంగల్వ కోష్ఠు, యావక్షారం వీటిని సమభాగాలు తీసుకొని అన్నిటిని పొడిచేసుకొని నిలవచేసుకోవాలి. ఈ పొడిని అరచెంచాడు మోతాదుగా రాత్రిపూట పడుకునేముందు తీసుకోవాలి. 5. అతసీతైలం (లిన్సీడ్ ఆయిల్) భోజనానికి ముందు చెంచాడు పరిమాణంలో నీళ్లతో కలిపి తీసుకుంటే మలం హెచ్చుమొత్తాల్లో మృదువుగా విసర్జితమౌతుంది.

ఔషధాలు: త్రిఫలా చూర్ణం, లశునాదివటి, అభయారిష్టం, వైశ్వానర చూర్ణం, మాణిభద్రలేహ్యం, పంచనకారచూర్ణం, ఏరండపాకం.

2. అర్శమొలలు (ఫైల్స్ / హెమరాయిడ్స్):

మలంతో పాటు రక్తం కూడా కనిపిస్తుంటే అది అర్శమొలలకు సూచన. అర్శమొలలనేవి రక్తనాళాలు - ముఖ్యంగా సిరలు - మలద్వారం ప్రాంతంలో గట్టిపడి మెలికలు తిరగటం వలన ఏర్పడుతాయి. మలబద్దకం వంటి కారణాల చేత మలద్వారం వద్ద ఒత్తిడి ఏర్పడితే, అది సిరలపైన ప్రతిఫలించి, సిరల గోడలు చిట్లి రక్తస్రావానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీని ఫలితంగా మలద్వారం వద్ద నొప్పి, అసౌకర్యం, దురద వంటి లక్షణాలు కలుగుతాయి. అలాగే, చేతికి బొడిపె వంటి ఆకారం తగిలే అవకాశం వుంది. పోతే, ఎక్కువ సంఖ్యలో విరేచనాలవుతున్నప్పుడు కూడా ఈ అర్శమొలల మీద ఒత్తిడి పడి, చీరుకుపోయి, నొప్పి, రక్తస్రావాలూ కలిపించే అవకాశం వుంది. అర్శమొలల నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు రక్తం ఎర్రటి ఎరుపుతో తాజాగా కనిపిస్తుంది. అలాగే మలంతో కలిసి కాకుండా మలం చుట్టూ చారికలా కనిపిస్తుంది. ఇలా కాకుండా ఒకవేళ రక్తం మలంతో కలగాపులగంగా కలిసిపోయి ఒకింత నలుపు రంగులో కనిపిస్తుంటే దానిని పేగుల నుంచి ఏర్పడిన రక్తంగా అనుమానించాలి. శత్రువులా బాధిస్తుంది కనుక మొలలకు అర్శస్సు అనే పేరు వచ్చింది. ('అరి' అంటే సంస్కృతంలో శత్రువు అని అర్థం.)

గృహ చికిత్సలు: 1. వాము, శొంఠి సమతూకంగా తీసుకొని పొడిచేయాలి. దీనిని అరచెందాడు మోతాదుగా గ్లాసు మజ్జిగతో కలిపి తీసుకోవాలి. 2. కరక్కాయల నుంచి గింజలను తొలగించి కేవలం పెచ్చులు మాత్రమే గ్రహించి పొడిచేయాలి. దీనిని పూటకు అరచెందాడు చొప్పున రెట్టింపు భాగం బెల్లంతో కలిపి మూడు పూటలా తీసుకోవాలి.... 3. ఉత్తరేణి గింజలను రెండు చెంచాలు పొడి చేసి బియ్యపు కడుగు నీళ్ళతో తీసుకుంటే రక్తం ఆగిపోతుంది. 4. నాగకేశర చూర్ణం (చెంచాడు), పంచదార (2 చెంచాలు), వెన్న (5 చెంచాలు) అన్నీ కలిపి తీసుకుంటే అర్శమొలల్లో స్రవించే రక్తం ఆగుతుంది.

ఔషధాలు: అర్శకుఠార రసం, కాంకాయణగుటిక, సూరణ వటకములు, అభాయారిష్టం. బాహ్యప్రయోగం - కాసీసాదితైలం.

 

3. గుదవిదారం (ఫిషర్):

మలద్వారపు చర్మం చీరుకుపోయినప్పుడు దానిని గుదవిదారం (ఫిషర్) అంటారు. ఇది మలబద్దకం వల్లగాని, ఇన్ఫెక్షన్ల వల్లగాని ఏర్పడుతుంది. మామూలుగా పెదవులు, చేతివేళ్లు, మోచేతులు తదితర భాగాల పైనుండే చర్మం దళసరిగా, గట్టిగా, పొడిగా తయారైనప్పుడు ఎలా అయితే చీరుకుపోతుందో అలాగే, మలద్వారపు చర్మం కూడా చీరుకుపోయే అవకాశం ఉంది. మలబద్దకాన్ని తగ్గించడం ఈ స్థితిలో మొదటి చికిత్సా సూత్రం. వ్రణరోపన ఔషధాలను ప్రయోగించడం రెండవ సూత్రం.

ఔషధాలు: అభయారిష్టం, అవిపత్తికర చూర్ణం, ద్రాక్షాది రసాయనం, ద్రాక్షారిష్టం, సుకుమార రసాయనం, వైశ్వానర చూర్ణం, మాణిభద్ర లేహ్యం.

బాహ్యప్రయోగాలు - వ్రణరోపణ తైలం, శతధౌతఘృతం.

4. విస్పోట (పెరియానిల్ యాబ్సిస్):

కొంతమందికి మలద్వారం వద్ద నొప్పితో కూడిన గడ్డలు తరచుగా తయారవుతుంటాయి. వైద్య పరిభాషలో 'పెరియానల్ యాబ్సిస్'గా పిలువబడే ఈ గడ్డలు ఎక్కువగా వెంట్రుకల కుదుళ్లు ఇన్ ఫెక్ట్ అవ్వడం చేతనూ, వాటి మొదళ్లు అడ్డగించబడటం చేతనూ వస్తుంటాయి.

గృహచికిత్సలు:1. రేగు ఆకులను ముద్దగా నూరి ఉడకబెట్టి పైకి వట్టు వేయాలి. 2. రణపాల ఆకును వేడిచేసి పైకి కట్టాలి.

ఔషధాలు: శారిబాద్యారిష్టం, గంధక రసాయనం, కర్పూర శిలాజిత్తు.

5. అతిసారం (డయేరియా):

తరచుగా విరేచనాలయ్యేవారిలో మలద్వారం ఒరుసుకుపోయి నొప్పి ఏర్పడే అవకాశం ఉంది. విరేచనాలు సాధారణంగా ఆహారం కలుషితం కావడం చేతకాని, పెద్ద పేగులు వ్యాధిగ్రస్తమవడం వల్లగాని, మోతాదుకు మించి విరేచ నౌషధాలను తీసుకోవడం వల్లగాని ఏర్పడతాయి. ఇలా జరుగుతున్నప్పుడు కారణాలను కనిపెట్టి దానికి అనుగుణమైన చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

6. పెద్దపేగుల్లో సంచులవంటి నిర్మాణాలు తయారవడం ( డైవర్టిక్యులైటిస్):

మలద్వారంలో నొప్పి దానంతట అదే వస్తూ తిరిగి తగ్గిపోతూ ఉంటే పెద్ద పేగుకు సంబంధించిన 'డైవర్టిక్యులైటిస్' అనే స్థితి గురించి ఆలోచించాలి. వయసు మీద పడుతున్న కొద్ది పెద్ద పేగు కండరాలు శక్తి తగ్గిపోయి చిన్న చిన్న సంచుల మాదిరి నిర్మాణాలు తయారవుతాయి. వీటిల్లో మలం చేరి గట్టిపడి ఇన్ఫెక్షన్ కు గురై మలద్వారం వద్ద నొప్పిని కలిగిస్తుంది. ఈ వ్యాధిలో పేగుల కండర శక్తిని పెంచి, మలనివారణను సజావుగా జరిపించే మందులను వాడాలి.

ఔషధాలు: అగస్త్యహరీతకీలేహ్యం, పంచామృతపర్పటి, మహాగంధక రసం, రసపర్పటి, స్వర్ణపర్పటి.

7. పేగుల్లో తిత్తివంటి నిర్మాణాలు తయారవడం (పాలిప్స్):

అర్శమొలలు లేకపోయినప్పటికీ ఒకవేళ మలద్వారం నుంచి రక్తం కారుతున్నట్లయితే 'పాలిప్స్' గురించి ఆలోచించాలి. పాలిప్స్ అనేవి శరీరపు ఖాళీ ప్రదేశాల్లో తయారవుతుంటాయి. ఇవి కాండం కలిగి, రక్తంతో నిండి ఉండే తిత్తి వంటి నిర్మాణాలు. ఇవి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్లగాని లేదా ఒత్తిడికి గురై గీరుకు పోవడం వల్లగాని రక్తస్రావమై మలద్వారం నుంచి బహిర్గతమవుతుంది.

 

కుటజఘనవటి, సంజీవనీవటి, బాహ్యప్రయోగం - కాసీసాదితైలం.

7. స్త్రీ సంబంధ వ్యాధులు (గైనకలాజికల్ డిసీజెస్):

మహిళల్లో మలద్వారం వద్ద నొప్పికి స్థానిక కారణాలే కాకుండా ఇతర అంశాలు కూడా కారణమవుతాయి. అండాశయానికి చెందిన 'ఓవేరియస్ సిస్టులు' గాని కటివలయానికి చెందినా 'పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ వ్యాధులు'గాని మలద్వారంలో నొప్పి రూపంలో వ్యక్తమవుతుంటాయి. దీనిని వైద్యశాస్త్ర పరిభాషలో 'రిఫర్డ్ పెయిన్' అంటారు. ఈ సమస్యలకు, ఆయా కారణాల మీద దృష్టి సారించడం అవసరం.

గృహచికిత్సలు: 1. వస చూర్ణాన్ని పూటకు ఒక గ్రాము మోతాదుగా మూడుపూటలా తేనెతో తీసుకోవాలి. 2. అత్తిచెట్టు పట్టను కాని, దానిమ్మ చెట్టు వేరు బెరడునుగాని, కషాయం కాచో యోనిని శుభ్రం చేసుకోవాలి. దీనిని 'డూష్' అంటారు. 3. తులసి ఆకులను, వేపాకులను వెడల్పాటి గంగాళంలో మరిగించాలి. ఈ నీళ్ళతో కాళ్ళు బైటపెట్టి బొడ్డుమునిగేలా ఇరవై నిమిషాలు కూర్చోవాలి, ఇలా రోజుకు మూడు సార్లు వారం రోజుల పాటు చేయాలి. 4. త్రిఫలాచూర్ణం (ఒక చెంచా), గుడూచిసత్వం (అరచెంచా) రెండుకలిపి తగినంత నెయ్యిని, తేనెను కలిపి ఆహారానికి ముందు రోజుకు మూడుసార్లు చూప్పున కనీసం రెండు నెలల పాటు పుచ్చుకోవాలి.

ఔషధాలు: ఆరోగ్యవర్ధినీవటి, కైశోరగుగ్గులు, రసమాణిక్యం.

బాహ్యప్రయోగాలు - జాత్యాదితైలం, మహామరీచ్యాదితైలం, మహానారాయణతైలం.

8. ఇరవై నాలుగు గంటల కడుపునొప్పి (ఎపెండిసైటిస్):

జ్వరంతో పాటు ఆకలి తగ్గిపోవడం, వాంతి వచ్చినట్లు ఉండటం అనేవి 'ఎపెండిసైటిస్'ను సూచిస్తాయి. 'ఎపెండిక్స్' అనేది ఉదర ప్రాంతంలో కుడివైపున క్రిందిభాగంలో అమరివున్నఒక ఆంత్రావశేషం. ఇది కొంతమందిలో పెద్దపేగు వెనుకగా అమరి వుంటుంది. అలాంటి వారికి ఒకవేళ ఎపెండిసైటిస్ వస్తే అది మలద్వారంలోకి నొప్పి రూపంలో ప్రసరిస్తుంది.

ఔషధాలు: ఆరోగ్యవర్ధినీవటి, పునర్నవారిష్టం, దశామూలారిష్టం, లవణభాస్కర చూర్ణం, శంఖభస్మం, కపర్థికాభస్మం, స్వర్జికాక్షారం, అగ్నితుంటివటి, ఆహిఫేనాదివటి, కర్పూరాదివటి, బృహత్ వాత చింతామణి రసం, పునర్నవాదిమండూరం., శంఖవటి, శూలహరణ యోగం.

9. మానసిక ఆందోళన (ప్రాక్టాల్జియా ఫ్యూగాక్స్):

కొంతమందికి మానసికంగా ఒత్తిడికి లోనయినప్పుడు మలద్వారంలో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి నిద్రనుంచి మేలుకొలుపగలిగేటంత ఎక్కువస్థాయిలో కూడా ఉండవచ్చు. వైద్య పరిభాషలో ఇటువంటి నొప్పిని 'ప్రాక్టాల్ జియా' ఫ్యూగాక్స్' అంటారు. ఒత్తిడికి లోనయినప్పుడు కండరాలు అనూహ్యంగా ముడుచుకుపోవటం వలన ఈ తరహా నొప్పి వస్తుంది. ధ్యానం, ఇతర రిలాక్సేషన్ విధానాలతో పాటు అశ్వగంధా, బ్రాహ్మీ వంటి మూలికలు ఇందులో చక్కగా పని చేస్తాయి.

ఔషధాలు: నారసింహ ఘృతం, బ్రాహ్మీ ఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబలా తైలం, అశ్వగందారిష్టం, సర్పగంధా చూర్ణం, స్వర్ణముక్తాది గుటిక.

బాహ్యప్రయోగం - బ్రాహ్మీతైలం.

10. ప్రోస్టేట్ గ్రంథి వాపు (ప్రోస్టటైటిస్):

మగవారిలో, ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన తరువాత, ప్రోస్టేట్ గ్రంథి వ్యాధి గ్రస్తమయ్యే అవకాశం ఉంది. ప్రోస్టేట్ గ్రంథి వాచినప్పుడు మలద్వారం లోపల ఒక గోల్ఫ్ బంతిని ఉంచిన అనుభూతి కలుగుతుంది, మూత్రవిసర్జన కష్టంతో జరుగుతుంది. పలుమార్లు విసర్జించాల్సి వస్తుంది. అలాగే పురుషాంగం నుంచి జిగురు వంటి స్రావం కూడా వెడలే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు కొద్దిగా జ్వరం కూడా రావచ్చు. అలాగే ఈ వ్యాధి ఉన్నప్పుడు మలద్వారంలో నొప్పి కూడా ఉండే అవకాశం ఉంది. ఔషధాలు: అభ్రకభస్మం, చందనాది వటి, చందనాసవం, చంద్రప్రభావటి, గోక్షురాది చూర్ణం, గుడూచి సత్వం, గోక్షురాది గుగ్గులు, కర్పూర శిలాజిత్తు భస్మం, కాంచనార గుగ్గులు, స్వర్ణవంగం, త్రిఫలాది క్వాథ చూర్ణం.

11. పేగులో క్యాన్సర్:

ఒకోసారి రక్తమొలలు, పాలిప్స్ వంటి వాటి వల్లనే కాకుండా ప్రమాదకరమైన క్యాన్సర్ పెరుగుదలలవల్ల కూడా నొప్పితోపాటు రక్తం అపరిమితంగాస్రవిస్తుంది. అనియతంగా రక్తం స్రవిస్తున్నప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ చెయ్యకుండా వైద్య సలహా తీసుకోవాలి. దీనిలో సమస్య తీవ్ర రూపం దాల్చెంత వరకూ మలద్వారంలో నొప్పి తెలియకపోవచ్చు. కనుక ముందే జాగ్రత్తపడాలి. ఔషధాలు: భల్లాతకవటి, చిత్రకాదివటి. బోలబద్ధ రసం, బోలపర్పటి.

అసలు ఫిస్టులా (Anal Fistula) అంటే ఏంటి ఆయుర్వేదం లో నివారణకు నవీన్ సలహాలు 

                                            మలద్వార సమీపంలో చిన్న  బుడిపె ఏర్పడుతుంది .  ఆ బుడిపె మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది .  ఆ బుడిపె పెరుగుతూ  లోపల పెద్ద పేగు చివరి భాగం వరకు వెళ్తుంది . ఆ బుడిపె కొంత మందిలో పగిలి ఆ రంధ్రం నుండి చీము మరియు రక్తం కారుతూ చాలా అసౌకర్యానికి గురి అవుతారు . దీనినే ఫిస్టులా అంటారు .
కొన్ని సార్లు ఆ ఫిస్టులా మధ్యలో ఉండే రంధ్రం మూసుకుపోయి ఆ లోపలే చీము మరియు రక్తం నిల్వ ఉండి తీవ్ర వేదన {నొప్పి} కు గురి చేస్తుంది .
తేలిక భాషలో చెప్పాలంటే.. గోడలో పైనుంచి ఒక నీళ్ల గొట్టం వస్తోందనుకుందాం. ఆ గొట్టం ఎక్కడన్నా పగిలితే దాని నుంచి నీరు బయటకు లీకై.. అక్కడ గోడను పాడుచేసి.. ఏదోవైపు నుంచి బయటకు వస్తుంటుంది. ఒక రకంగా భగందరం కూడా అంతే. మలద్వారం నుంచి బయటకు ‘దారులు’ ఏర్పడటం, ఇవి చుట్టుపక్కల చర్మం మీద ఎక్కడో పైకి తేలటం ఈ సమస్యకు మూలం. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం.
మలద్వారం లోపలి గోడలకు కొన్ని గ్రంథులు (యానల్‌ గ్లాండ్స్‌) ఉంటాయి. ఇవి మల మార్గంలో జిగురులాంటి స్రావాలను విడుదల చేస్తూ.. మలవిసర్జన సాఫీగా జరిగేలా సహకరిస్తుంటాయి. వీటి మార్గాలు మలద్వారంలోకి తెరచుకొని ఉంటాయి.
ఏదైనా కారణాన వీటి మార్గం మూసుకుపోతే వీటి నుంచి వచ్చే జిగురు స్రావాలు మలమార్గంలోకి రాకుండా లోపలే నిలిచిపోతాయి. మెల్లగా మలంలో ఉండే బ్యాక్టీరియా సూక్ష్మక్రిముల వంటివి దీనిలో చేరి చీము పడుతుంది. దీంతో ఇది చీముగడ్డలా (యానల్‌ ఆబ్సెస్‌) తయారవుతుంది.
ఈ చీము బయటకు వచ్చే మార్గం లేక.. పక్కనున్న కండరాలను తొలుచుకుంటూ అక్కడి ఖాళీల మధ్య నుంచి క్రమంగా లోలోపలే  విస్తరించటం మొదలుపెడుతుంది. ఇది మెల్లగా మలద్వారం చుట్టుపక్కల ఎక్కడో చోటకు చేరుకుని.. అక్కడ పైకి సెగగడ్డలా కనబడుతుంది. దీనికి రంధ్రం పడితే ఇందులోంచి చీము బయటకు వస్తుంటుంది. అయినా పైన ఇన్ఫెక్షన్‌ సోకిన గ్రంథి అలాగే ఉంది కాబట్టి తిరిగి మళ్లీ మళ్లీ చీము వస్తూనే ఉంటుంది.
మలద్వారం దగ్గర వచ్చే సమస్యలు గురించి మాటల్లో చెప్పడం కష్టం . ఈ  సమస్యల గురించి చెప్పుకోడానికి సిగ్గుపడకుండా మలద్వారం దగ్గర ఏ చిన్న అసౌకర్యం కలిగినా  వెంటనే వైద్యులకు చూపించుకొని ఆ సమస్య గురించి మరియు దాని నివారణ మార్గాలు గురించి తెలుసుకొని చికిత్స చేయించుకోడం ఉత్తమం .
చాలా మంది మలద్వారం వద్ద వచ్చే సమస్యలన్నింటిని మొలల వ్యాధి {పైల్స్ } అని అనుకుంటారు . కానీ మలద్వారం వద్ద చిన్న చిన్న చీలికలు {ఫిషర్స్} రావచ్చు . లేదా మల ద్వారానికి సమాంతరంగా మరో మార్గం  {ఫిస్టులా } (Anal Fistula)ఏర్పడవచ్చు . ఇవన్నీ వేర్వేరు సమస్యలు .
ఫిషర్స్ ఉంటే చాలా భాధగా ఉంటుంది .  మొలలకు అంత  బాధ ఉండదు . అవి బయటకు వచ్చినప్పుడు , లేదా వాటిలో రక్తం గడ్డ కట్టినప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది .
ఫిస్టులా సంగతి తీసుకున్నపుడు అది మలద్వారం చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది , దాని  నుంచి  ఎప్పుడు రసి , లేదా  చీము వంటిది కారుతుంటుంది .
Ayurvedic Treatment For Fistula in Ano!!!
అసలు ఫిస్టులా(Anal Fistula) ఏర్పడానికి గల కారణాలను తెలుసుకుందాం :
                                         ఫిస్టులా అనేది ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే సమస్య . పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్ఫెక్షన్ వల్ల వ్యాధి వస్తుంది . అయితే ఈ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయన్నది ఇంతవరకు ఖచ్చితముగా తెలియదు .
ఎటువంటి వారిలో ఈ (Anal Fistula)సమస్య ఎక్కువ కనిపిస్తుంది ?
                           ఈ వ్యాధి ఏ వయసులో ఉన్న వారికైనా రావచ్చు . ముఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని ఉన్న వారిలో ఈ వ్యాధి వస్తుంది .
దీర్ఘకాలంగా మలబద్దకంతో బాధపడుతున్న వాళ్ళు మలద్వారం  సమీపాన సరి అయిన  పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల  వాళ్ళలో చీము గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది .
                                     అపరిశుభ్రమైన డ్రాయర్లు ధరించేవారిలో , మధుమేహ వ్యాధి ఉన్న వారిలో , డ్రైవింగ్ వృత్తిలో ఉన్న వారిలో , మరికొందరిలో వంశపారంపర్యంగానూ  కూడా చీము గడ్డలు సంభవించవచ్చు .
క్షయ వ్యాధి వల్ల కూడా ఫిస్టులా సంభవించవచ్చు . దీనిని టి .బి  మందులు వాడకం ద్వారా కూడా  తగ్గించవచ్చు
లక్షణాలు :Symptoms Of Anal Fistula:
1.  మలద్వారం చుట్టూ నొప్పి మరియు చికాకు అనేవి ప్రధాన లక్షణాలు .
2.  కూర్చున్నప్పుడు లేదా కదులుతున్నప్పుడు లేదా ప్రేగు కదలిక సమయంలో తీవ్రమైన కండర నొప్పి
3. మలంలో చీము లేదా మలంలో రక్తం కారడం లేదా మలద్వార చర్మం సమీపంలో ఒక మురికి వాసన రావడం
4. మలద్వారం చుట్టూ వాపు మరియు ఎరుపు , జ్వరం , చలి , అలసట మరియు అనారోగ్యం వంటివి అదనపు లక్షణాలు .
 5. విసర్జన క్రియ సరిగ్గా లేకపోడం
6. మలద్వారం దగ్గర దురద
7. మలద్వారం చుట్టుప్రక్కల నుంచి చీము మరియు రసి కారడం
8. రక్తస్రావం
పై  లక్షణాలతో పాటు మరి కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి .
* కడుపు ఉబ్బరం
*జీర్ణ క్రియ సరిగ్గా లేకపోడం
*ఆహారంపై ఆసక్తి లేకపోడం
*నీరసం నిస్సత్తువ
*నడుం నొప్పి
*మలబద్దకం
 ఫిస్టులాను రెండు రకాలుగా వర్గీకరిస్తారు . మలద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం . కింది భాగంలో ఏర్పడేది మరో రకం .
 1. లో లెవెల్  – దీనిలోని ఫిస్టులా మార్గం పొడవు తక్కువుగా అంటే రెండు సెంటీమీటర్లు కంటే తక్కువుగా ఉంటుంది .
 2. హై లెవెల్ – దీనిలో ఫిస్టులా మార్గం పొడవు ఎక్కువుగా ఉంటుంది  అంటే 4, 5 సెంటీమీటర్లు కన్నా ఎక్కువుగా ఉంటుంది .
వ్యాధి నిర్ధారణ :
                 ఫిస్టులాను చాలా వరకు చెప్పే లక్షణాలను బట్టే నిర్ధారించవచ్చు . కొంత మంది వైద్యులు వేలితో పరీక్షించి నిర్ధారణ చేస్తారు . మలద్వారం లోపల గాని బయట గాని వేలి పెట్టి చూడడం వల్ల రంధ్రం తగులుతుంది. బాగా అనుభవం ఉన్న వైద్యులు ఆ రంధ్రం నుండి మార్గం ఎంతవరకు వెళుతుందో కొంతవరకు తెలుసుకోగలుగుతారు .
                             ఎండోయానల్‌ స్కాన్‌: సన్నగొట్టంలా ఉండే అల్ట్రాసౌండ్‌ పరికరాన్ని మలద్వారంలోకి పంపి పరీక్షిస్తారు. దీంతో ఫిస్టులా మార్గం లోపలికి తెరచుకొని ఉంటే గుర్తించొచ్చు. సాధారణంగా మలద్వార కండరాల్లో ఎక్కడా గాలి ఉండదు. ఒకవేళ గాలి ఉన్నట్టు తేలితే అక్కడ మార్గం ఉన్నట్టుగా గుర్తిస్తారు. ఇది చవకైన, తేలికైన పరీక్ష.
* ఎంఆర్ఐ: ఫిస్టులా దారులు మరీ సంక్లిష్టంగా ఉంటే ఎంఆర్ఐ స్కానింగు చెయ్యాల్సి ఉంటుంది. దీనిలో ఎన్ని దారులు ఎలా ఉన్నదీ స్పష్టంగా తెలుస్తుంది.
                            పై పరీక్షలు ఆధారంగా లోపల ఎన్ని మార్గాలు ఉన్నాయో తెలుసుకోవడం సులభమవుతుంది .  ఫిస్టులా మార్గం ఎక్కడినుండి మొదలై ఎటు వెళ్తుంది అని తెలుసుకోవచ్చు .
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
1. శరీరానికి సరిపడా నీళ్లు త్రాగాలి ,దాని వల్ల మలబద్దకం సమస్య కలగదు .
2.జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ avoid చెయ్యాలి .
3. టైం కి ఆహరం తీసుకోవాలి
4. తినే ఆహారంలో సమతుల్యత ఉండేలా చూసుకోవాలి
5. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి .
6.విరేచనం సాఫీగా ఉండేలా చూసుకోవాలి .
7. ముఖ్యంగా స్త్రీలు రెండు ప్రసవాల మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి .
8. మలద్వారాన్ని వేడి నీటితో శుభ్రపరుచుకోవలెను .
9. ఎక్కువ సమయం కూర్చుని పనిచేసేవారు అలా కూర్చొని ఉండిపోకుండా మధ్యమధ్యలో లేచి అటు  ఇటు తిరగవలెను.
10. ప్రతి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తీసుకోవలెను .
11. ఆకుకూరలు , కూరగాయలు ఎక్కువగా తీసుకోవలెను .
12. టీ , కాఫీ లకి దూరంగా ఉండాలి .
13. మలద్వారం ఎప్పుడు పొడిగా , శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి .
14.  మానసిక ఒత్తిడి లేకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి .
15.  ఉడికించిన కూరగాయలు , ఫ్రూట్ సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి .
16. కారం , మరియు మసాలాలకు దూరంగా ఉండాలి .
17.  మద్యం సేవించడం మరియు ధూమపానానికి దూరంగా ఉండాలి .
చికిత్సా  విధానం :
         ఆధునిక వైద్యపరంగా ఫిస్టులాకి సర్జరీ తప్ప వేరే మార్గం లేదు . సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్లా మళ్లా ఈ అవస్థ పునరావృతం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి .

Ayurvedic Treatment For Anal Fist.               క్షార సూత్ర పద్ధతి ద్వారా మలద్వారం వద్ద కలిగే అన్ని రకాల సమస్యలు పరిష్కరించబడతాయి .

కొన్ని రకాల ఔషధాలతో లేపించబడిన దారాన్ని మలద్వారం నుంచి ఫిస్టులా లోకి పంపించి బయటకు లాగి ముడి వేస్తారు.ఈ దారం లోపల నుండి కోసుకుంటూ గాయాన్ని తగ్గిస్తూ బయటకు వస్తుంది .  ఈ దారాన్ని ఆయుర్వేద వైద్యులు నిర్ణీత సమయం ప్రకారంగా మారుస్తూ ఉంటారు . ఈ క్షార సూత్ర చికిత్స పద్ధతిని W . H . O వారు పరిశోధన చేసి ఆమోదించారు .
పరిశోధనల  ద్వారా క్షార సూత్ర చికిత్స విధానంతో ఫిస్టులా(Anal Fistula) పునరావృతం అయ్యే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు .
ఈ క్షార సూత్ర చికిత్స చేసుకున్నవారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. దినచర్యలు మానుకొని ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు .
రక్తస్రావం  లేకుండా, శస్త్ర చికిత్స లేకుండా ఈ Anal Fistula  ని అతి తేలికగా, పూర్తిగా నిర్మూలించవచ్చు. 

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: