ప్రోస్టటైటీస్ అంటే ఏమిటి?
ప్రోస్టటైటీస్ అనేది ఒక సాధారణ రుగ్మత, ఇది ఎక్కువగా సంక్రమణ కారణంగా ప్రోస్టేట్ గ్రంధి వాపు (మంట) వల్ల సంభవిస్తుంది. అనారోగ్య పరిసరాల వల్ల ఏ వయస్సు పురుషులకైనా ప్రోస్టేటిటీస్ సంభవించవచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రోస్టటైటీస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు తరచూ ప్రోస్టేట్ క్యాన్సర్ లేదా ప్రోస్టేట్ విస్తారణ సమానంగా ఉంటాయి, కానీ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు:
- మూత్రవిసర్జనలో కష్టాలు, మూత్రం యొక్క బాధాకరమైన లేదా ఆటంకపరిచే ప్రవాహం.
- కటి (పెల్విక్) ప్రాంతంలో నొప్పి లేదా ప్రోస్టేట్ యొక్క ప్రాంతం చుట్టూ, పురీషనాళం భాగంలో నొప్పి .
- తరచూ వ్యవధుల్లో మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన అత్యవసర పరిస్థితి, మూత్రంలో రక్తం అప్పుడప్పుడు పడవచ్చు.
- బాక్టీరియల్ సంక్రమణ విషయంలో, జ్వరం, వికారం మరియు ఇతర ఫ్లూ-వంటి లక్షణాలు కూడా సంభవించవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ప్రోస్టటైటీస్ దాని కారణాన్ని బట్టి వివిధ వర్గాలలో విభజించబడింది. అవి:
- దీర్ఘకాల ప్రోస్టటైటిస్
ఈ సందర్భంలో, లక్షణాలు నెమ్మదిగా వృద్ధి చెందుతాయి, మరియు గణనీయమైన కాలవ్యవధిలో కొనసాగుతాయి. దీర్ఘకాలిక ప్రోస్టేటిస్ అనేది సంక్రమణ వలన సంభవించదు మరియు తరచూ దీనికి సులభంగా చికిత్స చేయవచ్చు. దీర్ఘకాలిక ప్రోస్టేటిస్ యొక్క ముఖ్య కారణాలు:- ప్రోస్టాటిస్ యొక్క చరిత్ర.
- దీర్ఘకాలిక ప్రోస్టటైటీస్ మధ్య వయస్కుల్లో నుండి వయస్సు పైబడిన పురుషుల్లో సాధారణం.
- మంటతో కూడిన ప్రేగు రుగ్మత
- శస్త్రచికిత్స సమయంలో జరిగిన నష్టం.
- తీవ్రమైన ప్రోస్టేటిటిస్తీ
వ్రమైన ప్రోస్టటైటీస్ అకస్మాత్తుగా మరియు తీవ్రమైన వైద్యకేసు, ఇది సంక్రమణవల్ల సంభవిస్తుంది. దీనికి వెంటనే వైద్యరక్షణ అవసరం. ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు:- లైంగిక చర్య దురుపయోగంవల్ల ప్రోస్టేట్ యొక్క సంక్రమణ.
- ప్రోస్టేట్ లేదా మూత్ర నాళంలో ఏదైనా రకమైన సంక్రమణ చరిత్ర, మూత్ర నాళాల సంక్రమణ (UTI) లేదా లైంగికంగా సంక్రమించే సంక్రమణ (STI) లేదా హెచ్ఐవి (HIV) సంక్రమణం లేదా AIDS.
- కొన్ని సందర్భాల్లో, ప్రోస్టేట్ బయాప్సీ తరువాత సంక్రమణం అభివృద్ధి చెందుతుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ప్రోస్టేటిటీస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలను చూసిన తరువాత, వైద్యుడు కొన్ని పరీక్షలను ఆదేశించవచ్చు. వ్యక్తికి సంభవించిన వ్యాధి ప్రోస్టేటిటీస్ అయితే ఆ వ్యాధిని నిర్ణయించడంలో ఈ పరీక్షలు సహాయపడతాయి. ప్రొస్టటిటిస్కు అత్యంత సాధారణ మరియు ఖచ్చితమైన పరీక్షలు క్రింది విధంగా ఉన్నాయి:
- ఒక డిజిటల్ పురీషనాళం పరీక్షతో సహా భౌతిక పరీక్ష.
- మూత్ర నాళాల అంటురోగాల తనిఖీకి మూత్ర పరిశీలన (urinalysis)
- ట్రాన్సరెక్టల్ ఆల్ట్రాసౌండ్ను ప్రొస్టేట్ లో ఏదైనా వాపు లేదా అసాధారణ పెరుగుదలలు ఉంటే గుర్తించడం కోసం.
- ప్రతి డిచ్ఛార్జ్ లో స్పెర్మ్ మరియు వీర్యం మొత్తాన్ని తనిఖీ చేయడానికి మరియు రక్తం లేదా సంక్రమణ సంకేతాలను పరిశీలించడానికి యూరాలజిస్టులు వీర్యం విశ్లేషణ పరీక్ష చేయవచ్చు.
- మూత్రాశయ దర్శిని (సిస్టోస్కోపిక్) బయాప్సీ పరీక్ష: మూత్రాశయం పరిశీలనకు మరియు ప్రోస్టేట్ నుండి కణజాల నమూనా సేకరించడం కోసం, ఏవైనా వాపుల పరిశీలనకు ఈ జీవాణు పరీక్ష చేస్తారు..
ప్రారంభ దశల్లోనే నిర్ధారణ అయితే ప్రోస్టటైటీస్ కు సాధారణంగా సులభంగా చికిత్స చేయవచ్చు. బ్యాక్టీరియా సంక్రమణలకు చికిత్స చేయడానికి యాంటీబయాటిక్ మందులు అవసరం. వ్యక్తికి పెయిన్కిల్లర్లు మరియు శోథ నిరోధక మందులు సూచించబడతాయి. సాధారణమైన తేలికపాటి కేసులకు పారాసెటమాల్ మరియు ఇబుప్రోఫెన్ మందులు సూచింపబడతాయి. అయినప్పటికీ, వ్యాధి పరిస్థితి తీవ్రంగా ఉంటే లేదా నొప్పి ఘోరంగా పెరిగి ఉంటే, అమిట్రిప్ట్ టీలైన్ (amitriptyline) వంటి బలమైన నొప్పి నివారణలు కూడా సూచించబడతాయి. సూచించిన ఇతర మందుల్లో కండరాల సడలింపుల మందులను కలిగి ఉంటాయి. నొప్పి ఉపశమనం కోసం బాధిత ప్రాంతంలో వేడి నీటి బాగ్లను అద్దడం లేదా వేడినీటి స్నానాలను వైద్యులు సూచిస్తార
Medicine Name | Pack Size | |
---|---|---|
Ciplox | Ciplox 100 Tablet | |
Cifran | Cifran Infusion | |
L Cin | L Cin 0.50% Eye/Ear Drops | |
Norflox | NORFLOX EYE /EAR DROP | |
Meriflox | Meriflox 400 Mg Tablet | |
Gigaquin | Gigaquin Table | |
Neocip | NEOCIP SUSPENSION 60ML | |
Heal Up | Heal UP Tablet | |
Neoflox | Neoflox 500 Mg Capsule | |
Hinlevo | Hinlevo Tablet | |
Newcip | Newcip 500 Mg Tablet | |
Infax | Infax Tablet | |
Nircip | Nircip Infusion | |
Nflox B | Nflox B 400 Tablet | |
Jetflox | Jetflox Tablet | |
Nucipro (Numed) | Nucipro 250 Mg Tablet | |
Joycin | Joycin 500 Mg Tablet | |
Olbid | Olbid 250 Mg Tablet | |
Nogit | Nogit Tablet | |
L250 | L250 Tablet | |
Omniflox | Omniflox 250 Mg Tablet | |
L500 | L500 Tablet | |
Periflox | Periflox 500 Mg Tablet | |
Nor | Nor 400 Mg Suspension |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి