14, డిసెంబర్ 2020, సోమవారం

తెల్ల బట్ట నివారణకు తీసుకోవాలిసిన జాగ్రత్తలు ఈ లింక్స్ లో చూడాలి అవగాహన కోసం మాత్రమే


తెల్లబట్ట మహిళల్లో కనిపించే సాధారణ మరియు మాములు స్థితి. ఇది ఒక పారదర్శక ద్రవం యొక్క స్రావం లేదా శ్లేష్మం, ఇది యోనిని తేమగా మరియు సరళతగా ఉంచి, యోని సంక్రమణలను నివారిస్తుంది.. ఒక మహిళ యొక్క వయోజన జీవితంలో యుక్తవయస్సు నుండి రుతువిరతి వరకు కలిగే హార్మోన్ల స్థాయిలో మార్పుల మూలంగా తెల్లబట్ట ఏర్పడుతుంది. దురదలేని తెల్లటి స్రావం మరియు తడిగా ఉండటం వంటివి తెల్లబట్ట యొక్క లక్షణాలు, ఇది హానిరహితమైనది మరియు ఎటువంటి సంక్లిష్టత లేకుండా పరిష్కరించవచ్చు. తెల్లబట్టకు గల ఇతర కారణాల్లో లైంగికేతర మరియు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు కూడా ఉన్నాయి. ఈ సందర్భాలలో, దురద, ఎరుపుదనం, చెడు వాసన, అసౌకర్యం లేదా నొప్పి వంటి లక్షణాలు కూడా ఎదుర్కోవచ్చును. అటువంటి సంక్రమణలు సోకకుండా నివారించడానికి లేదా సంక్లిష్టతలను నివారించడానికి మందులు అలాగే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అధికంగా లేదా అసాధారణంగా ఉంటే తప్ప, తెల్లబట్టకు చికిత్స అవసరం లేదు

తెల్లబట్ట (ల్యూకోరియా) అంటే ఏమిటి? 

ప్రపంచ జనాభాలో ఐదవ వంతు సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళలను కలిగి ఉంటుంది. భారతదేశంలో, 2001 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో 19% మంది ఈ వయసు మహిళలు ఉన్నారు. భారతీయ మహిళలలో, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో యోని ఉత్సర్గం నిర్లక్ష్యం చేయబడుతున్న సమస్య. మహిళా పునరుత్పాదక మార్గ సంక్రమణలు భారతదేశము మరియు బంగ్లాదేశ్లతో సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్న ఒక ప్రజా ఆరోగ్య సమస్య. ఇక్కడ సంతానోత్పత్తి మార్గ సంక్రమణా సంఘటనలు 52-92% మధ్య ఉంటుంది. తెల్లబట్ట ఒక సహజ యోని స్రావం అయినప్పటికీ, ఇప్పటికీ ఇది ఒక వ్యాధిగా పరిగణించబడుతుంది. తెల్లబట్ట అనేది యుక్త వయసు మహిళలలో ఉండే ఒక లక్షణం అయినప్పటికీ, ఇది 3 నుంచి 10 ఏళ్ల వయస్సు మధ్య వయస్సున్న ఆడపిల్లల్లో కూడా చూడవచ్చు.

తెల్లబట్ట అనేది ఎటువంటి అంతర్లీనంగా వైద్య సమస్యలు లేకుండా యోని నుండి వచ్చే ఒక తెల్లటి స్రావం. క్లినికల్ ప్రాక్టీసులో, అన్ని రకాలైన స్రావాలు, తెలుపు లేదా పసుపు, ఏదైనాసరే రక్తం కలిగి ఉండకపోతే తెల్లబట్ట అనే అంటారు. సాధారణంగా స్త్రీల ఋతుచక్ర దశ మీద ఆధారపడి, యోని ద్రవం యొక్క రంగు, పరిమాణం మరియు చిక్కదనం మారుతూ ఉంటుంది. తెల్లబట్ట రంగు మరియు వాసన లేనిది, కానీ స్రావం ఎరుపుదనంతో పాటు ఆకుపచ్చ లేదా పసుపుగా ఉండి, దురద మరియు దుర్వాసనతో ఉంటే, ఇది పునరుత్పత్తి మార్గ సంక్రమణకు (ఆర్ టి ఐ) గుర్తుగా చెప్పవచ్చు.

తెల్లబట్ట (ల్యూకోరియా) యొక్క లక్షణాలు 

సాధారణంగా, ఇన్ఫెక్షన్ సోకని తెల్లబట్ట అనేది ఒక పలచని, పారదర్శకమైన నీటి స్రావం. ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, స్రావాల యొక్క మొత్తం, మందం మరియు రంగు మారుతూ ఉంటాయి. ఇది ఇతర లక్షణాలతో కూడా కూడి ఉంటుంది, ఇలా:

తెల్లబట్ట (ల్యూకోరియా) యొక్క చికిత్స 

మందులు

తెల్లబట్టకి కొంత కాలం యాంటీమైక్రోబియల్ మందులు వాడి చికిత్స చేయవచ్చును. అసాధారణమైన యోని స్రావాలకి, నిర్ధారించిన ఇన్ఫెక్షన్ యొక్క రకం మీద ఆధారపడి విధానాలు ఉంటాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు, సాధారణంగా యాంటీఫంగల్ మందుల కోర్సు సూచించబడుతుందిఏ చికిత్స లేకుండానే  BV యొక్క లక్షణాలు తగ్గుతాయి. హెర్పిస్ వ్యాధికి చికిత్స అందుబాటులో లేదు. యాంటీవైరల్ మందులు వ్యాప్తిని తగ్గిస్తాయి. సంక్రమణ సోకడాన్ని తగ్గించడానికి యాంటీవైరల్ మందులు కూడా ఇవ్వబడతాయి. ప్రస్తుతం, అనేక క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నప్పటికీ ,హెర్పెస్ కోసం టీకా అందుబాటులో లేదు.

ఆహారంలో మెంతులు, ఎండిన కొత్తిమీర, పండిన అరటిపండ్లు వంటి హెర్బల్ రెమెడీలు చేర్చుకుంటే, తెల్లబట్టని అదుపు చేయవచ్చు. "రావి" చెట్టు, ఫికస్ రేసెమోసా, మరియు తెస్పియా నుండి తయారు చేసిన ఆయుర్వేద తయారీలు కూడా స్రావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

జీవనశైలి నిర్వహణ

మందులు మరియు మూలికా ఔషధాలతో పాటు, సరైన పరిశుభ్రతను పాటించడం ఉత్తమమైన మార్గం.

  • సింథటిక్ లోదుస్తులను ధరించవద్దు కాటన్ లేదా లినెన్ ప్యాంటీలను ధరించండి. మంట పుట్టించని సబ్బుతో శుభ్రపరుచుకోండి. జననాంగ ప్రాంతాన్ని అతిగా కడగవద్దు, ఎందుకంటే అది pH సమతుల్యాన్ని పాడుచేస్తుంది మరియు బ్యాక్టీరియా యొక్క పెరుగుదలకు కారణమవుతుంది.
  • యోని యొక్క సంక్రమణను నివారించడానికి మల విసర్జన తరువాత ముందు నుండి వెనక దిశగా శుభ్రపరుచుకోండి.
  • వాష్రూమ్ కి వెళ్లిన ప్రతిసారీ యోని ప్రాంతాన్ని శుభ్రపరుచుకోండి.
  • సమతుల్య ఆహారం తీసుకోండి.
  • విష పదార్ధాలను తొలగించడానికి ప్రతిరోజూ 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగండి..
  • వాకింగ్, జాగింగ్, యోగ, ధ్యానం వంటి తేలికైన వ్యాయామాలు చేయండి ఎందుకంటే అధిక వ్యాయామం తెల్లబట్టను పెంచవచ్చు.
  • ఎల్లప్పుడూ ఒక దంపతీ లైంగిక సంబంధాన్ని(ఒక సమయంలో ఒక లైంగిక భాగస్వామి మాత్రమే కలిగి ఉండటం) కొనసాగించండి.
  • ప్రతి లైంగిక చర్య సమయంలో రబ్బరు కండోమ్లను వాడండి.

తెల్లబట్ట (ల్యూకోరియా) కొరకు అలౌపతి మందులు

తెల్లబట్ట (ల్యూకోరియా) ఈ అలౌపతి మందులు అన్ని మీ సమస్య బట్టి మెడిసన్ డోస్ వాడాలి డాక్టర్ సలహాలు మేరకు మాత్రమే వాడాలి 

Medicine NamePack Size
Microdox LbxMicrodox LBX Capsule
Doxt SLDoxt SL Capsule
Bjain Arsenicum Sulphuratum Flavum DilutionBjain Arsenicum Sulphuratum Flavum Dilution 1000 CH
ADEL 2 Apo-Ham DropADEL 2 Apo-Ham Drop
Bjain Aurum Metallicum DilutionBjain Aurum Metallicum Dilution 1000 CH
ADEL 32 Opsonat DropADEL 32 Opsonat Drop
Bjain Candida albicans DilutionBjain Candida albicans Dilution 1000 CH
Rexidin M Forte GelRexidin M Forte Gel
Dr. Reckeweg Stannum Metallicum DilutionDr. Reckeweg Stannum Metallicum Dilution 1000 CH
Dr. Reckeweg Ova Testa 3x TabletDr. Reckeweg Ova Testa 3x Tablet
Bjain Saponinum DilutionBjain Saponinum Dilution 1000 CH
Bjain Caulophyllum Thalictroides DilutionBjain Caulophyllum Thalictroides Dilution 1000 CH
ADEL 34 Ailgeno DropADEL 34 Ailgeno Drop
Doxy 1Doxy 1
Bjain Stannum metallicum LMBjain Stannum metallicum 0/1 LM
SBL Hydrocotyle Asiatica LMSBL Hydrocotyle Asiatica 0/1 LM
Ec DoxEc Dox 30 Mg/100 Mg Tablet
Schwabe Nymphaea odorata MTSchwabe Nymphaea odorata MT
Schwabe Cubeba officinalis CHSchwabe Cubeba officinalis 1000 CH
SBL Euphorbia pilulifera DilutionSBL Euphorbia pilulifera Dilution 1000 CH

మీకు తెల్లబట్ట సమస్య ఉందా? ఒక్కసారి ఈ చిట్కాలు పాటించి చూడండి ఫలితాన్ని మీరే నమ్మలేరు.

ప్రస్తుత కాలంలో మహిళలను వేధిస్తున్న సమస్యల్లో తెల్లబట్ట ఒకటి. దీనిని ఇంగ్లీష్ వైద్య భాషలో ల్యుకోరియా అని వైట్ డిశ్చార్ అని అంటారు. మహిళల జననేంద్రియాల నుండి తెల్లటి పెరుగు లాంటి పదార్థం స్రవిస్తూ దురద మరియు దుర్వాసన కలిగి ఉంటుంది. దీన్ని తెల్లబట్ట వ్యాధిగా పరిగణిస్తారు. 

సాధారణంగా మహిళల్లో పీరియడ్స్ సమయం అసన్నమైనపుడు జననేంద్రియాల నుండి తెల్లని ద్రవాలు రావడం సాధారణం అయితే అది దీర్ఘ కాలంగా కొనసాగడం మరియు, పైన చెప్పుకున్నట్టు దుర్వాసన, దురద, మంట వంటి సమస్యలు కలుగజేస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

గర్భాశయ ద్వారం లో గ్రంధులు స్రవించే పదార్థం యోని ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. అయితే గర్భాశయం లో లేదా యోని ద్వారం లో ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినపుడు అక్కడున్న బాక్టీరియా ఆ ద్రవాలతో కలసి చర్య జరపడం వల్ల తెల్లబట్ట సమస్య తీవ్రమవుతుంది.  వీటికి చిన్న చిన్న పరిష్కారాలు ఉన్నాయి అయితే సమస్య పెద్దదైనపుడు మాత్రం తప్పనిసరిగా గైనకాలజిస్ట్ ను కలవాలి.

తెల్లబట్ట సమస్యకు పరిష్కారాలు

◆తెల్లబట్ట సమస్య ఉన్నపుడు మొదటగా తీసుకోవాల్సినది జాగ్రత్తలు. 

◆జననేంద్రియాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. గోరువెచ్చని నీటితో జననేంద్రియాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ధరించే లో దుస్తులు శుభ్రంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. తెల్లబట్ట సమస్య ఉన్నపుడు శారీరక కలయికలకు దూరంగా ఉండాలి.

◆సమస్య తీవ్రంగా లేనపుడు త్రిపల చూర్ణాన్ని నీళ్లలో వేసి మరిగించి వడగట్టి, గోరువెచ్చగా ఉన్నపుడు ఆ నీటితో జననేంద్రియాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల బాక్టీరియా నశించి సమస్య తగ్గుతుంది.

◆చాలా తోటల్లో ఇంటి ప్రాంగణంలో అందం కోసం పెంచే నూరు వరహాల పువ్వులు తెల్లబట్టకు చక్కని పరిష్కారంగా పనిచేస్తాయి.  

◆నలబై నూరు వరహాల పువ్వులను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో మరిగించాలి. బాగా మరిగిన తరువాత వడగట్టి ఆ నీటిలో తాటి కలకండ ఒక స్పూన్, జీలకర్ర పొడి అరస్పూన్ వేసి కలిపి తాగాలి. ఇలా రోజుకు రెండు పూటలా తాగడం వల్ల  రెండు లేక మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది.

◆వంటింట్లో దొరికే వాము, జీలకర్రతో తెల్లబట్టకు చెక్ పెట్టచ్చు.  వాము, జీలకర్ర రెండు కలిపి ఒక స్పూన్ మోతాదులో తీసుకుని నోట్లో వేసుకుని మెల్లిగా నములుతూ  ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. చివరకు ఆ పిప్పిని నమిలి మింగేయాలి. తెల్లబట్ట సమస్యను చక్కగా తగ్గిస్తుంది ఈ చిట్కా.

◆దోరగా వేయించిన జీలకర్ర ను పొడి చేసి ఉంచుకోవాలి. జీలకర్ర యాబై గ్రాములు, తామర గింజల పొడి యాబై గ్రాములు, అతిమధురం పొడి యాభై గ్రాముల తీసుకోవాలి. ఈ మూడింటిని కలిపి నిల్వచేసుకోవాలి. దీనిని పూటకు ఒక స్పూన్ మోతాదులో మంచి నీటితో రెండు పూటలా తీసుకోవడం వల్ల తెల్లబట్ట సమస్య సులువుగా పరిష్కారమవుతుంది.

చివరగా….

తెల్లబట్ట సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అది గర్భాశయ మరియు జననేంద్రియ వ్యాధులకు సూచకంగా కూడా భావించవచ్చు కాబట్టి సమస్య తీవ్రతగా మారకముందే డాక్టర్ ను 

*తెల్ల బట్ట నివారణకు ఆయుర్వేదం లో  ( Leucorrhoea 

    నూరువరహాల పూవులు 40 తీసుకుని ఒక గ్లాసు నీటిలో మరిగించి వడకట్టుకొని ఆ కషాయంలో ఒక స్పూన్ తాటి కలకండ , అర స్పూన్ జీలకర్ర  పొడి కలుపుకుని తాగితే తెల్లబట్ట నివారణ అగును. రోజుకి రెండు సార్లు .2 నుంచి 3 రోజుల్లో నివారణ అగును. 

           వాము , జీలకర్ర కలిపి ఒక స్పూన్ తీసుకుని రసం మింగుతూ చివరికి పిప్పిని కూడా లొపలికి తీసికొనవలెను. ఈ విధంగా కూడా తెల్లబట్ట నివారణ అగును.

             

 *తెల్ల బట్ట ( Leucorrhoea )* White Discharge .

స్త్రీ యోని నుండీ ఒక తెల్లని పదార్ధాము విడుదలవుతుంది . దీనినే తెల్ల బట్ట అంటారు . ఇది విడుదల అవుతున్నప్పుడు దుర్గంధ పూర్వకముగా వుండును . శరీరంలో నొప్పులు వుండును . శరీరం దుర్లభంగా తయారవును .

గృహ చికిత్సలు : --

1 . ప్రాతః కాలములో బాగా ఫక్వమైన ఒక అరటి పండును తినండి . తర్వాత 2 spoon ల తేనెను ఆవు పాలలో కలిపి త్రాగండి . చాలా Relief గా వుండును .

2 . ఫక్వమైన అరటి పండులో ఆవు నెయ్యిని కలిపి తినండి .

3 .తిప్ప తీగ పొడి + శతావరి పొడులను సమపాళ్ళలో కలిపి చూర్ణంగా తయారు చెయ్యండి .

ఈ చూర్ణం తో 1/2 గ్లాసు కషాయం తయారు చేసుకొని ఉదయం , సాయంత్రం త్రాగండి .

4 . ఉసరి కాయ రసం + తేనెను కలిపి త్రాగండి .

5 . తులసి ఆకుల రసం + ఆవు పాలతో కలిపి త్రాగండి .

6.  తులసి రసం + తేనెను కలిపి తీసుకొండి .

( ప్రతి రోజు ఉదయం , సాయంత్రం తీసుకొండి )

7 . భోజనంలో ముల్లంగి తినండి .

8 . ఉసరి కాయ పొడి + అతి మధురము పొడిని సమ పాళ్ళలో కలిపి ఒక చూర్ణంగా తయారు చెయ్యండి .

ఈ చూర్ణం + తేనెను కలిపి తీసుకొండి .తర్వాత ఆవు పాలను త్రాగండి .

( ప్రతి రోజు ఉదయం , సాయంత్రం తీసుకొండి )

బియ్యం కడిగిన నీళ్లతో యోని ని ప్రతి రోజు 3 సార్లు కడుకోవాలి.

ఈలా 21 రోజులు చేయాలి.

పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .

తెల్లబట్ట -నవీన్ సలహాలు & చికిత్సలు :

 

*ముందుగా మీరు ఒక గ్లాసు నీటిలో నాలుగు చెంచాలు మెంతులను వేసి ఒక 20 నిమిషాలు బాగా మరిగించండి . ఆ నీటిని వడకట్టండి . అలా వడకట్టిన నీటిని  కొంచెం గోరువెచ్చగా చేసుకొని  ప్రతీ  రోజూ ఒక గ్లాసు  చెప్పున అలా ఒక 20 లేదా 25 రోజులు తాగినట్లయితే మీకు ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది .

* ప్రతిరోజూ ఉదయం రెండు లేత బెండకాయలను తినండి . ఇలా 21 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచిది .

* పరిశుభ్రమైన నీటిని 600 మిల్లీలీటర్లు తీసుకొని , దానికి 15 గ్రాముల పటిక కలిపి ఆ నీటితో యోని భాగాన్ని శుభ్రంగా కడిగి , పటిక నీటితో తడిపిన శుభ్రమైన వస్త్రాన్ని రోజు కొంతసేపు యోని మార్గంలో ఉంచితే స్త్రీలలో ఎదురయ్యే తెల్లబట్ట సమస్య , దురద వంటివి కూడా  తగ్గుతాయి .

* ఏలకులను వలిచి , లోపలగింజల్ని ప్రతిరోజూ తినండి  . దీని వల్ల జననాంగాలకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి . చలవ కూడా చేస్తుంది .

* ఉసిరి కాయ పొడి , పటిక బెల్లం పొడి , మీకు కావలసినంత  మోతాదులో  సమానంగా తీసుకొని  రెండిటిని కలిపి పెట్టుకోండి . ఉదయం ఒక చెంచా , సాయంత్రం ఒక చెంచా తినండి .

* రావి చెట్టు బెరడు , తుమ్మ చెట్టు బెరడుని సమానంగా తీసుకొని దంచి  పొడి చేసి, ఆ పొడిని  జల్లించి ఉంచుకోండి . ఒక గ్లాసు నీళ్ళల్లో చెంచా పొడి వేసి కషాయం చేయండి , ఆ కషాయాన్ని వడ కట్టండి . ఆ కషాయాన్ని గోరువెచ్చగా చేసుకొని చెంచా పటిక బెల్లం పొడిని అందులో కలిపి తాగండి . ఇంకా ఎటువంటి సమస్య మీ దగ్గరికి రాదు .

* చెక్కర కేళి అరటి పండు లేదా బాగా పండినటువంటి అరటిపండును తీసుకొని , ఒక ప్లేటులో కొద్దిగా నెయ్యి , కొద్దిగా పంచదార కలుపుకొని ఉంచుకొని అరటిపండును అందులో కలుపుకొని తినాలి . ఇలా 4 రోజులు చేయనట్లయితే ఈ తెల్లబట్ట అనే వ్యాధి తగ్గుమొఖం పడుతుంది .

* గంజిలో ఒక చిటికెడు పసుపు లేదా మిరియాల పొడిని కలుపుకొని తాగండి .

* ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు బార్లీ నీళ్లను తాగండి.

*  ఏలకులను వలిచి , లోపలగింజల్ని ప్రతిరోజూ తినండి  . దీని వల్ల జననాంగాలకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి . చలవ కూడా చేస్తుంది .

తెల్లబట్ట-తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.

* కాటన్ లోదుస్తులు వాడడం.

* బహిష్ఠు సమయంలో శానిటరీ నాప్కిన్స్ వాడడం, వాటిని ప్రతి రెండు గంటలకూ వాటిని మార్చుకోవడం.

* జననేంద్రియాలను గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవడం.

* గాఢమైన కెమికల్స్ కలిగి వుండే డెట్టాల్  సబ్బులు వాడకూడదు. మైల్డ్ సోప్స్‌తో శుభ్రం చేసుకోవాలి.

* జననేంద్రియాల వద్ద ఎలాంటి పెర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాలు వాడరాదు.

* దుర్వాసన, దురదతో కూడిన తెల్లబట్టను గుర్తించగానే డాక్టర్ని సంప్రదించి జీవిత భాగస్వాములిద్దరూ చికిత్స తీసుకోవడం అవసరం.

* శారీరక శుభ్రత పాటించడం.

* మానసికంగా సంతోషంగా ఉండాలి .

* ఆహారంలో మెంతులు , ఎండిన కొత్తిమీర , పండిన అరటిపండ్లు వంటి వాటిని చేర్చుకుంటే తెల్లబట్టని అదుపుచేయవచ్చు .

* మీరు తినేతిండిలో కారం ,  ఉప్పు బాగా తగ్గించుకొని తినండి.

 

తెల్లబట్ట సమస్యతో బాధపడేవారు పైన చెప్పిన గృహచికిత్సలు మరియు జాగ్రత్తలు పాటించి మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే కాక మీ స్నేహితులతో 

 
 

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: